Skip to main content

Full text of "ఆంధ్ర మహాభాగవతోపన్యాసములు"

See other formats




ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 
ఫోన్‌: 24753724 









ఆంధ్ర 
మహాభాగవతోపన్యాసములు 





(ప్రధాన సంపాదకులు 
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ 
డా. సి. నారాయణ రెడ్డి 
అధ్యక్షులు, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


సంపాదకులు 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర సారస్వత పరిషత్తు 


ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 
ఫోన్‌: 24753724 


శ 
ప్రథమ ముద్రణ : సెప్టెంబర్‌ 1957, 2000 ప్రతులు 


ద్వితీయ ముద్రణ : నవంబర్‌ 2008, 1000 ప్రతులు 


మూల్యం : రూ. 125/- 


(ప్రతులకు : 

ఆంధ్ర సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాదు-500 001. 
ఫోన్‌: +91-40-24753724 


ముద్రణ : 

విప్ల కంప్యూటర్‌ సర్వీసెస్‌ 

(డిజైనర్స్‌ & మల్టీకలర్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌) 
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044. 

ఫోన్‌: +91-40-27676910, 65348445 


అవతారిక 


నపీఠ పుర స్మార గ్రహీత, పద్మభూషణ్‌ 
దా॥ సి సి.నారాయణరెడ్డి 


అధ్యక్షులు 
ఆంధ్ర సారస్వత పరిషత్తు 


నిజాం పాలనలో తెలుగు భాషాదీపం కొడిగట్టిన కాలంలో దాని 
పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు. శ్రీ మాడపాటి 
హనుమంతరావు, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ లోకనంది శంకరనారాయణరావు 
వంటి పలువురు సాహితీమూర్తుల (ప్రేరణతో పరిషత్తు 1943లో రూపుదిద్దుకొని ఈ 
రోజు ఆంధ్రప్రదేశ్‌లో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్ట స్థానం వహించింది. 
మాన్యమిత్రులు కీ. శే. డా॥ దేవులపల్లి రామానుజరావుగారు యావజ్జీవితం పరిషత్తు 
అభివృద్ధికి శ్రమించారు. ఉత్తమాదర్శాలతో, ఆశయాలతో ఆవిర్భవించిన పరిషత్తు 
కాలానుగుణంగా బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్ధంగా నిర్వహిస్తూ అందరి 
మన్ననలందుకుంటున్నది. వీటిలో భాషా బోధన, గ్రంథ ప్రచురణ ముఖ్యభూమికలు 
వహిస్తున్నాయి. ఆంధ్ర సాళస్వత పరిషత్తు ప్రాథమిక, (ప్రవేశ, విశారద పరీక్షలు 
జరపడంతోపాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాల, స్నాతకోత్తరస్థాయి ప్రాచ్యకళాశాల 
నిర్వహిస్తున్నది. పరిషత్తు రూపొందించి నిర్వహించే సాహితీ సభలు, సమావేశాలు, 
ప్రసంగాలు, సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్టులు, ప్రసంగాత్మక ప్రదర్శనలు, 
సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి వైలక్షణ్యాన్ని సంతరించుకున్నాయి. పరిషత్తు 
ప్రచురించే గ్రంథాలను సాహితీలోకం హార్టికంగా స్వాగతిస్తున్నది. ఇంతవరకు 800 
పైగా గ్రంథాలు వెలువరించింది. 


అత్యంత (ప్రధాన సాహిత్యాంశాలపై అగ్రశ్రేణి కవి పండితుల ప్రసంగాలు 
ఏర్పాటు చేసి, ఆ ప్రసంగపాఠాలను గ్రంథరూపంలో (ప్రచురించడం పరిషత్తు ఒక 
సంప్రదాయంగా పాటిస్తున్నది. ఈ పరంపరలోనిదే ప్రస్తుత గ్రంథం ఆంధ్ర 


iv 


మహాభాగవతోపన్యాసములు”. ఉద్దండభాషాసాహిత్యాభిజ్ఞులైన శ్రీయుతులు మల్లంపల్లి 
సోమేశేఖరశర్మ, కురుగంటి సీతారామయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట్టపర్తి 
శ్రీనివాసాచార్యులు, శ్రీ స్వామి శివశంకరశాగ్రి, వేదాల తిరువేంగళాచార్యులుగార్ల 
ప్రసంగాలు పరిషత్తు 1956లో ఏర్పాటు చేసింది. ఆ ప్రసంగపాఠాలను 1957లో 
(గంథరూపంలో ప్రచురించింది. 


రక్తికి, భక్తికి, ముక్తికి సువర్ణసోపానాలై నిలిచిన ఘట్టాలెన్నో మహాభాగవతంలో 
వున్నాయి. ఈ గ్రంథంలోని ప్రసంగాలలో అవి ఆవిష్టృతమవుతాయి. పునర్శుద్రితమైన 
ఈ గ్రంథం ఆధునిక సాహిత్యలోకానికి కూడా పఠనీయంగా, మననయోగ్యంగా 
వుంటుందని విశ్వసిస్తున్నాను. 


హైదరాబాదు డా॥ సి.నారాయణరెడ్డి 
30.10.2008 


ప్రవేశిక 


ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన ప్రసంగ పరంపరలో “ఆంధ్ర మహా 
భారతోపన్యాసములు”, ఆంధ్ర మహా భాగవతోపన్యాసములు' అగ్రేసరమైనవి. చాలా 
కాలం క్రిందటే వాటి ప్రతులు చెల్లిపోవడం వల్ల మళ్లీ వాటిని పరిషత్తు 
పునర్శుద్రిస్తున్నది. భాగవతాధ్యాయనంలో నిష్ణాతులైన విద్వాంసులచేత 1956లో 
ఆరు అంశాలపై ప్రసంగాలు ఏర్పాటు చేసి 1957లో వాటిని గ్రంథ రూపంలో 
పరిషత్తు ప్రచురించింది. శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు, శ్రీ కురుగంటి 
సీతారామయ్యగారు,  డా॥ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు, శ్రీ పుట్టపర్తి 
నారాయణాచార్యులుగారు, శ్రీ శివశంకర శాస్త్రిగారు, శ్రీ వేదాల తిరువేంగళాచార్యులు 
గారు ఈ ప్రసంగాలు చేసిన సాహిత్య దిగ్గంతులు. మహాకవి పోతనామాత్యుని 
జన్మస్థలాన్ని గూర్చిన వివాదం బలహీనమైనా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 
మల్లంపల్లివారు వారి అభిప్రాయాలను స్పష్టంగానే వ్యక్తీకరించారు. ఇక అనువాదసరళిని 
గురించి విజ్ఞులెందరో చర్చించినా కురుగంటివారి వివరణ స్వోపజ్ఞమైంది. పోతన 
కవిత్వాన్ని గురించిన నారాయణాచార్యుల రెండు ప్రసంగాలు పోతన మహాకవి 
ప్రతిభా సౌందర్యాన్ని అనేక ముఖాలుగా చాటుతాయి. భాగవతంలోని రాజవంశాల 
నేపథ్యం శ్రీనివాసాచార్యులుగారు శాస్రీయంగా వెల్లడించారు. ఉపాఖ్యానాలలోని 
ఆంతర్యాన్ని సౌందర్యాన్ని శివశంకరస్వామిగారు నికషోపలంగా వివరించారు. 
వేదాలవారు వివరించిన వాసుదేవతత్త్వం తర్మనిబిడంగా ఉంది. ఇలాంటి పెద్దల 
స్థాయిలో విశ్లేషించగలిగిన పండితులు ఈనాడు మృగ్యం. భాగవతాన్ని అధ్యయనం 
చేసిన వారికి ఈ ప్రసంగాలు మరికొన్ని తేజోమార్గాలను చూపుతాయి. అందువల్ల 
పరిషత్తు ఈ (గ్రంథాన్ని పునర్శుద్రిస్తున్నది. 

మూల(గంథాలకన్నా భారత భాగవత- తెలుగు అనువాదాలు ఆంధ్రుల 
అభిమానాన్ని చూరగొన్నాయి. విద్వాంసులు, కవితా రసికులు ఈ అనువాదాలతో 
సంతృప్తి చెంది మూలగ్రంథాలను ఇంచుమించు విస్మరించారు. ఆంధ్ర: భాషా 


vi 


పరిణతిలో భాగవతభాషకు ఒక శక్తిమంతమైన ఓజస్సు ఉంది. భాగవత పద్యాలు 
ఒకటో రెండో కంఠస్థంకాని సాహితీ రసికుడు ఉండడు. నేటి విద్యార్థులు భాగవత 
పద్యాలు వల్లిస్తే కవితా మాధుర్యాన్ని రుచిచూస్తారు. పోతనగారి పద్యాలు సులభంగా 
కంఠస్థం చేసుకోవచ్చు. ప్రాచీనభాషగా తెలుగు కేంద్ర ప్రభుత్వం వారిచేత గుర్తింపు 
పొందిన ఈ తరుణంలో తెలుగు సాహిత్యానికి పరిషత్తు అందిస్తున్న ఉపాయనం ఈ 
గ్రంథం. ఈ ద్వితీయ ముద్రణలో సహకరించిన డా. సి. శ్రీరంగాచార్యగారికి అనేక 


ధన్యవాదాలు. 


హైదరాబాదు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 
31-10-2008. ప్రధాన కార్యదర్శి 


ముందుమాట 


మహా కావ్యాలనుండి మనము చాలా తెలుసుకోవలసిన ఆవశ్యకతను 
దృష్టియందుంచుకొని ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా భారతోపన్యాసముల 
కార్యక్రమములను మార్చి 1955లో నిర్వహించియుండెను. ఆ ఉపన్యాసముల 
నన్నింటిని కూర్చి మన్మథనామ సంవత్సర మాఘమాసమున పుస్తకరూపమున 
ప్రకటించుట జరిగినది. ఆ ఉపన్యాసములకును, పుస్తకమునకు రసికుల ఆదరణ 
బాగుగా లభించినది. తెనుగు పత్రికలు పరిషత్తు పూనికను ప్రశంసించినవి. 
ఆయాచితముగా తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీవారు మా మహాభారతో 
పన్యాసములను బి.ఏ.కు వచన పాఠ్యభాగముగా నిర్ణయించి మా ఉద్దేశ్యములకు 
బలమును చేకూర్చినారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు తిరుపతి యూనివర్సిటీ వారికి, 
ఆ యూనివర్సిటీ పాఠ్యపుస్తక నిర్జాయకులకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు 
అందజేయుచున్నది. 


విద్వాంసుల సహకారముతో తెలుగువారికి ఆదరపాత్రమైన భాగవతోత్స 
వములను కూడ నిర్వహించదలచినామని, భారత మహోపన్యాసములందు ప్రకటించి 
యుంటిమి. దైవానుగ్రహమువల్ల విద్వాంసుల సహకారము లభించినది. ఆంధ్రప్రదేశా 
వతరణ శుభసందర్భమున కార్తీక శు ౧ లు మొదలు సప్తమీల పర్యంతము 1956 
నవంబరు 3 నుండి 9 వరకు తిలక్‌రోడ్డున ఈ క్రింది విధముగా కార్యక్రమము 
కొనసాగినది. 


నవంబరు కవ తేది శనివారము: “పోతన చరిత్ర-స్థలకాలములు” అను 
విషయముపైన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఉపన్యసించిరి. సభకు పరిషత్తు 
ఉపాధ్యక్షులైన శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు అధ్యక్షత వహించిరి. 

నవంబరు 4వ తేది ఆదివారము: 'పోతన-అనువాద విధానము అను 


విషయముపైన శ్రీ ఆచార్య కురుగంటి సీతారామయ్యగారు మాట్లాడిరి. తెనుగున 
గర్గభాగవతము రచించిన శ్రీ చివుకుల అప్పయ్యశాస్రిగారధ్యక్షత వహించిరి. 


నవంబరు 6వ తేది మంగళవారము: “ఆంధ్ర భాగవత కవిత్వమును 
గురించిన రెండు ఉపన్యాసములను శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులుగారు చదివిరి. 
ఈ సభకు ఉస్మానియా యూనివర్సిటీ తెనుగు శాఖాధ్యక్షులైన శ్రీ ఖండవల్లి 


vii 


లక్ష్మీరంజనంగా రధ్యక్షత వహించిరి. కార్యక్రమము ప్రకారము నవంబరు 5వ తేదీ 
సోమవారము వర్షపాతమువల్ల ఆనాటి కార్యక్రమము సాగలేదు. అందువల్ల 5వ 
తేదీ ఉపన్యాసము, 6వ తేదీ ఉపన్యాసము రెండు 6వ తేదీన సాగినవి. 


నవంబరు 7వ తేది బుధవారము: “'భాగవతోపాఖ్యానములు-వాని 
అంతరార్థములు” అను విషయమును శ్రీ తల్లావరుల శివశంకరస్వామిగారు 
ముచ్చటించిరి. విజ్ఞానవర్థనీ పరిషత్తు కార్యదర్శులైన శ్రీ కేశవవంతుల 
-నరసింహశాగ్తిగారీ సభకు అధ్యక్షత వహించిరి. 
నవంబరు 8వ తేది: 'రాజవంశావళులు-భువనకోశము” అను విషయమును 
డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు వివరించిరి. ఆనాడు ఈ పరిషత్తు స్థాపకులలో 
ముఖ్యులు పరిషత్తు ప్రథమాధ్యక్షులైన శ్రీ లోకనంది శంకరనారాయణరావుగారు 
అధ్యక్షత వహించిరి. 
నవంబరు 9వ తేది: “వాసుదేవ తత్త్వము----భాగవత వైష్ణవము”ను గురించి 
శ్రీ వేదాల తిరువేంగళాచార్యులుగారు భాషించిరి. డాక్టరు దివాకర్ల వేంకటావధానిగా 
రీసభకు అధ్యక్షత వహించిరి. 


ఈ విధముగా ఏడు రోజులు సభలు జరిగినవి. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ 
సందర్భమున పెక్కు సాంస్కృతిక కార్యక్రమములు హైదరాబాదు సికిందరాబాదు 
జంట నగరాలలో జరుగుచున్నప్పటికి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పండితులు, 
రసికులు సభలలో పాల్గొని యుండిరి. మాయీ ఉద్యమమునకు సహకరించి, 
సభలకు అధ్యక్షులుగా ఉపన్యాసకులుగ దయచేసి మమ్ము ప్రోత్సహించిన 
విద్వాంసులందరికిని నమోవాకములు. 


ఆంధ్రావళి మోదము మాకు లభించగలదన్న విశ్వాసముతో ఈ పుస్తకమును 
పాఠకలోకమునకు అందజేయుచున్నాము. 
భాగవత పురాణ ఫలరసాస్వాదన 
పదవి గనుండు రసిక భావ విదులు 
హేవళంబి విధేయుడు 


ఆశ్వయుజ శు॥౧ పులిజాల హనుమంతరావు 
24-9-1957 ఆంధ్ర సారస్వత పరిషత్తు, ప్రధాన కార్యదర్శి 


విషయ సూచిక 


పోతన చరిత్ర స్థలకాలములు ' 1 
శ్రీ మల్లంవల్లి సోమశేఖరళర్థ 

“పోతన అనువాద విధానము 19 
శ్రీ కురుగంటి సీతారామయ్య 

పోతన కవిత్వము ౧ 89 


శ్రీ పుట్టపర్తి నారాయణాచార్వులు 


య్‌ అని గ్‌ 


పోతన కవిత్వము ౨ 135 


శ్రీ వుట్టపర్తి నారాయణాచార్యులు 


పోతన భాగవత రాజవంశములు 197 
డాక్టరు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు 

పోతన ఉపాఖ్యానములు - అంతరార్థములు 255 
శ్రీస్వామీ శివశంకరశాస్త్రి 


పోతన వాసుదేవతత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము 305 
శ్రీ వేదాల తిరువేంగళాచార్యులు 


ళా 


ఆంధ్ర 
మహాభాగవతోపన్యాసములు 


పోతన చరిత్ర - స్థలకాలములు 


శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ 


పోతన చరిత్ర - స్థల కాలములు 1 
పోతన చరిత్ర - స్టల కాలములు 


ఈ యాంధ్రప్రదేశావతరణ శుభసమయము ఆంధ్ర సంతతికి మహోదయ 
పర్వకాలము. తెలంగాణా, రాయలసీమ, మధ్యాంధ్రములందలి ముక్కోటి ఆంధ్రులు 
రాజకీయావరోధ (ప్రాకారములను భగ్నము కావించి చిరకాలాశయానుగుణముగా, 
సుదీర్హ కృషి తపూఫలముగా ఏకైక ప్రభుత్వ పతాకచ్చాయను కలసికొని యాంధ్రమాతకు 
దివ్య పుష్పాంజలీపూర్వక సువర్ణ కర్పూర మంగళ నీరాజనము లిచ్చుచున్న జాతీయ 
మహోత్సవ పర్వసమయ మిది. అలంపురాహోబల ద్రాక్షారామ క్షేత్రాధి దైవతములగు 
బ్రహ్మవిష్ణు మహేశ్వర పరిరక్షిత దివ్యభూమి ఈ యాంధ్ర మహీమండలి. కృష్ణా 
గోదావరీ పినాకినీ తుంగభద్రాది పుణ్యవాహినీ జల సంవర్ధిత కేదార 
ఖండమరకతమణి ప్రభావిరాజితగాత్రి మనయాంధ్రి, చిరకాల వియోగవ్యథాకులితులైన 
ఆప్తసోదరజనము కల్యాణోత్సవములలో వలెను, శరదుత్సవములలోవలెను 
ఒండొరులను గలసికొని చంద్రోదయమునకు సాగరమువలె ఆంధ్రప్రదేశావతరణ 
సందర్భమున నుప్పొంగి యానందవీచికాడోలికల నుయ్యాల లూగుచున్నది. 
తెలంగాణము, రాయలసీమ, మధ్యాంధ్రదేశములను నీమూడు ప్రదేశములును 
కలిసిననే విశాలాంధ్ర సంస్కృతికి సంపూర్ణత. అఖిలాంధ్ర సంస్కృతి వికాసమున 
కీమూడును సరిసమానముగ తోడ్చడినవి; భవ్యాంధ్ర సరస్వతిని విశిష్టపూజా 
ప్రసవములతో నారాధించినవి. ఆంధ్ర సాహిత్యపరమున జూచినచో 
పురాణేతిహాసములును మనుచరిత్ర వంటి విశిష్ట ప్రబంధములును మధ్యాంధ్రదేశ, 
రాయలసీమలలో నుదయింపగా ద్విపదకావ్య మవతరించినది ఈ తెలంగాణమున. 
ఇట్లే కళాపరముగ నాలోచించినచో ఆంధ్ర శిల్పకళాలక్ష్మి మధ్యాంధ్రదేశమున ఉషః 
కుమారివలె తన సౌందర్య సంపదను వెలార్చి విశ్వమోహనగీతి నాలపింపగా ఆమె 
యింపుసొంపులు పుడికిపుచ్చుకొని చిత్రలేఖనసుందరి సువర్ణ విరాజియై అందాలు 
సవరించుకొన్నది ఈ తెలుగు మాగాణి సీమావధులనే. దేవహర్య్య వాస్తువులో నాగర, 
వేసర, ద్రావిడరీతులకు తోడుగా కళింగరీతియని ఒక క్రొత్తరీతిని ప్రవేశపెట్టి ఆ 
వాస్తుకళకు విశిష్టతను చేకూర్చినది కళింగము. నాట్యకళకు తెలంగాణము ఆలవాలము 


2 ఆం([ధ మహాభాగవతోవన్యానములు 


కాగా రాయలసీమ గేయవాజ్మయమునకు పునాదులు వేసినది. అంతట కూచిపూడి 
నాట్యసంప్రదాయ పద్ధతిని నాటక మవతరించినది. మధ్యాంధ్ర దేశములో, ఆంధ్ర 
ప్రదేశాంతర్గతములైన మూడు సీమలును సంగీత సాహిత్యములను పోషించినవే; 
పెంపొందించినవే. అవి చేసిన సాంస్కృతిక కృషిలో ఏది లోపించినను అఖండాంధ్ర 
సంస్కృతికి కొరత కలిగినట్లే. ఈ మూడు సీమలును కలిసిన ఆంధ్రప్రదేశము 
ఆయాసీమలలో జనించి వృద్ధి పొందిన కలాతరంగిణుల నేకమొనర్చి అఖండాంధ్ర 
సంస్కృతీ వాహినికి రూపమిచ్చుచున్నది. నేడుకదా ఈ యాం(ధ్రత్రయీవిషయము 
గంగా యమునా సరస్వతీ పుణ్యప్రోతస్వినుల త్రివేణీసంగమ పుణ్యతీర్థసదృశమై 
ఆంధ్ర సంతతికి సంసేవ్యమై దాని భావిభాగ్యవిధాత యగుచున్నది. 

తెలుగుజాతి కొక నిగూఢమైన ధర్మపథమునుచూపి తెలుగు సంస్కృతికి 
రూపురేఖలు దిద్దిన యు(ద్ధంథములు రామాయణ, భారత, భాగవతములు. 
ముద్రితములై ఆంధ్రదేశము (ప్రచారములో నున్న (గ్రంథములలో భాషా 
గౌరవమునను, భావగౌరవమునను, కవితాగారవమునను ప్రశస్తి గాంచినవి ఒక 
వందకంటె మించియుండవేమో. వానిలోనెల్ల బహుళ ప్రచారముగలవి పైనుడివిన 
మూడు (గంథములే- రామాయణ భారత. భాగవతములు. వీనిలో భారత 
రామాయణములు మానవ సామాన్యములగు లౌకిక విషయములను, నైతిక 
విషయములను ధర్మమార్గమున బోధించి ఆంధ్ర జీవితమును తీర్చిదిద్దుట 
కుపకరించినవి. భాగవత మాముష్మిక ధర్మమార్గ ప్రదర్శకమై మానవజీవితమును 
తరింపజేయు భక్తకల్పద్రుమము. ఈ (గ్రంథ రత్నముల యందలి యితివృత్తము 
విశ్వజనీనము: సార్వకాలిక సార్వదైశిక ప్రయోజనము కలది. వీనిని రచించిన 
మహాకవులు సరసకవితా సామగ్రిచే వీని కమృతత్వ మాపాదించిరి. వివిధ 
విషయాధ్యములు, సకలాంధ్ర లోకారాధ్యములు. ఆంధ్రవాజ్మయ కల్చ్పలతికకు 
కూకటివేరులగు ఈ మూడు గ్రంథములలో ఏయొక్కటియు ఏకకవిచే, ఏకకాలమున, 
ఏకధాటిని రచింపబడకపోవుట ఆశ్చర్య విషాదకరమైన విషయము. పదునొకండవ 
శతాబ్దిలో నన్నయభట్టారకు డారంభించిన మహాభారతము పదునాలుగవ శతాబ్ది 
మధ్యనుకాని పూర్తిగా తెలుగులోనికి రాలేదు. భాస్మరరామాయణ మను సేరు 


పోతన చరిత్ర - స్థల కాలములు 3 


ప్రసిద్ధమైయున్నను రామాయణ మొక్క భాస్మరుని రచనము మాత్రమేకాదు. కుమార 
రుద్రదేవ, మల్లికార్డునభట్ట, అయ్యలార్యుల రచనలుకూడ నందున్నవి. ఇక నాంధ్ర 
మహాభాగవతము బమ్మెరపోతన కృతమని ప్రసిద్ధియున్నను దీనిలోని కొన్ని కొన్ని 
భాగములను వెలిగందల నారయ, ఏర్పూరి సింగయ, గంగయలు రచియించిరను 
విషయము ఎల్లరకును విదితమే. అయినను భాగవతమునకు ప్రశస్తి వచ్చినది 
పోతనమాత్యుని మధుర భక్తిరస పరిప్లత రచనమువలననే. ఆంధ్రదేశములో భాస్మర 
రామాయణము కంటెను హృదయరంజకములై శ్రవణపేయములై యఖిల 
జనానురాగమును గాంచినవి ఆంధ్ర మహా భారతభాగవతములే. ఈ రెండు 
(గ్రంథములలో తెలుగుదేశమున ప్రశస్తి దేనింక్కువ యను విషయమును నిర్ణయించుట 
కష్టము. దేనిప్రశస్తి దానిదే. వాని కవితారీతులే వేరు; అలంకారముల విషయమునను 
విభేదమున్నది. ఈ (గ్రంథములు రెండును ఆంధ్రావళికి సూర్యచంద్రులవంటివి. 
భారత మాంధ్రులకు ఐహికజీవనమును దిద్దుకొనుటలో లౌకిక, నైతిక 
ధర్మసూక్ష్మములను కర్మయోగపరముగ నుపదేశింపగా భాగవతము మానవ 
జీవితమును తరింవజేయుటకు భక్తిమార్గము నుద్చోధించుచున్నది. భక్తి 
జ్ఞానకర్మయోగములలో భక్తిమార్గమే సుగమము కదా! 


ఆంధ్రజ్యోతికి శుభోదర్శ్మమైన ఈ మంగళసమయమున రాజధానియైన ఈ 
హైదరాబాదు నగరమునందు శ్రీమదాంధ్ర సారస్వత పరిషత్తువారు పరమ 
భక్తాగ్రగణ్యుదైన పోతన మహాకవి విరచిత శ్రీమద్భాగవత సప్తాహ మహోత్సవ 
సతతువును సాగింప దలపెట్టుట తెలంగాణెపు తెలుగుబిడ్డలు మీకే చెల్లినది. 
సుకృతులైన మీరు ఏతన్మహోత్సవారంభమును గావింపనాహ్వానించుట నామీద మీకుగల 
అవ్యాజానురాగము తప్ప వేరొండుకాదని నా విశ్వాసము: ఏలన, శ్రీమదాంధ్ర 
మహాభాగవత రచనాధురీణుడును, పరమ భాగవతోత్తముడును, భక్తాగ్రేసరుడును 
అయిన శ్రీ బమ్మెర పోతనగారిని గురించియు, వారి కాలమును గురించుయు 
ముందు తెలిసికొనుట కొంత సంభావ్యమే యైనను వానిని గురించి చెప్పవలసిన 
విషయముల నన్నిటిని విమర్శక శిరోమణులును, కవి చరిత్రకారులును, ఈ వరకే 
పూర్తిగా, సవిమర్శముగా తెలిపియుండుట వలన నే నంతకంటె ఎక్కువ చెప్పగలనని 


4 ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


కాని, మీరిదివరకు వినని విషయములను వినిపించగలననికాని నేనిటకు రాలేదు. 
పోతన మహాకవిచరితమునకు సంబంధించిన విషయములు మీకిదివరకన్నియు 
తెలిసినవేయెనను శ్రీమదాంధ్ర సారస్వత పరిషత్తువా రాదరపురస్సరముగ దయతో 
పంపిన యాహ్వానమును తిరస్మరింపలేక యంగీకరించి వచ్చుటచేత వానిని 
పునరావృతము చేసి ఏతద్భాగవత సప్తాహ మహోత్సవ సందర్భమున ఆంధ్రజాతికి 
పరమపూజ్యుడైన భక్తావతంసము శ్రీమదాంధ్ర మహాభాగవత కృతికర్త పోతన 
కవీంద్రుని మీతోకలసి సంస్మరించుకొనదలచి వచ్చిన నా హృదయ,చాపలమును 
సహృదయులును, బుధవరేణ్యులునగు మీరు మన్నింతురు గాక! 


పోతన జన్మస్థానము, చరిత్ర, సమకాలికులు అన్నది నేటి ఉపన్యాస విషయము. 
చరిత్ర రసహీనమైన పేలపిండి వంటిది. ఇతరాంధ్ర కవుల విషయమునవలెనే 
పోతనగారి విషయమునను మనకు తెలిసినది స్వల్పము. తెలిసినదెల్ల పోతనగారు 
శ్రీమదాంధ్ర మహా భాగవతములో తన వంశమును గురించి, తన తాతముత్తాతలను 
గురించి భక్తి గౌరవ పురస్సరముగ సంస్మరించుకొన్న విషయమే. ఏది తెలిసినను 
ఏది తెలియక పోయినను పోతనగారు జన్మించిన తోడనే తెలుగు దేశములో 
భక్తికల్పలతిక మొగ్గతొడిగి పూవులు పూచినదను విషయము మాత్రము బాగుగా 
తెలియును. ఆయన రచించిన మహాభాగవతము తెనుగులోని కవతరించుటతో 
తెనుగువారి హృదయసీమల భక్తిరస ధునులు పొంగులెత్తినవన్న విషయము తెలియును. 
శ్రీరామచంద్ర కరుణాకటాక్షమును పొంది భాగవతము నాధారముగాగొని తెలుగువారి 
మనఃజేదారములలో భక్తిబీజములు వెదవెట్టిన హాలికుడు పోతన్నగారు. 


మధురభక్తి ప్రధానములైన శతకములు తెలుగులోనికి వచ్చినది పోతనగారి 
ఆంధ్ర మహాభాగవతావతరణమునకు తరువాతనే. కటకము గజపతి వంశజుల 
పరిపాలన కాలమున బంగాల దేశము నుండి చైతన్యస్వామి తెలుగు దేశమునకు 
వచ్చుటతో తెలుగు శతక కవితలో నీ మధుర భావమునకు ప్రాచుర్యము హెచ్చినది. 


పోతనామాత్యుడు మహాభాగవత రచనమునకు పూనుకొనునాటికి 
తెలంగాణములో వైష్టవమతము ముమ్మరముగ వ్యాపించినది. ఇట్లనుటచేత 


పోతన చరిత్ర - స్థల కాలములు 5 


తెలంగాణములో వైష్టవమది వరకు లేనేలేదని నా యభిప్రాయముకాదు. వైష్ణవము 
వాతాపి చాళుక్యుల కాలమునుండియు నున్నది. ఇందుకు వాతాపి, కల్యాణి చాళుక్యుల 
శాసనములును, వారి కాలమున మలచబడిన విష్ణ్వవతార ప్రతిమలు తార్మాణములు. 
చెన్నకేశవాలయములు తెలంగాణమున ఎక్కువగా నుండెను. అయినను కాకతీయుల 
కాలములో శైవమెట్లు రాజమతమై జనాదర పాత్రమయ్యెనో యదేవిధమున వైష్ణవము 
రాజమతమై గొప్ప వ్యాప్తిని పొందినది. వైష్ణవము విజయనగరాధీశ్వరుల 
కాలములోవలె తెలంగాణమున అమితవ్యాప్తి నందినది. రాచకొండ, దేవరకొండ 
రాజ్యాధిపతులైన రేచెర్ల వంశజుల కాలములోనే శ్రీవిద్యారణ్య శ్రీపాదులకు 
సమకాలికులైన శ్రీవేదాంత దేశికులవారి కుమారుడు శ్రీనైనారాచార్యులవారు 
సింగయమాధవేంద్రుని యాస్థానమునకు వచ్చి విమతవాదుల నోడించి 
యారాజేంద్రునికి వైష్టవమతమిచ్చినట్లు వైష్ణవ గ్రంథములు నుడువుచున్నవి. రాజు 
వైష్టవమతావలంబియెనప్పుడు సామంత నృపులును తద్ధర్మము నవలంబించిరి. 
పోతనగారి భాగవతరచన కీవైష్ణవ మత వ్యాప్తి కూడ ప్రోత్సాహకరమయ్యెనేమో. 


పోతన్నగారి జన్మస్థలము విషయమునను, కాలము విషయమునను, 
సమకాలికుల విషయమునను అన్నియు సమస్యలేయైనవి. ఆయన వంశ 
గోత్రాదికమేలనుగూర్చి తాను రచించిన ఆంధ్ర మహాభాగవతములో పోతన్నగారే 
చెప్పుకొన్నందు వలన వివాదము లేకుండా పోయినది. పోతనగారు కౌండిన్యగోత్రుడు; 
ఆపస్తంబసూత్రుడు; కేసయ లక్కసానుల కుమారుడు; తిప్పన అనుజుడు; ఎల్లన, 
సోమనమంత్రులాయన పితామహ ప్రపితామహులు; అన్నయ, భీమనలాయన 
ముత్తాత తండ్రి, తాతలు. కేసనమంటత్రియు, లక్కసానియ శివారాధన తత్పరులు. 
సానియను పదమిప్పుడు నీచార్థబోధకమైనది. పూర్వమది గౌరవవాచకమే. పోతనగారు 
త్రనతండ్రిని గురించి “శైవ శాస్తమతము గనియె” ననియు, తన తల్లినిగూర్చి “సదా 
శివపాదయుగార్చనానుకంపానయ వాగ్భవాని” యనియు తన యగ్రజుని “ఈశ్వర 
'సేవాకాము” డనియు చెప్పియుండుటచే పోతన తలిదండ్రులు ఈశ్వర సేవాసంసక్త 
చిత్తులనుటకు సందియము లేదు. తండ్రివలెను, అగ్రజునివలెను పోతనగారును 
శివధ్యాన తత్పరులే; అట్లని కేశవుని మీద భక్తిలేనివారు కాదు. 


6 ఆం(ధ మవోభాగవతోపన్వానములు 


శ్రీమదాంధ్ర మహాభాగవతావతరణమును గురించి పోతనగారే తమ 
(గంథమున తెలిపియున్నారు. ఆయన శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా 
కుతూహలుడై ఒకనాటి సోమోపరాగ కాలమున గంగకు జని క్రుంకులిడి 
తన్నదీపులినతలంబున మహేశ్వర ధ్యానాయత్తచిత్తుడై కించిదున్మీలితలోచనుడై యున్న 
సమయమున శ్రీరామ చంద్రమూర్తి కన్గవకు గానబడి పేరు చెప్పి తన పేర భాగవతంబు 
తెనుగు సేయుమనియు నానతిచ్చి యంతర్జితుడయ్యెనట. అటు తరువాత 
'శ్రీమహాభాగవత పురాణ పారిజాతపాదప సమాశ్రయంబునను, హరి కరుణా 
విశేషంబునను కృతార్థత్వంబు సిద్ధించె” నని తలచి మరల కొన్ని దినములకు 
ఏకశిలానగరంబునకు జనుదెంచి అందు “గురువృద్ధ బుధ బంధుజనాను జ్ఞాతుడై” 
పోతనకవీంద్రుడు భాగవత రచనమునకు పూనుకొనెను. బమ్మెరయని 
ఇంటి పేరుండుటవలన పోతన పూర్వుల నివాస స్థలము బమ్మెర (గ్రామమై 
యుండవలెను. బమ్మెర యనునది ఓరుగల్లు చెంతనున్నదనియు, ఆ గ్రామమునందు 
కౌండిన్యసగోత్రులగు నియోగుల కుటుంబ మొక్కటి కలదనియు, ఆ కుటుంబమువారు 
పోతనామాత్యుడు తమ వంశమువాడని చెప్పుకొనుచున్నారనియు, ఈబమ్మెరలో 
పోతరాజుగద్దె యని నాలుగురాళ్లు పాతిన స్థలమొకటి కలదనియు శతావధానులు 
శ్రీ శేషాద్రిరమణకవులు ప్రాసియున్నారు. కాని ఏకశిలా నగర మోరుగల్లనియు, 
గంగ గోదావరి యనియు నిరూపితమైనగాని బమ్మెర యదియే యని స్థిరపడదు. 
ఏకశిలానగర మేది, గంగ యేది అను విషయమున కొంతకాలమునకు పూర్వము 
కొమ్ములు తిరిగిన పండితులలో ప్రచండ వాదోపవాదములు చెలరేగినవి. 
ఏకశిలానగరమన్నది కడపజిల్లాలోని ఒంటిమిట్టయని కొందరును, తెలంగాణములోని 
ఓరుగల్లని మరికొందరును, గంగ గోదావరియే యని కొందరును, కాదని వేరొక 
కొందరును 'ఆవేశములు ' పెంచుకొని వాదులాడిరి. పోతన రాయలసీమ వాడని 
కొందరు పోరాడగా తెలంగాణమువాడేయని మరికొందరు వాదించిరి. (ప్రచండ 
రుంరూమారుతమువతె రేగిన ఆ వాదము చాలకాలము వరకు నుపశమింపలేదు. 
ఆ వాదప్రతివాదము లిట నుటంకించుట (గ్రంథవిస్తరము, ననవసరమునుగూడ. 
విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని స్థాపించి ఆంధ్రదేశ సాంస్కృతిక, వైజ్ఞాని 


పోతన చరిత్ర - స్థల కాలములు 7 


కోద్యములకు శ్రీకారము చుట్టిన మహామేధావి పరమపూజ్యులు అయిన కొమజ్ఞాజు 
లక్ష్మణరావు పంతులుగారు ఈ వాదప్రతివాదములనన్నిటిని సాకల్యముగ విమర్శించి 
తుదకు న్యాయాధిపతివలె తీర్పు చెప్పియున్నారు. ఈ విషయమును గురించి ఎవ్వరేమి 
చెప్పినను వారి ననువదింపవలసిన వారే. అంతటి న్యాయసమ్మతమైనదా తీర్చు. 
అయినను ఏకశిలానగరమును గురించియు, గంగను గురించియు ఒకటి రెండు 
మాటలు చెప్పెదను. 

ఏకశిలానగరమన్నది కాకతీయుల రాజధానియైన యోరుగంటికే రూఢియెన 
పేరని కొరవి గోపరాజ కృతమైన సింహాసన కం ఈ క్రింది పద్యముల 
వలన స్పష్టమగుచున్నది. 


ఉ|| ఆకడ నీతిశాస్త్రవిదుండై గురు వీడ్మొని యగ వేద్మతో | 
గాకిత మూలశక్తి గనిగా నొనరించిన పైడిచట్టు నా 
నేక శిలాభిధానమున నెన్నికకెక్కి ధరిత్రిలోన నే 
పోకలం బోని యట్టి సిరిపుట్టిన యింటికి నోరుగంటికిన్‌. 


ఉ॥ చందనగంధులు న్విటులు జాణలు దాన వినోదులుం బ్రభా 
సుందరమూర్తుల్లుం గవులు, శూరులు, బెద్దలు నుల్లసిల్ల సం 
క్రందన వైభవాధ్యుడగు కాకతి భూపతి రాజ్యలక్ష్మి బం 

' పొందెడు నప్పురంబున మహోత్సవలీలల నుండె నేర్పునన్‌. 


ఈ పద్యముల వలన ఏకశిలానగరము కాకతి ఖూపతుల రాజధాని యైన 
ఓరుగల్లే కాని కడపమండలములోని ఒంటిమెట్ట కాదని తేలుచున్నది. ఇక గంగ 
యన్నది గోదావరి నదియే యని నిరూపితమైనగాని పైనిర్ణయము స్థిరపడదు. ఈ ' 
యంశముకూడ కొరవి గోపరాజ కృత సింహాసన ద్వాతింశికలోని ఈ క్రింది పద్యము 
వలన నిరూఢమగుచున్నది. 


కం, ఆతండు త్ర్యంబక శిఖరో 
ద్భూతను విఖ్యాతం బరమ పూతంద్రికీ లో 


8 ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


మాత మహాపాతక సం 
ఘాత విఘాతానుయాతం గనియిన్‌ గంగన్‌. 


ఈ పద్యమున గంగ (త్ర్యంబక శిఖిరోద్భూత యనుటవలన అది నాసికా 
త్యంబకమున నుదయించిన గోదావరీనది యనుటకు సంశయింప బనిలేదు. 
పోతనగారి జన్మన్గలమైనను కాకపోయినను వారి పూర్వులది బమ్మెర. ఇది 
తెలంగాణాలోనిది. తరువాత కొంత కాలమాయన ఓరుగంటిలో నుండెను. అక్కడ 
నుండగనే ఆయన మహాభాగవత రచనమునకు పూనుకొని పూర్తిచేసెను. 


ఆంధ్ర మహా భాగవతము కాక వీరభ[దవిజయ, భోగినీ దండకములును 
పోతనామాత్య ప్రణీతములను ప్రసిద్ధి కలదు. వీనిలో నాలుగాశ్వాసములతో గూడిన 
వీరభద్ర విజయమునందలి కృతి కర వంశాభివర్ణనము ననుసరించియు, నాశ్వాసాంత 
గద్యము ననుసరించియు నది పోతనామాత్య కృతమని యున్నను దాని నతడు 
రచింపలేదను వారు నున్నారు. వీరభద్ర విజయములోని కవిత్వమునకును, ఆంధ్ర 
మహాభాగవతములోని కవిత్వమునకును వ్యత్యాసమున్నదన్నమాట నిజమే. 
వీరభద్రవిజయ కవిత్వము భాగవత కవిత్వమంత ్రాధమైనదియు కాదు; తప్పులును 
చాల గలవు. అందువలన పోతన్నగారు రచించిన గ్రంథములలో ఇది మొదటి 
దనవచ్చును. కాని ఈ కృతి ఆయన రచియింపనే లేదనుటకు సాహసింపలేను. 
జాగ్రత్తగా పరిశీలించినచో భాగవతములోని పద్యములకును వీరభద్ర విజయములోని 
పద్యములకును పోలికలు కలవు. ఏ పోలికలున్నను ఈ క్రింది 


ఉ॥ భాగవత ప్రబంధ మతి భాసురతన్‌ రచియించి దక్షదు 
ర్యాగ కథా ప్రసంగమున నల్పవచస్కుడనైతి తన్నిమి 
తాగత వక్రదోషపరిహారముకై యజనైక శైవశా 
స్తాగమ వీరభద్రవిజయంబు రచించెద వేడ్క నామదిన్‌. 
అను పద్యము పోతన కృతము కాదనియు, ప్రక్షిప్తమనియు నా విశ్వాసము. 
ఇదియే. కాదు, ఆంధ్ర మహాభాగవతములోని 


పోతన చరిత్ర - స్థల కాలములు 9 


ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌ 
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే 
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ 
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్‌. 


అను పద్యమును ప్రక్షిప్తమనియే నా నమ్మకము, పోతనామాత్యుడు మహాభక్తుడు, 
పరిణత హృదయుడు; ఆయన మనస్తత్వమే వేరు. భాగవత రచనా కాలమున ఆ 
పద్యము నాయన వ్రాసె ననుట ఆయన కపచారము కావించుటయే. ఆయన 
యటువంటి పద్యము వ్రాసియుండరు; వ్రాయలేడు. ఆయన నిగర్వ చూడామణి; 
ఆయనది నిండైన మనస్సు; మనస్సెంత నిండైనదో ఆయన వాక్కును అంత నిండైనదే; 
భాగవతమే ఇందుకు ప్రమాణము. కృతికర్త శైలియు, రచనయు నత డెట్టివాడో 
తెలుపు దర్భణములు. వానిలో ఆతని మూర్తిని, ఆతని హృదయమును కనుగొనగలము. 
భాగవతమును రచింపుమని పోతనగారి కన్నుల యెదుట సాక్షాత్మరించిన శ్రీరామ 
చంద్రమూర్తి ఆదేశించిన వెంటనే ఆయన భక్యావేశ పరవశుడయినాడు: 


పలికెడిది భాగవతమట 

పలికించు విభుండు రామభద్రుండట నేం 
బలికిన భవహరమగునట 

పలికెద వేరొండుగాథ పలుకగనేలా? 


ఏడీ ఈ విధముగా భక్తిభావ తన్మయుడై పలికిన మరొక యాంధ్ర కవి? 
నన్నయ తిక్కనాది కవులు పురాణములు తెనుగుజేయుచు నంతకు మున్ను 
భాగవతమును తెనుగు జేయకపోవుట తన పురాకృత శుభాధిక్యమని 
మురిసిపోవుచున్నాడు పోతనామాత్యుడు; పునర్ణన్మము లేకుండ జన్మ సఫలము 
చేసికొందునని ఆంధ్ర మహాభాగవత రచనమే ఒక తపస్సుగా భావించిన పరమపుణ్యశాలి 
ఆయన. ఆయన గంట మెప్పటికిని పూర్వోదాహృతములైన “భాగవత ప్రబంధమతి 
భాసురతన్‌), “ఇమ్మను జేశ్వరాధముల కిచ్చి” అను పద్యములను వ్రాయలేదు; అట్టి 
పద్యములను రచించుట పోతనగారి కశక్యమని కాదు; ఆయన మనస్తత్వ మట్టిది 
కాదనియే నా భావము. 


10 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


భోగినీ దండక కర్తృత్వ విషయమునందు కూడ వివాదము కలదు. ఏత[ద్దంధాం 
తమున గల 


పండిత కీర్తనీయుడగు బమ్మెర పోతన యా సుధాంశు మా 
ర్లాండ కులాచలాంబునిధి తారకమై విలసిల్లు భోగినీ 

దండకమున్‌ రచించె బహుదాన విహర్తకు రావు సింగభూ 
మండల భర్తకున్‌ విమత మానవనాథ మదాప హర్తకున్‌. 


అను పద్యము వలన ఈ భోగినీ దండక కృతికర్త పోతనామాత్యుడనియే 
స్పష్టపడుచున్నను ఈ కృతి నాయన రచింపలేదని ఆపద్య మాయనది కాదని 
వాదించువారు కలరు. చాలమంది కవుల విషయమున వారి జన్మస్థానమును గురించి, 
వారి కాలమును గురించి, తుదకు వారు రచించిన కృతులను గురించి కూడ నిట్టి 
సందేహములుండుటు ఆంధ్రుల దౌర్భాగ్యము. (గ్రంథము స్వయంభువు; అంతియకాని 
కవియే లేడను స్థితి కింకను మనము రాకపోవుట మనయదృష్టము. భోగినీ దండకము 
పోతన కృతమనియే నా విశ్వాసము. దానిని పోతన రచియించె నన్నంత మాత్రమున 
ఆయన ఖ్యాతికి కళంకము రాదు. ఆయనకు వాసి తగ్గదు. పోతనగారు 
భక్కాగ్రేనరులనినంత మాత్రమున బాల్యమునుండియు నట్లే యుండెనని 
భావింపనక్కరలేదు; ఆయనయు మానవుడే. ఆయనకూడ మొదట రావు 
సింగభూపాలుని కాశ్రయుడుగా ఉండి యుండవచ్చును; ఆయనను సంతోషపరచుటకు 
భోగినీ దండకమును వ్రాసియు నుండవచ్చును పోతన. క్రమక్రమముగ 
లోకానుభవము ముదిరి మనస్సు పరిపక్వమైనకొలది అభిరుచులు మారవచ్చును; 
ఆశయాదర్శములు మారవచ్చును; ఆముష్మిక చింత బలపడవచ్చును. వయసు 
పెరిగినకొలది పోతనగారిలో అదియే జరిగినదని నా నమ్మకము. భాగవత మాయన 
కడపటి గ్రంథము. దీనికి పూర్వపుది ఆయన భోగినీ దండకము. ఇక పోతనామాత్యుని 
కాలము. దీనిని నిర్ణయించుటకు నికరమైనవి లేకపోయినను మూడాధారములున్నవి. 
కొండవీటి పెదకోమటి వేమారెడ్డి యాస్థానమునందు విద్యాధికారిగా నుండిన శ్రీనాథ 
కవిసార్వభౌముడు పోతన్నగారికి సమకాలికుడును, బావమరిదియునని చెప్పు గాథ 


: పోతన చరిత్ర - స్థల కాలములు 11 


లుండుట వలన శ్రీనాథుని కాలము ననుసరించి పోతనగారి కాలమును నిర్ణయించుట 
యొక పద్ధతి. రావు సింగభూపాలుని కాలమును బట్టి పోతనగారి కాలమును 
నిశ్చయించుట మరొక పద్ధతి. బమ్మెర పోతనగారి ప్రపౌత్రులైన కేసనకవి' మల్ల 
కవులు రచియించిన దాక్షాయణీపరిణయము ననుసరించి కాలనిర్ణయము చేయుట 
వేరొక పద్ధతి. వీనిలో మొదటిది, అనగా శ్రీనాథుని ననుసరించి పోతన కాలమును 
నిర్ణయింపబూనుకొనుట ప్రమాద భూయిష్టమైనది; ఏలన పరంపరగ వచ్చు గాథలను 
ప్రమాణముగా విశ్వసింపలేము; నన్నయ భట్టారక, తిక్కన సోమయాజులకు మధ్య 
రెండు వందల సంవత్సరముల యెడమున్నను వా రుభయులు నేకకాలమువారని 
చెప్పు గాథలుకూడ నున్నవి. అందువలన శ్రీనాథుడు పోతనకు సమకాలికుడగునో 
కాదో, వా రుభయులకును బంధుత్వమున్నదో లేదో నిర్లీతమైనగాని శ్రీనాథుని 
ననుసరించి పోతన కాలనిర్ణయము చేయ గుదురదు. ఇక దాక్షాయణీ పరిణయ 
కృతి ననుసరించి పోతన కాలనిర్ణయము చేయు విషయమును గురించి 
యాలోచింతము. పోతనామాత్యుని ప్రపౌత్రులైన కేసకవి మల్లకవులు తమ దాక్షాయణీ 
పరిణయ కృతిని గురిజాల చినమల్లన సోమయాజి కంకితమిచ్చిరి. ఈ చినమల్లన 
సోమయాజి ప్రపౌత్రుడైన పార్వతీశ్వరుని కుమారుడు పేర మంత్రికి పోడూరి 
పెదరామామాత్యుడు ధాత సంవత్సర ఆశ్వయుజ బహుళ దశమీ సోమవారమునాడు 
దాక్షాయణీ పరిణయమునకు ప్రతి వ్రాసి యిచ్చెను. ధాత ఆశ్వయుజ బహుళ 
దశమీ సోమవారమునకు సరియైన ఇంగ్లీషు తేది 1756 అక్టోబరు 18వ తేదీ 
సోమవారమైనది. దీని ననుసరించి తరమునకు 25 లేక 30 సంవత్సరముల చొప్పున 
'పేరమంత్రి నుండి చినమల్లన సోమయాజి వరకు లెక్కించినచో ఆతనికి దాక్షాయణీ 
పరిణయము కృతి యిచ్చిన కేసన మల్లనకవుల కాలము తెలియగలదు. వీరికాలము 
తెలిసిన పిదప తరమున కాపద్ధతినే లెక్కకట్టి వారి ప్రపితామహుడైన పోతనగారి 
కాలమును నిర్ణయింపవలసి యుండును. ఈ పద్ధతిని చూచినచో పోతనగారు క్రీ.శ. 
పదునైదవ శతాబ్ది యుత్తరార్థములోనివాడగును. ఇక రావు సింగభూపాలుని 
అనుసరించి కాలనిర్ణయము చేయబూనినను ఇంచుమించుగ పోతన ఆ కాలమునకే 
వచ్చును. 





12 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


రావు సింగభూపాలుడు రేచెర్ల వంశజుడు. ఈతడు రాజాచల దుర్గాధిపతి, 
భోగినీ దండకమున ఈతడు కుమారాన్న పోతవనీనాథసూనుడనియు, రావుసింగ 
క్షమానాథ పౌత్రుడనియు, పోచమాంబాల సద్దర్భ సంజాతుడనియు, వసంతావనీనాథ 
సోదరుడనియు చెప్పబడినాడు. ఇన్ని యానవాల్లీయబడుటవలన ఇతనిని గుర్తించుట 
సులభమే. రాచకొండ రాజ్యమును పరిపాలించిన రెచెర్ల వంశజులలో ముగ్గురు 
రావు సింగనామధేయులు కలరు. అనవోత, మాదానాయకుల తండ్రి మొదటి 
సింగమనాయకుడు; అనవోతానాయని కుమారుడు కుమార సింగభూపాలుడు. ఇతడే 
రసావరవ సుధాకరమను అలంకార (గ్రంథమును రచించెను. ఈతడు క్రీస్తుశకము 
పదునాలుగవ శతాబ్ది ఉత్తరార్థములో నుండినవాడు. కుమారసింగ భూపతి పౌత్రుడును, 
కుమారాన్నపోత భూపాలుని పుత్రుడును అగు రావు సింగభూవరుడు మూడవవాడు. 
ఈతని యనుజుడు వసంతావనీ నాథుడు. ఈ రావు సింగభూపాలుని ముమ్మడి 
సింగభూపాలుడనియు వ్యవహరింతురు. ఈతడు క్రీస్తుశకము 1430 మొదలు 1475 
వరకు పాలించినట్లు ఆతని శాసనములు మొదలైన వాని వలన చెప్పవచ్చును. ఈ 
రావు సింగభూపాలునికి సర్వజ్ఞ బిరుదము కలదు. ఈ సింగభూపాలుని కోరిక పైనే 
పోతనామాత్యుడు భోగినీ దండకమును రచించెను. ఈ విధమున జూచినను 
పోతనామాత్యకవి పదునైదవ శతాబ్ది యుత్తరార్థమున నుండినట్లు స్పష్టమగుచున్నది. 


ఎటుల మెప్పించెదో నన్ను నింకమీద 
రావు సింగ మహీపాలు ధీవిశాలు 
నిండు కొలువున నెలకొనియుండి నీవు 


సకల సద్గుణ నికురంబ శారదాంబ. 


అని శ్రీనాథ కవిసార్వభౌముడు శారదను ప్రార్థించినది ఈ సర్వజ్ఞ 
సింగభూపాలుని ఆస్థానమునకు వెళ్ళినప్పుడే. అందువలన శ్రీనాథుడు కూడ 
పోతనామాత్య కవీంద్రునికి సమకాలికుడే; అయితే కొంచెమతనికంటె పెద్దవాడేమో. 
కాని అతడు పోతన్నగారి బావమరిది యని చెప్పుట కాధారములేవియు లేవు. 
రాకపోకల కానుకూల్యములు విశేషముగా ఏర్పడిన ఈనాడే మధ్యాంధ్ర దేశీయులు 
తెలంగాణావారితో వియ్యమందుట అరుదుగా కనబడుచున్నప్పుడు ఆ కాలములలో 


పోతన చరిత్ర - స్థల కాలములు 13 


మధ్యాంధ్ర దేశీయుడైన శ్రీనాథుడు వైవాహిక సంబంధము వలన పోతరాజునకు 
బావమరిది యయ్యెనన్న విషయము విశ్వాస పాత్రమైనదిగా తోచుటలేదు. 
వారుభయులును బావమరుదులని చెప్పుగాథ లన్నియు వట్టి పుక్కిటి పురాణాలే 
అని నా నమ్మకము. 


పోతనామాత్యుడు మహాభాగవతము పండ్రెండు స్మృంధములను పూర్తిగా 
రచియించెననియు, నందు కొన్ని భాగములుత్సన్నము లగుటచేత వెలిగందల 
నారయాదులు వానిని పూరించిరనియు చెప్పుదురు. ప్రకృతము మన కుపలబ్ధమగు 
నాంధ్రమహాభాగవతములో ఏకాదశ, ద్వాదశ స్కంధములు వెలిగందల నారయ 
కృతములు; షష్టస్మంధము ఏర్పూరి సింగన విరచితము; ఇక పంచమ సృంధము 
నందలి ప్రథమాశ్వాస, ద్వితీయాశ్వాసములు గంగనకృతములు. ఈ విధముగా 
ఆంధ్ర మహాభాగవత ముత్సన్నమగుటకు చెప్పబడు ఒక గాధ మన దేశమున 
చిరకాలానుగతముగ వచ్చుచున్నది. రాచకొండ రాజ్యాధిపతియైన రావు సర్వజ్ఞ 
సింగభూపాలుడు భాగవతమును దన కంకిత మీయవలసినదని పోతనామత్యు 
నభ్యర్థింపగా నాత డందులకు నిరాకరించెననియు, అందుమీదట నా రాజేంద్రుడు 
కుపితుడై బలాత్మారమున నా గ్రంథమును గైకొని దానిని భూమిలో 
పాతిపెట్టించెననియు, కొంతకాలమైన వెనుక దానిని బయటికి తీయగా అప్పటికే 
యా (గ్రంథము నందలి తాళపత్రములు కొన్ని చివికి శిధిలిమైపోయిన వనియు, ఈ 
కారణముననే భాగవతము నందలి కొన్ని భాగము లుత్సన్నమగుట సంభవించెననియు 
చెప్పుదురు. కాని యిది విశ్వసింపదగిన విషయముగా గనుపట్టదు. ఒకవేళ రావు 
సింగభూపాలు డాగ్రంధమును నశింపజేయ సంకల్పించుకొన్నచో దానిని సులువుగా 
తగులబెట్టి యుండవచ్చును. అట్లు చేయక దాని నేల పాతిపెట్టించెనో తెలియదు. 
మొత్తముమీద ఇది తలతోకలు లేని గాథ. భాగవతమును రచించుచుండగనే 
పోతనామాత్యుడు లోకాంతరగతుడై యుండునని నా యూహ, ఏకాదశ, ద్వాదశ 
స్మంధముల నాయన రచియింపనే లేదనియు, అందువలననే భాగవత సంపూర్ణార్థము 
పోతనామాత్య ప్రియశిష్యుడైన వెలిగందల నారయ, తన గురువుగారి మీద గల భక్తి 
గౌరవముల వలన వానిని రచించి యుండుననియు ననుకొనుచున్నాను. మిగిలిన 


14. ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


యాంధ్ర మహాభాగవతమును పోతనామాత్యుడే రచియించి యుండవలెను. దీనిలో 
పంచమ, షష్ట స్కంధములు ఉత్సన్నములగుటకు ప్రాయకముగా ఆనాటి రాజకీయ 
పరిస్థితులే కారణమై యుండవచ్చునని నేనూహించుచున్నాను. 


ముమ్మడి సింగమనాయకుని కాలమున కించుక పూర్వము నుండియే బీదరు 
రాజధానిగ పరిపాలించుచుండిన బహ్మనీ సుల్తానులకును రాచకొండ దుర్గాధిపతులకును 
వైరానలము (ప్రజ్వరిల్లినది. అహ్మదుషా రాజ్యకాలము చివర తెలంగాణము పై 
మహమ్మదీయులు దండెత్తి రాచకొండ రాజ్యాధిపతుల కోటలను గొన్నిటిని బట్టుకొనిరి. 
అహ్మదుషా అనంతరము బహ్మనీ సుల్తానులకును, రాచకొండ రాజ్యాధిపతులకును 
జరిగిన యుద్ధము లనేకములు. వానితో తెలంగాణము నిప్పులపుంత మైనది. 
రాచకొండ దుర్గాధిపతులు కటకము గజపతుల సాయముతో మరల ఓరుగల్లు, 
భువనగిరి మొదలైన దుర్గములను గెలుచుకొనిరి. శాశ్వతముగ ఈ దుర్గములు 
రేచెర్ల ప్రభువుల అధికారము క్రింద నుండలేదు. తుదకు క్రీ.వ. 1474-75 నాటికి 
తెలంగాణమున రాచకొండ, దేవరకొండ (ప్రభువుల రాజ్య మంతరించినది. అది 
పూర్తిగా రెండవ మహమ్మదుషా రాజ్యకాలమున ఆతని యధికారము క్రిందికి 
వచ్చినది. ఈ బహ్మనీ, రేచెర్ల వంశముల యుద్ధమున తెలంగాణమున శాంతి 
భద్రత లంతరించినవి. గ్రామ దహనము లతిశయించినవి. భాగవతమున కొన్ని 
భాగము లుత్సన్నమగుట కప్పటి రాజకీయ సంక్షోభమే కారణము కావచ్చును. ఇది 
యూహ మాత్రమే. పోతనామాత్య విరచితమైన భాగమే భాగవతమున అధికముగ 
నిలిచియుండుట ఆంధ్రుల యదృష్టమని చెప్పవచ్చును. 


పోతనామాత్యుని కవిత్వము అతి మృదు మధుర పద సంఘటితమై, 
శబ్బార్థాలంకార పరిశోభఖితమై, వీనులకు విందొనర్చుచు అమందానందము 
కలిగించుచుండును. పోతనగారే చెప్పుకున్నారు. 


కొందజకుం దెనుంగు గుణమగుం 
గొందజకును సంస్కృతంబు గుణమగు రెండుం 
గొందఅకు గుణములగు నే 

నందణ మెప్పింతుం గృతుల నయ్యెయెడలన్‌. 


పోతన చరిత్ర - స్థల కాలములు 15 


అని. ఆయన యెంత ధైర్యముతో, ఆత్మ విశ్వాసముతో చెప్పిన మాటలో ఇవి. 
అందువలననే రసానుగుణముగ తెనుగును, సంస్కృతమును సరిసమానముగ 
సార్థకముగ వాడగలిగిన ప్రతిభాశాలి ఆయన. తెలుగు దేశములో ఆంధ్ర మహా 
భారతమును జదువని వారుండిన నుండవచ్చును. గాని, ఆంధ్ర మహాభాగవతమును 
జదువని వారు చదువ నేర్చిన వారిలో అరుదు. భాగవతము నందలి గజేంద్రమోక్షము, 
రుక్మిణీ కళ్యాణము, కుచేలోపాఖ్యాము మొదలైన కథలను నేటికిని కంఠస్థము 
కావింయీకొని ప్రతిదినము చదువువారున్నారు. పల్లెటూళ్లలో సామాన్యమైనదా 
భాగవతము పోతనగారే దానిని కల్పతరువుతో పోల్చినారు. ఈ క్రింది పద్యమును 
చిత్తగింపుడు: 
మ.లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం 
జు లతా శోభితమున్‌, సువర్ణ సుమనస్సుజ్జేయమున్‌, సుందరో 
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాల వాలంబునై, 
వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్దిజ శ్రేయమై. 


ఆంధ్రప్రదేశావతరణ శుభసమయమున ఏతన్మహాభాగవత సప్తాహ మహోత్స 
వమును శ్రీమదాంధ్ర సారస్వత పరిషత్తువారు నిర్వర్తించుట అఖిలాంధ్ర సంస్కృతికే 
మంగళాశాసనముగా భావించుచున్నాను. ఏతన్మహోత్సవ నిర్వాహకులైన సుకృతుల 
కందరికి నా నమోవాకములు. 


సంస్కృత భాగవతము 


పోతన అనువాద విధానము 


శ్రీ కురుగంటి సీతారామయ్య, ఎం.ఏ. 


పోతన అనువాద విధానము ఏ 19 


సంస్కృత భాగవతము 
పూతన అనువాద విధానము 


శ్రీ పోతనార్యుని యాంధ్రీకరణ పద్ధతిని గూర్చి ప్రసంగము చేయుట నా 
యర్భష్టము. దానిని గూర్చి సమగ్రముగా చర్చించుట కీ యవసరము చాలకపోవుటయే 
గాక యసంభవముకూడ. కావున పోతన వాక్యములలో “విబుధవరుల వలన 
విన్నంత, కన్నంత, తెలియవచ్చినంత తేటపరతు” అనియే మనవి చేయుచున్నాను. 


చర్చనీయాంశమునకు వెడలక పూర్వము రెండు మూడు విషయములను 
ముచ్చటింతును. ఇదివరలో నీ విషయమును కొందరు పెద్దలు చర్చించి యున్నారు. 
వారిలో శ్రీయుతులు తం. తేవప్పెరుమాళ్లయ్య, నాగపూడి కుప్పస్వామయ్య, పురాణం 
హయగ్రీవశాస్రి, రాయదుర్గం నరసయ్యశాస్తి, శేషాద్రి రమణ కవులు, నిడదవోలు 
వెంకటరావు మొదలగువారి వ్రాతలు నాకు మిక్కిలి సాయపడినవి. వారి కందరకు 
నేను కృతజ్ఞుడను. వారి చర్చలలో పోతనార్యుని నివాస స్థల మొక ముఖ్యమైన 
విషయము." ఇచట రెండు వాదములు కలవు. పానిలో నొంట్లిమిట్ట వాదమునకు 
కీ.శే. వావిలికొలను సుబ్బారావుగారు ముఖ్యులు. కాని యిప్పటివరకు జరిగిన 
వాద(ప్రతివాదములను క్రోడీకరించి చూచిన, నొంటిమిట్ట వాదముకంటె నోరుగల్లు 
వాదమే బలవత్తరమని తేలుచున్నది. ఇందులకు సహకరించు మజియొక 
దృష్టాంతమును నేనిచ్చుచున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయము నందలి తాళపత్ర 
(గ్రంథ సంచయములో పంచతంత్రము యొక్క యాంధ్రీకరణము రాజనీతి రత్నాకర 
మనుపేర నొక యముద్రిత గ్రంథ మున్నది. దాని రచయిత పేరు కృష్ణయామాత్యుడు. 
తద్ధంథ పీఠికయందలి పద్యముల వలన నీ కృష్ణయామాత్యుడు బమ్మెర పోతనార్యుని 
వంశమువా దనియు, నీయన కోవవారు బెడందకోట(బిదరు)లో సూల్తానువద్ద 'నేబతి 
(ధనము లెక్కించువాడు) పని చేసినందున వారికి “నేబతి” యని యింటిపేరు 
పౌరుష నామముగా వచ్చినదనియు తెలియుచున్నది. ఈ గంథమున భువనగిరి, 
సిద్దపల్లి, పాలమూరు మొదలగు తెలంగాణము నందలి స్థలముల (ప్రశంస కలదు. 


20 ఆంధ మవోభాగవతోవన్వానములు 


ఈ వంశము తెలంగాణా ప్రాంతముదనియు వీరికులమున పూర్వుడైన బమ్మెర 
పోతనామాత్యుడును నీ ప్రాంతమువాడేననియు నూహకిది బలమిచ్చుచున్నది. 


రా 
శ్రీమద్భాగవతముయొక్క విశిష్టత 


బుగ్వేదమున “కృష్ణు”డను నొక మంత్రద్రష్ట కలడు. “భాగవత శబ్దమొక 
భక్తి ప్రధానమైన తెగకు పేరుగా మహాభారతము నందలి “నారాయణీయ” మను 
భాగమున గలదు. “భాగవత శబ్దము” బెస్‌నగర్‌ శాసనమున కలదు. ఇది క్రీ.పూ. 
1, 2 శతాబ్దుల నాటిదని చారిత్రకులు చెప్పుదురు. వాసుదేవుడు పరమాత్మగా 
పాణిని, పంతజలులు తెల్పుచున్నారు. కాలక్రమమున వెనుకటి కృష్ణుని, తరువాతి 
వాసుదేవుని నేకము చేసి 'కృష్ణవాసుదేవుడు' పరమాత్మగా భాగవతులనెడి యొక 
మత సంప్రదాయము కల తెగ వర్ధిల్లినట్లు స్పష్టమగుచున్నది. వీరికి భక్తి ప్రధానము. 
క్రమముగ భక్తి ముఖ్యాంశముగా గల వైష్ణవ మతము వర్ధిల్లైను. తరువాత 
శ్రీమద్రామానుజులు విశిష్టాద్వైతమును బలపరచి, దానికి భక్తిని ముఖ్యాంగముగ 
నొనర్చి యిదివరలో యవైదికమైన వైష్టవమతమునకు వైదికత్వమిచ్చి యుదాత్త 
మొనర్చెను. ఆకాలమునాటికే భాగస్షతము భక్తి ప్రధానమైన (గ్రంథముగా నుండెను. 
ఈ భక్తి నవవిధములు. 


“శవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనమ్‌, 
అర్చనం, వన్ష్సనం, దాస్యం సఖ్య, మాత్మ నివేదనమ్‌ ॥ 


భక్తి నీ విధముగా నవవిధములుగా విభజించిన మొదటి గ్రంథములలో 
భాగవతము ముఖ్యమైనది. అందువలన భాగవతము భక్తి సిద్దాంతమునకు పరమ 
ప్రమాణమైన (గ్రంథము. ఈ సిద్దాంతము మొదట దక్షిణ దేశమున వదలి, తరువాత 
యుత్తరదేశమునకు ప్రాకి, యావద్భారతదేశము నాక్రమించెను. ఈ సిద్దాంతము 
ముఖ్య సూత్రముగా చైతన్యవల్లభాది మతము లుత్సన్నము లయ్యెను. వీనిలో 
చైతన్యమతము మాత్రము బెంగాల్‌ దేశమున జనించెను. ఈ మతమునకు 


పోతన అనువాద విధానము 21 


శ్రీమద్భాగవతము ముఖ్య ప్రేరకమని విజ్ఞులు, విమర్శకులు తెల్పుచున్నారు. యస్‌.కే.డే 
పండితులు తమ “పద్యావళి” పీరికయందిట్లు వ్రాసినారు; 
"The Chief and almost exclusive scripture of Chaitanyaism 


is the Srimadbhagavata, on whose devotional Poetry and 
legend, it bases its erotic emotionalism". 


(Intro. P.4) 


- భాగవతమును గూర్చి వెనుక కొంత చర్చ జరిగెను. ఈ గ్రంథమును 13వ 
శతాబ్దమునకు దగ్గరగా హేమాద్రి స్నేహితుడగు బోపదేవుడను పండితుడు 
రచియించెననియు, నంతకు పూర్వ మీ గ్రంథమే లేదనియు కొందరు వాదించిరి. 
కాని యిప్పుడా వాదము పరాస్తమయినది. అష్టాదశ పురాణములలో చేరవలసినది 
దేవీ భాగవతమా? శ్రీమద్భాగవతమా? యను చర్చ కూడ జరిగి, తుదకు 
శ్రీమద్భాగవత వేం యందులకు పాత్రమని చారిత్రికులు, విమర్శకులు 
సిద్ధాంతీకరించినారు. భాగవత (ప్రశంస మాత్స్య పద్మాది పురాణములలో కలదు. 
'పురాణముల సంకలనము క్రీ.శ 6వ శతాబ్దము నాటికి జరిగి యుండవచ్చునని 
పరిశోధకుల యభిప్రాయము. 6వ శతాబ్ది నాటికే రచింపబడిన శ్రీమద్భాగవతము 
బోపదేవ విరచితమగుట యసంభవము కదా! రచనా కాలమునుండి భాగవతము 
తన ప్రభావమును భారతీయులపై వెదజల్లుచునే యున్నది. కాలక్రమమున నది 
భక్తి సిద్దాంతమునకు మూలాధార గ్రంథమైనది. 

"Tt seems highly probable that the Chaitanya sect and its 


doctrines... had an independent origin directly from the 
- _ Srimadbhagavata tradition". 


(Padyavali Intro. P. 7) 


ఈ భక్తి సిద్దాంతము పర్యాయతీగా నద్వైతమును కూడ ముట్టడించెను. తన 
గ్రంథములగు “అద్వైతసిద్ది, సిద్దాంతబిందు” మొదలైనవానిచే నద్వైతమునకు బల 
మొసంగిన శ్రీ మధుసూదన సరస్వతీస్వామి భక్తికిని, యద్వైతమునకును విరోధము 
లేదని తన గ్రంథములచే సూచించెను. ఈ త్రోవనే భాగవత వ్యాఖ్యాన కారులైన 


22 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


శ్రీధరస్వామివారును నడచిరి. వీరు వ్రజవిహారమను నొక భక్తిప్రధానమైన గ్రంథమును 
కూడ రచించిరి. వీరి గ్రంథములు చైతన్యమతానుయాయులకు ప్రమాణములయ్యెను. 
శ్రీ చైతన్యులు క్రీ. శ. 1485 సంవత్సరమున జన్మించిరి. అదివరకా ప్రాంతములలో 
నున్న భక్తి మతానుయాయులు చైతన్య మతములో కలిసిపోయిరా. ఆ కాలమున నా 
మతము ప్రజలలో నెక్కువగా వ్యాపింపలేదు. ఈ క్రింది వాక్యములను గమనింపుడు; 


"Dissatisfied with their spiritual surroundigs this religious 
group (Vaishnavas) used to meet in certain houses to hold 
religious discourses, to the readings of Srimadbhagavata 
and to satisfy their spiritual longings by an enthusiastic sing- 
ing of the Praises of Sree Krishna". 


(Padyavali Intro. P.15.) 


ఆకాలము నుండి చైతన్య మతానుయాయులకు శ్రీమద్భాగవతము 
మూలగ్రంథమయ్యెను. ఇక వల్లభ మతమున కాభాగవతమే పరమ ప్రమాణ (గ్రంథము. 
ఉపనిషత్తులు, గీత, బ్రహ్మ సూత్రములు మొదలైన వానిలోని యనుమానములను 
భాగవతము తొలగించినదని వారి యాశయము. వల్లబభస్వామివారు 
శ్రీమద్భాగవతమునకు వ్యాఖ్యానమునుకూడ రచియించిరి. ఈవిధముగ 
శ్రీమద్భాగవతము యావద్భారత సంస్కృతికిని గొప్పగా తోడ్చడు గ్రంథమయ్యెను. 


మరియొక విషయము. శ్రీమద్భాగవతము సాహిత్య శాస్త్రమున గొప్ప 
విప్లవమును తెచ్చిపెట్టెను. చాలకాలము వఅకును రసము లెనిమిదియే యను 
వాదముండెను. తర్వాత శాంతము రసముగా నంగీకరింపబడి రసములు తొమ్మిది 
యయ్యెను. భాగవత ప్రచారానంతరము మతి రెండు రసములుగా (గహింపబడినవి. 
వత్సలభక్తులు రెండును రసములని వాదింపబడెను. కాని విశ్వనాథాదులు కొందరు 
వీని నంగీకరింపలేదు. చైతన్యస్వామి శిష్యులలో ముఖ్యుడగు రూపగోస్వామి యీ 
విషయమై చర్చించి వీనికి రసత్వము సిద్ధాంతీకరించుటయే గాక, తాను రచించిన 
“ఉజ్జ్వల నీలమణి, భక్త రసామృతసింధువు” అను గ్రంథములందు శృంగారభక్తి 


పోతన అనువాద విధానము 22 


రసమునకు విభావానుభావ సాత్విక వ్యభిచార భావములను సమన్వయించి 
స్థిరీకరించినాడు. అందును ఆత్మసమర్పణము తుదిపరిణామముగా గల రాధామాధవ 
భావమును సోపపత్తికముగా నిరూపించెను. భాగవతమున రాధామాధవ భావము 
కంరోక్తిగ లేకపోయినను నవవిధభక్తులకు దృష్టాంతములు కలవు. దాస్యమున కీక్రింది 
శ్లోకములను గమనింపుడు: 


“వీక్ష్యాలకావృత ముఖం తవ కుండల శ్రీ 

గండస్థలాధర సుధం హసితావలోకం 

దత్తాభయంచ భుజదందయుగం విలోక్య 

వక్షః శియైక రమణంచ భవామదాస్యః ॥ (10-29-39) 


గోపికలు కృష్ణున కాత్మార్సణము గావించిరనుటకు సందియము లేదు. సుప్రసిద్ధ 
సంస్కృత చరిత్రకారులగు దాస్‌గుప్తగారి యీక్రింది వాక్యములను గమనింపుడు: 


"The Srimadbhagavata as the great scripture of emotional 
devotion and store-house of small legends, becomes the 
starting point of the theology of the Neo-vaishnava sect 
and supplied the basic inspiration to the new devotional 
Poetry. The new stand-point vivifies religion as well as its 
poetry with a human element and lifts one of the most 
powerful impulses of the human mind into the means of 
glorious exaltation. It thereby brings, colour and beauty 
into religious life; and its essential truth lies in its assertion 
of the emotional and aesthetic in human nature against the 
hard intellectuality of dogmas and doctrines." 


(Hist.San.Lit.Das Gupta P. 385.) 
ఈవిధముగా భక్తి రసమునకును, భక్తి సిద్ధాంతములకును శ్రీమద్భాగవతము 


ప్రేరకమయ్యెను. ఇట్టి మహోత్మృష్టమైన గ్రంథమును పోతనామాత్యుడు తెనిగించి 
యాంధ్రులకు మోక్షమార్గమును చూపినాడు. 


24 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


=) 
పోతన మహాభాగ్యము 


శ్రీమద్భాగవతము నాంధ్రీకరించుట యొక సామాన్య కవి చేయతగిన పనికాదు. 
నన్నయభట్టారకు డారంభించిన భారత రచనా కార్యము తిక్కనార్యుని కొజక్రైంండు ' 
శతాబ్దములు వేచియుండవలసి వచ్చెను. పోతనకు పూర్వము కవులెందరు లేరు? 
తిక్కనార్యునితోందయలదూగగల నాచన సోమనార్యుడు లేడా? తిక్కనార్యుని మెప్పువడసిన 
యాయన శిష్యుడగు కేతన లేడా? రామాయణమును రచించిన భాస్కరుడు లేడా? 
మార్కండేయ పురాణమును రచియించిన మారన లేడా? కాని వీరి కెవరికిని 
భాగవతము నాం(ధీకరింపవలెనని తట్టలేదు. ఏల తట్టును? ఒక్కొక్క కార్య మొక్కొక్క 
మహామహాోని కొఅకై వేచియుండును. అందులకై సుముఖములగు దేశకాల 
పాత్రాదులు కలియునపుడు వారవతరింతురు. రచియింపవలసిన భాగవతమునకు 
మాతృక యొక్క స్థాయి, యుదాత్తత రావలెను. సంస్కృత రామాయణము యొక్క 
యుదాత్తత భాస్మరరామాయణమునకు. వచ్చినదా? ఏల వచ్చును? ఇప్పుడున్న 
రచియింప బడుచున్న యే రామాయణమునకును వాల్మీకి రామాయణము యొక్క 
స్థాయి రానేరదు. గ్రంథమునకు తగిన కర్త యుద్భవించవలెను. ఈ విషయమునే 
పోతనార్యుడు.తన సహజ వినయ భావముతో నిట్లు చెప్పినాడు: 

“ఒనరన్‌ నన్నయతిక్కనాది కవు లీయుర్విం బురాణావళుల్‌ 

తెనుంగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో 

తెనుంగుం జేయరు మున్ను భాగవతమున్‌; దీనిం దెనింగించినా - 

.జననంబున్‌ సఫలంబుంజేసెదం బునర్జన్మంబు లేకుండగన్‌. (1-19) 


ఇట్లు వదలుట పోతన పురాకృత భాగ్యము మాత్రమే కాదు. ఆంధ్రజాతి 
. యొక్కపురాకృత శుభాధిక్య మనవలెను. భాగవత మాంధ్రుల మాన్యము. సంస్కృత 
మాతృకయొక్క రసము, పావిత్ర్యము దీనియందు ద్విగుణముగా నున్నవనవచ్చును. 
తెనింగించుటలో పోతన యాంధ్రత్వము నుట్టిపడునట్లు చేసినాడు. గ్రంథమునందు 
ఆంధ్రుల యాచార వ్యవహారములను, బాలక్రీడాదికమును జొన్సి యాంధ్రుడని 


పోతన అనువాద విధానము 25 


పించుకొనెను. ఆయన యాంధ్రాభిమానమున కొక యుదాహరణము. శుకుడు 
పరీక్షిత్తునకు భక్తిమార్గమును తెల్పునవసరమున మాతృకలో నీ క్రింది శ్లోకమున్నది: 


“కిరాత హుణాంధ్ర పుళింద పుల్మసా 
ఆభీర కంకాయవనాః కషాదయః 
యేన్యేచ పాపా యదుపాశ్రయాశ్రయాః 
శుద్ధ్యంతి తస్మైప్రభవిష్ణవేనమః.” 
పై శోకములోని 'యాంధ్రి పదమును పోతనార్యుడు వదలివేసెను. చూడుడు. 


“యవన వ్యాధ పుళింద హూణశక కంకాభీర చండాల సం 

భవులుం, దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి, భా 

గవత (్రేష్ణుల డాసి శుద్ధతనులై, కల్యాణులై యుందు ; రా 

యవికారుం, బ్రభవిష్ణు నాదుమదిలో నశ్రాంతమున్‌ మొక్కెదన్‌.” 
(2-63) 


చూచితిరా, పోతనగారి యాంధ్రాభిమానము! భాగవత రచనములో 
నాయనకు గొప్ప యభ్యర్షితత్వము నిచ్చినవి యాయన భక్తి వైరాగ్య వినయములు. 
ఆయన వ్యక్తియందలి యీ మూడు గుణములును భాగవతమునం దడుగడుగునకు 
కనబడుచుండును. గజేంద్ర మోక్షణాది ఘట్టములలో పెంచి వ్రాసిన స్థలములందలి 
యావద్భక్తి సన్నివేశములును, పోతనార్యుని భక్తి కుదాహరణములే యనవచ్చును. 
ఆయన హాలికుడై జీవితమును గడపుటయు, రాజాదరణమును నిరాకరించుటయు, 
నున్నదానితో తృప్తినొందుటయు, సరస్వతి కిచ్చిన బాసటయు, మొదలైనవి యాయన 
వైరాగ్యమునకు తార్మాణములు. ఇక నాయన వినయమును చూడుడు: 


“పలికెడిది భాగవతమంట 
పలికించు విభుండు రామభద్రుం డంట, నేం 
బలికిన భవహరమగునంట 
పలికెద; వేటొండు గాథ పలుకంగ నేలా”? 
(పీఠిక పద్యం 16) 


26 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు 

శూలికైనం దమ్మిచూలికైన 

విబుధ జనులలవలన విన్నంతం గన్నంతం 

దెలియవచ్చినంతం దేటపణతు.” (పీఠిక 17) 


ఇంతకంటె వినయముండునా? విషయౌత్కృష్ట్రమును, నాయన యశక్తత్వము 
నిందు కనబడుచున్నవి. మజియు భావి కవులకు నమస్కరించిన కవి కానరాడు. 


పోతనార్యుని రచన కేవల భాషాంతరీకరణమా? స్వతంత్ర రచనయా? యను 
ప్రశ్నము వచ్చును. బాగుగా విచారించిన యెడల నీగ్రంథమున రెండుగుణములు 
నున్నవని చెప్పవచ్చును. పోతన సహజ పాండిత్యుడనని చెప్పెను. అందువలన 
నాయన విద్యాభ్యాసమే చేయలేదా? అట్లనుటకు వీలులేదు. విచారించిన “సహజ 
కవితాధురీణు” డని మాత్రము చెప్పవచ్చును. అతని పాండిత్యము (గ్రంథము 
నందంతటను గనబడుచున్నది. మాతృకను శ్రీధర వ్యాఖ్యానముతో పలుమారు 
పోతనామాత్యుడు చదివి యుండును. అందులకు తార్మాణము కానవచ్చును. 


3 
భాషాంతరీకరణము పెరుగుదల - అందులకు కారణములు 


భారతాంధ్రీకర్తలు మాతృక నానుపూర్విగా ననుసరింపలేదు. పెంచి వ్రాసిన 
స్థలములకంటె కుదించి వ్రాసిన స్థలములు మెండు. దాదాపు శతసహస్ర సంఖ్యాక 
గ్రంథములు నన్నయాదుల చేతులలో నేబది వేల గ్రంథములైనవి. (గ్రంథమనగా 
ముప్పదిరెండు అక్షరముల పరిమితము) అనగా సగమయ్యెను. ఇక భాగవతమా! 


సంస్కృత భాగవతముయొక్క పరిమితియు, నిర్వచనమును కొన్ని 
పురాణములలో నున్నదని వెనుక మనవి జేసినాను. 
“యాత్రాధికృత్య గాయత్రీం వర్ద్వతే ధర్మవిస్తరః 
వృత్రాసురవధోపేతం తద్భాగవత మిష్యతే | 
అష్టాదశ సహస్రం త త్పురాణం పరికీర్తితం” (మత్స్యపురాణము) 


పోతన అనువాద విధానము BT 


“గ్రంథోష్టాదశ సాహస్రో ద్వాదశస్కంధ సమ్మితః. 
హయగ్రీవ బ్రహ్మవిద్యా యత్రవృత్రవధస్తథా 
గాయత్ర్యాచ సమారంభః తద్వైభాగవతం విదుః |” 
(స్కాంద పురాణం) 


పై నిర్వచనములలో భాగవతమునందు 18 వేల గ్రంథములును, 12 
స్మంధములును నున్నవని తేలుచున్నది.కాని యిపుడు మనకు లభ్యమైన 
శ్రీమద్భాగవతమున 12 స్మృంధములున్నవి గాని గ్రంథ సంఖ్య మాత్రము 
పురాణములలో చెప్పినట్లు లేదు. అందు 22 వేల గ్రంథములున్నవని పండితులు, 
విమర్శకులు లెక్క చెప్పుచున్నారు. పురాణోక్త (గ్రంథ సంఖ్యకంటె 4 వేలెక్కువగ 
నున్నవి. ఇవి పోతనార్యుని తెనుగు సేతలో దాదాపు 30 వేల గ్రంథములు కలదిగ 
పరిణమించినవి. అనగా 8 వేల గ్రంథములు పెరిగినవి. ఇట్లు పెరుగుటకు పెద్దలిచ్చిన 
కారణములిత్తును: 


(1 “బ్రాహ్యాద్యష్టాదశ పురాణములలో నుత్తమంబగు నీ పురాణ మత్యంత 
రహస్యార్థ ప్రతిపాదకంబును, పరమవేదాంత ప్రతిపాద్య భగవద్దుణ 
గణాపాదకంబునునైన యుత్తమ (గగ్రంథమగుట; 


(2) ఇట్టి గూఢంబయిన గ్రంథార్థంబు తేటపరుప వ్యాఖ్యాన రూపముగా 
వర్ణించుట; 

(3) భగవద్దుణాభి వర్ణనాది ఘట్టంబులందు సంస్కృత భాగవత ప్రతిపాదిత 
క్రమమున నభివర్ణించి, స్వకీయ భగవదృక్యతిశయమున స్వానవద్య 
కవిత్వ విద్యాచాతురీ సంప్రాప్త నిరంకుశ స్వాతం(త్ర్యముచే 
భగవద్దుణాదులను విశేషముగా వర్ణించుట; 


(4) భాగవత (గ్రంథ ప్రతిపాదితంబే గాక విష్ణుపురాణ హరివంశాది 
(గంథములనుండి కథావిశేషంబులం గొన్నిటిం దెల్పుట” 


పై 4 కారణముల వలన (గ్రంథము పెరిగినది. ఇట్టి గుణగణంబు 


28 ఆం(ధ మహాభాగవతోవన్యానములు' 


లుండుటచేతనే యీ .గ్రంథమునకును పోతనార్యునికిని శాశ్వత కీర్తి చేకూరినది. 
ఆంధ్ర దేశమున శ్రీమద్రామాయణము వలె ననేకులు ప్రతి దినమును భాగవతమును 
పారాయణము చేయుట కలదు. నవనిధులు గల కుబేరుడు కూడ తన ధనమును, 
పోతన శబ్దజాలమును వెచ్చించినంత విరివిగా వెచ్చింపడు. రాయలసీమలో దాదాపు 
ప్రతి గ్రామమునందును నాంధ్ర భాగవతమును ప్రతిదినము పారాయణము 
చేయువారు కలరని మా గురువర్యులు కీ.శే. వాసుదాసుగారు సెలవిచ్చినారు. 


అ 
రచనా వైవిధ్యము 


భారతమునందు వలెనే భాగవత రచనమునందును పెక్కుర చేతులు కలవు. 
పోతనార్యుడు రచియించిన యావ(ద్ధంథమును దొరకకపోవుట మన దౌర్భాగ్యము. 
పోతన భాగవతమున నన్నిస్మంధములు రచియించెనా, లేదా యనునది యొక 
ప్రశ్న దశమ స్మంధాంతము వజబకు రచియించి యుండవచ్చును గాని ఏకాదశ 
ద్వాదశ స్కంధములు రచియించి యుండకపోవచ్చునని యొక వాదము. కాని 
బాగవతమును నమష(గముగ రచియించగా, న ర్వజ్ఞని ౦గమ 
యంకితమియ్యనడుగుటయు, నిరాకరించినందున పాతిపెట్టుటయు; లేక రచించిన 
భాగవతమును దేవతార్చనలో పెట్టి పూజించుచు తుదకు చూడగా కొన్ని 
భాగములుత్సన్నములగుటయు నను రెండువదంతులును, పోతన్నగారు 
యావగద్దంథమును రచియించియే యుండునను నూహకు సహకారులుగ నున్నవి. 
ఇప్పుడులభ్యమానమైన గ్రంథమున పోతనార్యుని రచనముగాక వెలిగందల నారయ, 
ఏర్పూరి సింగయ, బొప్పనార్యపుత్రుడు గంగయ్యయు నను మువ్వురు రచించిన 
భాగములున్నట్లు కనపడుచున్నవి. వారు స్వయముగ రచియించిరా, లేక 
లుప్తభాగములను పూరించిరా, యను నదొక ప్రశ్న. ఏయే స్థలముల నెవ్వరు 
పూరించిరో, రచియించిరో యనుటకు నిష్కృష్టమైన తార్మాణము లేవైన నున్నవాయని 
విచారింతము. 


పోతన అనువాద విధానము 29 


ద్వితీయ స్మంధమున 91వ పద్యమువద్ద నుండి వెలిగందల నారయ కవిత్వమని 

వ్రాతప్రతులయందున్నది. దానిని ముద్రితప్రతుల యందును ననువర్తింపజేసినారు. 
కాని ద్వితీయస్మంధాంత గద్యమున పోతనార్యుడు రచించినట్లే యున్నది. అట్లే 
తృతీయస్మంధాంత గద్యమునను పోతనార్వుడు. రచియించినట్లే యున్నది. కావున 
ద్వితీయ, తృతీయ స్కంధములు కొన్ని స్థలములలో నుత్సన్నములు కాగా పోతనార్యుని 
ప్రియశిష్యుడగు వెలిగందల నారయ తద్భాగములను పూర్తిచేసెనని యనవచ్చును. 
కాని యతనే యా రెండుస్మంధములను పూర్తిగా రచియించెననుట విశ్వసింప వీలులేదు. 
అనేక స్థలములలో పోతన కవితా లక్షణములను, పోకడలును స్పష్టముగా 
కనపడుచున్నవి. తృతీయ స్మంధాదిని రామాంకిత పద్యమే యున్నది. అట్లే 
దశమస్మంధోత్తర భాగాదిలోను, ఏకాదశ ద్వాదశస్మంధాదులను, నంకితము మాత్రము 
రామునికనియే యున్నది. పోతన పోకడల ననుమానింప వీలులేదు. ఈక్రింది 
పద్యములను పరికింపవచ్చును. కృష్ణుడు తోడి గోపబాలరకు వినోదములను చూపు 
సందర్భమున నిట్లున్నది; 

“వర యమునానదీ సలిల వర్ధిత సౌరభయుక్త పుష్పమే 

దుర మకరందపాన పరితుష్ట మధువ్రత యూథ మాధవీ 

కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికా 


పరభృత రాజకీర మృదుభాషల భంగిం జెలంగి పల్ముచున్‌, 


(3-108) 


ఈ పద్యమునందు క్రిందగీటుంచిన భాగమును దశమస్కంధము నందలి 
యీక్రింది పద్యపాదముతో పోల్చవలెనని కోరుచున్నాను. గోపకాంతలు కృష్ణునిపై 
చాడీలు చెప్పు ఘట్టమున, 

నొకట వెక్కిరించు నాక్కొకచో మృగ 
పక్షి ఘోషణములు పరంగజేయు” (10 పూర్వ. 327) 


పైదానియందు వెనుకటిదాని ప్రతిధ్వని కనుపడుటలేదా? పై సందర్భముననే 


30 ఆం(ధ్ర మవాభాగవతోవన్వానములు 


వరయమునా నదీజల నివాస మహోరగ విస్తృతాస్య వి 

స్ఫురిత విషానల ప్రభల సోంకునం గ్రాంగిన గోపగోధనో 

త్మరముల నెల్లంగాని, భుజగ ప్రవరున్‌ వెడలంగందోలి, త 

త్సరిదమలాంబుపానమున సంతసమందంగం జేసె గోతతిన్‌.” 
(3-112) 


అని యున్నది. 


ఇట్లనేక పద్యములను చూపవచ్చును. ఈవిధముగా నాలోచించిన నారయ 
యుత్సన్న భాగములను మాత్రమే పూరించెననుకొనక తప్పదు. ఈక్రింది తృతీయ 
స్మంధమునందలి పద్యమును పరికింపుడు: 
“కంజాతకింజల్క పుంజ రంజిత పీత్ర 
కౌశేయ వాసు, జగన్నివాసు, 
శత్రుభీకర చక్రశంఖగదా పద్మ 
విహిత చతుర్చాహు, విగతమోహు, 
నుతభక్తలోక మనోనేత్ర వర్ధిష్టు 
లాలిత సద్గుణాలంకరిష్టు 
వరకుమారక వయః పరిపాకు, సుశ్లోకు, 
సుందరాకారు, యశోవిహారు, 


సకలలోక నమస్కృత చరణ కమలు, 

భక్తలోక పరిగ్రహ ప్రకటశీలు, 

దర్శనీయ మనోరథ దాయిం, గీర్త 

నీయతీర్ణ యశోమహనీయమూర్తి.” (3-915) 

ఇక నారయ్యయే పూరించెనని చెప్పు చతుర్ధ స్మంధమునకు వత్తును. ఇచటకూడ 
కొన్ని యుత్సన్న భాగములను పూర్తిచేసినట్లే కనపబడును గాని యంతయు ట్రాసెనని 
చెప్పుటకు వీలులేదు. ఈక్రింది పద్యములను చూడుడు. 


పోతన అనువాద విధానము 31 


కైలాస వర్ణనము: 


“భాసురలీలం గాంచిరి సుపర్వులు భక్తజనైక మానసో 

ల్లాసముం, గిన్నరీజన విలాసము, నిత్యవిభూతి మంగళా 

వాసము, సిద్ధగుహ్యకనివాసము, రాజిత భూవికాసికై 

లాసము, గాంతి నిర్జితకులక్షితిభృత్సుమహద్విలాసమున్‌.” (4-134) 


“అరవిందోదరం తావకీన ఘన మాయామోహితస్వాంతులై 

పరమంబైన భవన్మహామహిమముం బాటించి, కానంగ నో 

పరు బ్రహ్మాది శరీరులజ్ఞులయి; యోపద్నాక్ష! భక్తార్తి సం 

హరణాలోకన! నన్నుం గావం దగు నిత్యానంద సంధాయివై.” (4-177) 


పై పద్యముల యంతము లచ్చముగా పోతనార్యుని వానివలె నున్నవి. 


ఈవిధముగా పరీక్షించినచో “ద్వితీయ తృతీయ చతుర్ధస్మంధములును, 
దశమస్మంధోత్తర భాగమును కేవలముపరూప పద్యములతో నిండి నిబిడీకృతములై 
లేవని” (వ్రాసిన విమర్శకులతో నేనేకీభవించుచున్నాను. పూరించెనని చెప్పు 
స్థలములుకూడ కొన్ని పోతన పోకడలను కల్గియేయున్నవి. దశమస్మంధోత్తర భాగమున 
“కాటుక నెరయంగ కన్నీరు వరదలై” యను పద్యమునుండి వెలిగందల నారయ 
రచితమని పూర్వముద్రిత గ్రంథములలో నున్నట్లు పీఠికాకారులు వ్రాసిరి. నూతన 
ముద్రణమున నామాటలు తీసివేసి ముద్రావకులు ముద్రించినందులకు 
వందనీయులు. వివాదకారణము తొలగింపబడినది. 


ఏకాదశ ద్వాదశస్మంధములు పోతనార్యుని ప్రియశిష్యుండు వెలిగందల నారయ 
రచియించినట్లు వ్రాసికొనియున్నాడు. ద్వితీయ తృతీయ చతుర్ధ స్మంధములలో కొంత 
భాగములను పూరించినను, పంచమషష్ట స్మంధములను పూరించినవారు తామే 
వ్రాసినామని వ్రాసుకొనినట్లు, వెలిగందల నారయ వ్రాసుకొనలేదు. ద్వాదశ స్మంధాంత 
గద్యమున నారయ “నారాయణ”యెినాడు. బహుశః యీస్మంధములు పూర్తిగా 
నుత్సన్నములై యుండునని నాయూహ. పోతన పోకడ లిచట నెక్కువగా గానరావు. 


32 ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


మరియు భాషాంతరీకరణములో కొన్నిభేదములున్నవి. వానిని కొన్ని చూపుదును. 
మాతృక యనేక స్థలములలో సరిగాలేదు. కొన్నిభాగములను పూర్తిగా వదలివేసెను 
“మాతృకలోనున్న భిక్షు గీతాదులు తెనుగునకు రాలేదు”. ఏకాదశ స్కంధమున 
త్రయోదశాధ్యాయమున “శ్రీకృష్ణుండు హంసరూపియై చేసిన తత్వోపదేశ సందర్భమున” 
“వస్తునోయత్‌” అను శ్లోకము' నుండి పదునేడు శ్లోకములను తెనుంగుసేతలో 
నైదారుపంక్తులలో వెళ్ళబుచ్చినాడు. పదునాల్గవ యధ్యాయమున భక్తిపారమ్య 
ధ్యానయోగమును కొలది పంక్తులలో నిమిడ్చినాడు. మూలమునందలి యర్థమునకు 
భిన్నమైన తెనుంగుసేత నొకదానిని చూపుదును. . 


“మనసా వచసాదృష్ట్యా దృశ్యతేన్యై రతీంద్రియైః । 
అహమేవ నిమిత్తోన్యదితి బుద్ధ్యధ్వ మంబసా 11” 


అను శ్లోకమునకు “పంచేంద్రియములకు దృష్టంబైన పదార్థంబు నిత్యంబు. 
అది నిత్యదృష్టిని బ్రహ్మంబని తెలియవలయును” అని యాంధ్రీకరించినాడు. 
షోడశాధ్యాయమునందలి విభూతులను ముఖ్యముగా మూడు బంతులలో 
ముగించినాడు. మొత్తముమీద నీరెండు స్మంధముల తెనుగుసేత తృప్తికరముగలేదని 
విమర్శకులనుచున్నారు. మటియు రెండును తుదిస్మంధము లగుటచేతను, 
మూలమునకూడ నివి వెనుకటి స్మంధముల విశిష్ట లేకపోవుటచేతను నవి 
యెక్కువ శ్రద్ధతో తెనిగింపబడినట్లు కానరాదు. వ్రాతప్రతులలకును పాఠభేదములున్నట్లు 
విమర్శకులనుచున్నారు. మన కావ్రాతప్రతులు లభ్యములు కాకపోవుటచే 
నావిషయమును యెక్కువగా విస్తరింపజాలము. నారయ రచనలయిన 
తుదిస్మంధములలో కొన్ని విశిష్టాద్వైత సిద్దాంత ప్రతిపాదకములైన వాక్యములున్నట్లు 
చెప్పుదురు. పోతనయు శుద్ధ శంకరాద్వైతము ననుసరింపకపోయినను, కేవల 
విశిష్టాద్వైత సిద్ధాంతానుసారముగా వ్రాయక, శ్రీధరస్వాముల ననుసరించి 
యద్ర్వైతమునకును, భక్తికిని వైరుధ్యములలేదను సారాంశముతో వ్రాసెను. జ్ఞానము 
భక్తిగా పరిణమించి మోక్షసాధన మగునని యాయన యభిప్రాయము. తుది 
రెండుస్మంధములలో నట్లుగాక “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” 
యను నుపనిషత్తుల్యంబగు గీతావచన (ప్రకారంబున” యనియు, “దేవతాంతర 


పోతన అనువాద విధానము 33 


మంత్రాంతర సాధనాంతరములు వర్ణించెనేని వైకుంఠంబున వసియించు” నినయు 
మొదలగు ననేక వాక్యములున్నవి. 


(11-106; 12-39) 


వీనితోపాటు కేవలాద్వైతపరములైన వాక్యములును కలవు. విశిష్టాద్వైత 
పదములగు వాక్యములు దశమస్మంధోత్తర భాగమునందును కలవు. ఒక 
యుదాహరణము నిచ్చెదను: 


“వెండియు గొందజు సచరాచర వస్తుజాతములకు నంతర్యామివై సర్వంబు 
నీవయగుటం దెలియలేక, యనిత్యంబని విపరీతబుద్ధిం దెలియదురు; కాని 
కొందరు జగద్భరితుండవు గాన, జగద్రూపకుండవైన నిన్ను కటకమకుట 
కర్ణికాది వివిధభూషణ భేదములం గనకంబు నిజస్వరూపంబు' విడువక 
వర్తించు చందంబున జగద్వికారాను గతుండవయ్యును నిఖిల హేయ ప్రత్యనీక 
కల్యాణ గుణాత్మకుండవై యుందువని యాత్మవిదులైనవారు తెలియుదురు.” 


(ద.ఉ. 1220) 


“అట్టిజీవులు దేవతిర్యజ్మనుష్య స్థావరాది శరీరంబులు సొచ్చి యణురూపులై 
యుందురు. అందును నీవుందువు తదందరాత్మవగుచు.” 


_(ద.ఉ. 1223) 
“సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు [శ్రుతులు ముఖ్యవృత్తిం ప్రవర్తించు.” 
. (ద.ఉ. 1230) 


పై వాక్యములందలి యంతర్యామిత్వము, నిఖిలహేయ ప్రత్యనీక కల్యాణ 
గుణాత్మకత్వము, అంతర్యామియెడ (శ్రుతుల ముఖ్యవృత్తత్వము మొదలైనవి కేవల 
విశిష్టాద్వైత సిద్ధాంతములు. ఇట్లు రెండు విధముల వాక్యములుండుటచేత నారయ 
కొన్నిస్టలముల శ్రీధరవ్యాఖ్యననుసరించెననియు, కొన్నియెడల ననుసరింపలేదనియు 
. ననుకొనవలెను. 


34 ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


ఇక పంచమ న్మంధమునుగూర్చి కొంచెము తెలునుకొందము. 

పంచమస్మంధమును బొప్పనార్యపుత్రుడైన గంగయ్య వ్రాసెనని స్మంధాంత గద్యమున 
కలదు. ఇది రామాంకితముగాక “నందగోప కుమారాంకితము”గా నున్నది. 
ఆశ్వానములుగా విభజింవబడియున్నది. “మవానీయ గుణగరిషులగు 
నమ్ముని[శేష్ణులకు నిఖిల పురాణ వ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుండిట్లనియోనను 
ప్రతీక మాత్రము పోతన్నగారిదే వాడబడినది. నేను వెనుకచెప్పినట్లు నారయ్యయేగాక 
గంగయ్య సింగయ్యలును పోతన్నగారి ననుకరింపయత్నించిరి. విమర్శకులు 
“మూలమునందలి విశేషణాదులొక్కొకచో లేవనియు, మూలార్ధరీతి మారినదనియు, 
సరసవస్తు త్యాగములున్నవనియు, మొదలగు లోపముల నీభాగమునందు 
చూపుచున్నారు. పైవానివంటి మార్పులు భాషాంతరీకరణము లగునన్న 
(గంథములయందును కనపడును. కవిత్రయమువారు పెంచలేదా? కుదించలేదా? 
అట్లే పెంచినాడు. పోతనామాత్యుడును కుదించినాడు కాని యీస్మంధమున కొన్ని 
స్థలములలో కూడని వివరణములు చేసినట్లు తెలియగలదు. ఒక్కయుదాహరణము; 
ఆగ్నీ(ధ్రుడు పూర్వచిత్తుతో సంభాషించునపుడు మాతృకలో నిట్టున్నది: 

“కాత్వం చి కీర్షసిచ కిం మునివర్య శైలే 

మాయాసికాపి భగవత్సర దేవతాయాః । 

విజ్యేబిభిర్ని ధనుషీ సుహృదాత్మనోర్థే 

కింవామృగాన్‌ మృగయ సే విపినే ప్రమత్తాన్‌ ॥” 


(5-2-8) 
దీనికి తెనుగుసేత యీక్రింది విధముగా నున్నది: 
“సతి! నీవెవ్వతె? వీ ప 
ర్వతమునకేమేనిం గోరి వచ్చిన వనదే 
వతవో? శారదవో? రతి 
పతి పంచిన మాయవో? తపస్సారమవో” (5-ప్ర.27) 


మన్మథ పరవశుడై యట్లు పలికెనట! మన్మథపరవశుడై “నీవు శారదవో” 


పోతన అనువాద విధానము 35 


అని సరస్వతినిగా పల్ముట యళశ్లీల ద్యోతకముగా నున్నది. తరువాతనున్న మనోహర 
శ్లోకముయొక్క తెనుగుసేతయు తృప్తికరముగాలేదు. 


పోతన్నవలె గంగన్నయు కొన్నిస్థలముల తన స్వంతవర్ణనములను జొన్పినాడు. 
ఈభాగము పోతన రచించిన భాగమువలె నదై ప్రతపరముగానేయున్నది. మూలార్థము 
నెక్కువగా విడువకుండ తెనుగు చేసిన స్థలములును కలవు.:. ఒక్క యుదాహరణము: 


“ఇతి తేషాం వృషలానాం, రజస్తమః ప్రకృతీనాం, ధన మదరజ ఉతల్సిక్త 
మనసార: కర్మాతిదారుణం యద్రహ్మభూతస్య సాక్షాద్రహ్మర్షి సుతస్య, నిర్వైరస్య, 
సర్వభూత సుహృదః, సూనాయా మప్యనుజ్ఞాతాయాం, అనభినుత మాలంభన 
ముపలభ్య బ్రహ్మతేజసాతి దుర్విషహేణన దందహ్యమానేన వపుషా సహసోచ్చచాం. 
సహసైవదేవీ భద్రకాళీ భశమమర్న రోషావేశ రభస విలసిత భ్రుకుటి విటప కుటిల 
దం్ర్రారుణే క్షణాటోపాతి భయానక వదనాహంతు కామే వేదం మహాట్టహాస మతి 
సంరంభేష విముంచంతీ తతఉత్పత్య పాపీయసామతి దృష్తానాం తేనై వాసినా వివృక్ట 
శీర్నాంగకాత్రస్రవం తమసృగాసవ మత్యుష్ణం సహగణేన నిపీయ అతిసాన 
మదవిహ్వలోచ్చైస్తరాం స్వపార్షదైన్యహః జగౌననర్తహ, విజహారచ శిరః కందుకలీలయా. 


(5-16,17, 18) 


“సర్వభూతములకు సఖుడును, బ్రహ్మభూ 
తాత్ముడు నిర్వైరుడయిన (బ్రహ్మ 
సుతుని తేజంబంతం జూడ దుస్సహమైన 
భయమంది వడకుచు భద్రకాళి 
క్రోధంబు ముమ్మిడిగొనంగ హుంకారంబు 
సలుపుచు నట్టహాసంబు సేసి 
పాపాత్ములును దౌష్ట్యపరులును రాజస 
తామస కర్మ సంధానులగుచు 
విప్రవరునట్లు హింసించు వృషల పతిని 
భృత్యవర్గంబుతోందలన్‌ పృథ్విం గూల్చి 


36 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


'యపుడు వృషలాధిపుని శిరమంది లీలం 
బాడియాడుచు నందంద క్రీడ సలిపె.” (6-1-134) 


పైన గద్యములో నున్న స్వల్ప విషయములను వదలి కథాంశము చెడకుండ 
తెనుగు చేసినాడు. ఈయన కొన్ని స్థలములలో శ్రీధర వ్యాఖ్యానము ననుసరించెను. 
ఒక్క యుదాహరణము నిత్తును. పంచమస్మంధ ఏకాదశాధ్యాయమున రహూగణునకు 
భరతుడు ప్రత్యుత్తర మిచ్చునపుడు మాతృక యిట్లున్నది. 

“యావన్మనోరజసాపూరుషస్య 

సత్యేనవాత మసావా నురుద్ధం 

చేతోభి రాకూతిభిరాతనోతి 

నిరంకుశం కుశలం వేతరం వా॥ 

సవాసనాత్మా విషయోపరక్తో 

గుణప్రవాహో విషయ షోడశాత్మా” (5-11-45) 

దీనికి శ్రీధర వ్యాఖ్య యిట్లున్నది: 


“మనోయావద్రజ ఆది భిర్లుణై రనురుద్ధం వశీకృతం 
భవతి, తావత్‌... పురుషస్యకుశలం ధర్మం యితర 
ధర్మంవా, ఆతనోతి; కైః? చేతోభిః జ్ఞానేంద్రి 

యైః ఆకూతిభిః, కర్మేంద్రియెశ్చ, తతశ్చ ధర్మాధర్మ 
వాసనాయుక్తం... తన్మనః” 


దీని కీక్రింది తెనుగు సేత; 

“పురుషుల చిత్తంబు గుణములంజెంది, యెంత 
కాలముండును, మజియంత కాలమందు 
నరయ విజ్ఞాన కర్మేంద్రియములచేత 

మరగి ధర్మంబులను నధర్మంబులట్లు 

తగిలి పుట్టించుచుండు నత్యంత మహిమ” 


పోతన అనువాద విధానము 37 


మరియు ధర్మాధర్మ వాసనా యుక్తంబు చిత్తంబు. (5-ప్ర-154) 


శ్రీధరవ్యాఖ్య ననుసరించిన మజియొక యుదాహరణమునిత్తును. పూర్వచిత్తుని 
వర్ణించు నవసరము నున్న గద్యమున (5-2-4) “పురట లతారూఢ” అని 
మాతృకలోనున్న దానికి శ్రీధరులు “స్వర్ణవల్ల్యః తాస్యారూఢాః” అని వ్రాసిరి గంగన. 
దానినే “సువర్ణ లతారూఢ” అని యుంచెను. ఈ విధముగా గంగన్న (గ్రంథాంత 
గద్యమున తా నీస్మంధమును రచయించెనని చెప్పుకొన్నను పోతనామార్గమునే 
యనుసరించినట్లు భావింపవలెను. | 


ఇక షష్టస్మంధమును పరీక్షింతము. ఈ స్కంధమన్నిటికంటె విలక్షణము దీనిని 
సింగయ రచించెను. ఇందు పోతనవలెనే తన యిష్టదేవతా ప్రార్ధనమును, వంశావతా 
రమును, షష్ట్యంతములను రచియించెను. అచ్యుతుని కృతిపతిగా నొనర్చిను. పోతనకు 
వలెనే యితనికిని సరస్వతి కన్పడెను. క్రింది యనుకరణమును గమనింపుము: 


“భాగవతముం దేటపజుప నెవ్వండు సాలు 

శుకుండుం దక్క నరుని సఖుండుం దక్క 

బుద్ధిం దోంచినంత బుధులచే విన్నంత 

భక్తి నిగిడినంత పలుకువాండ.” (6-23) 


కథాక్రమమిట్లు మొదలుపెట్టెను: 


హరిచరణ స్మరణ పరిణామ వినోదులైన శౌనకాదులకు నిఖిల పురాణేతిహాస 
నిర్ణయ విఖ్యాతుడైన సూతుండిట్లనియె” ఈస్మంధమునందలి యజామీలోపాఖ్యానమును, 
చిత్రకేతూపాఖ్యానమును చదివిన తప్పక యీ భాగములను పోతనయే రచించె నను 
నభిప్రాయము పొడమును యమదూతల వర్ణనమును చూడుము. 


“కనియెన్‌ బ్రాహ్మణు డంత్యకాలమున వీంకన్‌ రోష నిష్ట్యూమలన్‌ 

ఘన పీనోష్ట వికారవడ్ర విలసద్గర్వేక్షణో పేతులన్‌ 

జన సంత్రాసకరోద్యతాయత సుపాశ శ్రేణికాహేతులన్‌ 

హననవ్యాప్తి విభీతులన్‌ మువుర నాత్మానేతలన్‌ దూతలన్‌.” (6-70) 


38 ఆంధ్ర మహాభాగవతోపన్యానములు 


ఈయనను పోతనవలె శ్రీధరవ్యాఖ్య ననుసరించిన స్థలములును గలవు. 
మాతృకలో “కుంజర శౌచవత్‌” (6-1-10) అనుదానికి శ్రీధరులవారు “యథాకుంజరః 
స్నాతోపి రజోభిరాత్మానం మలినం కరోతి” అని వ్రాసిరి. దానికి సింగన్న “సలిలమందు 
మేని మలినంబు పోకుండ గజము గ్రుంకు వెట్టుగతియబోలె” అని తెనుగు జేసెను. 
మరియొక యుదాహరణము. 

హంస గుహ్యస్తోత్రమున: 

“యదోపరామో మనసోనామరూపరూపస్య దృష్టస్మృతి సంప్రమోషాత్‌ 

య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మైవుచిషద్మనే నమః” 

(6-4-26) 

అని మాతృకలో నున్నది. 

దానికి శ్రీధరులవారు 

“యదామనస ఉపరామః = సమాధి, తదా, నామరూపేరూప్వ్యేతే యేనతత్తథా, 
తస్యఉపరమే హేతుః, దృష్ట = దర్శనం; స్మృతిశ్చ తయోః సంప్రమోషాత్‌ = నాశాత్‌; 
తదా,యః = స్వరూప జ్ఞానేన ప్రతీయతే; తస్మై, హంసాయ = శుద్ధాయ; శుచి = 
శుద్ధం, మనః; సద్మ = ప్రతీతిస్థానం యస్యతస్మైనమః”అని వ్యాఖ్య రచియించిరి. 
దానిని గంగయ్య యిట్లు తెనుగు జేసెను. 


“మజియు ననేక నామరూప నిరూప్యంబగు మనంబునకు దృష్టిస్మృ 

తుల నాశంబు వలన కలిగెడు నుపరామంబగు సమాధియందు, కేవల 

జ్ఞాన స్వరూపంబున నిర్మల ప్రతీత స్థానంబైన హంసస్వరూపికి నమ 

స్మారములు.” (6-217) 

ఈస్మంధములో కొన్నిన విశేషములు కలవు. ఒకదానిని చూపెదను. దేవతలు 
వృత్రునిచే నోడిపోయి విష్ణువువద్దకు పోవు సందర్భమున దుగ్ధసముద్ర వర్ణనమున్నది. 
ఇది మాతృకలోలేదు. ఈవర్ణన మద్భుతముగానున్నది. ఇందలి శ్లేషమూలోపమాలం 
కారములు, మొదటి నైమిశారణ్య వర్ణన గద్యమునందలి వానిని పోలియున్నవి. 
చూడుడు: 


పోతన అనువాద విధానము 39 


“మధువైరి నుందిరంబునుంబోలె మాధవ మన్మథ మహితంబై, |[బ్రహ్మగేహం 
బునుంబోలె శారదాన్వితంబై, నీలగళ సభానికేతనంబునుంబోలె వహ్ని వరుణ 
సమీరణ చంద్రరుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత 
జటీపటల మండితంబై, మరుని కోదండంబునుంబోలె పున్నాగ శిలీముఖ 
భూషితంబై... శైలజా నిటలంబునుంబోలె చందనకర్పూర తిలకాలంకృతంబై, 
... లంకానగరం బునుంబోలె రామమహిషీ వంచక సమంచితంబై.” 


(1-39) 


“విష్ణ కరకమలంబునుంబోలె నుదర్శనావర్తప్రగల్బ ౦బై, కైలాన 
మహీధరంబునుం బోలె నమృత కళాస్థానశేఖర పదార్పణంబై, ఇంద్రవైభవం 
బునుంబోలె కల్పవృక్ష కామధేను చింతామణి జనిత విశేషంబై, సుగ్రీవ 
సైన్యంబునుంబోలె అపరిమిత నిబిడ హరిసంచారంబై, నారాయణోదరంబునుం 
బోలె నిఖిల భువన భారభరణ సమర్థంబై, శంకరు జటాజూటంబునుంబోలె 
గంగా తరంగిణీ సమాశ్రయంబై, బ్రహ్మలోకంబునుంబోలె పరమ హంసకుల 
సేవ్యంబై.” (6-326) 


ఈ సామ్య మసామాన్యము. పోతన వచనరచనలో కాదంబరీ కావ్యము 
నొరవడిగా పెట్టుకొనెనందురు. ఈరచనము పోతనది కాదనగలమా? అజామీల 
చిత్రకేతూపాఖ్యానము చదువునప్పు డాభాగములు తప్పక పోతనార్య రచితములేనని 
మనకుతోచును. విమర్శకులు వ్రాసిన “షష్ట స్మంధములో 307. 326 వచనములును, 
అజామీలోపాఖ్యానము, చిత్రకేతూపాఖ్యానము పోతనామాత్యుని కవితయేయని 
సర్వవిధముల విశ్వసింపదగి యున్నది. అందు పోతన యభిమానించు నంత్య 
నియమములు, సాంన్కృతిక దీర్భసమానములు, నీనపద్య నియతులు 
విశేషముగాకలవు. విమర్శకులు షష్టస్మంధమును పోతరాజు కవితయును 
మనోవిశ్వాసముతో మరల పరఠింతురేని మాయూహతో నేకీభవింపకపోరు.” 

(భా. పీఠిక) 


పై వాక్యములతో నేనేకీభవించుచున్నాను. 


40 | . ఆం(ధ్ర మవోభాగవతోపన్యానములు 


లో 
' లాక్షణికుల నింద; గ్రంథపాతము' 


ఇక లాక్షణికులు భాగవతముపై చేసిన నిందను విచారింతము. ఉభయరేఫ 
సాంకర్యము చేసెనని యానింద. దీనినిగూర్చి యొక విమర్శకుడిట్లనినాడు: 
“ఆంధ్రకవులలో నొకపక్షమువా రీభేదమును పాటించిన వారుగను, నింకొకషక్షమువారు 
వీనిని పాటింపనివారుగాను నున్నారు.” ఈ విషయమున నప్పకవి చేసిన 
యాదోసమునకు కూచిమంచి తిమ్మకవి యిచ్చిన యీక్రింది సమాధానమును 
గమనింపుడు: 


“కాకుమాని యప్పకవి యహోబిలపతి 

ముద్దరాజు రామముఖ్యులెల్ల 

పోతరాజు కబ్బమును రాలురేఫలు 

గదిసెనంచు చెప్పిరది హుళిక్కి” 

ఆవిమర్శకునే పోతన వ్రాసిన భాగవత భాగములలో ' నీనియమమును 
పాటించుటయు, యితర భాగములలో పాటింపమియు చూపుచు నుదాహరణముల 
నిచ్చియున్నారు. వ్యాకరణమునకును, లక్షణమునకును బొత్తుగా గౌరవమేలేని 
యాకాలమున నీనింద కెక్కడను తావే లేదు. మద్దురువులగు కీ. శే. వాసుదాసుగారు 
తమ రామాయణ పీఠికయం దీక్రిందివిధముగ సెలవిచ్చినారు; 


“తుచ్చుడు సరిగాదని నను 

స్వచ్భపుంబోతన కవిత్వ సంపద చెడునే? 

స్వేచ్చ జరభి దూషించిన 

నచ్చ పతివ్రతకు పాప మంటంగలదే?” 

గ్రంథపాత వృత్తాంతమును వినుడు. దీనికి రెండు కారణములు వాడుకలో 
కలవు. పోతన భాగవతమును పూర్తి చేసి పూజామందిరమున నుంచి కుమారుని 
జాగ్రత్తగా కాపాడుమని చెప్పిపోగా తరువాత కొంత కాలమునకు దానిని విప్పిచూడ 
నది కొంతభాగము క్రిమిదష్టమైనందున పోతనార్యుని ప్రియశిష్యుడైన వెలిగందల 


పోతన అనువాద విధానము 41 


నారయ మొదలైనవారు దష్టభాగములను పూర్తిచేసిరని యొకకథ. సర్వజ్ఞసింగనకు 
భాగవతము నంకితము నీయ పోతనార్యుడు నిరాకరింపగా నాయనకు కోపమువచ్చి, 
దానిని పాతిపెట్టించెననియు, నందువలన నది శిథిలమైనదియు తచ్చిథిల 
భాగములను నారయాదులు పూరించిరనియు రెండవ కథ. వీని యాథార్థ్యమిపుడు 
మనకు బనిలేదు. కొనన్నిభాగము లుత్సన్నములైనవియు, వానిని నారయాదులు 
పూరించుటయు సత్యము. .ఈపూరణ సమస్యను వెనుక కొంత ముచ్చటించినాను. 
ద్వితీయస్మంధమునందలి కొంతభాగమును, తృతీయ చతుర్ధ స్మంధములలోని 
కొంతభాగమును, పంచమ షష్టస్మంధములును, దశమ స్మంధోత్తర భాగమును, 
ఏకాదశ ద్వాదశ స్మంధములును నుత్సన్నములైనట్లు ప్రతీతి. వీనిలో పంచమ, షష్ట 
స్మంధములును, ఏకాదశ ద్వాదశ స్మంధములును నితరులు పూరించినట్లు స్మ్కంధాత 
గద్యాదులు సాక్ష్యమిచ్చుచున్నవి. కాని లేనిభాగములు పూరించిరా? లేక 
లుప్తభాగములను పూరించిరా యనునదొక ప్రశ్న. పూరణ విధానమును వెనుక 
మనివి చేసినాను. భారతారణ్య పర్వములోని లుప్తభాగముల నెజ్బన పూరించినట్లే 
వీరును చేసిరని యనుకొనవలెను. భారత విషయమున నభిప్రాయ భేదములున్నను . 
నిచటమాత్రము లోపించిన భాగములనే వూర్తిచేసినట్లు వెనుకనిచ్చిన 
దృష్టాంతములవలన చాలవటకు నిరూపించియున్నాను. వీరి ప్రత్యేక కవిత్వ 
విధానములకు నిర్దిష్టములైన లక్షణములు గానరావు. శైలి పదగుంభనము, 
దీర్లసమాసములు, అంత్యనియమములు మొదలైన లక్షణములున్నవని కొందరందురు. 
కాని యవి యవ్యాప్య్యతివ్యాప్తి దోషములతో కూడియున్నది. ఆవిషయమును వెనుక 
చూపించినాను. స్మంధాత గద్యములందు తమ ప్రత్యేక నామములనిచ్చినను, నీలక్షణ 
వ్యత్యాసము కానబడుటలేదు. వెనుకటి లక్షణము లన్నిట కనబడుచున్నవి. విమర్శకులు 
కొందరు సీసపద్యములలో పోతన యొక విధమైన యతిప్రాస నియమమును 
" పాటించెననియు, దానివలన నితరుల భాగములను కనుగొనవచ్చుననియు చెప్పినారు. 
కాని వారి సూత్రము కూడ యవ్యాష్యతి వ్యాప్తిదోష దూషితము కాదని చెప్ప వీలులేదు. 
కాబట్టి యీవిషయమున నిదమిత్ణమని చెప్పుటకు వీలులేదు. కీ.శే. తిరుపతి ' 
వేంకటేశ్వరుల కావ్యములలో నేది తిరుపతి శాగస్తిగారును, నేది వేంకటశాస్రిగారును 


42 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


వ్రాసిరని నిర్జారణము చేయుటకు తగు నాధారములులేవు. ఒకమారు శ్రీవేంకటేశ్వర 
శాస్త్రి గారే యట్టి సాహసము చేయవలదని మందలించిరి. అట్టిస్థితిలో భాగవతమును 
గూర్చి నిష్కృష్టముగా చెప్పుట యసంభవము. ఆవిమర్శకులే యీక్రింది వాక్యములను 


వ్రాసినారు; 


“వీనినన్నిటిని సమన్వయించినచో పోతన (గ్రంథములో పరుల కూర్చులు 
మార్పులు తప్ప వారిస్వంత రచనమంతగా లేదని తోచును. ... పంచమ 
షష్టస్మంధములు చాలభాగ ముత్సన్నము కాగా కొంత పోతరాజు రచనము మజికొంత 
తమ రచనము నింపి మాతృకలోనుండి లభించిన పద్యములను చేర్చి తలలు మార్చి 
కొత్తమార్చులు కూర్చి పూర్వగ్రంథ స్కంధములు నిలువబెట్టినటుల తెలియును. 
భాగవత పూర్వపీరికా కారులందరును నేకముఖమున గంగన సింగనల కవిత 
పోతన కవితతో పోలుననుట కిదియే తార్మాణము.” ఇక నేకాదశ ద్వాదశ స్కంధములు 
మాత్రము నారయ కృతులనుట స్పష్టము. ఈ వివిధ కవిత్వములును, వాని 
లక్షణములును, పోలికలును యీవ్యాసాం శములుకావు. కావున నాపరీక్షను 
“కవిత్వమును” చర్చించువారికి వదలివేతును. అనువాద విధానమున పోతన దానిని 
తెల్పి యితరులదానిని వదులుట పాడిగాదనియు, నితరుల యనువాద విధానమును 
తెల్పువ్యాసము వేరుగా లేనందునను నీవిషయమును కొంత చెప్పవలసివచ్చెను. 
సింగయ గంగయల కవిత్వముకంటె నారయకవిత్వము కొంత లొజ్జనియు నతని 
భాగములందు దోషములు మిక్కుటముగా నున్నవనియు కొందబిదురు. కాని వారు 
తెలిపెడి దోషములవంటివి ప్రాయికముగా నందలి భాగములందరును కొంచమో 
గొప్పయో కలవు. ఆవిషయము మనకు బనిలేదు. భాగవతమును రచించి పూరించిన 
మహామహులందబును వంద్యులే. 


= 
పోతన భాషాంతరీకరణము 


ఇక పోతన భాషాంతరీకరణ పద్ధతిని ప్రత్యేకించి పరిశీలించవలసియున్నది. 
వెనుక పోతన తెనుగుసేతలో భాగవతము 8000 గ్రంథములు పెరిగినట్లు తెలిపినాను. 


పోతన అనువాద విధానము 43 


ఈ పెరుగుదల యితరులు తెనిగించినట్లు చెప్పు భాగములందుకంటే పోతన 
తెనిగించినవానిలోనే యెక్కువగా నున్నది. ఇందునకు కారణముకూడ వెనుక మనవిచేసి 
యున్నాను. ఆకారణము లెట్లు పెరుగుదలకు మూలభూతములో కను౧గొందము: 


1. బ్రాహ్యాద్యష్టాదశ పురాణములలో నుత్తమంబగు నీపురాణ మత్యంత 
రహస్యార్థ ప్రతిపాదకంబును, పరమవేదాంత ప్రతిపాద్య భగవద్దుణ 
గణాపాదకంబును నైన యుత్తమగ్రంథం బగుట; 


2. ఇట్టి గూఢంబైన గ్రంథార్థంబు తేటపటుప వ్యాఖ్యానరూపముగా 
నభివర్ణించుట. 


పై రెండు కారణములను కలిపి విచారింతును. భాగవత మట్టి యుత్తమ 
గ్రంథమనుటకు ప్రమాణములను తెల్పెదను; 


“యత్రాధి కృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః 
వృత్రాసురవధో పేతం తద్భాగవత మిష్యతే 
అష్టాదశ సహస్రం తత్పురాణం పరికీర్తితం.” (మత్స్య్రపురాణము) 


“గ్రంథోష్టాదశ సాహస్రో ద్వాదశస్మంధ సమ్మితః 
హయగ్రీవ (బ్రహ్మవిద్యా యత్ర వృత్రవధస్తథా 
గాయత్రాచ సమారంభః తద్వై భాగవతం విదుః.” (స్మాంద పురాణము) 


“అంబరీష శుకప్రోక్తం నిత్యం భాగవతం (శ్రుణు 
పఠస్య స్వ ముఖేనాపి యదీచ్చపి భవక్షయం.” (పద్మ పురాణము) 


“అర్టోయం బ్రహ్మసూత్రాణాం భారతార్థ వినిర్ణయంః 

గాయత్రీ భాష్యరూపోసౌ వేదార్థ పరి బృంహితః 

పురాణానాం సారరూపః సాక్షాద్భాగవతోదితః 

ద్వాదశస్కంధ సంయుక్తః శతవిచ్చేద సంయుతః 

గ్రంథోష్టాదశ సాహస్రః శ్రీమద్భాగవతాఖభిదః.” (గరుడ పురాణము) 


44 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పైనయిచ్చిన పవురాణవచనముల సారాంశమేమనగా భాగవతమున 
కారంభమున గాయ ్రీమంత్ర మున్నదని అదియే “సత్యం పరంధీమహి” యనునది. 
ఈ మంత్రమును పోతనార్యుడు భాషాంతరీకరింపలేదు. ఇది యొక విశేషము. 
భాగవతమునకు హయగ్రీవ బ్రహ్మవిద్యయను నామాంతరము కలదు. హయగ్రీవుడు 
చిక్కుబడకుండ వేదములను (బ్రహ్మదేవునికి చ్చినట్లున్నది. వృత్రాసురవధ 
భాగవతమునకొక విశిష్ట లక్షణము. అంబరీషుడు గౌతముని మోక్షోపాయమడుగగా 
_ నాయన నిత్యము భాగవతమును వినుమనియు సంసారక్షయమును కోరినయెడల 
భాగవతమును పఠింపుమనియు చెప్పెను. ఏతద్భాగవత పఠనశ్రవణములు 
మోక్షదాయకములు. మతి యే యితర పురాణమును గూర్చి యిట్లు కంఠోక్తిగా 
చెప్పలేదు. వేదాంతార్థ ప్రతిపాదకములైన బాదరాయణ బ్రహ్మసూత్రముల యర్థము 
భాగవతమున క్రోడీకరింపబడినది. పంచమ వేదమైన భారతముయొక్క తాత్సర్యమిందు 
తెల్చబడినది. మంత్రరాజమగు గాయత్రీ మంత్రమున కీభాగవతము భాష్యరూపము. 
వేదములయొక్క యర్థములచే నిది నిండియున్నది. ఇది నమన్త పురాణ 
సారభూతమైనది. భాగవత (ప్రాశస్యమునకింకేమి కావలెను? ఇది బ్రాహ్యాది సమస్తేతర 
పురాణసారభూతమనుట కేమి యభ్యంతరమున్నది? ఇందు మోక్షమునకు 
ముఖ్యసాధనమైన భక్తి ప్రవచింపబడినది. ఆ భక్తి నవవిధములని దృష్టాంత 
పూర్వకముగా తెలుపబడినది. ఇది “సాక్షాద్భాగవతోదితము”, అనగా పరమ 
భాగవతోత్తముడైన శకునిచే నుపదేశింపబడినది. దీనిని విని పరీక్షిత్తు మోక్షమును 
పొందెను. శ్రీమద్భగవద్గీతలో తెలుపబడిన భక్తి యోగమున కిది యుపబ్బంహణము. 
అందువలననే పోతన్నగారు “పలికెడిది భాగవతమట” అనియు “పలికిన 
భవహరమగునట” అనియు చెప్పినారు. ఈ పురాణమును సాక్షాదృగవదవతారమని 
నమ్ము వ్యాసమహర్షి తన కుమారుడైన శుకుని కుపదేశించెను. 


“సర్వ పురాణోత్మ ష్టమైన నిఖిలోపనిష[త్సతిపాద్య పరమ తత్వార్గ 


బృంహకత్వేనచ శ్రీమద్భాగవతం స్వయమేవ సమహర్మిః (వ్యాసః) విరచయ్య స్వసుతాయ 
శుకాయోపదిదేశ.” (చంద్రికా) 





పోతన అనువాద విధానము i 45 


ఈ విషయము భాగవతాదిలో నున్నది. ఇతర పురాణములు పరాశరాది 
ప్రోక్తములు. ఈ యర్థమునే యీ భాగవత శ్లోకము తెల్పుచున్నది: 


“నిగమకల్పతరో ర్గళితం ఫలం 

శుకముఖా దమృతద్రవ సంయుతం 

పిబత భాగవతం రసమాలయం 

ముహురహో రసికాభువి భావుకాః.” 

ఇప్పుడొక్కమారు భాగవతము యొక్క గొప్పతనమును తలంపుడు. ఇంత 
మహాగ్రంథమగుటచేతనే పోతన్నగారు దీనిని “భవహర”మగుటకై పలికి, తాను 
మోక్షమును జూరగొని, మనకు మార్గమును చూపినాడు. పఠితలు తరించుటకై 
మూలమున కంటె విపులముగాను సుజ్జేయముగా వివరించినాడు. అనగా మాతృకకు 
వ్యాఖ్యాన రూపముగా దీనిని రచియించుటచే నిది పెరిగినది. ఎట్లు విపులీకరించెనో 
ముందు తెలిసికొనగలము. 


3. “భగవద్దుణ వర్ణనాది ఘట్టములందు సంస్కృత భాగవత ప్రతిపాదిత 
క్రమమున నభివర్ణించి స్వకీయ భగవద్భక్ష్యతిశయమున స్వానవద్య 
కవిత్వ విద్యాచాతురీ సంప్రాప్త నిరంకుశ స్వాతం(త్యముచేత 
భగవద్దుణాదులను విశేషముగా వర్ణించుట.” 


పెరుగుదల కిదికూడ యొక కారణము. పై మూడు కారణములకు కొన్ని 
యుదాహరణముల నిచ్చెదను. ఇట్టి ఘట్టములు సప్తమస్మంధము మొదలుకొని 
దశమస్మంధాంతము వజకు నెక్కువగా నున్నవి. మణియు నచ్చటనే పెరుగుటకు 
నాల్గవ కారణమగు విష్ణుపురాణాదీతర గ్రంథముల నుండి గ్రహించినభాగములు 
కలవు. నిజముగా పోతనార్యుని ప్రతిభాకౌశలములను తెల్పుస్థలము లచ్చటనున్నను, 
పూర్వస్మంధములందును లేకపోలేదు. భారతీయ సంస్కృతిలో నైమిశారణ్యమున 
కొకయున్నత స్థానమున్నది అచ్చటనే సత్రయాగములు జరుగును. అచ్చటనే 
పురాణేతిహాస శ్రవణములు జరుగును. అది మహా తపస్సంపన్నులైన మహామునుల 
యాటపట్టు. అది “అనిమిషులు” అనగా దేవతలకు క్షేత్రము. అందువలన మిక్కిలి 


46 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పవిత్రమైన స్థలము. భాగవత కథయు నైమిశారణ్యముననే ప్రచారమైనది. సూతుడును 
శౌనకాది మహామునులు నెచ్చట నుందురో యచ్చట యెల్లప్పుడును హరినామ 
సంకీర్తనము జరుగుచుండును. అట్టి నైమిశారణ్య ప్రశంస వచ్చినప్పుడు పోతనార్యుడు 
తన హృదయము నాపు కొనలేకపోయెను. మాతృకలో “నైమిశేనిమిషక్షేత్రే” అని 
మాత్రమున్నది. వెంటనే యుద్రేకమున పోతన్నగారి హృదయముప్పొంగెను. 
పొడుగాటి సమాసములును, శబ్దార్థాలంకారములును గల పెద్ద గద్యము నొక 
దానిని రచియించెను. సుందరమైన నడకతో, శ్లేషమూలమైన యుపమాలంకారములతో 


నతిరసవంతమై యున్న దీగద్యము. “మధువైరి మందిరంబు నుంబోలె మాధవ 
మన్మథ మహితంబై” మొదలుకొని “జలదకాల సంధ్యా ముహూరంబునుబోలె 
బహువితత జాతి సౌమనస్య్వంబై” యొప్పు నైమిశారణ్యంబు అనెను. ఒక పద్యమును 
కూడ వ్రాసెను: 

“పుణ్యంబై, మునివల్లభ 

గణ్యంబై, కుసుమఫల నికాయోట్ధిత సా 

ద్గుణ్య మయి, నైమిశాఖ్యా 

రణ్యంబు నుతింపం దగు నరణ్యంబులోనన్‌.” (1-5) 


పోతనార్యుని కవిత్వమునకు సహజాలంకారములగు ననుప్రాసలకును, శబ్దాల 
కారములకును నిచ్చటనే యంకురారోపణమైన దనుకొనవచ్చును. శౌనకాది 
పరిప్రశ్నమున కృష్ణుని ప్రశంస వచ్చినవెంటనే పోతనార్యుని హృదయ మాగదు. 


“వర గోవిందకథాసుధారస మహావర్నోరు ధారా పరం 

పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి 

స్తర దుర్దాంతదురంత దుస్సహజనుస్సంభావితానేక దు 

స్తరగంభీర కఠోర కల్మష కనద్దావానలం బాజునే?” (1-49) 


ఇందు పాపము యొక్క ముష్మరగుణమును నది గోవింద కథా సుధారసముతో 
నెట్లు నశించునది బహురసవంతముగా వర్ణింపబడినది. ఇదియును, తరువాతి 
పద్యమును పోతనార్యుని స్వంతములే! ప్రథమస్మంధమునందలి భీష్మస్తవమున కూడ 


పోతన అనువాద విధానము 47 


కొన్ని పోతన స్వంత పద్యములు కలవు. మాతృకలోపండైండు శ్లోకములు మాత్రము 
కలవు. ఇందలి శ్లోకములను రెంటిని వాని భాషాంతరీకరణమును చూపెదను. 


“స్వనిగమ మపహాయ మత్రతిజ్ఞామృత మధికర్తుమపప్లుతో రథస్థః, 
ధృతరథచరణోభ్యయాచ్చలద్ద్లుః హరిరివహంతు మిభంగతోత్తరీయః i 
శిత విశిఖవతో విశీర్ణదంశః క్షతజపరిఫ్లత ఆతతా యినోమే, 
ప్రసభమధిససారమద్వథార్థః నభవతుమే భగవాన్‌గతిర్ముకుందః | 
(1-9-37,38) 
“కుప్పించి యెగసినం గుండలంబుల కాంతి 
గగనభాగం బెల్లం గప్పికొనగం, 
నుతికిన నోర్వక యుదరంబులో నున్న 
జగముల వ్రేంగున జగతి గదలం, 
జక్రంబుం జేపట్టి చనుదెంచు రయమునం 
బైనున్న పచ్చని పటము జా, 
నమ్మితి; నాలావు నగుంబాటు సేయకు 
మన్నింపుమని క్రీడి మరలం దిగువం, 
గరికి లంఘించు సింహంబు కరణి మెజసి 
నేండు భీష్మునిం జంపుదు; నిన్నుం గాతు; 
విడువు మర్గున యనుచు మద్విశిఖ వృష్టిం 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.” (1-222) 


“అపఫ్నతో రథస్థః” “చలద్దుః అనువానికి మొదటి రెండుపాదములు 


తెలుగుసేతలు. అతి రమణీయములు. 7 అక్షరములకొక (గ్రంథమును, 3 
అక్షరములకొక [గ్రంథమును రచియించెను. ఈ సందర్భమున మరియొక 
చిన్నపద్యమును వివరింతును. మాతృకలో: 


“లలిత విలాస వల్లు హాసప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః, 
కృతమను కృతవత్య ఉన్మదాంధాః ప్రకృతిమగన్‌కిలయస్య గోపవధ్వ” 
(1-9-110) 


48: ఆంధ్ర .మహాభాగవతోవన్యానములు 


అని యున్నది. దీనికి పోతన సేతను చూడుడు: 


“పలుకుల నగవుల నడపుల . 

నలుకల నవలోకనముల నాభీరవధూ 

కులముల మనముల తాలిమి 

కొలుకులు వదలించు ఘనుని గొలిచెద మదిలోన్‌.” 


“తాలిమి కొలుకులు” ఎంతచక్కని నుడికారము. శుకుడు భక్తి మార్గంబును 
చెప్పునెడ 4 శ్లోకములను 30 పంక్తుల గద్యములో చెప్పెను. (2-24,26) మరియు 
నా ప్రకరణముననే మాతృకలో. నున్న 13 శ్లోకములను (2.4 11-24) 21 గద్య 
పద్యములలో తెల్పినాడు. ఇందు చాలపద్యములు పోతన స్వంతములు. 


మాతృకలో తృతీయస్మంధమున నున్న విదురమైత్రేయ సంవాదము (8.5-12) 
ను పోతన 208 పద్య గద్యములలో తెలిపెను. ఇందనేకములు స్వంతపద్యములు. 
ఆస్మంధముననే దేవతలు మహావిష్ణువును స్తుతించు నవసరమున (8. 5.37-50) 
నున్న 13 శ్లోకములను దీర్ధమైన దండకములో వ్రాసెను. ఈదండకములోని కొన్ని 
భాగములు శ్రీధర వ్యాఖ్యననుసరించి వ్రాసినవి. యజ్ఞవరాహస్తవములోని మాతృకనున్న 
12 శ్లోకములు (3. 13.35-47) పెంచి పద్యములలో వ్రాయబడినవి. ఒక్క పద్యమును 
మాతృకతో ననువదించెను. 


“దంష్ష్రాగ్రకోట్యా భగవంస్త్వయాధృతా 
విరాజతే భూధర భూస్సభూధరా 
 యథావనా నిస్సర తోదతోధృతా 
మతంగజేంద్రస్య సపంక పద్మినీ,” 
“అరవిందోదర! తావకీనసిత దంష్ట్రాగ్రావలగ్న క్షమా 
ధర నద్యబ్ధినదాటవీయుత సమిద్ధ క్ష్మాతలం బొప్పెభా 
సురకాసార జలావతీర్ణ మదవచ్చుండాల రాడ్డంత శే 
. ఖర సంసక్తసపంక పంకజము రేఖంబొల్పు దీపింపగన్‌.” . (38-429) 


పోతన అనువాద విధానము ః 49 


చతుర్ధ స్మంధమున దక్షయజ్ఞ సందర్భమున మాతృకలో నిట్లున్నది 
(సతీవాక్యము): 


“వ్రీడామమా భూత్ముజన వ్రసంగతః 

తజ్జన్మధిక్‌ యో మహతామహృద్యకృత్‌ I 

గోత్రం త్వదీయం భగవాన్‌ వృషధ్వజః 

దాక్షాయణీత్యాహ యదా సుదుర్మనాఃొ 

దీనికి రసవంతములైన రెండుపద్యములను పోతన రచించినాడు: 


“నీల గళాపరాధియగు నీకుం దనూభవ నౌట చాలదా? 
చాలు గుమర్య! నీదు తనుజాతననన్‌ మది సిగ్గు వుట్టెడిన్‌; 
ఏల ధరన్‌ మహాత్ములకు నెగ్గొనరించెడివారి జన్మముల్‌? 
గాలుపనే తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడగన్‌?” 


“వర వృషకేతనుండు, భగవంతుండునైన హరుండు నన్ను నా 

దర పరిహాసవాక్యముల “'దక్షతనూభవి యంచు బిల్వ, నేం 

బురపురబొక్కుచున్‌, ముదముంబొందక, నర్మవచః స్మితంబులం 

దొజంగుదు నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చుటొప్పగున్‌.” 
(4-94, 95) 


ఇట్లే వీరభద్రుని జనన ఘట్టమునను పెంచెను. పై పూర్వ స్మంధములలోని 
పెంపుడులలో కొన్నిటికి పోతన్నగారి విచిత్ర _వివరణా పారీణతకు 
రెండుదాహరణములనిచ్చి తరువాతి స్మ్నంధములకు వెడలెదను. సకసనందనాదులు 
వైకుంఠమునకు పోయినపుడు విష్ణువు వారికడకు వచ్చు సందర్భమున మాతృకలో 
“మహామునీనాం, అన్వేషణీయ చరణౌ చలయన్‌ సహశ్రీః¥” అనియున్నది. “సహశ్రీః 
” అను మూడక్షరములకు రెండు వృత్తములను రచియించినాడు: 


“శరనిధి కన్యకామణియు సంభ్రమమొప్పంగ దోడ రా, మనో 
హర నిజలీలమైం బరమహంస మునీశ్వర వంద్యపాద పం 


50 ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


కరుహములన్‌ వినూత్నమణి కాంచన నూపురమంజు ఘోషముల్‌ 
వరుసం జెలంగ నార్యజనవంద్యుడు యోగిజనైక సేవ్యుండై.” 


“కరమణి హేమకంకణనికాయరుణంకృతు లుల్లసిల్ల న 
చ్చర లిడు హంసపక్షి సితచామర గంధవహోచ్చలత్సుధా 
కరరుచిరాతపత్రసుభగ ప్రవిలంబితహారవల్లరీ 
సరస గళత్తుషారకణజాల విరాజిత మంగళాంగుండై.” 
(3-534,535) 


ఇట్లనువదింప నంతుండదు. ఇక తరువాతి స్మృంధముల నెత్తుకొని పోతనార్యు 
డితర గ్రంథములనుండి తీసికొనిన భాగములతో నీయన పెంపుడును వివరింతును. 
ఈ పెరుగుట ముఖ్యముగా సప్తమస్మంధములోని ప్రహ్లాద చరిత్రము; అష్టమ 
స్మంధములోని క్షీరసాగర మథనము, గజేంద్ర మోక్షము, వామనచరిత్రము; 
నవమస్మంధములోని పరశురామ చరిత్రము; దశమ స్మంధములోని శ్రీకృష్ణ చరిత్రము, 
రుక్మిణీ కల్యాణము మొదలైనవాని యందు కలదు. ఇతర (గ్రంథములగు 
విష్ణుపురాణము, హరివంశము మొదలైన వానినుండి గ్రహించిన స్థలము ముఖ్యముగా 
నరకాసుర యుద్ధఘట్టమునం దున్నది. వీనినన్నింటిలోని యావత్తు పెంపును చూపుటకు 
తావు చాలనందున స్థాలీపులాకన్యాయముగా చూపుదును. పోతన చేసిన ప్రతిజ్ఞను 
వినుడు: 


“కొందజకుం దెనుగుం గుణమగుం 

గొందఅకును సంస్క లతంబు గుణమగు; రెండుం 

గొందటికు గుణములగు నే 

నందణ మెప్పింతుం గృతుల నయ్యెయెడలన్‌.” (1-20) 


ఈ పద్యము వలన పోతనామాత్యుడు పండితుడు కాడను ప్రవాదము 
పరాస్తమైనది. ఈ (ప్రతిజ్ఞను సంపూర్ణముగా నెరవేర్చి, శాశ్వతకీర్తిని పోతనార్యుడు 
గడించినాడు. 


పోతన అనువాద విధానము | 51] 


ప్రహ్లాద చరిత్రము 


ఈ భాగమందబకును ప్రియమైనది. మాతృకలో నిది 250 శ్లోకములు 
అనగా దాదాపు 850 గ్రంథములున్నవి. అట్టిదానిని పోతనార్యుడు దాదాపు 1000 
గ్రంథముల వణకు పెంచినాడు. ఈ క్రింది మూడనుష్టువ్‌ శ్లోకములను గమనింపుడు: 


“ప్రహాద ఉచ్యతాంతాత స్వధీతం కించిదుత్తమం 

కాలేనై తావతాయుష్మన్‌ యదశిక్షద్గురోర్భవాన్‌ 1 
ప్రహ్లోదః- 

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌ 

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమ్‌ ॥ 

ఇతి పుంసార్పితా విష్ణాభక్తిశ్చేన్నవ లక్షణా 

క్రియతే భగవత్యడ్ధాతన్మన్యేధీతముత్తమం ॥” (7163-1710) 

వీనికి పోతనార్యుడు 8 గద్య పద్యములను వ్రాసెను. 3 గ్రంథములను 24 
గ్రంథములకు పెంచెను. భక్తిభావము నుపబ్బంహణము చేసినాడు. ఈ పద్యము 
లేకొంచె మాంధ్రభాషా జ్ఞానమున్న వారికిని వచ్చునని భావించుచున్నాను. ఒక్క 
పద్యము ననువదించెదను. 


“అంధేందూదయముల్‌, బహాబధిర శంభఖభారావముల్‌, మూక స 
ద్రంథాఖ్యాపనముల్‌, నపుంసక వధూకాంక్షల్‌, కృతఘ్నావలీ 
బంధుత్వంబులు, భస్మహవ్యములు, లుబ్ధ ద్రవ్యముల్‌, కోడ స 
ద్దంధంబుల్‌, హరిభక్తి వర్షితుల రిక్త వ్యర్థ సంసారముల్‌.” (7-168) 


“మందారమకరంద”, “కంజాక్షునకుగాని”, “సంసార జీమూత సంఘంబు” 
మొదలైన పద్యములు సకలాంధ్రుల జిహ్వాగ్రముల నున్నవిగాన నేననువదింపను. 
శ్రీ వేలూరి శివరామశాస్తిగారు తమ నృసింహ పురాణ పీఠికలో, పోతన వ్రాసిన 
భాగవతములో నెబ్బన నృసింహపురాణమున వ్రాసిన పద్యముల పోకడలును, 
ననుకరణములును చూపినారు. అందుక్రిందనే “యెజ్బయ్య పద్యములు కొన్ని 





52 ఆం(ధ్ర మహాభాగవతోవన్యానములు 


పోతనపోతలోబడి పద్మములవలె విప్పారెను” అని సెలవిచ్చినారు. మహాకవుల 
యనుకరణములు ముదావహములేగదా! నరకాసుర వధాఘుట్టమున నిట్లే 
నాచనసోముని ననుకరించెను. అనుకరించిన రచనలకు మెరుగుపెట్టి దిద్దుట 
పోతనార్యుని యందలి మహాగుణము. అది యెల్లెడల కనబడును. మహాకవులు 
వేసిన బాటలను విడనాడక, తృణీకరింపక వానికితోడు స్వోపజ్ఞా ప్రతిభల 
నుపయోగించు కవుల కావ్యములు చిరస్థాయిలుగ నుండును. పునాది గట్టిగ నుండిన 
గదా భవనము శాశ్వతముగా నుండుట! ఈ కాలపు కావ్యములలోను శ్రీ రాజశేఖర 
శతావధానిగారి రాణా ప్రతాపసింహచరిత్రము, శ్రీ గడియారం శేషశాస్రిగారి 
శివభారతము మొదలైన (గ్రంథముల కభ్యర్షితత్వ మందులకే కలుగుచున్నది. 
ఆధునికులలో కూడ కొందజు పోతనార్యుని ననుకరించినవారున్నారు. మహాకవి = 
చివుకుల అప్పయ్యశాస్రిగారు తమ గర్గభాగవతమనెడి యుద్గంథమున పోతనార్యుని 
ననుకరించుచు తమ ప్రతిభా వ్యుత్పత్తులను చూపినారు. 


(ప్రహాద చరిత్రమునువలెనే సప్తమస్మంధమున పెంచిన యితర స్థలములు 
కలవు. ఈ స్మంధముననే దాదాపు 1500 గ్రంథము లుండునట్లు కనపడును. 


అష్టమ స్మంధమున నింతకంటె యెక్కువ పెంపుదల గలదు. మొదటి ఘట్టము 
గజేంద్రమోక్షము. ఇదియు నాంధ్రులకు మిక్కిలి ప్రీతిపాత్రమైన భాగము. మాతృకలో 
నీ భాగము 120 (గంథములకంటె నెక్కువ లేదు. దీనిని పోతనార్యుడు దాదాపు 4 
రెట్లు పెంచినాడు. ఈ క్రింది భాగమును గమనింపుడు. మాతృకలో: 


“తం తద్వదార్త ముపలభ్య జగన్నివాసః 
స్తోత్రం నిశమ్యదివిజై స్సహ సంస్థువద్భిః । 
ఛందోమయేన గురుడేన సఊహ్యమానః 
చక్రాయుధోభ్యగమదాశుయతో గజేంద్రః ॥ 
సోంత స్సరస్యురుబలేన గృహీత ఆరో 
దృష్ట్యాగరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రం | 
ఉత్‌క్షిప్యసాంబుజ కరం గిరమాహ కృచ్రా 


పోతన అనువాద విధానము 53 


న్నారాయణాఖిల గురో భగవన్నమస్తే | 
తంవీక్ష్యపీడిత మజస్సహసావతీర్య 
సగ్రాహమాశు సరసః కృపయోజ్ఞహార । 
గ్రాహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం 
సంపశ్యతాం హరిరమూముచదు స్రియాణాం 11” 
(8.3.31-33) 


ఈ ఘట్టమును 21 పద్యములలో మిక్కిలి రసవంతముగ వర్ణించెను. 
(8.95-116). మాతృకలో లక్ష్మి వెడలినట్లే లేదు. విష్ణు డెచట నున్నది, ఏమిచేయు 
చున్నది, యెట్టి యానందములో నున్నపుడు గజేంద్రుని యార్తనాదమాయనకు 
వినబడినది. యెట్టి సౌఖ్యమును వదలి గజేంద్రుని రక్షించుట కాయనవెడలినది, 
మొదలైనవానిని బహుహృదయంగముగా వర్ణించినాడు. 2,3 పద్యమల 
నుదాహరించెదను. 


“అలవైకుంఠపురంబులో, నగరిలో, నామూలసౌధంబు దా 
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో 
'త్సల పర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి 
హ్వల నాగేంద్రము “పాహిపాహి యనం గుయ్యాలించి సంరంభియై.” 
(8-95) 


ఈ పద్దె మాణిముత్తెము వంటిది. మందార వనము; దానిమధ్య అమృత 
సరస్సు; తత్రాంతమున నిందుకాంతోత్సల పర్యంకము; అందును రమావినోది, 
అదియెవరు పిలిచినను పలుకునట్టిస్థితకాదు. ఆయనయొక్క ముఖ్య గుణమగు నాపన్న 
ప్రసన్నత్వమునకు గొప్పదనము వచ్చుటకై యెట్టి సుకమును విడిచి యాయనవచ్చెనో 
వైధర్య్యముతో దెల్పినాడు. వినిన వెంటనే యాయన సంరంభమును తెల్పు పద్యములు 
హృదయంగమములు. వీనిలో నాసంరంభ ముట్టిపడుచున్నది. మాతృకలో 


“ఛందోమయేన గరుడేన సఊహ్యమానకి అని యున్నది. కాని పోతనార్యుడు 
._ అభ్రగపతిం బన్నింపడు” అని వ్రాసినాడు. చూడుడు: 


54 ఆంధ మవోభాగవతోవన్యానములు 


“సిరికిం జెప్పండు శంఖ చక్రయుగముం జేదోయి సంధింపం; డే 
పరివారంబును జీరం; డభ్రగపతిం బన్నింపం; డాకర్ణి కాం 

తర ధమ్మిల్లముం జక్క నొత్తండు; వివాద ప్రోత్ధిత శ్రీకుచో 
పరిచేలాంచలమైన వీడండు; గజప్రాణావనోత్సాహియె.” (8-96) 


ఈ పద్యము శ్రీనాథ పోతనలకు వివాద స్థానమైనట్లు కథ గలదు. అది 
పుక్కిటి పురాణమని నమ్మక పోయినను, దాని యందు మనస్తత్వమున్నది. రక్షణ 
సాధనమును కూడ తీసికొనక మజచెను. వాహనారూఢుడై వెడలినను దాని 
గమనవేగము చాలక భగవంతుడు దిగినట్లున్నది. “సహసావతీర్వి”, “గరుడోపి 
మందగతిరితి తతః సహసా అవతీర్య” అని శ్రీధరులవారి వ్యాఖ్య, అట్టి యవసరమే 
లేకుండ చేసినాడు పోతన్నగారు. ఇచటనే యున్నది పోతనార్యుని ప్రతిభ. తరువాత 
“తనవెంటన్‌” “తనవేంచేయు పథంబు” “తాటంకాచలనంబుతో” మొదలగు 
పద్యమును గనుడు: 








“అడిగెదననికడువదిం జను 

నడిగినం దను మగుడ నుడువండని నడనుడుగున్‌ 

వెడవెడ చిడిముడి తడంబడ 

నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌.” (8-103) 


ఇచ్చట నామె తత్తరము మూర్తీభవించుచున్నది. “అడుగిడు నడుగిడదు” 
అను మాటలు లక్ష్మి మనస్సు యొక్క ముందు వెనుకలను తెల్పుచున్నవి. ఇక 3 
పద్యముల ననువదించి యీ ఘట్టమును విడతును. 


“పాదద్వంద్వము నేలమోపి, పవనుం బంధించి, పంచేంద్రియో 
న్మాదంబుం బరిమార్చి, బుద్ధిలతకున్‌ మారాకు హత్తించి, ని 

ష్టేద బ్రహ్మపదావలంబన గతిం గ్రీడించు యోగీంద్రు మ 

ర్యాద న్నక్రము విక్రమించెం గరి పాదాక్రాంత నిర్వక్రమై.” (8-65) 


“వెద వివేకించు. గ్రీడించు విశ్రమించు” “బుద్ధిలతకున్‌ మాజాకు హత్తించి” 
మొదలైన నుడికారములు పోతనకే చెల్లును. సక్రముయొక్క పట్టు నీపద్యము 
వర్ణించుచున్నది. తుదిపాదము పద్యమునకు మకుటాయమానము. సక్రముయొక్క 


పోతన అనువాద విధానము 55 


కర్మశమైన పట్టు “క్ర” యను పరుషాక్షరము తెల్పుచున్నది. “క్రై యను నక్షరమును 
చూడుడు. “క” గజపాదమున కుపలక్షకము. “8 క్రావడి నక్రముఖమున కుపలక్షకము. 
“కి ను ' యెట్లు క్రింది భాగము నాక్రమించినదో యట్లే గజపాదమును 
క్రిందిభాగమున నక్రము నిర్వక్రమముగ నాక్రమించినది. కేవల ధ్వనులచేతనే గాక 
యక్షరవిన్యాసముచే గూడ పోతనార్యుడు నక్రము పట్టును వర్ణించినాడు. తర్వాత 
పద్యము కూడ నిట్టిదే. 

“ఊహ కలంగి జీవనపు టోలమునం బడి పోరుచున్‌ మహా 

మోహలతా నిబద్ధ పదమున్‌ విడిపించుకొనంగలేక సం 

దేహము బొందు దేహిక్రియ దీనదశన్‌ గజ ముండె భీషణ 

గ్రాహ దురంతదంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమై.” (8-67) 


“పరిఘట్టిత”, “పాదఖురాగ్ర” అనునవి నక్రముయొక్క పట్టును చెప్పుచున్నవి. 
“గి అను నక్షరము వెనుకటి “క్ర” వంటిది. తరువాత లక్ష్మీదేవి వర్ణనమును 
తిలకింపుడు: 


“నిటలాలకము లంటి నివుర జుం జు మ్మని 
ముఖసరోజము నిండ ముసురు దేంట్లు 
నళుల జోపంగం జిల్మ లల్ల నల్లనంజేరి 
యోష్టబింబ ద్యుతు లొడియ నుజుకు 
శుకములం దోలం జక్షుర్మీనములకు మం 
దాకినీ పారీనలోక మెసంగు; 
మీన్రపంక్తులుదాంట మెయిదీంగెతో రాయ 
శంపాలతలు మింట సరణి గట్టు 


శంపలను జయింపం జక్రవాకంబులు 

కుచయుగంబుం దాయి కొవ్వు చూపు 

మెలంత మొగులు పిటింది మొజుంగుం దీగెయుం బోలె 

జలదవర్గు వెనుక జరుగు నపుడు.” (8.104) 


56 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


నయ 


నుంచి క్రిందకు వచ్చుచున్నప్పుడు క్రమముగా నొక్కొాక యవయవము కనపడునప్పు 
డచ్చటివస్తువులతో ఘర్షణ జరిగినది. వచ్చుచున్న మార్గము మందాకినీతీరము. 
మొదట ముంగురులు. వాని క్రిందనున్న ముఖసరోజముకొజకై వచ్చి తోడి తేంట్లనుకొని 
తుమ్మెదలు వెండ్రుకలను తాకినవి. ఆ తుమ్మెదలను తోలుటకై యోష్టబింబమునకు 
వచ్చిన చిలుకలు తాకినవి. తరువాత, నీచిలుకలను తోలుటకై మందాకినీ పాఠీనములు 
చక్షుర్మీనములను తాకినవి. ఆ మీనపంక్తిని తొలగించుటకై శంపాలతలు మెయిదీగెతో 
నొరసినవి. శంపలను జయింప చక్రవాకములును కుచములను దాకినవి. 
ముంగురులు, పెదవులు, ముఖము, అందలి కన్నులు, మెయిదీగ, కుచములు. ఇది 
వరుస. మొదట వృక్షముల పై నున్న తేంట్లును, తరువాత చిలుకలును, తరువాత 
మందాకినీలోని పాఠీనములును, తరువాత నంతకుక్రిందనున్న మేఘములలోని 
మెరుపులును, తరువాత క్రిందనున్న చక్రవాకములును, పై నుంచి క్రిందికి దిగుచున్నట్లు 
స్పష్టము చేయుచున్నవి. ఈ పద్యమునందలి యలంకారములును, ధ్వనులును 
నతిరమణీయములు. ఇది లలితమై, రసవంతమై, వివిధాలంకార శోభితమై . 
యొప్పారుచున్నది. భంగ్యంతరముచేత ముక్తపద(గ్రస్తాలంకారము కూడియున్నది. 
సహజ కవితాధురీణుడైన పోతనకే యిట్టి రసవ[ద్రచనము చెల్లును. పోతనార్యుని 
కావ్యధోరణి గజేంద్రమోక్షమున సమ[గ్రముగ కాననగును. ఈభాగమునందలి 
యన్నిపద్యములును నన్నిముత్తెములు. 


లక్ష్మీదేవి యాకాశమునుండి విష్ణువు వెంబడి భూమికి దిగుచున్నది. పై 


తరువాతి ఘట్టము క్షీరసాగరమథనము. ఇచ్చట మాతృకలో పంచమాధ్యా 
యము నుండి ద్వాదశాధ్యాయము వరకునున్న కథ, పరిమాణము దాదాపు 350 
గ్రంథములు. దీనిని రెట్టింపుకంటె పెంచెను ఇందు 3 చిన్నపద్యముల నిచ్చి 
సంతసింతును: 


“గొల్లవారి బ్రదుకు గొజింతన వచ్చునే; ' 

గొల్లరీతిం బాలకుప్పం ద్రచ్చి 

గొల్లలైరి సురలు; గొల్లయ్యి విష్ణుండు; 

చేటులేని మందు సిరియుం గనిరి” ' (8-207) 


పోతన అనువాద విధానము 57 


“ఎడమంగుడి మునువు దిరుగుచుం 

గుడినెడమను వెనుకం దిరుగు కులగిరి కడలిం 

గడవెడల సురలు నసురలుం 

దొడితొడి ఫణిఫణము మొదలుం దుదియును దిగువన్‌.” (8-211) 


మందగిరి తిరుగుడును దేవాసురులు త్రిప్పెడు రీతియు నిందు ప్రతిబింబించు 
చున్నది. 


“ఆలోల జలధి లోపల 
నాలో నహివిడిచి సురలు నసురలుం బరవం 
గీలా కోలాహలమై 


హాలాహల విషముపుట్టె నవనీనాథా!” (8-215) 


విషమునుచూచి దేవాసురులు వాసుకిని విడచి పారిరట! ఎంత స్వభావ 
సిద్ధము! తరువాత వామనావతార ఘట్టము. ఇదియు వెనుకటివానివలె నతి 
రమణీయము. వామనమూర్తి పుట్టువునుండి మత్స్యావతారము వణకు మాతృకలో 
కథ రెండువందల (గ్రంథములలోనున్నది. (8.20-23) దీనిని పోతనార్యుడు దాదాపు 
700 గ్రంథములుగా పెంచినాడు. ఇచటి యాయన స్వంతకల్పన లతిరమణీయములు. 
మాతృకలోని యీక్రింది శోకములకు పోతన్న పెంపుడును గమనింపుడు: 


“యజంతి యజ్ఞః క్రతుభిర్యమాదృతాః 
భవంత ఆమ్నాయ విధానకోవిదాః । 
సఏష విష్ణుర్వరదోస్తు వాపరో 
దాస్వామ్య ముస్షైక్షితి మీప్పితాం మునే ॥ 
యద్యప్యసౌసావధర్మేణమాం బద్నీ యాదనాగసం । 
తథా ప్యేనం నహింసిష్యే ధృత బ్రహ్మతనుం హరిం ॥” 
(8-20-11,12) 


వీనిలోని యర్థము నీక్రిందివిధముగా పెంచెను. 


58 


ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


“కారేరాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిం బొందరే? 
వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై 
బేరైనంగలదే? శిబిప్రముఖులుం ట్రీతిన్‌ యశఃకాములై 
యీరేకోర్ములు? వారలన్‌ మజచిరే యిక్కాలమున్‌? భార్గవా!” 


“ఉడుగని క్రతువుల వ్రతములం 

బొడగనం జననట్టి పొడవు పొడవుం గుబుచై 
యడిగెడి నట? ననుబోంటికి 

నిడరాదె మహానుభావ! యిష్టార్ధంబుల్‌.” 


“ఆదిన్‌ శ్రీసతి కొప్పుపైం, దనువుపై; నంసోత్తరీయంబుపైం; 
బాదాబ్దంబుల పైం; గపోలతటిపైం; బాలిండ్లపై నూత్న మ 
ర్యాదం జెందుకరంబు క్రిందగుట; మీందై నాకరంబుంట; మేల్‌ 
గాదే? రాజ్యము గీజ్యమున్‌ సతతమే కాయంబు నాపాయమే?” 
“నిరయంబైన; నిబంధమైన; ధరణీ నిర్మూలనంబైన; దు 
ర్మరణంబైనం; గులాంతమైన; నిజమున్‌ రానిమ్ము; కానిమ్ము; పో! 
హరుండైనన్‌, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌం, 
దిరుగన్నేరదు నాదుజిహ్వ; వినుమా ధీవర్య! వే యేటికిన్‌.” 


“నొడివినంతవట్టు మసలక యిచ్చుచో 
నేలకట్టు విష్ణు? డేటిమాట? 
కట్టెనేనిం దాన కరుణించి విడుచును 
విడువ కుండనిమ్ము; విమలచరిత!” 


“మేరువు తలక్రిందైనను 

బారావారంబు లింకం బాతిన, లోలో 
ధారుణి రజ మై పోయినం 

దారాధ్వము బద్ధమైనం దప్పక యిత్తున్‌.” 


“ఎన్నండుం బరువేండ బోడంట? యేకలుండంట? కన్నవా 


పోతన అనువాద విధానము 50 


రన్నదమ్ములు నైన లేరంట? యన్ని విద్యల మూలగో 
ష్టి న్నెజణింగిన ప్రోడగుజ్జంట? చేతు లొగ్గి వసింప, నీ 
చిన్నిపాపనిం ద్రోసిపుచ్చంగం జిత్త మొల్లదు సత్తమా!” 
(8-592 నుండి 595) 
చూచితిరా! పోతనార్యుని యుద్రేకపూరిత రచనము! 
ఇక నొక్క పద్యమిచ్చి తరువాత ఘట్టమునకు వెడలుదును. 


“రవిబింబం బుపమింపం బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై 

శ్రవణాలంకృత మై, గళాభరణ మై, సౌవర్ణ కేయూర మై 

ఛవిమత్మంకణమై, కటిస్థలి నుదంచద్‌ఘంటియై, నూపుర 

ప్రవరం బై, పదపీఠ మై, వటుండు దా బ్రహ్మాండము న్నిండుచోన్‌” 
(8-621) 


ఇంతకంటే భావనాశక్తి యుండునా? 


పోతనార్యుడు పరమేశ్వరుని విరాడ్రూపమును దర్శించెనని వేర చెప్పవలెనా? 
ఎంత ధన్యుడు! 


నవమస్మంధమున మొదటిది గంగావతరణ ఘట్టము. మాతృకలోని రెండు 
శోకమల నిత్తును. 


తథేతిరాజ్ఞాభిహితః సర్వలోకహిత శృివః 

దధారావహితోగంగాం పాదపూత జలంహరేః ॥ 

భగీరథోథరాజర్షిః నిన్యేభువనపావనీం 

యత్ర స్వపితృణాం దేహాః భస్మీభూతాశ్చ శేరతే 11” 

ఈ రెండు శ్లోకముల యందలి యర్థమును దీర్భమైనట్టియు గంగా 
ర్సురీవేగముతో నడచునట్టి యొక గద్యముతోను, మటియొక పద్యముతోను తెల్పెను. 
గద్యము 8 పుటల నాక్రమించి పాఠకుల మనములను పవిత్రానందమున 
ముంచుచున్నది. గద్యమంతయు పోతన గద్యములకు నవాజమగం 


60 - ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


శ్లేషమూలోపమూలంకార రచనలో నిండియున్నది. తర్వాతి పద్యము ననువదించి 
తృప్తి చెందుదును. 


“జగతీనాథు రథంబు పజ్ఞ బహుదేశంబుల్‌ వడిం దాటి త 
త్సగరక్ష్మాపకుమార భస్మములమీందన్‌ ముంచి పారన్‌ మరు 
న్నగరావాసము వారు పొందిరి నవీన శ్రీలతో, గంగ నీ 

రుగతిన్‌ గాక మహాదురంత సుజనద్రోహానలం బాటునే! (9-230) 


ఎంత చక్కని యర్ధాంతరన్యాసము! 
థి 


పోతన పద్యాంతము లతిరమణీయములు. పొల్లు పదములును, పడికట్టు 
రాళ్లు నుండవు. 


తదుపరి శ్రీరామ చరిత్రమునందలి యొక్క పద్యము నిత్తును. సీతాదేవిని 
చూచు సందర్భమున నీక్రింది పద్యమున్నది. 


“దైతేయ ప్రమదా పరీత, నతిభీతన్‌, గ్రంథి బంధాలత . 

వ్రాతన్‌, విశ్వసనానిలాశ్రుకణ జీవం, జీవ దారామ భూ 

జాతన్‌, శుష్క కపోలకీలిత కరాబ్దాతన్‌, బ్రభూతన్‌, గృశీ 

భూతన్‌, బ్రాణసమేత, సీతం గనియెన్‌ భూమీశుం డా ముందటన్‌.” 
(9-311) 


అంత్య నియమ మటుండగా నిందు సంస్మార హీనకేశయు, నుష్ట విశ్వాసము 
కపోల ఘటితహస్తయు, రాక్షసీపరివృతయు, రామునకు బ్రాణపదయు నైన సీతకండ్లకు 
కట్టినట్లు పాఠకులకు కన్పడుచున్నది. 


' ఇక భాగవతమునం దెల్ల మకుటాయమానమైన దశమస్మంధమునకు వత్తును. 
ఇది రెండు భాగములు. శ్రీకృష్ణచరిత్రము భాగవతమునం దెల్ల నిగ్గు, రసవత్తమము. 
ఇందు పోతనార్యుడు తన యనన్య భక్తిని, యుద్రేకమును చూసినాడు. ప్రతి 
పద్యమునందును పోతన భక్తి తొంగిచూచుచుండును. ఇందలిపాత్రలలో పోతన 
యెక్యమైపోయినాడు. తొమ్మిదవ విధమైన యాత్మార్చణమున కీభాగము బీజభూతము. 


పోతన 'అనువాద విధానము | | 61 


రూపగోస్వామి యీ దశమస్మంధమును మిక్కిలి ప్రశింసించినాడు. 


పూర్వభాగము మాతృకలో రుక్మిణీ కళ్యాణాంతము వణకు 54 అధ్యాయములు. 
మిగిలిన 36 అధ్యాయము లుత్తరార్థము. ఉత్తరభాగమునందలి “కృష్ణుండు రుక్కిణీదేవితో 
విరసోక్తులాడుట” వజకు పోతనామాత్య రచనమని విమర్శకులందరు. అంతవజకు 
మాతృకలో 59 అధ్యాయములున్నవి. ఇక పోతన రచన కాని దనునది 31 
అధ్యాయములు. అగున్యా కాదా యను సంగతి తరువాత పరామర్శింతును. 69 
అధ్యాయములలో శ్రీకృష్ణ చరిత్రము చాలవజకు సమాప్తమగుచున్నది. 


మొదటి ఘట్టము శ్రీకృష్ణ జన్మము కంసుడు దేవకిని చంపబోవు సందర్భమున 
వ్రాసిన యీక్రింది పద్యములకు మాతృకలు లేవు. 


“అన్నవు నీవు; చెల్లెలికి నక్కట! మాడలు సీర లిచ్చుటో? 
మన్నన సేయుటో? మదురమంజుల భాషల నాదరించుటో? 
మిన్నుల (మోంతలే నిజము, మేలని చంపకు మన్న! మాని రా 
వన్న; సహింపు మన్న; తగదన్న్య వధింపకుమన్న్య వేడెదన్‌.” 


“చెలియన్‌, గన్నియ, ముద్దరా, లబల, నీసేమంబ చింతించు ని 

ర్మల, దీనిన్‌ బయలాడు మాటలకునై, మర్యాదం బోదట్టి, స 

త్కుల జాతుండవు, పుణ్యమూర్తి, వకటా! కోపంబు పాపంబు; నె 

చ్చెలి నోహో! తెగవ్రేయంబాడియగునే? చింతింపు భోజేశ్వరా!” 
(10-పూ-26, 28) 


ఇందు “బయలాడుమాటలు” మిన్నుల మోతలు” అను నచ్చ తెనుగు పదములు 
మధురములై వదంతి యొక్క నిరాధారత్వమును నంతశ్శూన్యత్వమును చెప్పక 
చెప్పుచున్నది. దేవకీ గర్భదౌహృదము కూడ మాతృకలో వివరముగా లేదు. పోతన 
చక్కని పదములతో వర్ణించెను. కృష్ణ జనన ఘట్టమునందలి సీసపద్యాదులు 
భక్తిరసపూరితములు. గోపస్రీలు తమలో తామొండొరులతో కృష్ణ జన్మమును గూర్చి 
చెప్పుకొనుట స్వభావోక్తియె హృదయంగమముగ నున్నది. 


62 : ఆం(ధ్ర మవోభాగవతోవన్వానములు 


“ఏమి నోముఫలమొ? యింత ప్రాద్దొకవార్త 

వింటి మబలలార! వీనులలర; 

మన యశోద, చిన్నమగవానిం గనెనంట 

చూచివత్తమమ్మ! సుదతులార!” (10 పూ.184) 

జన్మించినవాడు సాక్షాత్సరమేశ్వరుడని యీక్రింది పద్యములలో ద్యోతిత 
మగుచున్నది. కృష్ణుని స్నానమాడించుట, నిద్రపుచ్చుట వినుడు. 


“పలు తోయంబుల జగముల 
బలుదోయములందు ముంచి భాసిల్లెడి యా 
పలుతోయగాడు వల్లవ 

లలనాకర తోయములం జెలంగుచుం దడియన్‌.” 


“లోకములు నిదుర వోవంగ 
జోకొట్టుచు నిదురవోని సుభగుండు, రమణుల్‌ 
జోకొట్టి పాడ, నిదురం 
గైకొను క్రియ నూరకుండెం గను దెరవకయున్‌.” 
(10 పూ. 192, 198) 


ఈ ఘట్టమున రసవంత పద్యజాలము గలదు. కాని ముందునకు నడచెదను. 
పూతనా హరణ ఘట్టము మిక్కిలి హృదయంగమము. పూతన యేమియు నన్నట్లు 
మాతృకలో లేదు. కాని పోతనార్యుడు వ్రాసిన పద్యము లివి. 


“ముద్దాడి శిరము మూర్మొని పలికెన్‌” అని చెప్పి 
“చను నీకుం గుడుపంజాలెడి 

చను వారలు లేరు, నీవు చనవలె; ననుచుం 
జనుగుడిపి, మీంద నిలుకడం 

జను దాన ననంగ వేద్మం, జను జనుగుడుపన్‌. 
“నా చనుంబాలొక (గ్రుక్కెం 

డోచిన్ని కుమార! త్రాగుమొయ్యన; పిదపన్‌ 


పోతన అనువాద విధానము ; 63 


నీ చెలువ మెజుంగవచ్చును 
నాచెలువము సఫలమగును నలినదళాక్షా! (10 పూ. 220, 221) 


పై పద్యములో “చెలువము”పై శ్లేషించి పోతన హృదయ గతాభిప్రాయమును 
తెలిపినాడు. తరువాత యశోదారోహిణులు వలదని వారించు పద్యమున “కోశంబులో 
వాలు మెల్పుని మాట మెత్తదనము” “లోవాండి యను పదములు పూతన 
చెప్పుచేతలలోనున్న వైరుధ్యముమ తెల్పుచున్నవి. ఇక కృష్ణుడు పాలు త్రాగుట 
మాతృకలో యిట్లున్నది. 


“గాఢంకరాభ్యాం భగవాన్‌ ప్రపీడ్యతత్‌ 

ప్రాణైస్సమం రోష సమన్వితో పిబత్‌ (10-611) 

ఈ యర్థమును పోతనార్యుడు తన సహజ రసవద్దోరణిలో ననువదించి 
పఠితల నానందమున ముంచినాడు. 


“మేల్కొన్న తెజంగున మెల్లన గనువిచ్చి 
క్రేగంటం జూచుచుం గిదికి నీల్లి, 
యావులింపుచుం జేతులాదరంబునం జూచి 
యొదింగిలి యాంకొన్న యోజ సూంది 
బిగి చన్నుంగవం గేలం బీడించి కబళించి 
గుక్క గ్రుక్కకు “గుటుకుగుటుకు” మనుచు 
నొకరెండు గ్రుక్కల నువిదప్రాణంబులు 
సైతము మేనిలో సత్త్వమెల్లం 
“*ద్రావె; నదియును గుండెలు దల్లడిల్లం 
జిమ్మం దిరుగుచు నిలువక శిరము వ్రాల 
'నితరబాలుర క్రియవాండ వీవు గావు; 
చన్నువిడువుము; విడువు; చాలూ ననుచు” (10 పూ.224) 


పసిపిల్లలు పాలు త్రాగునపుడు పాలిచ్చు తల్లులీపద్యమును తప్పక 
భావించుకొనగలరు. “ఆవులించి, చేతులను చాచి, గిదికి, నీల్లి, పీడించి, కబళించి 


64 స ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


మొదలైన వరుసకార్యములు పాలు త్రాగుపిల్లలు చేయునవి. స్వభావోక్తి యెంత 
హృదయంగమము! కాని 'ఆకొన్న యోజన్‌', 'మేల్మొన్నతెఅంగునన్‌' అనుటతో కృష్ణుని 
కపటము వ్యక్తమగుచున్నది. ౩వ పాదమునందలి ధ్వన్యనుకరణమును, 4వ 
పాదమునందలి యామేడితమును రసవంతములు. ఈ క్రింది పద్యమును గనుడు: 


“విషధరరిపు గమనునికిని . 

విషగళ సఖునికిని విమల విష శయనునికిన్‌ 

విషభవభవ జనకునికిని 

విషకుచ చనువిషముం గొనుట విషమే తలంపన్‌.” (10 పూ. 282) 


శ్రీకృష్ణ బలరాముల క్రీడాభివర్ణనము భాగవతములో నెల్లమేలు బంతి 
ఘట్టములలో నొకటి. ఇచ్చటి పద్యములన్నియు యావదాంధ్రుల నోల్లలో 
మెదులుచున్నవి. ఒకవేళ యుండనిచో తప్పక వానిని పఠించి యానందింపు డని 
ప్రార్థించుచున్నాను. 

“బాలురకు బాలులలేవని 

బాలెంతలు మొజలువెట్టం బకపక నగి, యా 

బాలుండాలము సేయుచు ' 

నాలకుం గ్రేవులను విడిచె సంభోజాక్షీ!” (10 పూ. 307) 


మొదలుకొని 
“ఓయమ్మ! నీ కుమారుడు 
మాయిండ్లను బాలుం బెరుంగు మననీండమ్మా! 


పోయెద మెక్కడికైనను 
మా యన్నల సురభులాన! మంజులవాణీ!” (10 పూ. 329) 


వఅకున్న పద్యము లాబాలగోపాలము నెటిగినవే! ఇవన్నియు నన్ని రత్నములు. 
ఒక్క పద్యమును ప్రత్యేకముగా ననువదింతును. 


“తరుణి యొకతె పెరుంగు ద్రచ్చుచోం దుదివంగి 
వెన్నదీయ, నొదింగి వెనుకం గదిసి, 


పోతన అనువాద విధానము 65 


మగువ నీ సుతుండు మగపోండుములు సేయ 
సాగినాండు; తగదె చకర్మజేయ?” (10 పూ. 326) 


ఎంత సున్నితము? అశ్లీలద్యోతనముకూడ లేదు. అనుభవించిన గోపిగాక 
మరియొక గోపి చెప్పుట రసవంతము. శ్రీకృష్ణుని సర్వవ్యాపకత్వమును తెలుపు 
నీక్రింది పద్యమును చూడుడు: 
“కలకంఠి మావాడ గరితలమెల్ల, స 
పట్టి రాంగలండని పాలు పెరుంగు 
లిండ్ల లోపల నిడి యేమెల్లం దనత్రోవం 
జూచుచో నెప్పుడు సొచ్చినాండా? 
తలుపుల ముద్రలుం దాలంబులును బెట్టి 
యున్న చందంబున నున్న వరయ; 
నొక యింటిలోం బాడు; నొకయింటిలోం నాడు; 
నొకయింటిలో నవ్వు; నొకటందిట్టు; 
నొకట వెక్కిరించు; నొక్కొకచో మృగ 
పక్షి ఘోషణములు పరంగ జేయు; 
నిట్లుచేసి వెనుక నెక్కడం బోవునో? 
కానరాడు; రిత్త కడవలుండు.” (10 పూ.326) 


ఈ సర్వవ్యాపకత్వము జారత్వమనవచ్చునా? భగవంతుడు భక్తులను 
పరీక్షించునుకదా? ఈభాగమంతయు భాగవతముయొక్క సార్వజనీనతకును 
సార్వకాలీనతకును తార్మాణము. ఏనాడు రచింపబడినదో భాగవతము, ఇప్పటికిని 
యీపద్యము లాంధ్రుల నోళ్లలో మెదలుచున్నవి. 

తరువాత మృదృక్షణ విశ్వరూప ప్రదర్శన ఘట్టముకూడనిట్టిదే. “అమ్మా 


< మీ 


మన్నుదినంగ”, “కలయో వైష్టవమాయయో” యను పద్యములు తరుచు 
తెనుగువారినోళ్ల వినబడుచుండును. కజ్ఞిచేబూని కృష్ణుని వెంట పరుగెత్తు యశోద 


యాంధ్రదేశమున ప్రతి తల్లియందును మూర్తీభవించుచున్నది. 


66. ఆం([ధ మవోభాగవతోవన్వానములు 


కృష్ణుడు గోపబాలకులతో చల్చులారగించు ఘట్టము నాచిన్నతనమును 
జ్ఞాపకము తెచ్చుచున్నది. మేమొక వూరు పెండ్లికిపోవుచు త్రోవలో కృష్ణానదీ 
పులినమున మాయమ్మ చలిముద్దలు వేయగా తిన్న దృశ్యము నీవర్ణనము జ్ఞప్తికి 
దెచ్చుచున్నది. క్రింది పద్యమును చూడుడు; 


“కడుపున దిండుగాం గట్టిన వలువలో 
లాలిత వంశనాళంబుం జొనిపి 
విమల శృంగంబును వేత్రదండంబును 
జాతి రానీక డాచంక నిటికి 
మీంగడ పెరుగుంతో మేళవించిన చల్లి 
ముద్ద డాపలిచేత మొనయనునిచి 
చెలరేంగి కొసరి తెచ్చిన యూరుంగాయలు 
వ్రేళ్ళ సందులయందు వెలయు నిటికి 
సంగడీల నడుమం జక్కంగం గూర్చుండి 
నర్మభాషణముల నగవు నెజపి, 
యాగభోక్త కృష్ణు డమరులు వెజంగంద 
శైశవంబు మెటిసి, చల్చిగుడిచె.” (10 పూ. 496) 


భోగవల్లీల దురూహ్యము. భగవంతుడు మానుషవేషము దాల్చి మనుష్యులలో 
మెలగుటచే కృష్ణుడు మానవజాతి కత్యంత ప్రియుడైనాడు. ఉభయులమధ్య నున్న 
యీసన్నిహిత సంబంధమును పోతనార్యునిచేతలోనే చదువవలెను. నాకే శక్తియున్నచో 
నేనీకృష్ణ భంగిమను చిత్రించియుందును. “మీంగడపెరుంగుతో మేళవించిన చల్దిముద్ద”, 
“ఊరుంగాయలు మొదలైనవి యాంధ్రుల ప్రత్యేక సంస్కృతి చిహ్నములు. 
“గోంగూరను, ఆవకాయను” చేర్చిన నాంధ్రత్వము పూర్తియగును. 

తదుపరి కాళియమర్దన ఘుట్టమునకు పరుగెత్తుదును. ఇందు 70 


పద్యములున్నవి. నందాదుల దుఃఖ మతికరుణముగ వర్ణింపబడినది. మాతృకలో 
కృష్ణనర్తన మిట్లున్నది: 


పోతన అనువాద విధానము 67 


“తన్మూర్థరత్ననికరస్పర్శాతి తామ పాదాంబుజోఖిలకిళాది గురుర్న నర్త.” 
పోతనార్యుడంత చప్పగ చెప్పునా? చూడుడు: 


“ఘన యమునానదీ కల్లోల ఘోషంబు 
సరస మృదంగ ఘోషంబు గాంగ 
సాధు బృందావన చర చంచరీక గా 
నంబు గాయక సుగానంబు గాంగం 
గలహంస సారస కమనీయ మంజు శ 
బ్దంబులు తాళశబ్దములు గాంగం 
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది 


జనులు సభాసీన జనులు గాంగం 


బద్మరాగాది రత్న ప్రభాసమాన 

మహిత కాళియఫణి ఫణామంటపమున 

నళినలోచన విఖ్యాత నర్తకుండు 

నిత్యనై పుణ్యమునం బేర్చి నృత్యమాదె.” (10 పూ. 662) 
చూచితిరా పోతనార్యుని పెంపుడు సొంపు? 


తరువాత శరదృతు వర్ణనానంతరము కృష్ణుడు గోవులను మేపుచు 
“చుకూజవేణుం” అని మాతృకలో నున్నది. ఈ ఘట్టములో పోతనార్యుడు వ్రాసిన 
పద్యమొక చిత్రమునకు మాతృకయైనది: 


“కర్ణావతంసిత కర్ణికార ప్రభ 
గండభాగద్యుతిం గడలుకొలుప 
భువనమోహన మైన భ్రూవిలాసంబుతో 
వామభాగానత వదనమొప్ప 
నపసవ్యకర మృదులాంగుళీ చాతురీ 
షడ్డధ్వనికి మర్మసరణిం జూప 


68 ఆం(ధ. మవాోభాగవతోవన్యానములు 


దాకాలిమీంద నడ్డముసాంచి నిల్చిన 
పద నఖద్యుతి భూమిం బ్రబ్బికొనంగ 


మౌళిపింఛముం గంఠదామమును మెజయ 

విలసిత గ్రామముగ నొక్క వేణువందు 

బ్రహ్మగాంధర్వగీతంబు పరంగ జేసెం 

జతుర నటమూర్తి గోపాల చక్రవర్తి.” (10 పూ. 767) 


ఈ వేణురవము వినినప్పటి గోపీజనముయొక్క తత్తరమును వర్ణించు భాగము 
చదువవలసినదే గాని చెప్పిన రసహీనమగును. అపుడు యావటతకృతియు నా 
వేణురవముతో నిండి యానందముతో స్తంభించెను. “మ్రాకులు పూదేనియ లొలికెడు, 
నళిణాక్షుని చేతి వంశనాళము చేతన్‌” ప్రకృతి పురుషుని గీతిచే పులకిత యయ్యెను! 


అనంతరము గోపికా వస్రాపహరణ ఘట్టము- ఇది రసవంతమని 
చెప్పబనిలేదు. 


“మామా! వలువలు ముట్టకు 

మామా! కొనిపోకు; పొకు; మన్నింపు; తగన్‌ 

మామానమేల కొనియెదు? 

మామానసహరణమేల? మానుము: కృష్ణా!” (10 పూ. 818) 


ఈ పద్యము ప్రతీ యాంధ్రుని వీనుల ప్రతిధ్వనించుచున్నది. మాతృకలో 
నిచ్చట “పాణిభ్యాం యోనిమాచ్చాద్య” అని యున్నది. ఈ విషయమును పోతనార్యుడు 
పదజాలాచ్చాదితాళ్లీముగా సంతరించినాడు. , 


“చంచత్సల్లవ కోమల 

కాంచన నవరత్న ఘటిత కంకణరుచిరో 

దంచిత కర సంఛాదిత 

పంచాయుధ గేహలగుచుం బడంతులు వరుసన్‌.” (10 పూ. 889) 


అశ్లీలమును కప్పిపుచ్చుటలో పోతన యందెవేసిన చేయి! ఇచ్చటి యౌచితి 
గమనింపదగినది. 


పోతన అనువాద విధానము 69 


తరువాత గోవర్ధనోద్ధరణ ఘట్టమునుండి యొక్క పద్యమును మీ యెదుటనుంచి 
తరువాతి ఘట్టమునకు వెడలుదును. 


“హరిదోర్టండము గామ, గుబ్బశిఖరం బాలంబి ముక్తావళుల్‌ 

పరగన్‌ జారెడు తోయబిందువులు గోపాలాంగనాపాంగ హా 

సరుచుల్‌ రత్నచయంబుగాగ, నచలచ్చత్రంబు శోభిల్లెం ద 
ద్గిరిభిద్దుర్మదభంజియె జలధరాక్షిన్న ప్రజారంజియి.” (10 పూ. 922) 


అనంతరము గోపాలకృష్ణుని గోపికలు వెదకు ఘట్టము ఇచ్చటను తరువాత 
గోపికాగీతలలోను పోతనామాత్యుడు లీనుడై గోపీవిరహము తన స్వవిరహముగా 
వర్ణించినాడు. భక్తరస మీఘట్టమున వెల్లివిరిసినది. పాశ్చాత్యులలో కూడ అందును 
కైస్తవులలో శేష శేషిభావము కలదు. భగవంతుని భర్తగాను, భక్తుని భార్యగాను 
ఊహించుకొని యాత్మార్పణము చేసికొనుట. రవీంద్రుని గీతాంజలిలో కూడ నిట్టి 
ఛాయలు కలవు. దీనిని "౨౦౦౪16 of Divine Spouse" అందురు. గోపికలలో 
నంతర్భూతుడుగా పోతన్నగారు లేకపోయిన నీఘట్టములింత రసవంతముగా వర్ణించి 
యుండజాలడు. వర్ణన మీస్థాయి నందుకొనదు. 


“పూతనయై యొక్క పొలతి చరింపంగ = 
శౌరియె యొకకాంత చన్నుగుడుచు.” 


ఇంతకంటె నాత్మార్చణముండునా? కృష్ణనందలి యాత్మ గోపికలందరిలోను 
స్పందించినది. వారనన్యలైపోయిరి. 


“అనన్యా శ్చింతయంతోమాం యేజనాః పర్యుపాసతే, 

తేషాం నిత్యాభీ యుక్తానాం యోగక్షేమం వహామ్యహం॥” 

(భగవద్గీత) 

అని కదా శ్రీకృష్ణుడు సెలవిచ్చెను? సమస్త విశ్వమును (తమతో కూడ) 
కృష్ణమయ మయిపోయెను. కనపడునవి యన్నియు కృష్ణలీలలే! చూచునవి యన్నియు 
కృష్ణ పాదాంకిత స్థలములే! ఈ క్రింది పద్యములు మధుర భక్తికాటపట్లు: 


70 ఆంధ మహోభాగవతోవన్యానములు 


“నల్లసివాండు, పద్మనయనంబులవాండు, కృపారసంబు పైం 
జల్లెడువాండు, మౌళిపరిసర్పిత పింఛమువాండు, నవ్వు రా 
జిలైడు మోమువాం, డొకండు చెల్వల మానధనంబుం దెచ్చెనో 
మల్లియలార ! మీ పొదలమాటున లేండుగదమ్మ చెప్పరే?” 
“అంగజునైనం జూడ హృదయంగముండౌ కరంగించువాడు, శ్రీ 
రంగ దురంబువాండు, మధురంబగు వేణురవంబువాండు, మ 
మృంగజుపువ్వుం దూపులకు నగ్గము సేసి లవంగలుంగనా 
రంగములార! మీకడుకురాండుగదా? కృపనున్నం జూపరే!” 

(10 పూ. 1010, 1011) 


గోపికాగీతలు మాతృకలో 19 శ్లోకములు. 40 గ్రంథములుండును. వాని 
ననన్య సౌందర్యముతో రెండింతలు చేసినాడు. ఈక్రింది మాతృకను చూడుడు: 


“చలసి యద్ర్వజాచ్చారయన్‌ పశూన్‌ నళివ సుందరమ్‌ 
నాథతేపదం । శిలతృణాంకురైస్సీదతీతి నః కలలి 
తాం మనః కాంత గచ్చతి” (10-31-11) దీనిని 


“అరవిందంబుల కంటెం గోమలములై, యందంబులై యొప్పు నీ 

చరణంబుల్‌, కఠినంబులై మొనయు మాచన్నుంగవల్‌ మోపంగా 

నెరియంబోలు నటంచుం బొక్కుదుము; నీ యీకర్మ శారణ్యభూ 

పరిసంచారము కృష్ణ! నీ ప్రియలకున్‌ బ్రాణవ్యధం జేయదే?” 

(10 పూ. 1058) 

అని పోతననగారు రసప్రవణముగా దెనిగించెను. ఎంత సుందరము! ఎంత 
భావపూరితము! తరువాత శ్రీకృష్ణ పరమాత్మ గోపికలకు కనపడి క్షమాపణము 
వేడుకొనును. 

“నా పాయుట తప్పుగా గొనక భామినులార! కృపన్‌ క్షమింపరే!” భగవంతుడు 
భక్తరక్తుడు! భక్తదాసుడు! 





పోతన అనువాద విధానము . యై 


రాసక్రీడా, జలక్రీడావర్ణనము చేసిన గద్యములు మనోహరలయో పేతములై 
పద్యనిర్విశేషములై వరలుచున్నవి. అనువదించుట కనువైనవి కావు. ఈ క్రీడలయందు 
“కృష్ణుం డాత్మారాముండయ్యును గోపసతు లెందరందరకు నందరై, నిజ ప్రతిబింబంబుల 
తోడం గ్రీడించు బాలు పోలికం గ్రీడించె”. వేణునాదముచేయు “గోపకిశోరమునె” 
కదా మధుసూదన సరస్వతీస్వామి దర్శించినది! 


ఉద్భవ సందేశాదు లనేక ప్రకరణములన్నను, వానిని విడచి బభ్రమరగీతలను 
స్పృశింతును. భ్రమరగీతలలోని (ప్రతిపద్యమును రసగుళికయే! ఒక్కపద్యము 
ననువదింతును. 


“భ్రమరా! దుర్దనమిత్ర! ముట్టకుము మా పాదాబ్దముల్‌! నాగర 

ప్రమదాళీకుచ కుంకుమాంకిత లసత్రాణేశ దామప్రసూ 

న మరందారుణితాననుండ వగుటన్‌; నాథుండు మన్నించుం గా 

క! మము న్నేంపుచుం బౌరకాంతల శుభాగారంబులన్‌ నిత్యమున్‌.” . 
(10 పూ. 1455) 


ఈపద్యలములందలి యన్యాపదేశముల సహృదయులనుభవింపవలసినదే! 
లోతుకు దిగినకొలది రస మూరుచుండును. 


ఇక రుక్మిణీకల్యాణ ఘట్టము. కృష్ణుని చేష్టల నెంత విన్నను తనివితీరదు. 


“భూషణములు సెవులకు, బుధ 

తోషణము, లనేక జన్మదురితౌఘ విని 

శ్యోషణములు, మంగళతర 

ఘోషణములు, గరుడ గమను గుణభాషణముల్‌.” (10 పూ.1683) 


ఈఘట్టము మాతృకలో దాదాపు 200 గ్రంథములున్నది. దానిని పోతనార్యుడు 
తన భావనాబలంబునను భక్తిపారవశ్యమునను 500 గ్రంథములకు మించి 
పెంచినాడు. ఈఘట్టమున రసవంతము కాని పద్యములేదు. రుక్మిణీదేవి 


712 ఆం( మవోభాగవతోవన్యానములు 


నాంధ్రబాలికగా భావించినాడు. ఆమె బాల్యమును, నప్పటి యాటలను చెప్పు 
సందర్భములు ప్రతియాంధ్రుడును స్వబాలికా క్రీడలుగా భావించుకొనును. “బొమ్మల 
పెండ్లిండ్లు, గుజ్జనగూళ్లు, తద్దె పండుగలలో నుయ్యాలల యూపు” మొదలైనవి 
యాంగ్ర్ల బాలికలసొమ్ము. రుక్మిణీ కృమ్ణుల యౌవనావిర్భావమును 
తుల్యయోగితాలంకారముతో వర్ణించెను. 


“దేవకీసుతు కోర్మితీగెలు వీడంగ 
వెలందికి మైదీగె వీడం దొడంగెం 
గమలనాథుని చిత్తకమలంబు వికసింపం 
గాంతి నింతికి ముఖకమల మొప్పె 
మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపం 
బొలంతికిం జనుదోయి పొడవుసూపె 
శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ 
జలజాక్షి మధ్యంబు సన్నమయ్య 
హరికిం బ్రేమబంధ మధికంబుగాం గేశ 
బంధ మధికమగుచు బాల కమరెం 
బద్మనయనువలనం బ్రమదంబు నిండార 
నెలంత యౌవనంబు నిండియుండె.” (10 పూ. 11690) 


రుక్మిణి కృష్ణుని కంపిన సందేశభాగమును పెంచినాడు. “నిక్క్మంబు ప్రాణేశ్వరా!” 
యనుదానికి తర్వాతి 4 పద్యములును పోతన స్వంతములే! రుక్మిణి బ్రాహ్మణుని 
యాలస్యమునకు దుఃఖించు నవసరమున వ్రాసిన పద్యములు యావదాంధ్రుల 
హృదయములందు లగ్నంబులైయున్నవి. “లగ్నంబెల్లి”(1724) నుండి 9 పద్యములు 
రసగుళికలు. 


తరువాత “కృష్ణమార్గగత వీక్షణ పంక్తుల ద్రిప్పక” చూచు రుక్కిణీదేవియొక్క 
౧ లి 
యరతి యను శృంగారావస్థ యీక్రింది పద్యములో వర్ణింపబడినది. 


పోతన అనువాద విధానము 73 


“తుడువదు కన్నులన్‌ వెడలు తోయకణంబులు; కొప్పుం జక్కంగా 
ముడువదు; నెచ్చెలింగదిసి ముచ్చటకుం జన! దన్నమేమియుం 
గుడువదు; నీరముంగొనదు; కూరిమిం గీరముంజేరి పద్యమున్‌ 
నొడువదు; వల్లకీగుణ వినోదము సేయదు; డాయ దన్యులన్‌.” 

(10 పూ. 1729) 


తరువాత (బ్రాహ్మణుండు కృష్ణుడు వచ్చినాడని చెప్ప రుక్మిణి హృదయ 
మాయనకిట్లు వెల్లడించెను: 


“జలజాతేక్షణుం దోడితెచ్చితివి నాసందేశముంజెప్పి, నన్‌ 
నిలువంబెట్టితి; నీకృపన్‌ బ్రదికితిన్‌; నీయంత పుణ్యాత్మకుల్‌ 
గలరే? దీనికి నీకు బ్రత్యుపకృతిం గావింప నేనేర; నం 
జలిం గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధు చింతామణీ!” 
(10 పూ.1736) 


అనంతరము రుక్మి కృష్ణుని దాకినపుడు కృష్ణుడు రుక్మిని చంపబోవ రుక్మిణి 
వలదని వేడు పద్యమును చూడుడు: 


“అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగబుతో 

వినత శ్రాంతముఖంబుతో, శృతిచలద్వేణీ కలాపంబుతోం, 

గనుదోయిం జడిగొన్న బాష్ప్రములతో, గన్యాలలామంబు (మొ 

కిన, రుక్మిం దెగవ్రేయంబోక మగిడెం గృష్టుండురోచిష్టు!డై. 7 

(10 పూ.1768) 

ఇందు గజేంద్రమోక్షమునందలి “తాటంకాచలనంబుతో” అను పద్యముయొక్క 
ప్రతిధ్వని వినపడుచున్నది. తుదకు మాతృకలో “విధివదుపయేమే” అని 
వివాహఘట్టమున నున్నది. దానికి 7 పంక్తుల వచనమును, నీక్రింది పద్యమును 
పోతనార్యుడు రచియించినాడు. 


“ధృవకీర్తిన్‌ హరి పెండ్రియాడె నిజ చేతోహారిణిన్‌, మానవై 
భవగాంభీర్య విహారిణిన్‌, నిఖిల సంపత్మారిణిన్‌, సాధు బాం 


74 ఆం(ధ మవోభాగవతోపన్యానములు 


ధవ సత్మారిణిం బుణ్యచారిణి, మహాదారి ద్య సంహారిణిన్‌, 
సువిభూషాంబర ధారిణిన్‌, గుణవతీ చూడామణిన్‌, రుక్కిణిన్‌.” 
(10 పూ. 1782) 


ఇందు రుక్మిణి లక్షీదేవి యవతారమనెడి ధ్వనియున్నది. “నిఖిల సంపత్మారిణి” 
యను విశేషణము భావగర్భితము. ఇంతటితో దశమస్కంధ పూర్వభాగము 
ముగింతును. 


ఇక యుత్తరభాగమును గ్రహింతును. ఇందు మొదటి కథ ప్రద్యుమ్న చరిత్రము. 
ఇందును కొంచెముగా పెంపుదలకలదు. మాతృకలో ప్రద్యుమ్నుని గూర్చిన శ్లోకమిది. 


“సా తం పతిం పద్మదళాయతేక్షణం 

ప్రలంబ బాహుం నరదేవసుందరం 

సవ్రీడహసోత్తభిత భృవేక్షతీ 

ప్రత్యోపతస్థే రతిరంగ సౌరతైవొ 

ఇందు ప్రద్యుమ్నుడు యవ్వనము నందుటయు, నంతవరకు పెంచిన రతీదేవి 
యాయనను మోహించుటయు, బహుక్షుప్తముగా చెప్పబడినది. పోతన అంతటితో 
తృప్తిపడలేదు. మన్మథుని వర్ణనము చూడుడు: 


“చక్కనివారల చక్కందనంబున 
కుపమింప నెవ్వండు యోగ్యుండయ్య? 
మిక్కిలి తపమున మెజయు నంబికకునై 
శంకరు నెవ్వండు సగముసేసె? 
బ్రహ్మత్వమును బొంది పరంగు విధాతను 
వాణికై యెవ్వండు వాండి సెణీచె? 
వేయిడాగులతోడి విబుధ లోకేశుని 
మూర్తికి నెవ్వండు మూలమయ్యె? 


మునులతాలిమి కెవ్వండు ముల్లుసూపు 


పోతన అనువాద విధానము - 75 


మగలమగువల నెవ్వండు మరులు కొలుపుం? 
గుసుమధనువున నెవ్వండుకొను విజయము 
చిగురువాలున నెవ్వండు సిక్కుపజుచు.” (10 ఉ.10) 


ద్వారకానగరమునకు ప్రద్యుమ్నుడు వెడలినపుడు రుక్మిణి యాతనిని చూచి 
పుత్రునిగా గుర్తించియు, లోకాపవాద భీతిచే గ్రహింప ననుమానించుచున్నప్పటి 
పద్యములు మిక్కిలి రసవంతములు. ఒక్క పద్యమును వినుడు: 


“ఆలీ! నాతొలుచూలి పాపనికి బోర్మాడించినే సూతికా 
శాలామధ్య విశాల తల్పగతనై, చన్నిచ్చి నిద్రింప నా 
బాలున్‌ నా చనుంబాలకుం జెజిచి, యేపాపాత్ము లేత్రోవ ము 
న్నేలీలం గొనిపోయిరో? శిశువు దా నేతల్లి రక్షించెనో?” 
(10 4-31) 


తరువాత ఘట్టము శ్యమంతకోపాఖ్యానము. ఈ భాగమును యావదాంధ్ర 
దేశములోని బ్రజలు ప్రతి సంవత్సరము వినాయక చతుర్థినాడు పురాణముగా 
చదువుట వాడుక. అందుచే దీని నింతటితో విడచి ముందుకు నడతును. తరువాతి 
రసవర్ధట్టము నరకాసుర యుద్ధము. ఇది సంస్కృత భాగవతమున కొలదిగా నున్నది. 
దానిని పోతనార్యుడు విష్ణు పురాణ, హరివంశాదుల నుండి [గ్రహించిన 
విశేషాంశములతో పెంచెను. శ్రీ వేలూరి శివరామశాస్త్రి గారిట్లు వ్రాసినారు: 


“ఆంధ్ర భాగవతమునకు మాతృక యగు సంస్కృతములోని విజ్ఞాన 
వాక్యములకును విష్ణుపురాణమునకును పోలిక కలదు.” విష్ణుపురాణము 
భాగవతమునకు మూలమనుట వాస్తవమే! కావున పోతనార్యుడు సంస్కృత 
భాగవతములో లేని యంశములను విష్ణుపురాణము నుండి గ్రహించుట సమంజసమే 
యగును. “నరకాసురవధ, ప్రహ్లాద చరిత్రము, ధ్రవోపాఖ్యానము శ్రీ కృష్ణావతార 
ఘట్టము, రుక్మిణీకల్యాణము లోనగు కథాభాగములు విష్ణుపురాణమున సంగ్రహ 
రూపమున నున్నవి.” 

(వావిళ్లవారి భా.పీరిక పుట.9) 


76 ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


వీనిలో నొక్క సత్యభామా యుద్ధము తప్ప యన్నియు సంస్కృత భాగవతమున 
నున్నవి. రెండు గ్రంథముల యందలి కథలలోని తారతమ్యము విష్ణుపురాణ 
పీఠికయందు కాననగును. ఆ విషయమిప్పుడు మన కప్రస్తుతము. ఒక్కటి మాత్రము 
సత్యము, విష్ణుపురాణమునందు కంటెను సంస్కృత భాగవతమునందు కంటెను 
పోతన భాగవతము నందలి యీ కథలు రసవంతములుగా నున్నవి. వెన్నెలగంటి 
సూరన తన విష్ణుపురాణమున నచ్చటచ్చట పోతన ననుసరించినట్లు కనపడును. 
ప్రహ్లాద చరిత్రములో నిట్లున్నది! 


“ఏమి సుభాషితంబు పరియించితి పుత్రక! రాజనీతు లే 

మేమి యెజుంగంజెప్పె గురుండిప్పుడు నీ దగు పుస్తకంబు నం 

దేమి లిఖించియున్నయది? యిప్పటి పాఠకశక్తి చూచెదన్‌ 

మామది కింపుగా జదువుమా యొక పద్యము వీరిముందరన్‌.” 
(2-2-280) 


విష్ణుపురాణమునందు నరకాసుర ఘట్టమున సత్యభామ యుద్ధము చేసినట్లే 
లేదు. ఇది హరివంశమున కల్గిన మార్పు. ఈ మార్చును నాచనసోముడు 
బహురనవంతముగ వర్ణించినాడు. దానిని పోతనార్యుడనుకరించెను. 
“సత్యాసం[గ్రామము, కాళీయమర్గనము, రుక్క్మిణీపరిణయము, కృష్ణలీలలు, 
వామనావతారము లోనగు. కథాంశములు పోతన భాగవతంబునను, ఎజ్టాప్రగడ 
హరివంశమునందును సమానములుగా గలవు. ఉభయ గ్రంథభాగములను పోల్చుట 
ధర్మముగాదు... ఒకరిది పురాణశైలి; ఒకరిది ప్రబంధశైలి. అందువలన నుభయులకు 
పోల్కి చెప్పనలవికాదు.” అని శ్రీ శేషాద్రిరమణ కవులు తమ భాగవత పీఠిక 
యందు వ్రాసినారు. నేను వారితో నేకీభవించుచున్నాను. 


నరకాసుర యుద్ధఘట్టమున పోతన నాచనసోము ననుకరించిన మాట 
వాస్తవమే! భాగవత మాతృకలో కృష్ణుడు యుద్ధమునకు సత్యభామా సహితముగా 
పోయినట్లు మాత్రమే యున్నది. పోతనార్యు డిచ్చట 21 పద్యములను రచియించి 
ఘట్టమును రసవంత మొనర్చెను. వీర శృంగార రసములను తెల్పు సోముని “అరి 
జూచున్‌ హరిజూచు అను పద్యము వంటి పద్యమును “నరుజూచున్‌ పరుజూచు” 


పోతన అనువాద విధానము | 77 


అను దానిని పోతనార్యుడు వ్రాసినాడు. కాని పోలికకు చాల దీపద్యము. తరువాతి 
పద్యములు రమణీయములు. పోతనార్యుని ప్రతిభోపేతములు. ఒక్క పద్యము 
ననువదింతును. 


“ంాకేందుబింబ మై రవిబింబ మై యొప్పు. 
నీరజాతేక్షణ నెమ్ముగంబు 
కందర్చకేతువై ఘన ధూమకేతువై 
యలరుం బూంబోండి చేలాంచలంబు! 
భావజు పరిధియె ప్రళయార్ము పరిధి యి 
మెజియు నాకృష్ణ మై మెలంత చాప 
మమృత ప్రవాహ మై, యనల సందోహ మై 
తనరారు నింతి సందర్శనంబు 
హర్షదాయి యై మహారోష దాయి యె 
పరంగు ముద్దరాలి బాణవృష్టి 
హరికి నరికిం జూడ నందంద శృంగార 
వీర రసము లోలి విస్తరిల్ల. (10 ఉ. 183) 


పదునారువేల కన్నియలలో ప్రతి కన్నియయు కృష్ణుడు తననే వరించుననుకొను 
ప్రకరణమున మాతృక యిట్లున్నది: " 


“భూయాత్పతిరియం మహ్యం ధాతాతదనుమోదతాం 

ఇతి సర్వాః పృథక్‌ కృష్ణే భావేన హృదయం దధుః” 

ఈ శ్లోకార్థము నిట్లు రసవంతముగ సంతరించెను. 

“భూనాథోత్తమ కన్యకల్‌ వరుస సంభోజాతనేత్రుండు న 

న్నే నవ్వెన్‌ దగంజూచె; డగ్గజియె; వర్ణించెన్‌; వివేకించె, స 

న్మానించెన్‌, గరుణించెం, బే రడిగె, సన్మార్గంబుతోం బెండ్లి యౌ; 

నేనే చక్రికి దేవి నంచుం దమలో నిర్లీతలై రందణున్‌.” (10 ఉ. 218) 


78. ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


ఇచ్చట నుండి మరల నారయ కవిత్వమందురు. కాని తరువాత కూడ పోతన 
పోకడలు తప్పక కన్పడుచున్నవి. . 


తరువాత ఉషాపరిణయ ఘట్టమున మాతృకలో 80 శ్లోకములు, అనగా 
దాదాపు 100 గ్రంథములున్నవి. పోతన దానిని 500 గ్రంథములుగా పెంచినాడు. 
ఇట్లింత పెంచుశక్తి నారయనకున్నట్లు చెప్పజాలము. చిత్రరేఖ చిత్రములను వ్రాసి 
చూపు సందర్భమున మాతృక యిట్లున్నది. 

“ఇత్యుక్తా వదేవగంధర్వ సిద్ధచారణ పన్నగాన్‌ 

దైత్యాన్‌ విద్యాధరాన్‌ యక్షాన్‌ మనుజాంశ్చ యధాలిఖిత్‌ ॥ 

మనుజేషుచ సావృష్టీన్‌ శూరమానక దుందుఖిం 

వ్యలిఖిద్రామకృష్ణాచ ప్రద్యుమ్నం వీక్ష్యలజ్జితా 1” (10-62-16, 17) 


ఈ రెండు శ్లోకములను 14 పద్యములకు పెంచెను. వానిలోని శైలియు 
పోతన దానిదే ననవచ్చును. 
కృష్ణ వర్ణన మిట్లున్నది: 
“కమనీయ శుభగాత్రుం గంజాతదళనేత్రు 
వసుధాకళత్రుం బావన చరిత్రు 
సత్యసంకల్పు నిశాచరోగ్ర వికల్పు 
నత పన్నగాకల్పు నాగతల్పుం 
గౌస్తుభమణి భూషు గంభీర మృదు భాషు 
శ్రితజన పోషు నంచితవిశేషు 
నీలనీరద కాయు నిర్జిత దైతేయు 
ధృత పీత కౌశేయు నత విధేయు, 
నఘ మహాగద వైద్యు వేదాంత వేద్యు 
దివ్యముని నన్నుతామోదు తీర్థపాదు 
జిష్టు వర సద్దుణాలంకరిష్టుం గృష్టుం 
జూడు దై తేయకులబాల! సుభగలీల!” (10 ఉ.358) 


పోతన అనువాద విధానము 79 


ఇక కుచేలోపాఖ్యానమునకు వెడలక పూర్వము నారయదని చెప్పు నీ 
భాగములోని కొన్ని పద్యముల ననువదించి వాని శైలిని మీరే పరికింప వేడుచున్నాను. 


“చంచ త్మాంచన రుచిరో 

దంచిత వస్త్రముల నూతనార్మ ప్రభలన్‌ 

మించిన రత్నములం బూ 

జించెన్‌ ధర్మజుడు కృష్ణు జిష్టు సహిష్టున్‌” (10 ఉ.780) 


ఇది వస్తాపహరణమునందలి పద్యమునకు ప్రతిధ్వని 


“వితత జ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూత శుండాల ఘీం 
కృతు, లుద్యద్భట హుంకృతుల్‌, మహిత భేరీభాంకృతుల్‌, భీషణో 
ద్ధత నిస్సాణ ధణంకృతుల్‌, ప్రకట యోధనవ్రాత సాహంకృతుల్‌. 
కుతలంబున్‌ దివి నిండ (మోసె రివుసంక్షోభంబుగా భూవరా! 
(10 4.843) 


“హరి భజియించు హస్తములు హస్తము; లచ్యుతు! గోరి మొక్కుత 
చ్చిరము శిరంబు; చక్రధరుం జేరిన చిత్తము చిత్త; మిందిరా 
వరుం గనుదృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య 
క్షరు కథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుం బో భువిన్‌.” 
(10 -959) 


నేనుల్లేఖింపబోవు తుది ఘట్టము కుచేలోపాఖ్యానము. కుచేలుండు కృష్ణ 
మందిరమును ప్రవేశించు నపుడు మాతృకలో నీశ్లోకములున్నవి. 

“గృహాన్‌ ద్వ్యష్ట సహస్రాణాం మహిషీణాం హరెర్ట్విజః 

వివేశైకమతం శ్రీ మద్రృహ్మానంద రతిం యథా! 

తం విలోక్యాచ్యుతో దూరాత్‌ ప్రియాపర్యంకమాస్థితః 

సహసోత్థాయచాభ్యేత్య దోర్భ్యాం పర్యగ్రహీన్ముదా.” _ (10-80-1718) 


వీని కీక్రింది పద్యములున్నవి: 


80. 


ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


“విశదమై యొప్పు షోడశ సహస్రాంగనా 
కలిత విలాస సంగతిం దనర్చి 

మహనీయ తపనీయ మణిమయ గోపుర 
ప్రాసాద సౌధహర్యములం జూచి 

మనము (బ్రహ్మానందమును బొందం గడు నుబ్బి 
సంతోష బాష్పముల్‌ జడిగొనంగం 

(బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది 
రమున నింతులు చామరములు వీవం 

దనరు మృదు హంసతూలికా తల్చ్పమందుం 

దానుంబ్రియయును బహువినోదములం దనరి 

మహిత లావణ్య మన్మథమన్మథుండు 

ననంగ జూపట్టు పుండరీకాయతాక్షు”. 


“ఇందీవర శ్యాము వందితసుత్రాము 
గురుణాలవాలు భాసురకపోలుం 
గౌస్తుభాలంకారుం గామితమందారు 
సురుచిరలావణ్యు సురశరణ్యు 
హర్యక్షనిభ మధ్యు నఖిలలోకారాధ్యు 
ఘన చక్రవహస్తు జగత్ర్రశస్తు 
ఖగకులాధిపయానుం గౌశేయ పరిధానుం 
బన్నగశయను నబ్బాతనయను. 


మకరకుండల సద్భూషు మంజుభాషు 
నిరుపమాకారు దుగ్ధ సాగర విహారు 
భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు 


విష్ణు రోచిష్టు జిష్ణు సహిష్టుం గృష్టు.” 


పోతన అనువాద విధానము 81 


“కని డాయంజనునంతం గృష్టుండు, దల తృంజాక్షుండప్పేద వి 
ప్రని నశ్రాంత దరిద్రపీడితుం గృశీభూతాంగు జీర్ణాంబరున్‌ 
ఘన తృష్టాతురచిత్తు హాస్యనిలయున్‌ ఖండోత్తరీయున్‌ గుచే 
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండైదిగెన్‌ దల్పమున్‌.” 


శక్రర్ర మర్థి నెదురుగాం జని 
పరిరంభణ మాచరించి బంధుస్నేహ 
స్ఫురణం దోడ్జెచ్చి సమా 
దరమునం గూర్చుండబెట్టెం దనతల్పమునన్‌.” 
(10. ఉ.978, 979,980) 


ఈరచన మెవ్వరిదిగనున్నదో చెప్పబనిలేదు. అత్యనియమములు, పద్యాంత 
ములు మొదలైనవి పోతనార్యుని రచనమని చెప్పక చెప్పుచున్నవి. ఈఘట్టమును 
వామనావతారాదులవలె ప్రజాదరము వడయుచున్నది. ఇపుడీ భాగములో 
ననువదించిన పద్యములవలె రసవంతములైన పద్యములు కుప్పతిప్పలుగా కలవు. 
కాని యన్నిటి ననువదించుట యసంభవము గదా! ఇంతటితో నీయనువాదమును 
విడతును. 


౭ 
శ్రీధర వ్యాఖ్యానుసరణము 


వెనుకనిచ్చిన 4 కారణములతో పాటు పోతన శ్రీధరుల వ్యాఖ్య ననేకస్థలముల 
ననుసరించుటకూడ కొంతకాక కొంతయైనను పెంపుదలకు కారణమనక తప్పదు. 
ఎచ్చటమూలము క్షిష్టమై యర్థస్ఫురణము కాదో యచ్చటను, నొక్కొకచో సౌలభ్యము 
కొజకును, పోతనార్యుడు శ్రీధరస్వామి ననుసరించెను. అనుసరించిన యన్ని 
స్థలములను చూపుట యసంభవము. వెనుక నాం(ధీకరణ పద్దతి నెట్లు 
స్థాలీపులాకన్యాయముగా చూపితినో యట్లే యిచటను చూపెదను. కొన్ని ప్రముఖమైన 
యుదాహరణముల నిత్తును. 


82 ఆంధ్ర మహోభాగవతోవన్యానములు 


1. మూ॥ “నతేవిదుః స్వార్హగతింహి విష్ణుం 
ఇ 
దురాశయాయే బహిరర్థమానినః । 
అంధాయథాంధైరుపనీయమానాః 
వాచీశతంత్రా మురుదామ్నిబద్గాః 11” (7.5) “ 
క్రింద గీటుంచిన పాదమునకు శ్రీధరస్వామి వారిట్లు వ్యాఖ్యానము 
వ్రాసియున్నారు. 





“ఈశస్య, వాచి, తంత్రాం వేదలక్షణాయాం రజ్వాం, 
ఉరుదామ్బి ఉరూణిదామాని, బ్రాహ్మణాదీని యస్యాం, 
తస్యాం బద్దాఃి” “కామైః కర్మబిఃబద్దా ఇత్యర్థః” 
ఈస్థలమున పోతన తెనుంగుసేత యిట్లున్నది: 


“కాననివాని నూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్‌ 

కాననిభంగి.ం గర్మములు గాకొని కొందరు కర్మబద్దులై 

కానరు విష్ణుం; గొందజటం గందు రకించన వైష్ణవాంఘ్రి సం 

స్థాన రజోభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా! (7-182) 


ఇచట సౌలభ్యము కొఅకు వ్యాఖ్యానము ననుసరించి “కర్మబద్దులై” యని వ్రాసెను. 
2. నారదుడు ధృవున కుపదేశించు నవసరమునందలి విష్ణువర్ణనము 
మాతృకలో నిట్లున్నది: 
“తరుణం రమణీయాంగం అరుణోషేక్షణ ధరం । 
ప్రణతాశ్రయణం నృమ్హం శరణ్యం కరుణార్ణవం 1” (4-8-48) 
ఇచ్చట “న్భమ్డ” అను పదమునకు శ్రీధరులవారు “నృమ్హం ॥ 
ధనం, సర్వ పురుషార్థనిధి మిత్యర్థః” అని వ్రాసిరి. పోతన్నగారు: 


“మరి నీలసంశోభితాంగుండు తరుణుండు 
నరుణావలోక నోష్టాధరుండు 


పోతన అనువాద విధానము 83 


కరుణాసము(ద్రుండు పురుషార నిధియు 
ప్రణతాశ్రయుండు శోభనకరుండు” 


అని భాషాంతరీకరించిరి. శ్రీధరస్వాములవారి పదములనే గ్రహించెను. 
3. శుకుడు పరీక్షిత్తునకు ముక్తిమార్గంబు దెలుపు నవసరమున మాతృకలో 
నిట్లున్నది: 
“అండకోశే శరీరేస్మిన్‌ సప్తారణ సంయుతే” అనియున్నది. ఇందులకు 
శ్రీధరులవారు వ్యాఖ్యానము నిట్లు వ్రాసిరి: 
“సప్రావరణ సంయుతే; సప్తభిః మహదహంకార సహితైః 
_ పృథివ్యాది పంచభూతాత్మకైః ఆవరణైఃి” 


పోతనార్యుడును వ్యాఖ్యానము ననుసరించి, 


“విలోక్యమానంబగు ధరణీ సలిల తేజస్సమీరణ 

గగనాహంకార మహత్తత్త్వంబులనియెడి సప్తావరంబులచేత.” (2-15) 
అని వ్రాసెను. ఇట్లు చూపుట కసంఖ్యాక స్థలములుగలవు. ఇక నొకటి చూసి 
తృప్రిచెందుదును. 

4. దశమస్మంధమున కాళీయపత్చులు కృష్ణుని స్తుతిజేయు సందర్భమున 
మాతృకలో, 

“నమో నంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపళ్చితే 

నానావాదానురోధాయ వాచ్య వాచక శక్తయే ॥ 

నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే” (10-16-48,44) 
అని యున్నది. 


దీనికి శ్రీధరవ్యాఖ్య యిట్లున్నది: 


“అనంతాయ అహంకార పరిచ్చేదాత్‌; అతః సూక్షాయ అదృశ్యత్వాత్‌; అత 
ఏవ కూటస్తాయ, ఉపాధికృత వికారాభావాత్‌; అత ఏవ విపశ్చితే, సర్వజ్ఞాయః॥ నా 





' 84 ఆం(్ర మవోభాగవతోపన్యానములు 


చేతి నానావాదారోదాయ అస్తి, నాస్తి, సర్వజః, కించిజ్ఞః, బద్దః, ముక్తః, ఏకః, 


అనేకః ఇత్యాదీన్‌ నానావాదాన్‌; అనురుణద్ది = మాయయా అనువర్తరే, యస్తస్మై; 


వాచ్యవాచక శక్తయే; అభిదానాభిధేయ శక్తిభేదాదపి, నానాత్వే ప్రతీయ మానాయ 
॥నమళఇతి!॥। ప్రమాణమూలాయ = చ్రక్షురాదీనాం చక్షురాది రూపాయ, అత ఏవ 


uuu ర. 


కవయ్యే; స్వయంతన్నిరపేక్ష జ్ఞానాయ్య కుతః శాస్త్రయోనయే = వేదాత్మక విశ్వాసాయ”. 
ఇందులకు పోతనార్యుడిట్లు వ్రాసెను: 


స. మూడహంకృతులచే ముసుగువడక 
నెరిననంతుడవై దర్శనీయరుచివి 

గాక, సూక్షుడవై నిర్వికారమహిమ 

దనరి, కూటస్థుడని సమస్తంబు నెరుగు 

నీకు మొక్కెద మాలింపు నిర్మలాత్మ. 


మరియు కలండు, లేడు, సర్వంబు నెలుంగు, నించుక యెటుంగు బదుండు, 
విముకుండు, ఒకం డనేకుండు, ననునవి మొదలుగాగల వాదంబులు మాయవలన 


ననురోధింపుదువు గావున, నానావాదానురోధకుండ వయ్యును, నభిధానాభిధేయశక్తి 


భేదంబువలన బహుప్రభావ ప్రతీతుండవయ్యును, చక్షురాది రూపంబుల వలన 
(పమాణ రూపకుండవయ్యు, నిరపేక్ష జానంబు కలిమిం గవివయ్యు. వేదమయ 





విశ్వాసత్వంబువలన శాస్త్రయోనివయ్యు” (10 పూ. 681, 682) 
Pa? 
పరిశిష్టము 


పోతనార్యుని యద్వైత మెట్టిదో వెనుక కొంత మనవి చేసినాను. పరీక్షించినచో 
“మాయ” నంగీకరించి నప్పటికిని సాక్షాచ్చంకరాద్వైతము నీయన యనుసరించినట్లు 
తోచదు. కాని తత్త్వవివేచనము చేసిన స్థలములను పరిశీలించిన యెడల, పోతనార్యుడు 
తన కాలమునందున్న యొక విధమైన భక్షదైతముల కవిరోధియైన మతము 
ననుసరించి వ్రాసినట్లు కనబడుచున్నది. ఇదివరలో గంగయ్య సింగనల 


పోతన అనువాద విధానము 85 


భాగములలోని యద్వైత సిద్దాంత సూచనలును, నారయలోని విశిష్టాద్వైత సిద్ధాంత 
సూచనలును మనవిచేసి యున్నాను. 


పోతన శివభక్తుడు శివభక్తుల వంశమువాడైనను వాసుదేవతత్త్వమును 
మిక్కుటముగా నుగ్గడించెను. అందుచేత నతడు శివవిష్ట్వ భేదమును నమ్మువాడుగా 
గానబడును. ఈక్రింది పద్యములను గనుడు. 


“చేతులారంగ శివునిపూజింపదేని 
నోరునొవ్వంగ హరికీర్తి నుడవదేని 

దయము సత్యంబు లోనుగా దలపడేవి 
కలుగనేటికి తల్లుల కడుపుచేటు.” అనియు 


“నీ పాదకమల సేవయు 
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 
తాపార భూతదయయును 
తాపస మందార నాకు దయ సేయగదే!” 


అనియు చెప్పెను. శివపూజ, హరినామ కీర్తనము వలయునని నొడివెను. శివపూజ, 
సేయుచుండగా తనకు శ్రీరాముడు ప్రత్యక్షమైనట్లు చెప్పుకొనెను. శివభక్తుడై రామునిచే 
పల్మింపడి భాగవతమును రచియించెను. ఈక్రింది యుదాహరణమును గమనింపుడు. 
దక్షాదులు విష్ణువును స్తుతించిన యనంతరము విష్ణు విట్లు పలికెను: 


“ఏనును, (బహ్మయు, శివుండును నీజగంబులకు కారణభూతులము... మా 
మువ్వుర యందు నెవ్వడు వేరు సేయకుండు వాడు కృతార్థుండని యానతిచ్చిన” 
(4-207) శివధ్యానము చేయుచుండ శ్రీరామ దర్శనమగుట చిత్రము కదా! = 








పోతన భాగవతమున వ్రాసినంత శృంగార రసము నెవ్వరును రచియింపలేదు. 
కాని యావద్ధంథమును పఠించిన తరువాత పర్యవసించునది భక్తిరసము. శృంగారము 
అంగరసము. భక్తియంగి. దీనిని మదురభక్తియందురు. భక్తికిరసత్వమునుగూర్చి 
వెనుక తెల్పియున్నాను. 


86 | ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


నాకర్తవ్యమును యథాశక్తిగా నిర్వర్తించినాను. నాకీ యవకాశమునిచ్చిన ఆంధ్ర 
సారస్వత పరిషత్తు వారికి నేను కృతజ్ఞుడను. పోతనార్యుని దలచుటయు, నాయన 
రచియించిన భాగవతమునుగూర్చి ముచ్చటించుటయు నను పనులవలన నేను 
పవిత్రుడనుగ భావించుకొనుచున్నాను. ఆంధ్ర సాహిత్వాకాశమున తిక్కన పోతనలు 
సూర్యచంద్రులవలె ప్రకాశించుచున్నారు. 


1 


శా 
bh 


గ్‌ 


సంస్కృత భాగవతము 


పోతన కవిత్వము ౧ 


శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 


పోతన కవిత్వము ౧ 89 


“వేద కల్పవృక్ష విగళితమై శుక 

ముఖసుధాద్రవమున మొనసియున్న 

భాగవత పురాణ ఫలరసాస్వాదన 

పదవి గనుండు రసికభావవిదులు.” (భాగవతము) 


అధ్యక్ష మహాశయులకు నమస్మారము. సరసులైన సదస్యులకు కృతజ్ఞతాంజలి. 


“పోతనామాత్యుడు-అతండొకపవిత్రుండు, కవితానిర్మాణదక్షుండు. తన 
తపస్సును- 'వచస్సును- చక్కని నియమకుల్యలతోం బండించికొని “మానవుండు 
దివ్యగుణములు సంపాదించికొన్న యిట్లుండు”నని ప్రపంచమునకుం జూపి- తాను 
" తరించి- దేశమును తరింపంజేసినవాండు ఆంధ్రజాతి. కాతం డిచ్చిపోయిన 
భాగవతము- అమృతభాండము. ఆ కావ్యమునకు లక్షణమైన జీవితము- 
అమృతముకన్నను మధురమైనది. ఆ బ్రదుకర్ధముగాక కన్నులు. దేలవైచు 
మనవంటివారిపై నా మహనీయుండు జూపిన పరమానుకంపయే భాగవతము. 
సత్యము జెప్పినచో పోతన్నను కవిగా మాత్రమే అంచనావేయుట అతనియెడ మనము 
గావించు నొక యపరాధమే! కారణమేమన 'కవి యను పదమునకు- నేటి 
వాఖ్యానమెంతయో మందగించినది. మొన్న మొన్నటి వరకు- నలువది పుస్తకములు 
జదివి- నాలుగు నిఘంటువులు వల్లెవేసినవారు కవులగుచుండిరి. ఈనాం 
డాబెడదగూడ లేదు. నేటికవికి నాల్గు నిఘంటువు లక్కరలేదు. నలువది పుస్తకముల 
యూసేలేదు. వానికి గావలసినది నాగరవేషము. నలుగురు భజనపరుల 
యనుగ్రహము. పత్రికలలో ప్రచారము వీని కీర్యపకీర్తులు- యీ పరివార దేవతల 
నిగ్రహానుగ్రహములం బట్టి యుండును. అందుకై వారి యాదరము నెప్పుడును- 
యీకవి జాగ్రత్తగ రక్షించికొనవలెను. అవకాశము దొరకినంజాలు- జారవిడువక- 
మేరువంతవాండనని- యెదుటివారేమనుకొన్ననుసరే! ఆత్మశ్లాఘకు దిగవలెను. 
పూర్వమును యిట్టి రజోగుణ పూరితులకు గొదువలేదు. కాని- వారికిని- వీరికిని 


90 : ఆం(ధ మవోభాగవతోపన్యానములు 


యొక భేదముమాత్రము గద్దు! ఆడినమాటలో నర్ధమైనను నెగ్గించుకొనగల సామర్ధ్యము 
వారిది. ఈ కవిగ్రామణులకాC జవాబ్బారీలేదు. వీరినెవ్వరును అడుగరుగూడ! 
ఒకవేళనడిగి రాదనిపించిరి పో- ఆ ధైర్యమునకు మెచ్చి- వారికంబరాభరణాదు 
లొసంగెడు దాతలేరీ? కనుక నేటి యీదృష్టితో మనము జూచి యాతని నొక “కవి” 
యని తేల్చివేసినచో- నంతకంటె నన్యాయముండదు. ఈ విషయము నా కంటెను 
రనికులైన మీకే బాగుగదెలియును. పోతన్నవంటి వారికి “కవి” 
శబ్బమన్వయించునప్పుడు- దానికింకను గొంత గంభీరమైన యర్థము గావలెను. 


ఆ మహనీయుని గురించి వివరించుటకు మీరు నన్నెందు వినియోగించి 
కొన్నారో నే .నెణుంగను. ఆ నియమశీలకుండిన శీలసంపదలో- శతాంశము- 
సహగస్రాంశము నాకులేదు. ఆ విద్వాంసుని పాండిత్యమును అనుకరింపకున్న మానె- 
అర్థము జేసికొను సత్తువయు సున్న. తపస్వులైన వేదాంతదేశికులు- “పాదుకా 
సహస్రమున గాబోలు “కిమాశ్చర్యంపంగో రుపరియది గంగానిపతతి” యన్నారు. 
భగవంతునిదయ యున్నప్పుడు కుంటి వానిపై వానియింటికే వచ్చి గంగ 
(ప్రవహించునట! దేశికులు భగవంతుని యెడం జేసిన యీ వినయానుసంధానము 
జాపచారికమే! వారి తపోమహిమ యట్టిది. నాయెడ మాత్రము యీ మీయనుగ్రహము 
కుంటివానిపై గోదావరి బారుటయే! ఇది నా గొప్పయద్భృష్టము. ఇంతకు నా 
భాగ్యమునకేమిగాని- మీకు నిరాశ తప్పదేమోనని నా భయము. ఈ పనికి నా 
కన్నను గొప్పవారి నెన్నుకొనవలసి యుండెను. | 


కవి శబ్దమునకు నేటి వ్యాఖ్యానమేమో కొంత మనవి జేసితిని. పోతన్న 
జీవిత మందుకు నేరుగా నపవాదము. మన మతనిని 'కవి యన్నచో నాతనికి 
క్రొత్తతృప్తి పొంగుటయు లేదు. కాదన్న నది క్రుంగుటయులేదు. ఆతని జీవితమును- 
రచనమును- మననగావించుకొనుట- మనము పవిత్రులమౌటకే! కవితా 
రచనమునకుం గొందటజు ప్రాంచీనాలంకారికులు “విశ్వశ్రేయము'ను ఫలముగా 
జెప్పిరి. పోతనామాత్యుం డుద్దేశించిన ఫలమంతకన్నను భిన్నమైనది. ఆతండు తాను 
భాగవతమెందుకు వ్రాయవలసి వచ్చెనో వివరించుచు; 


పోతన కవిత్వము ౧ 91 


మ॥  ఒనరన్‌ నన్నయ తిక్కనాది కవు లీయుర్విన్‌ బురాణావళుల్‌ 
దెనుంగున్‌ జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో 
దెనుంగున్‌ జేయరు మున్నుభాగవతమున్‌ దీనిన్‌ దెనింగించి మ 
జ్ఞననంబున్‌ సఫలంబు సేసెద పునర్ణన్మంబు లేకుండగన్‌ ॥॥ 


అని పలికెను. ఆతండాశించిన ప్రధాన ఫలము- జన్మరాహిత్యము. దీనిని మరియొక 
మార్గమున నాతపస్వి సాధించుకొని యుండవచ్చును. కాని- యా మహాకవి పురాకృత 
శుభాధిక్యంబు ఆతనికి భాగవతమును జూపినదట! నిజమునకది యాతని 
పూర్వపుణ్యముగాదు. దేశముయొక్క శుభాధిక్యము లేకున్నచో- నా పరమసాత్వికుని 
హృదయపదమునుండి- యీ దివిజగంగ బారియుండెడిది గాదు. 


పోతనామాత్యుని విమర్శించువారిలో స్టూలముగ రెండు తెగలవారున్నారు. 
కొందజు వ్యాసుని భాగవతమునకు పోతనామాత్యుం డడుగడుగునను మెబిగును 
పెట్టె ననువారు, మరికొందరున్నారు. వారిదృష్టిలో పోతన్నకవియే గాందు. అతని 
భక్తి మాత్రము గొప్పదని తలపంకించి- దూరపు మొక్కులు మైక్కుదురు. దానినైనను 
గౌరవించుట పోతన్న వీరికి సమకాలికుండుగాదు గనుక మొదటివాద మతివృష్టి. 
రెండవది యనావృష్టి. ఈ నడుమ- ఆంధ్రులలోం గొందటికి- హఠాత్తుగం దమ 
భాషపై నభిమానము పుట్టుకొని వచ్చుటచేం గాంబోలు- వ్యాస భగవానునిపై నొక 
యేహ్యభావ మారంభమైనది. వారి దృష్టిలో నొకరికి తిట్టనిది- వేరొకరిని 
దీవించినట్లుగాదు. ముఖ్యముగ గడిచిన దశాబ్దములలో నీ ప్రాచుర్యము 
తిక్కనామాత్యుని భారతము విషయమున బహుళముగ జరిగెను. 


అడుగడుగునను వ్యాసుండు తక్కువ- తిక్కన్న యెక్కువ- యని బుజువు 

చేయనిది యీ విద్వాంసులకు నిద్రబట్టినట్లు గానరాదు. ఈ విజ్ఞాన వృద్దుల యాసరా 
లా థ 

జూచికొని కొందు “ఆంధ్రాంగ్రేయ పులగపు” విమర్శకులు మరికొంత విపరీతముగ 

గంతులువేసిరి. స్వకపోల కల్పితమైన కవిత్వమెంత యున్నను- తిక్కనామాత్యు 

డొనర్చినది యనువాదమే నను విషయమును వారు పూర్తిగ మజచినారు. మూలకారుని 

భావములేవో- తిక్కన భావములేవో వింగడించు పరిశ్రమయే- వీరికక్కజలేని 


92. ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


పనియైనది. సభావేదికలపైనిలచి- అయినది- కానిది- యంతయు తిక్కనదే నని 
యద్భుతముగ పొగడ్తలు సాగించిరి. ఒక్కొక్కసారి వీరి వాదములు జూచినపుడు 
భావుకులకు పట్టరానంత నవ్వు వచ్చును. [ద్రౌపది సైరంధ్రియెనపు డామె ధరించిన 
దుస్తులచ్చముగ తెలుంగువారివేనట! అర్జునుడు కల్తిలేని యాంధ్రనాయకుని వలెనే 
మాట్లాడునటం అభిమానము దురభిమానమై వెర్రితలలు వేసినపుడు చేయు విమర్శనము 
లిబ్లేయుండునని నా మనవి. నేనీ మాటలన్నచో తిక్కనపై నా కభిమానము లేదని 
తమరు తలపరాదు. ఆతండు ‘కవిబ్రహ్మ యనుటకు నా కెట్ట సందేహమునులేదు. 
ఆ యుభయ కవి మిత్రుడు కవితాశిలమునందు- పారగుండనుటలో- 
సంశయమున్నవానికి కవిత్వమేమి దెలిసినట్లు? కాని నేను విన్నవించునదేమనంగా- 
వ్యాసుల నెంత నిందించిన తిక్కన నంత వందించినట్లుగాదని మాత్రమే! 
ఒకానొకండు తొల్త నొక పదార్థమును దయారుచేసి పెట్టినపుడు- దానిపై మెబుగులు 
దిద్దుట మొదటిదాని యంతకష్టముగాదని మర్మజ్ఞు లెరుగుదురు. పాండవులు- 
భారతము- ఒక్క ఆంధ్రులకేకాదుగదా! వారి కథ భారతదేశపు సొమ్ము. అట్టివారికి 
తెలుంగు రూపురేకలుదిద్దు నధికారము తిక్కన కెవరిచ్చిరి? అని యెవరైన 
నడిగిరనుకొందము. దానికి మనసమాధానమేమి? మజియట్లొనర్చుట తిక్కన 
దోషమేనా? ఆమాట నేనను ఏ కవికైన నది స్వభావమని మాత్రమే నేను చెప్పం 
'దలచినది. కవి యెంత స్వతందత్రుండైనను- వ్రాయుచున్నదియే కాలమునకు 
సంబంధించిన కాన్యమైనను- అతండు జీవించిన సమాజము- దాని యభిరుచులు- 
వాని కావ్యమం దెట్లో యొకరీతి చోటుచేసికొని ప్రవేశించును. ఎంతటి వానికేగాని 
యీ గుణముదాంచికొనుట యసాధ్యము. అనావశ్యకము గూడ. కుమారవ్యాసు. 
డు రచించిన కన్నడపు భారతములోని పాండవులు కన్నడిగులే! మలయాళమున 
'ఎజుత్తచ్చన్‌' భాగవతకర్త. ఆ పురాణమున నవకాశముదొరికినపు డంతయు- పనస 
రసముల యూటలు- టెంకాయతోంటలు- కదళీవాటులు- చోటు చేసుకొన్నవి. ఆ 
బాలకృష్ణున కరంటిపండు దిననిది పూట గడువదు. స్వభావమిది గనుకనే తిక్కన 
పహృదయమునుండి “ఆం ద్రావళిమోదముంబొరయ) ననుమాట హఠాత్తుగ కావ్యమున 
దూకినది. పైగా- తిక్క్మనామాత్యుని కాలమున నందు కవసరము గూడ నుండెను. 


పోతన కవిత్వము ౧ 93 


నాటి తెనుంగు జాతి- దేశము- చెక్కలు ముక్కలుగం జేయబడినది. కాకతీయుల 
ప్రతాప మొకవైపు జెలరేగుచున్నను- నాటి కింకను వారి ప్రభ యుచ్చస్థితికి రాలేదు. 
జైనులు- వీరశైవులు- అద్వైతులు- మేము గొప్ప, మేము గొప్ప యని 
వాదించుకొనుచుండిరి. జాతియందు లాలసత మొదలైన ధర్మములు తొంగిచూచు 
ప్రమాదముండెను. ఈ దుస్సంప్రదాయముల నరికట్టుట కమాత్యుండైన తిక్కన 
మహాభారత రచనమునకు బూనుకొన్నాండు. తులసీదాసు రామాయణము వ్రాయుటకు 
గూడ నట్టి పరిస్థితులే కారణము. గనుక తెనుంగు జాతికిం గర్తవ్యము బోధింప 
దొరకొన్న తిక్కనామాత్యుని గ్రంథములో నాంధ్రజాతిగాక మరేది ప్రతిఫలించును? 
పఠితలమైన మనముగూడ- నొక గ్రంథమునందు- మనజాతి- స్వభావము- దేశము- 
యెంతగా ముద్రితమైన నంత యాత్మీయతను భావింతుము. తీక్ష్యమగు తార్మిక 
బుద్ధితో జూచినపు డిది దౌర్భల్యమే గావచ్చును. కాని- కావ్యమున మాత్రమిది 
యొక గుణమే! పైగా వ్యాసమహర్షి వ్రాసిన దేశకాలములు వేజు. అతనిని గలం 
చిన యావేశములు వేరు. మనుష్యులు వేరు. రాగద్వేషములు మొదలైన మానసిక 
వికారములు- వారికిని మనకును సామాన్యములే యైనను- అవి యుద్రేకించు 
సన్నివేశములు- వానిని వెల్వరించు తెనుంగులు- భిన్నభిన్నములు. అట్టిచో 
వ్యాసభగవానుండు “మనమనుకొన్నట్లే వ్రాయవలెననుట- “మనకు గావలసిన 
గుణములే” యాతనిలో నుండవలె ననుకొనుట- విజ్ఞతకంటెను అజ్ఞతనే యెక్కువగం 
దెలుపును. తిక్కనకు గల్గిన యీ సర్వతోముఖమైన పొగడ్త- నన్నయకు దక్కలేదే 
యని మరికొందరి బాధ. ఈ కుస్తీపట్లకు సాహితీదృష్టి యొక కారణమైనను- 
తెజవెనుకల భాగవతము గంపెడంత. వీరును యథా(ప్రకారము- యిది వ్యాసుని 
తగ్గు? - యిదినన్నయ “నిగ్గు యని ప్రారంభించినారు. మొన్నమొన్నటి వరకు 
మేధావంతుల మనుకొనువారికి- నన్నయను దిట్టుటయొక నాగరకముగ నుండెను. 
ఈ (ప్రచారమునకుం జదువు - కొన్ని యితర యోగ్యతలు - వీనినిబట్టి - 
మూలస్తంభములు గొందటే! తక్కినవారు వీరికి పలుకుబండలు సీసపద్యములలో 
నొయ్యారినడకలు లేవని - అతండు శబ్దసిద్దుండే గాని యర్ధరసికుండు గాండని 
నన్నయభట్టుల 'నాక్షేపించిరి. చెప్పవలెనా వీరి ప్రతాపము! ఆ 'జపహోమతత్సరుని' 
పాపము! తోచినవన్నియు ననిరి. 


94 . ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


ఈ నడుమ గాలి యిటు దిరిగినది. ఈ వాదములను విని మనమొక చిజునవ్వు 
నవ్వి - యూరకుండవల్వె నంతే! ఇంతకును-ఆ ముసలి వ్యాసునివైపు వాదించు 
'వకీ? లొక్కడును గూడ నేటికి దయారుగా లేదు. నిజముగ వీరి విమర్శనములు - 
ఆ నన్నయయు - యీ తిక్కనయు - యే యోగశక్తిచేతనైనను (బ్రదికి వినుటయే 
దటస్థించినచో- వీరి యకాండ తాండవమునకు వా రెంతయో నొచ్చుకొందురని నా 
తలంపు. 


కనుక- “సంస్కృతకవి భాగవతమును చాలరసహీనముగ వ్రాసెను. 
ఆంధ్రకవి-ఆ కవిత్వము నెంతయో హృదయంగమముగం జేసెను.” అని డప్పులు 
వాయించుపని - పోతన్నవంటి పరమసాత్వికుని విషయమున మాత్రము జేయవలదని 
వారికి నా వినయపూర్వక నమస్కారము. అతనికి వ్యాసభగవానునిపైనున్న గౌరవ 
మింతింతగాదు. అందుకే కంఠోక్తిగ- 


శా॥ పుట్టన్‌బుట్ట, శరంబునన్‌ మొలువ, నంభోయాన పొత్రంబునన్‌ 
మెట్టన్‌ గల్లను, గాళి గొల్వను బురాణింపన్‌ దొరంకొంటి మీ 
దెట్టే వెంటంజరింతు దత్సరణి నాకీవమ్మ! యోయమ్మ? మే 
ల్పట్టున్నాకగుమమ్మ! నమ్మితిజుమీ! బ్రాహ్మీ! దయాంభోనిదీ! 


అని తన వినయానుసంధానమును జూపి-పరమ భాగవత ధర్మమును వెల్లడించెను. 
కాళిదాసుగూడ నాతని దృష్టిలో నొక పురాణకర్తయె - బుషికవియునైనాండు అంత 
మాత్రమేగాదు. ఏకవిని కించపరచినను పోతన్నకు గలుగునది బాధయే! అందుకే 
యాతండు పూర్వకవి జనసంభావన మొనర్చెను వర్తమాన కవులకు బ్రియముబలి5ను. 
భావి కవులను బహూకరించెను. 


ఇంకొకరి తలంపున పోతన్నది కవిత్వమేగాదు. కారణమేమనంగా- నతనిలో 
మూలానుసరణము లేదట! మూలానుసరణ మనంగా' దాని యర్థమును వీరే 
వ్యాఖ్యానింపవలెను. వ్యాసుని రచనలో చి కారమున్న నిచ్చటను చకారమును- 
నచ్చట 'వి యున్న నిచ్చటను వకారముండుటయేనా? అట్లయినచో వ్యాసభాగవతమునే 
కాపీ వ్రాయుట మంచిది. పూర్వమొక నవా బుండెడివాయడట! వానిదగ్గణ నొక 


పోతన కవిత్వము ౧ 95 


వ్రాయసకాడుండెను. వాడు యథాగ్రుతగ్రాహి. ఒకనాండేదో యొక రికార్డు? ను 
నవాబు జూచి వ్రాయవలసినదిగా వానిని గోరెను. వాండాపనిజేయుచుండగా- 
నొక గడ్డుసమస్య యేర్చడినది. ప్రాతరికార్డులో నొక యక్షరముపై నీగయొకటి 
జచ్చియుండెను. వెంటనే యావ్రాతగాండును కష్టపడి యీగను సంపాదించి- దానిని 
చంపి యక్కడ బూసెనట! నాకు వీరి వాదమును విన్నపుడంతయు నీకథ జ్ఞాపకమునకు 
వచ్చుచుండును. 


వ్యాసభగవానుని గూర్చి యింతకుముందే గొన్ని విమర్శనములున్నవి. వ్యాసుం 
డొకండు గాదనియు- ఆ పేరు గలిగినవారు పలువురనియు నొక యభిప్రాయము. 
వారి వాదము ప్రకారము వ్యాసుందనునది బిరుదమేగాని యొకని పేరుగాదు. 
శ్రీమద్భాగవతమును వ్యాసుడు వ్రాయలేదనుటయు మరియొక యూహ! ఆ గ్రంథకర్త 
“'బోపదేవుండో' మరియెవ్వరోనట! ఆ గ్రంథవ్యాప్తికై వ్యాసుని పేరు బెట్టెనట! మరి 
వ్యాసులు రచించిన భాగవతమేదీ? అది దేవీభాగవతమే! ఈ వాదము లీనాటివేం 
గావు. చాల ప్రొచీనములుగూడ! సనాతనులు - యీ రెండు భాగవతములు 
వ్యాసకృతములేనని యంగీకరించినను - ఒకటి యువపురాణము - మరియొకటి 
మహాపురాణమని - 'చెన్నంపల్లె పంచాయతీ జెప్పిరి. ఇంతలోం దీరెనా? తీరనిత్తురా? 
ఉపపురాణ మహాపురాణ నిర్ణయమున మరల మతభేదము లేర్చడినవి. విష్ణుభక్తులు 
విష్ణు భాగవతమే మహాపురాణమన్నారు. “కాదు దేవీభాగవతమే” నని శాక్తులు 
వాదించిరి. ఈ వాదము తెగుట యెప్పుడు? ఇదిగాదని కొందరు మూండవ 
మార్గమును ద్రొక్మినారు. కారణభేదముతో రెండును “నుపపురాణములేనట! రెండును 
మహాపురాణములేనట!” ఇది సులభమైన పరిష్కారము. 


నవీన చారిత్రకులు భాగవతము వ్యాసకృతము గాదనుటలో6 జూపుకారణ 
ములలో నొకటి శైలిలోని భేదము తక్కిన పురాణములలో6 గనపడు వ్యాసుని 
శయ్యకును - భాగవతము నందలి ధారకును - భేద మున్నదని వాదము 
శైలీభేదమున్నమాట నిజమేగాని - నా మనవి యేమనగా - ఒక్కొక్కరి కొక్కొక్క 
శైలియని ముద్రవేసిన వాందెవండు? నాకుంజూడ నిదిసామాన్య లక్షణమేగాని - ' 


96 ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


విశిష్ట లక్షణము గాదు. ఒక కవి వ్రాసిన కావ్యమందే - సందర్భముల ననుసరించి 
శయ్యాభేదములేర్చడుచుండుట మన మెటింగిన విషయమే! వ్యాసుడు గొప్ప తార్మికుం 
డు. ఆతని కవితలో కవి హృదయమునకన్నను గొంత విమర్శనాదృష్టి యెక్కువ. 
చెట్లుచేమలు - మొదలైన ప్రకృతిని వర్ణించు తహతహకంటెను మానవహృదయముల 
లోనికి! దొంగిచూచి వాని నిజమైన రంగును బయటపెట్టుటలో నాకాంక్ష గొప్పది. 
ఈ వాసన భాగవతమునందు గూడ లేకపోలేదు. భారతములోను నీ పోకడలే 
యున్నవి. కొంత కర్మశమైన శైలి - అన్వయ కాఠిన్యము - యాతని రచనకు 
సామాన్యలక్షణములుగ గనపట్టును. ఈ గుణములు భాగవతము నందింకను 
ముదిరినవని చెప్పవచ్చును. అంతేగాక - అడుగడుగునను వృత్తములు మార్చు 
నలవాటొకటి యాతని భాగవతమున గ్రొత్తగ సంక్రమించెను. అందుకే సాధారణముగ 
పండితులుగూడ భాగవతమును పారాయణముసేయు మన్నచో - భయపడుదురు. 
పూర్వకాలములో నొక పండితుని వ్యుత్పత్తిని గమనించుటకు భాగవతమున కర్ణము 
జెప్పుమనెడివారట! కొన్నిచోట్ల భాగవత కవిత్వము కార్మశ్యమున బరాకాష్ట్ర నందినది. 
ఆతని పురంజనోపాఖ్యానము మొదలైన ఘట్టములు - అర్థమగువేళకు తల పగుల 
గొట్టుకొనవలసినంత పనియగును. వాల్మీకుల శైలి కలవాటుపడినవారికి వ్యాసుల 
రచన కొంత క్లిష్టముగనే యుండును. వాల్మీకిది శరత్కాలపు ప్రవాహమువంటి చల్లని 
శైలి. అన్వయ క్లిష్టత - బరువైన భాష - యివి వారికంత ప్రియమైనవిగావు. 
మానవహృదయము కెదురెక్కుటకంటెను - కనులముందున్న జడ ప్రకృతిని 
వర్ణించుటలో వారి కాకాంక్ష యెక్కువ. అడుగడుగునను వజ్రపు తునుకలవంటి 
యుపమానములు. వ్యాసు లనేకాలంకారములను వాడుదురు. ఇంతకును, యీ 
రెండును రెండు సంప్రదాయములు. సంస్కృత వాజ్మియమునందే యీభిన్నపంథలు 
బాగుగ ప్రచారములోనికి వచ్చినవి. వాల్మీకి ననుసరించిన మహాకవులు - భాసుడు 
- కాళిదాసు - మొదలైనవారు, లీలాశుకుండు, జయదేవుండు, మురారి మొదలగు 
కొందరు వ్యాసభగవానుని రచనను గారవించినారు. ప్రాచీనకాలమందును వ్యాసుని 
రచనను గేలిచేసినవారు లేకపోలేదు. వారాతనిని 'చకారకుక్షి యనిరి. అనగా- 
వ్యాసులు తమ కవిత్వములో సముచ్చయ చకారము నెక్కువగ వాడుదురని యాక్షేపకుల 


పోతన కవిత్వము ౧ 97 


రచనమునందును - తిక్కడక్క్మడ చకారములు గుప్పలు తెప్పలుగవచ్చును. ఇంతకును 
నీవిమర్శన మభిరుచి భేదమునకు సంబంధించినది. ఇట్టి యపకీర్తియే తెనుంగులో 
దిక్కనకుం దప్ప - దక్కినవారి కందటికు కొద్దియో గొప్పయో యున్నది. తిక్కనామాత్యుం 
డొక్కడుమాత్రము మందునకైనను వ్యర్ధ్థపదము వాడండట! తక్కిన కవులలో నిది 
సామాన్యముగ గనుపించుచుండునని వారందురు. నిజమే గావచ్చును. ఎంతటి 
సిద్దుందైన కవికైనను వానిహృదయము మొక దానియందు లీనమైయున్నప్పుడు తక్కిన 
గుణములలోం గొంత తరుగు గన్పడుట తప్పదు. 


తిక్క్మనామాత్యుడు వాగర్థములలో భావసంపదనే చక్కగం బోషింపవలె నను 
చూపుగలవాండు. శబ్దమనునది యాతనిదృష్టిలో భావము నందించుట కుపకరణము 
మాత్రమే! శబ్దమునకే ప్రత్యేక సౌందర్యమున్నదనియు దానిని సాధించుటగూడ 
నొక తపస్సనియు నాతం డంగీకరింపండు. శబ్దమును మజచి యర్థము పైం 
బరిపూర్ణముంగగన్నుంచినప్పుడే తిక్కన కవిత్వమున గలుగు నానందము మరి 
యాతనిలో నాదశుద్ధి లేదన్నప్పుడు వారొసంగు సమాధానమేమి? నన్నయ- శ్రీనాథుడు 
విద్యానగర కవులు. శబ్బములకే యొక ప్రత్యేక సౌందర్యమున్నదని నమ్మిరి. 
నమ్మినదానిని తనివిదీఖ ననుభవించి- మనచే ననుభవింపంజేసిరి. కవి కులగురువని 
కలముబట్టి ప్రతివాని చేతను- నాటినుండి నేటివజికు ముష్రాద్దు మొక్కులు గొనుచున్న 
కాళిదాసుగూడ శబ్బార్థములను సమానముగ గౌరవించెను. తన యభిప్రాయమును 
కావ్యారంభముననే 'వాగర్ణా వివసంపృక్తా' అను నుపమానముచే ధ్వనిమార్గమున 
సూచించెను. పోతనామాత్యుండు నాచనసోమునివలెనే యీరహస్యము నెంతయో 
గౌరవించినాండు. దేవతలొకవైపు- పూర్వదేవత లొకవైపు బంతులుదీరి కూర్చున్నారు. 
ఆ యిటుమూకలకును - అమృతమును బంచుటకై ముద్దులు కుప్పవోయుచు; 


కం॥ [శ్రోణీభర కుచయుగభర 
వేణీ భరములను డస్సి వివిధాభరణ 
క్వాణయయి యువిద వచ్చెను 
పాణి సరోజమున నమృత భాండము గొనుచున్‌. (8-313) 


98 ఆం(ధథ మవోభాగవతోవన్యానములు 


ఆ వచ్చినది యెవ్వరు? ఆమె మోహినీమూర్తి. అప్పుడు పోతన్న: 


కం॥ భాసుర కుండల భాసిత 
నానాముఖ కర్ణగండ నయనాంచలయె 
శ్రీసతియగు సతిగని దే 
వాసుర యూధంబు మోహమందె నరేంద్రా! (8-314) 


యనుచున్నాండు. వారికే గాదు. మోహ మాక్రమించి కొన్నది మనకుంగూడ. 
దేవాసురులను మరులు గొన జేసినది మోహినీ మూర్తి. మన శరీరములను 
మజపించినది సర్వమోహనమైన పోతనామాత్యుల వాగ్గేవి. మొదటి పద్యమున “భర” 
శబ్దము మూండుసారులు వచ్చినది. కాని యాయావర్తి మనకేమియు బరువుగా 
లేదు. చదివినదానినే - మజిల మజిల చదువుకొందుము. ఇట్టి ఘట్టములు 'కవిబ్రహ్మ 
కవిత్వమున నఖుందుగా వచ్చును. లేక రానేరావు. 


ఇంతకును పెద్ద సృష్టి యొనర్చునపుడు - భావమును ఛందస్సులను 
“పడికట్టు”లలో బిగింపవలసి వచ్చినప్పుడు అక్కడక్కడ నొకటి రెండు వ్యర్థపదములు 
రాక తప్పవు. వాల్మీకిలోను నప్పుడప్పుడు “తధైవహి - తధైవచ”లు వచ్చుచునే 
యుండును. ప్రాచీనులది - అదియొక యుదారమైన రచన, రాంగరాంగ నాపరిపాటి 
. సంస్కృతమునను గూడ నశించినది. ఈ దృష్టితో జూచినపుడు సంస్కృతములో 
పురాణకవులే ధారాశుద్ధిని సాధించిన వారనిపింతురు, రాంగరాంగ 'చిత్తారిపను 
లెక్కువయిపోయినవి. ఈ 'చిత్తారి' పని నింకను సాగబీకిన మహానుభావులు మొన్న 
మొన్నటి భావకవులు. లాలిత్యములు సాధింపవలసినచో - పూవుల కన్నను మెత్తగ 
నుండవలసినచో - వారి యూప ఇతర రసములను జెప్పు పట్టులందును - 
అడుగడుగునను వరాకాష్టతయే యగుపించవలెనని వారాశింతురు. దీని పరిణామ 
మేమైనది? “దినమును జచ్చువారికి నేడ్చువాండెవం” డను నొక సామెత గలదు. 
మనస్థితి యట్లైపోయినది. ఈరచనములు మనహృదయ మునకున్న స్పందన శక్తినే 
బాగుచేసినవి. చేయుచున్నవి. మాటిమాటికిని గిచ్చినచో నేమగును? క్రమక్రమముగ 


పోతన కవిత్వము ౧ 99 


దానిచే గలుగవలసిన బాధయు - భావవికారమును మాయమగును. సదా 
యేడ్చుచున్నచోం గొన్నాళ్ళకుం గన్నీరుగూడ నాగిపోవునేమో? మావైపు - పూర్వమున 
నెజుకలు దొంగతనమును విద్యగా సాధించెడివారు. వారిలో నొక 
యలవాటుండెడిదట! తండ్రి కుమారుని రోజును గట్టెలతోం జావమోదుచు “నేను 
చేయలేద” ను పలుకులను వల్లింపించెడివారు. ఇట్లొనర్చుటటెందు కనుకొన్నారు? 
వాండెప్పుడైన పోలీసులచేతికి దొరికిన వారి దెబ్బలు వాని శరీరముపై 
పనిచేయకుండుటకు. వాండు దొంగతన మొప్పికొనకుండుటకు. మన ప్రాచీనకవులకు 
- ముఖ్యముగా - పురాణ కవుల కీ రహస్యము జక్కగ దెలియును. వా రెక్కడో తప్ప 
సూక్ష్మతరములును - గంభీరతమములును నగు భావములను మాటిమాటికిని 
పని గట్టికొని వ్రాయరు. అందుచే వారి వ్రాతలలో నిట్టిపట్టులు వచ్చినప్పుడు మన 
హృదయము లధికముగ స్పందించును. ఆయుదారశయ్యను జేపట్టుట మనకన్నను 
వారికి భావతీవ్రత లేకకాదు. సరస్వతీ తత్వమైన వారి భావరసికత సామర్థ్యము - 
మన మింకను తపస్సుచే సాధింపవలసిన సిద్ధి. తలంచినచో వారు పాషాణముల 
నుండి పీయూషమును స్రవింపంజేయుదురు. వారియట్టి సామాన్యరచనకు కారణము 
పాఠకులపై నున్నదనియే మనకన్నను ప్రాచీనులకు మానవుల మనోధర్మములు బాగుగ 
దెలియును. 

పైని మనవి చేసినట్లు - వ్యాసులది పక్వమైన పురాణశయ్య. తరువాతి 
వారిలో నీశైలి మందగించినది. పురాణశయ్య యన్నవో - వ్యాసుండు శుష్కతార్శ్మికుం 
డని నాతలంపు గాదు. ఆహృదయమున నెంతయో లాలిత్యము గలదు, ఎంతయో 
యావేదన యున్నది. దశమస్మంధమునందలి - శరద్రాత్రి ఘట్టము - అవమానితుం 
డైన బ్రహ్మ కృష్ణ పరమాత్ముని వర్ణించిన పట్టు - మొదలైన సన్నివేశములు మన 
హృదయమును జేయివెట్టి కలంచును. కృష్ణభగవానుని భావించినపుడామహర్షి 
పసిపిల్లవానివలె, యొకానొక ప్రియలాలసయైన నవోఢవలె మారిపోవును. వారి 
ఈ క్రింది “భీష్మస్తుతి” శ్లోకముల దయతోం దిలకింపుడు. పవిత్రుందైన పోతనామాత్యుని 
తెనిగింపును గూడ రుచిజూతము గాక! 


100 ఆం(ధ మవాభాగవతోపన్వానములు 


ఇది వ్యాస భగవానుని శ్లోకము:- 


“త్రిభువన కమనం, తమాల వర్ణం రవికర గౌరవరాంబరందధానే 
వపురలక కులావృతాననాబ్టే - విజయ సఖే రతిరస్తుమే£_న వద్యా” 
“త్రిజగన్నోహన నీలకాంతి తను వుద్దీపింప, ప్రాభాత నీ 
రజ బంధు ప్రభమైన చేలముపయిన్‌ రంజిల్ల, నీలాలక 
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప, మా 
విజయుం జేరెడు వన్నెకాండు మది నావేశించు నెల్లప్పుడున్‌.” 


“రవికర గౌరవరాంబర” సమాసమునకు “ప్రాభాతనీరజబంధులొడనుట యొక 
తొడవు. “గౌర” శబ్దమును ధ్వనిగా వదలుట పోతన్న మెలంకువ. “వన్నెకాండ”ను 
మాట యీ పద్యములోని వరాలమూట. “తమాలవర్ణ” మనుట తెనిగింపులో 
బోయినది. 


శ్లో। యుధి తురగ రజో విధూమ్ర విష్వ - కృచలులిత శ్రమవార్యలం కృతాస్యే 
మమ నిశితశరై ర్విఖిద్యమాన త్వచి - విలసత్మవచే9 స్తు కృష్ణ ఆత్మ I 
“హయరింఖాముఖ ధూళి ధూసర పరి న్యస్తాలకో పేతమై 
రయజాత శ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో 
జయమున్‌ పార్థునికిచ్చువేడ్క ననినా శస్తాహతిం జాల నొ 
చ్చియు పోరించు మహానుభావుమదిలోంజింతింతునశాంతమున్‌” 


'నాదశుద్ధి యం దిర్వురును సిద్దహస్తులే; కాని - పోతన్నకు హయరింఖాముఖ 
ధూళిధూసర” యనుటలో మంచి పాటు గుదిరినది. '(శమవారి” కంటెను 
“తోయబిందువులు” కృష్ణునిరూపమున కలధకారమఘులు. భీష్ముని బాణములచే 
పరమసుకుమారు6 డైన వల్లవీ వల్లభుని శరీరము ఛేదింపంబడిన దృశ్యమును 
భావించుట లలితుందైన యాంధ్ర కవికిం గష్టమయ్యెను. పైగా 'విలసత్మవచే' అనునది 
దానికి బాధకమై- వ్యాఖ్యాన సాపేక్షమైనది. పోతన్న 'జాలనొచ్చియు' నని కృష్ణున 
కాబాధ తొలంగించినాండు. కవచము కథ యెత్తనే లేదు. “జయమున్‌ పార్టునకిచ్చువేద్ధు 
నని హేతువును జూపి “పోరించు” అనుటలోం గ్రొత్త దృశ్యమును వర్ణించెను. “పార్థ 


పోతన కవిత్వము ౧ 101 


శబ్దమియ్యెడ చాల బాగున్నది. మూలకారులు దొడ్డ సమాసమువేసి కచములకు - 
శ్రమవారికిని సహభావమును గల్పించిరి. తెనుగులో పాదములు విజుగుటచే- 
నాస్ఫూర్తిపోయినది. '“విష్వక్‌” శబ్దము వర్తమానార్థకము. “విష్వంచః” ఇతస్తశ్చకశ్చ 
లంతః అని వ్యాఖ్య. అనగా - భీష్ముడు దర్శించునపు దావెంద్రుకలు జలించుచున్న 
వన్నమాట. ఆ స్ఫూర్తి పరిన్యస్తములో రాలేదు. 'కచి శబ్దమునకు 'అలకలి అని 
వాడుట మంచి తెనిగింపు. 

“సపది సఖివచో నిశమ్యమద్వ్యే-నిజపరయోర్బలయోరథం ప్రవేశ్య 

స్థితవతి, పరసైనికాయురక్ష్యాహృతవతి, పార్థసభేరతిర్మమా౭_స్తు” 


“నరుమాటల్విని నవ్వుతోనుభయసే నామధ్యమక్షోణిలో 

పరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం 
బరభూపాయువు లెల్ల జూపులన శుంభత్మేళి వంచించున 
ప్పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్పద్మాసనాసీనుండై” 


“నరు మాటల్విని” పోతన కృష్ణుండు చిజునవ్వు నవ్వుచున్నాండు. “పరులీక్షిం ' 
పరథంబునిల్పి” యనునది-వర్ణితమైన సన్నివేశమునకింకను మెజుంగు. 'పరభూపా 
యువు లను జూపులచే వంచించువాండు “పార్ధసఖుండనుట కంటెను- పరమేశుం 
డనుట బాగున్నది. పరమేశుండు హృత్పద్మాసనమున గాక నిలుచునదెక్కడ? 
శత్రువులనుటకు “పరి శబ్దమునే మూండుసార్లు 'సహజి పాండిత్యు” డావర్తించెను. 
ఈ యామేడన మవధారణా స్ఫూర్తిని ధ్వనిగా దెలుపును. కాని స్థితవతి' పరసైనికాయు 
రక్ష్యాహృతవతి యను శబ్దసిద్ధి- తెనుంగులో నెగిరిపోయినది. 


“స్వనిగమ మపహాయ మత్ర్రతిజ్ఞాం- 
బుత మధికర్తు మవఫ్లతో రథస్థః । 
ధృత రథ చరణో౭_భ్యయా చ్చలద్ద్లు- 
రిని రివ హంతు మిభం గతోత్తరీయః 
“శితవిశిఖవతో విశీర్ణదంశః 
క్షతజ పరిఘ్లత ఆతతాయినో మే 


102 1 ఆంగ్ర మవోభాగవతోవన్వానములు 


ప్రసభ మభిససార మద్వధార్థః 
సభవతు మే భగవాన్‌ గతి ర్ముకుందః 11” 


ఈరెంటికి దెనింగింపే పోతనామాత్యుల 


సీ కుప్పించి యెగసినం గుండలంబులకాంతి 

గగనభాగం బెల్ల గప్పికొనంగ 

నుథికిన నోర్వక నుదరంబులోనున్న 
జగములవైేగుకు జగతి గదలం 

జక్రంబుంజేపట్టి చనుదెంచు రయమున 
బైనున్న పచ్చని పటముజాజ 

నమ్మితి నాలావు నగుబాటు సేయకు 
మన్నింపుమని క్రీడి మజల దిగువం 


తే గరికి లంఘించు సింహంబు కరణిమెజసి 
నేండు భీష్ముని జంపుదు నిన్నుగాతు 
విడువు మర్దునయనుచు మద్విశిఖవృష్టి 
దెరలి చనుదెండు దేవుండు దిక్కు నాకు. 


యను పద్యము, తెన్గుదేశమున నీపద్యము నోటికిరాని వారుండ రనుకొందును. 
ఇందులో మొదటిపాదము “అవుఫ్నతఃి యనుదానికిం దెనింగింపు. ఈశబ్దములోని 
స్ఫూర్తిని “కుప్పించి యెగసిని యనుట నిండుగా. దెలుపుచున్నది. ఆ “కుప్పించి 
యొగురు' నప్పుడు- గుండలములు చౌకళించి- వానికాంతి గగనమున వింతరంగు 
బూయుట పోతనామాత్యుల భావనయే. చలద్దుఖ" యనెడు సంస్కృతంబున 
కాంధ్రీకరణము రెండవ పాదము మూలమునందు భూమి చలించుటకుC 
గారణములేదు. శ్రీధరులాకొజంతను “ఉదరస్థ సర్వభువన భారేణ” యని పూరించిరి. 
ఆవిషయమును ఆంధ్రకవి యందికొన్నాండు. “గతోత్తరీయః” యనుటకు “పై నున్న 
పచ్చని పటము జాజుటి తెనుంగు. “పచ్చని యను విశేషణము పోతన్నదే. 


పోతన కవిత్వము ౧ 103 


కృష్ణభగవానుండు ధరించిన యుత్తరీయ మేలజాతీనది? దీనికి సమాధానము స్పష్టముగ 
వ్యాసులు జెప్పలేదు, దానిని సమర్థించుట శ్రీధరులవంతు. వారికిది చిక్కుగా గన్పడినది. 
తేనైవ సంరంభేణి యని శ్రీధరులు-తిన్నగాం జారుకొనిరి. ఇక పోతనామాత్యులు 
దానిని సవరించుకొనవలెను. ఆ 'సంరంభము' రెండవపాదములో రానేవచ్చినది. 
మరల నదే జెప్పినచో - నసిగానుండదు. అందుకై - “చక్రంబు జేపట్టి” యన్నారు. 
ఇది- “ధృతరథచరణః” అనుదానిని హేతువుగ నన్వయించుటయే. దీనితో నా 
యుబుకుటకు- నీయమునకు భేదమేర్చడినది. భూమి చలించుట “వేగు” హేతువు. 
పటము జారుటకు పరుగు కారణము. న్లాగవపాదము- అమాత్యుల స్వకపోల 
కల్పితము. “నేండు భీష్ముని... విడువు మర్దున” యన్నమాట తెనుంగు కవిదే. 
పద్యము చాలయందముగ గుదిరినది. కాని- “మత్ర్రతిజ్ఞాం బుతమధికర్తుం” 
యనునది తెనుంగున రాలేదు. రెండవ శ్లోకము- మొదటిదానితోనే గతార్థమగుటచే 
పోతన్న వదలిపెట్టెను. 


శ్లో “విజయ రథకుటుంబ ఆత్తతోత్రే- 
ధృతహయ రశ్మిని తచ్చియే క్షణీ యే 
భగవతి రతిరస్తు మే ము మూర్చోర్యమిహ 
నిరీక్ష్య హతాగతాస్సరూపం” 
“తనకున్‌ భృత్యుండు వీనింగాచుట మహాధర్మంబు వొమ్మంచు న 
ర్షున సారథ్యము పూని పగ్గములు చేం జోద్యంబుగాం బట్టుచున్‌ 
మునికోలన్‌ వడిబూన్చి ఘోటకములన్‌ మోదించి తాడించుచున్‌ 
జనులన్‌ మోహము నొందజేయు పరమోత్సాహుంబ్రశంసించెందన్‌.” 


ఈపద్యము మూలమునుండి వేజైనది. నాల్గవ చరణములోని వైష్ణవ 
మతాభినివేశము పోతన్న యద్వైత భావన కద్దువచ్చెనో; “తచ్చియేక్షణియే” యనునది 
తెన్గున రాలేదు. 
శ్లో లలిత గతివిలాస వల్గుహాస-ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః 
కృత మనుకృతవత్య ఉన్మదాంధాః-ప్రకృతిమగన్‌ కిలయస్య గోపవధ్వః 


104 ఆం(థ్ర మహాభాగవతోవన్యానములు 


కం[॥ పలుకుల నగవుల నడపుల 
నలుకల నవలోకనముల నాభీరవధూ 
కులముల మనముల తాలిమి 
కొలుకులు వదలించు ఘనుని కొలిచెద మదిలోన్‌ ॥ 


ఈపద్యములో శబ్దసౌందర్యమున నిరువురును పరాకాష్ట నందికొన్నారు. కాని- 
మూలభావమున కన్నను పోతన్న సృష్టి వేరైపోయినది. ఒకానొకనాండు 
కృష్ణపరమాత్ముండు నిజమునకు మన్నుదిన్నాండో- లేదో కాని- బలభద్రాదుదులు 
“తిన్నది సత్య'మని తల్లితో దూరులు జెప్పినారు. మాతృదేవి దండింపంబోయిను. 
అపుడు శ్రీకృష్ణులు నోరుదెజచిరి. అందామెకు గనపడిన దృశ్యమిది- 


“సాతత్ర దదృశే విశ్వం జగత్ళాా స్నుచ ఖం దిశః 

సా ద్రిద్వీపా్ది భూగోళం సవాయ్యగ్నీందు తారకం ॥ 

జ్యోతిశ్చక్రం జ్వలత్తేజో వివరాణి రసాతలం 

వై కారికాణీంద్రియాణి మనోమాత్రా గుణాస్త్రయః ॥ (10-8) 


ఈ భాగమునకు. దెనిగింపు- 


క ఆ లలితాంగి గనుంగొనె 
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ 
గోళ శిఖి తరణి శశి ది 
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్‌ (10 పూ.340) 


యనునొక పద్యముతోనే పోతనామాత్యులు ముగించిరి. వారి స్వభావమునుబట్టి 
పోతన్న అట్టిఘట్టములో యొక దొడ్డచూర్ణికను వ్రాసి పదసంపత్తితో! బరవళ్లు 
(ద్రొక్కవలసి యుండెను. మరి- యెందుకో- “నిమ్మకు నీరెత్తిన'ట్లయిపోయినారు. 
ఇంతవరకు నేనుద్ధతీకరించిన శ్లోకములు- వాని తెనింంగింపుతో వ్యాసుండు- పోతన్న 
సమానమైన యుద్దీలని మీకుం దట్టియుండు ననుకొందును ఏదో ప్రసంగవశమున 
చాల దూరము నడచివచ్చితిమి. 


పోతన కవిత్వము ౧ 105 


పోతనామాత్యుండు శ్రీమద్భాగవతము వ్యాసకృతమేననియు- అది మహాపురాణ 
మేననియు నమ్మెను. దానికాతడు జూపిన యుపపత్తి యిది- ఈ విషయము 
శ్రీధరీయములోనిది. 


వ॥ ఇట్లు “సత్యం పరంధీమహి” యిను గాయత్రీ ప్రారంభంబున- 


గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణములోన గాయత్రి 
నధికరించి ధర్మవిస్తరంబును - వృత్రాసుర వధంబును నెందుం 
జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటంజేసి యీ పురాణంబు 
శ్రీమహాభాగవతంబన నొప్పుచుండు- 

(భాగ.ప్ర.స్మం.35 వ) 


పోతనామాత్యునకు “సహజ పాందిత్యుండు” అను బిరుదుండెను. దీనికి- 
శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రి” యనున దాతందే జేసిన వ్యాఖ్య. దీనితోం 
గొందరాతండంత చదువుకొన్నవాంగాడనియు- గేవలము పరమేశ్వరుని యను(గహమే 
భాగవతాంధ్రీకరణమునకు మూలకారణమనియు, వాదింప మొదలుపెట్టినారు. 
భగవంతుని యను(గ్రవాములేనిది భాగవతరచన సాంగలేదనుటలో 
నాయాక్షేపణములేదు. ఇది మాత్రమేగాదు. ఎవండీపని జేయందలంచినను- సర్వేశ్వరుని 
దయలేనిది యది సాగదు. కాని- యంతమాత్రముతో పోతన్న వట్టి “దద్దమ్మ 
యనుట భగవంతునిపై- మన బాధ్యతను మజచిన భక్తి. చదువు బ్రహ్మవిద్య 
యంతటి కష్టము గాకపోవచ్చును. కాని- భగవద్విశ్వాసముతో మాత్రమే- రాని 
చదువు వచ్చుననుట కల్ల. అట్లెనచో- మా పోతులూరి వీరబ్రహ్మముగారు గూడ- 
ఒక యుద్దంథమునే వ్రాసియుండవచ్చును. అతనికి చదువురానిది వట్టి మాటలతో 
శ్రీధరీయమన్వితమగుటయు- భాగవతము వంటి ప్రొఢగ్రంథము అర్ధమగుటయు 
నా యూహకందని విషయములు. నాటి మర్యాద ననుసరించి పోతన్నకు సంస్కృతమున 
చక్కని పాండితి యుండును. శాస్తబలములేని దానాండు సాహిత్యము లేదు. ఆతని 
చిత్తవృత్తి కనువైన వేదాంత శాస్త్రమున గొప్ప పరిశ్రమ యొనరించి యుండును. 
తర్మములేనిది వేదాంతము లేదు కనుక- న్యాయ వైశేషికములా మహాకవికి దోడుగ 


106 ఆంధ్ర మహాభాగవతోవన్యాసములు 


నుండెడివి పోతనామాత్యుల ప్రతిభ చాల తీక్ష్యమైయుండి యుండవలెను. వారు- 
గురుముఖమున జదువని విషయములలో గూడనది 'నల్లేరుపై బండిగా' సాం 
గుచుండుటచేం జుట్టుపట్టుల నున్నవా రాయనను “సహజ పాండిత్యులొడని యందురు. 
ఈ శక్తి గొందటికుండును. 


మొన్న మొన్న తిరుపతిలో నరకంఠీరవ శా(స్తులవారుండిరి. వారు 
మహాతార్శికులు. ఇంతకును ఆయన గురుముఖమున జదివినది కొద్దియేనట! కాని- 
యా ప్రతిభ యప్రతిహతము. వారికడ నొక చిత్రమైన శక్తి యుండెడిది. అలంకారమున 
వారు - 'కావ్యప్రకాశి మను పాఠము జెప్పుచున్నారనుకొందము. అప్పుడా[గ్రంథము పై 
నవీనాలంకారికు లొనర్చిన పూర్వపక్షము లెన్నియున్నవో వాని నన్నిటిని- “సవ్యసాచి” 
వలె ఖండించెడివారు. ఇట్టి కౌశల్యమే - బాలసరస్వతులు బుక్కపట్టణము 
శ్రీనివాసాచార్యులకు గూడ నుండెనని వినికిడి. ఇట్టి వారిని గూర్చియే భవభూతి- 


శ్లో వితరతి గురుః ప్రాజ్జే విద్యాం యథైవ తధాజడే 
నచఖలు తయోః జ్ఞానే శక్తిం కరోత్యపహంతి వా 
భవతి హి పునర్ఫూయాన్‌ భేదః ఫలం ప్రతితద్య ధా 
ప్రభవతి శుచిర్చింబ గ్రాహీ మణిర్నమృదాదయః ॥ 


కనుక నా బిరుదమునుబట్టి యాతనికి చదువే రాదనియు - సర్వమును 
పరమేశ్వరుని కరుణచేతనే యుపపన్న మయ్యెననియు వాదించుట చాల యన్యాయము. 
అట్లు యేకాలమునను - యెవ్వరి విషయమునను - పరమేశ్వరుని కరుణ పనిచేయదు. 
ఆయన దయ-విచ్చివాని చేతి 'రాయిగాదు. నిజముగ - నట్లేచైనచో 
పురుషకారణమునకు వెలయేది? పురుషకారము పనికిమాలిన దైనచో మానవజన్మమే 
పనికిరానిదగును. ఒకటి సత్యమై యుండును. వైరాగ్యము ముదురుకొలందియు - 
కేవలము భగవచ్చింతనలో సక్తుండైన పోతనామాత్యునకు శాస్త్రవ్యాసంగమున రక్తి 
మందగించి యుండును. కృష్ణవిరహముతో బాధపడుచున్న చైతన్య ప్రభువునకు - 
పాణిని వ్యాకరణములోని ప్రతిసూత్రమును - నారాయణపరముగ నన్వయించెడిదట! 
శాస్త్రముల స్వభావము మనకు దెలియదు గాని - ఆ వ్యాసంగ మెతింంగిన పెద్దలు- 


పోతన కవిత్వము ౧ 107 


ఒక దినము వల్లింపకున్న తర్మము మజచి పోవుదురనియు - క్షణము వల్లెవేయకున్న 
వ్యాకరణ వాసన మిగలదనియు చెప్పుదురు. కనుక - వయస్సు గడచుకొలందియు 
- చదివిన శాస్త్రమాతనికి యుపస్థితిలో లేకపోయెనేమో? కాని వ్యుత్పత్తితో సానలుదీరిన 
సంస్మారమే నశింపదుగదా! ఈ విషయమంతయు నాతండు పాపము! “జనక శిక్షిత 
విహితాభ్యాసుండనై” యను ముక్కతోం జెప్పనే చెప్పెను. శ్రీనాథుని విషయమిట్లు 
గాదు. అతని శరీరము నిండుగ “కీర్తికండూతి” యే జీవితమనంగా - వాదిజయములు 
- ప్రతిపక్షభయములు. దినదిన పరిశ్రమలేని దామహాకవి పరిస్థితి క్లిష్టమగును. 
పైంగా “బహుదేశ బుధులతో భాషణలు” విద్యాపరీక్షలు దీనితో చదివిన చదువున 
కడుగడుగునను నొరపిడుగులు అడుగుటచే నాతని పాండిత్య మంతయు బాగుగ 
నుపస్థితిలో నుండియే కావలెను. శ్రీనాథుడు - బాహ్యజగత్తు నంతయు బాగుగ 
నవలోకించెను. పోతన్న యంతర్జగత్తును మధించెను. ఆతనిది పరినిష్టితమైన ప్రవృత్తి 
భోగము. పోతన్నది సర్వతో వికసితమైన నివృత్తి భోగము అంతేగాని - పోతన్నకు 
చదువే రానిచో- 


కం॥ కొందరికి తెనుంగు గుణమగు 
గొందరికిని సంస్కృతంబు గుణమగు రెండున్‌ 
గొందరికి గుణములగు నే 
నందణ మెప్పింతు గృతుల నయ్యెయెడలన్‌ ॥ 


అని చెప్పికొను ధైర్యమెక్కడనుండి వచ్చును! “నీ వాదమంతయు సరేనయ్యా! మరి, 
యా పోతన్నయే దన గ్రంథములో 
కం।। _ పలికెడిది భాగవతమట 
పలికించెడివాడు రామభద్రుండట నే 


పలికిన భవహర మగునట 
పలికెద వేతొండు గాథ పలుకగనేలా! 


యని చెప్పెను గదా! అంతేగాక, 


108 ఆం(ధ మవోభాగవతోపన్వ్యానములు 


“అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా 

పల, మందార వనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలో 

త్సల పర్యంక రమావినోదియగు, నాపన్నప్రసన్నుండు, వి 

హ్వల నాగేంద్రము పాహి! పాహి! యన గుయ్యాలించి సంరంభియై॥॥ 

ఇత్యాతి పద్యముల వ్రాయుఘట్టములందు రాముండే సాయపడెనను 
కథలున్నవి. ఈ గాధలన్నియు కల్లలందువా? “పలికించెడు వాడు రామభ[ద్రుండంట” 
యని యాతండన్న యనుభవము మృషావాదమా? యందురేమో! అవి కల్లలనియు 
నివి చెల్లవనియు నెవరన్నారు! “అలవైకుంఠపురంబులో” యిత్యాది పద్యములు 
రామభద్రుడు వ్రాసెనని యనుటతో మా పని యింకను సులభమైనది. తక్కినవి 
పోతన్న వ్రాసెనని యొప్పుకొన్నట్లేగదా! ఇంక నిందులో చిక్కేమున్నది? పోగా - 
రెండవ పక్షమెత్తికొందము. ఒక పోతన్నకే గాదు. సమస్తమానవులకును 
హృదయపద్మమున నిలిచి పలికించువాండు రామభద్రుందే! నానుండి యిప్పుడుపన్యాస 
రూపమునం బల్ముచున్నవా౭డు వాండు రామచండద్రుండే! రేపు మీతోంబలికింపం 
బోవు వాండును వాండే. ఈ సత్యము మనకు నేండా! వేలాదివర్షములనుండి బుషులు 
చెప్పినదే. కాని - మన మీ యథార్థమును పెదవులపై మాత్రమే నిల్పికొంటిమి. 
పోతన్న హృదయమున జీర్ణించికొనెను. మనకు నాతనికి భేదమింతే. కాని - యిప్పుడు 
మనము - భాషించుచున్నది వ్యావహారిక దశలో - అందుకే పరమార్ధముగా -. 
రామభద్రుడే వ్రాసినను పోతన్న వ్రాసెనని పలుకుదుము. కేవలము జ్ఞాన దృష్టితోనైనచో 
తిక్కన భారతము వ్రాయలేదు. నేను చెప్పలేదు. మీరు వినలేదు. “గజము మిథ్య - 
పలాయనము మిథ్య.” 


నానాలౌకిక వేషములలో బాధపడు మనము గూడ - నప్పుడప్పుడీమాయలో 
- మన స్వస్వరూపమును జ్ఞాపకము చేసికొనుటవలె గొన్ని మాటలాడుచుందుము. 
ఎవరైనను పెద్దలు మన యింటికి వచ్చినారనుకొందము. అప్పు డౌపచారికముగ 
“నిది మీ యిల్లే” నందుము. వెంటనే యా పెద్దమనుష్యుండు - యిల్లు తన పేరిట 
వ్రాసికొని చేవ్రాలుపెట్టుమని యడుగు ననుకొందము. నిమ్మళముగ సంతకము 
జేయుదుమా!. “పోయిరమ్మందుము”. సర్వవిషయములు నింతే. పరమార్ధదశలో 


పోతన కవిత్వము ౧ 109 


నన్నిటికి - నందరికీ అభేదమైనను - వ్యావహారిక దశలో భిన్నదృష్టి తప్పదు. 


సంస్కృత భాషలో పోతన్నను గొప్పగ ట్రేమించిన వారు గొందజున్నారు. 
భట్టబాణుని కాదంబరిపై పోతన్నకు పరమాదరము. కాదంబరి సంస్కృత భాషా 
సముద్రమున బయలుదేరిన గొప్ప తళ్ళు. అన్నిభాషలయందును - ననేకులు దాని 
పలుకుబడితో దమ వ్యక్తిత్వమును గోల్పోయిరి. మన కవిసార్వభౌముడు మొదలైన 
యుద్ధండులకుం బట్టుగొమ్మ యిదియే, బాణుడేగాక - కాళిదాసు - మాఘుండు - 
మయూరుండు - మొదలగు గీర్వాణ కవులెందరో పోతనామాత్యునకు నచ్చినవారు. 
గౌరవ పాత్రులు అన్నిటికిపైగా, వ్యానుని రచనావభావ మొకటి 
యుండనేయున్నదిగదా! ఆంధ్రసాహిత్యమున నన్నయ, తిక్కనలపై నందరి 
కవులకువలెనే పోతన్నకును ఆదరాభిమానములు. నాచనసోముండాతనికి దగ్గరివాడు. 
భాస్కరుడు, భాస్మరుని రామాయణమున గూడ పోతన్న జదివి యుండెను. 
రామాయణము నాతండు జూచి చప్పరించి “భాస్మరుండు చేయివేసి చెజచెను గాని, 
రామాయణమును బండ్లకెత్తించి యుండునా” యని పల్మెనని యొక గాధ. పోతన్న 
చిత్తవృత్తినిబట్టి యీ ప్రవాదము, సత్యమును ధైర్యము నాకులేదు. కాని, భాస్మరుని 
రచనను పోతన్న జూచియుండు నన్నంతవటజి కిది మనకుం బనికివచ్చును. భాగవత 
కవి కనుప్రాసలన్న నమిత ప్రీతి. వీనిని కొంత యెక్కువగ వాడినవాడు భాస్మరుండే. 
సోముడు గూడ నడవదడప యువయోగించినాండు. నాచనసోముడు 
నరకాసురవధలో సత్యభామను గొంత (ప్రొఢముగం జిత్రించెను. అతండు విద్యానగర 
కవి. ఆచిత్రణము పోతన్న హృదయము నాకర్షించినది అతండ గూడ నట్లే యామెను 
బోషించెను. ఈ సందర్భమున రెండు గంథములలోని పద్యములను గొన్న 
యందికొన్నట్లుండుట మన యభిప్రాయమున కింకను బలము. భారత కవులలో 
పోతన్న స్వభావమునకు నన్నయ నచ్చినంత యితరులు నచ్చలేదేమో! తిక్కనామాత్యుని 
గుటించి యాతండు “హరిహర చరణారవింద వందనాభిలాషి దిక్కమనీషిన్‌ భూషించి” 
యని మాత్రమే పలికెను. ఇట, “మనీషి శబ్దము సాభిప్రాయమేమో! వీరశైవ కవులకు 
స్వభావమైన రజోగుణముపై నాతనికి గౌరవము లేదు. కాని, శివభక్తిపై నాసక్తి 
యున్నది. అందుచేం జిన్ననాటం బాలకుటికి సోమనాధుని రచనల నెంతయో 


110 స ఆం(ధ్ర మహాభాగవతోవన్యానములు 


యాదరముతోం జదివియుండును. కాలక్రమమున నాయాకర్షణము బోయినది. 


వీరశైవముపై నభిమానము గతించి పోయినను విశ్వేశ్వరునిపై నా కవికి 
భక్తి ప్రపత్తులు అణువు గూడ దగ్గలేదు. శివుని ద్వేషించు విష్ణుభక్తుండును, విష్ణువును 
ద్వేషించు శైవుండును యెండమావులలో నీరు వెదకువారన్న నీతి పోతన్న కెంతో 
ప్రియమైనది. వయసుతో గూడ నీ విశ్వాసమును బెరిగినది. రాగరాగ 
కృష్ణపరమాత్మయందే యతండు శివావతారమును వీక్షించి భావింప మొదలు పెట్టెను. 
ఇట్టివాండు గనుకనే, కృష్ణపురమాత్ముల బాల్య లీలలు వర్ణించుచు, 


సీ! తనువును నంటిన ధరణీపరాగంబు 

పూసిన నెజ బోది పూతగాంగ 

ముందజ వెలుంగొందు ముక్తిలలామంబు 
తొగల సంగడిగాని తునుకగాంగ 

పాల భాగంబు పైబరగు కావిరి బొట్టు 
కాముని గెల్చిన కన్నుగాంగ 

కంఠమాలికలోని ఘననీల రత్నంబు 
కమనీయమగు మెడ కప్పుగాంగ 


ఆ|| హారవల్లులురగహారవల్లులుగాంగ 
బాల లీల (ప్రౌఢ బాలకుండు 
శివుని పగిది నొప్పె శివునికిం దనకును 
వేజులేమి దెల్ప వెలయునట్లు” (10. పూ. 297) 


నని యెంతో యార్ధముగ వర్ణించి పరమ భాగవతుల ధర్మమును బ్రదర్శించెను, 
స్మార్తులలో నంతటి పట్టింపులేదు గాని, శ్రీవైష్టవులలో మాత్రము శివుని జెడదిట్టువారిని 
జూచి యున్నాను. తనకు భక్తిజెల్లింపకున్నను, శివుని దిట్టిన జాలును. విష్ణువు 
సంతోషించునని వీరి మిధ్యాజ్ఞానము. శివభక్తి యింత యున్నది గనుకనే 
పోతనామాత్యుడు యతని నెంతో యుదారునిగ జిత్రించెను. పాలసముద్రమునందు 
హాలాహలము బుట్టినది. దేవదానవులు దిక్కుతోచక, తేలమొగములు వేసినారు. 


పోతన కవిత్వము ౧ 111 


వారంద రంబుజాసన పురోగములై - కైలాసమునకేగి ఖండేందుభూషు నెదుట 
మొజవెట్టికొనిరి. ఆ దేవతల బాధ చూచి 'ప్రమధేశ్వరుండు ప్రాణసతితో- 


కం. 


కం॥ 


కం 


కం. 


కం. 


“కంటే! జగముల దుఃఖము 

వింటే, జలజనిత విషము వేడిమి, ప్రభువౌ 
యుంటకు నార్తుల యాపద 

గెంటింపగ ఫలముగాదె కీర్తిమృగాక్షీ!” 
“ప్రాణేచ్చ వచ్చి చొచ్చిన 

(ప్రాణుల రక్షింపవలయుం బ్రభువుల కెల్లన్‌ 
బ్రాణులకిత్తురు సాధులు 

(ప్రాణంబులు నిమిష భంగురములని మగువా!” 


“పరహితము సేయునెవ్వండు 
పరమహితుండగును భూతపంచకమునకున్‌ 
బరహితమె పరమధర్మము 

పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖీ.” 


హరిమది నానందించిన 

హరిణాక్షి! జగంబు లెల్ల నానందించున్‌ 
హరియును జగములు మెచ్చంగ 
గరళము వారించుటొప్పుం గమలదళాక్షీ!” 


“శిక్షింతు హాలహలమును 

భక్షింతును మధురసూక్ష్మ ఫలరసముక్రియన్‌ 
రక్షింతు బ్రాణి కోట్లను 

వీక్షింపుము నీవు నేండు వికచాబ్దముఖీ!” 


యని యెంతో గంభీరముగ - ప్రసన్నముగ - ఉదారముగ - బలికెను. ఆ పార్వతి 
యాతనికన్నను వెట్టిబాగులది. ఆమె-కానిమ్మన్నదట! ఈ కథా భాగమును వినుచున్న 


112. ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పరీకితునకు గుండె బెదరెను. అతండు 


క్షిత్తు 
మ॥। ' అమరన్‌ లోకహితార్థమంచు నభవుండౌగాక యంచాడెబో! 
యమరున్‌ భీతిని మ్రింగవే యనిరిబో! యంభోజగర్భాదులున్‌ 
దము గ్రావన్‌ హర! లెమ్ము లెమ్మనిరివో! తాజూచి కన్గంట న 
య్యుమ (ప్రాణేశ్వరునెట్లుమింగుమనె నయ్యుగ్రానల జ్వాలలన్‌.” 
(8-289) 


యని ప్రశ్నించెను. అందులకు జిజబునగవుతో6 దల పంకించి శుకయోగి. 


కం॥ (మింగెడు వాండు విభుందని 
మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్‌ 
(మ్రింగుమనె సర్వమంగళ 
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (8-241) 


యని పలికి పరీక్షిత్తుతో బాటు తానుగూడ నాశ్చర్యరసమున నోలలాడెనట! ఈ 
(ప్రశ్నోత్తరములు పోతనామాత్యులవే! ఈ పెంపునకు గారణమాతనికి శివుని పైని 
గల భక్య్యృతిశయమే! ఇంతేగాక - పరమశివుండు - హాలహాలమును 'హుమ్మని 
యదలించి - 'త్రావన వాలకమును - ఆసమయమున నాతని నిర్వికారస్థితియు 
(8-244) నెంతో సమర్థముగ వర్ణించెను. 


వీరశైవమునకంటె నాతనిని వైష్ణవము బాగుగ నాకర్షించెను. వేదాంతదేశికుల 
నాటికే యాంధ్రదేశమున నాతత్వము మెల్లగా నల్లుకొన నారంభించినది. 'కోరుకొండి 
వారు, రాచకొండి రాజులు విష్ణుభక్తులైనారు. సంగమ వంశములోని మల్లికార్జునుం 
డు “ఏటూరి” గురువుల ప్రేరణముచే- వైష్ణవమును స్వీకరించెను. కాని తెనుం 
గుదేశమున వైష్ణవము నవలంబించుట బాగుగం బ్రచారములోనికి వచ్చినది, 
“'యహోబిలమఠము” పాదుకొని తాతయ్య పీఠము పెట్టినపిదపనే. అంతయైనను, 
నాటి జనుల కందులో ముష్మరతలేదు. విజయనగరరాజులలో 'నారవీటి” వారొక్కరే 
వైష్టవమునందు వీరత్వమును స్వీకరించిరి. పోతన్న వైష్ణవుండుగా మారలేదు. అప్పటి 
కాసంప్రదాయము బహుళముగ తెనుంగుదేశమున వచ్చి నదిగాదంటిని. ఇంతకు 


పోతన కవిత్వము ౧ 113 


నాతండు చక్కని యద్వైతి. పోతన్న తల్లిదండ్రులకుమాత్రము శైవమందు గాఢ- 
తాత్పర్యము. అతని తండ్రి కేసన 'శైవశాస్తమతము” గన్నవాండు అన్నయైన తిప్పన్న 
“ఈశ్వర సేవాకాముండు తాను 'సాధునయయుక్తుండట! తండ్రి తాతల శైవముపై 
నాతనికి మనసు బోకుండుటకుం గారణమేమో! ముఖ్యకారణమాతనికి 
జన్మసంస్మారమైనను కొన్ని చారిత్రక కారణములు గూడ లేకపోలేదు. ప్రతాపరుద్రుని 
కాలమున వీరశైవులు, జైనులు, బ్రాహ్మణులు- వీరుజేసిన గోల యింతంతగాదు. 
మూర్థములైన వీరి మతకక్షలే యాసామ్రాజ్య నాశనమునకు గారణములని కొందరు 
చారిత్రకుల యూహ. నాటి మతోన్మాదుల వీరవిహారములన్నియు- పోతనామాత్యుని 
చెవులలో బడియుండును. పాలకురికి సోమనాథుని ద్విపదలెంత యాకర్షించినను, 
ఆతండు వర్ణించిన కథలుమాత్రము- పోతన్న చిత్తవృత్తికి భయంకరములైనవే. దీనితో 
రజోగుణ ప్రధానమైన శైవముపై, గాలక్రమమున నాతని కఖిమానము 
పోయెననుటలోం జిత్రములేదు. తల్లిథైన లక్కసాని యన్న పోతన్నకు 
మిగులమక్కువయేమో! కొడుకులలో కడగొట్టువానిపై కన్నతల్లికి మమత యెక్కువట! 
ఆమె నాతడు రెండుపద్యములలో పొగడెను. 


పోతన్న రచించిన యితర (గ్రంధములు “బ్ర నీ గి వీదండకముి, 
'వీరభదవిజయము అనునవి. నారాయణశతకము గూడ నొకటిగలదు. వీనిలో 
భోగినీదండకము పోతన్న వ్రాసినదనుట నిర్వివాదాంశము. నారాయణశతకమును 
పోతనామాత్యునిదే మైయుండును. వీరభద్ర విజయము ఆతనిదా! కాదా! యనుటలో 
నభిప్రాయభేదములు గలవు. 


భాగవత మాతని జన్మతపస్సని ముందే మనవిజేసితిని. పరమపవిత్రమైన 
యీభాషాంతరీకరణముకై- మూలభాగవతము నాతడు, కొన్ని నూటులతడవలు 
జదివెను. ప్రతిరోజును భాగవత మతనికి పారాయణ(గ్రంథమై యుండునని నాయూహ! 
ఇది చాలక- తీరికగల యపుడెల్లను- వ్యాఖ్యానమును మధించెను. సందేహములు 
గల్లినచోట యనుభవరసికుల నడిగి తెలిసికొనెను. వారు జెప్పిన విషయములను- 
యేకాంతమున జిలికిచిలికి నిగ్గుదేల్చికొనెను. భాగవతమంతయు నా మహామహునకు 
గంఠస్థమై యుండెననుటలో- అణువు సందేహంలేదు. నారాయణావతారుండైన 


114 | ఆం(ధ్ర మవాభాగవతోవన్వానములు 


వ్యాసభగవానుం డా పవిత్రునకు 'కనుమూసినప్పుడు విచ్చునపుడు దరిసెనమొసం 
గూ చుండెను. ఇంతగా భాగవతమును సుశోధించి, సాధించినప్పుడు ఆధర్మములు 
పోతన్న జీవితములో పాదుకొనియుండవనుట నమ్మనిమాట! కనుక భాగవత రచన 
ననుసరించియే యాతని చిత్తవృత్తులను బాహ్యజీవితమును ఊహింపయత్నించుట 
బాగు. 


పోతనామాత్యుడు చల్లని గృహస్థుడు. ఆతనియింటిలో : కంటికింపైన 
తులసీబృందావనము, బ్రాహ్మణులన్నచో నాతనికెంత భక్తియో గోవులపై కూడ నంత 
భక్తి కద్దు. ఆతం డొనర్చు నిత్యకృత్యములలో గోపూజయు నొకటి. పోతన్నకుగల ఈ 
బ్రాహ్మణభక్తి యితర వర్ణముల పై నాయనకుగల యాదరమున కద్దురాలేదు. జన్మచేతనే 
బ్రాహ్మణుడు. పరమపవిత్రుండు. ఇతర వర్ణములలో గుణవంతులున్నను, వారు 
గౌరవమునకుం బాత్రులు గారను శుష్మమైన యభిప్రాయముపై పోతన్నకు కన్నులేదు. 
ఏజాతివాండైనను సాధువు, భగవద్భక్తుండు, ఉత్తముండని యామహాకవి విశ్వసించెను. 
ఆతనియింటిలో గోవులతో పాటు పరమేశ్వరుని నందివంటి వృషభ సంతానముగూడ 
నుండెడిది. ఆగోవులను ఆవృషభములను జూచినపుడంతయు కృష్ణపరమాత్మునకు 
వానిపైగల యవ్యాజానురాగము ఆయనమనస్సులో మెజపువలె మెరసెడిదేమో! 
“మానవునకు సుఖదుఃఖములు, తానుతాను ముందు జేసికొన్ని పుణ్యపాపముల 
ననుసరించి వచ్చును. ధనము, ఆలుబిడ్డలు వీరందజుగూడ తనకర్మ పండించుకొన్న 
పంటయే! వీరిలో నెవ్వరిని గాని వదలిపోవుటకు తన కధికారములేదు. 
అవసరమునులేదు.” ఇట్టిది యాతని విశ్వాసము. అందుచే “యిల్లు గుల్లజేసి, యే 
చెట్టుగుట్టలనో జేరి దేబిరించుట వల్లమాలినపని యనియు” నతండు భావించెను. 
ఆతనిదృష్టిలో సంసారము, భగవద్శక్తికి భంజకముగాదు. రంజకము గూడ! 
కామక్రోధాదులను సంపూర్ణముగ విసర్జించుటయే ధ్యేయమైనను. హఠాత్తుగ వానిపై 
దండెత్తక కొంత నియమబద్ధములుగ జేసికొనుటయు, ఆ ప్రక్రియలో కొంత 
వానిబలము సడలించి నిమ్మళముగ నిగ్రహించుటయు వివేకమైన ప్రయత్నముగదా! 
పైగా సన్యాసమొక్కటే- భగవత్రాప్తికి మాలమనుటయు పోతన్నకంత సమ్మతముగాదు. 
“సర్వమును భగవత్స్వరూపమే యైనపుడు సంసారము మాత్ర మేలకాక పోవలసి 


పోతన కవిత్వము ౧ 115 


వచ్చినది? అపుడు లేని సన్యాసమును దలపోసి యంగలార్చుటకంటె ఉన్న 
సంసారమున నూఅట యెందుకు జెందరాదు? “కర్మతంత్రముల నొనర్చుచు కమలాక్షు 
గొల్చట, అసాధ్యమా? సాధ్యాసాధ్యములు మనోభావములే” -ఇవి యాతని తలం 
పులు, ప్రాప్తమైన సంసారసుఖములనుగూడ నతండు తృప్తిగ ననుభవించియుండునని 
నాయూహ! కొందటు వేదాంతుల మనుకొనువారు స్త్రీని జూచిననే భయపడినట్లు 
నటింతురు. మీరా కాలమున నిట్టి సన్నివేశమే యొకటి జరిగినది. ఎవరో యొక 
గోస్వామి- రూప గోస్వామి యనుకొందును. బృందావన మందుండెను. మీరాబాయి 
వారిని దరిసింపనేగినది. వారికొక నియమముండెను. స్రీలముఖమును వారు 
జూడరట! వారిశిష్యుండు దారిలో నామె నడ్డి మఠములోనికిం బోనివ్వక పోయెను. 
ఆమె శిష్యుని మాటలు విని నేనింతవజకు నఖండ బ్రహ్మాండములలో కృష్ణపరమాత్ముం 
డొకడే మగవాడనుకొనియుంటిని. నేటికి మీగురువొకండు దయారయ్యెనా?” యని 
వెనుదిరిగినది. ఈ మాటలు రూపగోస్వామికిం దెలిసి పశ్చాత్తాపపడెనట! స్రీలపై 
నిట్టి యేహ్యభావము సుఖములపై శుష్మమైన ద్వేషము పోతనామాత్యులకు లేదు. 
కనుకనే 
కం॥ అనఘ విరక్తులకైనన్‌ 
దనయంత లభించుసౌఖ్యతతి వర్ణింపన్‌ 
జనదట!.... (తృ.స్కం. 7883 ప) 


అని తన మనస్సును సమాధానపెట్టుకున్నాండు. చక్కని గృహస్థునకుండవలసిన 
గుణములన్నియు నాతనికున్నవి. అతిథి పూజ ఆమహాకవికి ప్రాణముతో 
సమానమైనది. ఆ యాదరమునకు పోతన్న దృష్టిలో _నీయాజాతిలేదు. 
భగవంతుడు విశ్వాత్ముండన్న సత్యము అతని నరనరమునను జీర్ణించినది. అన్ని 
దానములకంటెను- అన్నదానమాతనికి చాలప్రియమైనది. నిజమే! ధనములిచ్చి 
యతిథిని తృప్తిపజచుట యసాధ్యము. అన్నముబెట్టి యెట్టివానినైనను “దృప్తిపడినా” 
ననిపింపవచ్చును. అందుకే యట్టి ఘట్టములు వచ్చినపుడు పోతన్న యెంతయో 
సానుభూతితో వర్ణించును. రాజవంశోత్తముండైన రంతిదేవుడు తపస్సు 
జేయుచుండెను. అతండు నలువదియెనిమిది దినములు నిట్రుపాసమొనర్చినాండు. 


116 ఆం(ధ మవోభాగవతోపన్వానములు 


మజుదినమునం గొంతయన్నము దినసంకల్పించెను. తొలుత నొక బ్రాహ్మణుడుం 
వచ్చి యాచించినాండు. కలిగిన యన్నములో రంతిదేవుండు సగమాతనికిచ్చెను. 
మతియొక శూద్రుడు వచ్చినాండు. ఆరాజు మిగిలిన యన్నములో నొకభాగమిచ్చెను. 
ఇంతలో వేటొక్కండు కుక్కలగుంపుతో6 గూడవచ్చి యన్నమడిగెను. రంతిదేవుం 
డణుమాత్రమైనను విసిగిగొన్నవాండుగాడు. అన్నశేష మిచ్చి “నన్నయము” 
లాడిపంపెనట! అంతతో పరీక్ష దీరిపోలేదు. మంచినీళ్ళు మిగిలినవి. వానినైనను 
ద్రావుదమని రంతిదేవుడు తయారయ్యెను. ఇంతలో నొక చండాలుడు 
సాక్షాత్మరించినాండు. వాండనెను; 


కం॥ హీనుండ చండాలుండను 
మానవ కులనాథ! దప్పిమానదు, నవలన్‌ 
బో నేర, నీకు జిక్కిన 
పానీయము నాకుం బోసి బ్రతికింప గదే! 


ఈమాటలే విన్న రాజు హృదయము దయారసముతోం బొంగిపోయినది. 
అతండెంతో యాదరముతో- 


ఉ॥ అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్న! రా 
వన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్‌ 
(గన్నన మాన్ని వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే 
లున్నదె! నాకుదిక్కు పురుషోత్తముం డొక్కండ సుమ్ము పుల్మసా! 
(న.స్క 647) 


అనిపలికి- 


మ॥। బలవంతంబగు నీరు వట్టున నిజప్రాణాంతమై యున్నచో 
నలయండేమియు వీని హృజ్ఞ్వరము నాయాసంబు ఖేదంబునా 
జలదానంబుననేండు మానుననుచున్‌ సర్వేశ్వరాధీనుండై 
జలమున్‌ బోసెను రంతిదేవుండు 'దయన్‌ చండాలపాత్రంబునన్‌. 


పోతన కవిత్వము ౧ 117 


ఈ సన్నివేశము నింతమధురముగా పోతన్న వర్ణించుటకు గారణము- ఆగుణముపై 
నాతనికి గొప్పసానుభూతి యుండుటయేం 


తన కాంతపై నెంత మక్కువయో పరకాంతలన్న నాతని కంత భయము. 
స్వర్గము - నరకము - పాపము - పుణ్యము - మొదలైనవన్నియు నాతండు 
నమ్మెను. పాపము వినాశహేతువనియు - పుణ్యమభ్యుదయ కారణమనియు పోతన్న 
విశ్వాసము. కౌరవులోడిపోవుటకు కారణము - ఇతరము లెన్నియున్నను “పాంచాలీ 
కబరీ వికర్షణ మహాపాపమే” ముఖ్యమైనదట! బ్రాహ్మణులు వారిధర్మమునుండి 
తొలంగినను సరే- యితరులు వారి నగౌరవపరుపరాదనియు పోతన్న విశ్వసించెను. 
'నీధర్మమున నీవులేవు గనుక- నాధర్మము నాకు లేదను” పోటీ యా సాత్వికునకు 
గిట్టదు. ధర్మము వినిమయరూపమైన లౌకిక పదార్థములవంటిది గాదని యాతని 
తలంపు. ప్రాప్తమైనదానితో తృప్తి పడుటయు, రానిదానికి వేకారకుండుటయు - 
పోతన నైజగుణములు. ధనముచేత మదము గల్లుననుట పోతన్న యితరులనుజూచి 
నేర్చుకొన్న నీతి. అందుచే నాతండు, అర్థమున్లై వారి నాశ్రయించుట అమర్యాదకరమను 
భావమును వయసుతోంబాటు బాగుగ బెంచికొన్నాయడు. మణీ ధనికుల 
నాశ్రయింపకున్నచో మనటబ్రతుకు లీడేరుటెట్లు? ఈప్రశ్న కాతండు చక్కని 
యుపాయమును జెప్పెను. అది యిది; 


సీ! కమనీయ భూమి భాగములు లేకున్న వే 
పడియుండుటకు దూదిపఠపులేల? 
సహజంబులను కరాంజలులులేకున్నవే 
భోజన భాజన పుంజమేల? 
వల్కలాజినకుశావళులు లేకున్నవే 
కట్ట దుకూల సంఘంబులేల? | 
కొనికొని వసియింప గుహలు లేకున్నవే 
ప్రాసాద సౌధాది పటలమేల? 


118 ఆం(ధ్ర మహాభాగవతోవన్యానములు 


తే॥ ఫలరసాదుల గురియవే పాదపములు! 
సాధుజలముల నుండవే సకల నదులు! 
పొసంగ భీక్షము వెట్టరే పుణ్యసతులు! 
ధనమదాంధుల కొలువేల తాపసులకు! ' 


ఇది యపాయములేని యుపాయమే! కాని యిట్లు బ్రతుకుటకు యాత్మశక్తి 
గావలెను. మనవంటివారి కీబ్రదు కందని మ్రనిపండ్ల కజ్టులు సాంచుటవంటిది. 
అందుకే- అహోరాత్రములు ధనికులు- అధికారులు- వీరి పంచలుగాచి- వారి 
తిట్లు దీవనలుగా- చీదరింపులు శృంగారములుంగా- (బదుకవలనిన 
దౌర్భాగ్యమేర్చడినది. కడకు మనస్థితి యెక్కడకు వచ్చినదనంగా “పైపద్యమున చెప్పినట్లు 
బ్రదికినవారుండిరి- అని యెవరైన అన్నను “ఆ! యివియన్నయు కట్టుకథలు లెమ్మని 
చప్పరించి వేయుదుము. ఇట్టి విశ్వాసము గలవాండు గనుకనే ఆనాండు పోతన్న 
యితర బ్రాహ్మణులవలె పౌరోహిత్యము సేయుట, హిరణ్యదానములు పుచ్చుకొనుట - 
యిటువంటిపనులకుం దయారైయుండండు. ఈ యభిప్రాయమునే యాతండు 
శృంగికథలో- 


ఉ॥ ఆడడు తన్ను దూషణము లాశ్రమవాసులగాని వైరులన్‌ 
గూడండు, కందమూలములు గూడు గదించు సమాధినిష్టుండై 
వీడండు లోని చూడ్కులను, విష్ణునిదక్క పరప్రపంచమున్‌ 
చూడండు, మద్ద్గురుండు- ఫణిం జుట్టగ నేటికి రాచవానికిన్‌ ॥ 


ఉ॥పోము హిరణ్యదానములం బుచ్చికొనంగ, ఫలంబు లేమియున్‌ 
దేము నవంచనంబులుగ, దీవనలిచ్చుచు వేసరింపంగా 
రాము, వనంబులన్‌ గృహవిరాములమై నివసింపజెల్లరే! 
పామును వైవంగా దగునె బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్‌।! 


అను పద్యములచేత సూచించెను. ఈరెండును పోతన్న సొంతముగం జెప్పినవే! 
నాటి రాజులను జూచినను - ఆతనికంత యాదరములేదు. వా రొనర్చుచుండిన 
యక్రమములు-ఆ నియమశీలి హృదయమును బాకులవలె బాధించుచుండినవి. 


పోతన కవిత్వము ౧ - 110 


ఈవేదననే యాతడు ధ్వనింగా- 


“పుడమిగల జనులు వొగడగ 

గుడుతురు కట్టుదురుగాక కువలయపతులై 

అడవుల నిడుమల బడియెడి 

బడుగుల మెడనిడగం దగునె పన్నగశవమున్‌ ॥ (ప్ర.స్క 469) 


అను పద్యముచేత నిరూపించెను. “బలవంతపు దైవమును” యింత గాఢముగ 
నాతండు నమ్మినను పురుషకారముపైగూడ నాతనికిం బట్టుదల కద్దు. మానవుని 
శక్తి యెంత పరిమితమైనను అది పూర్తి దృణీకరింపందగినదిగాదని, పోతన్న తలంపు. 
పురుషకారము సర్వకాలముల యందును జయించి తీరుననుటకు వీలులేదుగదా! 
దానికి జయములకంటె పరాజయములే యెక్కువ. కనుక ఆ గెలుపునకును యీ 
యోటమికిని పెరుగక- తరుగక ప్రయత్నము నిరంతరము చేయుచుండుటయే 
మానవజన్మ సాధింపవలసిన గొప్ప యోగము. దీనిపై యాతనికి సంపూర్ణ 
విశ్వాసముండెను. జయము లపజయములు సంపదలాపదలు అనిలచలిత 
దీపికాంచలములని వాని వెల నాతడు స్పష్టముగం దేల్చి వేసికొన్నాండు. మానవు. 
డు ప్రపంచమున జన్మనెత్తినందులకు వాండు సాధింపవలసిన ప్రధాన పురుషార్థము 
జన్మరాహిత్యమే! అనంగా మోక్షమన్నమాట! అందుకై వాండు చేతులారంగ శివపూజ 
చేయవలెను. “నోరు నొప్పి బుట్టినను విడువక హరికీర్తిని నుడవవలెనట! ధర్మార్థ 
కామమోక్షములను చతుర్విధపురుషార్థములలో- మొదటి మూటికి- పోతన్న దృష్టిలో 
-దమ్మిడి వెలలేదు. “అన్నియును పురుషార్థములేగదా! మొదటి మూండింటికిని లేని 
(ప్రాధాన్యము - నాల్గవదానికి మాత్ర మొక్కడనుండి వచ్చినది? మానవు డన్నిటిని 
సమగ్రముగ సాధింపవలెనేగాని- పుట్టినప్పటినుండి “ముక్తిముక్తి” యని దానినే 
పట్టుకొని వ్రేలాడినచో రక్తి యేమున్నది? “ముక్తి యనగా- జన్మరాహిత్యమనియేగదా 
వ్యాఖ్య! అనంతమైన యీజగల్లీలలో పాల్గొనక ప్రాణి ముక్తినొంది- మూల కూర్చొని 
యేమిసేయును? మాటిమాటికిని ప్రపంచమున బుట్టి సుఖము- దుఃఖము మొదలగు 
ద్వంద్వముల ననుభవించుటలోనే గదా యానందమున్నది? ఈ మొదలగు 


= 120 '” ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


వాదములకు పోతనామాత్ముండేమియు ప్రత్యుత్తర మొసంగండు. ధర్మార్థ 
కామమోక్షములలో దేని నెక్కువగ మానవుం డాదరించినను- నది లౌల్యమేనని 
చాణక్యుండు స్పష్టముగం జెప్పెను. ఆతనిది సామాజికదృష్టి. ఇట్టి వాదములపై 
మనకవికి సానుభూతిలేదు. జన్మరాహిత్యమును సాధింపక కేవలము- ఉదరపూజయే 
పరమార్ధముంగ మరగనవాని పుట్టుక పోతన్న దృష్టిలో తల్లుల కడుపుచేటు 
ఇతరవిషయములలో వారెంత గొప్పవారయినను పుండరీకాక్షు నెబుంగనివా రందరిని 
పోతన్న- లేని రెండు కాళ్ళను పూరించి పశువులగుంపులోనే జేర్చెను. (ద్వి. 49). 
అతండు చేపట్టిన యీ జన్మరాహిత్య సిద్ధాంతము కొందటికి సంకుచితముంగ దోం 
పవచ్చును. “పోతన్న వంటివాండు యితరుల క్షేమము నేమాత్రము గమనింపక తన 
ముక్తిని మాత్రము వెదకికొని వెళ్ళిపోవుట యేమంత బాగుగలేదు. ఇది తన కాళ్ళకు 
దాను మొక్కుకొనుట వంటిది” అని యడుగుదురేమో! కాని మానవతత్వములో- 
ఎవరెన్ని జెప్పినను - స్వార్థము లేనిది పరార్థము లేదు. స్వయంతీర్లః పరాన్‌తారయతి 
యనుమాట పరమసత్యము. “తాను, తనది, తనకు” అను నీభావములు పైకెంత 
సంకుచితములుగ కనిపించినను యివియే మహాకార్యములను సాధించి- తమకును 
తమతోడివారికిని, క్షేమమును గల్పించినవి. ప్రాచీనకాలమున నీ భావమున్నవారే 
మహాకార్యములం జేసినవారు, చేయించినవారు పూర్వకాలముననే గాదు! నేండు 
జేసినవారు, చేయించినవారు పూర్వకాలముననే గాదు! నేండు గూడ నంతే! 
ప్రాతకాలమున బావులో, సత్రములో గట్టంచినచో పుణ్యమో, కీర్తియో వచ్చునని, 
వానిని నిర్మించుచుండిరి. నేండు 'రావుబహదూరో'”, 'రావుసాహేబో” పేరు వెనుక 
తగిలించుకొనవచ్చునని జేయుదుము. ఆశలో తేడా యున్నను, మూలధర్మమేమో 
యొకటే! ఈ జన్న రాహిత్యమునకు మార్గమేది? దీనికొక్కటే మందు. శ్రీ మహావిష్ణువు 
పాదములను ప్రపన్ను(డై సేవించుట ఇతర దేవతలు త్రిగుణములకు లోంబడినవారు 
వారిని సేవించినచో బలము, అదికారము- మొదలగు వలములను 
బడయవచ్చునేగాని, ముక్తి నొసంగుటకు మాత్రము వారికి, పోతన్న దృష్టిలో- 
నధికారములేదు. విష్ణువు త్రిగుణాతీతుడు. ఆతండొక్కండే భక్తులకు ముక్తి నొసం 
గుట కధికారి. అందుచే- యెయ్యది పొందరాదు. అట్టి మేలు సిద్ధించుటకు హరిభజన 


పోతన కవిత్వము ౧ 121 


సేయవలయునట! ఇతర దేవతలందరును విశ్వమయతలేనివారు. వైయక్తికమైన 
యభిమానము గలవారు. విష్ణువున కివియేవియులేవు. అందుకే యితండు 
విశ్వమయుండు. శ్రీమన్నారాయణుని సేవించు భక్తుండుగూడ (త్రిగుణాతీతుడు 
గావలెను. కనుక విష్ణుభక్తులెల్లరును- దయ, శాంతి, దాంతి మొదలగు 
సాత్వికగుణములను అలవాటు జేసికొందరు. ఆ పిదప వానిని గూడ వదలి 
వేయుదురట! ఈ గుణములపై పోతన్న కభిమానమెక్కువ. అందుకే యిట్టి భాగవత 
ధర్మములను వివరింపవలసి వచ్చినప్పుడు, ఆ సన్నివేశములతో నాతం డెంతయో 
యాత్మీయతను గల్పించికొనును. “సుదాసురా డను నొక మహారాజుండెను. ఆతనికడకు 
వశిష్టుం డొకనాడు దయచేసినాండు. అతని నాతిధ్యమునకై సుదాసుందాహ్వానించెను. 
వశిష్టుండంగీకరించెను. అంతకు ముందొకసారి సుదాసుండు వేంటకుబోయి యొక 
రక్కసుని జంపియుండెను. వానితమ్మునిని ఆ మహారాజు కరుణించి వదలివేసెను. 
అన్నను జంపిన సుదాసునిపై యా రాక్షసునికి పగ. కపటోపాయమున వాండు 
దానిని సాధింపనెంచెను. వాడు మాబువేషమున సుదాసునింట వంటలవాండై 
కొల్చుచుండెను. వశిష్టుండు వచ్చినాండు. ఆ వంటవాండు సుదాసుని కనుగప్పి మనుష్య 
మాంసమును వండి వశిష్టునకు బెట్టెను. దానితో వశిష్టుం డుగ్రుడైపోయి, తప్పు 
రాజుదేనని నిర్ణయించుకొని “నీవు పండ్రెండేండ్లు రాక్షసుండవుగ” మ్మని శాపమిచ్చెను. 
సుదాసునకు తాత్మాలికముగం గోపము వచ్చినది. ఆ కథను పోతన్న యిట్లు 
జెప్పినాండు: 

మ॥। గురువున్‌ మారు శపింతునంచు జలముల్‌ గోపంబుతో దోయిటన్‌ 
నరనాథుండు ధరింపం, దత్సతిపతిన్‌ వారింప, మిన్నున్‌ దిశల్‌ 
ధరయున్‌ జీవమయంబకా నిఖిలమున్‌ దాంజూచి చల్లెన్‌ ధరా 
వరుం డాత్మీయ పదంబులన్‌ కరపుటీవాఃపూరమున్‌ మొక్కుచున్‌. 

ఇట పోతన్న కథనే జెప్పెను. కథను జెప్పినను సుదాసుండప్పుడు పట్టిన శాంతి 

యాతని కెంతయో ప్రియమనుట- ఈ పద్యము నడకయే దెలుపుచున్నది. ఇంతకన్న 
స్పష్టముగ యిట్టి సన్నివేశము చిత్రకేతుని కథలో వచ్చును. చిత్రకేతుండు విష్ణుభక్తుం 
డు. అతం డొకసారి హిమాలయ ప్రాంతముల నేగుచుండెను. అక్కడ నొకచోట 


122 ఆం(ధ మవాభాగవతోవన్యాసములు 


పార్వతీపరమేశ్వరులల నిండుకొలువు. కన్నుల పండువుగం గన్పించినదట! ఆ 
కొల్వులో- భవానిని గౌంగిటం జేర్చికొని పరమశివుండు గూర్చొని యుండెను. ఆ 
దృశ్యమును జూచినదే తడవు చిత్రకేతుండు పకపకమని నవ్వినాండు. పరమశివుం 
డు ప్రాకృతునివలె నిర్లజ్జుండై నలుగురిలో పార్వతిని, యెంత పెండ్లామైనను, 
కౌగిలించికొని కూర్చుండుట చిత్రకేతునకు గిట్టలేదు. వాని నగవు జూచి పార్వతికిం 
గోపమువచ్చినది. “నీవు రాక్షస యోనియందు జన్మింపు” మని యామె, ఘోరమైన 
శాపమిచ్చెను. వెంటనే వాండు విమానమునుండి దిగి, పార్వతీ పరమేశ్వరులకు 
నమస్కరించి, తన దారిని బోయినాండు. వాండు పోయిన వెనుక పరమశివుడు 
పార్వతితో నన్నాండట. “దృష్టంబయ్యెగదా! నారాయణ దాసదాసాను చరుల 
నిసృహభావంబు? హరితుల్యార్థదర్శనులైన నిస్సృహులైన భాగవతులకు 
స్వర్గాపవర్గనరక భేదభావంబులు లేవు. ప్రాణులకు దేహసంయోగంబు వలన 
నారాయణ లీలంజేసియుండి ద్వంద్వాదిసుఖ దుఃఖము లాత్మయందు నజ్ఞానంబున 
భేదంబు సేయంబడియె. ఇట్టి విపర్యయందు భగవంతుండయిన వాసుదేవుని భక్తి 
గలవారింజెందవు. 


మరియును- 


ఉ॥ “నేను గుమారనారదులు నీరజగర్భుండు దేవసంఘమున్‌ 
మానితయోగివర్య మునిముండల మిట్లగువార మందణున్‌ 
దానవ విద్విడంశ జనితంబులమయ్యుం దదీయతత్వముం 
గానంగనేర మీశు ఘనగర్భమునం దలపోసి చూచుచున్‌.” 


క। “ఆతనికిం బ్రియుం దప్రియుం 
డే తెజంగునలేండు నిఖిల మెల్లను దానై 
భూతముల కాత్మయగుటయు 
బూతప్రియుండొక్క డాదిపురుషుండు తన్వీ.” 


ఆ.వె. “అరయం జిత్రకేతుం దతిశాంతుం డతిలోక 
సముండు విష్ణుభక్తి సంగతుండు 


పోతన కవిత్వము ౧ - 123 


నితనినేమి సెప్ప! నీశుండనగునేను 
నువిద! యచ్యుత ప్రియుండ జుమ్మి.” 


క! “కావున భగవద్భక్తుల 
భావమునకు విస్మయంబు పనిలేదు మహా 
ధీవిభవ శాంతచిత్తులు 
పావన పరతత్వనిపుణ భవ్యులు వారల్‌.” 


ఈ కథలన్నియు పోతనామాత్యుం డెన్నిసారులు జదివెనో యెరుంగము. అందుచే 
నాతని జీవితమున నీగుణములన్నియు నైజములైనవి. అన్ని మాయలకంటెను, 
వైష్ణవమాయ ప్రభావము చాల గొప్పది. తక్కిన మాయలన్నియు నీమాయకు క్రిందే! 
దీని యాజ్ఞను దాటుటకు దేవేంద్రాడులకును సాధ్యముగాదు. యశోదాదేవి. యీ 
మాయకు జిక్కి కృష్ణపరమాత్ముని కేవలము తన కొడుకని భావించినది. 
విశ్వరూపమును బొందిన వెంటనే యామెకు ప్రజ్ఞగలిగెను. ఆ యశోద కృష్ణుని 
పరమాత్మునిగ స్తుతింప మొదలుపెట్టిను. తన యవతార కార్యమునకు 
భంగమువచ్చునేమోనని కృష్ణునకు భయమయ్యెను. అందుకై యాతండు వైష్టవమాయను 
బొందించినాడంట! వెంటనే యామె; 


క “జడను పడి, యెబుక సెడిి యా 
పడతుక సర్వాత్ముం డనుచు పలుకక, యతనిన్‌ 
కొడుకని తొడపై నిడికొని 
కడువేడుకతోడ మమతగావించినట! (ద.348) 


అందరికన్నను యెక్కువగ వైష్ణవ మాయతో దెబ్బ దిన్నవాండు పరమశివుడు. 
దేవరాక్షసుల కమృతమును పంచుటకయి హరి మోహిన్యవతారమెత్తినాండు. 
అమృతమును సాధించి దేవతలకొసరాను. ఈసమాచారము పరమశివునకు తెలిసినది. 
అతండు విష్ణుమూర్తి యొక్క “మగపోడుములే గాని “యాడు చందంబు” నంతవరకుం 
జూచినది లేదట! ఆస్వరూపమును జూతమని యాతని కతుకము. “మగవాండై 
జగములను దగిలిచి చిక్కులను బెట్టుదంట మగువ తనము ధరించినచో నీ 


124: ఆం(ధ మవోభాగవతోపన్వానములు 


జగములెట్లగునో? చూడవలె” ననుకొని శ్రీమహావిష్ణువును ప్రార్థించినాండట! అపుడు 
విష్ణువు భావగంభీరమగు నవ్వునివ్వటిల్ల వాసుదేవునితో నిట్లనెను: 


శా॥। శ్రీకంఠా! నినునీవ యేమజకుమీ! చిత్తంబు రంజించెదన్‌ 
నాకద్వేషుల డాగురించుటకునై నాండేనుగైకొన్న కాం 
తాకారంబు జగన్నిమజ్జనము, నీకై చూచెదే, చూపెదన్‌ 
గైకో నర్హములండ్రు కాముకులు సంకల్ప ప్రభావంబునన్‌ 
(6. 391) 


అంతే. కమలలోచనుండు మణి లేండు. ఉమాసహితుండైన భవుండు విష్ణుం 
డెట బోయ్మెనో యని దిక్కులు జూచుచున్నాండు. ఎదుట నొక ప్రీ మూర్తి గనుపడినది. 
పరమశివుని కిక మతిబోయినది. పార్వతి యెదుట నున్నది గూడ మజచి - 
యామగవాండు - మగువ వెంటం బడెను. పార్వతి యపు డెట్లయ్యెనో, యేమనెనో 
కవి చెప్పలేదు. పోతన్న పార్వతి మంచిది. పాపము! శివుండు వెంటంబడి మోహినిని 
బట్టుకొనెను. ఏమున్నది. విష్ణువు పకపక నవ్వెను అట్టిది వైష్ణవమాయ! 

దురంతమైన యీ వెష్టవమాయ దాటనిది ముక్తిలేదుగదా! మరి దీనిని 
తరించుట కుపాయము? ఉపాయ మాతనిదయయే! ఆయన దయకలుగుటకు 
మార్గము? మార్గమొక్కటే! శరణాగతి! జ్ఞానము- మొదలగు మార్గాంతరములపై 
పోతన్నకు గౌరవమేమోగాని- అనుసరింతమను ఆశలేదు. అవి యపాయకరములైనవని 
గూడ యాతని భావము. అందుకే, ' 


క “ఎతీంగిన వారలమనుచును 
కొజమాలిన యెజుకలెణింగి కొందరు నీపే 
రెజింగియు దలపంగ నొల్లరు 
పజతురథో గతులజాడ పద్మదళాక్షా” (ద.స్మ. 94) 


అని హృదయమును వివరించి పలికెను యమము, నియమము మొదలగు 
యోగములందు గూడ పోతన్నకు (శ్రద్ధ తక్కువ. వీనిచేత బలవంతముగ 
నియంత్రితమైన యాత్మ శాంతి వహింపదట! మరల కామరోషములచేత ప్రచోదితమే 


పోతన కవిత్వము ౧ 125 


(ప్రథ.స్మం. 132) యగునట! భగవద్భజన మొక్కటే వైష్ణవ మాయను తరించుటకు 
నిజమైన మార్గము. కులధర్మము, జాతిధర్మము మొదలైనవి భగవచ్చేవలేనిది 
శోభింపవు. కులధర్మమును వదలినవాండు భక్తిని సాధించినచో మజుజన్మమం దైనను 
సిద్ధినిబొందును. భక్తిలేని కులధర్మ గౌరవము ఊసరక్షేత్రమున విత్తిన విత్తువంటిది 
(ప్ర.100) ఈ తత్వము నెటింగినవారు గనుకనే- ధీరులు, నిరపేక్షులు, 
ఆత్మారాములునైన మునులు. (ప్ర. 188) హరిభజనమును నిష్మారణముగనైన 
జేయుచుందురు. కాయక మానసికములైన సేవ లెన్నియునున్న 


నీ యధీనములుంగా నిఖిల కృత్యంబులు 
ప్రియభావమున సమర్పింపందేని... (స.867) 


అను సేవయే పోతన్న దృష్టిలో నుత్తమోత్తమమైన సేవ. ఈ సేవకు శాంతిదాంతు 
లంగములు. భగవంతుని సేవించుటలోంగూడ బాహ్యవస్తువుల యూడంబరము 
కంటెను సాత్వికమైన, మానసికమైన పూజ. పోతనామాత్యులకు చాల ప్రియమైనది. 
ఇతరులు తన్ను నిందించినను మరల బదులు సేయవలెననుట, అతనికంత ప్రియమైన 
యూహగాదు. దాని నోర్చుకొనుటయే పోతన్నకు సమ్మతమైన మార్గము. పైగా 
మానవునకు కష్టములు ప్రాప్తించుటయు, ఆ మానవుని జక్కదిద్దుటకేనని యాతండు 
నమ్మెను. అందుకే పోతనామాత్యుండు దయారు చేసిన పరీక్షిత్తు తనకు శాపమిచ్చిన 
శృంగిపై గోపపడినవాండు కాదు. శృంగి దనకు శాపమిచ్చినాందని తెలిసినది. 
అపుడు పరీక్షిత్తు యిట్టనుకొన్నాండట: 
కం॥ ఏపారునహంకార 

వ్యాపారములందు మునిగి వర్తింపంగా 

నా పాలిటి హరి, భూసుర 

శాప వ్యాజమున ముక్తసంగున్‌ జేసెన్‌. (ప్ర. 500) 


కవిదృష్టిలో కలియుగమునందలి మానవులు మందబుద్ధి తరులు. అల్చతరా 
యువులు. చాలనిదానికి నుగ్రరోగ సంకలితులు గూడ. వారికి భక్తిదప్ప 
యితరమార్గము లాశ్రయించుటకు కావలసిన మనశ్శక్తియు నాత్మశక్తియు తక్కువ. 


126 -“ ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


“కాలము భగవత్స్వరూపముగదా! అందుచే నాకాలము మంచిది; యిది 
చెడ్డదని వింగడించుటలో సుజ్ఞానముకన్న అజ్ఞానమే యెక్కువ యున్నది. గొప్పవారు 
ప్రతికాలమునను బుట్టుదురు. అట్లే యల్పులు గూడ! కలియుగమున బుట్టినవాం 
డెల్ల. పాపియనుట త్రాటిచెట్టు క్రింద గూర్చున్న వాడంతయు త్రాగుబోతే 
యన్నట్లుండును”. ఇట్టి హేతువాదములపై నామహాకవికి శ్రద్ధ లేదు. మనముగూడ 
నంతబాధపడవలసిన పనిలేదని నామనవి. కారణమేమనంగా నీ వింగడింపులో 
మనకొక గొప్పలాభమున్నది. ఇతర యుగములలో సాక్షాత్తుగ మంచి పనులు 
జేసినగాని పుణ్యములేదట! కలియుగములోం బుట్టిన మనవంటి వారికి మాత్రము 
ఆబాధలేదు. గుట్టుచప్పుడుగా మంచిపనులు జేసెదనని మనసులోం దలంచుకొనుచున్న 
జాలును. రావలసిన పుణ్యముయొక్క వాటా నిరాక్షేపముగా లభించును. ఇది చాల 
సులభమైన యుపాయము! టేపటి నుండి మనమందర మిండ్లలో గూర్చొని 
యదిచేయవలె, నిదిచేయవలెనని యనుకొనుచున్నచోం జాలును. మన పొరుగింటి 
వానికింగూడ దెలుపక పుణ్యమును ప్రోవుజేసికొనవచ్చును. వైకుంఠద్వారములు తప్పక 
దెజచికొని తీరును. (ప్ర.442) 

పరకాంతలవలెనే పరధనము లన్నను అతనికి భయమే! తన నుండి యే పీడ 
యెవ్వరికి గలిగినను మేరువు నెత్తిపైంబడినంత వేధ యామనస్సునకు! తాను నమ్మిన 
విశ్వాసములపై నాతనికి సందేహము లేదు. అవి హేతువాదముల కెంత యాగనివైనను 
వానిని మనస్ఫూర్తిగ నమ్మి యాచరించెను. ఆచరించి తరించెను. మనమీనాండు 
హేతువాదమును గౌరవించినంత హృదయమును మన్నించుటలేదు. వాని 
పరిణామమేమైనది? దేనిపైనను జూపులేదు. ప్రామాణ్య బుద్ధి లేదు. జీవితము 
తెగిన గాలిపటమువలె యెక్కడకుం బట్టిన నక్కడకు బోవుచున్నది. పోతన్న విశ్వాసశీలి 
గనుకనే యా విషయము జెప్పవలసి వచ్చినపుడెంతయో స్పష్టముగం జెప్పును. 
ఒక్కొక్కసారి యా స్పష్టతకు మనమనస్సులు బాధపడును. పడినను ఆతనికి లెక్కలేదు. 
తన తలంపు నెదుటిహృదయముపై స్పష్టముగ ముద్రింపవలెనని యాతని యాశ! 
ఈక్రింది పద్యమును జూడుడు- 


పోతన కవిత్వము ౧ 127 


మ హరి జింతింపక మత్తుండై విషయ చింతాయత్తుండై చిక్కి వా 
సరముల్‌ ద్రోసెడివాండు కింకరగదా సంతాడితోరస్ముం డై 
ధరణీశోత్తమ! దండభృన్నివసన ద్వారోప కంఠోగ్రవై 
తరణీవష్ని శిభాపరంపరలచే దగ్గ్భుండు గాకుండునే ॥ (2-24) 


కం॥ మొత్తుదురు గదల, మంటల 
కెత్తుదు, రడ్డంబు దేహమింతింతలుంగా 
నొత్తుదు, రసిపత్రికలను 
హత్తుదురు కృతాంతభటులు హరివిరహితులన్‌ ॥ (ద్వి. 25) 


ఈ పద్యములలో జెప్పిన నరకము - యమకింకరులు - వైతరణి యను 
పదార్థములను మనము నమ్ముచున్నామా లేదా? యను విషయమాతని కక్కణలేదు. 
తాను నమ్మెను. మనమును నమ్మవలెనని యాతనియాశ. మమారాష్ట్రమందలి 
తుకారాముండుగూడ యిట్టి విషయములం జెప్పునపుడు మానవులను భయపెట్టుచు 
మాటాడును. తేలికంగాం జూచి _పలుకరించును. అట్టి చోటులలో మన 
యహంకారమును గౌరవించికొని వారిపైం గోపించిన లాభములేదు. లేక “వీనిని 
చదువ” మని బహిష్మరించినను నష్టము మనకుగాని వారికిగాదు. మేతువాదైక 
ప్రాణులమైన మనము వీనికి వెల యిచ్చినను యివ్వకున్నను యిట్టి విశ్వాసములతోనే 
వారు మహనీయులైరి. మనము సంశయములతో, అపనమ్మకములతో దినదినమును 
యమయాతనలు సత్యమైనను కాకున్నను వానివంటి బాధలనే యనుభవించుచున్నాము. 
ఒక మానవుండు మతియొకనిని యుద్ధరించుటకో, క్రుంగదీయుటకో సమర్భుండని 
పోతన నమ్మలేదు. అంతేగాక యరక్షితులైన భక్తులను సంరక్షించుటకు సర్వదా 
భగవంతుండు సన్నద్ధుండై యున్నాండు గనుక, తనవంటి మానవుని “నీవు నాకు 
తోడుపడు” మని యర్థించుట భగవంతునియెడ నపచారమనియు నాతని యూహ! 
అందుకే 


కం॥ రక్షకులు లేనివారల 
రక్షించెదననుచు చక్రి రాజై యుండన్‌ 


128 "ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


రక్షింపుమనుచు నొకనరు 
నక్షము బ్రార్థింపనేల నాత్మజ్ఞులకున్‌ ॥ (ద్వి 22) 


అని ధైర్యముగం జెప్పినాండు. లోకసుఖములు వానికొజికు చేయు సకామభక్తి, 
దానికొజ కేర్పజచు కొన్ని యన్యదేవతలు, వీనిపైగూడ నతనికి తాత్పర్యము శూన్యము. 
“ఎయ్యది పొందరాదు? అట్టి మేలు సేకూరుటకు హరిసేవ సేయవలయు” అనునది 
యా మహానుభావుని విశ్వాసము. కాని దేవతాంతర నింద చేయగూడదనుటయు, 
ఆతని నియమమే! అట్లే తన యభిప్రాయముతో నేకీభవింపని వారిపైగూడ 
దండెత్తవలెనను పట్టుదల యాతనికి లేదు. అట్టివారిని జూచి “పొందొల్లనివారు 
కర్మపుంజము పాలై” యని పోతన్న యుపేక్షించును. భాగవతము నందంద టిజిం 
గిన ప్రసిద్ధమైన పద్యమిది- 
కం॥ నీ పాద కమలసేవయు 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం 

తాపార భూతదయయును 

తాపసమందార నాకు దయసేయగదే॥ 


మూండు మాటలలో6 జెప్పవలెనన్నచో యీపద్యమే పోతన్న జీవితమునకు వ్యాఖ్య. 
అతం డీట్లే బ్రదికియుండును. ఇంతవరకును మనము విశదీకరించుచు వచ్చిన 
విషయములబట్టి పోతన్నకు వచ్చినది చదువే గాదనియు- ఆతని యితరములైన 
యోగ్యత లంతకన్నను గొప్పవనియు జప్పినట్లయినది. ఇట్టివారే బుషులు - భవభూతి 
మహాకవి జెప్పిన- 

“లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే 

బుషీణాం పునరాద్యానాం వాచమర్శో నుధావతి |” 


అను శ్లోక మీకోవకు జెందినవారిని గుజించియే! పోతనామాత్యుం డిట్టి బుషికవియే 
యను నిశ్చయము నాటికిని నేటికిని జనులలో ప్రచారమునందున్నది. అందుకే 
యట్టి కథలు కొన్ని బయలుదేరినవి. వానిలో నొకటి యిది. 


పోతన కవిత్వము ౧ 129 


“ప్రోత్రన్న భాగవతమున రుక్మిణీ కల్యాణఘట్టమును వ్రాయుచుండెనట!” 
దానిలో 


“హరికి ప్రేమబంధ మధికంబుగా కేశ 
బంధ మధికమగుచు భామకమరె”... 


ఈ సమయమునకు సరిగా వంటయింటిలో ప్రొయ్యిదగ్గజ నాడుకొనుచున్న పోతన్న 
బిడ్డ ప్రాయ్యిలోం బడినది. ఆమె శరీరమంతయు కమరునట్లు కాలినది. భార్య యా 
విషయమును పోతన్నకు దెలిపెను. అతండు తన వ్రాంతనుండి లేవనేలేదు. వెంటనే 
మూడవ చరణము. 





“పద్మనయనువలన [పమదంబు నిండారి యని పూరించినాండు. అంతలో 
నాపిల్లకు దగిలిన గాయములన్నియు మాయమైపోయినవి.” ఏదో కట్టుకథ. పోతన్నకు 
బిడ్డయుండెనో లేదో మనమెజుంగము. 'బాలకు+అమరె అనుచోట 'కమరె” అను 
అమంగళార్థము - పని గట్టుకొని యీడ్చిననే తప్ప- తోంచునదిగాదు. నిష్కర్షగా నీ 
కథ యెవరో యజ్ఞుని కల్బనయని దానిముఖమే జెప్పుచున్నది. కాని దీని నిటనెందుకు 
జెప్పితి ననంగా జనసామాన్యమునకు పోతన్నపైనున్న దృష్టి యిట్టిదని చూపుటకు 
వారి తలంపులలో నాతండేదోనాల్టు ఛందస్సు ముక్కలు చప్పరించి- తోంచినదెల్ల 
కవిత్వమని కలిపి కొట్టినవాండుగాండు. “మహా తపస్వి”, “వశ్యవాక్కు”, 
“శాపానుగ్రహదక్షుడు”. ఇంతయయ్యును పరమసాత్వికుండు. మరి యీ 
స్థితికాతండు వచ్చుట కెన్ని సంవత్సరములు బట్టినది? ఏమో! ఒక్కటి మాత్రము 
నిజము. ఆతండు పొందిన యీ సిద్ధి మూండునాళ్ళలో సాధింఛినది మాత్రముగాదు. 
కామక్రోధాదులతో - బాహ్యమైన నమాజముతో - యౌవనముతో- 
పోతనామాత్యుం డెంతయో బాధపడియుండును, గజేంద్రమోక్షములో కరిరాజు 
యీపద్యములం జెప్పెను- 

" కం॥ కలండందురు దీనులయెడ 
కలలండందురు పరమయోగి గణములపాలన్‌ 


130. ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


కలండందు రన్నిదిశలను 
కలండు కలం డనెడువాండు గలండొలేడో? 


కం॥ వినుదట జీవుల మాటలు 
చనుదట చనరానిచోట్ల, శరణార్థులకో 
యనుదట పిలచని, సర్వము 
గనుదట! సందేహమయ్యె! కరుణావార్డీ! 


ఈ పద్యములు జెప్పినది గజరాజని మనమనుకొనుచున్నను- యీ భావములు 
పోతనామాత్యుం డెన్నియోసారులు హృదయమున శంకించుకొన్నవే! ఏ సాధకునికైనను 
యీసితితప్పదు. కాని యింతలో యనుత్సాహము జెందక నతండు ద్విగుణీకృతమైన 
పట్టుదలతో జన్మ యంతయు సాధించెను. సాధించి భాగవతము నందలి 
సుతలాధీశ్వరుందైన యింద్రసేనుం డన్నట్లు- 


మ॥కో!! కంటి కంటి భవాబ్ధి దాటక గంటి, ముక్తి నిధానమున్‌ 
కంటి, నీ కరుణావలోకము కంటి, పాపమువీడ, ము 
క్కంటి తామర చూలియున్‌ బొడగాన నట్టిమహాత్ము, నా 
యింటికిన్‌ జనుదెంచి తీశ్వర యే కృతార్థతం బొందితిన్‌. 


(ద.ఉ. 1152) 
అని తృప్తిగ నానంద భాష్పములు రాల్చగలిగెను. ఆతనికి- 

“హరిమయము విశ్వమంతయు 

హరి విశ్వమయుండు సంశయము పనిలేదా! 

హరిమయముగాని ద్రవ్యము 

పరమాణువు లేదు... (ద్వి17). 


అన్న భావము- అడుగడుగునను భాసింపదొడగెను. మన ప్రాచీననులది భల్తూకపుం 
బట్టు, రక్తివిరక్తులలో నేది బట్టిననుసరే- వారు కడజూతురు. నేటి మనయావేశములు- 
“సోడా పొంగు వంటివి. చూచుచుండగనే పొంగినంత క్రుంగిపోవును. మనకుం 


పోతన కవిత్వము ౧ 131 


గావలసిన ప్రతి చిన్న పనియు- నెవండొ వీరభోగ వసంతరాయలు- చేసి పెట్టవలెను. 
ఈ సోమరితనమును సమర్థించుకొనుటకు- వేయి కారణములను ద్రవ్వెదము. 


ఇంతవరకును మన మూహించికొన్నంత దంతయు పోతనామాత్యుల 
యూహాచిత్రము. అంతేగాని చారిత్రకముగా నాతని గుజించి మన కేమియు 
దెలియదు. ఒక్క విషయము మాత్రము గట్టిగం జెప్పవచ్చును. అతండు దరిద్రుండు 
ఇది మాత్రము సీకెట్లు తెలియనందురా? అందున కుపస్ఫోరకమిది కృష్ణ భగవానుం 
డు ద్వారకకు వచ్చినాండు. 

ఆ సందర్భమున వ్యాసు లిట్లు వర్ణించిరి. 

“పత్చ్యః పతింప్రాష్య గృహానుపాగతం 

విలోక్య సంజాత మనో మహోత్సవాః 

ఉత్తస్థురారా త్సహసాసనాశయిః 

సాకంవ్రతైః వ్రీడితలోలలోచనాః 

తమాత్మ జైర్థష్టి భిరంతరాత్మనా 

దురంతభావా, పరిరేఖిరేపతిం 

నిరుద్ధమ ప్యాస్రవ దంబునేత్రయా 

ర్విలజ్జితానాం భృగువర్య! విక్లబాత్‌! 
-వ్యాసుడు కృష్ణుని యంతఃపురమును 'సర్వకాంతి యనియు 'అనుత్తమి యనియు 
బలికెను. పోతన్నయును పురుషోత్తమునకు సువర్ణసౌధమునే గట్టినాండు. కాని 
యంతతో నూరకున్న బాగుండెడిది. అతండు భార్యల యోగక్షేమముల విచారింప 
మొదలుపెట్టను. అందులో మొదటి పద్యమిది. 


మ॥ కొడుకుల్‌ భక్తివిధేయు లౌదురుగదా! కోడండ్రు మీ వాక్యముల్‌ 
గడవంజాలక యుందురా! విబుధ సత్మారంబు గావింతురా! 
దొడవుల్‌ వస్త్రములున్‌ పదార్థరససందోహంబులున్‌ జాలునా 
కడమల్లావుగదా! భవన్నిలయముల్‌! కల్యాణయుక్తంబులే! 


132 ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


-దీనిని జదివినప్పుడు వైభవావతారుండైన కృష్ణుని భార్యలకు గూడ- కూడు గుడ్డల 
కొణత దప్పక పోయెగదా- యని నాకుమాత్రము పట్టరానంత నవ్వు వచ్చినది. 
ఇందులో నున్న దారిద్ర్యము నిశ్చయముగ పోతన్నదే! అది- వాసుదేవుని యంతః 
పురమున గూడ దొంగిచూచినది. 


పోతన్న జీవితము- అతని కాలము- మొదలైన విషయములను గుటించి 
మనకన్ని సందేహములున్నను- అట్టి మహావ్యక్తి యొకడుండుట మనభాష 
కలంకారము. దినమున కొక్కసారిదైైన నామహనీయుని పేరుదలంచి 
నమస్మరించికొన్నచో మానవుడు కృతార్థుండగుననుటలో సందేహము లేదు. మన 
మింతవరకును జేసిన దాపనియే. 


సంస్కృత భాగవతము 


పోతన కవిత్వము ౨ 


శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు 


పోతన కవిత్వము ౨ 135 


పోతన కవిత్వము ౨ 


మ॥। లలిత స్కంధము, గృష్ట మూలము, శుకాలాపాభిరామంబు మం 
జులతా శోభితమున్‌ సువర్ణ సుమన స్సుజ్లేయమున్‌, సుందరో 
జ్వల వృత్తంబు, మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై 
వెలయున్‌ భాగవతాఖ్యకల్పతరువుర్విన్‌ సద్విజశ్రేయమై 11 
(భాగవతము) 


వ్యాసమహర్షి యెన్ని పురాణములు వ్రాసినను చిత్తమునకు శాంతి చిక్కలేదట! 
ఒకనాండాయన, చింతతో, మొగము ట్రేల వేసికొని కూరుచున్నాండు. నాదుండప్పుడు 
దిన్నగ రంగమున (బ్రవేశించెను. దేవతలలో నాతండొక విచిత్రవ్యక్తి. ఎంత 
హాస్యప్రియుండో, అంతా జ్ఞానప్రదాత. చింతతో చీకాకు పడినట్లున్న వ్యాసుని 
మొగమును జూచి, యతని మనో వైకల్యమునకు కారణమును నారదుండు బ్రశ్నించెను. 
తన మనస్సుకలంత పడుచున్నదని వ్యాసుండు బదులు పలికినాండు. అప్పుడు నారదు6 
డు 'ఓయి! మునీ! నీవు వేదార్థములనన్నింటిని ప్రపంచించితివి. పాపము! వేదములను 
విభాగించితివి. కాని, వానిలో “నించుకయైన విష్ణు కథలేర్చండ జెప్పిన” వాండవు 
గావు. ధర్మములు ప్రపంచించినంత మాత్రము, చిత్తమునకు శాంతి లభించుననుటకల్ల! 
భక్తిరస ప్రధానమైన గ్రంథమున వ్రాయు"మని చెప్పెను. అపుడు, జ్ఞానమే సర్వథ్రేష్టము. 
మేధయే సర్వమనుకొన్న యాబుషి హృదయమును గ్రుమ్మరించి భాగవతమును, 
రచించెను. అది బ్రహ్మసమ్మితమైనది. నిజమే! హృదయ సంవాదములేనిమేధ, ఆకాశ 
ప్రయాణములెన్ని చేసినను, అవనికి దిగిరావలసినదే! ఈ భావమే భాగవత రచనకు 
మూలము. అందుకే యది పురాణ రత్నమైనది. పోతన్నయు 


“భాగవతము దెలిసి పలుకుట కష్టంబు 
శూలికైన తమ్మి చూలికైన 

విబుధ జనులవలన విన్నంత గన్నంత 
దెలియవచ్చి నంతదేంట పజతు” 


136 ఆంధ్ర మవోభాగవతోపన్యానములు 


-అని స్పష్టముగ జెప్పెను. కృష్ణుని యవతారమందఖజ కర్థముగాదు. 
ఆతండు పూర్ణపురుషుండు. అడుగడుగునను, పరిమితమైన బుద్ధి నాతండపహాస్యము 
సేయును. అట్లే భాగవతము గూడ, యెత్తిన వారిచేతి బిడ్డగాదు. “ఒక మాట, ఒక 
బాణము” గల రామపరబ్రహ్మము, అందరకు నందుబాటులో నుండువాండు. 
రామునివలెనే, రామాయణ రచనయు నొకటే తిన్నని మార్గము నాశ్రయించినది. 
కృష్ణపరమాత్ముండట్టి, సులభుండుగాండు. ఆ జీవితమున నెన్నియో యెగుడుదిగుడులు. 
అతండు మహాయోధుండు. పిటికివాండు. పదునాటు వేలమంది భార్యలతో 
కాపురమీడ్చినవాండు. ఇన్ని యుండియును బ్రహ్మచారియట త్యాగభోగముల రెంటిని 
గడం జూచినవాండు అతని ధర్మాధర్మముల వింగడింపు మన మనుకొనునది గాదు. 
కృష్ణుని పాప పుణ్యములకు, అడుగడుగునను, అతండే భాష్యము జెప్పవలయును. 
రాముండభిమానించి, యాదరించినది, దాస్యభక్తి యొక్కటే! అతని యా॥శితులు -. 
హనుమంతుండు, సు(గ్రీవు(డు, విఖీషణుండును, అందటు శరాణగతులు. కృష్ణుని 
పరివారములో, నాకసమున నెన్ని చుక్కలో, యన్ని భేదములు: అతని వంటిదే, 
యతని కథయైన భాగవతమును, ప్రాకృతకావ్యములను జదివి యానందించుటకును 
కుందపుష్పమాల గ్రుచ్చుటకును, కుపితయిన ప్రియురాలి నోదార్చుటకును, తెలిసిన 
యదృష్టశాలురు కొందటేనట! ఒకానొక ప్రాకృత కవి సవాలు! అట్లే కృష్ణభక్తి 
నెజపుటకును, భాగవతమును పఠించుటకును, అధికారులు కొందటే! భాగవత 
మన్నిభాషలయందును గలదు. కాని, కొన్నిటిలో మాత్రమే యది, సమర్ధులైన కవుల 
చేతంబడినది. కన్నడము నందును భాగవతమే గలదు. కాని, దానియునికి, 
సదసత్సంశయ గోచరము. కుమారవ్యాసుని భారతమునకు, యితర వీరశైవ 
కావ్యములకు వచ్చినంత (ప్రచారము, భాగవతమునకు రాలేదు. తమిళ 
భాగవతమునకు గూడ నింతేగతి. ఆ భాషలో నాయనార్లు, ఆళ్వార్లు- వీరు రచియించిన 
భక్తిరచనలకే ప్రథమ తాంబూలము. వాని తరువాత నట్టి గౌరవము కలిసివచ్చినది. 
కంబరామాయణమునకే! భారత భాగవతములకు గాదు! భారతమున కంటె 
భాగవతమునకు మణియు వ్యాప్తి దక్కువ. కేరళ దేశమున మాత్రము, భాగవతము, 
ప్రజాదరణమును, గౌరవమును జూరగొన్నది. దానిని రచించిన మహాకవి “ఎజుత్తచ్చన్‌” 


పోతన కవిత్వము ౨ 137 


మహారాస్త్రమునందేకనాథుండు - భాగవతమును రచించెను. హిందీలోని “సూర 
సాగరము” ప్రసిద్ధమే. ఒరియా భాషయందును, అచల దాసనుకొందును, 
భాగవతమును వ్రాసినారట! అది ప్రసిద్ధమైనదేనని వారందురు. కాని, యిన్ని 
భాగవతములున్నను, వీనిలో వేనికిని బట్టని యదృష్టము, ఆంధ్ర భాగవతమునకే 
బట్టినదని నా యూహ! 


పాయియకత్వం పడిడడం, గుంఫేఉం, తమయకుజ్ఞ పసూణం 
కునియంచ పసాయేవుం, అజ్ఞని బహవేణ యాణంతి (వజ్జలగ్గ) 


ఏకనాథుండు తన భాగవతమునందు బ్రహ్మాండముగ పెంచి వ్రాసినది కృష్ణోద్దవ 
సంవాదమునే! తక్కిన కథాభాగము నంతయు జాల టూకీగా వెళ్ళగొట్టినాండు. 
“ఎచుత్తచ్చన్‌ వ్రాసిన భాగవతమునకు, వర్ణనావైపుల్యమునను, కథాసంవిధానమునకు 
పోతన్నతో పోటీ లేదు. అతని రచనలోను దశమస్మంధ మొక్కటే పెద్దది. ఇంక 
నూరదాను గ్రేవోన్నాది. అతని బావములు నము(ద్రమున లేచు 
నుత్తాలతరంగములవంటివి. హృదయ లాలిత్యమునకు, భావోన్మాదమునకు ప్రతీకమైన 
సూరదాసునకు భావముల నదుపులోనుంచుకొను వశిత్వము తక్కువ. తలంంపు 
లెట్లీడ్చిన నాతండట్లు పరువెత్తిపోవును. ఒక దశమస్మంధము మాత్రమే యాతని 
కవితోద్యానమున విరిసి పూలుబూచినది. తక్కినవన్నియు రసమును మూతిముట్ట 
వెలిచినవే. దశమస్కంధము నందును యొక దారి యొక తెన్ననిలేదు. తోచినది 
తోచినట్లు వర్ణింపంబడెను. ఒరియాలోని భాగవతమును నేను చదువలేదు. అరవము, 
కన్నడము వీనిలో భాగవతము లున్నవనిగూడ చాలమందికి దెలియదు. కారణమేమన 
నా గ్రంథకర్తలు తపస్వులు గారు. కవితానిర్మాణమున నందెవేసిన వారునుగారు. 
రెంటను సమర్భుండైనవాండు తెనుంనందలి పోతనామాత్యుండొక్కండే! ఆతండు పవిత్రుం 
డైన తపస్వి కవితలో నెన్ని పోకడలైనను బోంగలవాడు. పైంగా, భావగతముల 
నదుపులోనుంచికొన్న నియమశీలి! పోతన్న జీవితమును రామోపాసనతో నారంభించుట 
మనపుణ్యము. ఉపాసన యనయా, దానునమ్మి రామునినో, కృష్ణునినో- “పాడుచు, 
పొగడుచు నాతని దివ్యచరిత్రములను వినుచు జూచుచుండుటయేగదా! అట్లు 


138 . ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు 


_ సేయుటలోనా యుపాసనామూర్తి యొక్క గుణములు, అభిరుచులు, భక్తున కత్యంత 
ప్రియములై కొంతకాలమునకు, వానిస్వభావము గూడ నట్లే మారుటయు గలదని 
పెద్దలందురు. ఆ భావములు ప్రంచముగ నెదిగినపుడు, రూపురేకలు గూడ నట్లే 
యగునట! భ్రమర కీటక న్యాయమిదే! ఈ విషయములు, మన యూహకందవుగాని, 
హనుమంతుని దీవ్రముగ భావించిన వాళ్ళలో, రామకృష్ణ పరమహంసకు, 
తిన్ననితోం యొకటి బయలుదేరెనట! రాధా దేవీధ్యానమునందు నిమగ్నుండైన 
'చైతన్య ప్రభువునకు 6 దాను మగవాండనుట, యెప్పుడోదప్ప జ్ఞాపకమునకు 
వచ్చెడిదిగాదట! రెండవదేమోగాని, మొదటి విషయము మాత్రము, పిల్లల కందటి 
కనుభవములో నున్నదే! వారప్పుడప్పుడు, తోంకలేకయే హనుమంతులగుదురు. కొన్ని 
వేళలలో, పెద్దలము గూడ. 


అట్టి యుపాసకులు, భక్తులు, కవులైనపుడు, వారి రచనలలో నా విభిన్న 
తత్త్వములును, ప్రతిఫలించుననుటలో, పెద్ద విశేషమేమియు లేదు. ఇట్లు, 
అద్దమునందు నీడవలె, ప్రతిఫలించిన పట్టులు, సంస్కృత కవులలోను గలవు. 
దేశభాషా కవులయందును నున్నవి. లీలాశుకుని కృష్ణ కర్ణామృతమునకుం దెలిసినదే! 
అట్టిది మా రామునకేల లేకపోవలెనని యెవరో రామకర్ణామృత మల్లిరి. కాని 
“కర్ణామృతము మాత్ర మడిగాలేదు. దానిపోకడ వేరయినది. రామోపాసకులైన 
కబీరు, తులసీ, రహీము మున్నగువారి రచనలకును, మీరా, సూర, రసఖాన్‌ మొదలగు 
కవులకును పోలికలే యుండవు. త్యాగయ్య, క్షేత్యయ్యలకు పోలికలేవీ, కృష్ణభక్తులు 
విశ్చంఖలులు, ఉన్మాదులు. అందుకే కృష్ణోపాసకుల రచనలు, అపుడపుడు జదివి 
యానందించుటకు మాత్రమే పనికివచ్చును. గాని, ఓతప్రోతముగ వానియందే 
మున్గుటయు కష్టము మునిగి ప్రపంచమునకు! బనికివచ్చుటయు కష్టమే! వానిరసము 
వెక్కసమైనది. 'రేరాణి' పూలవాసనవంటిది. ఒకసారి రెండుసార్లకు బాగుండును. 
ఎక్కువైనచో మనవంటి నరముల పటుత్వము లేనివారికి, ఓర్చుకొనుటకు శక్తి చాలదు. 
పోతన కవిత్వమున మనకీభయము లేదు. అతనిదైవము, నియమశీలమైన 
రామభద్రుండు. అందుకే భాగవతమందు, రామాయణ ఘట్టము వచ్చినదే, యాతనికి 
జెక్కలు మొలచినవి. కన్నులుమూసి యొకసారి మనసార ధ్యానించికొని తిన్నగ 


పోతన కవిత్వము ౨ 139 


వ్యాసుని మూలమును జూచినాందు అందు- 


“తస్యాపి భగవానేష సాక్షాద్రహ్మ మయోహరిః 
అంశాంశేన చతుర్భాగాత్పుత్రత్వం (ప్రార్థితస్సురైః ॥ 


అని యున్నది. దాని నందికొని యుత్సాహముతో- 


మ॥। అమరేంద్రాశకు బూర్లచంద్రుండు దితుందైనట్లు నారాయణాం 
శమునం బుట్టె మదాంధ రావణ శిరస్సంఘాత సంఛేదన 
క్రమణోద్దాముండు రాముండాగరితకున్‌ గౌసల్యకున్‌ సన్నుతా 
సమనైర్మల్య కతుల్య కంచిత జనుస్సంసార సాఫల్యకున్‌ || 


అని వన్నెలు చిన్నెలతో క్రొత్త 'ఫక్షీ నారంభించినాండు రామకథను ముగించుచు 
పోతనామాత్యుండు- 


an నల్లనివాండు పద్మనయనంబులవాండు మహాశుగంబులన్‌ 

విల్లును దాల్బువాండు-గడువిప్పగు వక్షమువాండు మేలుపైం 

జల్లెడువాండు నిక్కిన భుజంబులవాండు యశంబు దిక్కులన్‌ 

జల్లెడువాండునైన రఘు సత్తముండిచ్చుత మాకభీష్టముల్‌ | 

(9-361) 

అని రామభద్రు నెంతయో ముచ్చటగ వర్ణించెను. ఇది యాతని సొంతపద్యము. 
పోతన్న పూజాగృహముననుండి, యతని భక్తికి మూలమైన రామచంద్రుని మూర్తి 
యిట్టిదేనేమో! “భాగవతమును వ్రాయునాటికి పోతనామాత్యునకు శివకేశవాద్వైత 
మేర్పడినది. అట్లే యామహానుభావునకు రామకృష్ణాద్యవతారములందును, నఖేద 
ప్రతిపత్తి బాదుకొన్నది. “గ్రంథమును వ్రాయుటకై యా మహానుభావుని బ్రేరేచినవాం 
డు రామభద్రుండేగదా! ప్రతిస్మంధమునందును తొల్తటిపద్యము రామార్చణముగ 
వ్రాసెను. షస్ట్రంతములు, గృష్టపరముగ నఖభివర్ణించినాండు.” ఇట్టి యభేదజ్ఞానమును 
పరిపూర్ణముగం బండించికొన్ని యాజ్ఞానైకనిధికి, రామావతారమందే యేకతాత్సర్యము, 
సిద్ధావస్థయందును, నుండుననుట పొజపాటు అని కొందజనవచ్చును. కాని యొక 


140 . ఆం(ధ్ర మవోభాగవతోవన్వానములు 


మూర్తి భేదముపై6 గొంతప్రేమ యెక్కువగ నుండెననుటలో నితరములపై 
దృష్టిలేదనియు, ప్రీతిగొరవడెననియు నర్థము గాదుగదా! ఒక తల్లికి చిన్నకొడుకుపై 
మక్కువ కొంత యధికమన్నచో తక్కిన వారినందరిని అడవులకు దోలునని భావమా? 
సమర్ధ రామదాసస్వామి యద్వైత సిద్ధిని బానమొనర్చిన మహానుభావుండు. అతం 
డాంజనేయుని యవతారమని యా సంప్రదాయస్థుల విశ్వాసము. వారొకసారి 
పండరికిం బోయిరి. 'కటితట విన్యస్తహస్తుండై, పాండురంగం డొయ్యారముగ 
నిలచియుండెను. వారి కావాలకము సరిపోలేదు. దేశమంతయు నధర్మ దూషితమై 
యున్నప్పుడు 'యీనడుముపై చేతులే మనుకొన్నారు. వెంటనే రంగండు చాపపాణియె 
వారికి దరిసెన మొసంెనట! తులసీదాసుల విషయమునను నిట్టి కథయే బ్రచారమున 
నున్నది. వారొకసారి మధురకు గాబోలు వెళ్ళినారు. అక్కడ 'జగన్నాథుని సేవింపం 
బోయిరి. రామాయత్తమైన తులసీదాసుల మనసు, రసికతాసర్వస్వమైన కృష్ణుని 
విషయమున నాగ్టముగాలేదు. “ఓయీ కృష్ణా! నీవెంత గొప్పవాండవయినను 
దనుర్భాణములు లేని మూర్తికి నా శిరస్సు వంచొనన్నారట! మరి వీరి కద్వైతసిద్ధి 
పండలేదా? పోతనామాత్యుండుగూడ నిట్టివాండే! 


పోతనామాత్యుండు రామపరాయత్తమతి యంటిమి. అందుచే నడుగడుగునను 
నా తపస్వికి నియమమే! ఈ నియమబద్ధమైన జీవితముతో భావముతో భాగవతమును 
వ్రాయుట నిజముగా మనపుణ్యము. అట్లు గాకున్నచో తెన్లు భాగవతముగూడ 
అతుకుల బొంతగ దయారైయుండెడిది. కాకున్న తెగిన గాలిపటమువలె గాలివీచినట్లెల్ల 
బోయియుండెడిది. నియమశీలుండైన వ్యాసుండు పోతనామాత్యుండు. వీరి 
గాంభీర్యమెట్టిదో యొక చిన్నయుదాహరణ మిత్తును. కృష్ణభగవానుండు, 
బృందావనమునుండి మధురానగరమునకు వెళ్ళినాండు. ఆతనిని గొంపోయినవాం 
డక్రూరుండు. వెళ్ళిన కృష్ణుండు రాచకార్యములతో మరల బృందకు రానేలేదు. 
కొంతకాలమున కాతని మనసులో జిన్ననాటి చిలిపిచేంతలు బారాడ నారంభించెను. 
మజిపునకుం దట్టిన గోపికలపై మనసు పోయినది. ఒకనాం డాతం దేకాంతములో. 


పోతన కవిత్వము ౨ 141 


శా నాపై! జిత్తములెప్పుడున్‌ నిలుపుచున్‌ నారాక గాంక్షించుచున్‌ 
నాపే రాత్మల నావహించుచు వగన్‌ నానా ప్రకారంబులన్‌ 
గోపాలాంగన లెంత జాలిపడిరో కోపించిరో దూతిరో ! 
వ్రేపల్లెన్‌ నిజధర్మ గేహములలో విభ్రాంత చైతన్యలై.॥ 
(ద.పూ.1431) 


అని యాలోచించుకొన్నాండు. బృందకుం బంపుట కర్ణులైవ్వరని యూహించి 
యుద్దవుని బిలచి 


శా॥ రమ్మా! యుద్ధవ! గోపకామినులు నారాకన్‌ నిరీక్షించుచున్‌ 
సమ్మోహంబున నన్నియున్మజచి-యేచందంబునన్‌ గుందిరో 
'తమ్ముం నమ్మినవారి డిగ్గవిడువన్‌ ధర్మంబుగాదండ్రు వే 
పొమ్మా ప్రాణములే క్రియన్‌ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్‌ ॥ 
_(ద.పూ. 1484) 


అని పలికి పంపినాండు. 

ఈ సందర్భమున వ్యాసుండు. 

శ్లో గచ్చోద్ధవ ప్రజంసామ్య! -పిత్రోర్నః ప్రీతిమావహ ! 

గోపీనాం మద్వియోగాధిం-మత్సందేశైర్వి మోచయ! 
అని తల్లిదండ్రులను గూడం జేర్చెను. వ్యాసుని ఫక్మినే యనుసరించి మళయాళములోని 
“ఎచ్చుత్తచ్చన్‌' మహాకవియు. 

“త్రాతనుంమాతాక్కళ్కుం శోకత్తెక్కళయేణం” అని యొక ముక్కను జేర్చెను. 
ఈపని పోతన్నగూడ చేసియుండిన బాగుండెడిది. ఆతనికెందుకు దట్టలేదో! 
ఈసందర్భమున “ఎచ్చుత్తచ్చన్‌' మహాకవి చాలచక్కగ (వ్రాసినాడు, ఆ భాగమిది. 

ఉద్పేశ్టవ్ర భక్తనాయి -జ్ఞానసంపన్ననామ్‌ 

సత్యబుద్ధి మానాయి-మేవీడు ముద్ధవనె 


142 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


సత్త్వరం విళిచ్చతి మంద హాసేనకృష్ణన్‌ 
ఉద్ధవ కరంపి డిచ్చీవణ్ణ మరుళ్‌ సెయ్య 
బుద్ధి శుద్ధియుం జీవజంతు క్కళ్‌ తన్నిల్‌కృప 
కేవలం సమత్వవుం-దైవ విశ్వాసమతుం 
కేవలసత్వ గుణలక్షణం గలుయువ 

ఏరె యుళ్లొరు భవానెనుడె జీవనెక్కా 

లేరె యుండెడో! నిన్న స్నేహ మెన్నజ్ఞాలుం. 


కృష్ణు డుద్ధవుని బిలచి తొలుత మందహాసము జేసినాండు. అతండు బ్రయోగించు 
మొదటి బ్రవ్మోస్తమదే! ఆపై యుధద్ధవుని చేయి వట్టుకొని మైత్రి నెజవి 
పలుకనారంభించెనట! “ఉద్ధవా! నీవు బుద్ధిశుద్ధిగలవా౭డవు. జీవజంతువులపై 
దయగలవాండవు. సమత్వము-దైవ విశ్వాసము-నీ సొత్తు. సత్త్వగుణములు నీవి. 
ఇన్నిటితో నీవు నాకు ప్రాణాధికుండవైతివి. కనుక నీయెడ నాకుగల స్నేహమునుబట్టి 
నిన్నంపుచున్నాః ” అన్నాండు. ఈసందర్భమున- కృష్ణు డీమాటలాడుటెంతయో 
యుచితముగ నున్నది. ఇట్లే యీ కథలోని నందుని వాక్యములుగూడ నెంతయో 
యాగములు. నందుండు-కృష్ణుని వాక్యములు దలంచిపనచి నపుడు- యశోద 
యొట్లున్నది? వ్యాసుల శ్లోకమిది. 
శ్లో; యశోదా వర్ద్వ్యమానాని-పుత్రస్య చరితానిచ 

శృణ్వంత్య శ్రూణ్యపా ప్రాక్షీత్‌ స్నేహస్నుతపయోధరా! 
“ఎచ్చత్తచ్చన్‌” యశోదయు- 


“పుత్రనై గుణగణం వర్ణికున్న తుక్కేట్టు 
చిత్తవుమలిజ్ఞాడన్‌ ములలయుంచు రన్నిట్టు 
చిత్తత్తిల్‌ కృష్ణన్‌ తన్నెధ్యానిచ్చు నేత్రాంబువు” 
ఎత్రయుం వీళ్తివీళ్తి నిన్నితు యశోదయుం | 


పోతన్న మహాకవి యశోదయు- 


పోతన కవిత్వము ౨ 143 


కం॥ పెనిమిటి బిడ్డని గుణములు 
వినుతింప యశోద ప్రేమ విహ్వలమతియైి 
చనుమొనలం బాలుగురియగం 
గనుగొనలను జలము లొలుకంగా బెగ్గిలియెన్‌ 1 (ద.పూ. 1443) 


ఈ సందర్భమున సూరదాసువంటివాండు- తన హృదయమును గుదించికొని- 
యశోదాదేవి నింత యుజ్వలముగం జేసియుండలేదు. హరిహరాద్వైతము 
భారతమైనట్లు రామకృష్ణాద్వైతము భాగవతముగ దక్కుట మన భాగ్యము. ఆ తపస్వి 
తెన్గువారి యిలవేల్పు. 


తెన్గున నాయదృష్టము రామాయణమునకు బట్టలేదు. అందుకే నాటినుండి 
నేటివరకు 'మేము మే'మని రామాయణమును వ్రాయుటకు ప్రతికవియు ముందుకు 
దూకుచున్నాండు. కాని నాదృష్టిలో రామకథను వ్రాయవలసిన యుదాత్త చరిత్రుం 
డింకను తెనుంగునం బుట్టవలసియున్నది. ఇటుకలు, గార- యీరెండే యిల్లుగానట్లు, 
చదువు- ప్రతిభ మాత్రమే రామాయణమువంటి యుదాత్తకథకు సమగ్రమైన సామాగ్రి 
గాదు. తపస్సుతో బరిపక్వమైన కొంత యాత్మశక్తియును గావలెను. కాని మనకు 
నేండిది బొత్తిగా నర్థము గానిమాట! అర్థమైనను అనవసరమైన పరిశ్రమ. మనుచరిత్ర, 
వసుచరిత్రల వంటి (గంథములకథ వేరు. వానిని చదివి యానందింతుమేగాని 
పూజింపము. అట్లున్నను వారుగూడ మనకంటె యాత్మశక్తి గలవారె! 


వారిలో నొకరొకరి జీవితగాథలు విన్నపుడొడలు పులకరించును. ధ్వన్యాలోక 
వ్యాఖ్యాత- అభినవగుప్తు డందటికిం బరిచితుండే! అతనికిం దపస్విగా గొప్ప 
ప్రఖ్యాతిలేదు. కాని యాతని జీవితచరిత్రను జదివినపుడు నాకొడలంతయు 
గగుర్చొడిచినది. కాళ్ళీరదేశ ప్రత్యభిజ్ఞావాదమున కాతండు మూలస్తంభము. ఆ 
బ్రహ్మచారి- మరలివత్తునని శిష్యులతోం జెప్పి యొకసారి బ్రహ్మాండమైన 
కొండలగుహలోనికి దూరెనట! శిష్యులు కాచికాచి విసిగి వెనుదిరిగినారు. 
అభినవగుప్తండు తిరిగి రానేలేదు. ఈనాటికిని కాశ్మీరదేశస్థులు “యీ గుహనుండి 
యభినవగుప్తుండు గడ్డకువచ్చు”నని యమాయికముగ ననుచుందురట! తులసీ 


144 - ఆం(్ర మవోభాగవతోవన్వానములు 


రామాయణము, త్యాగరాజుకృతులు మొదలగువానిలో నాత్మశక్తి యున్నంత కవితా 
శిల్పము లేదు. కాని- వానికున్న ప్రభావము అసామాన్యము. భాగవతమును 
మాత్రము యేకొంచెము పరేంగితజ్ఞానమున్నను యే కవియు వ్రాయ సాహసింపం 
డు. వ్రాసినను దాని నెవ్వరును జదువరు. 


మన భాషతో సంబంధములేని యితరులకును దెలిసిన కవులు దెనుంగులోం 
గొందటున్నారు. వారిలో మొదటివాండు పాలకురికి సోమనాథుడు. రెండవవాం 
డు పోతనామాత్యుండు, సోమనాథుని పేరు కన్నడిగలకుం బరిచితమైనది. ఆతండు 
వీరశైవుండు గనుక, విధిగా కన్నడము నేర్వలసియు వచ్చెను. బసవేశ్వరుని 
యుత్తాలవాజ్మయ విహారమంతయుం గన్నడముననే సాగినది. తక్కిన వీరశైవుల 
వచనము లా భాషలోనే గలవు. వీరశైవుల వచనవాజ్మయము - అదియొక విచిత్రమైన 
ఛందోరచన. వారి. నొరవడిగ నుంచుకొని మొన్న మొన్నటి వైష్ణవకవులు తెనుంగులో 
నా పోకలంబోయిరి. కాని యవి పాకమునకు రాలేదు. సోమనాథుడు కన్నడములో- 
తెలుంగులోవలె ప్రసిద్ధకవి కాకపోయినను కవిత్వము వ్రాసెను. తమిళమునగూడం 
గొంత యాతని పేరు ప్రాకినది. యీ ప్రాకుటయంతయు మతాఖినివేశముతోనే, 
పోతనామాత్యుల స్థితి యదిగాదు. అతండు తెన్లుదేశపుటెల్లలు దాటిపోలేదు. 
తెన్గుదేశమునను నలుమూలలు దిరిగియుండండు. అతండు విరక్తుండు. ప్రాప్తమైన 
దానితో తృప్తిపడువాండు. ఆతని కితర భాషలలోం బ్రవేశముండెనని యూహించుట- 
కారచనలో గుర్తులు లేవు. కాని యాతనికిం గవిగావచ్చిన దానికంటె భక్తుండుగా 
గల్లిన కీర్తి దొడ్డది. ఆనాటి భాగవతులలో నాతండు నాయకరత్నము. ఈ 
ప్రసిద్ధిమాత్రము హనుమంతుని తోంకవలె బెరుంగుచునే బోయెను. సమర్థ 
రామదాసస్వామివారి సాంప్రదాయిక (గ్రంథములలో- మహాభక్తుండుగ పోతన్న 
వర్ణింపంబడినాండు. ఆసన్నివేశమిది. సమర్థ రామదాసు 'మేరుపర్వతమును 
దర్శించివచ్చెనట!! అదెట్లు సాధ్యము? అంతవబకును బోవుటకు వారెంతవారైనను 
మానవులకు శక్తిలేదే! యను శంక శిష్యులకుం బొడమెను. దానిని సమర్థించుటకు 
వారు పోతన్న నుదాహరణముగ దీసికొన్నారు. “అల వైకుంఠపురంబులో' అని పోతన్న 
పద్యమారంభించెనట! తరువాత నాతనికిం దోంచలేదు. రామభద్రుని దయతో 


పోతన కవిత్వము ౨ - 145 


వైకుంఠము నాతండు జూచివచ్చి శేషమును బూరించినాండట! పోతన్న వైకుంఠమును 
జూచివచ్చెనా? లేదా? అట్లు చూచివచ్చుటకు సాధ్యమా? యను ప్రశ్నలకిక్కడ చోటు 
లేదు. ఈకథ నుదాహరించుటలో నా యభిప్రాయము పోతనామాత్యుండు 
మహారాషులకుం బరిచితుండని దెలుపుటవరకే! ఉత్తరహిందూస్థానమున 
'తెలాంగులను నొక శాఖవారున్నారు. రాజస్థానము గుజరాతులలో వారెక్కువ. ఆ 
బ్రాహ్మణులు దాక్షిణాత్యులు. వల్లభాచార్యుల కాలమున దక్షిణము నుండి 
యార్యావర్తమునకు కదలిపోయిరి. వారికి మన భాగవతముపై నభిమానముగలదు. 
ఈవిషయమును నేను ఢిల్లీలో వింటిని. త్యాగరాజు తమిళదేశమునందు తెనుంగు 
భాగవతమునకు ప్రచారమెక్కువ యిచ్చినట్లున్నది. నాండు ప్రచారమనంగా దానిని 
తాననుస్టించి చూపుట. త్యాగయ్య దినమును తెనుగు భాగవతమును బారాయణ 
మొనరించెడువాండట! ఈనాటికిని మన కామాత్ర మభిమానము ఆంధ్ర గ్రంథములపై 
నేర్పడలేదు. తెనుంగు కవిత్వము నెంత మెచ్చుకొన్నను మడుగు గట్టికొన్నప్పుడు 
మాత్రము మనకు జ్ఞాపకమునకు వచ్చునవి సంస్కృత గ్రంథములే. ఉత్తర 
హిందూస్థానమున నొక సంద్రాయమున్నది. ఆతడు చతుశ్శాస్త్ర పండితుండైనను సరే 
రామాయణ మన్నంతనే తులసీరామాయణమునే పారాయణము సేయును. ఇంత 
ముష్కరత మన కక్కరలేకున్నను సంస్కృత గ్రంథములలోనే మోక్షము గలదనియు 
వానినుండి మూటలు గట్టికొని రావచ్చుననియు తలంచు పేరాస మాత్రము 
నవ్వవలసినంత మూర్ధత. భావశుద్ధి ఫలసిద్ధికి ప్రధానకీలకము. 


ప్రాచీనులలో అప్పకవి మొదలైన మహామహులకు పోతన్న కవిత్వము 
లాక్షణికముగం గనుపింపలేదు. అతండొనర్చిన పాపమేమనగా 
లఘ్వులఘరేఫములకుం (బ్రాసగూర్చుట. ఇట్టి పనికిమాలినయెత్తిపొడుపే పాలకురికి 
సోమనాథునిపైంగూడ గలదు. ఈజాతివారందరును కల్పవృక్షములను దెగనతికి 
వంటకట్టెలు దయారు చేయుదమను రకము. అప్పకవి వంటి వారికేగాదు. కవుల 
మనుకొన్న వారిలోను చాలమందికి పోతనామాత్యులపై యనుగ్రహము మట్టమే! 
అందుకే, ప్రాచీన కవి ప్రశంసల చిట్టాలలో, నెక్కడోదప్ప, పోతన పేరు గనుపింపదు. 
ఈ నడుమ పోతన్నను గుతించి, సాగిన విమర్శలు, ఆయన యూరేది? తండ్రి, 


146 | ఆంధ్ర మవాభాగవతోవన్యానములు 


తాతలెవ్వరు? మొదలగు విషయములపైననే కొందరు విద్యాధికులాతని కవిగా, 
తూంచిన వ్రాంతలును గలవు. కాని, వీరిలోం జాలమంది యాంగ్ల విద్యాభక్తులు 
వారు సులోచనములు ధరియించియే ప్రతి విషయమును జూతురు. ప్రాచీనులది, 
అదొక గొడవ. కల మందికొన్నంతనే. వారికంటంబడునది, మమ్మటుండు రుయ్యటుం 
డు. తప్పులు బట్టుటలో నున్నంత చొరవ, యొప్పులను (గహించుటలోలేదు. ఇంతకును, 
నీ యిరుదెగలవిమర్శనములతోను, మనకు జరిగిన న్యాయము సున్న, 'గజేంద్రమోక్ష 
కథలో నడవిని వర్ణించుచు, పోతన్న యొక దీర్శవచనము ప్రాసినాండు. దీనినొక 
ప్రసిద్ధ విమర్శకుండు వెక్కిరించెను. అమరకోశమును, దగ్గజనుంచికొని పోతన్న 
వనౌషధి వర్గలోని చెట్ల పేర్లన్నియు నిందుంజేర్చినాండట!! నిఘంటువును దగ్గజం 
బెట్టుకొని, పదములకు వెదుకవలలసిన దురవస్థ, ప్రాచీనవులకులేదు. వారు 
బాల్యముననే, వానినెల్ల వల్లించెడు వారు. పూర్వకవులలోం గొందజు సంస్కార 
హీనులైన నుండవచ్చునుగాని, యవ్యుత్పన్నులులేరు. అట్టి ప్రబుద్ధులున్నది మనలోనే! 
ఆంగ్లభాషాభ్యాసము, మనకు గొంత స్వతంత్ర భావముల నొసంగినది. అట్టివారును 
దక్కువయే! మన పూర్వులు ప్రాచీన సంప్రదాయములకు బానిసలని, మనము 
వారిని నిందింతుము. కాని, మనకథ యేమైనది. మన మాంగ్ల సంప్రదాయములకు 
దాసులము. ప్రాచీనుల దాస్యములో “మా యనుకొని సంతోషపడు నాత్మతృప్తియైన 
నున్నది. మనకదియులేదు. పోతన్న వ్రాసిన వచనమంతయు (గ్రచ్చపొదవలె, 
చెట్లపేరులేగాదు, ఇతర విషయములు గూడ నాతండు వర్ణించెను. అతండు చేసిన 
దోషము, మొదటిలో నొకపడి చెట్లను జేర్చుటయే. వానికర్థమొజణంగుట. యీ 
విమర్శకునకు. గష్టమైనది. ప్రతిదానికి వనౌషధివర్గ జూడవలసినదేగదా! 
మరియడవిలో, చెట్లు గాక, హంసతూలికా తల్పము లెక్కడనుండి వచ్చును? పోతన్న 
సృష్టించిన పాత్రలలో వైవిధ్యముండదనుట రెండవ యాక్షేపణము. వారి వాదమిది: 
“భాగవతములోనందజును భక్తులే! ప్రతివారికి -శ్రీమహావిష్ణువు-చతుర్భుజములతో 
సాక్షాత్మరించును అతండగుపడినదే తడువ - యీభక్తుండు శ్రీమద్రమారమణ 
గోవిందా"యని జాగంటవాయింప మొదలుపెట్టును. ఈపాత్ర లందజును- మనవలె 
ప్రపంచమునం దిరుగువారు. ఏదో కల్పిత జగత్తులోవారు ఎంతసేపు చెప్పినను - 


పోతన కవిత్వము ౨ [47 


భాగవతము మావన జీవితములోని యొక భాగమును మాత్రమే దెలుపును.” ఇది 
వీరి వరుస. వైవిధ్యమనగా- వీరియర్థమేమో స్పష్టముగం జెప్పిన బాగుండును. 
భాగవతము భక్తుల చరిత్రలు వ్రాయుటకు. బుట్టిన గ్రంథము. అందులో రక్తులనెట్లు 
జేర్చవచ్చును? భారతములోంగూడ ననేకులు వత్తురు. వారందజును వీరులేగదా! 
లేక పాత్రల యాకార వికారములలో - వైవిద్ధమును గనపజుప వలెనని వీరి 
భావమా? ఆకారములోని భేదమే - వైవిధ్యమగుచో - నట్టివారు - రామాయణమును 
ఒకటికి పదిసారులు చదువవచ్చును. అక్కడనైనచోం దృప్తిగా క్రోంతులు - యెలుం 
గుగొడ్లు - కాకులు - గ్రద్దలు, వీరికి కావలసినన్ని సారులు. గనబడును. భాగవతమున 
నావైవిధ్యమెట్లు వర్ణింపవచ్చును? కంసునకు కాలిమెడమలు వెనుకకున్నట్లు చెప్పవలెనా? 
లేక - జరాసంధుని మీసములు పెనుగొండ చేత్రాడంతటి - పొడుగుగ నుండెనని 
వర్ణింపవలెనా? కాని భాగవతమున, వీరికింగూడ, నొక యాసరా యున్నది. ఇట్టి 
భావుకులు, కుబ్బావృత్తాంతమును దృప్తిదీర జదివికొనవచ్చును. కావ్యములందలి 
పాత్రలందరును, మనము దినమును జూచువారివలెనే యుండవలెనన్నచో, 
కావ్యములను జదువుట పనిలేని పని. ప్రపంచమునే జూచుకొనవచ్చును. కవి 
యెంత స్వభావవాది యైనను, ఉన్నదున్నట్లే చెప్పడు. చెప్పరాదు. వాస్తవముగం 
జూచినచో, నేకావ్యమందైనను పాత్ర కల్పితమే? అనుభవములు, వాని 
నావిష్కరించుపద్ధతులు, వీనిలోని భిన్నతయే వైవిధ్యమైనచో, నది భాగవతమున 
మాత్రమేల లేదు? భారతములోని పాత్రలన్నిటికిని విక్రమ ప్రదర్శనము సామాన్య 
ధర్మమైనట్లు- భాగవతమునందును భక్తి సామాన్య ధర్మమైనను- దానిని 
బ్రదర్శించుటలో- ననుభవించుటలో- వైవిధ్యము .గావలసినంత యున్నది. 
ప్రేమోన్మాదమున నొడలు మజచి- కృష్ణుని మురళీగానము విన్నంతనే గృహములను 
విడచి శరద్రాత్రియందు పరువెత్తికొనివచ్చు గోపికల భక్తికిని నియమశీలియై, 
వినయశీలియైన యంబరీషుండు సాధించిన దాస్యభక్తికిని భేదమేల లేదు? 
మధురానగరమందుం గృష్టునిగామించి, చందనాదుల నొసంగు- త్రివక్రయైన 
కుబ్దదృష్టియు, పరమాత్ముని పాదములచేత సదమదమైన పడగలుగల కాళియుని 
గాంచి కృష్ణుని పతిభిక్షవేడు యురగాంగనల తలంపులును నొకటియేనా?” 


148. ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


అదిగాదయ్యా! ప్రతియొక్కరును కృష్ణుని బొగడుట కారంభింతురు. ఆపొగడ్తలో- 
నెక్కడజూచినను- ఒక్కటే వేదాంతపుగోల యని యందురేమో! భారతములో దిక్కులేనన్ని 
యుద్ధములు వర్ణింపంబడునుగదా! ప్రతిదానియందును- పగిలిన పుర్రెలు పాతిన 
రక్తములే గదా యున్నది? చెప్పినదే మాటిమాటికి. జెప్పుచున్నాండను విసుగు 
మనకేలం గలుగదు? కారణమేమనంగా కామక్రోధాదులు సహజముగ మనకున్నవి. 
వానిని బాగుగ ననుభవింపవలెనను నాకాంక్షయు గలదు. వీని నుద్రేకింపంజేయు 
ఘట్టములు వచ్చినపుడు లోకమునవలెనే కావ్యమునను సులభమగు లీనమైపోదుము. 
భాగవతమువంటి గ్రంథములు కామక్రోధాదులను దమించికొమ్మనును. దమించికొను 
మార్గములనే దెలుపును. ఈపద్ధతి మనకంత యిష్టముగాదు. అందుకే భాగవతమును 
జదువుటకును, వినుటకును అధికారులు గావలెనంటిని. భారతము, పురాణము 
జెప్పుచున్నప్పుడు వేలకొలంది జనులు చేరుదురు. భాగవతమును జదువయూనినచో- 
పట్టుమని పదిమంది యుండరు. ఇది నా యనుభవములోని విషయము. 


పోతన్న వర్ణించు పాత్రలలోను కావలసినంత వైవిధ్యమున్నది. మనము 
కను గలిగి చూడవలయు నంతే! బలిచక్రవర్తి భార్యపేరు వింధ్యావళి. 'ఈమెకు 
నోరేలేదా' యనిపించును. అంత దీర్ధమైన బలిచక్రవర్తి కథలో- నామె 
మనకగుపించునది రెండుమారులే! బలి-వామనునకు- మూండడుగుల మేర 
దానమిచ్చినాండు. ఎదుటనున్న కులాచార్యుండు వామనునికి రహస్యములు విప్పిచెప్పి- 
వానికి దానమిచ్చినచో సర్వనాశమగునని _హెచ్చరించెను. బలి వినలేదు 
ఆచార్యుండు ఘోరముగ శపించెను. తనయెదుట నింతకథ జరుగుచున్నను వింధ్యావళి 
పల్లెత్తు మాటనలేదు. వటునికాళ్ళు గడుగుటకు నీరుమాత్రము తెచ్చినది. ఆ 
: సన్నివేశమును పోతన్న యిట్లు వర్ణించెను: 


ఆ.వె. దనుజలోకనాథుదయిత వింధ్యావళి 
రాజవదన మదమరాళగమన 
వటుని కాళ్ళుగడుగ వరహేమఘటమున 
జలము దెచ్చె భర్తసన్న యెతింగి 


పోతన కవిత్వము ౨ 149 


ఈ సందర్భమున మూలములోని 'జాలకమాలినీ యను విశేషణమును 
పోతనామాత్యుడు వదలెను. వింధ్యావళి స్వభావమునకు రాజసమునకుం బొత్తు 
గుదురదని యేమో! 'భర్తసన్న యెటింగి” యను చేర్పు పోతన్నదే! దీనితో కథకు 
(బాణమువచ్చినది. వామనమూర్తి బలిని బంధించినపుడు మాత్రము- ఆమె 
యూరకుండ లేకపోయినది. 


మ॥। తతమత్తద్విపయానయి, కుచనిరుంధచ్చోల సంవ్యానయి 
ధృత భాష్పాంబువితానయె, కరయుగాధీనాలికన్థానయై 
“పతి భిక్షాంమమదేహి,” కోమలమతే! వద్మాపతే! యంచుత 
త్సతి వింధ్యావళి చేరవచ్చె ్రిజగద్రక్షామనున్‌ వామనున్‌! 


వచ్చి యచ్చేడియ వామనమూర్తి చరణ సమీపమున బ్రణతయై నిలుచుండి 
యిట్లన్నదట! 
కం॥ నీకున్‌ క్రీడార్థములగు 
లోకంబులు జూచి పరులు లోకులు కుమతుల్‌ 


లోకాధీశుల మందురు 
లోకములకు రాజవీవం లోకస్తుత్యా! 


కం॥ కాదనండు పొమ్ము! లేదీ 
రాదనండు జగత్రయైక రాజ్యము నిచ్చెన్‌ 
నాదయితు గట్ట నేటికి 
శ్రీదయితా చిత్తచోర! (శ్రిత మందారా! 


-ఈ రెండవ పద్యము పోతన్న స్వకపోల కల్పితమే! మొదటి పద్యము ఆమె 
మనోనిశ్చయమును దెలుపును. సర్వమునకును భగవంతుడే కర్తయను విశ్వాస 
మామె ప్రతియూహలోను గలదు! అందుకే 'వింధ్యావళి'- శుక్రుడు, బలి-వీరి నడుమ 
జరగిన రగడలో! బ్రవేశింపనే లేదు. రెండవ పద్యములో వింధ్యావళిని పాపము! 
స్త్రీత్వ మావేశించినది. తన పతినే వామనుడు గట్టెను. ఆ పరీక్ష కామె నిలువలేక 


150 | ఆం(ధ మహాభాగవతోవన్యాసములు 


పోయినది. “అయ్యా! మాట తిరుగక నా పతి మూడు లోకములను దానమిచ్చినాం 
డే! ఇట్టివానిని నీవు గట్టుట న్యాయమా?” యని నేరుగా- వామనమూర్తి హృదయమునకే 
యామె 'బ్రశ్న వేసినది. వింధ్యావళి- భగవంతుని గుణించి వాడిన రెండు విశేషములును 
రెండు ముత్యములు. “శ్రీదయితాచిత్తచోర!” యనుటలో “నీకును భార్యయున్నది. 
భర్తకు గష్టము ప్రాప్తించినపుడు భార్యకెంత దుఃఖముండునో యా లక్ష్మినడిగిచూడు 
మనుచున్నది. “నిన్ను జేరిన భక్తులకు. గల్బవృక్షమువలె కోరికలనెల్ల దయసేయువాం 
డవని బ్రసిద్ధియున్నదే! నా భర్తను సర్వనాశము జేసితివేమయ్యా!” యని 
యెత్తిపొడుచుచున్నది. ఆ యడుగుటయు గొంత గడుసుగనున్నది. వింధ్యావళీ 
మహాగంభీరమైన చిత్తవృత్తి గలది. ఆమె యెప్పుడును బలుకదు. పలికిన ప్రతిమాటయు 
తూచి పలుకును. గోపిక లట్టివారు గారు. కృష్ణుండొకటి యన్న వారు పది 
మాటలాడుదురు. మనసులోని భావమును మాటుసేయుట వా రెన్నడైలుంగని విద్య. 
గోపికల యసూయలు (ప్రేమలు యీర్య్యలు ప్రణయకోపములు సర్వమును మజుక్షణమే 
గృష్పునకుం దెలియవలసినదే! ఇంక సత్యభామ ప్రణయగర్విత, రూపగర్విత- ద్రౌపది 
కరుణాలులిత, సుస్వభావ. గురుపుత్తుండైన యశ్వత్థామ నర్జునుండు బట్టికొని 
వచ్చినాండు. ఆమె ద్రౌణింజూచి వినయమున మొక్కినది. ఆమెకు. (బ్రతీకార 
కాంక్షలేదు. అమితమైన యధర్మభయము గలది. ఆమెకును 


ఉ॥ యాదవులందు పాండవులయందు నధీశ్వర నాకు మోహ వి 
చ్చేదము సేయుమయ్య”- 


అని ప్రార్థించిన కుంతీదేవికిన భేద మేమాత్రమును భావింపలేమా? ఇట్టివానికంటెను 
మతి యేవిధమైన వైవిధ్యము గావలెనో నాకర్థమగుట లేదు. వీరాశ్రయించిన భక్తిలో 
వైవిధ్యము లేదందురా! అట్లయినచో నెందులో భేదమున్నది. అంతయెందుకు? 
మనము దినదినము దిను నన్నములో భేదమున్నదా? శృంగారమున భేదమున్నదా? 
వాని నావిష్మరించు రీతులలో భేదమున్నది! తినెడు నన్నములో భేదములేదు. 
వ్యంజనములలో నున్నది అట్లే భక్తిలో భేదములేదు. భిన్నభిన్న చిత్తవృత్తులు దానిని 
భావించి యనుభవించుటలో భేదమున్నది. 


పోతన కవిత్వము ౨ 151 


పోతన్న కవిత్వములో నౌచిత్యము చాల తక్కువ యని యనేకులాతనిపై 
వేయు మతియొక యభాండము. అట్లు జూచినచో తిక్కన వలె నౌచిత్యమును 
బోషింపంగలవా రెందరున్నారు? కావ్యమున కౌచిత్యము కావలెనని ప్రాచీనాలంకారికు 
లందజును జెప్పినను- దానికెక్కువ ప్రాశస్యమిచ్చినవాండు క్షేమేంద్రుందే! కాని యాతని 
విషయముననే ప్రాచీనాలంకారికులలోనే యేకవాక్యత లేదు. ఇంతగా నౌచిత్యమును 
బట్టి పెనగులాడిన క్షేమేంద్రుడు సంస్కృతములో - పదిమందిలో నొక్కండేగాని 
గొప్ప ప్రశస్తికి వచ్చినవాండు గాండు. ఇంతకును నా మనవి యేమనగా - నౌచిత్య 
మనునది కవిత్వమునకు గావలసిన గుణములలో నొక్కటియేగాని క యౌచిత్యమే 
కవిత్వముగాదు. “ముక్కు మొగమునకుం గావలసిన యందములలో నొకటిగాని- 
ముక్కే మొగము గాదు గదా! బెచిత్యమనయా నేమి? ప్రపంచమున నెట్లు జరుగుచున్నదో 
యట్లే జెప్పుట! ఎట్లు జరుగుటకు వీలున్నదో యట్లు జెప్పుట! ఇవి రెండును- 
ముఖ్యముగ దేశకాలములం బట్టి హృదయ ధర్మమునుబట్టి మారునవే! 
తిక్కనామాత్యులదే యొక ఘట్టము జూడుండు. రాయబారమునకు వెడలుచున్న 
కృష్ణునితో పాండవులైదుగురును దమతమ యభిప్రాయములం జెప్పినారు. ద్రౌపది 
గూడం జెప్పందలచుకొన్నది. కృష్ణునకు రాయబారమిష్టములేనట్లే ద్రౌపదికిం గూడలేదు. 
కాని కృష్ణుండు రాయబారమను వింత యంతర్నాటక మొకటి యాడుచున్నాండు. 
అతండు రాయబారము నంగీకరించునేమో నని ద్రౌపది భయము. ఆ భయముతో 
నామె బ్రహ్మాండముగ విజృంభించినది. “వరమున బుటితిన్‌ భరత వంశముమెటి తి” 
ను పద్యము మొదలుకొని- సుమారొక పది పద్యములతో ద్రౌపది యుత్తాల 
తాండవమునే జేసెను. ఈ సన్నివేశము- నిజముగ- తిక్కనామాత్యుని గొప్ప సృష్టులలో 
నొకటి. ఆమె జట్టు విరియంబోసికొని కృష్ణునితో- 
కం॥ ఇవి దుస్ససేను వ్రేళ్లం 

దవిలి సగము డ్రెవ్విపోయి, తక్కిన యవి కౌ 

రవులకడ తీరుమాటల 

యవసరమునం దలపవలయు నచ్యుత వీనిన్‌ | 


152": ॥ ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


యని పలికినది. అపుడు కృష్ణుం డామె నోదార్చందలలంచి “కన్నీరు దుడువను- 
పెన్నెటివేణి ముడువను” దగువారిని నియోగించెను. సాహితీపరు లనేకులిక్కడ తిక్కనను 
తెగ బొగడుదురు. “ఆహా! తిక్కన యెంత యుచితజ్ఞుండు! ఎంత బాంధవ్యమున్నను- 
వయసులోనున్న స్త్రీని పరపురుషుండు తాకండు. తాకరాదు.” ఈ లోకాచారము 
నిక్కడ చక్కగా కృష్ణుండు నిర్వహించినాండు. బ్రహ్మాండమైన యావేశముతో- కథ 
సాగించిన తిక్క్మనామాత్యుండు- అంతటి రసోద్రేకమునంగూడ నౌచిత్యమును 
'మటువలేదు. కవి రసమునందు లీనుండైపోయి- తన్ను మజచిపోవు స్థితికి రారాదు. 
తక్కిన కవులెల్లరు నట్లెపోయి సన్నివేశమును జెజతురు. ఇతండొక్కండే సన్నివేశమును 
వెలయించును” అని నావంటి వాండొకడుండు ననుకొందము. ఏమయ్యా! కృష్ణు 
డింతదయలేనివాండు! కృష్ణునకు- (ద్రౌపదికిని- అన్నా చెల్లెండ్రవరుసగాదా! ఆమె 
తన యెదుట 'బావురు మనియేడ్చుచుండగా- దటుకున లేచికన్నీరు దుడుచుటయో- 
యోదార్చుట యోజేయక- యింటి యల్లునివలెం గూర్చున్నాండు. ఆ పనిని దాసీలే 
సేయవలెనా? ధర్మమునకు హృదయములేదా?” యని యాక్షేపించు ననుకొందుము. 
వానికి మన మొసంగు సమాధానము? అట్లే “శరద్రాత్రిలో వేణుగాన మొనర్చు 
కృష్ణునికడ కున్మాదినులైన గోపికలు “పరాయత్త చిత్తలై- తత్తరించి పారుట నామనసున 
కంత బాగుగలేదు” అని మజియొకం డాక్షేపించును. వానికిని సమాధానము మన 
మూకీభావమే! ఏదో యొకరీతి కష్టపడి యౌచిత్యస్వరూపమును సాధించికొన్నను- 
ప్రతి సన్నివేశమందును- తీవ్రభావోద్రేకముతో బ్రతుకుట యెంత కష్టమో! అట్లే 
ప్రతివిషయమున నౌచిత్యమును పాటించు టంతకష్టము. పైగా నొక కావ్యమును 
విమర్శించునపుడు- వాని హృదయ తత్వమేదో మనము చక్కగా గ్రహింపవలయును. 
అంతేగాని- యే తిక్కననో, నన్నయ్యనో - మనసులో బెట్టుకొని- “యాగుణము 
లీతనిలో లేవే!” యని విమర్శించుట యాకవికింజేయు ప్రబలమైన యన్యాయము. 
'ప్రబంధకవులకు తిక్కనలోని కావ్యగుణములు లేవు. వారందుకు వ్రాయలేదు. రాయలు 
తన వర్ణనావైశారద్యమును గన్సజచుటకు కవిత్వమును రచియించెను. కథ నొకచోట 
గూర్చుండుమని యాతండు వర్ణనలారంభించును. ఆతని బుతువర్ణనముల గొడవలో- 
యామునాచార్యుం డేమైనాడో రాయలకు. గాబట్టదు. మనకును గాబట్టదు. 


పోతన కవిత్వము ౨ 153 


తిక్మనామాత్యుని గుణములు రాయలలో లేవు. ఇతని గుణములు తిక్కన్నలో నున్నవా? 
యని నా ప్రశ్న. బెచిత్యమే కావ్యస్వరూపమైనచో నిన్ని యేండ్లనుండి- యీ జాతికిం 
జెందిన గ్రంథముల నిందు సహృదయులెందుకుం జదువుచున్నారు? ఇంతకును 
జెప్పవచ్చిన దేమనంగా- నీ గుణములలోనే- కావ్యత్వమున్నదని తూకమువేయుట 
చాల కష్టము. అభిరుచి భేదములు ప్రబలముగం బనిసేయును. ఉన్నంతవరకు 
తృప్తిపడి పోవుచుండవలసినదంతే! బెచిత్యమునకుం బట్టాభిషేక మొనర్చిన తిక్సనయు- 
“అరవిందనయన, చంద్రముఖి” యిత్యాది శబ్దముల బహిష్మిరింపలేదు గదా! “అరవింద 
చరణి యను విశేషణము నతండు గూడ వాడును. ప్రపంచమున నెంత 
యందకత్తెయెనను దానికి - పద్యములు పాదములుగ నుండవు. ఒకవేళ నుండినను 
- ఆమె నడచుటయును - మనము చూచి సహించుటయును పచ్చియబద్ధము 
స్వభావవాదమున సాగబీకినం గలుగు ప్రయోజనమింతే! ద్రౌపదిదగ్గణ కశ్వత్థామను 
బట్టుకొనివచ్చినారు. అపుడామె యతనిని వదలిపెట్టుమనెను. అందజు సమ్మతించిరి. 
భీముడు మాత్ర మొప్పికొనలేదు. అతండు- 


చ! కొడుకులం బట్టి చంపెనని కోపముచెందదు బాల ఘాతకున్‌ 
విడువు మటంచు జెప్పెడిని వెల్టిది ద్రౌపది వీండువిప్రుండే 
విడువగనేల చంపుడిటు వీనిని మీరలు జంపరేని నా 
పిడికిటిపోటునన్‌ శిరము భిన్నము సేసెద జూడు డిందటున్‌ ॥ 


అని యశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి హరి 
చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి- కడమరెంటను ద్రుపదపుత్రికను 
దలంగించి నగుచు నిట్లనియె.” 


-యీవచనమును. జదివిన యెవరైనను- “ఏమయ్యా! మీకృష్ణుండు గొప్ప 
మంటత్రవాదివలె నున్నాండే! అంతకుముందతనికి రెండు చేతులేగదా యుండెను? 
భీముండు కోపగించిన వెంటనే చిటికలో - మంత్రము వేసి మరిరెండు చేతులు 
తగిలించికొన్నాందే అవి యట్టచేతులా? నిజమైన చేతులా!” యని యడుగవచ్చును. 
వారిదృష్టిలో నిట నౌచిత్యము చెడినది. అందుకే యొక కావ్యమును విమర్శించినపుడు 


154 ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


కవి విశ్వాసముపై మనకు సానుభూతి యుండవలెనని మనవిజేసితిని. పోతన్న 
దృష్టిలోం గృష్టుడు-మన మనుకొన్నట్లు మనుష్యుండుగాండు ఆయన సర్వశక్తుండు. 
సర్వాత్ముండు. సర్వనియంతయైన పరమేశ్వరుండు కనుక తన కిష్టమువచ్చినట్లు 
చేయగలండు. ఈ భావమును మనము మనస్సులో నుంచికొన్నచో - హరి - 
హఠాత్తుగ చతుర్భజుండైనాం డనినప్పుడు బెచిత్యము సెడవలసిన పనిలేదు. 


ఇది యొకటేగాదు. ఇట్టి ఘట్టము లడుగడుగునను పోతన్నలో నగపడును. 
కృష్ణుండు ద్వారకకుం బ్రయాణమగుచు - పాండవుల వీడ్కొని రథారోహణము 
సేసెనట! తిక్కనామాత్యుండైనచో నీ వీడ్కొనుటయెట్లో - పరస్పర సంభావనము 
లెట్లునడచెనో - మన కన్నులయెదుట జరుగుచున్నట్లు చిత్రించియుండును. 
పోతనామాత్యుని కట్టివానిపై దృష్టి లేదు. ఇంతలో నొక సన్నివేశమేర్చడినది. 
ఉత్తరాగర్భమును భేదించుటకై యశ్వత్థామ బ్రహ్మశిరస్సును బ్రయోగించెను. ఆ 
యాపద నెటింగిన గృష్ణుండు - దానిని జక్రముతో భేదించినాండు. అపుడు - కుంతి 
కృష్ణుని సమీపించినది. ఆమె యతనికి మేనత్త. వయసున బెద్దిది. న్యాయముగ 
గృష్టుండామెకు నమస్మరించుటయు - కుంతి యాశీర్వదించుటయు లౌకికమైన ' 
యౌచిత్యము. కాని - యామె దృష్టిలో గృష్ణుండు మేనల్లుడు గాండు. “సకల 
ప్రాణిహృదంతరాళముల భాస్వజ్ఞోతియెయుండు సూక్ష్మ కళుండు.” ఆమె వచ్చుటయే 
తడవు. 


కం॥ పురుషుం డాధ్యుండు ప్రకృతికి 
బరుండవ్యయుం డఫఖిలభూత బహిరంతర్భా 
సురుండును లోకనియంతయు 
బరమేశ్వరుండైన నీకుం బ్రణతులగుహరీ! 11. 


అని యారంభించి (ప్రణతు లొనరించినదట! ఆ ప్రణతికిం గృష్ణుండియ్యకొన్నాండు. 

లోకములో - మేనత్త - అల్లుడు, వీరినడుమ నిట్టి ప్రవృత్తి యెక్కడనైన నుండునా? 
కాని- యాక్షేపణకు ముందు-కుంతి-కృష్ణుని మేనల్లునిగా నర్థము సేసికొనలేదనుట 
మనము మజచిపోరాదు. అపు డీ యనౌచిత్యమంతయు నౌచిత్యముగ మారిపోవును.: 


పోతన కవిత్వము ౨ 155 


ఇట్టి ఘట్టములు - అనుభవములు ప్రపంచములో జరుగుట యరుదైనను 
_ జరుగకపోవు. విరక్తు(డై వనములకు వెళ్లుచున్న తులసీదాసు భార్యకు బ్రదక్షిణ 
మొనరించి-నమస్మరించి వెడలిపోయెనట! అతని దృష్టిలో నామె భార్యగాదు జ్ఞానదాత్రి 
మొన్నమొన్నటి రామకృన్ణ పరమహంసయు శారదాదేవిని దేవిగానెంచి. - 
పూజలొనర్చెడుంవాండట! “కాదయ్యా! మనము మానవులము పాత్రలయందు మన 
ప్రవృత్తులెంతగా జిత్రితములైన వారు మనకంత దగ్గరవత్తురు. అపుడే మనకు వారితో 
తాదాత్యము బొందు నదృష్టము గల్గును. లేకున్న వారిపై మనకు సానుభూతులేర్చడవు” 
అని యందురా! మానవులలోను, అందరికిని నన్నిభావములయందును- అనుభూతి 
సమానముగ నుండునా? కాళిదాసు కుమారసంభవములో- పార్వతీ పరమేశ్వరుల 
ప్రణయలీలలను- విస్తరించి వర్ణించెను. ప్రాచీనాలంకారికులలోనే-కొందరిది 
యనౌచిత్యమని నిందించిరి. ఇది బాగుగనున్నదని యభినందించినవారును 
లేకపోలేదు. 


చదివినవారికి- చదువుతోపాటు - తక్కిన యన్ని గుణములును మెండేనేమో! 
(ప్రాచీనకాలమున-చాలమంది కవులు-పోతనామాత్యునకు చూపవలసినంత గౌరవము 
జూపలేదు. అప్పకవివంటి తిమ్మప్ప లాతనిలో- “అది లేదిది లేదని - వ్రేళ్లు బెట్టి 
చూపుట మానినవారు కారు. ఎంతచేసినను-ప్రజాసామాన్యమున -భాగవతమునకున్న 
పలుకుంబడి- యద్వితీయమైనది. భద్రాద్రిరాముని తరువాత-ప్రజలు గౌరవించునది- 
బమ్మెరపోతన్ననే. కవితాదృష్టితోను-భారతకవుల తర్వాత -జ్ఞాపకమునకు వచ్చునది 
భాగవతమే. కొన్ని విషయములలో పండితులకంటెను-ప్రజాసమాజము-న్యాయమును 
చక్కంగా నిర్ణయించును. 


ఈనడుమ పండితులలో యీ దృష్టి కొంత తగ్గుమొగము వడినది. సంతోషింపం 
దగిన విషయమే! కాని యాతని కవిత్వముపై తీసికొనవలసినంత దయను మాత్రము- 
విమర్శకు లీనాటికిని గైకొనుటలేదు. తిక్కన్నపై నెన్నియో చక్కని విమర్శనములు 
జరిగినవి. శ్రీనాధుడు రాయలయుగము మొదలగువానిపై-తత్వజ్ఞులు తోడితోడి 
రహస్యములను దవ్వియెత్తుచున్నారు. ఈ పట్టుదలలో-అరపాలైనను పోతన్నకై 
ఖర్చుబెట్టిన పుణ్మాత్ములులేరు. భాగవతము శుద్ధమైన ప్రతి-యిప్పటికిని 


156 . . ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


లేదన్నచో-యిదియే చాలును మన రసికతకు! సాధారణముగ ఆంధ్ర గ్రంథములే 
తప్పుల ప్రోవులు. పాఠములను సవరించుటలో పండితులు సవ్యసాచులు. ఎవరో 
వేటూరి ప్రభాకరశాస్తుల వంటివారు పరిష్కరించిన యొకటి రెండు (గ్రంథములకుం 
దప్ప-తక్కినవాని కన్నిటికిని యా శనిదోష ముండనేయున్నది. అందులోను 
భాగవతమునకుం బట్టిన ఘోరదశ యింతంతగాదు. దీనికి బాధ్యులెవరు? ఈ 
విషయమున మన యూనివర్సిటీలను తప్పుబట్టుటకు వీలులేదు. కారణమేమనగా- 
ఆంధ్ర భాషకు సరియైన నిఘంటువును దయారుజేసికొనవలె ననునంతవరకైనను - 
వారి దివ్యచిత్తములకు నేటికిని రాలేదు. అట్టిచో గ్రంథములను బరిష్మరించి ప్రకటించు 
బాధ్యతంగూడ వారిపైనుంచిన-పాపము చాలకష్టపడుదురు. పోతనామాత్యుండు 
గావించినది భాషాంతరీకరణమేననుట -అందరకును దెలిసిన విషయమే! ఈ 
పరివర్తనలో నాతండు జూపిన మెలకువలెన్నియో యున్నవి. పరివర్తన మనంగా 
నాతనిది కేవలము బల్బజమైన - అన్నిరీతులుగను మూలమునకు పరమవిధేయమైన 
- పరివర్తనముగాదు. వ్యాసభగవానుని యీక్రింది శ్లోకమును గమనింతము గాత! 


“అతఃక్షమ స్వాచ్యుత మేరజోభువో 
హ్యజాన తస్త్వ తృధగీశమానినః 
అజావలే పోంధ తమోంధ చక్షు షో 
హ్యేషోను కం ప్యోమయి నాథవాని తి ॥ 
క్వాహం తమోమహదహం ఖచరాగ్ని వార్భూ 
సంవేష్టి తాండఘట సప్త వితస్తి కాయః 
కే దృగ్విధాల_ విగణి తాండ వరాణు చర్యా 
వా తాధ్వరోమ వివరస్య చతే మహిత్వం! ॥ 
ఉత్‌క్షేపణం గర్భగతస్య పాదయోః 
కింకల్ప్యతే మాతు రథోక్షజాగసే? 

: కిమస్తి నాస్తి వ్యపదేశ భూషితం 

త వాస్తి కుక్షీ కియదప్యదంతం: (ద.10-14) 

పైశ్లోకములకు పోతన్న యొనర్చిన తెనింగింపు యిది; 


పోతన కవిత్వము ౨ 157. 


స్కీ సర్వేశ! నే రజోజనితుండ! మూఢుండ 
.. ప్రభుండ నేనని వెల్టి ప్రల్లదమున 
గర్వించినాండను, గద్వాంధకారాంధ 
నయనుండం గృపంజూడు నను బ్రధాన 
మహదహంకృతి నభోమరుదగ్ని జలభూమి 
పరివేష్టితాండ కుంభంబులోన 
నేండు జేనలమేన నెనయు నేనెక్కడ! 
నీ దృగ్విధాండంబు లేరికైన 


తే.గీ. సంఖ్య సేయంగ రానివి సంతతంబు 
నోలి బరమాణువుల భంగి నొడలి రోమ 
వివరములయందె వర్తించు విపుల భూతి 
నెనయుచున్న నీ వెక్కడ! యెంతకెంత 1 
(ద.పూ. 557) 


తర: కడుపు లోపలనున్న పాపండు గాలందన్నినం గిన్మతో 
నడువబోలునె క్రాంగి తల్లికి, నాద్య! సన్నము దొడ్డనై 
యడంగి కారణకార్య రూపమునైన యీ సకలంబు నీ 
కడుపులోనిది గాదె పాపండ గాక నే మతి యెవ్వందన్‌! 


'పాపండంగాక నే మరియెవ్వండన్‌' అని బ్రహ్మదేవుండు కృష్ణపరమాత్మ 
హృదయమును బ్రశ్నించు ప్రశ్న పోతనామాత్యులు తయారుచేసినదే! సీసపద్యములోని 
“నేనెక్ష్మడ! నే వెక్కడ?” అని తెచ్చిపెట్టిన పలుకుబడి పోతనామాత్యునిదే! సంస్కృతములో 
నున్నదే యైనను ఆస్వారస్యమును చెటుపక తెనుంగునకు తెచ్చుట యొక చాతుర్యమే! 
“ఎంత కెంతి అనునది ఆంధ్రకవి వేసికొన్న కొసరు. ఈ క్రిందిది వ్యాసుల మరియొక 
శ్లోకము: 


“శ్రేయ స్సృతిం భక్తి ముదస్యతే విభో 
క్లిశ్యంతియే కేవలబోధ లబ్ధయే 


158 : ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


తేషామసౌక్తీశలయేవ శిష్యతే 
నాన్యద్యధాస్థూల తుషావ ఘాతినాం nu 
దీనికిది తెనింగింపు: 


కం॥ [(శేయములు గురియు భక్తిని 
జేయక కేవలము బోధసిద్ధికి దపమున్‌ 
జేయుట విఫలము పొల్లున 
నాయము సేకురునె తలంప నధికంబైనన్‌. (10-541) 
“స్థూల తుషావఘాతినాం? అను పదమును-దానిస్వరూప యోగ్యతను పాడు 
సేయక 'పొల్లున ఆయము సేకురునె? అను తెనుంగుతనముతో గూడ ఆంధ్రమునకు 
కొనితెచ్చిన పోతనామాత్యుల చాకచక్యము-ఎంతైనను కొనియాడందగినది. మరికొన్ని 
యెడల - అనంగా మూలము క్లిష్టముగనో - అనన్వితముంగనో యున్నవోట 
వ్యాఖ్యానము తోడు గైకొని యావిషయముల నాంధ్రమునం జొప్పించుటయు నాతం 
డొనర్చిన పద్ధతులలో నొకటి. ఇంతేగాదు. సామాన్యమైన చోటులలో గూడ శ్రీధరులొక 
నూత్న ఫక్కీతో వ్యాఖ్యానించి మూలమునకు 'మెటుగు వెట్టుదురు. అప్పుడు 
పోతనామాత్యులును-శ్రీధరుల ప్రతిభకు మెచ్చుకొన్నవారు వోలె-వారి మార్గమునే 
యనుసరించిపోదురు. ఇదిగో వ్యాసభగవానుల శ్లోకము. 


నైమిశే9 నిమిషక్షేత్రే మునయ శ్వౌానకాదయః 
సత్రం స్వర్ణాయ లోకాయ సహస్రసమమాసత ! 


సామాన్యముగం జెప్పినచో “అనిమిషక్షేత్ర అను శబ్దమునకు “దేవతలు 
వసించుచోట అని మాత్రమే యర్థము. “'స్వర్ణాయలోకాయి అనుటకును 'స్వర్గఫల 
ప్రాప్తి కవి వ్యాఖ్యానము. ఇంతమాత్రమే వ్యాసుల యభిప్రాయమైయుండునని 
నాయూహ! ఈయర్థము శ్రీధరులకు రుచింపలేదు. వేయియేండ్లు సత్రాయాగమును 
జేసి బుషులు స్వర్గమును గోరుట అతని దృష్టిలో మూండేండ్లు కసరత్తు జేసి మూలనున్న 
- ముసలమ్మను గొట్టినట్లున్నది. అందుచే నాయన “స్వః = స్వర్గే గీయత, యితి 


పోతన కవిత్వము ౨ 150 


స్వర్ణాయోహరిః = సయేవలోకః - భక్తానాం నివాసస్తారం-తస్మైత త్రాప్రయ 
యిత్యర్థఖ అని వ్యాఖ్యానించెను. “అనిమిష' శబ్దమునకు గూడ ఆతనికి వేరు 
వ్యాఖ్యానము గావలసి వచ్చినది. “అనిమిషుాడను పదమునకు శ్రీవిష్ణువని 
శ్రీధరునివ్యాఖ్య. కాని యాయర్ధము (ప్రసిద్ధము గాదు. ఆ కొదువను పూరించుటకై 
“అలుప్తదృష్టిత్వాత్‌” అను ముక్కను తగిలించెను. దీని కుపస్ఫోరకముగ “క్షేశ్రేస్మిన్‌ 
వైష్టవేవయం” అను శ్లోకాంతరమును గూడ యీచోట నుట్టంకించినాండు. శ్రీధరుం 
డు చేసిన యీ వ్యాఖ్యానము పోతన్నకింతయో రుచించెను. అతండుగూడనటే. 


“శౌనకాది మహామునులు స్వర్గాకగీయమానుండగు హరిం జేరు కొజకు 
సహస్రవర్షంబు లనుష్టానకాలంబుగాగల సత్రసంజ్ఞకంబైన యాగంబు సేయుచుండిరి. 


(ప్ర.స్మ 39) 
అని పరివర్తించెను. తన కభిమానమైనచోటుల మూలమును విడచి స్వకపోల కల్పితమైన 
కథ నాతండు జెప్పికొనుచుబోవును. తన యభిరుచులకు భిన్నముగ'నున్న చోటులను 
మూలము నాతండు వదలుట కద్దు. అట్టిచోటులలో పోతనామాత్యులు వ్యాఖ్యాతల 
యభిప్రాయమును గూడ లక్ష పెట్టరు. వ్యాసభగవానుని శ్లోకమిది. - 


తతో9_తికుతుకో దృత్యస్తిమితై కాదశేంద్రియః 

తద్ధామ్నా-భూదజస్తూష్టీం పూర్ణేవ్యం తీవపుత్రికా 11 

పై శోకమందలి యలంకారము సహజముగ లేదు. పైగా ఉపమానము స్త్రీ 
లింగములో నున్నది. ఇది యలంకారములో నొక దోషము గూడ గదా! శ్రీధరులకును 
నీసందర్భము బరువేయెనదేమో! వారి వ్యాఖ్యానము కొంత ద్రావిడ ప్రాణాయామముగా 
నడచినది. శ్రీధరుల వ్యాఖ్యానమిది: 

పూర్చేవీ = ప్రజాధిష్టాత్రీకాచిద్దేవతా 

తస్యాః అంతి = సమీపే, పుత్రికా = చతుర్ముఖీ కనకప్రతియేవ.” 

ఆమూలమును- యీ వ్యాఖ్యానమును - రెండును పోతనామాత్యులను 
దృప్తిపజిచినట్లు లేదు. అందుకే యాతడు - ఆ యుపమానమును చల్లగా 
జారవిడచినాండు. 


“160 | ఆం(ధ్ర మవోభాగవతోవన్వానములు 


పోతన్న యనేక చోటుల వ్యాసులతో పందెము వేసికొని నడచినట్లుండును. 
అట్టి ఘట్టములు -అడుగడుగునను మనకు కనిపించును. చూడుడు- అంబరీషునకు 
క్రమ క్రమముగా వైరాగ్య మభివృద్ధిని పొందినది. అపుడు వ్యాసులిట్లు వ్రాసిరి; 

“గృహేషు దారేషు సుతేషు బంధుషు 

ద్విపోత్తమ స్యందన వాజ పంక్తిషు 

అక్షయ్య వస్రాభరణా యుధాధిషు 

అనంతకో శేష్యకరో దసన్నతిం. 


దీనికి పోతన్న తెనింగింపు: 


ఆ.వె. అతని కీహమానె హరులందుగరులందు 
ధనములందు కేళివనములందు 
పుత్రులందు బంధు మితులయందును 
పురమునందు నంతిపురమునందు. (న.88) 
మూలమునందు సప్తమీబహువచనము అప్పుడప్పు డావర్తింపబడుట మీకు 
విదితమే! దానితో నొక సౌందర్య మాశ్లోకమున కేర్పడినది. దానిని గమనించిన 
పోతన్న యావిభక్తినట్లే తెనుంగునందు బొందించెను. పైగా హరులందు గరులందు 


యిత్యాది ప్రాసలు - ఆతండు మూలమునకు దిద్దిన మెజుంగులు. చక్రమును 
వర్ణించుచు వ్యాసభగవానుండు: 


“తస్మా, అదాద్ధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం 

ఏకాంత భక్తి యోగేన వ్రతోభీతాభిరక్షణం” 
అని శబ్దాలంకారమునకు త్రోవ జూపెను. పోతన్న “ప్రతిభట శిక్షణంబును, నిజ 
జనరక్షణంబును నిఖిల జగదవక్రంబునగు చక్రంబునిచ్చి చనియె యని యా రసవాద 
విద్యను బూర్తిజేసినాండు. ఇంత మాత్రమేగాదు. కుంతీదేవి కృష్ణపరమాత్మను 
స్తుతించుచు- 

“కృష్ణాయ వాసుదేవాయ, దేవకీనందనాయచ 

నందగోపకుమారాయ గోవిందాయ నమోనమః 


"పోతన కవిత్వము ౨ 161 


నమః పంకజనాభాయ నమః పంకజమాలినే 
నమః పంకజ నేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే ॥ 


అని స్తుతించింది. 


“శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! 
పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మ నంకాశచరణ! హృషీకేశ! అని 
మూలమునందలి నామవాచకములను విడువక - వానినన్నింటిని వైజయంతీమాలికగ 
గూర్చి సుందరముగ నొనర్చినవాండు పోతన్న! 


వ్యాసుండొకసారి భావమును సూచించివదలును. ఆ వ్రేలుబట్టుకొని 
యాంధ్రకవి హస్తమంతయు (మ్రింగును. అనంగా వ్యాసుని హృదయమును - 
పరిపూర్తిగా వివరించునన్నమాట! అంబరీషుని భార్యను గుణించి చెప్పుచు వ్యాసులు- 


“మహిష్యా తుల్యశీలయా” యని పలికినాండు. దానికి పోతన్న 

“తనతోడి నీడకై వడి 

ననురూప గుణాధ్యయైన యాత్మమహిషితో” 
అని వ్యాసుల భావమును విశదీకరించెను. వ్యాసులతో మాటలాడుచున్న 
నారదునిగుతించి “వీణాపాణిః స్మయన్నివ” అని మాత్రమే మూలమున నున్నది. 
దానిని “లేనగవు నెగడెడి మొగంబుతోడ, విపంచికా తంత్రివ్రేల మీటుచు” అని 
పోతన్న వ్యక్తీకరించిరి. కథా సన్నివేశమును రచించుటలో పోతన్న మెటుంగు వెట్టిన 
చోటు లనేకములు గలవు. ముఖ్యముగా “వామనచరిత్ర, ప్రహాదచరిత్ర! కాలయవనుని 
కథ! గజేంద్ర మోక్షము - మొదలగువానిలో నాయన చూపిన కవితా చాతుర్య 
మమోఘమైనది. కథలలో కొన్ని యెడల రసానుబంధియగు వర్ణనలు ఆతండే 
సొంతముగ గావించుకొనచు పోయినాండు. నారదుని వృత్తాంతమందు సర్పమును 
వర్ణించుచు జెప్పిన పద్యములో- 

“నీలాయత భోగఫణ 

వ్యాళానల విషమహో[గ్ర వషహ్నిజ్వాలా 

మాలావినిపాతితయి...” 


162 ఆం(ధ మవాభాగవతోవన్వానములు 


యన్న సమాసమతనిదే! వ్యాసులకడకు నారదుండు వచ్చినపుడు ఆతనిని వర్ణించుచు 
వ్రాసిన సీసము పోతన్న కల్పన. 

శుక్రాచార్యుడు దానమీవలదని బలితోనన్నాండు. ఇచ్చినచోనీకు నాశము 
తప్పదనెను. అట్లు హితముజెప్పిన కులాచార్యుని మాటలువిని మూలమునందు 
“తూష్ణీం భూత్వాక్షణం” అని మాత్రమేగలదు. ఆబలికి “క్షణమాత్రనిమీలితలోచనుండై” 
యనుట పోతన్న జేసిన ప్రాణ ప్రతిష్ట. అట్లే యంబరీషుని చరిత్రలో “వెల్టితపసి 
చేయువేడబంబు” చకృబెట్టుమని శ్రీ మహావిష్ణు వన్నమాటలును పోతన్నవే! ఒక్కొక్కసారి 
రసోత్సాదనకై వ్యాసులు చెప్పక విడిచిన భావము యొక్క కొసరును యితడు 
పూరించుటవలె పలుకును. తమకొకటి రెండు మాత్రము మనవి సేతును. 
హిమవదరణ్యములలోం (బ్రవేశించుచున్న ధృతరాష్ట్ర మహారాజును నియమశీలయైిన 
గాంధారిగూడ వెంబడించినది. ఆమెను గుణించి వ్యాసులిట్లన్నారు: 

“పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ 

పతివ్రతాచాను జగామసాధ్వీ 

హిమాలయం న్యస్తదండ ప్రహర్షం 

మనస్వి నామివసత్సం ప్రహార 
ఈ ఘట్టమున పోతన్న రెండు పద్యములు వ్రాసినాండు. అవి ఈక్రిందివి: 


శా అంధుండైన పతిన్‌ వరించి పతిభావాసక్తి నేత్రద్వయీ 
బంధాచ్భాదనమున్‌ ధరించి నియమ ప్రభఖ్యాతయెయున్న త 
ద్దాంధారక్షితినాథు కూతురును యోగప్రీతి చిత్తంబుతో 
సంధిల్లం బతివెంటనేంగె నుదయత్సాధ్వీ గుణారూఢయిె।। 


చ వెనుకకురాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం 
బునకు భయంబులేక వడిబోయెడి ధీరునిభంగి, యప్పుడా 
వనిత దురంతమైన హిమవంతము పొంతవనాంత భూమికిన్‌ 
జెనిమిటితోడ నించుకయు భీతివహింపకనేంగె బ్రీతితోన్‌ ॥ 


పోతన కవిత్వము ౨ 163 


వీనిలో మొదటిది 'పతివ్రతా' సాధ్వీ అను పదములకు పోతనామాత్యుండు జేసిన 
వ్యాఖ్యానము రెండవ పద్యములో మొదటి యుపమానము. వ్యాస భగవానుండు 
వాడినదే! రెండవది పోతనామాత్యుండు జేసిన చేర్చు. ఇది సమకాలికమైన భావమేమో! 
ఎట్లెనను మొదటి యువమానము బూరింవని గుణవిశేషముల నిది 
కూడగట్టుకొనుచున్నది. చక్రమునకు వెజచి దుర్వాసుండు శ్రీ మహావిష్ణువు శరణుం 
జొచ్చినాండు. అపుడాయన యిట్లనెను; 


“నాకు మేలుగోర నా భక్తులకకాని 
భక్తజనుల కేన పరమగతియు 
భక్తండెందు జనిన పరతెంతు వెనువెంట 
గోవువెంటం దగులుకోదెభంగి.” 


భాగవతము చదువుటకు రాని పల్లెటూరివారు గూడ యీ యుపమానము పోతన్నదని 
యెజుగుదురు. అనగా జనసామాన్యములో నిదియంత ప్రసిద్ధము. అనర్హరత్నమును 
బోలిన యీ యుపమానము పోతనామాత్యునిదే! కృష్ణుండు నిర్యాణము చెందినాం 
డు. కృష్ణవిరహముచే కర్షితుండైన యర్జునుండు హస్తినావతికి వచ్చెను. అపుడు 
కవ్వడివాలకమును జూచి కలంంగిన ధర్మరాజు ద్వారకలో సమాచారమేమమని 
ప్రశ్నించెను. అర్జుంనుండు కన్నీరు కరతలంబునం దుడిచికొనుచు, “మహానిధిం 
గోలుపోయిన పేద చందంబున” నిట్టూర్పులు నిగిడించుచు బదులుపలుకెనట! 
సందర్భశుద్ధి గలిగిన యీ యుపమానము సహజ పాండిత్యునిదే! వెంటనే యర్జునిం 
డిట్లు దుఃఖమును గ్రుమ్మరించినాండు. 


క।। మనసారథి మనసచివుండు 
మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్‌ 
మన విభుడు, గురుడు దేవర 
మనలను విడనాడి చనియె మనుజాధీశా! 
(ప్ర.స్క 358) 


పోతన్న జేసిన శిల్పమిది. మూలమునందు బల్బజములుగ నుండు ఘట్టములకు 


164 ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


గూడ మహత్తరమైన తన ధారాశుద్ధిచే పోతన్న కావ్యత్వము నాపాదించును. అర్జునుం 
డు నచ్చినపుడు ధర్మరాజిట్లడుగుచున్నాండు. 


“కచ్చిత్తేల_. నామయం తాత! భ్రష్టతేజా విభాసిమే 
అలబ్ధమనో9_వజ్ఞాతః కింవాతత్ర చిరోషితః 
కచ్చిన్నాభిహతో భావైశ్ళబ్దాది భిరమంగలైః 
నదత్తముక్త మర్థిభ్యః ఆశయా యత్ర తిశ్రుతమ్‌. 
కచ్చిత్త్వం బ్రాహ్మణం బాలం గాంవృద్ధం రోగిణః ప్రియమ్‌ 
శరణోపసృతం సత్వం నాత్యాక్షీశ్ళరణప్రదః 
కచ్చిత్త్వం నాగమో౭_ గమ్యాంగమ్యాం వాసత్మృతాంగస్రియమ్‌. 
వరాజితో వాధభవాన్నోత్త మైర్నాసమైః పధి.” 
ఇత్యాదులు వ్రాసెను. ఈ బల్పజమైన విషయము గైకొని- 
క ఓడితినో! శత్రువులకు 
నాడితినో! సాధు దూషణాలాపములన్‌ 
గూడితినో! పరసతులను 
వీడితినో! మానధనము వీరుల నడుమన్‌. 


(ప్ర.354) 
క! తప్పితినో! యిచ్చెదనని 
చెప్పితినో! కపటసాక్షి చేసిన మేలున్‌ 
దుప్పితినో! శరణార్థుల 
రొప్పితినో! ద్విజులం బసులరోగుల సతులన్‌. 
(ప్ర. 855) 


క।। అడిచితినో! భూసురులను 
గుడిచితినో! బాలవృద్ధ గురువులు వెలగా 
విడిచితినోం యాశ్రితులను 
ముడచితినోం పరులవిత్తముల లోభమునన్‌. (ప్రజ356) 


పోతన కవిత్వము ౨ 165 


అను మూండు పద్యములలో పోతన్న తెనింగించెను. ఈ తెనింగింపులో మూలమును 
మహత్తర విషయముగ భాసింపంజేసినాండు. అవశుండై పాండవులకడ నున్న ధృతరాషు 
నుద్దేశించి విదురుండు గృహమును వదలి తపశ్చర్యకు బూనుకొనవలసినదని కొన్ని 
న్యాయనిష్టురములు పలికెను. అందులో ధృతరాష్ట్రుని శోచనీయమైన స్థితిని గూడ 
నాతండు వివరించినాండు. వానిలో నొక వాక్యమిది. 


“భీమాప వర్ణితం పిండం ఆదత్తే గృహపాలవత్‌.” 


పాండవులందరిలోను భీమునికి ధృతరాష్టుడన్నమంట! దానిని మనసులో 
నుంచికొనియే విదురుడు “భీమాపవర్ణితమ్‌” అనెను. పోతనామాత్యుం డాభీముం 
డేమనునో యిట్లు విస్తరించినాండు. 
క॥ _ బిడ్డలకు బుద్ధిసెప్పని 
గ్రుడ్డికి పిండంబువండికొని పొండిదెపైం 
బడ్డాడని భీముండొజి 
గొడ్డెములాడంగ కూడు గుడిచెద వధిపా! 


ఇందులో “గృహ పాలవత్‌' యని విదురుండొక యుపమానము చెప్పెను. 
'కుక్కవలె” నన్నమాట. ఎంతచెడినను ధృతరాష్ట్రుడు చక్రవర్తి. ఆతని నీమాట 
యనిపించుట పోతన్న కిష్టములేదు. దానిని తొలంగించినాండు. 

అంబరీషునిపైకి దుర్వాసుని 'కృత్య' వచ్చినది. ఆ సందర్భమున వ్యాస భగవానుం 
డు, “సచచాల పదాన్ఫపళొ అని వర్ణించెను ఈ వర్ణనములో పోతన్నకు గొంత 
గర్వము ధ్వనించినదేమో! దానిని తిన్నగా వదలివేసినాండు. అట్లే దుర్వాసుడు 
తన్ను శరణు వేడినపుడు వ్యాస భగవానుడు “మేనే స్వవీర్యంచ పరానుభావం” అను 
ముక్కను వాడెను. అనంగా తనద్గెర్యాది గుణములును-భోగవంతుని 
ప్రభావము-రెండును ఆరాజున కనుభవమునకు వచ్చెనని యర్థము. ఈ ముక్కను 
పోతన్న మెలకువతో తొలగించి- 


“తపసినెగులు మాన్ప తానెంతవాండను 
హరి కృపామహిత్వమనుచుదలంచి...” 


166 ఆం(ధ 'మవోభాగవతోవన్వానములు 


అని యంబరీషునియొక్క పరమభాగవత ధర్మమునకు మెజుంగులు దిద్దినాండు. 
నారదుని కథలో వనవర్ణనము వచ్చును. ఆవనమును వ్యాసుండిట్లు వర్ణించెను. 


“చిత్ర ధాతు విచిత్రాద్రీన్‌, యిభ భగ్నభుజద్రుమాన్‌ 
జలాశయాన్‌ శివజలాన్‌ నలినీ స్సురసేవితాః” 


దీనిని పోతన్న యిట్లు తెనింగించెను: 


“సమద కరికర విదళిత శాఖలుగల శాఖులు (ప్ర. 120). ఈ తెనింగింపులో- 
వ్యాసుని రచనకు వ్యాఖ్యానప్రాయముగా పోతన్న రచన కొణంతల నెట్లు పూరించుచు 
బోవునో తమ చిత్తమునకు వచ్చెనని తలంతును. ప్రథమస్మంధములో “ప్రాతర్హత 
హుతాగ్నయః” అని వ్యాసులు వ్రాసినారు. ఈముక్క వ్యాఖ్యాన సాపేక్షము. దీనికి 
శ్రీధరులు అనేననిత్యనైమిత్తిక హోమసాకల్యం దర్శితం” అని వ్యాఖ్యానించిరి. అట్లే 
పోతన్నయు “నిత్యనైమిత్తిక హోమంబులాచరించియని వ్యాఖ్యాన విషయము నట్లే 
దీసికొనెను. 


దశమస్మంధమున నీశ్లోకమున్నది: 


“నారాయణస్త్వం నహి సర్వదేహినాం 

ఆత్మాస్యధీశో9_ ఖిలలోకసాక్షి 

నారాయణోంగం నరభూజలాయనాత్‌ 

తచ్చా£_పిసత్యంన తవైవమాయయా! 

(10.14.13) 

ఈశ్లోకమునందలి నారాయణ శబ్దమునకు శ్రీధరులు మూండు నాల్గు రీతులుగ 
వ్యాఖ్యానమును జెప్పిరి. ఈ సందర్భమున పోతనామాత్యుండు: 

నలినాక్ష నీ వాదినారాయణుండవు 

జలము నారము జీవచయమునార 


మందు నీవుంట నీయం దివి యుంటను 
నారాయణుం డను నామమయ్యు” (10-560) 


పోతన కవిత్వము ౨ | 167 


అని స్పష్టముగ తన యభిప్రాయమును జెప్పివేసినాండు. ఇట్లొక్కొక్కసారి యాతండు 
వ్యాఖ్యానమునకు భిన్నముగ చెప్పును. తిక్కనామాత్యులకు యుద్ధవర్ణనములు 
వచ్చినప్పుడు - మూంపులు మూండగును. పోతనామాత్యులకు వేదాంతమును 
వివరింపవలసి వచ్చినప్పుడట్టి యావేశ మావహించును. అస్పష్టముగ - లేక 
గ్రహించుటకు కష్టసాధ్యముగా నున్న వ్యాసుల వేదాంత శ్లోకములను వారెంతో 
యాప్యాయముగ వర్ణింతురు. ఇంద్రియములను దమించుట మొదలగు ఘట్టములలో 
పెద్ద పెద్ద సమాసము లుపయోగించి - యుద్ధరంగ వర్ణనముపలె హడావిడిసేయుట 
పోతనామాత్యుల కలవాటు. కామక్రోధాదులనుదమించు వేదాంతి యుద్ధవీరుం 
డెందుకుగాండు? ఈక్రింది వ్యాసుల శ్లోకమును పోతన్న యెంత సుకరముగ- 
రమణీయముగ తెనుగుంలోనికి తెచ్చినాండో చిత్తగింపుండు: 


“ఏకాయనోల_సౌద్విఫలః త్రిమూలః 
చతూరసః పంచశిఫః షడాత్మా 
సప్తత్వగష్ట విటపోనవాక్షో 
దశచ్చదో ద్చిఖగోహ్యాదివృక్షః” (10.2.29) 
స్రీ ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖ 
ములు రెండు గుణములు మూండువేళ్ళు 
తగురసంబులు నాల్గు ధర్మార్థముఖరంబు 
లెజింగెడి విధము లైదింద్రియంబు 
లారు స్వభావంబు లా శోక మోహాదు 
లూర్ములు ధాతువు లొక్కయేడు 
పైపొజలెనిమిది ప్రంగలు భూతంబు 
లైదు బుద్ధియు మనోహంకృతులును 


తే॥గీ!! . రంధ్రములు తొమ్మిదియు కోటరములు ప్రాణ 
పత్రదశకంబు జీవేశ పక్షియుగము 
గలుగు సంసారవృక్షంబు గలుగజేయు 
గావనడగింప రాజ వొక్కరుండ వీవ। (ద.పూ.91) 


168 ర్‌ ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


పోతనామాత్యుల సీసపద్యము- ఆ సంసారవృక్షమును బ్రహ్మాండముగం జూపించు 

చున్నది. వారేరుకొన్న వృత్తమట్టిది. అంతేగాదు- మూలమునం దస్పష్టముగానున్న 

విషయములను వ్యాఖ్యాన సాహాయ్యముతో వివరించుచు గూడ బోయిరి. ఇంతకన్నను 

బల్బజములుగ నుండు విషయములలో గూడ వారి శైలి యను రసవాద 
విద్యయెంతయో గొప్ప పనిచేయును. ఆ రచన యిది: 


సీ _ విక్రియా శూన్యమై విషయత్వమును లేని 

దగుచు నాత్మాకారమై తనర్చు 

నంతఃకరణమొక్క యధికసాక్షాత్మార 
విజ్ఞానమునబట్టి వేరొరులకు 

యెరుగంగరానిదై యేపారియుండుట 
జేసి నీనిర్గుణ శ్రీవిభూతి 

బహిరంగ వీధులబారక తిరములై 
యమలంబు లగు నింద్రియములచేత 


ఆవ నెట్టనేలకెన నెజుంగంగనగుగాని 
గుణవిలాసివగుచు గొమరు మిగులు 
నీ గుణవ్రజంబు నేరరాదెరుగంగ 
నొక్క మితములేక యుంటనీశ ॥ (ద. 5538) 


ఈ పద్యమునందలి విషయము శుష్మతర్మము యొక్కకంప. దాని నా మహాయోగి 
వాగ్రైచిత్రి యెంతయో రమణీయముగ నొనర్చెను. ఈరీతిగ పోతనామాత్యుండు 
తెనింగింపులోం జూపిన ప్రతిభ యితరకవులు జేసిన పనితనముకంటె యేవిధముగను 
తక్కువదిగాదు. కాని దురదృష్టవశమున మనమే యింతవరకాతని ను పేక్షించితిమి. 
ఆ యపరాధమున కాతని కిప్పుడైనను మానసికముగ క్షమాపణ జెప్పికొందముగాక! 


ఒకప్పుడొక పిల్ల విమర్శకుండు సందర్భవశమున నాతో “భాగవతపు 
శైలియేమియు బాగుండదు. తిక్కనధార తీగదీసినట్లుండును. పోతన్నదట్లుగాక- 
పాదపాదమునకు దునిగిపోవును. యతి-ప్రాస-వీనిని బూరింపవలసినపుడు- క్రొత్త 


పోతన కవిత్వము ౨ - 169 


క్రొత్త పదములను వెదకికొనుటలోనతండు పడు బాధ జూచిన మన '“కయ్యో' 
యనిపించును” అని నిరాఘాటముగ తిక్కన- పోతన్నలలోని తారతమ్యమును తీర్చు 
జెప్పివేసెను. నేనప్పుడేమియు మాట్లాడలేదు. కారణమేమనంగా- నా బాల్యములో 
నేనుగూడ పోతనపై నిట్టి యభాండముల నెత్తితిని. 'తీంగె దిగిచినట్లు వ్రాసిననే 
ధారాశుద్ధియగును. కాకున్న కాదు” అని మొదలు స్థిరపడవలెను. అటుతరువాత నీ 
విమర్శకు నడుముల బలము నిల్చును. భారత కవులలో- తీంగ దిగిచినట్లు రచన 
యున్నమాట నిజమే! ఆ ధారయొక్క ద్రుతగతి యెజ్జినకంటెను- నన్నయభట్టులలో 
నింకను గొంత మీటినది. కాని భారతము వీరకావ్యము. ఆ పాత్రలకు ద్రుతగతి- 
ప్రబలమైన యుద్రేకము- ఉత్తాలములైన భావములు- యివి సహజములైన 
ధర్మములు. అందుచేనాకావ్యములను రచించునప్పుడు, శయ్య యెంత తొందజగ 
నడపిన మనకంత యానందము గలుగును. కాని - భాగవతము యొక్క ధర్మము 
వేలు. శాంతి దాని ప్రధానమైన రసము. ఆ పాత్రలకు నిలుకడ - సంయమము - 
యివి నైజములైన గుణములు. అట్లే వానిని సృష్టించు కవికి గూడ నీ గుణములు 
లేకున్నచో నా సన్నివేశములు క్రోంతిచేతికి దొరికిన యుద్ధమువంటి వగును, 
భారతములోని వారికి ముఖ్యముగ రజోగుణము ప్రధానము. అందుచే మాటలలో 
వాడిమి - భావములలో తీండ్ర - యీ గుణము లుండితీరవలెను. పోతన్న పాత్రలు 
-సత్వగుణ ప్రధానములు. భారతములో ప్రతిచోటను తీంగెదిగిచిన శైలియే లేదు. 
నిలిచి - నిలుకడగం బలకిన పట్టులును నుండనే యున్నవి. అట్లే - భాగవతమున 
గూడ హృదయ భావములకు - విశ్చంఖల 'స్వైరగతి నావిష్మరింప వలసిన చోట 
పదములు పాదరసమువలెం బర్వెత్తును. అక్కడ నాతని ధార - వర్షాకాలమునందలి 
ప్రవాహమువలె తెగదూకులుదూకినది. కాని సామాన్యముగ నాతండు శయ్యను - 
నిరంతరమును గళ్ళెమును చేతంబట్టుకొనియే నడచును. పోతన్న భాగవతపుం దెనిం 
గింపు - నేండు గొంత అనుకొన్నట్లు- పుస్తకమును ముందు బెట్టకొని - మూం 
డునాళ్ళలో దీర్చిన ముచ్చట గాదు. ఆతండు సంస్కృత భాగవతము నెన్నియో 
యేడులు - పరాయణముగ - బారాయణ మొనర్చెను. చదివి - వ్యాసభగవానులు 
సృష్టించిన ప్రతి సన్నివేశమును - ప్రతిపాత్రను - ప్రతిపద్యమును - పదమును - 


170 ఆంధ్ర మవోభాగవతోవన్వానములు 


భావించి, భావించి - “వివర్ణిత చేష్టులొ డైంనాండు. ఈ తపస్సు జన్మమంతయు సాం 
గుటచే - నా భక్తులలోని యనేక గుణములు - పోతనామాత్యులకు స్వభావములై 
పోయినవి. అతని జీవితమునందు పరమ భాగవతులు తొంగి చూచినట్లు - 
భాగవతములోని ప్రతిభక్తునిలోను - పోతన్న బ్రతుకు తొంగిచూచును. భాగవత 
మతనికిం గవిత్వము గాదు. కనువిప్పు. ఆం(ధ్రీకరణ మతని కానందమేగాదు. నిష్ట 
నేటిమనకు మననమను పదార్థము: సున్న “కంపెనీల 'కేటలాగు లలో మన 
పుస్తకముల జాబితా యెక్కువ కనబడవలెనను ఉబలాటతప్ప వ్రాసిన ముక్కలు 
బాగున్నవా? లేదా? యను నాత్మవిమర్శనము జేసికొనుట - పనిలేని పని. ఒకానొక 
తెలుంగు కవి “నే నీ జన్మలో నూటయెనుబది పుస్తకములు వ్రాసి నానయ్యా” అని 
యెదలు విజచికొని నాతోననెను. అతనికి బదులు పలుకుటకు నాకేసిగ్గయినది. 
“శ్రద్ధమంగళమాయె” నని నాలోనేను నవ్వకొంటిని. పతంగము గూడ పతంగునితో 
పందెము వేసుకొనునట! 


తిక్కనశైలి పోతనామాత్యునకు సాధ్యము గాకపోలేదు. అనుసరింపంబోవుట 
- బోళ్ళపడుట - యవకతవక చేష్టలుమనవి. తిక్కన జ్ఞాపకము వచ్చినపుడతండు 
- ఆ యమాత్యునివలెనే వ్రాయును. ఈ క్రింది పద్యమును జూడుడు. 


an రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధని శాత్రవో 
ద్వేజకమైన గాండివము విల్లట! సారథి సర్వభద్ర సం 
యోజకుండైన చక్రియట! యుగ్ర గదాధరుండైన భీముం డ 
య్యాజికి దోడువచ్చునట! యాపదగల్లుటదేమిచోద్యమో! 
(ప్ర.స్క 211) 
-పై పద్యము తిక్కన దున్నట్లున్నదో లేదో మీరే చెప్పుడు. అంతేగాదు. అతండు 
నాచన సోమునివలెంగూడ నందుకొనును. ఈ క్రింది పద్యమొక యుదాహరణము: 


శా॥ రాడా! చూడ సమస్త భూతములలో రాజిల్లువాండిచ్చటన్‌ 
లేడా! పాజుని చిచ్చజమ్ముదొలంగన్‌ లీలాగతింద్రోచి నా 


పోతన కవిత్వము ౨ 171 


కీడా? నేడభయ (ప్రధానమత డూహింపన్‌ నతత్రాతమున్‌ 
గాడా! యెందజ గావండే యెడల మత్మర్మంబు దానెట్టిదో! 

(ప్ర.స్మ్క 283) 
ఈశబ్ద చిత్రమును గమనించినపుడు నాచనసోముని కవిత్వమును- పోతన్న తలం 
చుకొన్నచో నెంత బాగుగ ననుకరింప గలండో మనకుందెలియును. ఎజ్జన రచించిన 
నృసింహ పురాణమును పోతనామాత్యుండు బాగుగ నధ్యయన మొనర్చను. ప్రహ్లాద 
చరిత్రములో నాతని చరణము లందుకొని వ్రాసిన పద్యములెన్నియో యున్నవి. 


అందరికన్నను నన్నభట్టుల ననుసరించవలెనను ఉద్వేగము పోతనామాత్యులకు 
కొంత యొక్కువగ- కావలసినదానికన్న యెక్కువగనే- ఉన్నట్లు కనిపించును. వారు 
నన్నయ్యను అనేక చోటుల ననుసరింతురు. కొన్నిచోట్లలో నన్నయ్య వాడిన పదములే 
వచ్చుటగూడ కద్దు. 


చ॥ తరళతరంగ వీచి సముదంచిత బిందు సరస్సరస్వతీ 
సరిదరవింద తుందిల లసత్తరు తీరనివాస సన్మునీ 
శ్వర నికరాశమాకలితసంపదలన్‌... (తృ-798) 
ఈ పై పద్యమున 'సరస్సరస్వతీీ యనుచోట నుండునది నన్నట్టుల శబ్బాలంకారమే! 
ఒక్కొక్కసారి వారివలెనే వీరును పద్యమంతయు నొకటే సమాసమును నింపివేయుదరు. 
ఆ నింపినచోట మన కదిసమాసముగా నట్లే భాసించుట- ఆ పదములలోని యొక 
చమత్మారము - ఈ క్రింది దట్టిది: 


a మానితసౌరభ ప్రసవమంజుల పక్వఫల ప్రవాల భా 
రానత చూతపోత విటపాగ్రనికేతన రాజకీర స 
మ్మానిసుభానులాప పరిమండిత కర్వమతాపసాశ్రమో 
ద్యాన వనప్రదేశ కమలాకరతీర నికుంజపుంజముల్‌. (8.1044) 
ఈ సీసపద్యమును చదువునప్పుడు మనకు నన్నయభట్టుల పద్యమును 
చదువుతున్నట్లే యుండును. 


172" ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


బీ నవ్య కాంచన రణ న్మణినూపు రారావ 
విలసిత పాదారవిందయుగళ 
కాంచీకలాప సంకలిత దుకూల వ 
స్త్ర స్స్ఫార పులిన నితంబబింబ 
రాజి తాన్యోన్య కర్మశ పీన కరికుంభ 
పృథు కుచభార కంపితవలగ్న 
మదిరా రసాస్వాద మద విఘార్ణిత చారు 
సిత నవవికచ రాజీవనయన 
తే॥గీ॥।  యపర పక్షాష్టమీ శశాంకాభ నిటల 
మదవ దళికుల రుచిరోపమాన చికుర 
లలిత చంపక కుసుమ విలాస నాస 
హాసలీలావలోకన, యబ్దపాణి. (తృ. 726) 


ఇంత మాత్రమేగాదు. భావధారలో గూడ వా రప్పుడప్పుడు నన్నయ్య 
ననుసరింతురు. ద్రుపదుడు, ద్రోణుడు- వీరిరువురును ఒక గురువు కడ విద్య 
నేర్చుకొన్నవారు. తరువాత [ద్రుపదుడు పాంచాల దేశమునకు రాజయినాండు. 
ద్రోణుడు- రాజకుమారుల కస్త్రవిద్యనేర్చుచు బ్రదుకుచుండెను. సామాన్యముగ 
విద్యావంతునకు (ప్రధాన లక్షణమైనది. దారిద్ర్యము. ముందర-యతని- 
యస్త్రశస్త్రములేవియు పనిజేసినవిగావు. వివాహమైన వెనుక పేదతికముతో నాతం 
డు బాధపడ నారంభించెను. పిల్లలకు పాలుద్రావుట కొక గోవైనను ఆతనియింటిలో 
లేదట! ద్రోణుని భార్య కృపి. ఆమెతో నప్పుడప్పుడు “ద్రుపదుండు తన సహాధ్యాయి” 
యని ద్రోణుండు గొప్పలు సెప్పికొని యుండెనేమో! 

ఆ రాజునడిగి యేమైనను దానము తెమ్మని భార్య తరిమినది. ఆతండు 
వెళ్లెను. సామాన్య ధనవంతులకే మనసు లుండవు. ఇంక రాజుల ఇక్కడనుండి వచ్చును? 
వాండు “సరే. పొమ్మన్నాడు.” ఆయవమానము ద్రోణుని బాధించుచునే యుండెను. 
ఇంతలో నర్జునుండు పేరు ప్రఖ్యాతులు గడించినాండు. ద్రుపదుని పట్టికొనివచ్చుటకై 


పోతన కవిత్వము ౨ 173 


గురువు శిష్యుని నియోగించెను. ద్రుపదుడు అర్జుననుకు ఓడిపోయి, చికాను. “అర్జునుం 
జేసిన పరాక్రమంబునకు పరమ హృష్టహృదయుండైన ద్రోణుడు ద్రుపదుంజూచి 
నగుచు నిట్లన్నాండట: 


కం॥ వీరెవ్వరయ్య డ్రుపద మ 
హారాజులె? యిట్లు కృపణులై పట్టువడన్‌ 
వీరికి వలసెనె? యహహ! మ 
హారాజ్య మదాంధకార మదివాసెనొకో. (ఆ.ష.90) 


ఈ మందలింపులోని యెత్తుగడ పోతనామాత్యుని హృదయమును చక్కగా 
లోంగొన్నది. వారును ఒక్కచోట యీ యెత్తుగడనే వాడిరి. కృష్ణుండు వెన్నలు 
దొంగిలించినాండు. ఆ దొంగతనమును యశోద కనుగొన్నది. ఆమె కృష్ణునితో 
నిట్లన్నదట! 


కం॥ వీ రెవ్వరు? శ్రీకృష్ణులు | 
గారా? యెన్నండును వెన్న గానరంట కదా! 
చోరత్వం బించుకయును ' 
నేరరంట! ధరిత్రి నిట్టి నియతులు గలరే! (10-372) 
కాని సాధారణముగ పోతనామాత్యుల శైలియిట్టిది: 


ప్రీ “మేఘంబుమీంది క్రొమ్మెజుంగుకై వడి మేని 
పై నున్న పచ్చని పటమువాండు 
గండ భాగంబుల గాంచన మణిమయ 
మకరకుండల కాంతి మలయువాండు 
శరవహ్నినడగించు సంరంభమున!జేసి 
కన్నుల నును!6గెంపు గలుగువాండు 
బాలార్మమండల ప్రతిమానరత్న హా 
టక విరాజిత కిరీటంబువాండు 


174 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


తే కంకణాంగద వనమాలికా విరాజ 
మానుం డసమానుం డంగుష్ట మాత్రదేహుం 
డొక్కగద చేతం దాల్చి నేత్రోత్సవముగ 
విష్ణుం డావిర్భ వించెనవ్వేళయందు. 
(ప్ర.స్మ్క 285) 


అడుగడుగునను- నాగియాగి - ముందు వెన్మలు జూచికొని - యాతని 
పద్యగతి యెంతో సుందరముగ నడచును. ఒక్కొక్కసారి- యావేశ పడవలసిన 
సమయములందును - యిట్లే వచించును. అనంగా- వశిత్వము ఆపాత్రలకు- 
సామాన్య ధర్మమన్న మాట! దీనికర్థము పోతన్నకిది యంతటి నైజగుణమనుటయే! 
కలిపురుషుడు ధర్మదేవతను - కాలందన్నినాండు. ఆ దృశ్యమును జూచిన యభీమన్యు 
నందనుకు బ్రహ్మాండమైన కోపము వచ్చెను. ఆతండు కోదండము నెక్కువెట్టి - మేఘ 
గంభీర వచనములతో నిట్లన్నాండట! 


శా॥ నిన్నుంగొమ్ముల జిమ్మెనో! కదిసెనో! నిర్భీతివై గోవులం 
దన్నంగారణమేమి మద్భుజసనాథక్షోణి నే వేళలం 
దు న్నేరంబుల సేయరా దెజుంగవా! ధూర్తత్వముం భూమి భృ 
త్సన్నాహంబు నొనర్చెదెవ్వండవు, నిన్‌ శాసించెదన్‌ దుర్మతీ. 
(ప్ర.స్క 415) 
కం॥ గాండీవియు! జక్రియు భూ | 
మండలి బెడంబాసి చనిన మదమత్తుండవై 
దండింపం దగనివారల 
దండించెదు, నీవదగుదు దండనమునకున్‌. 
(పస్క416) 


-ఇంతటి కోపములోం గూడ పరీక్షిత్తు సహజమైన శాంతిని వదలినవాండేగాండు. 
“నిన్నుం గొమ్ముల జిమ్మెనో! గదిసెనో” యను కూర్పు లోనున్న పోతన్న శైలిలోని 
వ్యవహారదక్షత మీరు గమనించియే యుందురని నాతలంపు. 


పోతన కవిత్వము ౨ 175 


నిన్నటి యుపన్యాసములో తమకు పక్వమైన పురాణశయ్యను గూర్చి మనవి 
చేసితిని. ఆ శయ్యాసౌభాగ్యము - ఆ యుదారరచన- పోతన్నలో నక్కడక్కడం 
గన్పించును. అంబరీషోపాఖ్యానములో నీ క్రింది పద్యము పురాణశయ్యకు చక్కని 
యుదాహరణము- 


క్స్‌ ఘనవైభవంబున కల్మషదూరుందై 

యజ్జేశు నీశునబ్దాక్షుగూర్చి 

మెనసి వశిష్టాది మునివల్లభులతోడ 
దగిలి సరస్వతీ తటమునందు 

మేధతో బహువాజి మేధంబు లొనరించె 
గణతింపరాని దక్షిణలువెట్టి 

సమలోష్ట హేముండై సకల కర్మంబులు 
హరి పరంబులుగాగ నవనియేలె 


en విష్ణుభక్తులందు విష్ణువునందుగ 
లంకయెడల మనసులంకెవెట్టి 
విహిత రాజ్యవృత్తి విడువనివాడునై 
యతండు రాచతపసి యనంగనొప్పె. (న.స్మ, కి4) 


-దీనిలో ఘనవైభవంబును- మొనసి- తగిలి- మేధతో నిత్యాదిశబ్దములు 
వ్యర్థపదములని కొందరాక్షేపించవచ్చును. ఇట్టి యాక్షేపణల విషయమై కొంత నా 
(ప్రథమ వ్యాసమున వివరించిచెప్పితిని. ఈ శయ్య నన్నయ భట్టులలో నక్కడక్కడ 
గన్పించును. ఎజ్జిన్నలోంగూడ కొంత యున్నది. తిక్కనామాత్యులు మాత్ర మీదృష్టిని 
మార్చుకొనిరి. వారికి కావ్యరచన శిల్పము. ఆ శిల్పము యెదిగియెదిగా భావకవులలో 
- తరువాతివారిలోనే స్థితికి వచ్చినదో మనవి జేసితిని. తిక్కన తరువాతగూడ - 
తిక్క్సనామాత్యుల శిల్పమును ప్రేమించినను- యీ పక్వమైన పురాణశయ్యపై మోజు 
వదలనివారు లేకపోలేదు. మార్మండేయ పురాణము - వరాహ పురాణము - 
- మొదలైనవానిలో నీపాకము బాగుగ గన్పడును. శ్రీనాథుండు గూడ నీసుగుణమును 


176 ఆం(ధ మహోాభాగవతోవన్యానములు 


వలచినవాండే! వీరందరికంటెను - తెగువగల యిట్టి రచనను ఆద్యంతము 
నడపించవలె నను చూపుగలవాండు రంగనాథ రామాయణ కర్త. అందుకే చదువుకొన్న 
వారేమనుకొన్నను - సామాన్యులలో రంగనాథ రామాయణమునకు - 
దానివంటిదేయైన యుత్తర రామాయణమునకుం బ్రచారము తగ్గలేదు. ఇంతకును 
- భాగవతమును జదువుకొనుటకు పాఠకుడు మనస్సులతోంబాటు బాహ్యముగను 
గొంత తయారుగావలెను. ప్రొద్దుటినుండి రాత్రివరకు నింటిపనులన్నియు గొజం 
తలేక చక్కబెట్టుకొని, రాత్రి భుజించి- పదిమంది తీరికగా గూర్చొనవలెను. వారి 
గోష్టిలో మధ్యమధ్య లౌకికవిషయముల గొడవ “నేనున్నానని ప్రవేశింపరాదు. 
నడుమ ప్రమితలో నాముదము బోసి యంటించిన దీవము కొడిగట్టక 
యాత్మజ్యోతివలెనే వెలుగుంచున్నది. అపుడు వయస్సుమళ్ళిన - రాగద్వేషాదుల 
యుద్వేగము తగ్గిన - యొకానొక పెద్ద-నాటకరాగములో- 


బీ ఒక వేయు తలలతోనుండు జగన్నాథు 
బొడ్డుం దమ్మిని (బ్రహ్మపుట్టె మొదల 
నతనికి గుణముల నతని బోలిన దక్షు 
డగు నత్రి సంజాతుండయ్యె నత్రి 
కడగంటి సూడ్ముల కలువల సంగడీం 
డుదయించె విప్రుల కోషధులకు 
నమరం దారాతతి కజుని పంపున నాథుం 


డై యుండి రాజసూయంబు సేసి 


తే మూండు లోకంబులను గెల్చి మోదకమునం 
జని బృహస్పతి పెండ్లాము జారుమూర్తి 
దార నిలుసొచ్చికొనిపోయి తన్ను గురుడు 
వేండు నందాంక న య్యింతి విడువండయ్యె. (న.375) 


-యని తిన్నగ నారంభించును. వాని చుట్టునున్న వారందజు “చక్కని పాటకు పడగ 
నాడించు పాములవలె” హాయిగ దలలాడించుచు వినుచుందురు. వారికి: నిజముగ 


పోతన కవిత్వము ౨ - | 177 


భాగవత మర్థమైనది. ఆ శయ్యలోని సౌలభ్యమును- ఆ కథలోని హృదయమును 
దెలియున దాపుణ్యాత్ములకే! అంతేగాని - “పొగగొట్టపు భూంకారధ్వనులలో” 
నానాభావ పంకిలములై చిల్లరంగడుల బోలు మనస్సులతో - మనము భాగవతమును 
చదివినచో - దాని రుచి యర్థముగాదు. ప్రొద్దున లేచినవెంటనే - ముఖము 
కడుగుకొనుమాట యెట్లున్నను - కాఫీ త్రాగుటకు మన మలవాటు పడితిమి. 
వేడివేడిగా నది వట్టి కడుపులలోనికి - దిగజాటినప్పుడు - కొంత బాధయే యగును. 
కాని - దానిని మనము - గణించుటలేదు. “గడ్డపెరుగు వేసికొని - హాయిగా చల్లి 
భుజించినచో - కడుపులో నెంతయో చల్లగనుండునే మీకీశిక్ష యేమని - వయసు 
మళ్ళినముసలమ్మలు - మా యింటలేరుగాని - పిల్లల కసరించుచునే యుందురు. 
నిజమే దాని చల్వను - మనమూహింపగలము. కాని - మన యలవాటులను 
మార్చుకొందుమా? పిల్లలు మార్చుకొందురా? అట్లే భాగవత పఠనముగూడ! ఇది 
మనకు చక్కగ నర్ధముగాకపోయెనే యని - యొక్కొక్కసారి - యాసక్తితోం 
జదువుకొననారంభింతుము గాని - మన దురదృష్టముం అది యెంత యర్థము 
గావలెనో అంతగాదు. ఎట్లు కావలెనో అట్లుగాదు. కారణమేమి? మన బ్రతుకులలో 
- భావములలో - దానికి వూర్వాంగములులేవు. నన్నయ్యకువలెనే 
పోతనామాత్యులకును శబ్ద సౌందర్యము పై6 గన్నుకద్దు. ఒక్కొక్కసారి వారు శబ్దము 
కొజికే పద్యమును వ్రాయుదురా! యనిపించును. ఈ క్రింది వట్టివి: 


క11 గజ నామధేయపురమున 
గజరిపు పీఠమున ఘనుడు గలిదమనుండ 
గ్గజవైరి పరాక్రముండే 
గజిబిజిలేకుండం దాల్చెం గౌరవ లక్ష్మిన్‌. (ప్ర.437 


-ఇందు పోతన్న హృదయమును లోంగొన్నది “గజ” శబ్దము. అదే నాల్గు రూపములతో 
నాల్గు చరణములలో సాక్షాత్మరించినది. ఇటువంటిదే 


క పురుందీ బోటికి నిందిర 
పురుండంబుజగాక యొరులు పురుందే యనుచున్‌ 


178 | ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పురుటాలికి పది దినములు 
పురుండు బ్రవర్తించిరెలమి పుణ్యపుగణితల్‌, 


అనునదియును 'పురు” డను శబ్దముపై పోతన్న చేయం దలంచికొన్న 'గారడీ'యే 
యీపద్యమునకు మూలము. నన్నభట్టు లీ విద్యలో సిద్ధహస్తులు. 


శబ్దముపై నింత గన్నుంచిన వాండు కనుకనే యాతండొక్కొక్కసారి - 
యుత్తాలముగ రసమును వర్ణింప దలంచుకొన్నప్పుడు - వీని సహాయముతో 
ననన్యసాధారణమైన సృష్టులొనర్చును. పరశురాముని కథలో నీ పద్యమున్నది. 


మ॥ ప్రళయాగ్నిచ్చట భంగిం గుంభివిదళింపంబారు సింహాకృతిం 
పెలుచున్‌ రాముండిలేశువెంట నడచెం బృథ్వీతలంబెల్ల నా 
కులమై క్రుంగం గుఠారియైం గవచియై కోదండియై కాండియె 
ఛలియై సాహసియై మృగాజినమనోజ్ఞశ్రోణియై తూణియె. 

(న.స్క 444) 


-దీనియందు కోదండి, కాండి, కవచి, యిత్యాది శబ్దములతో నాతండు వీరరసమున 
కెంతయో మెటుగువెట్టినాండు. ఈగుణము లాతనిరచనమున - నడుగడుగునను 
గలవు. గంగావతరణ వచనము - దేవదానవుల యుద్ధ వర్ణనము - వామనుం 
డెదిగినరీతి వర్ణించు చూర్ణిక - నృసింహావిర్భూతీ - శబ్దసంపదతో - నాతండెంతలలేసి 
పనులొనర్చునో - దెలుపుటకుం గొన్ని యుదాహరణములు: ఆతని పదములు 
చిలుకల గుంపులవలె బారులు కట్టును. పారిజాత పుష్పములవలె జలజల 
జల్లించికొనును. శరత్కాల ప్రవాహమువలె మందాలసముగం (బ్రవహించును. 
కోపముం గొన్న కోడెనాగులవలె తోకలపై నాడును. సంస్కృత సమాసములతో 
నెంతయో లాలిత్యమును గైకొని వచ్చినవాండు నన్నయ్య. ఆతని యా సిద్ధి సంస్కృత 
కవులకును లేదు. నన్నభట్టుల ననుసరించుట కెందటో వేకారి యాయాసపడిరి. 
అతనిని గొంత సమీపించిన దే కొందటో! వారిలలో కొంతవజకు కృతకృత్యులైనది 
మువ్వురే! మొదటివాండు పోతనామాత్యుండు. తరువాత అల్లసానిపెద్దన. ఆ 
చాయలక్కడక్కడ నందికొన్నవాండు కవిసార్వభౌముండైన శ్రీనాథుడు. ఈ శబ్దదృష్టి 


పోతన కవిత్వము ౨ 179 


పోతన్నలోం గొంత చాపల్యమునకే దారితీసినదనవచ్చును. ఒక్కొక్కసారి యాతండు 
శబ్దములను శబ్దములకొజికే వాడును. బ్రహ్మ యన్నదో నాతనికిం జాలదు. “తలవాకిట 
వాణిగల పోడిమిచే వాడిమికెక్కిన నలుమొగంబుల తక్కరిగొట్టు” యని బ్రహ్మాండముగ 
విస్తరించి చెప్పిననే యాకవికి తృప్తి. మరియొకచోట “సకలంబున సుకరంబున 
నెటింగెడి నెజవాడి “ముదుక యెజుకగల ప్రోడొయని బ్రహ్మనుద్దేశించియే పలుకును. 
దశమస్మ్కంధమున నొక ఫభంట్టమున్నది. నందాదులు బృందావనమునకు- 
సంసారములు తగిలించుకొని వచ్చిరట! ఆ సన్నివేశ మొకవచనమున (10. పూ. 425) 
వర్ణింపంబడినది. దానితోజు చూడంగా- ఒక పెద్ద సామ్రాజ్యము గదలినట్లున్నది 
గాని- గొల్లగూడెము గదలినట్లులేదు. శ్రీనాథుని పోకడలుకూడ నిటువంటివే! ఇవి 
యన్నియు నాచనసోముని నవీనగుణముల మాహాత్య్యము నన్నయ పాత్రలు మితముగ 
మాటాడును. పదిమాటలు పలుకవలసినచోట నొక మాట యని తక్కినవన్నియు 
మీరే యూహించికొమ్మనుట యతని రచన. ఈ సుగుణముచే నాతని రచనకు మేరువంత 
యౌన్నత్యము- సముద్రమంత గాంభీర్యము కుదురుకొనును. ఈగుణము 
నన్నయయంత లేకున్నను - పోతనామాత్యులకును గొంత కద్దు. కార్తవీర్యార్దునుండు 
బలవంతముగ మొదవును గొని మహిష్మతీ పురమునకుం బోయినాండు. అపుడు 
రాముండింట లేడు. వచ్చినవెంటనే - తల్లి రేణుక చెప్పినది. ఆతనికిం గోపము 
వచ్చెను. అపుడాయన- 


అ॥ అద్దిరయ్య యింట నశనంబుం గుడిచి మా 
యయ్య వలదనంగ నాక్రమించి 
కోరి మెదవు రాజు గొనిపోయినాండంట 
యేను రాముండాట యొజుంగందొక్కొ (స.స్మం. 446) 
యన్నాండు. 


రావణుని కార్తవీర్యార్దునుండు కూకటుల గదలించి పట్టుకొని - మోకాళ్ళను 
తాకించి - కింకరులతో కారాగారమునం బెట్టించినాడంట! తరువాత గార్తవీర్యుం 
డు మాహిష్మతికి వచ్చి- 


180 - ఆంధ్ర మవోభాగవతోవన్వానములు 


“ఓరీ, యిటమీద నూరకుండుము, జగతిన్‌ 

వీరుండ ననకుము, గాంచితి 

పోరా...” యని సిగ్గుపరచి పుచ్చినాండట! 
కాని- మితహిత సత్యవాక్యములతో నన్నయ్యను సమీపింపం గలవారు- నాటికిని- 
నేటికిని- ఆంధ్ర సాహిత్యములోనే లేరు. 


బంగారువంటి ప్రాయము- కొంగుపసిడి- చెలజిక్కు యిటువంటి నానుడులు 
పోతన్నలో నక్కడక్కడ కనుపించును. “మత్తికాండు- వేడుకలకత్త వంటి పదజాలము 
గూడ. తార బృహస్పతిని కన్నుగప్పి చంద్రుని బొందినది. బుధుండు పుట్టినాండు. 
వాండు నాభాగమని బృహస్పతి- నాకు రావలెనని చంద్రుండు- వాదుపడిరి. అపుడు 
బుషులు - సత్యనిర్ణయమునకై దేవతలనడిగిరి. వారు “ఆ వేడుకలకత్తె యెజుం 
గుగాని, యితరు లెజటుంగ”రన్నారట! ఇచట- వేడుకలకత్తె పదమెంతో వేడుకంగా 
నున్నది. 


నన్నభట్టులు యాటవెలందిని గొంత యాదరించిరి. కాని- వారా రచనలోం 
బ్రత్యేకతను జూపించిన వారుగారు. వానికిం గొంత నైపుణ్యమును- నడపించినవాం 
డు బమ్మెర పోతరాజు. భాగవతమున ప్రతి సీసపద్యము గడపటను-సాధారణముగ 
నాటవెలందియే తగులుచుండును. 'ప్రత్యేకముగ వ్రాసిన యాటవెలందులు కూడ 
నెక్కువ. వీనిలోని సౌందర్యమును “చాలు! చాలు! ననునంతవరకు పోషించినవాం 
డు వేమనయోగి! కాని తొలుత నొకవింత యొయ్యారముతో- ఆంధ్రభాషలో 
నాటవెలంది యడుగువెట్టినది పోతన్నతోనే! మహాలక్ష్మి వంటిదానికే “హంగు సేయుట 
కాతని కాటవెలంది కావలసివచ్చినది. అదృష్టము సేసికొన్న యా పద్యమిది- 


ఆ॥ చంచరీక నికర రుంకార నినదంబు 
దనరు నుత్సలముల దండంబెట్టి 
మేఘకోటి నడిమి మెజంగుం బుత్తడి మాడ్కి 
సురలనడుమ నిలిచె సుందరాంగి. (అ.స్మం.277) 


ఇది. యొక్కటేగాదు. ఆటవెలందులలో నాతండు కల్పించిన యొయ్యారములు 


పోతన కవిత్వము ౨ 181 


పలురకములు. ఒక్కొక్క రకములో నొక్నొక్క యందము. ఈ క్రిందిదొక సౌందర్యము. 


ఆ|| కామతంత్రటీక-కలువలజోక కం 
దర్చుడాక-విటుల తాల్మిపోక 
చకితచక్రవాక, సంప్రీత జనలోక 
రాకవచ్చె మేలు రాక యగుచు. 
ఇట్టి తమాషా’ లత డెన్నియో చేసినాడు. రసికులు దయతో నవలోకింపవలెను. 


పోతనామాత్యుల కవిత్వములో మూండుపాళ్ళు సంస్కృతమును యొకపాలు 
తెన్గును వచ్చును. తెన్గునుగూడ- “గుణముగ” నాతండు వాడిన చోటులున్నవి. 


“కొజనెలపైం దోంచు నిరులు నా జెలువొంది 
నొసలిపైం గురులు తుంపెసలుగురియ” 


అని యొకసారి పోతన్న-సంస్కృతమును ముట్టనని ప్రతినచేసి వ్రాయును. కాని 
సంస్కృతము నాశ్రయింపనిది- శబ్బసంపదలతో నొనర్చు నగిషీపనులను యెక్కువగా 
చేయుటకు వీలు తక్కువ. శ్రీనాథునకుగూడ నిదే యలవాటు. ఆంధ్రభాషలో సంస్కృత 
శబ్దముల పొంతంబోక- ఆచ్చికములతోడనే యమూల్యమైన రచనను చేయగల 
సామర్థ్యము నాటికిని-నేటికిని తిక్కనామాత్యులదేం! 


మనము మాటలాడునపు డొక్కొక్షసారి యిది చాల 'యిదిగా నున్నదందుము. 
అక్కడేదో భావస్ఫోరకమైన మాట మనకు తట్టుట లేదు. ఆకొజంతను “యిది యను 
సర్వనామము పూరింపవలెనని మన యాశ. ఇట్టి 'యిదు' లతో పూరించుకొనవలసిన 
చోటులు తిక్కనామాత్యులలో చాలవచ్చును. ఇఆయలవాటప్పుడవ్వుడు 
పోతన్నకుకూడనున్నది. భావములోని నత్తినాయన 'మంచి యను పదముతో 
పూరించుకొనుచుండును. పాలసముద్రమునయుట్టిన లక్ష్మీదేవికి-దేవతలేవేవో 
యుడుగరలిచ్చిరి. ఆ నడుమ భారతీదేవి యొక “మంచి” తారహార మొసంగెనట! 
(అ.స్క 271). ఈ తారహారములోని మంచితనమేమో వివరించుట కతనికి 
మాటలురాలేదు గాబోలు! ఈ 'మంచి' మరియొకసారి వచ్చును. యశోదకు కొడుకు 
బుట్టినాండని గోపికలకు. దెలిపినది. అపుడు వారందరు 'మంచి పదార్థములు 


182 ఆం(ధ మహాభాగవతోపన్యానములు 


కొనుచు వచ్చిరట! 


కం॥ కంచుకములు దలచుట్లును 
గాంచన భూషాంబరములు కడుమెజయంగనే 
తెంచిరి గోపకులందటు 
“మంచి” పదార్థములు గొనుచు మాధవుకడకున్‌. 
(ద.181) 


-ఇక్కడ మంచితనము గూడ పోతన్నకు సంభవించిన మాటలలోని నత్తియే! 
ఆంధధ్రకవికి -వ్యాసభగవానులవలాను- చక్కనియలంకారముల పై మమత 
వారప్పుడప్పుడు ఉపమానములు వాడుదురు. ఉపమానములకంటె - యుళత్రేక్షలు 
- రూపకములు మెండుగా వచ్చును. తరువాత ప్రబంధకవులకు వీరి యిట్టి పోకడలే 
మార్గదర్శకములైనవి. దశమ స్మంధములోని చం[ద్రోదయవర్ణనము నెన్నిసారులు 
చదివినను విసుగురాదు. ఆపద్యమిది. 


“విటసేనపై దండువెడలెడు వలజేని 
గొల్లెనపై 'హేమకుంభమనంగ 

గాముకధ్భృతి వల్లికలు ద్రెంప నెత్తిన 
శంబరాంతకు జేతి చక్రమనంగ 

మారుండు పాంధుల మానాటవులుగాల్ప 
గూర్చిన నిప్పులకుప్ప యనంగ 

విరహి మృగమ్ములవేంటాడ మదనుండు 
దెచ్చిన మోహనదీపమనంగ 

ఆ|| వింతనునుపు గలిగి వృత్తమై యరుణమై 
గాంతితోం జకోరగణము లుబ్బ 
బొడుపుంగొండ చక్కి బొడిచె రాకాచంద్ర 
మండలంబు గగనమండలమున. (ద.స్మ. 967) 


-ఈ క్రింది రచన స్వభావోక్తియో - యుత్రేక్షయో - మీరే యూహించికొనవలెను. 


పోతన కవిత్వము ౨ 183 


ఏదియైన గానిండు. అది - వెన్నలు - పాలు మెక్కిన కృష్ణుని వలెనే దిండుదిండుగా 
నున్నది. ఆ పద్యమిది: 
సీ; _ కర్ణావతంసిత కర్ణికార ప్రభ 
గండ భాగద్యుతిం గడలు కొలుప 
భువన మోహనమైన భ్రూవిలాసంబుతో 
వామ భాగానత వదనమొప్ప 
నపసవ్యకర మృదులాంగుళి చాతురి 
షడ్డ ధ్వనికి మర్మసరిణిం జూప 
డా కాలిమీద నడ్డము సాచి నిల్చిన 
పద నఖద్యుతి భూమి ప్రబ్బికానయగ 
తే॥ మౌళిపింఛముం గంఠదామమును మెజయ 
విలసిత గ్రామముగ నొక్క వేణువందు 
(బ్రహ్మగాంధర్వ గీతంబు పరంగం జేసె 
చతుర నటమూర్తి గోపాలచక్రవర్తి 
(ద.పూ.767) 


-లలితములైన - శ్లేషలు - ధ్వనులు - వీనిపైంగూడ పోతన్న కథిమానము కద్దు. 
వామన చరిత్రలో నతండు వ్రాసిన 


ఫ్‌ ఇది నాకు నెలవని యేరీతిం బలుకుదు 
నొకచో టనక నెందు నుండనేర్తు 
నెవ్వనివాండ నం చేమని నడువుదు 
నాయంత వాండ నై నడవనేర్హు 
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుం 
బూని ముప్పోకలం బోవనేర్తు 
నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ 
నేరుపు లన్నియు నేన నేర్తు 


184 ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


ఆ|| నొరులు గారు నాకు నొరులకు నే నౌదు 
నొంటివాండం జుట్ట మొకండులేండు 
సిరియుం దొల్లిగలదు చెప్పెద నా టెంకి 
సుజనులందుం దజచుం జొచ్చియుందు. 
(అ.స్మ, 552) 


-అను పద్యము ద్వ్యర్ధియైనను నేకార్థబోధకమైన పద్యమంత సులభముగ 
నర్ధమగుచున్నది. తజచుగ నాతండు దశావతారముల నీ శైలిలోం జూపుచుండును. 
ఇట్టి పట్టులలో - గొంత యాతండు - చాపల్యమునకు - లోంగినట్లును - మనకుం 
దోంచును. 


పోతన్న-శ్రీనాథుండు: వీరిరువురిని ప్రక్క ప్రక్కల నిల్పి చూచినప్పుడు కొంత 
రజోగుణము యొక్క వలలోంబడిన పోతన్న శ్రీనాథుండుగను - అంతర్జగత్తులో 
మునింగి సత్త్వగుణము కొంత తెచ్చికొన్న శ్రీనాథుండు పోతన్నగను - తప్పక 
మారుదురనిపించును. ఈ మాట నెందుకంటిననంగా - వీరిర్వురి చిత్తవృత్తులను - 
నడపించిన మూలపదార్థ మొక్కటే. తీవ్రమైన యావేశము. పోతన్నకు విష్ణులీలలు 
వర్ణించుట యందెంత యార్ట భావముగలదో - అట్టి యొడలు మజచునావేశమే - 
శ్రీనాథునకును శివలీలలు వర్ణించునపుడు గలుగును. “హఠము” అనునది - యారెండు 
చిత్తవృత్తులకున్న సామాన్య ధర్మము. కాని - శ్రీనాథునిలో నది రజోగుణ మిళితమై 
బాహ్యజగత్తున విహారములు సాంగించెను. ప్రతిపక్షుల విషయములలో శ్రీనాథుని 
చిత్తవృత్తి యిట్టిది- 

“కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్‌ 

వంటక మించునే యితర వర్తనముల్‌ పదివేలు మానసం 


బంటునె మానుషంబుగల యట్టి మనుష్యుల కెన్నడేనియున్‌ 
కంటకుందైన శాత్రవుండొకండు తనంతటి వాండు గల్లినన్‌. 


-ఇట్టి యఖినివేశమే పోతనామాత్యులకును గద్దు. కాని - వారి పూర్వపుణ్యముచే 
విష్ణుభక్తి ప్రాప్తించినది. ఆ సంస్మారముతో-వారిహఠమంతయు -కామక్రోధాదులను 


పోతన కవిత్వము ౨ 185 


జయించుటయందు- వైరాగ్యమును సంపాదించు టయందు- చరితార్థమైపోయెను. 
అది పోతన్న తపఃఫలము. వీరిర్వురి-మూలప్రకృతులలోను గొన్ని పోలికలు 
గనిపించును. శృంగారరసముపై శ్రీనాథున కమిత చాపల్యమనుట ప్రపంచమునకే 
తెలిసిన విషయము. అట్టి శృంగార లోలతయే పోతనామాత్యులకుగూడ నున్నది. 
కాని పోతన్నకు వైరాగ్యమెక్కువ. నియమశీలమైన జీవనము బాహ్యముగ నంటిన 
దారి(ద్యము-ఆతని ప్రవర్తనము నిరువైపుల సంరక్షించుకొనుచు వచ్చినవి. 
వైష్ణవోపాసనలో-నాంతరిక బాహ్య మాలిన్యముల నణచుకొన్నగాని క్షమాపణలేదు. 
వీరశైవములో నింతటి పట్టుదల యున్నట్లు కానరాదు. శివావతారులైన జంగములకు 
- మనస్సులనే గాక - తనువులనుగూడ నర్చించుట కైవల్య దాయకమని వారు 
తలంచిరి. మగవారికేమో గాని - మగువలకిది బుగగ నన్వయించినది. 
శ్రీనాథునివంటి వారికి మంచియవకాశము - దొజకెను. ఈ దృష్టిలోని యవకతవకలే 
- “కాళహస్తి మాహాత్యములవంటి కవితల కెక్కెను. పోతన్న కిట్టి యనుకూలము - 
అభిలాష రెండును లేవు. అందుచే నాతని శృంగార రసాపేక్షయంతయు 
కృష్ణపరమైపోయినది. గోపప్రీల విలాసములు - వారిరూపురేఖలు వర్ణించునపు 
డాతండెంతో యందముగ నారసమును తీర్చిదిద్దెను. గోపకాంతలు యశోదంకు 
గృష్ణుని యల్లరి చిల్లరి చేష్టలం దెలుపు ఘట్టము మూలములో మూండు శ్లోకములుగా 
మాత్రమున్నది. దీని నీతండు పెంచి సుమారు ముప్పది పద్యములు వ్రాసినాండు. 
వానిలో చదువుటకు కొన్ని వెగటు పుట్టించునవి గూడ! విష్ణువు మోహిన్యవతారము 
నెత్తిన ఘట్టములోను యితని పెంపకము కావలసినంత కలదు. గోపికా విరహవర్ణన 
- రాస క్రీడ, భ్రమర గీతలు - యిట్టివానిలో - పోతనామాత్యుం డాగోపికలు తానే 
యైపోయినాండు. కాకున్నచో నంతబాగుగ నాఘట్టములు వ్రాయుట యసాధ్యమైన 
పని. మహారాష్ట్రమునందలి భాగవతకర్త - యేకనాథుండు - భక్తులు- తమ 
కామక్రోధాదులను భగవంతునియందెట్లు నిక్షేపింతురో - విపులముగ వర్ణించి చెప్పెను. 
భాగవత రచనమందు - పోతనామాత్యు లా స్థితులనన్నిటిని - యనుభవించినట్లున్నది. 
ఆయనయే - యంబరీషోపాఖ్యానములో: 


186 | ఆం(ధ మవాభాగవతోపన్వానములు 


కం॥ పంచేంద్రియముల తెరువుల 
వంచించి మనంబునందు వరమతులు ప్రతి 
ష్టించి వహింతురు నన్నును 
మంచి వరుం బుణ్యసతులు మరగిన భంగిన్‌” 
(న.స్మం. 122) 


-అన్నట్లు - దశమస్మంధములో - సత్యముగ నాతండొక విరహపరితప్తయైె- 
'పతివ్రతయైన గోపికయే యైనాండు. ఆ మహాకవి - తన కామక్రోధాదులను 
భగవంతునిపై నిక్షేపించుటకు ఫలము-అతండు మాత్రమే కాదు; తెనుంగు దేశమే 
తరించుట యెనది. 

పోతనామాత్యులకు వివిధ చిత్తవృత్తులుగల నాయకులను సృష్టించుటకంటెను- 
నాయికలను సృష్టించుటలో నెక్కువ యపేక్ష యున్నట్లున్నది. ఆతండు వర్ణించిన 
శకుంతల- శర్మిష్ట- దేవకి- దేవయాని- రోహిణి- యశోద- వీరందరును 
_ చిత్తవృత్తులలో కేవలము విభిన్నలైన వ్యక్తులు. తమ కొక రెండుదాహరణములు 
మాత్రమే మనవి సేసికొందును. 


ఊర్వశికి మిత్రావరుణుని శాపము గలిగెను. అందుచే నావిడకు మానవజన్మ 
మేర్చడినది. కాని యంతకుముందే యూర్వశికి పురూరవునిపై నొక డ్రేమకద్దు. 
కారణమేమనంగా ఆతని శౌర్య సౌందర్యగాంభీర్యాది గుణములను నామె యింద్రుని 
సభలో నారదునిచే విన్నదట! ఊర్వశి భూలోకమునకు వచ్చి పురూరవుని ముందట 
నిలువంబడినది. వాండిట్లన్నాండు: 


త॥ ఎక్కడినుండి రాక మన కిద్దరకుం దగు నీకు దక్కితిన్‌ 
మ్రుక్కడి వచ్చెనే యలరు ముల్ములవాడ డిదంబు (ద్రిప్పుచే 
దిక్కు నెజుంగనీడు నను దేహము దేహము గేలుగేల నీ 
చెక్కున చెక్కుమోపి తగు చెయ్వుల నన్ను విపన్ను గావవే! 

-ఊర్వశి మహాప్రొఢ. వాండీ మాటలన్నంతనే వీండు లఘుహృదయుండని యామె 
యర్థము సేసికొన్నది. ఈ భావము నామె బైటంబెట్టినది గాదు. ఇంతలో 


పోతన కవిత్వము౨ 187 


గంధర్వులువచ్చి పురూరవుని (పేమవిఘాతమును జేసినారు. ఆమె వాని 
కన్నుమటంగి పోయినది - నాటనుండి పురూరవుండు వెళ్టివాండై యూర్వశిని వెదకుచు 
తిరుంగుచున్నాండు. ఒకసారి సరస్వతీ నదీ తీరమున నామె వానికంట బడెను. 
వీనిని వదలిపోయినది మొదలు ఊర్వకశికి వీని గాలియే లేదు. యోగ వియోగములకు 
మనసివ్వరా దనునది యామె నేర్చుకొన్న కామశాస్త్రవేదాంతము. పురూరవుండామె 
కడకేంగి దీనముగ యాచించినాండు. అపుడూర్వశి తన మనస్సులో వీనిని గుణించి 
యున్న నిజమైన భావమును బైటబెట్టినది. అది యిది: 


కం॥ మగువలకు నింత లొంగెదు 
మగవాండవె నీవు! పశువు మాడ్మిన్‌ వగవన్‌ 
దగవే? మానుష పశువును 
మృగములు గని రోయుగాక మేలని తినునే! 
(స-415) 
-ఈతలం పామె కీనాండు గలిగినది గాదు. పురూరవుని జూచిన మొదటినాండే 
యేర్చడినది. ఆభావమునింతవరకు దాంచినది. ఆ తరువాత నామె తన కులధర్మము 
నీరీతి వెల్లడించెను. 


మ॥ తలయపుల్‌ చిచ్చులు మాటలుజ్ఞ్వల సుధాధారల్‌ విభుండైన పూ 
విలుతున్‌ మెచ్చర, యన్యులన్‌ వలతురే విశ్వాసమున్‌ లేదు క్రూ 
రలుతోడన్‌ బతినైన చంపుదు రధర్ముల్‌ నిర్ణయల్‌ చంచలల్‌ 
వెలయాంద్రెక్కడ! వారివేడబము లావేదాంతసూక్తంబులే. 

(న.416) 


ఊర్వశీ పురూరవుల (ప్రేమలో పురూరవుండు (్రేమైకవశుండు. కడుంగడు దీనుం 
డుగూడ. ఆదేవకాంత వానితో నెప్పుడును సేవంజేయించుకొన్నదేగాని- వాని కొకనాం 
డైనను సేవజేసినట్లు గానరాదు. ఇది యనుకూల పతిక. ప్రౌాఢనాయిక. 


దుష్యంతుడు వేటకు బోయెను. ఆశ్రమమునందు శకుంతల యొక్కతియ 
యున్నది. ఆశ్రమమునం బ్రవేశించిన దుష్యంతుని కామె కంటంబడినది. దట్టపుం 


188 ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


దుజుము-మిజుమిజు చూడ్కులు-నట్టాడునడుము - దుష్యంతున కింకేమిగావలెను? 
వెంటనే యతండు తన మనస్సును బైట పెట్టినాండు. ఆమెకును దుష్యంతుని జూచిన 
వెంటనే మతివోయినది. ఇంతలో మన్మథుండొకండు నడుమ దూజిను. వాండు 
గుసుమాస్రములతో నా బానలను గొట్టినాడంట! శకుంతల తాలిమి సెడి యిట్లు 
బదులు పలికినది: 


మ॥  అనివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్ర భూభర్తయున్‌ 
గని రా మేనక డించిపోయె నడవిన్‌ గణ్వుండు నన్నింతగా 
మనిచెన్‌ సర్వము నా మునీంద్రుం దెజుంగున్‌ మద్భాగధేయంబునన్‌ 
నిను గంటిన్‌ పిదపన్‌ గృతార్థ నగుదున్‌ నేండీ వనాంతంబునన్‌. 
(న.617) 


శకుంతల ముగ్ధ. భావగోపన మింకను ఆమెకు బాగుగ నలవాటైనది గాదు. ఊర్వశి 
తాను పురూరవుని (పీమించితినని నోరార చెప్పనేలేదు. శకుంతల చెప్పినది. ఆ 
చెప్పుట “కృతార్ధనగుదున్‌” అని యెంతో నాజూకుగా నన్నది. సత్ములమునం బుట్టిన 
కన్యక యింతకంటె మతియేమనును? 


పోతనామాత్యుండు సృష్టించిన దేవయాని మహాగర్వోద్యమసాని, భూరికోపాన 
లాకలితగ్గానికూడ. ఆమె దృష్టిలో శర్మిష్ట తండ్రి శుక్రాచార్యునకు దాసుండు. తన 
చీర కట్టుకొన్న శర్మిష్టను “విహితములే కుక్కలకు హవిర్భాగంబులొ” యని యామె 
(బ్రశ్నించు చున్నది. శర్మిష్ట గూడ కోపమున తక్కువదిగాదు. కాని- యాకోపము 
క్షణమాత్రము. శర్మిష్ట దేవయానికి దాసియైనది. దానికి కారణము తండ్రియాజ్ఞ 
అపుడామె “చల మింకేల పోనీలొమ్మని తన్ను తాను సవరించుకొన్నదంట! ఆ సవరింపు 
తన కార్యమును సాధించుకొనుటలో దీక్షయే! 'ఎడరువేచి' ఒకానాకనాండు యయాతిని 
లోగొన్నది. దేవయాని కాసంగతి తెలిసి క్రోధ మూర్చితయయ్యెను. యయాతి 
భంగపడినాండు. ఆమె విన్నదిగాదు. యయాతి యపరాధము. శుక్రుని చెవులకు 
తాకనేతాకినది. శర్మిష్ట క్షత్రియ కాంత కుచితమైన భావగోపనముగల యువతి. 
దేవయానికి తోంచిన భావము దాంచికొను నలవాటులేదు. 


పోతన కవిత్వము ౨ | | 189 


సాధారణ కవులు ఆంగిక శృంగారమును వర్ణించి తృప్తి చెందుదురు. ఇతం 
డును స్రీలయంగములను (ద. 218) వర్ణించును. కాని దానికన్నను స్త్రీల చేష్టలు- 
విలాసములు వర్ణించుట-పోతనామాత్యులకు ప్రియమైన పద్ధతి. స్ర్తీల యేడ్పులలో 
నందమును భావించిన కవులు కొందటున్నారు. శ్రీనాథుండే ఆ రసికతకు 
మొదలుపెట్టెనేమో! దానిని రామరాజ భూషణుండు సాగందీసి పెద్దరాగముగం జేసెను. 
పోతనామాత్యులకు గూడ ప్రీల యేడుపన్న నిష్టమే! నారదుని వరమువలన చిత్రకేతున 
కొక కుమారుండు పుట్టెను. వాండు కలిగినది “కృతద్యుతి” యను పట్టమహిషికి 
అసూయగొన్న సవతులు వానిని చంపినారు. అపుడాకృతద్యుతి వక్షము మోదికొంచు 
విపరీతముగ నేడ్చినది. 


al కుంకుమరాగ రమ్య కుచకుంభములన్‌ గడు కజ్జలంబుతోం 

బంకిల మైన భాష్ప్రములం బాల్పడ మజ్జన మాచరింపుచున్‌ 

కంకణపాణి పల్లవయుగంబున వక్షము మోదికొంచు నా 

పంకరుహాక్షి యేద్చె పరిభావిత పంచమ సుస్వరంబునన్‌. 

(ష.స్క 451) 

-ఈ పద్యమును జదివిన 'కృతద్యుతి' పాటబాడినట్లు తోచునేగాని పరిదేవనము 
సేసినట్లు లేదు. ఇక్కడ వర్ణింపబడిన ఆమె రూపమును- శృంగారమున కొసం 
గినంత ప్రాంవు దైన్యమున కొసంగుట లేదు. మన్మథుండన్నను పోతన్నకు మక్కువే! 
వాని పరాక్రమములను మాటిమాటికి కతండు వర్ణించుచుండును. వాని 
విక్రమవిధానమున నొక సన్నివేశమిది: 


కం॥ కంఠే కాలునిచేతన్‌ 
కుంఠితుండగు టెట్లు మరుండు కుసుమాస్రంబుల్‌ 
లుంఠించి గుణనినాదము 
ఠంఠమ్మని బాల నేసె టవఠవ గదురన్‌. (9-615) 


అన్నివిధములైన శృంగారములును పోతనామాత్యులకు ప్రియమైనవే! ఆతని 
భాగవతములో కలహాంతరితలు, విరహిణులు, సంయోగ గర్వితలు, వాసక సజ్జికలు- 
ఇట్టి నాయకిలు కొల్లలుగా వచ్చుచుందురు. 


190 ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


శృంగారమునకును హాస్యమునకును జక్కని లంకె. సాధారణముగ 
శృంగారమును ్రేమించువారిలో హాస్యముపై నాసక్తియు గొంత యుండును. 
నిజముగా నవ్వు మానవునకు భగవంతుం డొసంగిన యమూల్యమైన వరము. ఒక 
చిజఖునవ్వు గూడ నవ్వక- యిరువదినాలుగు గంటలు కాలిన పెనమువలె 
మూతిబెట్టుకొని యుండుట కొందబు గొప్ప సభ్యతగ భావింతురు. అట్టివారిని 
జూచిన నాకు “పాపమయ్యోం” యనిపించును. వారు జీవితమెట్లు వెళ్ళబుత్తురో 
గాని- మనకుమాత్రము వారిని జూచిన యోర్చుకొనుట యొక నరకయాతన! 
“సరేలేవయ్యా! నీకు కొంతకు కొంత యన్నియు నమరియున్నవి గనుక నందముగా 
నవ్వెదవు. మా కిరువదినాల్లు గంటలేవో సాంసారిక చింతలు. నీవలె తిన్నంగాం 
- గూర్చొని నవ్వుటకు తీరికలే”దని కొంద అందురు. నా మనవి యేమనంగా నింటిలో 
నన్నియు నమరియున్న నే నవ్వవలె నను నియమము లేదు. మన సాంసారిక 
కష్టములు పోగొట్టుకొనుటకే హాసమొక యమూల్యమైన యౌషధమని నేను జెప్పునది. 
నా యనుభవములో ధనికులకన్నను దరిద్రులే తృప్తిగ నవ్వుదురు. కాని కొందజు 
వచ్చు నవ్వునుగూడ బలవంతముగ నాపికొని యేమో గాంభీర్యమును ప్రదర్శింప 
నారంభింతురు. అది వారి దురదృష్టము. ఒకసారి ఉత్తర హిందూస్థానమున నొక 
విద్వాంసుని గలిసికొంటిమి. అతండు ప్రసంగవశమున తులసీరామాయణముపై 
తానొక వ్యాఖ్యాతనని పల్కెను, తులసీదాసును వ్యాఖ్యానించుటకు తనకున్న ప్రత్యేక 
యోగ్యతలలో- నవ్వుకుండుటయు నొకటియని యాతని మాటలలో నే తెలిసికొంటిని. 
అతండంట! సుమారిరువది యేండ్లనుండి యొకమారైనను నవ్వలేదంట! ఆ గాంభీర్యమే 
తులసీదాసులను వ్యాఖ్యానించుట కొక ప్రత్యేకమైన యోగ్యతయంట! ఆ వ్యాఖ్యాతను 
జూచుటకే నాకు భయమయ్యెను. ఇట్టివాండు తులసీదాసునకు దొరకుట క్షయముకాగా 
మిగిలిన కర్మలేశమునకు గుజుతేమో యనిపించినది. ఆ వ్యాఖ్యాత తన గ్రంథమును 
నా కొసంగుదునని పలికెను. దానిని దీసికొని చదువు సాహసము నాకులేకపోయినది. 
చదివినచో ఆతనికున్న రోగము నాకుగూడ దగులుకొనునేమోయని నాభయము. 
శ్రీనాథునిలో విపరీతమైన హాస్యముగలదు. ఆతనిది మందహసితముగాదు. అతి 


పోతన కవిత్వము ౨ 191 


హసితము. ఒక్కొక్కసారి యపహసితముగూడ పోతనామాత్యుల యందును- 
హాస్యరసమున్నది. శ్రీనాథుడు భోగ్యవస్తువులన్నియు నమరియుండి నవ్వినవాండు. 
పోతన్న పరమదారిద్యములో నుండియు- తృప్తిగా నవ్విన భాగ్యశాలి. కాని 
నగవునందును- వారికి కొంత సంయమమే యున్నది. సామాన్యముగ పోతన్నది 
మందహాసమే. అరుదుగా దప్ప హద్దుమీరిన చోటుండదు. కృష్ణుని బాలలీలలలో- 
నీ హాస్యరసము- కొంత చోటుచేసికొన్నది. కాస్తంత యెక్కువ గూడనేమో! తమరు 
చదివికొనవచ్చును. వామనుని కథలో గురుశాప తప్తుండైన పరిస్థితిలో గూడ బలి 
తన మందహాస ప్రియత్వమును విడవలేదు. అనంగా దుర్భరదారిద్యమునందును 
పోతన్న తన హాస్య ప్రియత్వమును మానలేదన్నమాట! ఆ పద్య మీక్రిందిది: 


© వె పుట్టినేర్చికొనెనొ పుట్టక నేర్చెనో 
చిట్లి బుదులిట్సి పొట్టివడుగు 
అ ప లబ ల 
బొట్టనున్న వెల్ల బూమెలునని నవ్వి 
ల aa) 
యెలమి ధరణిదాన మిచ్చెనపుడు. 
కానీ సాధారణముగ నిట్టివరుదు. ఒక్క పదముతోనో, వాక్యముతోడనో హాస్యమును 
సూచించుట పోతన్న వాడుక. యయాతి చరిత్రములోని యదువు చెప్పిన ఈ క్రింది 
పద్యమట్టిది: 
శా॥॥ కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృ 
చ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేద ప్రణాకంపన 
శ్రాంతిస్ఫోటక యుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానా సుఖో. 
పాంతంబైన వయోనిధాన మిది యయ్యాం తేరయీ వచ్చునే. 
(న.551) 


-దీనిలో 'తేరయీోవచ్చునే” అనే పదము చదివినపుడు మాత్రమే కాసంత మన పెదవి 
విచ్చును. 

ఒక్కొక్కసారి పోతన్నయే మనయెదుట నిలచి చిబునవ్వుతో కెదికి 
హెచ్చరించుటయు కద్దు. అట్టిది యొకటి. 


102 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


కం॥ తజ్జనని లోంగిటంగల 
రజ్జు పరంపరలం (గ్రమ్మరం సుతుంగట్టన్‌ 
౬ లట 
బొజ్జ దిరిగి రాదయ్యె జ 
గజ్జాలము లున్న బొజ్జం గట్టన్‌ వశమే! (ద.పూ. 888) 
-అట్టి చోటులలో గూడ నితని హాస్యము లలితమైనదే! ఈపద్యమును చూడుండు: 


ఆ॥వె॥। పొడుపుం గొండమీంద పొడుచుట మొదలుగా 
బరువువెట్టి యినుండు పశ్చిమాద్రి 
మరుగు జొచ్చెగాక మసలిన చలిచేతం 
జిక్కెచిక్కె ననగ చిక్కకున్న? 
-ఈ పద్యమునందు నాల్గవపాదమునందు మాత్రమే కొంత హాస్యమున్నది. 
సాధారణముగ నాతనికి చేష్టలతో హాస్యమును వర్ణించుట ప్రీతి. ఇందు 
కుదాహరణములు తమరు గోపికల క్రీడలు మొదలైన వానిలో జూడవచ్చును. 


భక్తి శృంగారములు, కరుణ-పోతనామాత్యులకు చాల ప్రియమైన రసములు. 
అశ్వత్థామను బట్టికొనివచ్చినప్పుడు ద్రౌపది బలికిన యా పద్యము లితర కవులెవ్వరును, 
(వాయలేనంత బాగుగానున్నవి. వైరాగ్యము, వశ్చాత్తాపము మొదలగు 
భావములనుగూడ ఆతండెంతయో సానుభూతితో వర్ణించును. ఆ గుణము లామహాకవి 
జీవితములో అంత గాఢముగా నదుకుకొన్న వన్నమాట. సౌభరి మహాతపస్వి. 
ఒకనాండాతండు స్నానార్ధమై యమునకు వెళ్ళెను. అక్కడ నొక మీనరాజు 
తనకుటుంబముతోం గనపడినాండట! సౌభరికి సంసారముపై మనసు పోయినది. 
మాంధాత తన కూంతుల నందర నొసంగి యాతనికిం బెండిలి సేసెను. సౌభరి 
సుఖములన్నియు ననుభివించినాండు. ఒకానొకనాం డేకాంతమున నిట్లాలోచించుకొనాం 
డంట! 


మ।॥। ఉపవాసంబుల డయ్యుటో విషయ సంయోగంబు వర్ణించుటో 
తపమున్‌ బూని చరించుటో హరి పడ ధ్యానంబునన్‌ నిల్చుటో 
యపలాపంబున నేలం బొందితి హతంబయ్యెన్‌ దపంబెల్ల నీ 


పోతన కవిత్వము౨ 193 


కపటస్రీ పరిరంభముల్‌ మునులకున్‌ గైవల్య సంసిద్ధులే. (న.185) 
చ మునినట! తత్వవేదినట! మోక్షముగాని సుఖంబు లెవ్వియున్‌ 
జనవట! కాంతలేబదట! సద్మచయంబట వాసదేశమున్‌ 
తనయులు నైదువేలట నిదానము మీనకుటుంబి సౌఖ్యమున్‌ 
గనుటటం చెల్లరే! నగవుగాక మహాత్ములు సూచిమెత్తురే. (న.186) 
పై పద్యమును చదివినప్పుడు యెవ్వనికైనను కడుపున చేయివెట్టి కలం 
చినట్లగును. దీనికి కారణ మాతండంత లీనుండై వ్రాయుటయే! 
కృష్ణుడు తప్పుజేసినాండు. అప్పుడు యశోద వానిని కట్టివేయుటకై 
ప్రయత్నించినది. ఆ వెన్నదొంగ తప్పించుకొనుట కట్లు ప్రయత్నించుచున్నాండో 
చూడుడు: - 
బీ స్తంభాదికంబులు దనకు నడ్డంబైన 
యిట్టట్టు జని పట్టనీని వాని 
యీ తప్పు సైరింపు మింక దొంగిలంబోవ 
నేనని మునుముట్ట నేడ్చువాని 
కాటుకనెరయంగ కన్నులు నులుముచు 
వెడలు కన్నీటితో వెగచువాని 
నేదెస వచ్చునో యిది యని పలుమాజు 
సురుంగుచు క్రేంగంటం జూచువాని 
ఆ|| వె।। గూడబాటి పట్టుకొని వెజపించుచు 
చిన్ని వెన్నదొంగ చిక్కె ననుచు 
నలిగి కొట్ట చేతులాడక పూంబోణి 
కరుణతోడ బాలు కట్టందలంచి (ద.పూ.871) 
-ఇట్టి పద్యములు తెలుగు వాజ్మయముననే అరుదుగా దొరకును. లలితములైన 
భావములను పోతన్నవలె చెప్పగల వారాంగ్రవాజ్మయమున చాల తక్కువ. వర్ణనలు 
వచ్చునపుడు ఆతండు కొంత విస్తృతముగ వర్ణించును. శబ్బసంపదకే కొన్నిపద్యముల 
నాతండు పలుకును. తిక్క్మనామాత్యుల కవిత్వములో నొకానొక పద్యమునకు 
కథాసందర్భమునుండి వేజుపజచినపుడు జీవములేదు. పోతనామాత్యులలో 


104: | ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు .. 


విశకలితములుగా చదువుకొనుటకు పనికివచ్చు పద్యము లెక్కు కథారచనలో 
పోతనామాత్యుండు చూపించిన మెలకువ యెంతయోగలదు. వామన చరిత్రలో 
నాకౌశల్యము పరాకాష్ట చెందినదనవచ్చును. వామనమూర్తి సభయందు ప్రవర్తించిన 
విధము-బలి వామనుల సంభాషణము -యీభావమంతయు -పోతనామాత్యుని 
స్వకపోల కల్పితమే బలిచక్రవర్తి కథ చదివినపుడే పాఠకునికిగాని-వామనునిపై 
సానుభూతి కలుగదు. మన హృదయములోగొను నుదాత్తనాయకుండు బలిచక్రవర్తి. 
పోతన్న హృదయములోంగొన్నవాండు గూడ నతండే. 
దశమస్మంధములో కృష్ణవిరహ పరితప్తయైన గోపిక-పోతనామాత్యుండు 
కృష్ణునుద్దేశించి: 
సీ! అదె నందనందనుం డంతర్జితుందయ్యె 
పాటలీ తరులార! పట్టరమ్మ! 
హేలావతుల గృష్ట! యేలబాసితివని 
యైలేయ లతలార! యడుగరమ్మ! 
వనజాక్షుం డిచటికివచ్చి డాంగండుగదా! 
చూతమంజరులార! చూడరమ్మ! 
మానినీ మదనుతో మారాక యెతింగించి 
మాధవీ లతలార! మనుపరమ్మ! 
ఆ|| వె।।  జాతిసకుల బాయ నీతియే హరికని 
జాతులార! దిశలం బాటరమ్మ 
కదళులార! పోయి కదిలించి శిఫిపింఛ 
జూటుందెచ్చి కరుణం జూపరమ్మ! 
అని దీనముగా బలికెను. పోతనామాత్యుల విషయమున మనకుం దక్కిన 
భాగ్యముగూడ నంతే! ఆ మహనీయుని గుతించి మన మీ పద్యమును మాటిమాటికిని 
మననం చేసికొనవలసినదే! ఆంధ్ర సాహిత్యములో నాతండొక స్వప్నము 
వంటివాండు. కవులెందతో పుట్టిరి. పుట్టుదురు. పోతనామాత్యులవంటి తపస్వి, 
బుషి కవి, పుట్టుననిమాత్రము ధైర్యముగం జెప్పలేము. బే 


పోతన భాగవతము 


రాజవంశములు - భువనకోశము - 
ఇతర శాస్త్రములు 


డా॥ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులుగారు 
M.A., Ph.D. 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 197 
అన ల్స్‌ 
పూర్వ అరక 


పోతన భాగవతమునందు సంస్కృతమునందు భాగవతమునందు కానరాని 
చారిత్రక విషయములెవ్వియు కానరావు. పోతనకు బొత్తిగా చరిత్ర దృష్టి లేదనుటలో 
. అతిశయోక్తి ఎంతమాత్రమును లేదు. మూలమునందున్న చరిత్రను విమర్శించు 
మాట యటుండ దానిని సరిగ అర్ధము చేసికొని తన గ్రంథమున చేర్చుటయందుకూడ 
కొంత బెదాసీన్యము వహించెనేమో. అందువలననే సంస్కృత భాగవతమునకును 
పోతన భాగవతమునకును కొన్ని ముఖ్యభేదములు కాన్సించుచున్నవనియు 
తోచుచున్నది. 


అసలు సంస్కృత భాగవతమునందలి రాజవంశ వృత్తాంతమునందే మత్స్య, 
వాయు, విష్ణుపురాణములతో పోల్చిచూచ్చిన యెడల కొన్ని భేదములు కాన్పించుచున్నవి. 
భవిష్యద్రాజవంశ వృత్తాంతములను తెలియపరచు పురాణములనన్నిటిని పరిశీలించి 
వానిలోని చారిత్రకాంశములన్నిటిని చర్చించి యిదమిత్ణమని నిర్ణయించుటకుగాని 
ఈ దృష్టితో పరిశీలించినపుడు పురాణములలోపల ఎంతవఅకు నమ్మదగినవి అని 
నిశ్చయించుటకు గాని, వానిలో భాగవతమునందలి రాజవంశ వృత్తాంతము 
ఎంతవఅకు నమ్మదగినది అని కాని చర్చించుటకు గాని ఇచట గ్రంథవిస్తర భీతిచే 
సాధ్యముకాదు. 


ఇక పోతన భాగవతమునందలి విషయమును గాని, లేక సంస్కృత 
భాగవతమునందలి విషయమునుగాని సమన్వయముచేసి చూపవలెననిన యెడల 
ఇతర పురాణములందలి అంశములన్నిటిని పరిశీలించి వాని సహాయముచేత 
సమన్వయము చేసినగాని సాధ్యముగాదు. ఒక్క పురాణములేగాక ఇతిహాసద్వయము 
చేసినగాని సాధ్యముగాదు. ఒక్క పురాణములేగాక ఇతిహాసద్వయముగూడ ఈ 
సందర్భమున అత్యంతావశ్యకములైన ఆధారసామగ్రి చారిత్రక పరిశోధనయందు 
ఎట్టి ఆధారములను పరిశీలింపక వదలివైచుట సాధ్యముగాదు. కాబట్టి 
భాగవతమునందలి చారిత్రకాంశములను సమగ్రము చర్చింపవలెనన్నవో ఒక్క 


198 ఆం(ధ మవోభాగవతోవన్యానములు . 


పురాణేతిహాస వాజ్మయము మాత్రమేగాక ఈ అంశములనుగూర్చి ప్రస్తావనజేయు 
బౌద్ధ, జైన వాళఖ్మయమేమి, అంతకన్న ముఖ్యాధారముల వేదవాజ్మయమేమి ప్రాచీన 
చారిత్రకాధారముల నన్నిటిని కొద్దిగనో, గొప్పగనో పరిశీలించినగాని చారిత్రక 
సమన్వయమున కుదురదు. అందువలన ఈవ్యాసమున ప్రధానముగ భాగవతమును 
(అందులో ముఖ్యముగ పోతన భాగవతమును) దృష్టియందుంచుకొని యుండినను 
నంమార్శతకొరకై ఇతర చారిత్రకాంశములునుగూడ (అవి పోతన 
భాగవతమునందుగాని, సంస్కృత భాగవతమునందుగాని సంక్షిప్రములైనను) 
కొంతవజకు చేర్చబడియున్నవి. ఎన్నియో అంశములు భేదాభిప్రాయమునకు 
తావిచ్చుచున్నవి గాని వాటి నొక్కొక్కదానిని చర్చించినచో ఈవ్యాసము మితిమీరి 
పెరిగిపోవు నను భయముచే బహుజనామోదమును బడసిన అభిప్రాయములను 
మాత్రము విశదీకరించి చర్చలను వదలివైచితిని. 


ఈ వ్యాసరచనయందు నాకు తోడ్చడిన గ్రంథములు అసంఖ్యాకములు, 
వానినన్నిటిని ఇందు పేర్కొనుట దుస్సాధ్యము. కాని సుమారు ముప్పది 
సంవత్సరములుగ ఈవిషయమునుగూర్చి చదువుచున్నను ఈ ప్రచురితములైన 
గంథములన్నియు నాకు లభించనందున ప్రధాన (గ్రంథములను మాత్రమే 
దృష్టియందిడుకొని నా రచనను సాగించితిని. ఇందు పొందుపరచిన అతిసంగ్రహ 
పుస్తకముల పట్టికలోని (గంథములన్నిటికిని నేను కృతజ్ఞుడను. ముఖ్యముగా రాప్సన్‌, 
హంజా, పార్టిటల్‌, పుసాల్మర్‌, రాయ్‌చౌదరి మహాశయులకు అధికముగా 
బుణపడియున్నాను. అట్టి గురువర్యుల శిక్షణయుండియు నేను అక్కడక్కడ ఏవైన 
దోషములు చేసియుండిన యడల క్షంతవ్యుడను. 





భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 199 


OO 
కాలక్రమము 


చరిత్ర కందరాని ప్రాచీన కాలము నందలి పౌరాణిక సంఘటనలను గాని, 
రాజవంశ వృత్తాంతములను గాని కాలమానరీత్యా నిర్ధారించి చూపుట దుష్మరమైన 
పని. కడకు ఒక్కొక్క యుగము యొక్క పౌర్వాపర్యములను నిర్ధారించుటయు గూడ 
దుస్సాధ్యమే. కాని భారత యుద్ధము ప్రాచీన సంఘటనలలో అత్యంత ప్రాముఖ్యము 
గలది. కాన భారత యుద్ధకాలమున నిశ్చయింపగలిగిన యెడల దీనిపై నాధారము 
చేసి ప్రాచీన రాజవంశముల కాలమును ఒక మోస్తరుగ నిర్ణయము చేయవచ్చును. 


భారత యుద్ధము కలియుగారంభముననే జరిగెననియు, కలియుగము 
ఆరంభమైన పిదప 653 సంవత్సరములకు జరిగెననియు రెండు ముఖ్యమైన 
సంప్రదాయములు కలవు. మొదటి వాదమునకు బాదామి చాళుక్య రాజగు రెండవ 
పులకేశి యొక్క ఐహోలెశాసనము ఆధారము రెండవ దానికి ఆధారము వృద్ధగర్గ. 
వరాహమిహిర. కల్షణుల వ్రాతలు. కలియుగము క్రీ.పూ.3102 నందు 
ప్రారంభమాయెనని ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞుల సంప్రదాయమును ఆర్యభటుడు 
ఉద్దాటించి యున్నాడు. 


మహాభారత (గ్రంథమునందు ప్రస్తావించిన నక్షత్ర, గ్రహస్థితిని బట్టి 
కాలనిర్ణయము చేయుటకు కొందబు ప్రయత్నము చేసియున్నారు. కాని 
పరస్పరవిరుద్ధములగు అంశములే ఈ మహాభారతము నందు తెల్పబడియున్నందున 
ఈరీతిగ ఎట్టి సమన్వయమును కుదురుట లేదు. 


నందవంశ రాజగు మహాపద్ముడు క్రీ.పూ. 382 యందు సింహాసన మెక్కెను, 
ఇంతకు పూర్వము 1015 సంవత్సరముల క్రితము పరీక్షిత్తు జనించెనని 
పురాణములును, మహాభారతమును చెప్పుచున్నవి. అతడు మహాభారత 
యుద్ధమునందు జనించెను. కాబట్టి భారత యుద్ధము సుమారు (1015+382) = 
క్రీ। పూ॥ 1397 నందు జరిగెనని చెప్పవచ్చును. మహాపద్మనందునికిని, జనమేజయుని 


200 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


ప్రపౌత్రుడగు అధిశీమకృష్ణునికిని మధ్య 26 మంది రాజులు పరిపాలన మొనర్చిరట. 
ఇది బహుశః పొరబాటేనేమో. లేకున్న ఒక్కొక్క రాజునకు సరాసరి 18 సంవత్సరముల 
చొప్పున(26౫18) = 468 సంవత్సరములును, యుధిస్టిర అధిశీమకృష్ణులకు మధ్య 
100 సంవత్సరముల అంతరాళమును మొత్తము కాలము 1015 సంవత్సరములకన్న 
చాలా తక్కువ యగుచున్నది. ఒక్కొక్క రాజునకు 18 సంవత్సరములకన్న ఎక్కువగ 
రాజ్యకాలము నాపాదించుటయు కూడ చారిత్రక సంప్రదాయమునకు విరుద్ధము, 
కాబట్టి భారత యుద్ధము సుమారు క్రీ॥ పూ॥ 1400 ప్రాంతమున జరిగినదని 
తలంపవచ్చును. 


భారత యుద్ధమునకు పూర్వము 95 తరముల నాటివాడు వైవస్వతమనువు. 
ఇతనితో కలియుగ మారంభమగుచున్నది. తరమునకు 18 సంవత్సరముల చొప్పున 
కలియుగారంభమును వైవస్వతమనువు కాలమును భారత యుద్ధమునకు (95౫18) 
= 1710 సంవత్సరములకు పూర్వమనియు, అనగా సుమారు క్రీ॥ పూ.(1710+1400) 
=3110 సంవత్సరములనాటి వనియు నిర్ణయింప వీలుకలదు. ఖగోళ శాస్త్రజ్ఞుల 
సంప్రదాయమునకల తారీఖునకు (అనగా క్రీ॥పూ॥ 3102 ఈ తారీఖునకును 
సమన్వయము కుదురుచున్నది. : 


కలియుగారంభమున జల ప్రళయము సంభవించెననుటకు ప్రబలమైన 
ఆధారములు కలవు. చాలా ప్రాచీన గ్రంథమైన శతపథ బ్రాహ్మణమునందే ఈ 
జలప్రళభయమును గూర్చియు వైవస్వతవమనువు సృష్టి నిరసించుటను గూర్చియు 
(ప్రస్తావన గలదు. ఈ జలప్రళయ వృత్తాంతము హీబ్రూ, బాబిలోనియా 
ఇతిహాసములందుకూడ కలదు. మెసొపోటేమియా ప్రాచీన ఇతిహాసమునందు ఈ 
జల ప్రళయము సుమారు క్రీ.పూ. 3100 ప్రాంతమున సంభవించెనని కూడ కలదు. 
కాబట్టి కలియుగారంభము ఈ విచిత్ర సంఘటనము నుండియే పరిగణింపబడెనని 
ధృవపడుచున్నది. 

కలియుగారంభమునకును, భారతయుద్ధమునకును పైరీతిగ కాలనిర్ణయము 
చేసినయడల ప్రాచీన రాజవంశముల కాలమును ఈ క్రింది విధముగ 
నిశ్చయింపవచ్చును. 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు i 201 


ప్రాచీన సంప్రదాయమున మొట్టమొదటి రాజు వైవస్వతమనువు కాబట్టి 
వైవసత్వమనువు యుగమును సుమారు క్రీ! పూ. 3100 నాటిదనియు, ఈ మనువునకు 
“ ఐదవతరమునాటి వాడగు యయాతి ఇతని తరువాత (18౫5)=90 సంవత్సరములకు 
అనగా సుమారు క్రీ.పూ.(8100-90)=3010 నాటి వాడనియు, అతని తరువాత 
ఇరవై తరములకు అనగా (20%18)=360 సంవత్సరములకు రాజ్యమెక్కిన మాంధాత 
సుమారు క్రీ.పూ. (3100-360)=2740 నాటి వాడనియు, తదుపరి 31,83 
తరములకు పిదప వచ్చిన కార్తవీర్యార్డున, విశ్వామిత్ర, జమదగ్ని పరశురామ, 
హరిశ్చంద్రుల కాలము సుమారు క్రీ.పూ. (3100-31%18)=2542 నుండి 2506 
వరకుననియు అయోధ్యరాజగు సగరుడును, హస్తినాపుర రాజులగు దుష్యంత, 
బోరతులును నుమారు క్రీ.మా।॥ 3100-41%18)=2362 నుండి 
3100-44౫18)%2308 మధ్య కాలమున వెలసిరనియు, శ్రీరామచంద్రమూర్తి 
మనువునకు 65 తరముల పిదప రాజ్యమేలెను గాన సుమారు క్రీ.పూ. 
(3100-65౫18)=1930 నాటి వాడనియు, శ్రీకృష్ణుడు అటు తరువాత వాడనియు 
తలంపవచ్చును. 


పై సమన్వయము ఒక రీతిగ సంతృప్తికరముగ నున్నను, ఇంకను ఎంతయో 
పరిశోధన జరిగినగాని ఇదమిత్ధమని నిర్ధరించుటకు వీలులేదు. 


౨ 
జలప్రళభయమునకు పూర్వపు కథ 


కలియుగమునకును జలప్రకయమునకును పూర్వము జరిగిన వృత్తాంతములు 
పురాణములందు కొంతవరకు వర్ణింపబడియున్నవి. సృష్టియందు ప్రపథమమున 
నుండిన మనువు స్వాయంభువ మనువు. ఈ స్వాయంభువ మనువు (బ్రహ్మనుండి 
జనించి తన అర్ధనారీ రూపముగు దేహమునందలి శతరూపానామమున బరగిన 
ప్రీ భాగమునుండి ప్రియమిత్ర, ఉత్తానపాదులు ఇరువురు కుమారులను, ముగ్గురు 
కుమార్తెలను పొందెను. ఈకుమార్తెలకును దేవతలకు, బుషులకును, యజ్ఞములకును 
ఎంతయో సంబంధముగలదని గాథలు కలవు. కాని ఈ మువ్వురిలో నొకతె ఆకూతి 
స్వారో చిషమనువు యొక్క జనని. 


202 “ ఆం(ధ్ర మహాభాగవతోవన్యాసములు 


స్వాయంభువమనువు నకులి. రాజుడని అపరనామముగలదు. ఇతనికి 
పూర్వముండిన ఆనంద బ్రహ్మ వర్ణవ్యవస్థ నేర్చరచి, వివాహ ధర్మమును స్థాపించినను 
కాలక్రమమున నష్టమైపోయినందున స్వాయంభువ మనువు పునః ప్రతిష్టచే సెనట. 
ఇతడు విజేతయె శత్రువుల నందరిని జయించి భూమి యందు ప్రథమ రాజాయెనట. 
ఇతని రాజధాని సరస్వతీనది యొడ్డున నుండెను. 


రెండవ మనువు స్వారోచిషుడు. స్వాయుంభువమునువు యొక్క 
కుమారులిరువురిలో నొక్కడును మనువు గాజాలరైరి. కాని అతని పెద్దకొడుకగు 
ప్రియపుత్రుని ముగ్గురు కొడుకులును శైశవమునందే సన్యసంచి తరువాతి 
మన్వంతరమున ఉత్తమ, తామస, రైవత నామముల బరగి మూడవ, నాల్గవ, 
ఐదవమనువులుగ విలసిల్లిరి. స్వాయంభువ మనువు రెండవ కొడుకగు ఉత్తానపాదుని 
ముగ్గురి కొమారులలో (ధ్రువుని గాథ అందరెరిగినదే. అతని తమ్ములు కీర్తివత్‌, 
ఉత్తములు నామమాత్రావశేషులే. (ధ్రువుని పిదప ప్రాచీన గర్భుడు సింహాసనమెక్కెను. 
ఈ వంశమునందలి చాక్షుషుడు ఆరవ మనువు. అతని పౌత్రుడు వేనుడు దుష్పుడై 
నిరంకుశముగ ప్రవర్తింపగా ప్రజలు చెలరేగి, అతనిని జంపి, అతని కుమారుడైన 
పృథువును అభిషిక్తుని గావించిరి. ఇతడు వ్యవసాయమును వృద్ధిజేసి, పశుసంపదను 
పెంచి, వ్యాపారమును పెంపొందించి, అసంఖ్యాకములగు గ్రామములను 
పట్టణములను నెలకొల్పి, సర్వ సమగ్రమైన అభివృద్ధిని దెచ్చి తనపేర భూమికి 
పృథివియను శేరు చిరస్థాయి గావించెను. బుజు మార్గమున పరిపాలించు రాజు 
లందరికిని ఇతడు ఆదర్శప్రాయుడు. అతడు సింహాసన మెక్కినపుడు గావించిన 
ప్రమాణమును పరిశీలించినచో నిరంకుశత్వమునకు ఎంత మాత్రమును తావియ్యక 
తన బాధ్యతను బాగుగా గుర్తెరిగి సక్రమ పాలనను గావించు అధునాతన 
చక్రవర్తులెవ్వరును ఇంతకన్న నిశితమైన శపథమును గావింపజాలరని స్పష్టమగును. 


పృథువునకు ఐదవ తరమువాడు దక్షుడు. ఇతని కూతురి పౌత్రుడే 
జలప్రళయము నుండి సృష్టిని కాపాడిన వైవస్వత మనువు. 


. భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు .203 


3 
ప్రళయము-వైవస్వత మనువు 
(సుమారు క్రీ.పూ. 3100) 


పురాణములలో విపులముగ వర్ణింపబడిన ప్రళయ వృత్తాంతము 
మహాభారతము నందును అంతకన్న (ప్రాచీన గ్రంథమగు శతపథ బ్రాహ్మణమునందును 
గూడ సంగ్రహముగ వర్ణింపబడియున్నది. ఈగాధ అందరెరిగినదే. మనువు ఒకనాడు 
చేతులు కడుగుకొనుచుండగా తన్ను రక్షింపమని ఒక చిన్న చేప వేడుకొనెననియు, 
దయామయుడగు మనువు ఆ చేపను తనకమండలములో వేసి పెంచగా అంతకంతకు 
పెద్దదై కమండలము కాదు గదా, చిన్న బావిలోను, చెరువులోను కూడ స్థలము 
జాలక మహా సముద్రమునకు చేర్చవలసి వచ్చెననియు, ప్రళయము ఆసన్నము 
కాగానే ఈ మత్స్యము సలహానుబట్టి మనువు ఒక పడవను నిర్మించుకొని ఈ 
చేపకొమ్మునకు కట్టి ఉత్తర పర్వతమునకు చేరి పడవ నొక చెట్టునకు కట్టివైచి కొండ 
నెక్కి ప్రాణసంరక్షణ చేసికొని జలప్రళభయము ఉపశమనము చెందిన పిదప కొండపై 
నుండి దిగి వచ్చి మానవ సృష్టి నారంభించెననియు ఈ కథయందు స్థూలముగ 
తెలియుచున్నది. ఉత్తరమునందున్న నేటి హిమాలయ పర్వతములందు ఒక చోట 
కొండ చరియను మనోరవతరణమని యందురు. ఇచటనే మనువు పైనుండి కొండ 
దిగివచ్చెనట. 


వైవస్వత మనువు మానవత్వమునకే ఆదికారణము కాబట్టి పురాణములలో 
పేర్కొనబడిన రాజవంశముల కస్నింటికిని అతడేమూల పురుషుడు. ఇతడే ప్రథమ 
రాజు. పాలకుడును కాబట్టి భూలోకమున చట్టములనేర్చరచి పరిపాలనా పద్ధతి 
నారంభించినది ఇతడే. పరిపాలనా నిర్వహణమునకై వలయు ఆర్థిక సంపత్తిని 
సేకూర్చుటకై భూమి ఆదాయమునందు ఆరింట ఒక పాలు ప్రభుత్వమునకు పన్నుగా 
చెల్లింపవలెనని నిర్ణయించినది కూడ ఇతడేనట. వట 


ఈ మనువునకు పదిమంది కుమారులు కలిగిరి. కాని వీరి పేర్లను గూర్చియు 
జనన క్రమమును గూర్చియు ఒక్కొక్క పురాణములో నొకొక్కరీతిగ చెప్పబడియున్నది. 


204 ఆం(ధ మవోభాగవతోవన్వానములు ' 


జ్యేష్టుడు విచిత్రపురుషుడు. ఇతడు ఇల అను పురుషుడు; కాని ఇతడు ప్రీ కూడ. 
కాబట్టి ఇలా అని ఆడపేరు కూడ ఇతనికి కలదు. మిగతావారి పేర్లను ఈ క్రింది 
రితిగ నిశ్చయింపవచ్చును. (1) ఇక్ష్వాకు (2) నాభాగ (3) ధృష్ట (4) శర్యాతి (5) 
నరిష్యంత (6) ప్రాంశు (7) నాభాగోద్దిష్ట (లేదా నాభానేదిష్ట) (8) కరూష (9) 
పృషధర. వీరిలో నలుగురే రాజ వంశ స్థాపకులు. ఇక్ష్వాకు అయోధ్యను రాజధానిగా 
చేసికొని పరిపాలించెను. ఇతని తనయుడు వికుక్షి ఐక్ష్వాకు(సూర్య) వంశమును 
స్థాపించెను. నాభాగుని వంశము బహుశః గంగాప్రాంతమున మధ్యభాగమును 
పాలించిరేమో. ఈవంశమును గుణించి ఎక్కువ విశేషములు తెలియవు. త్వరలో 
పరాజితులై స్వాతంత్ర్యమును గోల్పోయిరేమో. ఈ వంశములోని వాడే రథీతర చక్రవర్తి 
ఇతని వంశీయులే రథీతరులని ప్రసిద్ధిగాంచిన క్షత్రియాంశసంపన్నులగు క్షత్రియ 
(బ్రాహ్మణులు. ధృష్ట వంశీయులైన ధార్‌క్షక క్షత్రియులు పంజాబులోని వాహికను 
పరిపాలించిరి. వీరు బ్రాహ్మణులనియు, క్షత్రియులనియు, వైశ్యులనియు కూడ 
నానావిధములుగ (ప్రస్తావనగలదు. వర్ణవ్యవస్థ ఏమంత విస్పష్టముగ పరిగణింపబడని 
రోజులవి. శర్యాతివంశీయులు ఆనర్తప్రాంతమును పరిపాలించిరి. గుజరాత్‌ 
ప్రాంతముతో సంబంధము కలిగించుకొనిన వారిలో వీరే ప్రథములు. కాబట్టి గుజరాత్‌ 
యొక్క ప్రాచీనామము ఆనర్త. శర్యాతి కుమారుడైన ఆనర్హుని నుండి ఈ పేరు 
వచ్చెను. నరిష్యంతుని వంశీయుల గూర్చి ఏమియు తెలియురాకున్నది. వీరు శకులకు 
మూలపురుషులని కొందరు చెప్పుచున్నారు. ప్రాంశు వంశమును కూడ అజ్ఞాతులే, 
నాభగోద్ధిష్టుడు ఉత్తర బీహారునందు వైశాల వంశమును స్థాపించెననియు, బసార్ట్‌ 
(ముజఫర్‌పూర్‌ జిల్లా) నాటి వైశాలియనియు తోచుచున్నది. సోన్‌ నదికి పడమట. 
నున్న నేటి రీవా సంస్థానమును కరూషు లాక్రమించి మహోయోధులుగ కీర్తిగాంచిరి. 
పృషధరునికి మాత్రము భూభాగమే లేకపోయెను. ఇతడు గురువుగారి గోవును 
జంపి నేరస్థుడాయెనట. 


జ్యేష్టపుత్రుడైన ఇలుడు స్రీ రూపమున బుధుని పరిణయమాడి పురూరవుని 
ప్రసవించెను. ఇతడే ఐల(యంద్ర) వంశస్థాపకుడు.. ఈ ప్రధాన వంశమునుండియే 
కాన్యకుబ్బులు, యాదవులు (హైహయులు, అంధకులు, వృష్ణులు) తుర్వసులు, 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 205 


ద్రుహ్యులు, ఆణవులు, పంచాలులు, బార్హ్మద్రథులు, చేదులు మొదలగు రాజవంశము 
లుద్భవించెను. 

ఇలాదేవి సుద్యమ్నుడను కింపురుషునిగ పరివర్తనముజెంది సుద్యుమ్నులని 
ప్రసిద్ధిజెందిన ఉత్కల, గయ, వినతాశ్వులను పేర్లుగల ముగ్గురు కుమారులను 
పొందెను. ఈ మువ్వురును క్రమముగ ఉత్మల, గయ, ఉత్తరకురు మున్నగు 
ప్రాచ్యదేశములకు రాజులైరి. కొంత కాలమునకు పిదప అనవులును, కాన్యకుబ్బులును 
ఈ ప్రాంతమునంతటిని ఆక్రమించుకొనగా ఈమూడు వంశములును అంతమొందెను. 

చంద్రవంశరాజులైన పురూరవ, నహుష యయాతుల జైత్ర యాత్రలవలననే 
క్రమముగా కరూష,. నాభాగ, ధృష్ట, నరిష్యంత, ప్రాంశు, పృషధర రాజ్యము 
లంతమొంది పౌరవరాజ్యము విస్తరించెను. 


ధి 


యయాతి యుగము 
(సుమారు క్రీ॥ పూ॥ 3000-2750) 
1. చంద్రవంశము: 

బుధునికో లేక సోమునికో ఇలాదేవియందు జనించిన ఐలపురూరవుడు 
చంద్రవంశ స్థాపకుడని పైన చెప్పబడెను. ఐలరాజధాని ప్రతిష్టానమనియు, 
తరువాతికాలమున ఇచట. ఐలులు ఎన్నియో గొప్పకార్యములు చేసిరనియు 
పురాణములు చెప్పుచున్నవి. కాని వీరు ఆరంభమున హిమాలయ ప్రాంతము 

వారనుటకు పురాణములందు ఎన్నియో ఆధారములు కలవు. 


పురూరవుడు సప్తద్వీపములను పరిపాలించి ఒక వంద పర్యాయములు 
అశ్వమేధయాగమును గావించెనట. ఊర్వశీ పురూరవుల (ప్రేమగాథ అందరెరిగినదే 
కాని చివరకు ఇతడు నధికారమదాంధుడై బ్రాహ్మణుల పై దండెత్తి, వారి నగలను 
హరించి, నైమిష్భషులు యాగము చేయుచుండగా కాంచన ఖచితమైన వారి యజ్ఞశాలనే 
కొల్లగొట్టనుద్యమించెనట. బుషులు కుపితులై ఇతనిని వధించి, ఇతని జ్యేష్టపుత్రుడైన 
ఆయువును సింహాసనమెక్కించిరి. 


206 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పురూరవుడు సూర్యవంశజుడైన ఇక్ష్వాకు చక్రవర్తి యొక్క సమకాలికుడు. . 
ఉత్తరముననుండిన ఇక్ష్వాకు చక్రవర్తియొక్క అయోధ్య రాజ్యమును జయింపజాలక, 
దక్షిణమున మహాయోధులైన కరూషుల నెదిరింపజాలక పురూరవుడు తూర్చువైపునను, 
వాయవ్యదిశయందును తన రాజ్యమును విస్తరింవజేసెను. ఈ విధముగ 
ఐలరాజ్యమునందు గంగా యమునానదుల మధ్యప్రదేశమును, మాల్వా, తూర్పు 
రాజపుత్ర స్థానమును చేరిపోయెను. ఈ విశాలరాజ్యమును పురూరవుని యనంతరము 
ఆయు అమావసులను అతని కుమారులిరువురును పంచుకొనిరి. 


ఆయువు (ప్రతిష్ణానము రాజధానిగా ఐలవంశము ఉత్తరోత్తరాభివృద్ధి 
నొందునట్లు ప్రయత్నములు సాగించుచుండగా అమావసు గంగా యమునా నదుల 
మధ్యప్రాంతమును తన భాగముగ పంచుకొని కాన్యకుబ్దవంశమును స్థాపించెను. 
ఆయువు బుషులకును, బ్రాహ్మణులకును గౌరవము జూపి వారితో స్నేహభావమున 
మెలంగుచుండెను. కాని స్వర్భాను డను దానవ రాజకూతురు ప్రభాదేవిని 
పరిణయమాడి ఐదుమంది పుత్రులను బడసెను. వీరిలో నహుషుడు, క్షతవృద్దుడు 
అను మొదటి ఇరువురు మాత్రమే ముఖ్యులు. 


నహుషుడు తండ్రి యనంతరము ప్రతిష్టానమునకు రాజుకాగా రెండవవాడు 
తూర్పువైపున కాశీపట్టణపు రాజయ్యెను. నహుషుడు గొప్ప యోధుడు. ఇతడు 
భూమిపైన ప్రప్రథమమున నాటకరంగమును స్టాపించెనట. ఇతడు ఇంద్రపదవిని 
పొందెననియు, పిదప గర్వితుడై అగస్యుని పరిహసించి, తన ఉత్తమ స్థానమును 
గోల్పోయెననియు మహాభారతమున ఒక గాథ యున్నది. కాని నహుషుడు కడు 
సమర్ధుడని పరిగణించుటకే ఎక్కువ ఆధారములు కలవు. . 


నహుషుని పిదప రాజ్యమెక్కిన అతని తనయుడు యయాతి సమ్రాట్‌ 
బిరుదాంచితు డని పురాణములందును మహాభారతమునందు (ప్రశంసింపబడెను. 
ఇతడు అయోధ్య, కాన్యకుబ్ద రాజ్యములకు పడమట నున్న మధ్యదేశము నంతటిని 
సరస్వతీనది వరకును జయించెను. తన రాజ్యమునకు ఆగ్నేయమునను, దక్షిణమునను, 
పశ్చిమమునను ఉండిన భూభాగమునంతటిని ఆక్రమించుకొనెను. భార్గవకుల బుషి 


. భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 207 


పుంగవుడైన ఉశన వుక్రుని కుమార్తెయగు దేవయానియు, అసుర రాజైన వృషపర్వుని 
కుమార్తెయగు శర్మిష్టయు ఇతని భార్యలు. వీరిరువురి వివాహమునుగూర్చి 
కొంతవిస్తరముగ పురాణములందును, మహాభారతము నందును వర్ణింపబదియున్నది. 
దేవయాని వివాహము ్రతిలోమ వివాహము. కాన దీనిని సమర్థించుటకై కొన్ని 
విశేష కారణములు చెప్పబడియున్నవి. . 


దేవయానికి యదుతుర్వసులను ఇరువురు కుమారులును, శర్మిష్టకు అను, 
ద్రుహ్యు, పూరు అను మువ్వురు కుమారులును జనించిరి. యయాతి తన రాజ్యము 
ఈ ఏవరికిని పంచియిచ్చి ప్రధానవంశము నిలబెట్టుటకు మాత్రము కనిష్ట పుత్రుడైన 
పూరురవునే నియోగించి ఇతనికి ప్రతిష్టానము రాజధానిగాకల మధ్యదేశమును 
(గంగాయమునలకు మధ్యనున్న భాగమునందు దక్షిణ భాగమును) పంచి ఇచ్చెనట. 
పూరువు క్రమముగ కీర్తివంతుడై ఈ వంశమునకు పూరువంశమనియు, పౌరవ 
వంశమనియు అపరనామమును సంపాదించెను. ఇతని పిదప ఇతని తనయుడు 
జనమేజయుడు సింహాసన మెళ్ళెను. ఇతర తనయు లేప్రాంతమును పొందిరో స్పష్టముగ 
తెలియుట లేదు. జ్యేష్ణుడైన యదుచక్రవర్తి చర్మణ్వతీ(చంచల్‌) వేత్రవతీ (బెత్వా) 
శుక్తిమతీ(కేన్‌) నదులతో విరాజిల్లు నైబుతి భాగమును పొందెననియు, తుర్వను 
రీవా ప్రాంతమునగల ఆగ్నేయ దిగ్భాగమును పొందెననియు, ద్రుహ్యుడు పడమటి 
ప్రాంతమును, అనువు ఉత్తర ప్రాంతమును పొందిరని కొన్ని పురాణముల నుండి 
తెలియుచున్నది. 


ఈ రీతిగ పూరువు నాటికి కాశీకాన్యకుబ్బములతో సహా ఐలవంశీయులు 
సప్తరాజ్యములను స్టాపింపగల్లిరి. కాని వీటిలో యదుచక్రవర్తి స్థాపించిన యాదవవంశ 
మొక్కటే చంద్రవంశము లన్నిటియందును కడుంగడు ప్రశస్తిగాంచెను. గుజరాత్‌, 
కాథియవార్‌ ప్రాంతమున నుండిన శర్యాతులను జయించి రాక్షసులాక్రమించుకొనగా 
యాదవులు ఈ రాక్షసులను జయించి ఆ ప్రాంతమునంతటిని ఆక్రమించుకొనిరి. 
యదుచక్రవర్తి కుమారులలో క్రోష్టా, సహస్రజిత్‌ అను ఇరువురు మాత్రమే ముఖ్యులు. 
వీరికాలములో యాదవ వంశము రెండుగా చీలి యాదవ, హైహయ వంశములుగ 
నేర్చడెను. 


208 | ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


యదుచక్రవర్తికి పండ్రెండవతరము వాడైన చిత్రరథుడు మతినారుడను పేరుగ 
పౌరరాజునకు సమకాలీనుడు. మతినారునికూతురు అయోధ్యరాజగు సూర్య వంశపు 
రెండవ యువనాశ్వుని వివాహమాడెను. వీరి పుత్రుడు మాంధాత చిత్రరథుని పౌత్రి 
(శశబిందు కుమార్తె) బిందుమతిని పరిణయము జేసికొనెను. చిత్రరథ శశబిందువులు 
గొప్పసామర్థ్యవంతులు. శశిబిందుపాలనమునందే యాదవరాజ్యము విస్తరించి 
తూర్పున పౌరవ, తుర్వసురాజ్యములను, ఉత్తరమున (ద్రుహ్యరాజ్యములను 
ఆ(క్రమించుకొనెను. 


2. సూర్యవంశము: 
మనువుయొక్క తొమ్మండుగురు కుమారులు స్థాపించిన వంశములలో 
అయోధ్య, విదేహ, వైశాలి, శర్యాత వంశములు మాత్రమే ఎన్నదగినవి. 


మనువుయొక్క జ్యేష్టపుత్రుడు ఇక్ష్వాకు చక్రవర్తి అయోధ్య రాజులలో ప్రథముడు. 
ఇతనికి నూరుగురు కుమారులు కలిగిరి. కాని వారందరిలో ఇతని పిదప 
సింహాసనమెక్కిన వికుక్షియు (ఇతనికి శశాదుడనియుకూడ కలదు), విదేహరాజ్యమును 
స్థాపించిన నిమియు, అరణ్యమునకు పేరునిచ్చిన దండకుడును మాత్రమే ముఖ్యులు. 


వికుక్షుని కుమారుడు పరంజయుడనియు, పురంజయుడనియు కకుత్‌స్థుడనియు 
ప్రసిద్ధిగాంచెను. రణరంగమున ఇంద్రుడు వృషభ రూపముదాల్చి తన మూపురము 
(కకుత్‌) భాగముపై నెత్తికొనిపోయెనట. ఇతనికి ఆరవతరమువాడు ఉత్తర 
కోసలరాజధాని నగరమైన శ్రావస్తి నగరమును స్థాపించిన (శ్రావస్తుడు;, యువనాశ్యుని 
కుమారుడు. 


శ్రావస్తుని పౌత్రుడైన కువలాశ్వునికి దుంధుమార యని బిరుదు. ఈ 
బిరుదునుగూర్చి యొక విచిత్రగాధ గలదు. ఇతడు దుంధు అను రాక్షసుని జయించి, 
ఉత్తంకుడను మునివర్యుని రక్షించుటకై రాజపుత్రస్థానమునందు ఎడారిలో మధ్యనున్న 
లోతులేని నము(ద్రమునకు వెళ్లెనట. అటనున్న రాక్షసుని జయించి 
భూగర్భముననుండిన అతని అగ్ని ప్రాసాదమును తుదముట్టించెనట. బహుశః ఏదైన 
ఒక అగ్నిపర్వతము పశ్చిమకోస్తా యందుండెనేమో అనియు ఆ పర్వతము 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 209 


విజృంభించినపు డొకమారు కువలాశ్వుని సేన నాశనమునుజెందినను అతడు 
చుట్టుముట్టు త్రవ్వినందువలన ఏదో ఒక జలప్రవాహము (బహుశః సమీపముననే, 
భూగర్భము నుండెనేమో) ఈ అగ్నిపర్వతముపై ప్రవహించి తుదముట్టించెనేమో 
అనియు డాక్టరు నరేంద్రనాథ లా అను చరిత్రజ్ఞుడు వ్యాఖ్యానము చేయుచున్నాడు. 
బహుశః దక్షిణ రాజపుత్ర స్థానమునందును ఇంకను పశ్చిమమునను ఉండిన 
అసురులను ఆదిమవాసులను జయించి ఆర్యసంస్కృతిని వ్యాపింపజేసినందున ఇట్టి 
గాథ ఏర్పడియుండుననికూడ తోచుచున్నది. 


కువలాశ్వునికి ఎనిమిదవ తరమువాడు రెండవ యువనాశ్వుడు. ఇతనికి 
సౌద్యుమ్ని యని అపరనామము గలదు. ఇతనిని గూర్చియు ఒక విచిత్రగాథ కలదు. 
ఇతడు పొరబాటున తన పట్టపురాణి కివ్వవలసిన మంత్రజలమును తానే త్రాగినందున 
గర్భము ధరించి తన ఎడమరొమ్ము ఎముకనుండి కుమారుని ప్రసవించెనట. ఈ 
శిశువు ఇంద్రుని బొటనవ్రేలిని చివికి అమృతమును పొంది, పెరిగి, పెద్దవాడైనందున 
మాంధాతయని పేరుగాంచెనట. 


సూర్యవంశమునందలి ఇతరశాఖలను గూర్చి ఇచట సం(గ్రహముగ 
_ ప్రస్తావింపవచ్చును. ఇక్ష్వాకు కుమారుడైన విదేహుడు (ఇతనికే నిమియని మరియొక 
సేరుగలదు) విదేహరాజులకు మూలపురుషుడాయెను. ఇతడు జయంత పట్టణము 
నధివసించుచుండెను. ఇతని కుమారుడే మిథియను పేరుగల జనకుడు. మిథినుండియే 
రాజధాని పేరుకూడ మిథిలయాయెను. కాలక్రమమున ఈ వంశము పేరుకూడ 
మారిపోయి జనకవంశమాయెను. 


నాభానేదిష్టుడు స్థాపించిన వంశము తరువాతి రాజైన విశాలనుండి వైశాలి 

వంశమని పేరుగాంచెను. ఇతడే విశాల లేక వైశాలినగరమును స్థాపించెను. ఈ 

వైశాలి మొదటి రాజులపేర్లు భలందన, వత్సప్రీ. భలందనుడు గొప్ప యోధుడు. 
భూమి నంతటిని జయించెను. కాని ఇతడు వర్ణాంతరుడై వైశ్యుడాయెనట. 


మనుపుత్రుడైన శర్యాతిచే స్థాపింపబడిన శర్యాత వంశము ఏమంత గొప్ప 
ఖ్యాతిని సంపాదించుకొనలేదు. శర్యాతి తన కూతురు సుకన్యను భృగువంశీయుడైన 


210 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


చ్యవన బుషికి నొసగి పరిణయము జేసెను. శర్యాతి పిదప అతని కుమారుండు 
ఆనర్హుడు సింహాసన మెక్కెను. అచిరకాలములోనే ఈవంశము పుణ్యజన రాక్షసులచే 
నిర్మూలనము జెందెను. 


సౌద్యుమ్నులు కూడ ఎక్కువ (ప్రాముఖ్యత గాంచలేదు. 
శ. బ్రాహ్మణ కుటుంబములు: 


క్షత్రియ వంశములేకాక ప్రాచీన భారత చరిత్రయందు (బ్రాహ్మణ 
కుటుంబములు కూడ ఎక్కువ ప్రాశస్త్యము వహించెనని భాగవతమును ఇతర 
పురాణములును బుజువు పరచుచున్నవి. 


ఈ(బ్రాహ్మణ కుటుంబములు (బ్రహ్మమానస పుత్రులైన ఎనమండుగురు 
బుషీశ్వరులనుండి ఏర్పడెనట (1) భృగు (2) అంగిరస (8) మరీచి (4) అత్రి (5) 
వసిష్ట (6) పులస్య (7) పులహ (8) క్రతు అను ఈ ఎనమండుగురును ఏ రీతిగ ఈ 
కుటుంబములకు మూలపురుషులైరో కొన్ని విచిత్రగాథలు వర్ణించుచున్నవి. వీనిలో 
చివరి మువ్వురును బ్రాహ్మణ కుటుంబములను స్థాపించలేదు. పులస్త్యునుండి | 
రాక్షసులును, వానరులును, కిన్నరులును, యక్షులును, మాత్రమే జనించిరి. పులహ 
బుషినుండి కింపురుషులును, పిశాచములును, భూతములును, సింహశార్జూలాది 
జంతువులు జనించెను. క్రతువునకు భార్యాపుత్రులుండినట్లుగాని, వివాహము 
జరిగినట్లుగాని ప్రస్తావనలేదు. కాని వాలఖిల్యులు ఇతని సంతతి యని ఒక 
గాథయున్నది. మిగత ఐదుగురు బుషీశ్వరుల నుండి వచ్చిన కుటుంబములు కూడ 
అన్నియు ఒకే ప్రాచీనతను కాలమునం దుద్భవించినటుల గానరాదు. భార్గవులును, 
వసిష్ణలు ప్రాచీనతములు. అంగీరసులును కూడ అప్పటివారేనేమో! కాని 
ఆగ్రేయులును, కాశ్యపులును (మరీచినుండి జనించినవారు) తరువాతి కాలమునాటి 
వారని తోచుచున్నది. 


భార్గవులలో ప్రాచీనతములు చ్యవనుడు, శుక్రుడు. శుక్రుడు దైత్య, దానవ 


అసురలకు గురువాయెను. బృహస్పతి దేవగురువైనందున వీరిరువురికిని వైరము. 
శుక్రుని కూతురు దేవయాని వూరువంశ రాజైన యయాతిని పెండ్లాడి 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు “ 211 


యదుతుర్వసులను ఇరువురు కుమారులను పొందెనని పైన జూచితిమి. 


వసిష్టుల పుట్టుపూర్వోత్తరముల గూర్చి విచిత్రగాధలు గలవు. వీరు ఈ 
మన్వంతరమున మిత్రావరుణ దేవతనుండి జనించిరని ఒకగాధ. స్వాయంభువ 
మన్వంతరమున మూలపురుషుడైన వసిష్టుడు బ్రహ్మ మానసపుత్రుడుగ జనించెనని 
మరియొకగాధ. వసిష్టులు తొలుతనుండియు అయోధ్యరాజులకు వంశపారంపర్యముగ 
నుండిన పురోహితులు. ఇక్ష్వాకు చక్రవర్తియొద్దను, వికుక్షి-శాదునియొద్దను, నిమివద్దను 
కూడ వసిష్టులు పురోహితులుగ నుండినట్లు పురాణములందు కలదు. 


ఆక్రేయులు కూడ ప్రాచీనతమ వంశములలో నొకటియని తోచుచున్నది. 
కాని వీరిలో ప్రథముడు, ప్రభాకరుడనువాడు, పురువంశరాజులలో నొకడగు 
భద్రాశ్వుని (లేక రుద్రాశ్వుడా?) పదిమంది కుమార్తెలను వివాహము జేసికొని 
పదిమంది కుమారులను కలిగెనని చెప్పబడి యున్నది. ఈ పదిమంది కుమారులే 
ఆత్రేయ గోత్రశాఖలలో ముఖ్యశాఖలకు మూలపురుషులని చెప్పబడియున్నది. 
మరీచిమహర్షి కశ్యప ప్రజాపతియనియు, దేవదానవులకు ఉభయులకును 
మూలపురుషుడనియు ప్రస్తావన కలదు. 
పై కుటుంబములు మాత్రమేగాక విశ్వామిత్రులును, జమదగ్నులును, ఇతర 
బ్రాహ్మణ కుటుంబములును కూడ తరువాత కాలమున చారిత్రికముగ ఎక్కువ 
(ప్రాముఖ్యత వహించెను. 
౫ 
మాంధాతయుగము 
(రమారమి క్రీ పూ॥ 2750-2550) 
1. సూర్యవంశము 
. శశబిందు యాదవరాజ్యమును వృద్ధి గావించుచుండగా సూర్యవంశతిలకుడైన 
మాంధాత అయోధ్యయందు పాలన సల్పుచు చక్రవర్తి యనియు, సమ్రాట్‌ అనియు 
ప్రసిద్ధికెక్కెను. ఇతని తల్లి పౌరవంశ రాజైన మతినారుని కుమార్తె యైన గౌరియనియు, 


212 ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


తండ్రి యువనాశ్వుడనియు పైన తెల్పబడెను. ఇతడు విష్ణువుయొక్క ఐదవ అవతారము. 
ఇతడు ఒక వంద రాజసూయ యాగములను, అశ్వమేధ యాగములను గావించెనట. 
ఇతని దాతృత్వమును ప్రశంసించుచు ఎన్నియో గాధలు అనాదిగ కలవు. ఇతని 
రాజ్యవైశాల్యమును గూర్చియు, గోదాములను గూర్చియు కూడ ఎంతయో (ప్రశంస 
గలదు. యాదవ శశబిందు కూతురు బింధుమతి ఇతని భార్య, పుత్రులు పురుకుత్స, 
అంబరీష ముచుకుందు లని. మువ్వురు ఇతని తనయ (కొందరు ఈమెను పొత్రి 
యనియు, కొందరు చెల్లెలనియు చెప్పుచున్నారు) కావేరి కాన్యకుబ్దుల జహ్నువును 
పరిణయమాడెను. 


ఇంద్రుని బొటనవేలిని చివికినందున (నన్ను చివుకుచున్నాడు అని ఇంద్రుడు 
చెప్పెనట) మాంధాత ఆయెనని చెప్పు వ్యుత్పత్తిబహుశః తరువాతికాలము నాటిదై 
యుండునని తోచుచున్నది. అతడు భూమినంతటిని జయించెననియు ఇంద్రుని 
అర్జాసనమును పొందెననియు అందరెరిగిన అంశమే. ఇతడు పౌరవులను 
కాన్యకుబ్దులను దృహ్యులను, ఆనవులను జయించినట్లు తోచుచున్నది. యదువులతో 
చుట్టరిక ముండినందున వారిని వదిలివైచెనేమోగాని దట్రానధముసిరైదటి 
హైహయులను కూడ జయించినట్లు తోచుచున్నది. 


ఇతని పిదప సింహాసనమెక్కిన ఇతని తనయుడు పురుకుత్సుడు “అవశ్యం 
పితురాచారి మని దండయాత్రలను సాగించెను. నాగులు ఇతనిని ఆశ్రయించి 
శరణువేడగా వారి కన్యను నర్మదను, పరిణయమాడి వారి శత్రువులైన మౌనేయ 
గంధర్వులను నిర్జించి ఈ నాగులను రక్షించెను. 


ముచుకుందుడు కూడ సుప్రసిద్దుడే. ఇతనికిని కాలయవన కృష్ణులకును 
సంబంధము కలిపి, సమకాలికులుగ జేయుట బహుశః పొరబాటేమో? ఇతడు 
పారిపాత్ర, రిక్షపర్వతములనడుమ నర్మదానది యొడ్డున ఒక పట్టణమును గట్టించి 
బలమైన కోటను స్థాపించెను. కాని అచిరకాలమునందే హైహయ రాజైన 
మహిష్మంతుడు ఇతనిని జయించి ఇతని కోటను గైకొని మహిష్మతియని దానికి 
వేరుపేరు నిచ్చెను. 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 213 


పురుకుత్సుని పిదప అయోధ్య క్రమముగ (ప్రాముఖ్యతను కోల్పోవగా 
చం(దవంశములు వృద్ధియాయిను. 


2, చంద్రవంశములు: 


మాంధాత కాలమునందు పౌరవంశము క్షీణదశయందుండెను. కావుననే 
మాంధాత యమునానదియొడ్డున యజ్ఞములను జేయుటయేకాక పౌరరాజ్యమును 
దాటిపోయి ఆనాడు అటువైపున నుండిన (అనగా పంజాబు సమీపమున నుండిన) 
ద్రుహ్యులను కూడ జయించెను. ద్రుహ్యులను రాజపుత్ర స్థానమునుండి 
పంజాబువరకును తజిమివైచిరి. యాదవులు బహుశః శశబిందు కాలమునందు 
పౌరరాజ్యమును గూడ జయించినట్లు తోచుచున్నది. హైహయరాజ భద్రశ్రేణ్యుడ్ను. 
గూడ ఎట్టి ఆటంకమును లేక పౌరవ రాజ్యము గుండ చొరవచేసికొని పోయి. 
వారణాసి చేరెను. బహుశః పౌరవ రాజ్యము నామమాత్రా విశిష్టమై యుండెనేమో 
యనుటకును ఈ రాజులు అరణ్యవాసము జేయుచుండిరేమో యనుటకును దుష్యంతుని 
గాధయే కొంత ఆధారమొసగుచున్నది. ఇతడు కరంధముని సుతుడైన మరుత్తతుర్వసుతో 
నుండెననుట నిస్సంశయము కదా! 


మాంధాతచే జయింపబడినను అచిరకాలమునందే కాన్యకుబ్ద జహ్నువు 
కాలమున మరల ప్రాముఖ్యత నొందెనని జహ్నువుయే ననాశ్వుని పౌత్రిని 
పరిణయమాడెనను విషయమును బట్టియే తెలియుచున్నది. 


హైహయులు మూల్వకు దక్షిణమున మహిష్మంతుని కాలమునను, అతని 
తరువాతరాజైన భద్రశ్రేణ్యుని కాలమునను దినదినాభివృద్ధిగాంచిరని పైన జూపితిమి. 
భద్రశ్రేణ్యుడు పౌరరాజ్యమును నిర్ణించుటయేగాక కాశీనికూడ జయించి ఆ ప్రాంతము 
నంతటిని ఆక్రమించుకొనెను. కాశీరాజైన మర్యశ్వుడు నష్టరాజ్యమును సంపాదించుకొను 
ప్రయత్నమునందే హైహయులచే పరాజితుడై చంపబడెను. ఇతని కుమారుడు సుదేవుడు 
కూడ ఓడిపోయెను. కొంతకాలము కాశీప్రాంతము క్షమక రాక్షసుల వశముజెందెను 
కాని త్వరలోనే హైహయదుర్దముడు మరల నీప్రాంతము నంతటిని సాధించెను. . 


“214 1 ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు 


అనవులు మహమనస్సనెడి రాజు కలమున (ఇతడు అనువుకు ఏడవ 
తరమువాడు) తూర్పువైపు వ్యాపించి పంజాబు నాక్రమించుకొనిరి. బహుశః ఇతని 
రాజ్యము కడు విశాలమైనందుననే గాబోలు ఇతని తనయులు ఉశీనర, తితిక్షులు 
ఇరువురును ఈ రాజ్యమును పంచుకొనిరి. 


ఉశీనరుడు పంజాబు తూర్పు భాగమున తన రాజ్యమును స్టాపించెను. ఇతని 
పిదప ఇతని ఏవుగు కుమారులును ఇతని రాజ్యమును పంచుకొనగా శిబి మూల్లాన్‌ 
ప్రాంతమును, నృగుడు నేటి మాంట్‌ గోమరీ, ఉత్తర బికనీరు ప్రాంతమును, నపుడు 
నవరాష్ట్రమును, కృమి కృమిల పట్టణ ప్రాంతమును, సువ్రతుడు బహుశః తూర్పు 
పంజాబు ప్రాంతమును పాలించిరి. యోధేయులను, అంబప్టులును క్రమముగ 
నృగసువ్రతుల నుండి ఉద్భవించినవారు. వీరందరిలో శిబి సుప్రసిద్ధుడై పంజాబు 
నంతటిని (ఒక్క వాయవ్యదిగ్భాగము మాత్రము తప్ప) జయించెను. ఇతని కుమారులు 
నలుగురును ఈ క్రిందివిధముగ నాలుగు రాజ్యములును స్టాపించిరి. (క) వృషదర్శులని 
"పీరుగాంచిన శిబివంశీయులు మూల్చాన్‌ (ప్రాంతమునందును, (ఖ) సౌవీరులు 
సింధునందును, (గ) కేకయులు జీలం చీనాబు నదుల మద్య నున్న నేటి గుజరాత్‌, 
షాపూర్‌ ప్రాంతమునందును, (ఘ) మద్రకులు సకల (నేటి సియాల్‌ కోట) రాజధానిగా 
నేటి లాహోర్‌, జమ్ము ప్రాంతములను పాలించిరి. 


తితిక్షువు తూర్పువైపు వెడలిపోయి విదేహ, వైశాలి రాజ్యములను దాటిపోయి 
సౌద్యుమ్నులు పాలించిన తూర్పు బిహారు ప్రాంతములకువచ్చి అచ్చట ప్రాచ్య 
రాజ్యమును స్థాపించెను. దీనినుండియే కాలక్రమముగ అంగ, వంగ, కళింగ, పుండ్ర, 
సుహ్మరాజ్యము లేర్చడి బలిచక్రవర్తి ఏవురు కొమారులకును ఈ ప్రాంతము 
స్థానమాయెను. 

ద్రుహ్యలు, శశబిందు, యువనాశ్వ, మాంధాత, శిబి మున్నగు వారిచే 
పరాజితులై రాజపుత్ర స్థానమును వదలి ఉత్తరము వైపు వెళ్ళిపోయి పంజాబు 
చేరిరని ఇదివరకే జూచితిమి. వీరిరాజు అంగారుడు మాంధాతచే చంపబడెను. 
అంగారుని తరువాతి రాజులలో నొకడైన గాంధారుని నామమే ద్రుహ్యులకు తరువాతి 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు | 215 


కాలమున రూఢమాయెను. వీరి సంఖ్య (క్రమముగ పెరిగినందున వీరిలో కొందరు 
భారతదేశమును దాటిపోయి ఉత్తరమున మ్లేచ్చ ప్రాంతములలో ఎన్నియో చిన్న 
చిన్న రాష్ట్రములను స్థాపించిరని తోచుచున్నది. 


౬ 


పరశురామయుగము 
(బహుశః క్రీ॥ పూ॥ 2550-2350) 


అయోధ్యరాజైన సూర్యవంశపు సగరునివరకును ఈ యుగముగానే 
పరిగణింపవచ్చును. ఈ యుగమునందు పండ్రెండు తరముల చరిత్ర కలదు. కాని 
ఒక్క భృగువంశీయులు మాత్రమే కాక హైహయులును, భృగువులును ఇరువురును 
ఒకరి తరువాత నొకరు ప్రాముఖ్యము వహించియున్నారు. 


1. భృగువులు: 


భృగువునుండి ఏర్పడిన భార్గవులు ఆనర్త(గుజరాత్‌) యందు వసించిరి. 
శర్యాతులు నావనముచెందిన పిదప ఈ(ప్రాంతము హైహయుల ప్రాబల్యమునకు 
లోనుకాగా భార్గవులుకూడ వారితో చేరిరి. కృతవీర్యుడు తన పురోహితులైనందున, 
హైహయరాజు భార్గవులకు అధికధనము నొసంగెనట. ఇతని తరువాతి రాజులు 
ఈ ధనమును వాపసు ఇవ్వమనికోరగా, భార్గవు లందుల కియ్యకొననందున వారిని 
మైహయులు నానావెతలం బెట్టసాగిరట. వీరిబారినుండి తప్పించుకొనుటకై భార్గవులు 
ఈప్రాంతమునుండి పారిపోయి, మధ్యదేశమునందలి కాన్యకుబ్దమును జేరిరి. 


భార్గవులలో ముఖ్యుడు ఊర్వుని కుమారుడు బుచీకుడు. ఇతడు 
విలువిద్యయందు గొప్పనేర్పరి. హైహయులయందు పగసాధించుటకై ఇతడు. 
క్షత్రియులతో సంబంధ బాంధవ్యములను ఏర్పరుచుకొనుటకై యత్నించెను. కాన్యకుబ్ద 
రాజైన గాధితనయను, సత్యవతిని తనకిచ్చి వివాహము చేయుమని కోరగా గాధికి 
ఇష్టములేక తప్పించుకొనుటకై నెపము వెదకి నల్లచెవులుగల వేయి గుజ్బములను 
కన్యాశుల్మముగా తెచ్చియిమ్మని కోరెనట. ఇట్టి దుష్మరకార్యమును కూడ సాధించి 


216 | ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు 


బుచీకుడు సత్యవతిని పెండ్లాడెను. వీరి తనయుడే జమదగ్ని. కాబట్టి జమదగ్ని 
విశ్వామిత్రుని మేనల్లుడు(విశ్వామిత్రుడు గాధికుమారుడు కదా!) 


జమదగ్ని విలువిద్యయందును, శస్త్రవిద్యయందును గొప్ప పాండిత్యము 
సంపాదించెను. అయోధ్య రాజవంశమునకు చెందిన రేణువు కూతురిని రేణుకను 
పరిణయమాడెను. కాని ఇతనికి యుద్ధమునందును, పగసాధించుటయందును 
వైముఖ్యము. పరమశాంతుడై కాలము గడుపుచుండ హైహయరాజగు, కార్తవీర్యుడు 
ఇతని ఆశ్రమమునకు వచ్చి, ఇతని ఆతిథ్యమును స్వీకరించి, ఇతనివద్దనున్న 
కామధేనువును హరింపబూనెను. మొదట కామధేనువు రోమములనుండి ఉద్భవించిన 
యవనులచేత ఇతడు పరాజితుడైనను ఎట్లో తనకార్యము సాధించి, ఆ(శ్రమమును 
ధ్వంసముచేసి కామధేనువును ఎత్తుకొనిపోయెనని అందరెరింగిన విషయమే. 


జమదగ్నికి నలుగురైదుగురు కుమారులు కలిగిరి. వారందరిలో కనిష్టుడైన 
రాముడు కడు సమర్థుడు. ఇతనికి ముఖ్యమైన ఆయుధము పరశువు (గండ్రగొడ్డలి). 
కాని అన్ని ఆయుధములందును, ముఖ్యముగ విలువిద్యయందును గొప్ప నేర్చరి. 
ఇతడు (త్రేత, ద్వావరయుగముల నంధికాలమునందు అవతారమెత్తిన 
విష్ణుమూర్తియేయని పురాణములు నుడువుచున్నవి. కాని మహాభారతమునందు 
రెండుచోట్ల మాత్రమే (ఇవి తరువాతి కాలమునందు చేరిన (ప్రక్షిప్రములేమో!) ఇతడు 
విష్ణువు యొక్క అవతారమని చెప్పబడినది. 


తరతరములనుండి హైహయులయందుకల ద్వేషభావమువలనను కార్తవీర్యుని 
దుశ్చర్యలవలనను క్రోధోద్దీపితుడై భార్గవరాముడు కార్తవీర్యుని చేతులను నరికి చిత్రవధ 
చేసెను. పిదప ఇట్టిపాపమునకు ప్రాయశ్చిత్తముగ తండ్రియాజ్ఞ ననుసరించి 
తీర్థయాత్రకై బయలుదేరిపోగా కార్తవీర్యుని కొమరులు జమదగ్నిని తపస్సు చేసికొనుచు 
సమాధి యందుండినపుడు చంపివైచిరి. పరశురామునికి ఇక హైహయులను 
నిర్మూలముచేయుట మాత్రమేగాక సకల క్షత్రియులను అంతమొందించుటయే జీవిత 
పరమావధిగ దోచి, ఇరువదియొక్క మారులు దండయాత్రసలిపి అతడు 
క్షత్రియోన్మూలనము గావించెనట. క్షత్రియరక్తముతో కురుక్షేత్రమువద్ద ఎన్నియో 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 217 


తటాకములు నిండిపోయెనట.' ఎవరో కొందరుమాత్రము అతికష్టముతో 
పర్వతప్రాంతములకు పారిపోయిగాని, లేదా ప్రీలమధ్య దాగిగాని ప్రాణములను 
దక్కించుకొనిరట. పౌరవృక్షవంతుడగును, అయోధ్యసర్వకర్మయు, మగధ 
బృహద్రథుడును, అంగచిత్రరథుడును కాశీవత్సరాజు మాత్రమే పరశురామునినుండి 
తప్పించుకొనిరి. ఈగాథలయందు కొంత అతిశయోక్తి యుండినను పరశురాముడు 
తన బంధుమిత్రులను కూడగట్టుకొని వైశాలి, విదేహ, కాశీ, కాన్యకుబ్ద అయోధ్యరాజుల 
నందరిని కూడగట్టుకొని హైహయులపై పలుమారు దండయాత్ర సాగించి 
నిరించెననుటకు నందియము లేదు. ఇట్టి ఘోరవిపత్తునకు లోనై హైహయులు 
కొంతకాలమైనను అణగియుండు రనుటకు నందియము లేదు. 


పరశురాముడు ఒక్కొక్కమారు క్షత్రియవధ చేసినపుడును ప్రాయశ్చిత్తముగ 
తపము చేయుచుండెనట. చివరకు పాపపరిహారముగ కశ్యపునికి తాను జయించిన 
పృధివినంతటిని దానము జేసెనట. ఇకముందెప్పుడైననుకూడ పరశురాముడు 
దండయాత్రకు పూనుకొనకుండుటకై కశ్యపుడు, పృథివియంతయు తనదైనందున, 
పరశురాముని బహిష్మరించెనట. పృథివిపై ఎచట నుండుటకును తావు లేక 
పరశురాముడు సముద్రమునుండి పశ్చిమ కోస్తాప్రాంతమును సాధించి, ఎత్తి అందు 
వనవాసమేర్చరచి వసతి కల్పించుకొనెనట. భృగుకచ్చ (నేటి బ్రోచ్‌) నుండి కన్యాకుమారి 
వరకును పశ్చిమ కోస్తా ప్రాంతమంతయు పరశురామునితో ఎక్కువ సంబంధము 
కలిగియుండినటుల నేటికిని గాన్సించుటకు కారణమిదియే. 


పరశురాముడు దాశరథిరామునికిని పాండవులకును ఎన్నియో తరములకు 
పూర్వము వాడైనను రామాయణమునందును, మహాభారతమునందును కొన్ని 
ఘట్టములయందు కానవచ్చుచున్నాడ్లు. దాశరథి రాముడు సీతను పరిణయమాడి 
అయోధ్యకు మరలివచ్చుచుండ భార్గవ రాము డెదురై కయ్యమునకు కాలుద్రవ్వి 
పరాజితుడాయెననియు, జరాసంధుని దండయాత్రలకు గురిగాని చక్కని 
నివాసస్థానమును పరశురాముడు బలరామ కృష్ణులకు చూపించెననియు, భీష్మ, 
ద్రోణ, కర్ణులకు శస్త్రవిద్య నేర్చి ఆచార్యుడాయెననియు, భీష్మునితో యుద్ధము 


216 ఆం(ధ్ర. మహాభాగవతోవన్యానములు 


జేసెననియు, పాండువలతో యుద్ధమునకు పూనుకొనవలదని దుర్యోధనునికి సలహా 
యొసంగెననియు ఇంకా కొన్ని గాధలు కలవు. ఇతిహాసనాయకుల ప్రాశస్త్యము 
నుగ్గడించుటకై వీరికి భార్గవులతో కూడ సంబంధము కలిపివేయుటకు ఇట్టి గాధలు 
తరువాతి కాలమున ఏర్పడియుండవచ్చునని తోచుచున్నది. ఇక కాలమాన రీత్యా 
ఏదో ఒక సమన్వయము కుదిరించుటకై గాబోలు ఇతడు చిరంజీవి యను (శాశ్వతముగ 
జీవించువాడని) రూఢి ఏర్పడెను. 
2. హైహయులు: 

పురుకుత్సుని యనంతరము అయోధ్య రాజ్యము క్షీణింపగా హైహయులు 
క్రమముగా తూర్పు, ఉత్తరమువైపుల వ్యాపించిరనియు, కృతవీర్యుని కుమారుడు 
అర్జునుడు గొప్పయోధుడై తన రాజ్యమును ఎక్కువగ వ్యాపింపజేసెననియు, సమ్రాట్‌, 
చక్రవర్తి, కార్తవీర్య, సహగ్రారున బిరుదముల నొంది ఇతడు మహాఖ్యాతి 
వహించెననియు పైన జూచితిమి. ఇతని సహస్ర బాహువులు నిజముగ వెయ్యి 
ఓడలని ఒక చారిత్రకుడు నిర్ధరించి యున్నాడు. నారాయణుని అవతారమని కొందరు 
విశ్వసించు దత్తాత్రేయు నారాధించి కార్తవీర్యుడు అతని యనుగ్రహము వలన 
దిగ్విజయమును గాంచెనట. నర్మదానది సముద్రమున గలయు ప్రాంతము 
నధివసించిన కర్మోటక నాగులనువారి అనూప రాజ్యమును ఇతడు జయించి మహిష్మతీ 
పట్టణమును గైకొనెను. రావణుని జయించి ఖైదీగా తీసికొనివచ్చియు, పిదప కరుణించి 
వదలివైచెనట. ఇతడు హిమాలయ పర్వతమువరకును దండయాత్ర సాగించెననుటకు 
తార్మాణము. ఇతడు అటనున్న అపవశిష్టుని ఆశ్రమమును ధ్వంసముజేసి, శాపము 
నొందుటయే. పృథివినంతటిని జయించి ఎన్నియో యజ్ఞములను జేసెననియు, 
ఇతడు ఆదర్శ ప్రభువనియు, తపమునందును దానమునందును, విద్యయందును, 
గుణములందును సాటిలేని వాడనియు, ఇతని పరిపాలన న్యాయ సమ్మతముగ 
నుండెననియు ఘోషించుచున్నందున ఒక్క భార్గవుల తోటి వైరమును, అపవశిష్టునికి 
వేసిన అపకారమును మాత్రమే ఇతని యందలి లోపములని తోచుచున్నవి. 


హైహయ భార్గవ స్పర్థలకు కారణము నిజముగ భార్గవుల విదేశీ వ్యాపార 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 219 


దక్షతయేనని కరండీకర్‌ అను మహారాష్ట్రపండితుడు వాదించుచున్నాడు. భార్గవులు 
సముద్రయానమునందు ఎక్కువ నైపుణ్యముగల వారట. కాబట్టి విదేశ వ్యాపారమున 
గొప్ప లాభమును గడించిరి. కాని అర్జునుడు వీరిని స్వార్థపరులుగ భావించి, విదేశ 
వ్యాపారము స్వదేశమునకును ఆర్య సంఘమునకును లాభదాయకముగ నుండుటుల 
జేయబూనుకొని నౌకా నిర్మాణ దక్షులైన ఆత్రేయుల సాయమున సహస్ర నౌకలను 
(లేక వెయ్యి తెడ్లచే నడువబడు (బ్రహ్మాండమైన ఒక నౌకను) నిర్మింపజేసి, తన్ను 
ప్రతిఘటించిన రావణ, కర్కోటకాదులను జయించెననియు పరశురాముడు ఇతనిని 
ఎదిరించి నిర్జించి విదేశ వ్యాపారమును ఆర్యుల వశమునుండి లాగికొని ద్రావిడుల 
వశము గావించెననియు పై వాదముయొక్క సారాంశము. హైహయరాజ్యము 


నాశము జెందిన పిదప పరశురాముడు పశ్చిమ భూభాగమును అభివృద్ధి పరచి 
సూర్పారికవంటి పట్టణములను స్థాపించెనట. 


పరశురాముని ధాటికి లొంగిపోయినను హైహయులు అచిరకాలమునందే 
విజ్బంభించిరనుటకు అర్జునుని కొమారులు నానాప్రాంతములందును రాజ్యము 
చేయుచుండుటయే నిదర్శనము. అర్జునుని జ్యేష్టపుత్రుడు జయధ్వజుడు అవంతియందు 
రాజ్యము చేయుచుండెను. మరియొక పుత్రుడు వూరసేనుడు మధురయందును, 
ఇంకొకడు శూరుడనువాడు బహుశః సురాష్ట్రమునందును రాజ్యము చేయుచుండిరి. 
జయధ్వజుని కుమారుడు తాళజంఘుడు. ఇతనికి పెక్కుమంది కుమారులు కలిగిరి. 
వారందరిలో వీతిహోత్రుడు ముఖ్యుడు. 


హైహయులు ఐదు భాగములుగా చీలిపోయిరని పురాణములు చెప్పుచున్నవి. 
(1) వీతివోత్రులు (2) శార్యాతులు (3) భోజులు (4) అవంతీయులు (5) కుండికేరులు 
అను ఈ ఏవురును కూడ తాళజంఘలని పేర్కొనబడుచుండిరి. వీరిలో వీతిహోత్ర, 
కుండికేరులు (లేక తుండికేరులు) వింధ్యప్రాంతముల నుండిరి. శర్యాతులు పశ్చిమ 
భారతమునందును, భోజులు ఆరావలి పర్వత ప్రాంతములందును, అవంతీయులు 
మాల్వ యందును రాజ్యమేలిరి. వీరు కాన్యకుబ్ద, కోసల, కాశీరాజ్యములపై పలుమారు 
దండెత్తుచు వచ్చి, చివరకు కాన్యకుబ్దమును జయించిరి. కాశీరాజైన హర్యశ్వుని 


220 ఆం(ధ్ర మవోభాగవతోవన్వానములు 


గూడ జయించిరి. కాని తరువాత పరాజితులై వీతిహోత్ర రాజొకడు భార్గవబుషిని 
శరణు వేడవలసి వచ్చెను. అటుపిదప హైహయవంశమే అంతమొందెను. (బ్రాహ్మణుడే 
రాజాయెను. 


అయోధ్యరాజ్యముపై హైహయులు దండెత్తినపుడు వారితో శక, యవన, 
కంభోజన, పారద, పల్లవులు చేరియున్నందున హైహయులు వీరందరికిని 
నాయకులుగ నుండిరేమోయని తోచుచున్నది. ఇట్టి ప్రబలశత్రువును ఎదిరింపజాలక 
నాటి అయోధ్యరాజు బాహుడనువాడు (అసితుడని రామాయణమునందు గలదు). 
పారిపోయి వనవాసము చేయుచు బెరవ భార్గవుని ఆశ్రమమున అవసానము జెందెను. 
ఇతనికి వనవాసమునందే సగరుడను తనయుడు కలిగెను. ఇతడు బెరవ భార్గవనియొద్ద 
విద్యాభ్యాసముచేసి, చివరకు భార్గవుల సాయముచేతనే తన రాజ్యమును మరల 
సంపాదించుకొని ప్రశంసాపాత్రు డాయెను. వైశాలీ విదిశా రాజ్యములను గూడ 
హైహయులు జయించిరనియు విదిశవారి పాలనముక్రిందనే కొంతకాల 
ముండెననియు పురాణములు చెప్పుచున్నవి. కాని హైహయులు తూర్పువైపు 
వ్యాపించుటకు వీలు లేకుండునట్లు వైశాలిరాజులు ఒక గొప్ప ప్రతిబంధకముగ 
నేర్పడిరని తోచుచున్నవి. 


హైహయులు రణపండితులేగాని పాలనాదక్షులుగారు. అందువలన యుద్ధము 
నందు పరాజయము చెందిన రాజ్యములు సర్వవిధముల నాశనము చెంది 
అరాచకమునకు లోనగుచుండెను. 


3. ఇతర చంద్రవంశములు: 


(క) యాదవులు: సగర చక్రవర్తి అయోధ్యను పాలించుచుండగా యాదవ 
రాజ్యమును విదర్భరాజు పాలించుచుండెను. అ(ప్రతిహతపరా[క్రముడగు 
సగరచడక్రవర్తితో విదర్భరాజువియ్యముసలిపి కూతురు కేశినిని సగరునికి 
పరిణయముగావించి, వంశాను క్రమముగ వచ్చిన రాజ్యమును వదలివైచి, 
దక్షిణాపథమునకు వెడలిపోయెను. ఈరీతిగ ఉత్తరాపథమున కంతటికిని సగరుడు 
ఏకచ్చత్రాధిపత్యము వహించెను. కాని సగరుని యనంతరము విదర్భయాదవులు 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 221 


మరల హైహయరాజ్యముపై తమ యధికారమును నెలకొల్పిరి. విదర్భరాజ తనయులు 
మువ్వురును మూడు శాఖలకు మూలపురుషులైరి. క్రథుడని అపరనామముగల 
భీముడు ప్రధానవంశమున నుండగా కైశికుడు చేదిరాజై చేదివంశ స్థాపకుడాయెను. 
మూడవ కుమారుడు లోమపాదుడు స్థాపించినవంశమే (ప్రాంతమందుండెనో 
తెలియరాదు. 


(ఖ) ఆనవులు: ప్రాచ్యదేశమున తితిక్షువుచే స్థాపింపబడిన ఆనవ వంశము 
సగరచక్రవర్తి కాలమున బలిచక్రవర్తి పాలనయందుండెను. ఇతని రాణి సుధేష్ట భర్త 
యనుమతిగొని మామతేయ దీర్చ తపస్సనెడి బుషివర్యునివలన అంగ, కళింగ, 
వంగ, పుండ్ర, సుహ్మ యను నామముల బరగిన ఏవురుకొమరులను పొందెను. 
అంగరాజ్యము యొక్క రాజధాని నేటి భాగల్‌పూరునకు పడమట నాలుగుమైళ్ళ 
దూరమునగల మాలిని, అంగ, మగధరాజ్యములకు మధ్య సరిహద్దుగ చంపానది 
ఏర్చడెను. నేటి భాగల్‌పూరు మాంఘీరు జిల్లాలే నాటి అంగరాజ్యము. దీనికి పడమట 
నేటి ఢాకా, చిట్టగాంగ్‌ ప్రాంతములే నాటి వంగరాజ్యము. పుండ్రరాజ్యము 
ఉత్తరబెంగాల్‌ ప్రాంతము. సుహ్మరాజ్యము బర్వాన్‌ ప్రాంతము. కళింగము ఒరిస్సా 
కోస్తా ప్రాంతము, ఉత్తర సర్మారులును. 


(గ) కాన్యకుబ్దము: జహ్నువు తరువాత కొన్ని తరములకు కుశికుల 
మూలపురుషుడైన కుశికుడును, ఇతని కీపొరుకుత్సరాణియందు (ఈమె పురుకుత్సనికి 
ఆరవతరముది) గాధియు, అతనికి బుచీకుని అనుగ్రహమువలన విశ్వరథ 
నామధేయముగల విశ్వామిత్రుడును కలిగిరి. గాధి ఇంద్రుని యవతారమట. గాధి 
కూతురు, సత్యవతి, బుచీకుని పరిణయమాడిన యంశము ఇదివరకు ఎరిగినదే. 


విశ్వామిత్రుడు వసిష్టుని నుండి కామధేనువును బలాత్మరించి గైకొనజాలక 
క్షత్రియ బలముకన్న బ్రహ్మతేజోబలమే ఉత్తమమైనదని తెలిసికొని రాజ్యమును 
వదలివైచి సర్వసంగ పరిత్యాగముజేసి, ఘోరతప మొనరించి బ్రాహ్మణుడై చివరకు 
వసిష్టునితోనే తాను బ్రహ్మర్షియని ఒప్పందము నొందెను. విశ్వామిత్రుడు వసిష్ట 
నెదిరించి సత్యవ్రత (త్రిశంకునికి సాయముజేసి స్వర్గమునం దతనికి స్థానము 


222 : - ఆంధ్ర మవోభాగవతోపన్యానములు 


చేకూర్చెను. త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు వసిష్ణుని మన్ననకు పాత్రుడుకాగా 
అతని సుగుణములను పరీక్షించుటకై విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని ముప్పుతిప్పలు 
పెట్టెను. శక్తి మొదలగు వసిష్టులను విశ్వామిత్రుడు సౌదసుల (సుదాసుని 
వంశమువారు) ద్వారా సంహరింపజేసెను. హరిశ్చంద్రుని కొమర్హుడైన రోహితునికి 
బదులుగ శునఃశేవుడను వానిని నరమేధయాగ మున బలియివ్వకుండ వానిని 
తనకుమారునిగ స్వీకరించి రక్షించెను. విశ్వామిత్రుడు రామాయణమునందు 
కన్పించుచున్నాడు. ఇతనికి మేనకయందు శకుంతల జనించుటయు ఆమె దుష్యంతుని 
పరిణయమాడి భరతచక్రవర్తి జననియగుటయు సకలజన విదితమే. 


విశ్వామిత్ర వసిష్ణుల స్పర్థ అననంతరము, వంశక్రమానుగతము అని 
పురాణముల నుండి తెలియుచున్నది. శకుంతలా జనకుడును, శ్రీరామచంద్రుని 
సమకాలికుడును, హరిశ్చంద్రునికిని, జమదగ్నికిని, శునఃశేఫునికిని, సుదాసునికిని 
కవశ ..ఐలూషునికిని, దశరాజ్ఞులకును సమకాలికుడును ఐన విశ్వామి(త్రుడు 
ఒక్కడేకాజాలడు. వీరందరిని ఒక్క వ్యక్తిగ పురాణములందు నిర్ధరించి చెప్పినందువలన 
వంశవృక్షములందును, కాలమాన పట్టికలందును ఎన్నియో చిక్కులేర్చడినవి. 


కాన్యకుబ్ద రాజైన విశ్వామిత్రుడు జమదగ్ని పరశురాములకు బంధువు కాబట్టి 
హైహయులతో వారికున్న పోరాటములో ఇతడును కొంత సహాయము 
చేసియేయుండును. వసిష్టునిచే పరాభవముచెంది, రాజ్యమును పరిత్యజించి, 
తనకుటుంబమును అయోధ్య సమీపమునందలి ఒక ఆ(శమములో వదలి, 
తపమాచరింప బోయెననుటలో ఆశ్చర్యమేమియులేదు. శునఃశేఫుని రోహితునికి 
బదులుగ బలిఇవ్వనుండ అతనిని రక్షించి దేవరాతుడని పేరు మార్చి తనకుమారునిగ 
స్వీకరించెను. తనకుమారులు క్రొత్తగ వచ్చిన ఈ దేవరాతుని ఆధిక్యతను (జ్యేష్టత్వమును 
ఒప్పుకొనకపోగా వారిని మ్లేచ్చులు కమ్మని శపించెను. వీరే ఆంధ్ర, పుండ్ర, శబరులు, 
విశ్వామిత్రుని యనంతరము అష్టకుడు కాన్యకుబ్ద సింహాసనమెక్కెను. 


(ఘ) కాశీ: దివోదాసుని కుమారుడు ప్రతర్దనుడో లేదా అతని కుమారుడు 
వత్సుడో ' ఈరాజ్యమును విస్తరింపజేసి కౌశాంబీ (ప్రాంతమంతటిని ఇందులో. 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 223 


కలిపివైచెను. వత్సునినుండి ఈప్రాంతమునకు వత్సదేశమని పేరువచ్చెను. వత్సుని 
కుమారుడు అలర్భుడుకూడ సామర్థ్యవంతుడే. భద్రశ్రేణ్యుని కాలమునుండి రాక్షసుల 
బారియందుండిన వారణాసిని ఇతడు జయించి మరల కాశీపట్టణమునే తన 
రాజధానిగా చేసికొని చాలకాలము రాజ్యపాలనము చేసెను. 

4. సూర్యవంశము: 

(క) అయోధ్య: మాంధాత, పురుకుత్స, ప్రసదస్యుల కాలమున 
యశోవంతముగ విరాజిల్లిన ఈరాజ్యము తరువాత నామమాత్రావిశిష్టముగ నుండి 
త్రయ్యారుణ, సత్యవ్రత-త్రిశంకు, హరిశ్చ్రంద్రుల కాలమున మరల గణనకెక్కెను. 
సత్యవంత త్రిశంకునుగూర్చి ఎన్నియో గాధలుగలవు. ఇతని అత్యాచారములను 
జూచి కోపించి పురోహితుని ఆజ్ఞానుసారముగ ఇతనిని తండ్రి శపించగా ఇతడు 
ఇల్లు వాకిలిలేక గంగానది యొడ్డున మహారణ్యములలో తిరుగుచు చండాల 
జీవితమున పండ్రెండు సంవత్సరములు గడిపెనట. ఆరోజులలో తొమ్మిది 
సంవత్సరముల కాలము ఘోరమైన క్షామము సంభవించెను. ఆక్షామమునందు 
విశ్వామిత్రుని కుటుంబము తిండిలేక మలమల మాడుచుండగా (అతడు వీరిని 
వదలివైచి తపము జేయబోయెనని పైన జూచితిమిగదా) త్రిశంకు వీరిని పోషించెనట. 
తపము ముగిసిన పిదప విశ్వామిత్రుడు వృత్తాంతమునంతయు ఎటింగి బ్రిశంకునకు 
సాయపడ నిశ్చయించి, ఇతని తండ్రి త్రయ్యారుణుడు చనిపోయినను గూడ ఇతనిని 
రాజ్యమునకు పిలిపింపక పోవుటగని, ఇదంతయు తనకు పరమశత్రువైన వసిష్టునిపై 
సాధింపగల విజయముగదా! అని పరిగణించి, కొంత [శ్రమపడి త్రిశంకును అయోధ్య 
సింహాసన మెక్కించెను. 


త్రిశంకుని పిదప హరిశ్చంద్రుడు సింహాసనమెక్కి సమ్రాట్‌ పదవినిపొంది 
రాజసూయయాగ మొనరించెననియు, ఎన్నియో కష్టములకోర్చి విశ్వామిత్రుని చేతనే 
తాను సత్యవ్రతుడనియు, సుగుణముల కుష్పయనియు మన్ననగాంచెనని అందరెరింగిన 
విషయమే. ఇతని కుమారుడు రోహితుడు రోహితపురమును గట్టించెనట. రోహితుని 
చిన్నకుమారుడు. చంపయనువాడు తూర్పు బిహారునందు భాగల్‌ పురమునకు 


224 | ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


సమీపమున చంపాపురమును కట్టించెనట. హరిశ్చంద్రునికి ఆరవ తరమువాడు 
బాహువు. ఇతని తనయుడే సగరుడు. తన తల్లికి సవతి విషము పెట్టగా ఆ విషము 
గర్భమునందున్న ఇతనికే ప్రాకి ఆవిషములోనే జనించినందున ఇతడు సగరుడాయెను. 
ఇతడు జనించుటకు పూర్వమే తండ్రి మరణించెను. తల్లి జెర్వబిషి ఆశ్రమమున 
వరణుజొచ్చి ఇతనిని ప్రసవించినందున ఇతడు బెర్వబుషివద్ద విద్యాభ్యాస ముజేసి 
విలువిద్యయందు గొప్ప ప్రావీణ్యము సంపాదించి, జెర్వుని అనుగ్రహమువలన 
ఆగ్నేయాస్రమునుగూడ పొందెను. అప్పటికి అయోధ్యప్రాంతము నంతటిని 
హైహయులవంటి వచ్చిన విదేశీయులు ఆక్రమించుకొనిరి. వీరు క్షత్రియులనంటి 
వచ్చిన. విదేశీయులు ఆక్రమించుకొనిరి. వీరు క్షత్రియులమని చెప్పుకొనుచు, 
(బ్రాహ్మణులను గారవించుచు, సనాతన మతాచార వ్యవహారముల నవలంబించి 
వసిష్ణునే తమ పురోహితునిగ ఉంచుకొనిరి. ఈరీతిగ సగరుడు యుక్తవయస్ముడగు 
వరకును సుమారు ఇరువది సంవత్సరములు జరిగెను. 


సగరుడు గొప్పయోధుడు. రాజ్యమును సంపాదించుకొని పిదప హైహయులను 
జయించుటకై మధ్యదేశమును, మధ్యభారతమునంతటిని దాటిపోయి, అఖండ 
విజయముగాంచి, వారి అనుయాయుయిన శకయవన కాంభోజాదులను 
సంపూర్ణముగ అణచివైచి, వారు వసిష్టుని వరణుజొచ్చి వేడగా వసిష్టుని వాక్యమును 
శిరసావహించి ప్రాణముతో వదలివైచెను. కాని పరాజితులను చిహ్నముగ శకులు 
నగము తల గొరిగించుకొనవలెననియు, కంబోజులు మార్తిగ తల 
గొరిగించుకొనవలెననియు, పారదులు అసలు క్లౌరమే చేసికొనరాదనియు, వెంట్రుకలకు 
ఎట్టి సంస్కారము జేసికొనరాదనియు, పహ్హవులు గడ్డమును గొరిగివైచియే 
తీరవలెననియు- ఈ రీతిగ వీరెవ్వరికిని వైదికాచారముల నవలంబించుటకు 
వీలులేనట్లు కట్టడి చేసెను. వసిష్టుల ఆధ్వర్యమున క్రమముగ విదేశీయులు ఏరీతిగ 
వైదికాచార సంపన్నులగుచుండిరో, వీరికెట్టి విచిత్ర ఆచార వ్యవహారములుండెనో 
ఈ గాధ నుండి తెలియుచున్నది. సముద్రము సగరుని తనయుడాయెనని (సాగరుడు) 
తెల్పుటకు మరియొక విచిత్రగాథ గలదు. 


సగరుడు నాటి రాజన్యుల నందరిని అణచివైచి ఉత్తరాపథమునకు ఏకచ్చత్రాధి 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 225 


పత్యము వహించెను. ఇక అతడు వదలివైచిన రాజ్యములు తూర్పున విదేహ, వైశాలి, 
ఆనవ రాజ్యములను, దక్షిణమున విదర్భయు, చంబల్‌ నది యొడ్డున ఉండిన 
యాదవుల శాఖయు, మధ్యదేశమునందు కాశియు, రేవాపర్వత ప్రాంతములందు 
తుర్వసుల రాజ్యమును- ఇవి మాత్రమే. 


సగరుని జ్యేష్టపుత్రుడు అసమంజుడు క్రూరుడగుటచేత అతనిని వదలివైచి 
అతని తనయుడైన అంశుమంతునికి పట్టము కట్టిరి. 


(ఖ) వైశాలి: వైశాలి రాజైన కరంధముని కొందరు రాజులు కలిసి దండెత్తి 
చుట్టుముట్టగా వారితో ఘోర యుద్ధముగావించి ఎట్టకేలకు జయము నొందెను. 
ఇతని తనయుని అవీక్షితుని విదిశారాజు (బహుశః ఇతడు హైహయుడేమో?) 
చెరగొనిపోగా ఇతనితో బోరి తనయుని విడిపించుకొనుటయే గాక గొప్ప విజయమును 
గాంచెనట. విదిశ రాజు తనయ విశాలను పెండ్లియాడి ఇతడు షోడశ 
మహాచక్రవర్తులలో నొకడని ప్రసిద్ధిజెందిన మరుత్తుడను తనయుని పొందెనట. 
మరుత్తుడు విరామము లేక యజ్ఞ యాగాదులను జేయుచుండెనట. ఇందులకై 
వలయు వేలకొలది పాత్రలను ఇతర ఉపకరణములను ఇతడు బంగారుతోనే 
చేయించెనట. ఇతనికి నాగులతో అమిత పోరాటము సాగెననియు చివరకు వీరిని 
సంపూర్ణముగ నోడించి వారి నివాసములన్నింటి ని కాల్చివేయ నుద్యుక్తుడుకాగా వీరు 
ఇతని తండ్రి శరణుజొచ్చి, వారు జంపిన బుషులనందరిని విషముపీల్చియో 
బెషధములుపయోగించియో టబ్రతికింపగా, ఇతడు దయదల్చి వదలి వైచెనెట. 
ఈనాగులు నిజముగ హైహయులే యనియు హైహయుల విజృంభణము 
వీలులేకుండునట్లుగ వారిని అణచివేయుట మరుత్తుని మహాకార్యములలో నొకటియని 
పార్టిటర్‌ అను చరిత్రకారుడు వక్కాణించుచున్నాడు. 


5. (బ్రాహ్మణ కుటుంబములు: 


భృగు, భార్గవ నామములతో వాసిగాంచిన ఈ బ్రాహ్మణ కుటుంబము 
ఈయుగమునందు సర్వప్రాముఖ్యతను గాంచెను. బుచీకుడు, జమదగ్ని 
పరశురాముడు, అగ్ని బెర్వుడు భార్గవులలో ముఖ్యులు. 


226 - క ఆంధ మహోభాగవతోవన్యానములు 


అంగిరసులలో ప్రథముడు అయాస్యుడు. ఇతడే అయోధ్య రాజైన 
హరిశ్చంద్రుడు. శునఃశేపుని బలియిచ్చి యజ్ఞము చేయపూనుకొనినపుడు అధ్వర్యవము 
వహించిన పురోహితుడు. అంగీరసులు వైశాలి రాజుల వంశక్రమానుగత పురోహితులు. 
ఉశిజ అంగిరసుడు కరంధమ అదీక్షుతుల పురోహితుడుగా నుండగా, అతని తనయులు 
బృహస్పతియు, సంవర్తుడును మరుత్త అవీక్షుతుని పురోహితులయిరి. ఉశిజుని 
జ్యేష్టపుత్రునికి ఉచిత్యునికి ఆతని భార్యమమతయందు దీర్హతముడను గ్రుడ్జివాడొకడు . 
తనయుడుగ జనించెను. దీర్జతముడు ధర్మవిరుద్ధముగ ప్రవర్తించినందున అతనిని 
బహిష్కరించి, తెప్పపై నునిచి గంగానది యందు వదలివైచిరట. అదృష్ట వశమున 
ఆతడు కొంత దవ్వరిగిన పిదప తూర్పు ఆనవ రాజైన బలి ఆతనిని జూచి సురక్షితునిజేసి 
తనకు పుత్రభిక్ష ఇవ్వమని వేడెనట. ఈ రీతిగ బలియొక్క రాణికి అంగ, వంగ, 
కళింగ, పుండ్ర, సుహ్ములని ఏవురు పుత్రులు జనించిరి. తరువాత కొంతకాలమునకు 
దీర్భతమునికి గ్రుడ్డితనము పోయి దృష్టి ఏర్పడెననియు, పౌరవంశ భరతుని 
అభిషేకమున ఇతడే ఆధ్వర్యవము వహించెననియు తెలియుచున్నది. బృహస్పతి 
కుమారుడు భరద్వాజుడు కాశీపట్టణమునకు వెళ్ళి దివోదసుని పురోహితు 
డాయెననియు, అతని పుత్రుడు వితథుడు భరత చక్రవర్తికి దత్తపుత్రుడై పౌరవ 
వంశమును నిలబెట్టెననియు కూడ పురాణములందు గలదు. 


అత్రికుటుంబములో హైహయార్జునిచే మన్ననగాంచిన దత్త ఆత్రేయు డొకడే 
ప్రముఖుడుగా గాన్సించుచున్నాడు. 


వసిష్టులలో దేవరాజు అయోధ్యరాజులగు త్రయ్యారుణ సత్యవ్రతులకు 
పురోహితుడు. తరువాత కాలమున అతని వంశీయుడే శకయవనాది విదేశీయులకు 
కూడ పురోహితుడుగనుండి చివరకు సగరుని పురోహితుడాయెను. మైహయార్జునుడు 
హిమాలయములలో ధగ్ధము జేసిన ఆశ్రమము ఇతనిదే. ఆపవ బుషి కూడ ఈ 
వసిష్ట కుటుంబమువాడే. 


జామదగ్న్య రాముని యజ్ఞమునందు అధ్వర్యవము వహించి, అతనినుండి 
"పృధివి నంతటిని దానముగగొని, పరశురాముని దండయాత్రలకు ఇక ముందెన్నడును 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు i 227 


అవకాశము లేకుండునట్లుగ అతనిని బహిష్కరించిన కశ్యపుడే పురాణములందు 
ఆకుటుంబములో మొదటివాడుగ గాన్పించుచున్నాడు. మరియొక అగస్తుడు 
లోపాముద్రను పెండ్లాడి దక్షిణ దేశమునకు వచ్చెను. ఇతడు కాశిరాజగు ప్రతర్ణుని 
పౌత్రుడైన, అలర్భుని సమకాలీనుడు. 


ఇప్పటికి పురాణ వాక్యములరీత్యా కృతయుగము ముగిసెను. పరశురామ, 
సగరులయుద్ధములవలన పౌరవ, కాన్యకుబ్ద, ద్రుహ్య, ఆనవ(పంజాబుశాఖ) 
వంశములు క్రమముగ రూపుమాయజోొచ్చెను? యాదవులు దక్షిణాపథమును చేరిరి. 
హైహయులు పూర్తిగ అణగిపోయిరి. ఇక తూర్పు ప్రాంతమునందలి వైశాలి, విదేహ, 
అయోధ్య, కాశీ, ఆనవ(బెంగాల్‌శాఖ) రాజ్యములు మాత్రమే తరువాత యుగమున 
ప్రశస్తిగాంచెను. 


ఆ 


రామచంద్రయుగము 
(రమారమి క్రీ॥ పూ॥ 2350-1950) 

1. సూర్యవంశము: 
సగరునికి పిదప భగీరథునివరకును అయోధ్య రాజ్యము కొంత వెనుకకు 
బడెను. భగీరథుడు షోడశ మహాచక్రవర్తులలో నొకడు. ఇతడు సమ్రాట్‌ బిరుదమును 
సంపాదించెను. ఇతడు గోదాన బాహుళ్యముచేత వాసికెక్కెను. ఇతడు శివభక్తుడు. 
ఇతడు వియద్దంగను తపముజేసి భూమిపై ప్రవహింపజేసి కపిల మహర్షిచే శాపము 
జెందిన తన పూర్వీకులకు మోక్షము దెచ్చెనట. అందువలననే గంగ భాగీరథియాయెను. 
బహుశః గంగా పూజను ఇత డారంభించెనో, లేక గంగా నదికి కాలువలు త్రవ్వించి 
నీటిపారుదల వసతులేర్చరచినందున ఇతనికి పురాణములం దిట్టి ప్రాముఖ్యత వచ్చెనో 

చెప్పజాలము. 

భగీరథునికి మూడవ తరమువాడు అంబరీషనాభాగి. ఇతని కాలమున 
అయోధ్య (ప్రాముఖ్యత గడించెను. ఇతడు భాగవత మతావలంబియనియు, 


228 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


ద్వాదశీవ్రత నిష్టుడనియు పురాణములలో గాన్పించు ప్రశంస బహుశః తరువాత 
కాలమున ఇతనికి ఆపాదించిన విశేషములని తోచుచున్నది. ఇతని తర్వాత మూడవ 
తరమువారు బుతువర్షుడు. నలచరిత్రయందు ఇతనికి కొంత స్థానము కలదు. 
బుతువర్గుని తనయుడు సుదాసుడు. కాని వేదప్రస్తావితుడైన దశరాజ్ఞ సుదాసునికిని 
ఇతనికిని ఎట్టి సంబంధమును లేదు. 


సుదాసుని తనయుడు కల్మాషపాదుడను అపరనామముగల మిత్రసహుడు 
ఇతని పేరును గూర్చి ఎన్నియో గాధలుగలవు. ఇతడొకమాటు పొరబాటున తన . 
గురువు వసిష్టునికి నరమాంసమును వడ్డించెనట. వసిష్టుడు కుపితుడై రాక్షసుండవు 
గమ్మని శపించి, పొరబాటని తెలిసినపిదప శాంతుడై శాపకాల వ్యవధిని తగ్గించి 
రాక్షసత్వము పండ్రెండు సంవత్సరములేయని నిర్ధరించెనట. ఈ లోగా రాజుగూడ 
వసిష్టుని శాపమునకు కినిసి ప్రతిశాప మొసగ నుద్యుక్తుడై రాణిచే నివారితుడై, 
శాపగ్రస్త మంత్రజలమును ఏమిచేయుటకును తోచక, భూమిపై వైచినచో ఏండ్ల 
తరబడి భూమి బీడు పారిపోవునని వెజచి, తన కాళ్ళపైననే వేసికొనెనట. వెంటనే 
తన కాళ్లు శిలామయములాయిను. యధథాసితిని పొందిన పిదప కల్మాషపాదునికి 
మరియొక శాపముండినందున పుత్రులు లేక దుఃఖించి వసిష్టనిచే వేడి నియోగరీత్యా 
వసిష్టునిచే రాణికి గర్భోత్పత్తి కలిగించెను. 


ఈ విధముగ జనించిన అశ్మకుడను తనయుడు పౌదన్యపురమును 
స్థాపించెనట. అశ్శకుని తనయుడు మూలకుడనువాడుపరశురామునికి వెజచి 
ప్రీసమూహములందు దాగికొనుచుండుటచేత నారీకవచుడనిపించుకొనెను. కాని 
పరశురాముడు అశ్మకునికి ఎన్నియో తరముల పూర్వుపువాడు. బహుశః కల్మాషపాదుని 
యనంతరము రాజు లసమర్జ్థులగటచేత ఈ ప్రాంతమునందలి అరాచక, విపరీత 
పరిస్థితులను బట్టి ఇతనిని రహస్యముగ అంతఃపురములో నునిచి పెంచి పెద్దవానిని 
జేయవలసివచ్చెనేమో? అయోధ్య అను రాజ్యముగూడ రెండు చీలికలై ఆరు, ఏడు 
తరములకు పిదపనే. రెండవ దిలీపుడని ప్రఖ్యాతిగాంచిన ఖట్వాంగుని కాలముననే, 
మరల ఒక్కటాయిను. అంతవరకును, భరతపంచాల రాజ్యములు ఉచ్చర్ధక యందుండి 
నపుడు, అయోధ్య క్షీణదశయందుండెనేమో? 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 229 


రెండవ దిలేపుడు సమ్రాట్‌, చక్రవర్తి బిరుదాంచితుడు అసురులతో బోరుటకై' 
ఇతడు దేవతలకు సాయము జేసెనట. ఇతడు విష్ణుభక్తుడు. ఇతని తనయుడు 
రఘమహారాజు గొప్పఖ్యాతిని గడించినందున ఇక్ష్వాకువంశము రఘువంశమాయెను. 
ఇతడు ఆదర్శప్రభువు కాబట్టి తరచు అయోధ్య రాజులలో ప్రథముడుగ 
పరిగణింపబడుచున్నాడు. ఇతడు పృథివి నంతటిని జయించి విశ్వజిత్‌ యాగము 
గావించెనట. 


రఘు మహారాజు తనయుడు అజమహారాజు. ఇతని రాణి విదర్భరాజ తనయ, 
ఇందుమతి. వీరి కుమారుడే దశరథుడు. ఇతడు ఉత్తరాపథమున సకల దిక్కులందును 
దండయాత్రలు సాగించి విజేతయై ఆర్యసంస్కృతిని వ్యాపింపజేసెను. ఇతని 
సమకాలికుడైన మధుయాదవ రాజ్యమును సుస్థిరముగ జేసెను. పౌరవులు ఆనాడు 
గంగా యమునా మధ్యదేశమున ఉత్తర పంచాలాది నాలుగు రాజ్యములందు 
విలసిల్లుచుండిరి. దశరథుని కాలమున కోసల రాజ్యమునకు తూర్పు విదేహవైశాలి, 
అంగరాజ్యములను, దక్షిణమున కాశీతో కలిసిపోయిన వత్సదేశమున, పడమట 
హస్తినాపుర రాజ్యమును, పంచాల రాజ్యములును, విలసిల్లుచుండెను. యమునానది 
వద్ద నుండి గుజరాత్‌ వరకును, వింధ్యా, సాత్పురా పర్వతముల కటువైపునుండిన 
దక్షిణ ప్రాంతమంతయు మధుచక్రవర్తి పాలనమున నుండిన యాదవ రాజ్యమునకు 
లోబడి యుండెను. 


దశరథునికి కౌసల్యా, కైకేయి, సుమిత్రలే కాక ఇతరభార్యలుండిరి. కాని 
కైకేయిదేవి సుతునికే పట్టము గట్టెదనని వివాహమునకు పూర్వము ఇతడు మాట 
ఇచ్చియుండినట్లు తోచుచున్నది. ఇతని కూతురు శాంత, అంగరాజగు లోమపాదునికి 
పెంపుడు పోయెను. కాని వసిష్ణుని సలహా ననుసరించి దశరథుడు శాంతను 
బుష్యశృ్ళంగుని కిచ్చి పరిణయము గావించి అతని సహాయముతో పుత్రకామేష్టి 
యాగము జేసెను రామజననాది రామాయణ వృత్తాంత మందరెరింగినదే. 
రామాయణము నుండియే మనకు ప్రాచీన కాలము నందలి దక్షిణ ప్రాంతమును 
గూర్చి కొంతవరకు తెలియచున్నది. అచ్చటచ్చట కొందరు ఆర్యవీరులు వసతి 


230 ( ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


నేర్చరుచుకొని యుండిరేమో; కాని దక్షిణాపథమున దండక యని విఖ్యాతిగాంచిన 
ఘోరారణ్యముండెను. రామచంద్రుడు వనవాసమునకై బయలుదేరి మొదట ప్రయాగకు 
వెళ్ళి, నైరుతిదిశ ప్రయాణము సాగించి భూపాల్‌ ప్రాంతమును అటునుండి దక్షిణముగా 
నర్మదానది యొడ్డును, పిదప చిట్టిస్‌గర్‌ జిల్లా ప్రాంతములచేరి అందు పది 
సంవత్సరములు వాసమొనర్చెనని తోచుచున్నది. పిమ్మట దక్షిణమువైపు 
ప్రయాణముచేసి గోదావరీ నదికి మధ్యయందున్న జనస్థానమును చేరెను. ఈ 
ప్రాంతము రాక్షసుల బారికి లోనైనందున మునులకు బాధాకరముగ నుండెను. 
రామచంద్రుడు మునులకు సాయమొనర్చి రాక్షసులను కొందరిని హతమార్చను. 
ఈ రాక్షసులకు సింహళమునందలి రాక్షస రాజ్యముతో సన్నిహిత సంబంధ 
ముండినందున, రావణుడు పగపూని సీతను ఎత్తుకొనిపోయెను. రాముడు 
దక్షిణమువైపు ప్రయాణము సాగించుచు పంపా సరస్సును, బుష్యమూక పర్వతమును 
చేరుకొని వాలి వధ గావించి, సుగ్రీవునికి పట్టము గట్టి, వానర సహాయమున 
రాక్షసులను జయించి, రావణుని వధించి, విభీషణునికి పట్టముగట్టి, సీతా సమేతుడై 
అయోధ్య జేరెను. ఇంత కాలమును తన ప్రతినిధిగ భరతుడు పరిపాలన 
మొనర్చుచుండెను. 


కొన్ని కొన్ని విచిత్ర వృత్తాంతములను. అతిశయోక్తిని, వదలివైచినచో రామకథ 
యందు చారిత్రకము కాని విషయము లేమంత ఎక్కువగా గాన్పించుట లేదు. 


రాముని తమ్ములు వివిధ ప్రాంతములను పాలించుచుండిరి. అంగద 
చంద్రకేతులను పేర్లుగల, లక్ష్మణుని సుతులిరువురును హిమాలయ పర్వత సమీపమున 
నుండిన కారపథ దేశమునందు అంగదీయ, చంద్రచక్ర రాజధానీ నగరముల నుండి 
పాలించుచుండిరి. భరతునికి తనతల్లి రాజ్యమైన కేకయ రాజ్యమును, సింధుదేశమును 
రాజ్యమాయెను. అతని తనయులు తక్ష్మ పుష్మరులు గంధర్వులనుండి గాంధారను 
జయించి తక్షశిలా, పుష్మరావతీ పట్టణములను స్థాపించిరి. శత్రుఘ్నుడు యమునానది 
పశ్చిమమున సాత్వత యాదవుల నోడించి మధుసుతుడగు మాధవలవణుని జంపెను. 
మధుపురి(మధుర) మధురయని నామకరణముజేసి ఇతడు తన రాజధానిగా 
జేసుకొనెను. ఇతని తనయుడు సుబాహుడిందే ఇతని పిదప పాలనము సల్చెను. 


భాగవత రాజవంశములు -భువనకోశము -ఇతర శాస్త్రములు 231 


రాముని తనయులలో కుశుడు అయోధ్య ప్రాంతమును, లవుడు ఉత్తరకోసల 
ప్రాంతమును గ్రావస్తి రాజధానిగా పాలించిరి. ఈ చిన్నచిన్న రాజ్యము లెక్కువ 
కాలముండినట్లు గాన్సించదు. గాంధార రాజ్యముల ప్రస్తావన తరువాత కాలమున 
అసలే గానరాదు. బహుశః ద్రుహ్యులతో అవి కలిసిపోయెనేమో! యాదవ రాజగు 
భీమసాత్వతుడు శత్రువ్నుని కుమారులను మధుర నుండి తరిమివైచి ఆ 
ప్రాంతమునంతటిని యాదవ రాజ్యమున గలిపికొనెను. ఇక లక్ష్మణుని కుమారులను 
గూర్తిగాని, లవునిగూర్చిగాని ప్రస్తావనయే గాన్పించుటలేదు. 


ఇటుపైన అయోధ్యకు ఎట్టి 'ప్రాముఖ్యతయు గాన్పించదు. పౌరవ.యాదవ 
రాజ్యములే ఇటుపైన ఎక్కువ ప్రశస్తిగాంచిన రాజ్యములు. 


విదేహ: జనక నామధేయమున బరగిన రాజులలో సీతాదేవి తండ్రియైన 
శీరధ్వజుడు. సుప్రసిద్ధుడు. సాంకిష్య రాజగు సుధన్వనుడు సీతను తనకిచ్చి పరిణయము 
చేయమని శీరధ్వజుని కోరెను. కాని సుధన్వనుడు యుద్ధమునందోడిపోగా శీరధ్వజుడు 
" తనతమ్ముని కుశధ్వజుని సంకిష్య రాజ్యాధినాథునిగా జేసెను. శీరధ్వజుని తనయలు 
సీతా ఊర్మిళలు రామలక్ష్మణులను, కుశధ్వజుని కుమార్తెలు మాండవి, (శ్రుతకీర్తులు 
భరత, శత్రుఘ్నులను పరిణయమాడిరి. 


వైశాలి: మరుత్తుని సుతుడు నరిష్యంతుడు గొప్ప యజ్ఞము జేసి, మహాదాతయని 
ప్రసిద్ధాక్కెను, అతని సుతుడు దముడు గొప్ప యోధుడు: స్వయంవరమున తన్నెదిరించిన 
శత్రురాజులను నిర్జించి దశార్లదేశ రాకుమార్తెను పరిణయమాడెను. కొన్ని తరములకు 
పిదప తృణబిందువు సింహాసన మెక్కెను. ఇప్పటికి త్రేతాయుగమున మూడవ పాదము 
జరుగుచుండెనని పురాణములు చెప్పుచున్నవి. తృణ బిందు ఆనంబుషను పెండ్లాడి 
విశాలుడను తనయుని, ఇలవిలాయను కూతురిని పొందెను. ఇలవిలను పులస్తునికిచ్చి 
పరిణయము జేయగా వారికి ఐలవిల విశ్రవసుడు కలిగెను. విశాలుడు విశాలా 
పట్టణమును నిర్మించి రాజధానిగా జేసికొనగా 'ఆ రాజ్యమునకు వైశాలి అనుపే రు 
యేర్చడెను. ఈ వంశమున గాన్పించు చివరి నామము సుమతి (లేక ప్రమతి). 
ఇతడు దశరథుని సమకాలీనుడట. 


232 1 ఆం(ధ్ర' మహాభాగవతోవన్యానములు 


2. చంద్రవంశము: 


పౌరవులు: పౌరవయోధుడైన దుష్యంతుడు సగరుని కీరెండు మూడు తరములకు 
ఇటీవలివాడు. తుర్వసురాజునకు పుత్రులు లేనందున దుష్యంతుని దత్తపుత్రునిగా 
స్వీకరించినందున ఈ రెండు వంశములేకమాయెను. ఇక్ష్వాకు వంశము సగరుని 
యనంతరము క్షీణదశ చెందగా దుష్యంతుడు తన పిత్రీయ రాజ్యమును 
సంపాదించుకొని వంశకరుడని ప్రఖ్యాతి గాంచెను. ఇతడు కశ్యప కుటుంబమునకు 
చెందిన కణ్వుని ' ఆశ్రమమున పెరిగిన విశ్వామిత్రుని తనయను శకుంతలను 
పరిణయమాడి భరతుడను కుమారరత్నమును గాంచెనని పైన జూచితిమి. 


దమన, సర్వదమన బిరుదాంచితుడైన భరతుడు గంగా. యమునా 
నదీతీరములందు ఎన్నియో యజ్ఞములను గావించెను. దీర్హతము డీయజ్ఞములం 
దీతనికి పురోహితుడాయెను. ఇతడు సరస్వతీ నది యొడ్డున గూడ యజ్ఞములను 
జేసెననియు, సానాప్రాంతములను జయించి న(మ్రాట్‌ బిరుదమును 
సంపాదించెననియు పురాణముల నుండి తెలియుచున్నది. ఇతని రాజ్యము సరస్వతి 
నుండి గంగ వరకును వ్యాపించి యుండెను. ఇతని తరువాత పౌరవ వంశమునకు 
భరత వంశమని పేరువచ్చెను. బహుశః ఇతని కాలమునందే రాజధాని (ప్రతిష్టానము 
నుండి మారి హస్తినాపురమునకు వచ్చెను. హస్తినాపురమను పేరు బహుశః ఇతని 
తరువాతి రాజులలో నొకడగు హస్తినిబట్టి ఏర్పడియుండును. = 


భరతుని కుమారులదరును అప్రయోజకులైనందున అతడే వారి నందరిని 
జంపి మరుత్తులను ప్రార్థించి బృహస్పతి కొమరుడైన భరద్వాజుని తనయునిగా 
పెంచుకొనెను. కాని ఇతని పిదప సింవాసనమెక్కినది ఇతన మనుమడు(భరద్వాజుని 
తనయుడు) వితథుడనువాడు. 


భరతునికి తరువాత ఐదవతరమువాడైన హస్స్తికి అజమీఢుడనియు, 
ద్విమీఢుడనియు ఇరువు కుమారులుండిరి. వీరిరువురును కడుసమర్జులై ఎన్నియో 
కొత్త రాజ్యములను జయించి పౌరవరాజ్యమును విస్తరింపజేసిరి. అజమీఢుడు 
హస్పినాపురమునందు పొలించినందున అతని తనయులు ఆ ముగ్గురును (బుక్ష్మ 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 233 


నీల, బృవాదశ్వులనువారు) ఈ రాజ్యమును పంచుకొనిరి. బుక్షుడు 
హస్తినాపురమునందు పౌరవ వంశమును నిలబెట్టెను. నీలబ్బహదశ్వులు ఉత్తర 
దక్షిణ పాంచాల రాజ్య స్థాపకులైరి. ద్విమీఢుడు తన పేరట ఒక వంశమును 
స్థాపించెను. అది కొంతకాలము వరకు నేటి బెరీలీ జిల్లా ప్రాంతమునందు వెలసిల్లను. 


అజమీఢునికి తరువాత ఆరవతరమువాడు భృమ్యశ్యుడు. ఇతనికి అసమర్ధులైన 
తనయులేవు రుండిరి. అపవాస్యమునక్రై వీరికి ఒసగిన (పంచ అలం అనెడి) సూటిమాట 
పంచాల నామమునకు ఆధారమాయెను. పంచాల భరతవంశమునం దొక 
శాఖయేయని దీనిని బట్టి తెలియుచున్నది. (బహుశః ఐదు వంశములు కలిసిపోయి 
ఇట్టి సంయుక్త స్మారకమగు పేరునకు దారి తీసినేమో?) ఈ ఏవురిలో జ్యేష్ణుడైన 
ముద్గలుడు ఒక ప్రధాన శాఖకు మూలపురుషుడాయెను. ఇతని పౌత్రుడు ఈ రాజ్యమును 
విస్తరింపజేసెను. ఆతని తనయుడు దివోదసుడు ఇంకను ఈ రాజ్యవైశాల్యమును 
వృద్ధిజేసెను. కొందరు చారిత్రకులు ఇతడును ఇతని వంశీయుడైన సోమదత్త 
సుదాసుడును వైదిక వాజ్మయమునందు దశరాజయుద్ధమునందు ప్రస్తావింపబడిన 
మహాపురుషులేయని విశ్వసించుచున్నారు. ఇది బహుశ అసమంజసమని తోచుచున్నది. 


యాదవులు: ప్రధానయాదవ వంశము విదర్భయందు క్రథ- భీముని 
పాలనమునం దుండగా ఇతని తమ్ముడు కైశికుడు చేదివంశమును స్టాపించెను. 
విదర్భరాజులలో సుప్రసిద్ధుడు నిషధరాజగు నలుని చేపట్టిన దమయంతీదేవి తండ్రియైన 
భీమరథుడు. ఇతని తరువాత సుమారు పదితరములకు వచ్చిన మధువు. చీలిపోయిన 
చిన్న చిన్న యాదవ సంస్థానముల నన్నిటిని జేర్చి, యాదవ సామ్రాజ్యమును 
స్థాపించెను. కాని అతని తనయుడు శత్రుఘ్నుడిచే హతమాయెను. కొంతకాలము 
ఈ రాజ్యము శత్రుఘ్బుని తనయుడు సుబాహువు పాలనమునందుండినను మధువుకు 
ఐదవ తరమువాడైన సత్వతుని కుమారుడు భీముడు. మరల పిత్రీయమును 
సంపాదించుకొనెనని పైన జూచితిమి. 


తూర్పు ఆనవులు: ఏడవ తరమువాడైన లోమపాదుని వరకు అంగవంశమును 
గూర్చి మన కేమియును తెలియదు. ఇతడు విలువిద్యయందు కడు నేర్పరియనియు, 


234 ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


దశరథునికి ప్రియమిత్రుడనియు, ఇతడు దశరథుని కుమార్తెను శాంతాదేవిని 
దత్తపుత్రికగ స్వీకరించి, బుష్యశృంగుని కిచ్చి వివాహముజేసి, పుత్రకామేష్టి 
యాగఫలితముగ చతురంగుడను పుత్రునిగాంచెను. లోమపాదుని ప్రపౌత్రుని పేరును ' 
బట్టియే అదివరకును మాలినీ యని వడసిన అంగరాజ్య రాజధోనీనగరమునకు 
చంపాయను పేరు వచ్చెను. 


కాశీ: వారణాసినుండి రాక్షసులను తటిమివైచి రాజధానిని మరల కాశీయందు 
స్థాపించిన అలర్ముడు బుతుధ్వజ (ఇది వత్సుని రెండవ చేరు) మదాలసల పుత్రుడు. 
ఇతడు ఆముష్మిక దృష్టి కలవాడగుటచేత తమ్ముడు తనపై దండెత్తిరాగా 
యుద్ధముచేయుట కిచ్చగింపక రాజ్యమును వదలివైచెను. అలర్భుని పిదప అతని 
సుతుడు సన్నతి రాజ్యమునకు వచ్చెను. 


శి. బ్రాహ్మణ కుటుంబములు: 
ఈ యుగమునందలి భార్గవులలో |ప్రాచేతసుడను అపరనామము గల వాల్మీకి 
సుప్రసిద్ధుడు. 
విశ్వామిత్రులలో శకుంతల తండ్రియు, మిత్రసహ - కల్మాషపాదుని 
పురోహితుడగు వసిష్టునికి సమకాలికుడై పగసాధించిన ధీరుడును - వీరిరువురును 
- ముఖ్యులు. 
లా 
కృష్ణ మహాయుగము 
(రమారమి క్రీ।పూ॥ 1950-1400) 
రాక్షస నిర్మూలనానంతరము శ్రీరామ పట్టాభిషేకమునుండి ఆరంభమైన 
ద్వాపరయుగము, భారతయుద్ధ పరిసమాప్తితో ముగిసినదని పురాణములు 


చెప్పుచున్నవి. ఈ యుగమున పంచాల, పౌరవ, యాదవ వంశములే ప్రధానస్థానము 
నాక్రమించెను. అయోధ్య మొదలైన రాజ్యములు అడుగంటిపోయిను. 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 235 


1. పంచాలులు: 


ఉత్తర పంచాల రాజ్యము సుదాసుని కాలమున విస్తరించి ప్రసిద్ధికెక్కెను. 
సుదాసుడు పౌరవరాజగు సంవరణుని జయించి, ఆతని రాజ్యము నాక్రమించెను. 
కాని ఇతని పుత్రపొత్రులైన సహదేవ సోమకుల రాజుల కాలమున ఈ 
రాజ్యప్రాబల్యము తగ్గిపోయినందున సంవరణుడు తన రాజ్యమును మరల 
సంపాదించుకొనగల్దెను. మరికొంత కాలమునకు ద్విమీఢరాజగు ఉగ్రాయుధుడు 
ఉత్తర పంచాల రాజును (బహుశః పృషతుని పితామహునేమో?) సంహరించి అతని ' 
రాజ్యము నాక్రమించెను. రాజ్యభ్రష్టుడైన పృషతుడు దక్షిణ పంచాల కాంపిల్యయందు 
తలదాచుకొనెను. ఉగ్రాయుధుడు అంతటితో తృప్తినొందక శంతనుని మరణానంతరము 
పౌరవరాజ్యముపై దండెత్తెను. కాని భీష్ముడు ఇతనిని సంహరించి పృషతునికి అతని 
పిత్రీయమైన అహిచ్చత్ర రాజ్యము నిచ్చివేసైను. 

పృషతుని పిదప ఉత్తర పంచాలయందు అతని తనయుడు ద్రుపదుడు సింహాసన 
మెక్కాను. ఇతడు తన సహాధ్యాయుడైన ద్రోణుని అవమానపరచినందున ఆతడు తన 
శిష్ణులైన కురుపాండవ రాకుమారుల సాయముచేత ఇతనిని ఓడించి ఉత్తరపంచాల 
రాజ్యమును గైకొనెను. సోమక, సృంజయులను పంచాల వంశ శాఖలు ద్రుపదుని 
జేరి భారతయుద్ధమున పాల్గొనెను. ద్రుపదుడు తపమాచరించి ద్రోణుని 
సంహరింపగల కుమారుని, దృష్టద్యుమ్నుని గాంచెను. పంచాలులు భారతయుద్ధ 
యుగమున ప్రముఖ స్థానమునం దుండిరనుటకు ఎట్టి సంశయమును లేదు. 
పాండవులు పంచాల రాకుమార్తె యగు ద్రౌపదిని పరిణయమాడినందున వీరు 
పాండవుల పక్షమునందుండి వారికి ఎంతయో సహాయము గావించిరి. 


దక్షిణ పంచాల రాజులందరిలో బ్రహ్మదత్తుడు సుప్రసిద్ధుడు. ఇతడు 
బుగ్వేదాధర్వణవేదముల క్రమపాఠమును నిర్ధరించి నిర్ణీతము జేసెనట. ఇతని మంత్రి 
పుంగవుడు కండరీకుడు సామవేదక్రమపాఠమును నిర్ణయము జేసెనట. బ్రహ్మదత్తుని 
ప్రపొత్రుడు జనమేజయ దుర్భుద్ధి క్రూరరాజైనందున ద్విమీఢ రాజగు ఉగ్రాయుధుడు 
ఇతనిని వధించి రాజ్యము నాక్రమింపగా ఈ వంశము అంతమొందిను. 


236 క్ల ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


2. పౌరవులు:ః 


పంచాల సుదాసునిచే వరాజితుడైన పౌరవరాజు, సంవరణుడు, 
సింధుదేశమునకు పారిపోయి వసిష్టుని సాయముచే మరల రాజ్యమును 
సంపాదించుకొనెనని పైన జూచితిమి. ఇతనికి తపతీదేవియందు కురు అను గొప్ప 
యోధుడు జనించెను. కురువు ప్రయాగయందు యజ్ఞము చేసెనట. అనగా మధ్యనున్న = 
దక్షిణ పంచాల రాజ్యమును జయించి ఇతడు ప్రయాగ వరకును తన రాజ్యమును 
విస్తరించెనని యర్థము. కురుదేశము, కురుక్షేత్రము (వ్యవసాయములోనికి తెచ్చిన 
ప్రాంతము) కురుజాంగల (వ్యవసాయములేని ఆటవిక ప్రాంతము), మొదలగు 
నామము లీతనినిబట్టి యేర్చడినవి. ఇతని వంశీయులు కౌరవులైరి. కొన్ని 
సందర్భములందు ఈ దేశవాసులకుగూడ కురు, కౌరవనామములను వ్యవహరించు 
చున్నారు. వ 

కురురాజు పిదప రాజ్యమెక్కిన వారిని గూర్చి స్పష్టముగ తెలియుట లేదు. 
ఇతనికి పరీక్షితు, జహ్ను, సుధన్వు లను ముగ్గురు పుత్రులుండిరనియు, పరీక్షితునికి 
జనమేజయుడను, అతనికి శ్రుతసేన, ఉగ్రసేన, భీమసేనులును కలిగిరని 
తెలియుచున్నది. కాని ఆపిదప వీరికేమాయెనో తెలియరాదు. బహుశః జహ్నువు 
కొమారుడు సురథుడు ప్రధానవంశమునందే రాజ్యమునకు వచ్చియుండుట జూడ 
వీరు స్వాంత్ర్యమును గోల్పోయిరని ఒకానొక గాథ తెల్పుచున్నది. జనమేజయుడు 
గార్ట్యబిషి కుమారునికి హాని యొనరించినందున ఆ ముని ఇతనిని శపించెననియు, 
పిదప ఇంద్రోతదైవాప శౌనకుడు ఇతనికొరకై అశ్వమేథయాగమునుచేసి 
పాపపరిహారము గావించినను కూడ రాజ్యము మాత్రము లభింపదాయెననియు 
ఈ గాథనుండి తెలియుచున్నది. 


కురురాజు యొక్కకనిష్ట పుత్రుడైన సుధన్వుని వంశము రెండు శాఖలై నాలుగవ 
తరమువాడైన వసురాజు కాలమునందు చేదిమగధ రాజవంశములాయెను. ప్రధాన 
వంశమునందు సమర్భులెవ్వరును లేనందున (ప్రతీపుని కాలము వరకును 
కౌరవవంశము అణగియుండెను. ప్రతీపుని మువ్వురు కొమరులలో జ్యేష్టుడు దేవాపి 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు . 237 


కుష్టురోగి, రెండవవాడు బాహ్లికుడు. తనకు రాజ్యమక్కరలేదని వదలివైచిపోగా, 
మూడవపుత్రుడు శంతనునికే రాజ్యమువచ్చెను. శంతనుడు గంగను పరిణయమాడి 
భీష్ముని గాంచెను. ఇతడు దేవవ్రతుడను బిరుదముగలవాడు. తనతండ్రి సత్యవతిని 
పరిణయమాడి ఆమెయందు జనించు పుత్రులకు రాజ్యము నొసగుటకై తాను. 
బ్రహ్మచర్యదీక్ష బూనెను. ఇతడు గొప్ప యోధుడు. రాజనీతి యందునుకూడ దక్షుడు. 
ద్విమీఢ ఉగ్రాయథుడు దండెత్తిరాగా అతనిని హతమార్చి, పృషతునికి అతని 
'పిత్రీయమైన ఉత్తర పంచాల రాజ్యమును సంపాదించిపెట్టెనని పైన జూచితిమి. 


శంతనునికి సత్యవతియందు జనించిన వారిలో పెద్దవాడు, చిత్రాంగదుడు 
గంధ్వరులతో యుద్ధముచేసి చనిపోయెను. రెండవవాడు విచిత్రవీర్యుడు 
,సింహాసనమెక్కెను. ఇతడును పుత్రులులేకనే చిన్న వయస్సునందే మరణించినందున, 
అతని రాణి నియోగపద్ధతి నవలంబించి, వ్యాసమహర్షిచే ధృతరాష్ట్ర పాండురాజులను 
కనెను. ధృతరాష్రుడు గ్రుడ్డివాడైనందున పాండురాజనకు పట్టముగట్టి, భీష్ముడు 
రాజవ్యవహారము లన్నింటిని నడపించుచుందిను. ధృతరాష్ట్రుడు గాంధారిని 
పరిణయమాడి దుర్యోధన, దుశ్శాసనాది పుత్రులను నూరుగురిని గనెను. పాండురాజు 
కుంతి భోజుని కూతురును, కృష్ణుని మేనత్తయు, అయిన పృథా యను మారుపేరుగల 
కుంతీదేవిని, వాహ్లిక రాజైన శల్యుని కూతురగు మాద్రిని పరిణయమాడెను. పిదప 
విజిగీషువై దండయాత్ర సాగించి, దశార్జులను; మిథిల, కాశీ, సుహ్మపుజ్ఞరాజులను 
జయించి కురురాజ్యమును విస్తీర్ణముజేసెను. ఒకమారు వేటయందు పొరబాటున 
పాండురాజు జింకయని భ్రమపడి ఒక బుషి కుమారుని వధించి శాపమునొందెను.. 
వెంటనే పశ్చాత్తాపము జెంది రాజ్యమును వదలి, భార్యాద్వయ సమేతుడై 
హిమాలయములకు వెడలిపోయెను. అప్పుడు కుంతీదేవికి యమ, వాయు, 
ఇంద్రులవలన యుధిష్టిర, భీమార్జునులును, అశ్వినీదేవతలవలన మాద్రికి నకుల 
సహదేవులును కలిగిరి. పాండురాజు ఆ(శ్రమవాసమునందే మరణింపగా మాద్రి 
సహగమన మొనర్చెను. కుంతీదేవి పంచపాండవులతో హస్తినాపురమునకు 
మరలిరాగా, రాజ్యపాలన మొనర్చుచుండిన ధృతరాష్షుడు యుధిష్టిరుని యువరాజుగా 
నియమించెను. 


238 | ఆం(ధ మవాభాగవతోవన్యానములు 


చేది, మగధ రాజ్యములు: సుధన్వుని పిదప నాల్గవ తరము వాడైన వసురాజు 
యాదవులనుండి చేది రాజ్యమును జయించి తన వంశమును స్థాపించెనని పైన 
జూచితిమి. ఇతనికి చైద్యోపరిచార(వైద్యులను జయించినవాడు) సమ్రాట్‌ “చక్రవర్తి” 
అను బిరుదములు గలవు. ఇతడు మగధ, మత్స్య రాజ్యములనుగూడ ఆక్రమించినట్లు 
తోచుచున్నది. ఇతని రాజధాని నగరము శుక్తిమతీ (నేటికేనో) తీరమునందుండిన 
శుక్తిమతి, ఇతని నలుగురు పుత్రులును వేర్వేరు స్వతంత్ర రాజ్యములను స్థాపించిరి. 
జ్యేష్ణుడు బృహద్రథుడు మగధ యందును, కుశుడు కౌశాంబియందును, యదువు 
కరూష ప్రాంతమునందును, ప్రత్యగ్రహుడు చేదియందును రాజ్యములను నెలగొల్పిరి. 
కనీష్టునికి బహుశః చేది రాజ్యమునకు సమీపమున వాయవ్య దిశయందుండిన 
మత్స్యరాజ్యము ప్రాప్తమాయెనేమో? 


బృహద్రథుడు గిరివ్రజపట్టణము రాజధానిగా మగధరాజ్యమునేలి, ఈ 
రాజ్యమునకు ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించెను. ఇతని తరువాత వారిలో నొకడైన 
జరాసంధుడు రాజ్యమును బ్రహ్మాండముగ విస్తరింపజేసి మధురరాజైన యాదవ 
కంసునిగూడ తన సామంతునిగ చేసికొనెను. కంసుడు క్రూరుడై, ప్రజలను 
హింసించుచుండెనని శ్రీకృష్ణుడతనిని వధించి ఉ(గసేనునికి మథురయందు 
పట్టాభిషేకము గావించెను. కంసుడు తన అల్లుడు కాన జరాసంధుడు కుపితుడై 
మథుర భోజులపైనను కృష్ణునిపైనను ఎన్నియోమార్లు దండెత్తి, కొంత విజయము 
సాధించెను. యాదవులు కొంతకాలము జరాసంధుని ఎదిరించగలిగినను ఎన్నటికైనను 
ప్రమాదము తప్పదని గుర్తెరిగి నైరుతివైపు వలసపోయి, పశ్చిమ కోస్తా ప్రాంతమున 
ద్వారకవద్ద కృష్ణుని నాయకత్వమున సుస్థిరులైరి. కొంతకాలమునకు పాండవ భీముడు 
జరాసంధుని వధించెను. తని తనయుడు సహదేవుడు పాండవుల పక్షము జేరెను. 


తి యాదవులు: 


భీమ. సాత్వతుడు పాలించిన విశాల యాదవ రాజ్యమును అతని పుత్రులు 
నలుగురును పంచుకొనిరి. భజమానునివంశమువారి (ప్రస్తావన కానరాదు. 
దేవావృధునికి పర్ణాశనది (నేటి పశ్చిమ మాల్వాయందలి బనాసుతో కొంత సంబంధ 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 239 


ముండినటుల కాన్సించుచున్నది. బహుశః ఇతని వంశమువారే మాత్తిన్‌కావత భోజులని 
ప్రశస్తిగాంచి, నేటి ఆబూపర్వత ప్రాంతమందలి సాల్వదేశమును పాలించిరి. మూడవ 
పుత్రుడు అంధకుడు మధురయందు రాజ్యముజేసెను. ఇతనికి నలుగురు పుత్రులు 
కలిగిరి. కాని వారిలో కుకుర భజమానులు మాత్రము ముఖ్యులు. కుకురుని నుండియే 
కుకురులు జనించిరి. వీరు కంసుని కులమువరకు ముఖ్యులుగ నుండిరి. బజమాన 
వంశీయులు అంధకులని పేరునొంది, మధుర సమీపమున రాజ్యము చేయుచుండిరి. 
ఈ వంశమువాడే హృదీకుని పుత్రుడైన కృతవర్మ. ఇతడు కౌరవుల పక్షమున 
భారతయుద్ధమున పాల్గొని, యుద్ధమున చావని మువ్వురిలో నొకడు. తరువాత 
యితడు ద్వారకకు జని, యాదవుల అంతఃకలహములలో సాత్యకిచే చంపబదెను. 
భీమ సాత్వుతుని నాల్గవపుత్రుడు వృష్టికి నలుగురు తనయులు జనించిరి. వీరిలో 
జ్యేష్ట కనిష్టుల నామధేయము ఒక్కటే- అనమిత్రుడు ఈ నలువురినుండి ఎన్నియో 
వంశశాఖ లారంభమాయెను. జ్యేష్టుడు, అనమిత్రునికి (లేక సుమిత్రుడా?) పిదప 
అతని తనయుడు నిఘ్బుడనియు వానిపిదప అతని తనయులు ప్రసేన సత్రాజితులు 
రాజ్యము చేసిరి. శ్యమంతకోపాఖ్యానము ద్వారా సత్రాజితుని గూర్చియు ఇతని 
తనయ యగు కృష్ణుని ప్రియభార్య, సత్యభామను గూర్చియు ఎరుగని వారుండరు. 
మరికొంతకాలమునకు ఈవంశీయుడైన దేవమీఢుషుడు ఇక్ష్వాకు రాకుమారితెను 
అశ్శకీదేవిని పరిణయమాడి, శూరుడను పుత్రుని గాంచెను. శూరుని రాణి మారీషా. 
యను పేరుగల భోజకుల ప్రసూత. వీరికి వసుదేవాదులగు పదిమంది పుత్రులును, 
పృథా, శ్రుతశ్రవా మున్నగు ఏవురు కుమార్తెలును కలిగిరి. పృథాదేవిని కుంతిభోజుడు 
పెంచుకొనందున ఈమెకు కుంతియని పేరువచ్చెను. (శ్రుతదేవ వృద్ధశర్మ యనెడి 
కరూషరాజును పెండ్లాడెను. శ్రుతశ్రవ చేదిరాజగు దమఘోషుని పరిణయమాడి, 
శిశుపాలుని గాంచెను. వసుదేవుడు కుకురరాజగు దేవకుని (దేవకీ మొదలగు) 
ఏడుగురు పుత్రికలను వివాహమాడెను. ఇతని పుత్రులే బలరామకృష్ణులు. ఇతని 
పుత్రిక సుభద్ర అర్జునుని పెండ్లాడి, అభిమన్యుని గాంచెను ఇతని పుత్రుడే పరీక్షితు. 
ఇతడే భారత యుద్ధానంతరము హస్తినాపుర సింహాసనము నధిష్టించినది. 


వృష్టికి కనిష్ట పుత్రుడైన అనమిక్రునికి మాద్రీదేవియందు శినియు, వానినుండి 
శైన్యులును జనించిరి. సాత్యకి, యుయుధానులు ఈ వంశమునందే జనించిరి. 


240 క ఆం(ధథ మహాభాగవతోవన్యానములు 


కుకురులలో ఆహుకుడనువాడు, కాశీరాజు పుత్రికను పెండ్లాడి, దేవక ఉగ్రసేన 
మొదలగు పుత్రులను గాంచెను. దేవకునికి నలుగురు పుత్రులను, దేవకీ మొదలైన. 
ఏడుగురు పుత్రికలును కలిగిరి. ఉ(గ్రసేనునికి కంసాది నవపుత్రులును, 
పంచపుత్రికలును కలిగిరి. కంసుడు తండ్రిని చెరబట్టి సింహాసన మాక్రమించెను. 
వసుదేవుడతని మంతి. దేవకీపుత్రుడు తన్ను సంహరించునని విని, కంసుడు ఆమె 
పుత్రులను ఏడుమందిని చంపెను. కృష్ణ, బలరాములు గోకుల బృందావనమునందు 
పెరిగి, పెద్దవారైరి. కృష్ణుడు కంసుని జంపి, ఉగ్రసేనుని మరల సింహాసన మెక్కించెనని 
పైన జూచితిమి. 


కృష్ణుని వృత్తాంత మంద రెరింగిన విషయమే. భాగవతమునందు ప్రత్యేకముగా 
కృష్ణలీలలు కొంత అధికముగా వర్ణింపబడి యున్నవి. భారతమునందుకూడ ద్రౌపదీ 
స్వయంవర ఘట్టమునుండియు కృష్ణుని ప్రస్తావన అధికముగా కలదు. ఈ అంశము 
లందరెరింగినవేగాన ఇట వర్ణింప నవసరములేదు. 


యాదవ నాశనమునకు పిదప కృష్ణుడు తన యవసాన మాసన్నమైనదని 
గుర్తెరిగి, ప్రీలను పిల్లలును వచ్చి చూచుకొనమని అర్జునుని కబురుపంపి, వనవాసమున 
కేగెను. అర్జునుడు ద్వారకనుండి వీరందరిని తోడ్కొనిపోయి కృష్ణుని మనుమలలో 
యింకను జీవించియున్న వజ్రుడను వానిని మధుర సింహాసన మెక్కించెను. కృష్ణుడు 
గాఢ తపమున మునిగియుండగా వేటగాడొకడు జింక యని భ్రమపడి అతనిని 
బాణముతో చంపెను. 


వాసుదేవ కృష్ణుని దైవముగా పూజించుట పతంజలి మహాభాష్య కాలమునకు 
పూర్వము అనగా క్రీ॥। పూ॥ రెండవ శతాబ్దమునకు పూర్వమే రూఢిగా నుండెనని 
చెప్పవచ్చును. 
4. తూర్పు ఆనవులు: 


జరాసంధుని సామంతునిగ కర్ణుడు కొంతకాలము అంగరాజ్యమును పాలించు 
చుండెను. ఇతని వృత్తాంత మంద రెరింగినదే. ఇతని కుమారులలో జ్యేష్టుడు 
వృషసేనుడు. ఇతడును తన ఏవురు తమ్ములతో బాటు భారత యుద్ధమున 
మరణించెను. . 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 241 


ర్‌. సూర్యవంశము 

రాముని యనంతరమున అయోధ్య చరిత్రయం దంత ప్రాముఖ్యత 
గడించలేదు. రాముని తనయుడు కుశుడు కుశస్థలి రాజధానిగా దక్షిణ కోసలను 
' పాలించి, వింధ్య ప్రాంతములందు ఆర్య సంస్కృతిని వ్యాపింపజేసెనని తెలియుచున్నది. 
ఇతడు నాగకన్యను పరిణయమాడెనని చెప్పుట వలన ఆర్యేతరులలో ఇతడు నాగరికతను 
ఎక్కువగా వ్యాపింపజేసెనని తెలియును. ఇతని తరువాతి వారలలో జైమినినుండి 
యోగము నేర్చిన హిరణ్యనాభ కౌసల్యయనువాడు ముఖ్యుడు. భారత 
యుద్ధమునకుపూర్వము సూర్యవంశ రాజులలో చివరివాడు బృహద్బలుడు. ఇతడే 
అయోధ్య సేనను ఈ యుద్ధములో నడపి పాండవుల నెదిరించెను. రాజసూయమునకు 
పూర్వము భీము డితనిని జయించి యుండెను గాని కర్ణుడు మరల ఇతనిని 
జయించినందున కౌరవులతో చేరవలసి వచ్చెను. ఇతడు అభిమన్యునిచేత భారత 
యుద్దమున చంపబడెను. 


డా 


భారత యుద్ధము 
(రమారమి క్రీ॥ పూ॥ 1400) 


భారతగాథ యందరెరింగినదే. అందువలన ఇచట వర్ణింప నవసరములేదు. 
కాని యుద్ధమునందు పాల్గొనిన రాజుల వృత్తాంతము నొకింత పరికింపవలయును. 
కౌరవులకు పదునొకండు అక్షౌహిణులును, పాండవులకు ఏడు అక్షౌహిణులును 
మాత్రమే సేన యుండెను. . 


ప్రాచ్య భారతమునుండి మగధ రాజైన జరాసంధుని తనయుడు సహదేవు 
డొకడు తప్ప ఇతరులందరును కౌరవుల పక్షమున నుండిరి. 


మధ్యదేశమున వత్స, కాశి, చేది, కరూష్క దశార్ణ, పంచాల పాలకులు 
పాండవులపక్షమున నుండిరి. కోసలరాజైన బృహద్బలుడు మాత్రము కౌరవులను 
చేరెను. యాదవులు ఒక్క పక్షమును చేరరైరి. కృష్ణుడు యుద్ధము చేయనని కేవలము 


242. ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


సలహాదారుడుగ మాత్రమే పాండవులను చేరెను. బలరాముడు ఎవరివైపునను చేరుటకు 
ఇష్టములేక తాటస్థ్యము వహించెను. వృష్టి యాదవులలో యుయుధానుడును, 
సాత్యకియు పాండవుల పక్షము చేరిరి. మాహిష్మతీనీలుడును, అవంతి యొక్క వింద 
అను విందులును, భోజ అంధక కృష్ణ కృతవర్మలును, విదర్భ నాషాద సాళ్వరాజులు 
కౌరవులను జేరిరి. 


పంజాబు పశ్చీమోత్తర ప్రాంతము నుండి కౌరవులకు బావమరిదియెన సింధు 
సౌవీరరాజు జయద్రధుడును, గాంధార యొక్క శకునియు, త్రిగర్త యొక్క సుశర్మయు, 
కేకయ శిబిరాజులను, రుద్రరాజగు శల్యుడును, వాహ్లీక, క్షుద్రక, మాలవ, (శ్రితాయు 
(అంబష్టుల రాజు), సుదక్షిణులును (కంభోజరాజు) కౌరవసేన యందుండిరి. ఈ 
ప్రాంతమునుండి పాండవ పక్షమును జేరినవాడు కాశ్మీరమునందు నైరుతి 
దిగ్భాగమును పాలించిన అభిసారుడొక్కడే. పాండవుల పక్షమున పంచాలులును, 
మత్స్యులును, చేది, కరూష్క పశ్చిమ మగధ, కాశీ, నైరుతి యాదవులును ఉండగా, 
కౌరవుల పక్షమున ఇంచుమించుగా ప్రాచ్య భారత రాజులందరును, పశ్చిమోత్తర 
(ప్రాంతరాజులును, మధ్యదేశమునందలి కోసల, వత్స, శూరసేన రాజులును, పశ్చిమ ' 
ప్రాంతమునందలి మాహిష్మతీ, అవన్తీ, సాల్వ రాజ్యములును ఉండెను. అనగా 
మధ్యదేశమును, గుజరాతును పాండవుల పక్షమున నుండగా మిగత భాగమంతయు 
కౌరవుల పక్ష మవలంబించెను. పాండవుల సేన మత్స్య రాజధానియైన 
ఉపప్లవ్యమునందు విడిసియుండగా కౌరవసేన హస్తినాపురంనందుండెను. 

భారత యుద్ధమును గూర్చిన చర్చ ఇచట అనవసరము. యుద్ధమునందు 
పంచపాండవులును, సాత్యకియు, ధృతరాష్టుడును తప్ప మిగతవారందరును (కృతవర్మ 
కృపాచార్య, అశ్వత్థామల సంగతి వేరు) మరణించిరి. యుధిష్టిరుడు సింహాసనమెక్కాను; 
అశ్వమేధయాగము చేసెను. మరి కొంతకాలమునకు వృష్టి, యాదవ వంశములు 
నిర్మూలములాయెను. యాదవ స్తీ జనమును పిలుచుకొని వచ్చుచున్న అర్జునుని 
ఆభీరులు ఓడించిరి. 


మరల కొంతకాలమునకు అర్జునుని మనుమడగు పరీక్షితునకు పట్టముగట్టి 
యుధిష్టిరుడు సన్యసించి అడవులకేగెను. 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 243 


పరీక్షితునితో కలియుగము ప్రారంభమాయెనని పురాణములు చెప్పుచున్నవి. 
ఇంతకుపూర్వము జరిగినదంతయు భూతకాలములో చెప్పబడినను, ఇటుపైన 
రాజవృత్తాంతము భవిష్యత్తులో జరుగనున్నట్లుగ పురాణములు చెప్పుచున్నవి. 


29 
భారత యుద్ధానంతర యుగము 
(సుమారు క్రీ॥ పూ॥ 1400 నుండి క్రీ॥ పూ॥ 600 వరకు) 


క్రీ॥ పూ॥ నాలుగవ శతాబ్దమున నందసామ్రాజ్యమునందు కలసిపోవువరకు, 
భారతయుద్ధమునకు పిదప, వెలసిల్లిన రాజ్యముల ప్రస్తావన పురాణములందు 
కానవచ్చుచున్నది. మగధ గాక పౌరవులు, ఐక్ష్వాకులు, పంచాలులు, కాశీ, హైహయ, 
కళింగ, అశ్మక, మైథిల, శూరసేన, వీతిహోత్రులు పేర్కొనబడినను, మగధతో పాటు 
పౌరవ, ఐక్ష్వాకువంశముల వృత్తాంతము మాత్రమే కొంత ఎక్కువగా గాన్పించుచున్నది. 
అసలు పైనుడివిన వంశములన్నియు ఇంచుమించుగా ఉత్తరాపథమున తూర్పు 
ప్రాంతమునందును, మధ్యప్రాంతమునందును, పశ్చిమప్రాంతమునందును కొద్ది 
భాగమునందును మాత్రమే వెలసినవి. మిగత ప్రాంతముల ప్రస్తావన గూడ ఈ 
కాలమున కానరాదు. నేటి ఉత్తర ప్రదేశ, దక్షిణ బిహర్‌ ప్రాంతపు చరిత్ర మాత్రమే 
పురాణములందు ఈ యుగమున కానవచ్చుననుటలో అతిశయోక్తి లేదు. 


1. పౌరవులు 

భారత యుద్ధమునకు పిదవ పాలించిన రాజులలో (ప్రథముడు 
పరీక్షితుడనియు, ఇతడు అర్జునుని పౌత్రుడనియు, ఇతనితో కలి ఆరంభమాయెననియు 
పైన జూచితిమి. వైదిక వాబ్బ్యయమున గానవచ్చు పరీక్షితుడును ఇతడును వేరని 
స్పష్టముగ తెలియుచున్నను చారిత్రకముగ అతని చర్యలును, ఇతని చర్యలును 
కలిసిపోయి సందేహము. లేర్పడుటకు ఎక్కువ అవకాశము వచ్చినది. 


పరీక్షితు రాజ్యము గంగా యమునల మధ్యప్రదేశమని తెలియుచున్నది. 
అనగా నేటి థానేశ్వర్‌, ఢిల్లీ గంగా యమునల మధ్య ప్రదేశము నందలి 


244 Er | ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు 


ఉత్తరభాగమును, కలిశకము ఇతని కాలములో నారంభమయ్యెను. కలిపురుషుడు 
ధర్మదేవతను తనగా, పరీక్షితు అతనినెదిరించి అణచి, తన రాజ్యమునుండి తణిమివైచిన 
వృత్తాంతము పోతన భాగవతమున ప్రథమ స్మంధమున (పద్యములు 378-404) 
వర్ణింపబడియున్నది. 


ఇతడు మృగయావినోదియై అరణ్యమున సంచరించుచు దారి తప్పి, 
తపమొనరించుచున్న ఒక మునిని గాంచి దారి యడుగగా అతడు బదులు 
చెప్పకున్నందున కినిసి, అతనిపై చచ్చినపామును వేసి యవమానపరచెననియు, 
ఇందుకు కోపించి ఆ మునియొక్క పుత్రుడు ఇతనిని శపించెననియు, శాపానుసారముగ 
తక్షకుడను సర్పరాజు ఇతనిని కాటువేసి, చంపెననియు పోతన భాగవతమున 
విపులముగ వర్ణింపబడినది. నాగులు గాంధారయందు క్రమముగ బలవంతులై 
రనియు, భారతయుద్ధమున బలహీనత నొందిన పౌరములను నాగులకు రాజైన 
తక్షకుడు ఎదిరించి హస్తినాపురముపై దండెత్తి ఓడించి పరీక్షితుని జంపెననియు 
తోచుచున్నది. 


పరీక్షితుని పిదప అతని తనయుడు జనమేజయుడు బాల్యదశయందే 
సింహాసనమెక్కెను. తన తండ్రిని జంపిన నాగులపై యితడు పగబూని తక్షశిల పై 
దండెత్తి ఎందరో నాగులను వధించెను. ఆస్తికుడు ఈ సందర్భమున ఇతనిని 
నివారింపనియెడల నాగులను నిర్మూలనము జేసియేయుండును. తక్షకుడు మాత్రము 
ఎట్లో తప్పించుకొనెను. దీనినే సర్పసత్రమని పురాణాదులందు, వర్ణించియున్నారు. 
జనమేజయుడు బలవంతుడనియు, కురురాజ్యమును మరల వృద్ధినొందించెననియు, 
తక్షశిలా ప్రాంతమును దానికిని తన రాజ్యమునకును మధ్యనున్న మద్రదేశమును 
(పంజాబుమధ్య) జయించెననియు దీనినిబట్టి తెలియుచున్నది. తక్షశిలను జయించిన 
పిదప ఇతడు కొంతకాలము తక్షశిలనే రాజధానిగా చేసికొనియుండెననియు కూడ 
తోచుచున్నది. కావుననే జనమేజయునకు వైశంపాయనుడు మహాభారత కథను ఈ 
తక్షశిలయందే వినిపించెను. కేకయరాజగు అశ్వపతి పరీక్షిత్తు, జనమేజయులకు 
సమకాలీనుడు. జనమేజయుడు గాంధారదేశమును జయించినపుడు గాంధారకు 
తూర్పున నున్న ప్రాంతము నేలుచుండిన అశ్వపతి జనమేజయుని తన సార్వభౌమునిగా 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు .245 


అంగీకరించెను. ఇతడు తత్త్వ విశారదుడనియు, ప్రజాపాలనమున సాటిలేనివాడనియు 
ప్రతీతి. అశ్వపతి కేకయ రాజులందరికినిగల వంశనాశమైనందున జనమేజయుని 
కాలమునాటి రాజే వీరందరిలో మిన్నయని ఊహింపవచ్చును. 


జనమేజయుని తమ్ముడు కక్ష సేనుడనువాడు స్వతంత్ర రాజ్యము స్థాపించి 
యింద్రప్రస్థము రాజధానిగా పరిపాలించెనని తోచుచున్నది. ఇతని తనయుడు 
అభిప్రతారిణుడు ఖాండవమున దృతి అధ్వర్యమున యజ్ఞమొనరించెనని పంచవింశ 
బ్రాహ్మణమునుండి తెలియుచున్నది. బంధుకోటిలో అభిప్రతారిణులే సర్వోత్తములటి. 
హస్తినాపుర వంశము క్షీణించి, జనమేజయ సంతతివారు హస్తినాపురము వదలి, 
కౌశాంబికి వలసపోయిన పిదపకూడ యింద్రప్రస్థమున ఈ అభీప్రతారిణ వంశము 
రాజ్యమేలుచుం డెననుట స్పష్టము. 


జనమేజయునికి పిదప అతని తనయుడు శతానీకుడును, యితని పిదప 
అతనికిని విదేహ రాజపుత్రియందు జనించిన అశ్వమేధత్తుడును, అటు పిమ్మట 
పౌత్రుడు అధిసీమకృష్ణుడును రాజ్యమే చేసిరి. శతానీకుడు విదేహరాజగు ఉగ్రసేన 
జనకునికిని అశ్వమేధదత్తుడు పంచాలరాజగు ప్రవాహణ జైవాలికిని సమకాలికులని 
తెలియుచున్నది. అధిసీమ కృష్ణుని కాలమున మగధయందు సేనాజిత్తుడును, 
అయోధ్యయందు దివాకరుడును పాలించుచుండగా గోమతి నదియొడ్డున 
నైమిశారణ్యమున ద్వాదశ వర్షములొక మహాయాగము జరిగెను. పురాణములన్నియు 
ప్రప్రధమమున పారాయణము చేయుట ఈ యాగమునందే. ఈ_యాగమున 
ఆధ్వర్యవము వహించినవారిలో శౌనకుడు [ప్రథముడు కాబట్టి మహాభారతమును, 
పురాణములును ఇతనిని సంబోధించి చెప్పిరట. పురాణముల నన్నిటిని సేకరించి 
పరిష్కరించుటకు యిదియే ప్రథమ ప్రయత్నము గాబోలు. పురాణములోని 
రాజవంశావళిలో అధిసీమ కృష్ణుని యనంతరము పాలించిన రాజులపేర్లును, 
రాజవంశముల పేర్లును భవిష్యత్మాలమునందు చెప్పబడుటకు కారణము బహుశః 
అప్పటికవి లేకపోయి తరువాత కాలమున చేర్చబడియుండుటయే అని తోచును. 


అధిసీమ కృష్ణుని తనయుడు నిచక్షుడు పరిపాలించుచుండగా ఈ కురు 


246 ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


రాజ్యమునకు దారుణవిపత్తు సంభవించెను. గంగ ఉప్పొంగి పట్టణమును నాశనము 
చేసెను. మిడుతలదండు (వడగండ్ల వర్షమని మరియొక వృత్తాంతము) రాజ్యమునందలి 
పైరుపంటలను సంపూర్ణముగ నాశనము చేసెనని ఛాందోగ్యోపనిషత్‌ నుండి 
తెలియుచున్నది. ఇట్టి ఈతి బాధలకు తాళజాలక కురుప్రజలు దేశమును వదలి, 
బయలుదేరి సుమారు 800 మైళ్ళు ప్రయాణముచేసి, అలహాబాదు సమీపమున 
యమున ఒడ్డున ఉన్న వత్సభూమిలోని కౌశాంబికి వలసపోయిరి. పంజాబు 
ప్రాంతమునుండి: ఒత్తిడి చేయుచుండిన శత్రువులు కూడ కొంతవరకు ఈ వలస 
పోవుటకు కారణమైయుం డవచ్చును. 


కౌశాంబి చేరిన పిదప వీరి చరిత్ర స్పష్టముగ తెలియుటలేదు. నిచక్షుని 
పిదప 23 మంది రాజులు క్షేమకుడనువాని వరకు పరిపాలించిరని పురాణములు 
చెప్పుచున్నవి. వీరిలో శతనాక అపరనామములు గల పరంతపుడును, ఉదయనుడును 
ముఖ్యులు. పరంతపుడు అంగ రాజధాని యగు చంపపై దాడి చేసెనట. ఉదయనుడు 
అవంతి రాజగు ప్రఖ్యాత మహాసేనునికి, మగధ రాజగు అజాతశత్రువునకును 
సమకాలికుడు. 


2. కోసల 


భరత యుద్ధమునందు మరణించిన బృహద్బలుని పిదప(3) ఇక్ష్వాకు 
వంశరాజులు పరిపాలన చేసిరి. వీరిలో ఆరవవాడగు దివాకరుడు అధిసీమ కృష్ణుని 
సమకాలికుడని పైన చూచితిమి. కాని పురాణములందున్న వృత్తాంతమును జైన 
'గంథములందలి వృత్తాంతముతో పోల్చి చూచినచో ఈనాటి చరిత్రయందు చాలా 
తారుమారు జరిగిదనియు సత్యచరిత్రమనియు, దుష్మరమనియు తోచుచున్నది. 


అయోధ్యగాక సాకేతయు, శ్రావస్తియు కూడ రాజధానీ నగరములుగనుండెనని 
తోచుచున్నది. సాకేత అయోధ్యలను ఒక్కొక్కపరి పర్యాయపదములుగ వాడినందున 
బహుశః ఇవి నేటి సికిందరాబాదు, హైదరాబాదువలె సమీపముననున్న పట్టణములని 
తోచుచున్నది. అయోధ్య సరయూనది సమీపమున నున్నదని అందరెరింగిన అంశమే. 
ఇది నేటి సాహెబ్‌ మాహెట్‌ అను గ్రామము. ఇది గొండా, బ(హైబ్‌ పొలమేరలలో 
రాప్తేనది ఒడ్డున ఉత్తరప్రదేశ్‌లో నున్నది. 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 247 


కోసల కాశీరాజ్యములకు తరచు యుద్ధము సంభవించుచుండెననియు, చివరకు 
కాశీ కోసలరాజ్యమునందు కలిసిపోయెననియు బౌద్ధ వృత్తాంతములనుండి 
తెలియుచున్నది. 


8 మగధ 

భారత యుద్ధమున బార్హద్రధ వంశజుడైన సహదేవుడు (జరాసంధుని 
తనయుడు) పాండవుల పక్షమున నుండెనని పైనజూచితిమి. ఇతని తనయుడు 
సోమాధి అధిసీమకృష్ణ, దివాకరుల సమకాలీనుడు. ఈ వంశమునందు చివరివాడు 
23వ తరమునకు జెందిన రిపుంజయుడు. ఇతనిని చంపి ఈతని మంత్రి పుఃక (సుః 
క, ముఃక, పునిక, పులక అని కూడ యితనిపేరు కాన్సించుచున్నది. ) అనువాడు 
యితని కుమారుని సింహాసన మెక్కించెననియు, ఈ ప్రద్యోతుడు ప్రద్యోతవంశము 
స్థాపించెననియు కలదు. ప్రద్యోత వంశము నందు 5 తరముల రాజులు 138 
సంవత్సరములు పాలించిరనియు, పిదప శిశునాగుడు తన తనయుని కాశీరాజుగాచేసి 
తాను గిరివ్రజమును (యిదియే రాజగృహ, నేటి రాజగీర్‌) రాజధానిగ చేసికొని 
పాలించెననియు, ఈ వంశమువారే బింబిసార, అజాతశత్రులనియు పురాణములు 
తెల్పుచున్నవి: 

కాని పురాణముల వృత్తాంతమునకును, బౌద్ధ జైన గంథములందలి 
వృత్తాంతములకును చాలవ్యత్యాసము కాన్పించుచున్నది. ప్రద్యోత వంశము అవంతి 
రాజ్యమును పాలించెనని మత్స్యపురాణముకూడ ఒప్పుకొనుచున్నది. శిశునాగుడు 
బింబిసారునికి పూర్వపువాడా? లేక తరువాతివాడా? అనుటయుకూడ చర్చనీయాం | 
శమే. భావిపరిశోధన వలన గాని సత్యచరిత్ర నిర్దారణ కాజాలదు. 


4. ఇతర రాజ్యములు 
భారత యుద్దానంతరము పైమూడు రాజ్యములుగాక ఇతర రాజ్యములేవియు 
ప్రాముఖ్యత కాంచలేదు. కాబట్టి వీరిని గూర్చి ఎక్కువ చారిత్రాకంశములు కానరావు. 
పంచాలరాజ్యమున భారత యుద్ధమునకు పిదప మహాపద్మనందుని 
రాజ్యకాలము వరకును 27 మంది రాజ్యము చేసిరనియు, ఈ రాజ్యమున పరిచక్రా, 
కాంపిల్య (లేక కాంపీల), అహిచ్చత్ర అను మూడు పట్టణము లుండెననియు, 


248 ఆంధ్ర మవోభాగవతోవన్వానములు 


ద్రుపద మహారాజు కాలమున ఈ రాజ్యము రెండు భాగము లాయెననియు, 
చేదిరాజకన్య ఉత్తరపాంచాల రాణియగుటచేత చాలమంది చేదినుండి అచ్చటికి 
వలసపోయిరనియు, దుర్ముఖ(ద్విముఖ) అను రాజు బౌద్దమునందు కొంత 
(ప్రాముఖ్యము వహించెననియు తెలియుచున్నది. 

| 


శూరసేన రాజ్యమునకు యమునానది ఒడ్డునవున్న మధురానగరము రాజధాని. 
భారతయుద్ధమునకు పూర్వము ఈ రాజ్యము యాదవ వంశీయుల పాలనలోనుండెనని 
పైన జూచితిమి. యుద్ధానంతరము నందయుగము వరకును 23 మంది రాజులు 
పాలించిరట. 


శూరసేన రాజ్యమునకు దక్షిణమున అవంతి రాజ్యముందెను. అవంతి యనగా 
మాల్వ మధ్యభాగమును, నిమాల్‌ ప్రాంతమును. దీని రాజధానిపేరు అవన్తీ లేక 
ఉజ్జయినీ. ఇది నేడు చంబల్‌నదికి ఉపనదియగు సిప్రానది యొడ్డున గాన్పించు 
నేటి ఉజ్జయినీ నగరమే. భారత యుద్ధమునకు పిదప ప్రద్యోతవంశము వరకును 
ఉజ్జయినీ చరిత్ర స్పష్టముగ తెలియరాదు. సుమారు 28 మంది రాజులు పాలించిరని 
కొన్ని పురాణములందును, 24 మందియని మరికొన్ని పురాణములందును వీరు 
హైహయ వంశీయులని కొందరును, వీతిహో్యతులని మరికొందరును 
వాదించుచున్నారు. : 


విదేహరాజ్యము విజ్ఞానమునకును, సంస్కృతికిని ఒక ముఖ్య కేంద్రమని 
కొందరు తలంచుచున్నారు. జనకరాజులవంశము కృతి అనువానితో అంతమొందెను. 
ఇతనికి కృతక్షణుడని మరియొక నామము. ఇతడే భారత యుద్ధమునాటివాడు. 
ఇతని తండ్రిపేరు బహుళాళ్ళుడు. కృతి అనువాడే కరాళుడనియు, యితడు 
(బ్రాహ్మణకన్యను చెజిచినందున సకుటుంబముగ నాశనము చెందెననియు 
అర్థశాస్త్రమునందు కలదు. 


తత్త్వవేత్తయై, యాజ్ఞవల్ము్యునినుండి బ్రహ్మజ్ఞానమును సంపాదించిన 
జనకుడెప్పటివాడో తెలియరాదు. జనమేజయుని కాలమున పాలించుచుండిన జనకుని 
ఆస్థానమునుండి అతని ఆస్థానవిద్వాంసుడైన శ్వేతకేతు (ఉద్దాలకుని తనయుడు) 
జనమేజయుని యాగమున పాల్గొనెనని తెలియుచున్నది. బుద్దుని కాలములో 


భాగవత రాజవంశములు-భువనకోశము-ఇతర శాస్త్రములు 249 


లిచ్చవీలతో పాటు విదేహవజ్జి రాజసమూహమున నుండెనని బౌద్ధగ్రంథములనుండి 
తెలియుచున్నది. 


కాశీరాజ్యమును గురించి అచట 28 మంది రాజులు పాలించిరనుట తప్ప 
మరేమియు తెలియదు. 

అంగరాజ్యమును గూర్చియు ఏమంత ఎక్కువగ తెలియరాదు. కళింగ 
రాజ్యమును 32 మంది రాజులును, అశ్మక రాజ్యమును 25 గురు రాజులును 
పాలించిరని తెలియుచున్నది. కాని వీరినిగూర్చి ఎట్టి అంశములును తెలియుటలేదు. 


SIs) 


బౌద్ధ యుగము 
(సుమారు కీ పూ॥ 600 - కీవె॥ 200 వరకు) 


పోతన భాగవతమున ద్వాదశ స్మంధమునందు శుకయోగి పరీక్షిత్తునకు 
భావికాలగతుల చెప్పు సందర్భమున రాజుల క్రమము నెరింగించి యున్నాడు. 
ఇందు కేవలము రాజుల పేర్లపట్టిక మాత్రమేయున్నది. కాని ఎట్టివివరముములను 
కానరావు. ఈ పేర్లయందునుకూడ సంస్కృత భాగవతమునకును పోతన 
భాగవతమునకును చాలా భేదములు కాన్పించుచున్నవి. ఇక చారిత్రకరీత్యా 
పరిశీలించిన యడల భాగవత పురాణమునకును యితర పురాణములకును ఉన్న 
భేదములు మాత్రమేగాక బౌద్ధ జైన గ్రంథములందు కాన్పించు వృత్తాంతమునకును, 
ఇతర చారిత్రకాధారములకును, పురాణ వృత్తాంతమునకును కాన్సించు 
వ్యత్యాసమంతయు పరిశీలించి దీర్షపరిశోధన కావించినగాని సత్యచరిత్ర గానరాదు. 
అయినను రాజుల ప్రకారము పోతన యొసగినట్లుగ ఈ క్రింది పట్టికయందు 
కాననగును. 


5. శివనాగులు: 10 రాజులు మొత్తము 360 సంవత్సరము లేలిరి. 1. 
శిశునాగుడు 2. కాకవర్గుడు 3. క్షేమవర్శుడు 4. క్షేత్రజ్ఞుడు 5. విధిసారుడు 6. 
అజాతశత్రువు 7. దర్భకుడు 6. అజయుడు 9. నందివర్థనుడు 10. మహానంది. 


250 | ఆం[ధ మహాభాగవతోవన్యానములు 


. “అంతట మహానందికి శూద్రస్రీ గర్భంబున నతి బలశాలియయిన మహా 
'పద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోగల 
దాసమయంబున నరపతులు శూద్రప్రాయులై, ధర్మరహితులై తిరుగుచుండ 
మహాపద్మునకు సుమాల్యుండాది గాగల యెనమండ్రు కుమారు లుదయించెదరు. 
వారు నూరు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతట గార్ముకుండు మొదలుగా . 
రాజనవకంబునం దాఖ్యలం జనియించు; నానవనందుల నొక భూసురోత్తముండు 
న్మూలనము సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీజగతీ తలంబు 
నేలుదరు; రత్తరి నా భూదేవుడు చంద్రగుప్తం డనువానిం దనరాజ్యమందు నభిషిక్తుంగా 
జేయంగలండు.” 
“మౌర్యులతో చేరిన యీపదుగురును” 137 సంవత్సరములు రాజ్యమేలిరి. 
1. చంద్రగుప్తుడు 2. వారనాథుడు 8. అశోకవర్ధనుడు 4. సుయశస్సు 5. సంయుతుడు 
6. శాలిశూకుండు 7. సోమశర్మ 8. శతధ్వనుండు 9. బృహ(ద్రథుండు(తొమ్మిది 
పేర్లు కలవు) 
బృహద్రథుని సేనాపతియగు శుంగుండతనిని వధించి రాజ్యము గైకొనును. 


శుంగులు: 10 మంది రాజులు 112 సంవత్సరములు రాజ్యమేలిరి. 1. 
శుంగుడు 2. అగ్నిమిత్రుడు ౩. సుజ్యేష్టుడు 4. వసుమిత్రుడు 5. భద్రకుండు 6. 
పుళిందుడు 7. ఘోషుడు 8. వ[జమి(త్రుడు 9. భాగవతుడు 10. దేభూతి. 


దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుం డనువాడు వధియించి రాజ్యంబేలు. 


కణ్వులు: వసుదేవునకు భూమిత్రుండు, వానికి నారాయణుండు కలిగిరి. 
“కణ్వవంశజులైన వీరలు మున్నూట నలువదేనబ్దంబులు మేదినీతలం బేలుదురు.” 
(345 సంవత్సరములకాలము . పాలించిన కణ్వులలో మూడు నాలుగు పేర్లే 
చెప్పబడినవి.) 


పిదప ఆంధ్రుల ప్రస్తావన ఈ క్రిందివిధముగ గలదు. “మతియు కణ్వవంశ 
జుండగు సుశర్ముండను రాజుదయించిన, వాని హింసించి, తద్భృత్యుం డాంధ్ర 
జాతీయుండయిన వృషలుం డధర్మమార్గవర్తియె వసుమతీ చక్రం బవక్రుండై యేలు.” 
పిమ్మట 27గురు ఆంధ్రవంశరాజుల పేర్లును పేర్లకు పిదప “యిట్లు పెక్కండ్రుదయించి 


భాగవత రాజవంశములు-భువనకోశము -ఇతర శాస్త్రములు 251 


నన్నూట యేబదియాజు హాయనంబులు “ధాతింబరి బాలించెదొరని కలదు. 

ఆం(ధ్రవంశరాజుల గూర్చి కొంత విపులముగా క్రింద చర్చింపబడియున్నది. కాని 

ప్రకృతము ఆ తరువాత వంశములను గూర్చిన ప్రస్తావన తిలకింతము. ఈ వంశముల 

"పేరును, ఒక్కొక్క వంశము నందలి రాజులు పాలించిన మొత్తము సంవత్సరముల 

సంఖ్యయే యివ్వబడినది గాన ఒక్కొక్క వంశములోని వివిధ రాజుల పేర్లుగాని వారి 

కాలపరిమితిగాని య్వివబడలేదు. ఒక్కొక్క రాజవంశమునందలి రాజుల సంఖ్య ఈ 

(క్రింద పట్టికయందు చూడనగును. 

(1) ఆభీరులు 7 (2) గర్దభులు 10 (3) గంకవంశజులు 16 (4) యవనులు 

8 (5) బర్బరులు 1 (6) గురుండులు 18 (7) మేనులు 11; మొత్తము వీరందరును 

గలిపి 909 సంవత్సరములు “గర్వాంధులై” యేలిరట. ఈ మొత్తము కూడిక తప్పో, 

అచ్చుతప్పో, తెలియరాదు. 
మరల కొన్ని వంశముల పట్టిక గలదు. 

1. మేనవంశజులు(వీరును పై మేనులును ఒక్కరే గారేమో?) 
11 మంది రాజులు 300 సంవత్సరములు రాజ్యమేలిరి. 

2. _ కైలికులను యవనులు రాజులై ఏలిరి. పిదప, 

3. భూతనందుడు, నవభంగిరుడు, శిశునందుడు, అతని తమ్ముడు యశోనందుడు, 
ప్రవీరకుడు మొత్తము 106 సంవత్సరము లేలిరి. 

4. పై రాజులకు 13గ్గురు కుమారులుదయించి, అందు 6 మంది బాహ్లిక 
దేశాధిపతులైరి. 

5. కడమ 7 గురు కోసలాధిపతులైరి. 

6. _ వైఢూర్యపతులు నిషధాధిపతులైరి. 

7. అప్పుడు పురంజయుడు మగధదేశాధిపతియై పుళింద, యదు, మద్ర 
దేశవాసులగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై, హరిభక్తి విరహితులై 
యుండ, వారికి ధర్మోపదేశముసేసి, చాల పరాక్రమవంతులైన క్షత్రియ 
వంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై ఆ గంగా ప్రయాగ 
పర్యంతము పరిపాలించెను. 


252 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


8. _శూద్రప్రాయులగు రాజులును, వ్రాత్యులును, బాషండులు నగు విప్రులును 
గలిగి, సౌరాష్ట్రావంత్యాభీరార్చుద మాళవదేశాధిపతులయ్యెదరు. 


9. సింధు తీరంబుల, జంద్రభాగా ప్రాంతంబుల గాశ్మీర మండలంబునను 
మేధావిహీనులై మ్లేచ్చాకారులగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్య 
దయాహీనులై సంగ్రామ రంగంబుల హఆతులయ్యెరు. 


ఇంతటితో పోతనభాగవంతబున రాజవంశావళి ముగిసెను. సంస్కృత 
భాగవతమున చెప్పిన వంశముల నెన్నిటినో పోతన వదలివైచెను. మిథిలాపట్టణము 
నేలిన రాజులు, క్రీ॥వె।। మూడవ నాలుగవ శతాబ్బులందు పరిపాలన మొనరించిన 
రాజవంశములు సంస్కృత భాగవతమునందు వివరింపబడి యున్నను పోతన వాని 
నన్నిటిని సంపూర్ణముగ వదలివైచెను. 


2. ఆంధ్ర వంశ రాజులు: 
ఆంధ్ర వంశ రాజుల పట్టికను, కాలమానమును యిందుజేర్చుట ఏమంత 


అ(ప్రస్తుతము కాజాలదు. 


ఈ పట్టికనుండి ఆంధ్రవంశ రాజుల నామములు పోతన భాగవతమునందును, 
సంస్కృత భాగవతమునందును, ఇతర పురాణములందును ఏరీతిగనున్నవో 
కాంచనగును. చారిత్రకులు రూఢము చేసిన రాజుల నామధేయములును, వారి 
రాజ్యకాలపరిమితియు క్రీస్తుశకమున నిర్భరించి వారి రాజ్యకాలమునుకూడ 
క్రిందిపట్టికయందు ఈయబడినది. కాన వాటిని గూర్చిన చర్చయంతయు యిందు 
విశదీకరింపవలె ననిన యడల ఈ వ్యాసమింకను పెరిగిపోవును. అందువలన 
యింతటితో ముగించెదను. 


ఆంధ్ర రాజవంశమును గూర్చిన విషయములనుగూడ పోతన 
ఎంతమాత్రమును పరిశీలింపక [గ్రంథమును రచించెననుట పైనుండి స్పష్టము. 
చారిత్రక దృష్టి లేకుండుటయే యిందునకు కారణము. 


ఖే 


ee 7 











మను వైవస్వత 
ఇక్ష్వాకు నభగ ధృష్ట శర్యాతి నరిష్యంత ప్రాంశు నాభానేదిష్ట కరూష వృషద్ర ఇలా+బుధ సుద్యుమ్న 
వికుక్షి+శశాద నిమి రథీతర - దార్షక అనర్తయంద " వైశాలివంశము _ కరూషులు పురూరవులు  సౌద్యుమ్నులు 
విశర్యాతులు | 
ఆయు అమావసు 
నహుష క్షతవృద్ధ రంభ రజి అనేన కాన్యకుబ్ద వంశము 
యతి యయాతి కాశీవంశము రాజెయక్ష్మత్రియులు క్షతధర్మన్‌ 
యదు . .తుర్వను ద్రుహ్యు అను. వూరు 


| | =) | ఇట | 
తుర్వసువులు _గాంధారయందలి ద్రుహ్యులు అనవులు పౌరవులు 
సహస్రజిత్‌ క్రోష్టా | 


హైహయులు J యాదవులు ఉశీనర తితిక్షు భరతులు 





వీతిహోత్రులు శార్యాతులు భోజులు అవంతులు తుండికేరులు. వైదర్భులు _ నృగ నవ క్రిమి సువ్రత శివి అంగ వంగ కళింగ పుండ్ర సుహ్మ అజమీఢ ద్విమీఢ 
| | లి m9 వీ 9 9 | | | | | గ్ల | | 
వైదర్భులు చేది క్లే త్రస్రీటస్టి సై... వృషదర్భ. సౌవీర కేకయ ముద్రక. భరతులు ఉత్తరపాంచాల. ' దక్షిణ పాంచాల 
| స్‌ A 
సాత్వతులు వృషదర్భులు సౌవీరులు కేకయులు '' మద్రులు కురు | 
| (కకయులు) (మద్రకులు) (కౌరవులు) 'శృంజయులు సోమకులు 
అంధక-భోజులు మృత్తికావత - వృష్ణులు | | | 


భోజులు కురు వాసవులు 


లా . | | (కౌరవులు) 
కుకురులు (మథుర) అంధకులు | | ——— 


బృహద్రథులు చేది కరూష  కౌశాంబి మత్స్య 
కౌరవులు పొందవులు 


BESTS సారా! 
రాజ్య 


సంఖ్య | మత్య్స పురాణము 


అ 06 ఎర అ m= 


22 


28 
24 
25 


26 
27 
28 
29 
30 








శిశుక 


కృష్ణ 

శ్రీ మల్లకర్ణి 
పూర్ణోత్సంగ 
స్మంధస్తంభి 
శాతకర్ణి 

లంబోదర 

అపీలక 
మేఘస్వామి(సంఘ) 
స్వాతి(స్వామి) 
స్మందస్వాతి 
మృగేంద్ర స్వాతికర్ణ 
కుంతల స్వాతికర్ణ 
స్వాతికర్ణ 
పులోమావి 
రిక్తవర్ణ(వికృష్ణు 
హాల 







మణ్జలక 
పురీంద్రసేన 

సుందర శాన్తికర్ణ 
చకోర స్వాతికర్ణ 





శివస్వాతి 


గౌతమీ పుత్ర 
పులొమా 
శివశ్రీ 











శివస్మంధ శాతకర్ణి 

యజ్ఞశ్రీ శాతకర్ణికా 
Ea లు 

విజయం 

చండ శాతకర్ణి 

పులొమా 















కాల 
పరిమితి 











































































వృషలుడు 
కృష్ణుడు 
శాంతకర్ణుడు 
పౌర్ణమాసుడు 
లంబోదరుండు 
చిబిలకుడు 
మేఘస్వాతి 
మహేంద్ర శాతకర్ణి 
కుంతల శాతకర్ణి 
స్వాతిషేరణ 
షటుమావి అటమాన |దండమానుడు 
నేమికృష్ణ అరిష్టకర్మన్‌ - 
హాల హాలెయ హాలేయుండగు 
. అరిష్టకర్ముడు 
(పుత్తలక) భావక తలక' -' | తిలకుడు 
వురికషేన ప్రవిల్ల సేన పురీషభీరు | పురీషసేతుడు 
శాతకర్ణి సున్దర శాతకర్ణి సుందరశాతకర్ణి సునందన సునందనుండు 
చకోర శాతకర్ణి చకోర శాతకర్ణి చకోర శాతకర్ణి, చకోర వృకుండు 
; జటావుడు 
శివస్వామి శివస్వామి శివస్వాతి | శివస్వాతి. 
అరిందముడు 
గోమతీపుత్ర | గోమతి' | 
పురీమాన్‌ పురీమంతుడు 
'మేదశిరస్‌ దేవశీర్షుడు- 
శివస్మందుడు 
యజ్ఞశీలుడు 
శివస్మంద శాతకర్ణి శివస్మంద శుతస్మంధుడు 
యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ న్న 'యజ్ఞశత్రుడు 
విజయ విజయ విజయుడు 
దేజ్జ శ్రీశాతకర్ణి దజ్జశ్రీశాతకర్ణి చంద్ర చండ్రబీజుడు 
పులోవాపి పులోమాన్‌ సులోమాధి -| సులోమధి 












సిముక 

కృష్ణ 
శాతకర్ణి(మొదటి) 
పూర్ణోత్సంగ 
స్మంద సంధి 
శాతకర్ణి(రెండవ) 
లంబోదర 
అపీలక 
మేఘస్వామి 
స్వాతి 
స్మందస్వాతి 
మృగేంద్ర 


| కుంతలస్వామి 


స్వాతికర్ణ 


పుళుమావి(మొదటి) 


గౌరకృష్ణ 
హాల 


మండులక 
పురీంద్రసేన 
సుందర స్వాతికర్ణ 
చకోర స్వాతికర్ణ 


శివస్వాతి 


గౌతమీపుత్ర శాతకర్ణి. 


పుళుమావి(రెండవ) 
శివశ్రీ 


శివస్మంద 
యజ్ఞశ్రీ 

విజయ 

చంద్రశ్రీ 
పుళుమావి(3వ) 





చారిత్రకులు * 
నిశ్చయించిన రాజ్య 
కాలపరిమితి 


29 
18 
10 
18 
18 
56 
18 
12 
18 
18 


24 
25 


21 
1/2 
28 


24 
28 


29 















క్రీస్తు శకమున . 


కాల 
నిర్ణయము 







కీ॥పూ॥ 


271-248 
248-230 
230-220 
220-202 
202-184 
184-128 
128-110 
110-98 
98-80 
80-62 
62-55 ' 
55-52 ' 
52-44 
44-43 
43-19 


19-క్రీ॥వె 6 
క్రీ.వె.6-7 


7-12 

12-33 
33-34 
34-34 


34-62 


62-86 
86-114 
114-121 


121-128 
128-157 
157-163 
163-166 
166-174 


అనవులు 
వైశాలి | యాదవులు | హైహయులు | ద్రుహ్యులు | తుర్వసులు తూర్పు వాయవ్యదిశ పౌరః 
వ. య. 
se వినం అం నం లి 
మను 








మను 
నాభానేదిస్ట | ఇలా J ఇలా 
పురూరవ క పురూ 
ఆయు 
నహుష 
భలనందన | యయాతి 
యదు 
క్రోష్టా సహజిత్‌ ద్రుహ్యు | తుర్వసు ల్రీను పురు 
జనమే 
హైహయ 
చిత్రరథ 
మతిని 
మహిష్మంత | గంధార 
భద్రశ్రేణ్య : 
తితిక్షు ఉశీనర 
శివి 
కృతవీర్య కేకయ 
అర్జున 
జయధ్వజ 
తాలజంఘ 
వీతిహోత్ర 
కరంధమ 
అవీక్షిక్‌ చేది 
మరుత్త.. | విదర్భ కరంధమ 
మరుత్త బలి 
క్రథభీమ కైశిక 
చిది | అంగ 


(దుష్యంత) దుష 





కూర్పు 


పాంచాలులు పాంచాలులు 
10 


[న LRT రాల 





భరద్వా 
వితథ 
భీమరథ వీరబాహు 
హస్తి 
| అజామీ 
తృణబిందు 3 ద్విమీఢ 
విశాల 
నీల బృహద్య సు 
భృమ్యశ్వ 
మదు ముద్దల 
దివోదాస 
సత్వంత లోమపాద 
భీమ 
అంధక వృష్టి 
సుదాస 
సంవరః 
కురు 
పరీక్షిత్‌ 
(బ్రహ్మదత్త ప్రతీప 
ఉగ్రాయుధ జనమేజయ శంతను 
ఉగ్రసేన వసుదేవ వృషత విచిత్రవీ 
| కంబ ద్రోణ ద్రుపద ధృతర్యా 
కృష్ణ కర్ణ అశ్వత్థామ భృష్టద్నుమ్య పాండవ 


సాంబ వృషసేన అభిమన 


ఆంధ్ర 
మహాభాగవతోపన్యాసములు 


ఉపాఖ్యానములు-అంతరార్థములు 


మహోపాధ్యాయ సాహిత్యాచార్య సాహిత్య సమ్రాట్‌, కవీంద్ర 
శ్రీ స్వామీ శివశంకర శాస్త్రి-సాహితీ సమితి 


ఉపాఖ్యానములు -అంతరార్థములు (| 255 


(ప్రతి గ్రంథముకూడా ఆఖ్యానమే. ఎదుటివారిని సంబోధించి చెప్పినట్లు 
రచింపక పోయినను, ఆ గ్రంథకర్త అప్రత్యక్షముగా నుండి ఉత్తమాధి కారికి చెప్పుచున్నట్లే 
భావింప నగును ఆఖ్యానములో ప్రధాన వృత్తము సామాన్యముగా సుదీర్షముగా 
నుండదు. గ్రంథ బాహుళ్యమే యభిలషిత మగుచో ఉపాఖ్యానములను సంతరింపక 
తప్పదు. ఆఖ్యానము నడచుచుండగా సందర్బోచితముగా ఉపాఖ్యానము సముద్భూత 
మగును. పురాణము లన్నిట నున్న విధముగనే భాగవతమునగూడ ఉపాఖ్యానములు 
కలవు. ఉపాఖ్యాన శబ్ద వాచ్యము లయిన కథలు భాగవతములో కొన్ని కానవచ్చు 
చున్నవి. ఉపాఖ్యాన ప్రాయములయిన కథలెన్నో యున్నను వానిని పరామర్శించుట 
కవకాశము లేదు. 


భాగవతమును శుకుడు పరీక్షిత్తునకు ఏడు రోజులలో చెప్పినట్లు కానబడు 
చున్నది. బ్రాహ్మణ శాప తప్పుడై పరీక్షిత్తు సప్తమ దివసమున మరణము తప్పదని 
యెరింగినవాడగుటచే భూలోక స్వర్గలోక సౌఖ్యములు హేయములని తలచి, రాజ్యము 
విసర్జించి, నిరశనత్వ దీక్షాచరణము సంకల్పించుకొని- 


కలిదోషావలి నెల్ల బాపెడి వియద్గంగా ప్రవాహంబు లో 
పలికిం బోయి మరిష్యమాణు డనుచుం బ్రాయోపవేశంబునన్‌- 
చిత్తము గోవింద పదా 

యత్తము గావించి మౌని యై తనలో నే 

తత్తణము లేక భూవర 

సత్తముడు వసించె ముక్తసంగత్వమునన్‌. 


విష్ణుపదీ తీరమున ప్రాయోపవేశమున రాజుండుట యాకర్ణించి మహర్షులెందరో 
యచటికి జేరిరి. రాజు వారలను పూజించి తుదకు- 


ఏడు దినంబుల ముక్తిం 
గూడగ నేరీతి వచ్చు గురు సంసార 
క్రీడన మేక్రియ నెడతెగు 


256 : ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


చూడుడు మా తండ్రులార, (శ్రుతి వచనములన్‌. 
సప్తాహంబుల ముక్తి కేగెడు గతిం జర్చించి భాషింపరే! 


అని ప్రార్థించినాడు. 


దైవయోగమున ఆ సమయమునకు శుకయోగి యరుదెంచెను. పరీక్షిత్తు 
(ప్రణిపాతము చేసి, “చెప్పవే తండ్రి, ముక్తికి జేరు తెరువు” అని వేడినాడు. కావున 
పరీక్షిత్తు కోరినది ముక్తియేకాని అన్యము కాదనుట స్పష్టము. 

భాగవతము ముక్తి బోధక గ్రంథము “జ్ఞానాదేవ హి మోక్షః” అనునట్లు, 
హరిభక్తివలన జ్ఞానము కలిగి మోక్షము లభించునని నిరూపించుచున్నది. ఇందు 
నవవిధ భక్తిమార్గములు వర్ణితములు. ఈభక్తి జ్ఞానపరమే. 


ప్రహ్లాదుడు తండ్రితో సంభాషించువట్టున నొకచో- 

తను హృద్భాషల సఖ్యమున్‌ (శవణమున్‌ దాసత్వమున్‌ వందనా 

రృనముల్‌ సేవయు నాత్మలో నెరుకయున్‌ సంకీర్తనల్‌ చింతనం 

బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స 

జ్ఞనుడై యుండుట భద్ర మంచు దలతున్‌- 
అని అధికారి తారతమ్యమునుబట్టి అన్నాడు. ఇదియే భాగవత హృదయమని 
చెప్పవచ్చును. 

ఈ తాత్పర్యమును బోధించుటకై భాగవతములో కొన్ని యుపాఖ్యానములు 
_ నిబద్ధములయినవి. పురాణములు తాత్పర్యార్థ ప్రతిపాదకములగుటచే కథలు, 
ఘటనలు యథాతథము లని భావించినను భావింపకున్నను క్షతి లేదు. 


స్పష్టముగా విషయ నిరూపణము చేయుట యటుండగా, విషయ నిగరణము 
చేయు విధానము గోచరించుచుండును. ఒక యెడనేదో, నీతికాని, ధర్మముకాని, 
తత్త్వముకాని స్ఫురించును. కొన్నియెడల బహువ్రీహి సమాసమువలె అన్యపదార్థము 
ప్రధానముగా ద్యోతిత మగును. కథలలోని ప్రత్యంగమునకు అంతరార్థ 
ముండనక్కరలేదు. బాహ్యార్థ చర్వణానంతరము అంతరార్థ మనుమీయమాన మగును. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 257 


ప 
ధ్రువోపాఖ్యానము 


ఉత్తనపాదు డను మహారాజునకు సునీతి, నురుచి యను భార్యలు కలరు. 
సునీతివలన ధ్రువు డను పుత్రుడు పుట్టెను. రాజునకు సురుచి యెడ ప్రీతియు, 
సునీతియెడ నప్రీతియు నేర్పడెను. ఉత్తానపాదు డొకనాడు సురుచి బిడ్డ డగు ఉత్తముని 
తన తొడపై గూరుచుండ బెట్టుకొని యుపలాలనము చేయుచుండగా (ధ్రువుడు 
దగ్గరకు బోయెను. తండ్రి వాని నాదరింపలేదు. సురుచి సవతి కుమారునితో నిట్లనెను. 
“నీకు తండ్రి తొడపై గూరుచుండు యోగ మున్నచో నా కడుపన బుట్టియుందువు. 
శ్రీహరి పదపద్మము లాశ్రయించినచో నీవు నా గర్భమున జన్మింపగలవు” 
ఈపలుకులకు తండ్రి మిన్నకుండెను. ధ్రువుడు బాధపడి, తల్లికడకు బోయి వృత్తాంతము 
నివేదించెను. ఆమె వగచి బాలునోదార్చి, “సురుచి పలికినట్లు హరి పదపద్మములు 
సేవింపుము. నారాయణు నాశ్రయించి నీ తాత యగు మనువు భౌమ దివ్య మోక్ష 
సుఖముల నొందెను” అని బోధించెను. ధ్రువుడు పురము వెడలి కొంత దూరము 
పోవునప్పటికి నారద మహర్షి యెదురుపడి, (ప్రశ్నించియున్న తెర గెరిగి నారాయణు 
నారాధించు విధానము బోధించి వాసుదేవ మంత్ర ముపదేశించెను. ధ్రువుడు 
మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు చేసి మధువనమునకు జనెను. 


అంతట నారదుడు ఉత్తానపాదునికడకు బోయెను. రాజు మహర్షిని పూజించి 

“నా కుమారుడు ధ్రువుడు, నతని తల్లియు నరణ్యమునకు బోయినారు. ఏమయిరో 

- తెలియదు. నా పొరపాటువలన కుమారునకు కష్టము కలిగినది” అని విచారముతో 

బలికెను. అందులకు నారదుడు “నీ కుమారుని హరి రక్షించును. ఎవ్వరును పొందని 

యున్నత పదమును ధ్రువుడు పొందగలడు. అతడు నిన్ను జూడవచ్చు...”నని యోదార్చి 
చనెను. 


ధ్రువుడు ఘోరతపస్సు చేసెను. దానివలన సమస్త లోకములు కంపించెను. 
లోకపాలకులు హరిసన్నిధి కరిగి విన్నపముచేసిరి. ధ్రువుడు ఘోరతపస్సు 
చేయుచున్నాడనియు, వానిని వారింతుననియు హరి వారల ననునయించి, 


258 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


గరుడవాహనా రూఢుడై ధ్రువుని యెదుట సాక్షాత్మరించెను. అతడు స్తుతి క్రియాకరణ 
సమర్ధుడు కాలేదు. హరి వాని కపోల తలమును తన శంఖముతో స్పృశింపగా 
'నతడు ముక్త కంఠముతో భగవంతుని స్తుతించెను. 


హరి సంతుష్టాంతరంగుడై “బాలకా! గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతిశ్చక్రము, 
నక్షత్ర రూపములైన ధర్మాగ్ని కశ్యప శుక్రులును, సప్తర్నులును తారకా సమేతులై 
దేనిచుట్టు ప్రదక్షిణము తిరుగుచుందురో, దురాపము, అనన్యాధిష్టికము, లోకత్రయ 
ప్రళయకాలమున నశింపక వెలుగుచుండు (ధ్రువక్షితి యను ఆ పదవిని 
ఇరువదియారువేల సంవత్సరముల తరువాత ప్రాప్తింతువు. అంతవరకును రాజ్యము 
చేయుదువు” అని యనుగ్రహించెను. 


అనంతరము (ధ్రువుడు నిజపురమునకు మరలి వచ్చుచుండగా చారుల వలన 
తండ్రి వృత్తాంతము విని, యెదురు పోయి, కొనివచ్చి వానిని రాజ్యాభిషిక్తుని జేసెను. 


అతని సహోదరుడు వేటకై వనమున కేగి, యక్షునిచే నిహతుడయ్యెను. అతని 
తల్లి సురుచి దుఃఖముతో నరణ్యమున కేగి దవానలములో దగ్ధ యయ్యెను. 


హరి సేవానిరతుడై ధ్రువుడు తుదకు ద్రువక్షితిని బ్రాపించెను. 


ఉపమాతృ సేర్యావాగ్వ్యసన కర్షితుడై ధ్రువుడు క్రమముగా ఉత్తమ పదవి 
నొందెను. అభిమానవంతులకు అన్యుల హేళన ఉద్దీపకమై ఉత్తమ ప్రయత్నమునకు 
పరోక్షముగా నుపకరించును. ఉత్తానపాదుడు ఉత్తముడే. కాని ప్రథమ భార్యకన్న 
ద్వితీయభార్య ప్రియతర యయ్యిను. లోకవృత్తమింతే. అందుచే ముద్దుల పెండ్లము 
పెద్దభార్య కొడుకును అవహేళన చేయుచున్నను అతడు మిన్నకుండెను. తన 
యుత్సంగమునకు ధ్రువుని దీసికొన్నచో నామెకు కష్టముగా నుండునని యూహించి 
యూరకున్నాడు. ఆమె వాక్కులు (ధ్రువుని చెవులలో బాణములవలె నాటుకొన్నవి. 
అందు బాధ యున్నను బోధకూడ కలదు. కావుననే యత డిల్లు వెడలినాడు. 


నారద దర్శనములో నానార్థములున్నవి. త్రిలోకసంచారి యగు నతడు ఈ 
విషయము నిట్టె గ్రహించి అనుగ్రహ బుద్ధితో నవతరించినాడు. తపోనివారణము 


ఉపాఖ్యానములు -అంతరార్థములు- | 259 


నిజముగా నవరోధకల్పనకు గాదు; పూనికను దృఢతరము చేయుటకే. విఘ్నాయాన 
సంత్రస్తు లయినవారు అల్బులు. “ధీరుల్‌ విఘ్న నిహన్యమాను లగుచున్‌ 
ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్దార్థము లుజ్జగింపరు”. 

“విష్ణుపదము అత్యున్నతము తీవ్రయోగ సమాధి నిష్టులయిన తపస్వులకుగూడ 
సులభ ప్రాప్యము కాదు. నీ వీ పూనిక విడుచుట మేలు. చిన్నవాడు” అని నారదుడు 
కొంత యధైర్యపరచెను. కాని ధ్రువుడు తీవ్రాభినివేశముతో పట్టు పట్టెను. 
(గహింపకున్నను ఉత్తానపాదుడు తనయునకు భావి సూచకముగా ధ్రువ నామ 
ముంచినాడు. అప్పుడు నారదుడు- 


“ధర్మార్థ కామ మోక్షాఖ్యం య ఇచ్చే జేయ ఆత్మనః 
ఏకం హ్యేవ హరే స్తత్ర కారణం పాద సేవనమ్‌” 


అని చెప్పినాడు. ఇది ఉపదేశము. దీని ననుసరించి బాలుడు బహువిధముల 
ఘోరతపస్సు చేసినాడు; అనన్యమైన నిరూఢ భక్తియుక్తుడగుటచే భగవంతుడు 
సాక్షాత్మరించినాడు. వయో లింగ వర్ణ భేదములతో పని లేనిది భగవానుని 
యనుగ్రహము. ప్రత్యక్షమైన భగవానుని ధ్రువుడిట్లు స్తుతించినాడు: 


యో౭_నస్తః ప్రవిష్య మమ వాచ మిమాం ప్రసుప్తాం 
సంజీవయ త్యఖిల శక్తిధర స్వ్వధామ్నా 

అన్యాం శ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్‌ 

(ప్రాణా న్నమో భగవతే పురుషాయ తుభ్యమ్‌!” 


“ఈ ప్రార్థనలో నారదోపదిష్ట మగు మంత్ర లింగ మున్నది. 


క్రమశః ధ్రువక్షితి లభ్యమగునని నారాయణు డనుగ్రహించినాడు. ఈ (్రువక్షితి 
సమస్త జ్యోతిర్మండలములకును మీద నుండునది. కల్పాంతమున జ్యోతిర్మండలములు 
లయించినను ఈ ధ్రువక్షితి లయింపదు. దీనికే విష్ణుపద మని ప్రసిద్ధి కలదు. విష్ణు 
పాదోద్భృవయైన గంగ ధ్రువ మండలమునుండి జాలువారి, చంద్రాది మండల 
క్రమమున క్రింది లోకములకు రసాతలము వరకును ప్రవహించును. 


260 « ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


ఇంటికి మరలునపుడు (ధ్రువుడు అత్రుప్తుడై తన్ను అసిద్దార్థునిగా భావించు 
కొన్నాడు. “పరమేశ్వర సాక్షాత్మారమైనప్పుడు మోక్షమును వేడక రజోదృష్టితో బాల్య 
చాపల్యమున నిట్టి పదవి కోరితినౌ యని విచారపడినాడు. 

ధ్రువుడు భగవన్నుతి చేయునపుడు మాత్రము అంతరాత్మయె వాగాదులను, 
ఇంద్రియములను (ప్రేరేపించుచుండు సర్వవ్యాప్తి పరబ్రహ్మ, చైతన్యమునే పరిపూర్ణ 
భావమున భావించినాడు. 

ముముక్షు వగుటకు గాని, జీవన్ముక్తు డగుటకు గాని పురుషుడు వయోవృద్దుడు 
కా నక్కరలేదనియు, ధ్రువ, ప్రహ్లాద, శకుల వంటి మహనీయులు బాలురే యనియు, 
బాల్యముననే బ్రహ్మనిష్ణుడగుట యుత్తమమనియు ఈ యుపాఖ్యానము సూచించును. 


3 
పురంజనోపాఖ్యానము 


పూర్వము పురంజను డను రాజు కలడు. అతనికి విజ్ఞాతు డను సఖుడు 
కలడు. రాజు పురాన్వేషియై తన కనురూపమైన పురమును గానక ధరాచక్ర మంతటను 
సంచరించి, తుదకు హిమవత్పర్వత దక్షిణ సానువులందు పురము నొకదానిని గనుగొని, 
పుర బాహ్యోద్యానము లోనికిబోయెను. అచ్చట యువతీజన సమేతయె... అయిదు 
తలలు కలసర్ప ప్రతిహారుని వెంట వచ్చుచున్న యువతీరత్నమును గాంచి పురంజనుడు 
“సుందరీ! ఎవరు నీవు? తలిదండ్రు లెవరు? ఈ యువతులెవరు? ఈ సర్పమెవ్వడు? 
తెలుపు” మని యడిగెను. ఆమె యతననిజూచి వీరమోహితయై చిరునవ్వుతో నిట్లనెను: 
“పురుషర్షభ, కుల గోత్ర నామాదికములు నాకు దెలియవు. ఈపురమున 
నివసించుచున్నాను. కాని దీనిని నిర్మించినవారి నెరుగను. ఈ లలనా రత్నములు 
నాసఖులు. మేము నిద్రించు చున్నప్పు డీ వృద్ధ సర్పము పురమును పాలించుచుండును. 


మనుజనాయక, నీవు మద్భాగ్యవశమున 
నిటకు నేతెంచితి, విపుడ నీకు 
మంగళం బగు! నీవు మహితేంద్రియ గ్రామ 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 261 


భోగ్యంబు లగు కామపుంజములను 
నర్ణి సంపాదింతు వనఘాత్మ, ఈ నవ 

ద్వార ప్రయుక్తమై తనరు పురము 
నీవు కైకొని యేలు నీ కంటె దీనికి 

నధిపు డన్యుండు లే డనఘ, యిందు 
మదువనీతము లైన కామముల ననుభ 
వింపగా సమాశత మధిష్టింపు మెలమి 
కోరి నీకంటె ప్రియులు నెవ్వారు నాకు? 


రతిజ్ఞాన విహీనుడు, నయకోవిదుడు, ఇహపరచింతాశూన్యుడు, పశుప్రాయుడు, 
త్వదన్యుడు నైనవానిని ఎవ్వని వరింతును? గృహస్థాశ్రమము సర్వక్షేమార్థమైన 
యా(శ్రమము. 

కరుణారస పరిపూర్ణ 

స్ఫురితస్మితరుచి విలోకపుంజము చేతం 

గర మర్థి దీనజన భయ 

హరణుడవై సంచరింపు మఖిల జగములన్‌.” 


ఇట్లు పలుకగా పురంజను డామెను స్వీకరించెను. అంతట వారు పురములో 
ప్రవేశించిరి. నూరు సంవత్సరములు వారు సమస్త సుఖములనుభవించిరి. 


లోకభయంకరమైన గ్రీష్మకాలము వచ్చెను. తరళలహరీ మనోహరమైన 
(హ్రోదినిలో నతడు నివాసము చేసెను. ఆ పట్టణమునకు తూర్పు దిక్కున అయిదు, 
దక్షిణమున నొకటి, ఉత్తరమున నొకటి, పశ్చిమమున రెండు మొత్తము తొమ్మిది 
వాకిళులు కలవు. పైదిక్కున ఏడు, క్రింది దిక్కున రెండు ప్రకార మా ద్వారము 
లమరియుండెను. పృథగ్విషయ గత్యర్థమై ఈశ్వరుడొకడు కలడు. ఆపురమున 
నిర్వాగ్యశస్మరులను నిద్దరు అంధులు కలరు. పురంజనుడు వారలచే గమన 
కరణములను క్రియల నొందుచు, అంతఃపురగతు డగునప్పుడు విషూచీ సమన్వితుడై, 
జాయాత్మ జోద్భవములైన మోహట్రసాద హర్షముల నొందుచుండును. అట్లు 


262 బ్‌ అం(ధ మవాభాగవతోవన్వానములు 


కర్మాసక్తుడు, కామాత్మకుడు నై బుద్ధియను మహిషిచే నతడు వంచితుడయ్యెను. ఆ 
కామిని యేమి చేసిన తాను నదే చేయుచుండును. ఆమె మోదింపగా తానును 
మోదించును. ఈవిధమున నతడు అజ్ఞుడు, ఇతరేచ్చా విరహితుడు నై యుండి 
యొకనాడు ధనుర్ధరుడై- 


పంచాశ్వయుక్తంబు పంచబంధనము చ 
క్ర ద్వితీయమును యుగద్వయంబు 
ఆశువేగంబు నేకాక్షంబు కూబర 
ద్వయము పతాకా త్రితయ యుతంబు 
ఏకప్రగ్రహమును నేక సారకంబు 
సప్త వరూధంబు స్వర్ణభూష 
మును పంచ విక్రమమును నేక నీడంబు 
ప్రకట పంచ ప్రహరణము నైన 


రథము కాంచన రచిత వర్మము ధరించి 
విలసదక్షయతూణీర కలితు డగుచు 
కడక దీపింప నెక్కి యేకాదశ ప్ర 
సంఖ్య సేనాసమేతుడై సురభసముగ- 


పురము వెడలి పంచప్రస్థ మను వనమున కరిగి, విడువరాని మహిషిని విడిచిపెట్టి, 
మృగయాసక్తుదై ఘోరముగ ననేక మృగములను వధించి, వేట చాలించి, 
మందిరమునకు మరలివచ్చి, రాత్రివేళ స్వకీయ ప్రాణవల్లభ యగు మహిషిపైకి 
మనసు మరలగా గృహిణి కానబడలేదు. అంత నతడు నిజాంతః పురములోని 
కాంతల నడుగగా వారు చీరె చెరగు పరచుకొని నేలపై బండుకొని విచారముతో 
నున్న గృహిణిని జూపిరి. పురంజనుడు తన యుత్సంగమున నామెను 
గూరుచుండబెట్టుకొని, పాదములుముట్టి మధురవాక్కులతో నామెను లాలించెను. 
ఆమె లేచి మంగళస్నానము చేసి, మోహనాకారముతో వచ్చి నిలిచెను. అంతట 
వారు బహుకాలము భోగములలో దేలియాడిరి. క్రమముగా ఏకాదశ శత పుత్రులను, 


ఉపాఖ్యానములు -అంతరార్థములు ' 263 


దశోత్తర శత పుత్రికలును సముద్భవించిరి. వారలకు యుక్తవయస్సులు రాగా 
నెల్లరకును రాజు వివాహములు చేసెను. అనేక యజ్ఞములు చేసెను. క్రమముగా 
నతని వయసు మరలిపోయెను. 


అప్పుడు చండవేగ విఖ్యాతుడను గంధర్వాధీసుడు 360 మంది గంధర్వులు, 
గంధర్వీ జనము మిధునములుగా వెంట జనుదేర పురంజన పురము నాక్రమింప 
నుండెను. పురాధ్యక్షుడైన ప్రజాగరుడు వారితో సంవత్సరకాలము యుద్ధము చేసి, 
క్షీణించెను. ఈ కాలమున పురంజనుడు పాంచాల దేశమునుండి నిజపార్షదులు 
కొనివచ్చు పదార్థముల ననుభవించుచు బాంధవ సమేతుడై చింతాక్రాంతుడై యుండెను. 


కాలపుత్రిక యను కామిని వరాన్వేషణ చేయుచు సమస్త లోకమున కలయ 
దిరుగుచు యయాతి కుమారుడగు పూరుని జూడ, నాతడామెను వరించెను. ఆమె 
యతనికి వరమిచ్చి, దౌర్భాగ్యవశమున దుర్భగయని ప్రతీతి గాంచుటచే నామెను 
మరియొక పురుషుడెవ్వడును వరింపలేదు. ఒకనాడు (బ్రహ్మలోకమునుండి 
యవతరించుచున్న నారద మహర్షిని ఆమె వరింపగా నతడు నిరాకరించెను. ఆమె 
కోపించి ఏకత్రావస్థానము లేకుండునట్లు నారదుని శపించెను. మహర్షి యామె 
కుపాయము చెప్పగా నామె భయనామకుడను యవనేశ్వరుని దరిశి, పతివి కమ్మని 
ప్రార్థించెను. దేవగుహ్యచికీర్ను వగుదానిని జూచి యతడు చిరునగవుతో, “నిన్నెవ్వరు 
నభినందింపరు. కాని నేను జ్ఞానదృష్టితో నీకు పతి నిరూపణము చేయుదును. నా 
సేనా సాహాయ్యము పొంది, ప్రజానాశ మొనరించు నీవు అవ్యక్తగతివైకర్మ నిర్మితమైన 
లోకము ననుభవింపుము. ఈ ప్రజ్వారుడు నాకు సహోదరుడు. నీవు నా భగినవి. 
మీ యుభయులతో గూడి అవ్యక్తుడను, భీమసైనికుడను అయిన నేను వర్తింతును.” 
అని చెప్పెను. తోడనే యతని సైనికులు ప్రజ్వార కాలకన్యాయుక్తులై భూమండలమున 
దిరుగుచు, భౌమభోగాఢ్యమును, జరత్పన్నగ పాలితము నైన పురంజనుపురము 
నొక నా డాక్రమించిరి. కాలకన్యక బలాత్మరముగా నాపురము ననుభవించెను. 
యవనులు పురద్వారముల వెంట లోనికి బ్రవేశించి సమస్తమును పీడించుచుండిరి. 
పురంజనుడు కాలకన్యోపగూఢుడై, నష్టసంపదుడు, వినష్టమతి, విషయాత్మకుడు, 


264 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


వినిహతైశ్వర్యుడు, ప్రతికూలబంధుబాంధవుడునయ్యు గంధర్వ యవనాక్రాంత 
పురమును విడువలేక విడువలేక విడువ నుపక్రమించెను. ప్రజ్వారుడు పురమును 
దహించెను. పురంజనుడు చాల పరితాపము చెందుచు దగ్గరవారి గతి యే మగునో 
యని వగచుచుండ భయనాముడు వచ్చి, పశువును గొనిపోవునట్లు అతనిని తోడుకొని 
పోవుచుండగా ననుచరవర్గము దుఃఖముతో వెంట జనుచుండెను. జరత్సన్నగము 
వెడలినంతనే పురము జర్జరితమైపోయెను. 

తమో విహితుదైన పురంజనుడు పూర్వ సుహృత్తగు ఈశ్వరునెరుంగక 
పరలోకగతుడయ్యెను. అచ్చట యవను డతనిని బాధించుచుండను. ఆర్తి 
యనుభవించుచు నిజ భార్యయైన ప్రమదోత్తమను చిత్తమున నిరంతరము 
తలచుచుండుటచే నతడు తరువాత జన్మమున విదర్భరాజగృహమున ప్రమదోత్తమ 
యె జన్మించెను. 

ఆ వైదర్శిని పాండ్యభూమీశుడు రాక్షస వివాహము చేసికొనెను. ఆ 
మలయధ్వజుడు బహు సంతానము గన్న పిదప విరక్తుదండయి, రాజ్యము 
కుమాలరులకిచ్చి, చ్రంద్రమసాతామ్రపర్లీజలముల సుస్నాతుడై బహుకాలము ఘోర 
తపము చేయుచు, హరిధ్యాన నిరతుడై యుండెను. భార్య వైదర్శిభక్తితో తనకు 
శుశ్రూష చేయుచుండనొకనాడాతడు మృతినొందెను. అది యెరుగక యామె 
యథాప్రకారము పరిచర్య చేయుచు, పాదములు చల్లబడిపోవుటచే నాతడు 
విగతజీవుడయ్యెనని గ్రహించి, బహువిధముల విలపించి, భర్తృ కళేబరమునకు 
దహనసంస్మారము చేస్తి తానును అగ్నిలో బడనుండగా పూర్వసఖుడు విజ్ఞాన 
స్వరూపుడునయిన బ్రాహ్మణు డచ్చటికి వచ్చి యామె నూరడించి “నీవెవరు? ఇత 
డెవరు? నేనెవ్వడనో తెలియునా? ఈసృప్టికి పూర్వము మన మిరువురమును సఖులము” 
అని యిట్లు చెప్పెను. “మనము మానస నివాసులమైన హంసలమై యుండి, యిలు. 
వెడలి వేయి వత్సరములు సఖులమై వర్తించుచుంటిమి. నీవు నన్ను బాసి 
భౌమభోగరతుడవై మహీమండలమున గ్రుమ్మరునప్పుడు కామినీ నిర్మితము, 
పంచారామము, నవద్వారసమేతము, ఏకపాలకము, త్రికోష్టము, షట్ములము, 
పంచవిపణము, పంచప్రకృతి, ప్రీ నాయకమునైన యొకానొక పురమును జూచి 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 265 


అందు ప్రవేశించి, అంగనా పరతంత్రుడవై, నష్టస్మృతివై, వైదర్శ్భీ జన సంభావిత 
సుఖాభాసములగు దుఃఖములచే నిట్టి దశ పొందితివి. నీవు వైదర్శివి కావు. ఇతడు 
నీభర్త కాడు. నీవుపురంజనపతివి కావు. నీవు (స్రీ వనియు, గత జన్మమున 
పురుషుడవనియును తలంచుట సత్యముకాదు. ఇదియంతయును మాయ. మనము 
పూర్వము హంసలము. మన రూపము చూడు. నేనే నీవు. నీవే నేను. విద్వాంసులు 
మన యంతరమును వీక్షింపరు” అప్పుడు వైదర్శి యీ బోధ విని తద్వియోగ 
నష్టమైనజ్ఞానము క్రమ్మర పొందెను. 
kkk 

నా వృష్టః కస్యచి ద్రూయాత్‌-అడుగనిదే ఎవరికినిచెప్పరాదు. కావున 
ప్రాచీనబర్హి అడిగిన పిమ్మటనే నారదుడు పురంజనోపాఖ్యానము చెప్పినాడు. కర్మరుడు 
ప్రాచీనబర్హి 


“న జానామి మహాభాగ, పరం కర్మాపవిద్ధధీః 

బ్రూహి మే విమలం జ్ఞానం యేన ముచ్యేయ కర్మభిః. 

గృహేషు కూట ధర్మేషు పుత్ర దార ధనార్థ ధీః 

న పరం విందతే మాఢో భ్రామ్యన్‌ సంసార వర్మసు” 
అని పలుకగా, నారదుడు చెప్పిన యుపాఖ్యానము ముక్తిప్రదము. జ్ఞానవిషయమును 
నారదుడు సూటిగ చెప్పలేదు. 


“పరోక్ష క్రియా ఇవ హి దేవాః” అనిశ్రుతి చెప్పుచుండుటచే- 

“ప్రాచీన బర్దిషం పారోక్ష్యేణ ప్రదర్శితమ్‌ 

యత్సరోక్ష ప్రియో దేవో భగవాన్‌ విశ్వభావనః.” 
ఉపాఖ్యాన విధాన మవలంబింప వలసివచ్చినది. 

పురంజనోపాఖ్యానము సంసార వృక్ష స్వరూపమును, శరీర తత్త్వమును 
వివరించును. ఏ కారణమున ఆత్మ ద్విత్రి చతుష్పాదము, బహుపాదము, అపాదము 
అగుచు పురంజనుడయ్యెనో ఆకతమున పురంజనుడు పురుషుడయ్యిను. అట్టి పురుషునకు 
నామ క్రియాగుణముల వలన విజ్ఞాతుడు కాకపోవుటచే అవిజ్ఞాత శబ్దవాచ్యుడగు 


266 ఆం(ధ్ర మవోభాగవతోవన్యానములు 


సఖుడు ఈశ్వరుడు. పురుషుడు సాకల్యమున దేహపరిగ్రహము చేయగోరినపుడు 
నవద్వారకలితము, ద్విహస్తచరణయుక్తము అగు పురమేదికలదో అది లెస్సయని 
తలచి ఆపురమును దేహమున ఇంద్రియములతో ఏబుద్ధి నధిష్టించి విషయముల ' 
అనుభవించునో, అహంకారమమకారములకు ఏబుద్ధితత్త్వము కారణమగునో ఆ 
బుద్ధి ప్రమదోత్తమ. దానికి సఖులు జ్ఞాన కర్మ కారణములయిన యిం(ద్రియ 
గుణములు. సఖీజనములు తదీయ వృత్తులు. పంచముఖ సర్పమనగా పంచవృత్తియన 
ప్రాణము. ఏకాదశ మహాభట్టులనగా బృహద్బలుడు, ఉభయేంద్రియ నాయకుడు 
నయిన మనస్సు. నవద్వార సమేత మయిన యీ పురమును చుట్టివచ్చిన పాంచాల 
' దేశములనగా పంచ విషయములు. నవద్వారములనగా అక్షి నాసికా, కర్ణ 
ముఖాదికములు. : 


చండవేగు డనగా కాలోపలక్షకమయిన సంవత్సరము. గంధర్వులు దినములు, 
గంధర్వీజనములు రాత్రులు, పరీవర్తనము ఆయుర్దరణము, కాలకన్యక జర, 
యవనేశ్వరుడు మృత్యువు, అతని సైనికులు ఆధివ్యాధులు. ప్రజ్వారుడు జ్వరము. 
దక్షిణ పాంచాల మనగా పితృలోక ప్రాపకము. ప్రవృత్తి రూపకము నయిన శాస్త్రము. 
ఉత్తర పాంచాల మనగా దేవలోక ప్రాపకము. నివృత్తి సంజ్ఞికము అయిన శాస్త్రము. 
శ్రుతధరుడు శ్రోత్రము. వైశన మనగా నరకము. అంధులనగా హస్తపాదములు. 
అంతఃపురము హృదయము. విషూచి యనగా మనస్సు. 


రథ మనగా దేహము. కురంగములు ఇంద్రియములు. ఈషాద్వయ మనగా 
వత్సరము, తతత వయస్సు. చక్ర ద్వయము పుణ్యపాపకర్మద్వయము. వేణుత్రయము 
గుణత్రయము. పంచబంధురమనగా ప్రాణ పంచకము. రశ్మి మనస్సు. సారథి 
బుద్ది. రథికోపవేశనస్థాన మనగా హృదయము. కూబరములు శోక మోహములు. 
పంచ (ప్రహరణములనగా పంచేంద్రియార్థ ప్రక్షేపము, పంచవి(కక్రమము 
కర్మేంద్రియములు. సప్తవరూధములు ధాతువులు. హైమోపస్మరము రజోగుణము, 
అక్షయ తూణీరము ఆనంత వాసనాహంకారోపాధి. ఏకాదశ చమూపతి యనగా 
ఏకాదశేంద్రియమైన మనస్సు. ఆసురీవృత్తి యనగా బాహ్య విక్రమము. విషయముల 
ననుభవించుట వేట. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 267 


జీవుడు దేహమున స్వప్నసుషప్తి జాగ్రదవస్థలయందు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, 
ఆధి భౌతికములైన బహువిధ దుఃఖములవలన క్షేశముల ననుభవించుచు, 
అజ్ఞానావృతుడయి, వర్ష శతము నిర్గుణడయ్యును ప్రాణేంద్రియ మనో ధర్మములను 
తనయం దధ్యవసించి కామలవముల ధ్యానము చేయుచు, అహంకార మమకార 
సహితముగా కర్మాచరణము సలుపుచుండును. 


ఇక స్రీ నాయక పురము: పంచారామములు లనగా పంచేం[ద్రియార్థములు. 
నవద్వారములు నాసికాది ద్వారములు. ఏక పాలక మనగా ప్రాణ పాలనము. 
త్రికోష్టము లనగా తేజో భిన్నములు. షట్ములములు ఇంద్రియ సంగ్రహము. 
విపణములు కర్మేంద్రియములు, పంచప్రకృతి యనగా పంచభూతములు. ప్రకృతి 
యను కామిని యనగా బుద్ధి. 


స్వప్నావస్థయందు లింగ శరీరాధిష్టాత యైన జీవుడు జాగ్రద్దేహాభిమానము 
విడిచి శరీరాంతము నొంది, మనమున సంస్మార రూపమున ఆహితమైన కర్మము 
ననుభవించుచందమున పురుషుడు ఏ లింగ శరీరముచే కర్మ మాచరించునో ఆ 
లింగ శరీరమున లోకాంతరములో దేహ విభేదము నొందక తత్సలమనుభవించును. 
దాన ప్రతిగ్రహాదులయందు స్టూలదేహమునకు కర్తృత్వము కలదన్నచో, అహంకార 
మమకారయుక్తుడైన పురుషుడు మనస్సుచే సేయే దేహము వరి[గ్రహించునో ఆయా 
దేహమున సిద్ధమైన కర్మ మా జీవు డనుభవించును. అట్లు కాకున్న కర్మము 
పునర్భవకారణ మగుట ఉపపన్నము కాకుండును. కావున మనః ప్రధానమైన లింగ 
శరీరమునకే కర్తృత్వముపపన్న మగును. 


పంచన్మాత్రాత్మకము, త్రిగుణాత్మకము, షోడశ వికారాత్మ విస్తృతము నగు 
లింగ శరీరము నధిష్టించి, చేతనాయుక్తుడైన జీవుడని చెప్పబడును. 


“తివిరి యప్పురుషుండు దేహంబునను జేసి 
యనయంబు పెక్కు దేహాంతరముల 
నంగీకరించుచు నవి విసర్జించుచు 
సుఖ దుఃఖ భయమోహ శోకములను 


268 


ఆం(ధ్ర మహాభాగవతోవన్యానములు 


బొలు పొందు తద్దేహములనె పొందుచునుండు 

అది యెట్టు లన్నను నగ్రభాగ 
తృణ మూది మరి పూర్వతృణ పరిత్యాగంబు 
గావించు తృణజలూకయును బోలె 
జీవు డవని గొంత జీవించి మియమాణు 
డగుచు నొందు దేహ మర్ధి జెంది 
కాని, పూర్వమైన కాయంబు విడువడు 
కాన, మనమె జన్మ కారణంబు. 
య. మనంబె జీవులకెల్ల సం 
సరణ కారణ మట్టి కర్మవశంబునన్‌ సకలేంద్రియా 
చరణు డౌట నవిద్య గల్గును సంతతంబు నవిద్యచే 
బరగటన్‌ బహుదేహకర్మనిబంధముల్‌ కలుగుం జుమీ! 
న అవిద్య లయించుటకై రమాపతిన్‌ 
ఘనుజన్యస్థితి ప్రళయ కారణభూతుని పద్మపత్ర లో 
చను పరమేశు నీశ్వరు నిసర్వజగంబు తదాత్మకంబుగా 
గనుగొనుచుం దదీయ పదకంజము లర్థి భజింపు మెపుడున్‌”. 


ఇదే జీవేశ్వరగతి. 


“ధ్యాయ తీవ వేలాయ తీవ” అని శ్రుతి. బుద్ధితో తాదాత్యము కలిగినపుడు 


అంతయు దానివలెనే యుండును. “పురం జనయతీతి పురంజనః” సంస్కృత 
భాగవతమున మహిషి పేరు పురంజని. హంసలనగా పరిశుద్ధులు. “హంసా పరిశుద్దా”. 


విషయ వివరణమున పురంజనోపాఖ్యానము ప్రగాధమయినది. 


అ 
(జడ) భరతోపాఖ్యానము 


పూర్వము భరతు డను మహారాజు ధర్మమార్గమున దేశమును పరిపాలించుచు 


విష్ణుధ్యాన పరాయణుడై యుండెను. అంతకుమున్ను అజనాభ మను పేరు గల 


ఉపాఖ్యానములు -అంతరార్థములు | 269 


వర్షమునకు ఈ రాజువలన భారతవర్ష్న మని పేరు వచ్చెను. ఆయన ధనాదికమును 
పుత్రులకు సమముగా పంచియిచ్చి, ఇలువెడలి పులహాశ్రమమునకు బోయి, బహు 
విధముల నిష్టతో హరి నారాధించుచు విగత విషయాభిలాషుడయ్యెను. 


ఒకనాడాయన నదిలో స్నానము చేసి ప్రణవోచ్చారణ చేయుచుండ లేడిపిల్ల 
తల్లి గర్భమునుండి జారి నీటిలో బడెను. తల్లి మరణించెను. భరతుడు పిల్లను 
జూచి జాలిచెంది, ఆశ్రమమునకు గొనిపోయి మిక్కిలి మక్కువతో బెంచుచుండెను. 
క్రమముగా హరిణపోతము మీదనే మానసము లగ్నమగుటచే ఆయన శక్తులుత్సన్నము 
లయ్యెను. ఏమి చేయుచున్నను ఆయన హరిణపోతమునే తలచుచుండెను. 
ఒకనాడాలేడిపిల్ల యెచ్చటికో కనబడకుండ బోయెను. హరిణపోతము మీద మోహ * 
మగ్గల మగుటచే నతడు బహువిధముల విలపించెను. తుదకు లేడిపిల్ల 
మరలివచ్చునప్పటి కాయనకు సంతోష మంకురించెను. ఇట్లు కొంత కాలము చనెను. 


భరతుం డల్లన అంత్యకాలము వెసం టబ్రాపింపగా నప్పు డా 
హరిణంబుం గడు భక్తి బుత్రుగతి నత్యాసక్తి వీక్షింప, నా 
హరిణంబుం దన యాత్మలో నిలిపి దేహం బంతటం బాసి తా 
హరిజీ గర్భమునన్‌ జనించి హరిణంబై యొప్పె పూర్వస్మ ఎ్రతిన్‌. 


భగవదారాధన సామర్థ్యమున మృగ జన్మ కారణము గ్రహించి భరతుడు లోలోన 
పరితాపము చెందుచు, పులహాశ్రమమునకు వచ్చి, దేహత్యాగావసానము 
వాంఛించుచు, సంగము విడిచి తిరుగచు, తుదకు నదీతీర్ణమున శరీరము విడిచెను. 


భరతు డావలి జన్మమున అగిరసు డను నుత్తమ బ్రాహ్మణునకు ద్వితీయ 
భార్యయందు పుత్రుడై పుట్టెను. తండ్రి యతినికి సక్రమముగా సమస్త సంస్కారములు 
చేయించెను. బాలుడు పెరిగి పెద్దవాడయి, భాగవతోత్తముడై కర్మములయం దిచ్చ 
లేకుండియు, నెట్లో చేయుచుండెను. తండ్రి యెంత ప్రయత్నించినను కుమారునకు 
సక్రమ కర్మానుష్టాన మలవడలేదు. కొంత కాలమునకు తండ్రి మరణింపగా నతని 
తల్లి యగ్నిప్రవేశము చేసెను. సవతితల్లి కొడుకు లతని మహిమను గుర్తింపనేరక 
అతనిని వేదాధ్యయనము చేయనీయక కుమతులై గృహకృత్య నిర్వహణమున 


270: ఆం(ధ ' మవోభాగవతోవన్వానములు ' 


నియోగించి, “ఉన్మత్త జడబధిరి అని పిలుచుచుండిరి. వ్యవసాయమున నియుక్తుడై 
భరతుడు దేహాభిమానము లేక శీతవాతాతప వర్షముల కోర్చి, నూక, తవుడు, 
తెలికపిండి, పొట్టు తినుచు, చేనుకావలి కాయుచుండెను. సంతాన కాముడైన వృషలపతి 
పురుష పశువును భద్రకాళి మందిరమునకు తీసికొని పోవుచుండగా వాడు 
తప్పించుకొనిపోయెను. భృత్యులు రాత్రివేళ చేను కాచుచున్న భరతుని బట్టుకొనిపోయి 
అభ్యంజనాదికము చేయించి, నూతన వస్తాదులిచ్చి, భోజనానంతరము వాద్యములతో 
నతనిని భద్రకాళి సమ్ముఖమున నాసీనుని జేసిరి. వృషలపతి మంత్రపూతమైన ఖడ్గము 
చేతబట్టి మస్తకము ఖండింపదలచెను. అప్పుడు- 


అచ్చట విప్రసూనుడు భయం బొకయించుక లేక చంపగా 
వచ్చినవారియందు కరవాలమునందును కాళియందు దా 
నచ్యుత భావ ముంచి హృదయంబున పద్మదళాక్షు నెంతయున్‌ 
మచ్చికతోడ నిల్చి యనుమానము నొందక యుండె నెంతయున్‌. 


భద్రకాళి వృషలాదులను సంహరించెను. “అనంతరము భరతుడు చేనికి కావలికై 
పోయెను. 


ఆవల కొంత కాలమునకు సింధు భూపాలుడగు రహుగణుడు ఇక్షునదీ 
తీరమున నున్న కపిల మహాముని వలన తత్త్వజ్ఞానము గ్రహించు కోరికతో మేనాలో 
జనుచుండెను. శిబికావాహకులు త్రోవలో భరతుని గాంచి, మేనా మోయింపసాగిరి. 
అతడు హరిధ్యానమున నుండుటచే దేహముమీద మనస్సులేక యెట్లో నడచుచుండెను. 
విషమ గమనమునకు రాజు బాధపడుచు వాహకులను మందలించెను. నూతన 
పురుషుని వలన బాధ కలుగుచున్నదని వారు చెప్పగా రాజు వేగిరపడి భరతుని 
బహువిధముల దూషించెను. 


భరతు డిట్లనెను: “రాజా! భార మీ శరీరమునకుగాని నాకు గాదు. స్వామి 
- భృత్య సంబంధము శరీరమునకుగాని జీవునికి లేదు. స్తబ్బుడను, ముక్తుడను అగు 
నాకు నీవు చేయు శిక్ష వ్యర్థమగును.” 


ఉపాఖ్యానములు -అంతరార్థ ములు 1 271 


రాజు శిబికనుండి దుమికి బ్రాహ్మణునికి సాష్టాంగ దండప్రణామము 
లాచరించి “మహాత్మా! నా తప్పు సైరింపుము. నిస్సంగుడవైన నీ స్వభావము తొలుత 
(గ్రహింపనైతిని” అని వేడగా భరతుడు రహుగణునకు తత్త్వజ్ఞాన ముపదేశించి 
చనియెను. సింధు భూపతియును దేహాత్మ భ్రమను విడిచిపెట్టెను. 


కృపయాపి కృత స్సంగః పతనాయైవ యోగినః . 
ఇతి ప్రదర్శ్మయ న్నాహ భరత స్యైణ పోషణమ్‌. 


యోగియగువానికి సంగ మేమాత్రము కూడదు. దయావిష్ట చిత్తుడైన భరతుడు 
లేడిపిల్లను రక్షించి, తత్సంగమువలన యోగ(భ్రష్ణుడయ్యెను. 


లోకములో కొందరు కుక్కనో, పిల్లినో, చిలుకనో, ముంగిసనో, ఉడతనో, 
ఏదో పక్షినో, జంతువునో పెంచుచు దానితో కాలక్షేపము చేయుచుందురు. 
రామదాసునంతటి మహానుభావుడు చిలుకను పంజరములో బంధించి పోషించుటచే 
పండ్రెండు వత్సరములు బందిగమునం దుండవలసి వచ్చినట్లు జన(్రుతి కలదు. 


(ద్రవిడ దేశమున విలసిల్లిన శ్రీతాయ్‌ మానవర్‌ అను మహానుభావుడు ఏదో 
ధర్మశాల వసారాలో నొకమూల నుండెడివాడు. రాజకుమారుడొకడు సంపదలు, 
సౌఖ్యములు త్యజించి ఆయన సేవచేసి తరింపవలెననెడి యాశయముతో నొకనాడు 
తత్సన్నిధికి బోయి ప్రణామాదికము చేసెను. ఆయన యేమియు మాటాడలేదు. 
రాజపుత్రుడు ఆయన తనకు గానబడునట్లుగా ఆ ధర్మశాలలోనే వేరొకమూల 
నివసించుచు, ప్రతి దినము (ప్రాతఃకాలమున ప్రణామము చేసిపోవుచుండెడివాడు. 
ఇట్లు ద్వాదశ వర్షములు గడిచినవి. ఎన్నడును పలుకరింపని శ్రీతాయ్‌ మానవర్‌ 
ఒకనాడు రాజకుమారుని తన దగ్గరకు బిలిచెను. అతడు సమ్మోదభరితుడై “స్వామీ, 
నేటికి తమకు నామీద అనుగ్రహము కలిగినది! ధన్యుడను! ఈ యనుగ్రహమునకు 
కారణము మాత్రము గ్రహింపలేకున్నాను అని భక్తితో పలికెను. “నాయనా! నేటితో 
నీవు సంఘవర్ణితుడవైనావు. రాజ్యాధికమును విడిచినావు; కాని ప్రీతిపాత్రమైన 
శునకమును మాత్రము విడువవైతివి. నిన్న కుక్క చనిపోవగా దానిని ఖననముచేసి 
వచ్చితివి. నేటినుండి సంగరహితుడవయి జ్ఞానివయినావు” అని యనుగ్రహించినట్లు 
కథ తెలియవచ్చుచున్నది. 


272 | ఆం(ధ మహోాభాగవతోవన్యానములు 


నిరంతర హరిణ సంసర్గముచే భరతుడు క్రమేణ ఉత్తమశక్తులు కోలుపోయెను. 
“అంతే మతిస్సా గతిః. జీవిత మరణకాలమున దేనిని విశేషముగా ధ్యానించిన 
అదియే యగును. భరతుడు హరిణమునే చూచి తద్భావనతో ప్రాణములు విడుచుటయే 
హరిణజన్మము కలిగెను. వెనుక జన్మములో విశేషముగా భగవదారాధన 
చేసియుండుటచే నతనికి పూర్వజన్మస్మృతియు, వివేకమును సంక్రమించెను. హరిణ 
దేహమున బహుకాల ముండక త్వరలోనే యతడు తద్దేహమును పవిత్ర ప్రదేశమున 
విసర్జించెను. . 


“శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో భిజాయతే; 
అథవా యోగినా మేవ కులే... ...”. 


ఉత్తమ బ్రాహ్మణ వంశమున నతడు జన్మించెను. తండ్రి జీవించి యున్నంతవరకును 
అన్నియు సక్రమముగా నడచెను. అనంతరము నవతి సోదరుల వలన 
బహువిధములైన కష్టముల కతడు లోనయ్యాను. తుదకు పశుప్రాయమైన వృత్తి 
యవలంబింపక తప్పినది కాదు. ఆహారముకూడ పశువులకు పెట్టునదే యాతడు 
తినుచుండెను. ఎట్టి స్థితిలో నన్నును జ్ఞానియగుటచే ఆత్మారాముడై యుండి కష్టసుఖ 
విభాగము తలపెట్టలేదు. 


కర్మవేష మనుభవింపవలెను? భద్రకాళికి బలిగాగూడ బోవలసి వచ్చెను. 
దేవి దయాళు వగుటచే నతనికి మరణము సంభవింపలేదు. 


శిబికావహనము చివరి కృత్యము. లోపల గూరుచున్న రహూగణ ప్రభువునకు 
భరతుని సంగతి యేమి తెలియును? కావున ప్రభు దర్పముతో నిష్టురవాక్యము 
లాతడు పలికినాడు. ఎంత ప్రాభవోపేతుడు, రజోగుణ సంస్ప ఎ్రస్టుడు నయినను 
రాజు కపిలమహాముని సన్నిధికి బోయి విజ్ఞాన వాక్కులు వినదలిచనవా డగుటచే 
జడ భరతుని పలుకులు చెవినిబడినంతనే ప్రబుద్దుడై పల్లకి దిగి అతని పాదములపై 
ప్రాలినాడు. తమస్సును గాని, రజస్సునుగాని తొలగించిననే కాని వివేకోదయము 


కాదుకదా? 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 273 


జడ భరతు డవధూత చర్య నవలంబించినవాడు. అట్టివాడు “మూకోన్మత్త 
పిశాచవత్‌' ప్రవర్తించును. సంసర్గమువలన భ్రష్టుడగుటచే నతడు అన్యసంసర్గము 
తన కంటకుండుటకై అవధూత చర్యావలంబి యయినాడు. 


అవధూత చర్యను గూర్చి విష్ణుపురాణములోని హిరణ్యగర్భగీతములైన 
శ్లోకములున్నవి: 


“సమ్మాననా పరాం హానిం యోగార్ధేః కురుతే యతః 

జనే నావమతో యోగీ యోగసిద్ధిం చ వినతి. 

తస్మా చ్చరేత వై యోగీ సతాం ధర్మ మదూషయన్‌ 

జనా యధా వమన్యేరన్‌ గచ్చేయు ర్నైవ సంగతిమ్‌.” 
రహూగణునకు భరతుడు తుదిలో చేసిన ఉపదేశసార మిట్లున్నది: 


“జ్ఞానం విశుద్ధం పరమార్థ మేక 
మనంతరం త్వబహిః బ్రహ్మ సత్యమ్‌ 
ప్రత్యక్షృకాశం భగవచ్చబ్ద సంజ్ఞం 
య ద్వాసుదేవం కవయో వదన్తి. 
రహూగ ణైతత్‌ తపసా నయాతి 
న చేజ్యయా నిర్వపణా ద్ధహా ద్వా 
న చృందసా నోత జలాగ్ని సూర్యై 
' ర్వినా మహత్సాద రజోభిషేకమ్‌ 
య త్రోత్తమ శ్లోక గుణానువాదః 
ప్రస్తూయతే గ్రామ్యకథా విఘాతః 
నిషేవ్యమాణోనుదినం ముముక్షో 
ర్మతిం సత్రీం యచ్చతి వాసుదేవే.” 


భరతునంతవానికి కర్మ క్షయమై ముక్తి లభించుటకు మూడు జన్మములు పట్టినది. 


274 ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 
= 

అజామిళోపాఖ్యానము 

కన్యాకుబ్ద పురమున అజామిలు డను (బ్రాహ్మణుడు కలడు. అతడు. 

సదాచారములు విడనాడి, దుర్వాదములు చేయుచు, జూదమాడుచు ఉపపత్నితో 
కాలక్షేపము చేయుచు, కాలక్రమమున పదుగురు కుమారుల బడసెను. బిడ్డలను 
భావించుచు, పెంచుచు, మోహజలధిలో బడి, పతితుడయ్యెను. ఈ రీతిని ఎనుబడి 
యెనిమిది వర్షములు గడచినవి. తన కడగొట్టు కొడుకునకు అజామికుడు నారాయణు 
డను పేరు పెట్టి, వానితో నాటపాటలలో కాలము బుచ్చుచుండగా మరణ సమయ 


మాసన్నమయ్యెను. అయ్యెడ మువ్వురు యమదూత లతనికి గానబడిరి. అతడు 
వికలేంద్రియుడు, వికంపిత ప్రాణుడు, వికృతలోచనుడు, విహ్వలాత్మకుడు నయి- 


దూరమున నాడు బాలుడు 

బోరన దన చిత్తసీమ బొడకట్టిన ఓ 
నారాయణ, నారాయణ, 

నారాయణ యనుచు నాత్మనందను నొడివెన్‌. 


మరణ సమయమున అజామిళుడు నారాయణ స్మరణము చేయుటచే తత్సమీపమున 
నున్న విష్ణుదూతలు ప్రభునామ మాలకించి, యమకింకరులు తనువు నుండి 
బ్రాహ్మణుని వెలికి దీయుచుండగా డగ్గరివారిని ప్రక్కకు నెట్టిరి. 


యమదూతలు వారితో “ఎవరు మీరు. మమ్ము నడ్డగించుటకు కారణమేమి? 
ఈ ప్రాణిని విడిపించితిరి. ఇక యముని శాసనములు లోకమున హాస్యాస్పదములు 
కావా? దివ్యరూపధారులై, ఆయుధధారులై, శాంతతనుద్యుతులు నగు మీరు 
ధర్మపాలురమైన మమ్ము నడ్డగించుట న్యాయమగునా? ఇతడు బ్రాహ్మణ వంశమున 
బుట్టి, తొలుత వేదాధ్యయనాదికము చేసినాడు. గురువులను, అతిథులను సేవించినాడు. 
బహు మంత్రసిద్దులనుగూడ పొందినాడు. నిత్య నైమిత్తిక క్రియలు నిర్వర్తించినాడు. 
కాని యౌవన మదమున భ్రష్టుడై, క్రమముగా పతితుడయినాడు. ఇట్టివానిని 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 275 


నరకమునకు గొనిపోవలెను. దండనమువలన నితడు ధన్యుడు కాగలడు. ఇది 
ధర్మమార్గము” అని పలికిరి. 


నయకోవిదులైన విష్ణుదూత లపుడిట్లనిరి: 
“ఈతడు కోటి సంఖ్యలకు నెక్కుడు పుట్టువు లందు జెంది యా 
యాతములైన పాప నివహంబుల నన్నిటి బారద్రోలె ప్ర 
ఖ్యాత మతిన్‌ మహా మరణ కాలమునన్‌ హరి పుణ్యనామ సం 
భూత సుధామయాద్భుత విభూతికరాక్షర సం(గ్రహంబునన్‌. 
బిడ్డపేరు పెట్టి పిలుచుట విశ్రామ 
కేళినైన మిగుల గేలినైన 
_ పద్య గద్య గీత భావార్థములనైన 
కమలనయను దలప కలుషహరము.” 
ఇట్లని వారు భాగవత ధర్మము నిర్ణయించిరి. యమదూతలు శాంతి చెంది 
యమలోకమునకు జని, యముని కీ విషయము విన్నవించిరి. 


అజామిళుడు తన జీవితమును సింహావలోకనము చేసి, మిక్కిలి విచారించి, 
వైష్ణవజ్ఞాన దీపము వలన తన యజ్ఞానము తొలగిపోవగా గంగాద్వారమునకు 
జని, దేవతామందిరములో సమాసీనుడై, యోగమార్గమున దేహము విడిచి, 
విష్ణుసేవకులతో గూడి విమానమెక్కి వైకుంఠమున శ్రీమన్నారాయణ పదారవింద 
సేవాచరణ పరిణామ స్థితికి జనెను. 


Kkk 


“నరక యాతనల నెట్లు తప్పించుకొననగును?” అని పరీక్షిత్తుశుకు నడిగెను. 
పాపకర్మములు చేసినయెడల నరకలోక నివాసము, యమయాతనలు సిద్ధించును. 
కృ చాంద్రాయణాది (ప్రాయశ్చిత్త కర్మలచేత పాపకర్మములు సమూలముగా 
నాశము పొందవు. అవిద్వాంసుదైన యధికారికే ప్రాయశ్చిత్తము విధింపబడినది. 
అముఖ్యము, ముఖ్యము అని (ప్రాయశ్చిత్తము రెండువిధములు. 


276 | ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


అజామిళుని నడవడి చిత్రమైనది. ఉత్తమ బ్రాహ్మణవంశమున బుట్టి 
వేదాధ్యయనాదులుచేసి, సక్రమముగా కన్య నాతడు వివాహము చేసికొన్నాడు. 
అంతవరకును యోగ్యుడే. కాని భార్య పెద్దదికాలేదు. అతనికి యౌవనోద్రేకము 
కలిగినది. మీదుమిక్కిలి ఒకనాడు తలవని తలంపుగా ఉద్దీపన మొదలిడినది. అజ 
కానవచ్చినది. ఇచ్చట అజయనగా వృషలి. “అజయామిళి తీతి అజామిళః.” అజతో 
కూడినవాడు. ఇప్పుడు అజ యనగా అవిద్య. పెద్దలు పెట్టిన నామధేయమున 
కనుగుణముగా ప్రవర్తించినాడు. ఏమాత్రము నిగ్రహమున్నను భ్రష్టత సంక్రమించెదిది 
కాదు. 


ఇక నేమున్నది? శూద్ర స్త్రీని పెట్టుకొన్నాడు. వీర్యవంతులకు సంతానము 
కలుగకుండునా? కాలక్రమమున నతడు పదుగురు కొడుకులను బడసెను. వృషలీ 
సాంగత్యమున సదాచారములు విడనాడెను. “స్వాధ్యాయా న్మా ప్రమదళొ అని 
వేదాదేశము. కాని వేదాధ్యయనము మానెను. అంతటితో నూరకుండక దుర్వాదములు 
చేయసాగెను. నిత్యకృత్యములకు ధనము వలయు గదా? ద్యూతమే శరణమయ్యెను. 
అన్ని విధముల నాతడు భ్రష్టుడాయెను. 


కాని, అనుకొనకుండా అజామిలుడు తన చిన్నికొడుకునకు నారాయణ యని 
పేరిడెను. తక్కినవారి నామములలేవో తెలియరాదు. తెలిసినను దాని ప్రసక్తితో 
పనిలేదు. నారాయణ యనునది శ్రీమహావిష్ణువు నామాంతరము. భారతీయులలో 
భగవన్నామము పెట్టుకొనని వారలాకాలమున లేరు. సామాన్యముగా చిన్నికొడుకుమీద 
తలిదండ్రులకు ప్రీతి మెండు. అజామిళునకు నారాయణమీద (పేమ మీద మిక్కుటము. 
వానితోనే యతనికి కాలక్షేవము. ఒకనాడు వాఠాత్సంబభవముగా . 
మృత్యువాసన్నమయ్యెను. యమదూతలను జూచి యాతడు బెగడొంది, చిన్నికొడుకు 
జ్ఞప్తికి రాగా నారాయణా యని కేకవేసెను. వాడు దగ్గణకు వచ్చెనో రాలేదో కాని 
విష్ణుదూతలు వచ్చిరి. వారే యతని సంత్రాణనమునకు హేతుభూతులయిరి. 


అప్పుడు యమదూతలకును విష్ణుదూతలకును సంవాదమో వివాదమో 
జరిగెను. అజామిలుడు వినుచుండెను. ఆశ్రవణమే యతనిని రక్షించినది. ఉపదేశము 


ఉపాఖ్యానములు-అంతరార్థములు 277 


లేకుండ ఉత్తమ జ్ఞానోదయము కానేరదు. వారి సంవాదమే అతని ఉపదేశమయినది! 


వ్యతిక్రమమునకు ప్రాయశ్చిత్తము తప్పదు. ఇచ్చట “కిం తర్హి ముఖ్య 
ప్రాయశ్చిత్తమ్‌.” అను ప్రశ్నయు కలుగును. యమదూతలు వెడలిపోయిన తరువాత 
నాతడు నిజీవితమును సింహావలోకనము చేసికొనెను. మిక్కిలి విచారము కలిగినది. 
అదియే ప్రాయశ్చిత్త రూపము. “ముఖ్య ప్రాయశ్చిత్తం తు విమర్శనం జ్ఞానమ్‌”. 
అప్పుడతడు పునీతుడయినాడు. ముక్తికి సంసిద్దుడయినాడు. 


ఒక్కమారు భగవన్నామోచ్చారణము చేసినతనే యతినికి ముక్తి కలిగినట్లు 
ఉపాఖ్యాన ముద్దాటించుచున్నది. నామోచ్చరణము చేతనే హఠాన్ముక్తి కాలేదు. 
మాలిన్యక్షాళనము, జ్ఞానోదయము, పరామర్శ ఇత్యాది సోపానములున్నవి. ప్రతిజ్ఞా 
వాక్యము మండూకఫ్సతి చేసి, ప్రరోచనోత్సాదక మయ్యెనని భావింపవలెను. 


భగవన్నామోచ్చారణము భవతారక మని భావన చేయవలెను. 
౭ చిత్రకేతూపాఖ్యానము 


శూరసేన దేశములకు ప్రభు వగు చిత్రకేతుడు చాల యోగ్యుడు. అతనికి 
చక్కని భార్యలెందరో కలరు; కాని సంతానము లేదు. ఒకనాడు అంగిరస 
మహామునిరాగా రాజాయెనను పూజించెను. మహాముని పుత్రకామేష్టి చేసి అగ్రమహిషి 
యగు కృతద్యుతికి యజ్ఞ శేషమిచ్చి, పుత్రుడు పుట్టునని చెప్పి వెడలిపోయెను. 
నవమాసములు నిండిన వెనుక కుమారుడు జన్మించెను. బిడ్డయు దినదిన 
ప్రవర్థమానుడై, అందరకును అల్లారుముద్దగా పెరుగుచుండ, రాజు కృతద్యుతియందు 
బద్దానురాగుడై తక్కిన రాణులను తలపకుండెను. బిడ్డడే దానికి కారణమని యెంచి, 
వారు బాలునికి విషయము పెట్టించిరి. తెల్లవారగనే బిడ్డని లేపుటకై దాది పోయి 
చూడగా వాడు మృతుడై యుండెను. వార్త విని తల్లి వచ్చి యేడ్చుచుండ రాజు విని 
యచటికి బోయి దుఃఖించెను. అందరును దుఃఖాక్రాంతులయిరి. 


అంతలో అంగిరస, నారదు లచటికి వచ్చి, రాజునకు బోధ చేసిరి. చిత్రకేతు 
వారితో- : 


278 


ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


“పొందుగ గ్రామ్య పశుత్వము 

పొంది మహాశోకతమము పొందిన నాకున్‌ 
సుందర దివ్యజ్ఞానము 

జెందించిన వారి మిమ్ము జెప్పుడు తెలియున్‌.” 


అనును. 


“నీకు పుత్రుని ప్రసాదించిన అంగిరసుడను నేను. ఇతడు బ్రహ్మమానసపుత్రుడు. 


నారద మహర్షి” అని మరల జ్ఞానబోధము చేసెను. నారదుడు “రాజా, ఉపనిషద్గోప్య 
మగు మంత్రమును సప్తరాత్రములు పఠించువాడు సంకర్షణు డైన భగవంతుని 
జూచును. నారాయణు నాశ్రయించి యీ మోహము వదలి శీఘ్రముగా నుత్తమ 
పదవిని పొందుము” అని. మృతకళేబరమును జూచి “జీవుడా, ఈ దేహమున 
(బవేశించి, ఆయుశ్శేషము ననుభవించి, రాజ్యము చేయుచు బంధువులను 
సంతోషపెట్టుచుండుము” అనెను. 


ఆ బాలు డిట్లు పలికినాడు: 


“కర్మవశమున నెందు సుఖంబు లేక 

దేవ తిర్య జ్వ్వయోనుల దిరుగు నాకు 
వెలయనే జన్మమందునొ వీరు తల్లి 
దండ్రు లయినారు చెప్పవే తాపసేంద్ర! 
బాంధవ జ్ఞాతి సుతులును బగతు రాత్మ 
వరు లుదాసీన మధ్యస్థ వర్గములును 
సరవి గనుచుందు రొక్కొక్క జన్మమునను 
నెరయు బ్రాణికి నొకవాని నిజము కలది? 
సతు లెవ్వరు సుతు లెవ్వరు 

పతు లెవ్వరు మిత్ర శత్రు బంధుప్రియ సం 
గతు లెవ్వరు సర్వాత్మక 

గతుడై గుణసాక్షి యైన ఘను డొక్కనికిన్‌?” 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 279 


“నాకును మీకును నెక్కడి సంబంధము” అని బంధువులతో చెప్పి, వెడలిపోయెను. 


అందరు విస్మితచిత్తులై దుఃఖము మాని, శవమునకు యమునానది కడ 
నుత్తరకర్మములు నిర్వర్తించిరి. చిత్రకేతువు కాళిందిలో స్నానముచేసి నారదునివలన 
మంత్రోపదేశము పొంది, నియమపూర్వకముగా నారాయణ రూపమైన విద్యనారాధించి 
సప్త రాత్రానంతరమున విద్యాధరత్వమును, దివ్యవిమానమును పొందెను. 
నారాయణానుగ్రహమున త్రిజగములందును విమానమున సంచరించుచు, ఒకచోట 
అనంతుని దర్శించి, ఆయన బోధలు విని, భక్తి శ్రద్ధా సమన్వితుడై బహుకాలము 
దివ్యసుఖములతో వివిధ ప్రదేశములను వీక్షించుచుండెను. ఒకనాడు- 


ఆ విద్యాపుర భర్త కాంచె హర నీహారామృతాహాసమున్‌ 
శ్రీ విభ్రాజితమున్‌ నిరస్త గిరిజా సేవాగతాయాసమున్‌ 
దేవానీక వికాసమున్‌ శుభ మహాదేవాంఘ్రి సంవాసమున్‌ 
భూవిఖ్యాత విలాసమున్‌ త్రిభువనీపూతంబు కైలాసమున్‌. 


ఆ రజత భూధరంబున 

నీరేజ భవామరాది నికరము కొల్వన్‌ 
పేరోలగమున నుండిన 
గౌరీయుతుడైన హరుని గనియె... 


తన యూరుపీఠంబున నున్న భవానిని కౌగిట జేర్చుకొని యున్న పరమేశ్వరుని జూచి, 
చిత్రకేతుడు పకపక నవ్వి, దేవికి వినబడునట్లుగా నిట్లనెను: 


“కొమరొప్పగా లోక గురుడును, కడ లేని 
ధర్మ స్వరూపంబు తాన యగుచు 

జడలు ధరించియు సరి లేని తపమున 
పొడవైన యీ యోగి పుంగవులును 

(బ్రహ్మవాదులు కొల్వ భాసిల్లు కొల్వులో 
మిధున రూపంబున మెలతతోడ 


280 


ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


ప్రాకృతుండునుబోలె బద్ద్ధానురాగుడై 
లాలితుం డయ్యు నిర్లజ్ఞత నిట 


అకట, ప్రకృతి పురుషుడైన తా నేకాంత 
మందు సతులతోడ నలరు గాని 

ఇట్లు ధర్మసభల నింతులతో గూడి 
పరిఢవింపలేడు భ్రాంతి నొంది.” 


పరమేశ్వరు డా వాక్కులు విని నవ్వెను. భవానిమాత్రము కోపము చెంది, 
“భృగు నారద కపిలాదులు 

నిగమాంతజ్ఞాలును యోగ నిర్ణయ నిపుణుల్‌ 

త్రిగుణాతీతు మహేశ్వరు 

నగ రెన్నడు వారు ధర్మనయ మెరుగ రొకో! 


నీవు రాక్షసుడవై పుట్టుము. ఇకముందు మహాత్ముల నవజ్ఞ చేయకుము” అని 


పలికెను. చిత్రకేతుడు విమానము దిగివచ్చి దేవికి దండప్రణామములు చేసి, అంజలి 
ఘటించి, “జగన్మాతా, నీ శాప వాక్కుల నట్ల కైకొంటిని. నన్ననుగ్రహింపుము. 
శాపభయ శంకితుడను కాను. జగన్మాతవైన నిన్ను పరిహసించినందులకు 
వగచుచున్నాను” అని దండ ప్రణామములు చేసి, పార్వతీ పరమేశ్వరులను 
ప్రసన్ననులను గావించి వెడలిపోయెను. 


పిమ్మట పరమేశ్వరుడు పార్వతీ దేవితో- 


“అరయ చిత్రకేతు డతి శాంతు డతిలోక 

సముడు విష్ణుభక్తి సంగతుండు 

ఇతని నేమి చెప్ప? ఈశుండ నగు నేన 

ఉవిద, అచ్యుత ప్రియుండ జుమ్మి. 

కావున భగవద్భక్తుల 

భావమునకు విసయంబు పని లేదు” అన, నామె శాంతించెను. 


kkk 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 281 


సామాన్యముగా గృహస్థులకు సంతాన వాంఛ యుండును; అందులో రాజులకు 
చాల మెండుగా నుండుట సహజము. తన యనంతరము కుమారుడు రాజ్యమునకు 
రావలెననియు, తన సంతతి వృద్ధి నొంది శాశ్వతముగా దేశమును పరిపాలించుచుం 
డవలెననియు వాంఛ యుండును. అట్లే చిత్రకేతువు కూడా నభిలషించెను. అతనికి 
భార్యలెందరో యున్నను తుదకు అంగిరస మహాముని యనుగ్రహమున గాని 
సంతానము కలుగలేదు. కుమారుని కన్న రాణిమీదనే ప్రభువునకు ప్రీతి మిక్కుట 
మగును; అందుచే తక్కిన రాణులను అలక్ష్యము చేసి, ఆదరింపకుండుట 
సంభవించును. వారికి అసూయా ద్వేషములు జనించును. తమ కష్టమునకు 
కారణమేదో దానిని నిర్మూలించుటకు వారు ప్రయత్నింతురు. బాలుడు పోయిననే 
కాని ప్రభువునకు కృతద్యుతి యెడ ననురాగము హరింపదని, వారు బాలునకు 
రహస్యముగా విషయప్రయోగము చేయించిరి. బలీవర్ధములు పోరాడునపుడు లేగ 
_ నలిగిపోయినట్టు అమాయకుడగు బాలుడు కాలధర్మము చెందెను. 


ఏకపుత్ర మరణ విషయమున తండ్రి దుఃఖము వర్ణనాతీతము. అందునను 
లేక లేక కలిగినవాడు, వంశాకురము, భవిష్యత్రభువు నగువాని మృతి మహా దుః 
ఖప్రదము. కావుననే విద్వాంసుడయినను రాజు మిక్కిలి దుఃఖాక్రాంతుడాయెను. . 
బుషి వాక్కులవలన గాని ఆతనికి, ప్రబోధము కలుగలేదు. కొంతతడవు దుఃఖింపక 
తప్పలేదు. 

బుషి ప్రబోధముకూడ చాలినది కాదు. శృంగ గ్రాహిక న్యాయప్రకారము 
“జాతస్య మరణం ధ్రువ” మ్మను సూక్తిని జనన మరణ స్వభావమును నిరూపింపవలసి 
వచ్చెను. అందులకే బుషి కళేబరమున వదలినజీవము నాహ్వానించి, శరీరమున 
మరల ప్రవేశించి సుఖించి బంధువులను సుఖపెట్టుమని పలికెను. ఆ జీవి చెప్పిన 
మాటలు, చేసిన బోధ అందరకు నాశ్చర్యము కలిగించెను. తామెవనిని ప్రీతితో 
బెంచి పంచ ప్రాణములను వానిపై బెట్టి డేమించుచుండిరో అట్టి వాడే 
తూష్టింభావముతో విరాగవచనములు పలికినపుడు బంధువులకు గూడ విరక్తి 
కలుగును. అట్లే చిత్రకేతునకు వైరాగ్యము కలిగెను? ఆతడు క్రమముగా ప్రభావ 
సంపన్నుడాయెను. 


282. ఆం[్ర మవోభాగవతోవన్యానములు ' 


ఈ యుపాఖ్యానము ప్రధానముగా జనన మరణ స్వరూపమును ' 
నిరూపించును. 


“యధాప్రయాన్సి సంయాన్సి స్రోతో వేగేన వాలుకాః 
సంయుజ్యన్తే వియుజ్యన్తే తథా కాలేన దేహినః 


ఇక 
“యధా ధానాసు వైధానా భవన్తి న భవన్తి చ 
ఏవం భూతేషు భూతాని చోదితా నీశమాయయా.” 


ఈశ్వర మాయా చోదితులయి పుత్రాదిరూప భూతములు ప్రవర్తించుచుండునని 
తాత్పర్యము. . 

ఇంకొక విషయము గమనింపదగినది. విమ భక్తివరాయణులు 
అన్యదైవతములయెడ గూడ భక్తితో ప్రవర్తింపవలెనే కాని, అగౌరవముచూపరాదనియు, 
శివ కేశవ భేదము తత్త్వతః లేదనియు (గ్రహింపనగును. అంతటి మహాప్రభావ 
సంపన్నుడయ్యును చిత్రకేతువు పరమేశ్వరుని పరిహసించుటచే గౌరీ శాప దగ్గుడై, 
తుదకు వృత్రాసురుడై జన్మింపవలసి వచ్చెను. 


౭ 

సుయజ్ఞోపాఖ్యాము 

ఉశీనర దేశమున సుయజ్ఞు డను రాజు యుద్ధమున శత్రువులచే నిహతు 
డయ్యెను. అతని శవము చుట్టును బంధువులు, కాంతలు గుమిగూడిరి. భార్యలు 
బహువిధములు రోదనము చేయుచుండిరి. సాయం సమయమగుచుండెను. ఇంతలో 
యముడు (బ్రాహ్మణ బాలుని రూపమున నచటికి వచ్చి వారితో నిట్లనెను: “అజ్ఞులు 
యోగ వియోగములకు సుఖదుఃఖముల నొందుదురు. పుట్టినవాడు చనిపోవకుండునా? 
ప్రాణికోటి యెచ్చటబుట్టెనో యచ్చటికే పోవుట నైజము. మావంటివారము, ఒంటిగా 
నడవులలో తిరుగుచు వన్యమృగములబారి బడక బ్రదికి యున్నాము. గర్భమున 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 283 
థి 


మమ్ము పోషించినవాడే యడవులలోగూడ రక్షించుచున్నాడు. కాలకర్మవశమున 
భూతములు నిలుచును, పోవును. 


పాంచభౌతిక మైన భవనంబు దేహంబు 
పురుషుడు దీనితో పూర్వకర్మ 

వశమున నొకవేళ వర్తించు దీపించు . 
తరియైన నొకవేళ తలగిపోవు 

చెడెనేని దేహంబు చెడు గాని పురుషుడు 
చెడ డాతనికి నింత చేటు లేదు. 

పురుషునికిని దేహపుంజంబునకు వేరు 
గాని యేకత్వంబు కానరాదు 


దారువుల వెలుంగు దమనుని పై వడి 
కాయముల జరించు గాలి భంగి 

నాశ లీనమైన నభముచాడ్పున వేరు 
తెలియవలయు దేహి దేహములకు. 
ప్రాభవమున భూతపంచ కేంద్రియ మనో 
లింగ దేహములను లీల కూడు 

విడుచు నన్యు నొకడు విభుడు, దీనికి మీరు 
పొగుల నేల వగల బొరల నేల? 


బాంధవ్య మనునది మాయాగుణముచే దోచుచుండును. ఈ కథ వినుడు. 


అడవిలో పిట్టలను పట్టువాడు తన సాధనములను గొనిపోయి వల పన్ని 
అందు జిక్కుకొన్న పక్షుల గొంతులు నులిపి చిక్కములో బడవేయుచుండెను. ఒక 
యాడు పిచ్చుక వలలో చిక్కి చచ్చినది. దాని భర్త విలపించుచు బిడ్డల నెట్లు" 
పోషింప గలనని వాపోవు చుండెను. ఇంతలో కిరాతుడు బాణము విడువగా మన 
పిచ్చుక నేల వ్రాలెను. 


234 i ఆం(ధ్ర మహాభాగవతోవన్యానములు 


కావున మీ రెంత కాలము దుఃఖించినను రాజు మరలిరాడు.” 


బాలరూపధారి యైన యముని వాక్కులు విని వారు తెలివి తెచ్చుకొని దహన 
సంస్కారములు చేసి వెడలిపోయిరి. 


koksk 


ప్రియజన మరణము లోకములో దుస్సహము. భర్తలు మృతి నొందగా 
భార్యలు విలపించుట సహజము. వైధవ్యము మహా భయంకరము! ఇష్టలయినచో 
బంధువులుకూడ సత్యముగానే దుఃఖింతురు. రోదనమువలన కొంత భారము తగ్గును. 
మన వాజ్మయమునను, లోకములోను దుఃఖాభిభూతులకు ఆప్తులు విలపింపవలదని 
బోధించుచుండుట పరిపాటి. అట్లు చేయుట యొకవిధముగా సమంజసమే. దుః 
ఖమునకు అంత ముండవలెను. దుఃఖమగ్నులకు వివేకము నశించును. కావున 
బోధయుపక్తమగు చుండును. 


ఈ యుపాఖ్యానమున యముడు దయాలువై బాలరూపముదాల్చి వచ్చి, 
దుఃఖితులకు వివేకము కలిగించెను. వయోవృద్ధులు ధర్మపన్నములు పలుకుదురు. 
చిన్నవారు పలుకరు. ఇందు చిన్నవాడు పెద్దబోధ చేయుటలో విశేషమున్నది. 
పురాణములలో బాలురు వివిధ సంఘుటనలలోవివేకముతో ప్రసంగించుట 
గమనింపదగినది. ఒక్క ప్రహ్లోదుని దృష్టాంతము చాలును. బాలురు బోధ 
చేయుచుండగా పెద్దల కాశ్చర్యము లజ్ఞయు కలుగును. “ఇంతటి చిన్నవాడు 
సద్వాక్యములు పలుకుచున్నాడు. మనము పెద్దలమయ్యు, బాలునిచే చెప్పించుకొన 
వలసివచ్చినది” అని శాంతచిత్తులగుదురు. 

“జాతస్య మరణం ధ్రువమ్‌ అని యందరకును తెలిసినదే. అయినను తరుణము 
వచ్చినప్పుడు తప్పక బోధ చేయవలసినదే. సద్వాక్య విషయములలో “అసకృ దావృత్తిః 
' ముంబిదే. 'పీదైనను... 

“పధి స్థితం తిష్టతి దిష్ట రక్షితం 

గృహస్థితం తద్విహతం వినశ్యతి, 


ఉపాఖ్యానములు-అంతరార్థములు 285 


జీవ త్యనాధో పి తదీక్షితో వనే 
గృహే పి గుప్తో విహతో న జీవతి.” 


ఇందలి అవాంతర కథలోకూడ బోధ యున్నది. భార్య, భర్తయను బంధములో 
నున్నప్పుడు పిచ్చుకలవలె చచ్చుటయే సంభవించును. బంధమున ఛేదింపజాలనిచో 
మానవులుకూడ పిట్టలవలెనే యగుదురు. ఉత్తమ జాతిలో జన్మించినను లాభములేదు. 
చటక దంపతుల వృత్తాంత మీ యర్థమును సూచించును. 


హిరణ్యాక్షుడు మృతి నొందిన పిదప దుఃఖించుచున్న తల్లిని ఊరడించుటకై 
హిరణ్యకశిపుడు చెప్పిన దీ యుపాఖ్యానము. రాక్షసుడయ్యును కొంత వివేకము 
కలవాడు హిరణ్యకశిపుడు. పైన మహావీరుడు, మృత్యువును లెక్కచేయనివాడు. 
కాలగతిని, భాగధేయమును గ్రహించినవాడు. అట్టివాడు పలికెడి పలుకులలో 
సారముండుట సహజము. 


Kkk 


౮ 
అంబరీషోపాఖ్యానము 


అంబరీషుడు సద్గుణ గరిష్టుడు. అతడు సమస్త ప్రపంచమునకును ప్రభువయి, 
సత్పరిపాలనము, వైష్టవార్చనలు చేయుచుండువాడు. అశ్వమేధాది యజ్ఞము 
లెన్నియోచేసి, హరిధ్యాన పరాయణుడై, రాజ్య పరిపాలనము సలుపుచు నిర్లిప్తుడై 
యుండగా నొకనాడు భక్తవత్సలుడైన పురుషోత్తముడు అతనికి చక్రము ననుగ్రహించెను. 
అంబరీషుడు హరిని గూర్చి ద్వాదశీ వ్రతము వత్సరముపాటు చేసెను. ఆ వ్రతాంతమున 
కార్తిక మాసములో మూడురాత్రులుపవసించి, కాళింది నదిలో స్నానము చేసి, 
మహాభిషేక విధానమున మధువనములో హరి నభిషేకించి, విప్రోత్తములకు 
గోదానములుచేసి, సంతృప్తిగా భోజనము పెట్టించెను. అనంతరము ప్రభువు పారణ 
చేయదలచుచుండగా దుర్వాస మహర్షి అభ్యాగతుడుగా వచ్చెను. రాజాయనను 
పూజించి భోజనార్థము మంత్రించెను. మహర్షి స్నానార్థము కాళిందీ నదికి బోయి 
ధ్యాన నిమగ్నుడై తడవుచేసెను. ద్వాదశి రెండు గడియలు మాత్రము మిగిలియుండెను. 


286 ఆం(ధ్ర మవోభాగవతోవన్వానములు 


ద్వాదశి వేళ రాజు పారణ చేయక తప్పదు. మహర్షి రాలేదు. పారణ చేసినచో 
(బ్రాహ్మణాతిక్రమ దోషము కలుగును. కావున రాజు విద్వజ్ఞనులతో సంప్రతింప 
వారు అంబరీషునితో... 


“అతిథి పోయి రామి నధిప ఈ ద్వాదశి 

పారణంబు మాన పాడి కాదు 

కుడువకుంట కాదు కుడుచుటయును కాదు 

సలిలభక్షణమ్ము సమ్మతమ్ము.” 
అని ధర్మసందేహము పోగొట్టిరి. అంబరీషుడు నీరు పారణచేసి దుర్వాసునికై యెదురు 
చూచుచుండెను. 


కొంత తడవునకు దుర్వాసుడు వచ్చి రాజు చేష్టితము మనమున గ్రహించి, 
ఆగ్రహించి “ఈతడు విష్ణుభక్తుడు కాడు, దాంభికుడు. నన్నాహ్వానించి ముందు తానే 
పారణ చేసినాడు. ఈ దుష్కర్మునకు శిక్షచేసెదను” అని కేశపాశము పెరికి, దానితో 
“కృత్య” యనుశక్తిని నిర్మించి రాజుమీదికి వదలెను. ఆశక్తి భీకారాకారముతో, 
వివిధాయుధములతో రాజును సమీపించెను. అంబరీషుని రక్షించుటకై విశ్వరూపుడైన 
హరి చక్రమును బంపెను. అది వచ్చి కృత్యను సంహరించి, దుర్వాసుని వెంటబడెను; 
మహర్షి యెచటికి బరుగిడిన నచటికి వెంట నంటుచుండెను. ఆయన బ్రహ్మలోకమునకు 
జేరి “విధాత, విశ్వజనన వ్యాపార పారీణ, రేఖాలీలేక్షణ, కావవే, కరుణ చక్రంబు 
న్నివారింపవే” యని ప్రార్థించెను. బ్రహ్మ తన వలన కాదని వివరించెను. అంతట 
దుర్వాసుడు కైలాసమున కరిగి మహేశ్వరునికి విన్నవించెను. మహేశ్వరుడు మంచిబోధ 
చేసి, విష్ణువు నాశ్రయింపుమనెను. మహర్షి వైకుంఠమునకు జని... 


' “భక్తరక్షా పరతందత్ర, మానుపగదే చక్రానల జ్వాలలన్‌! 
నీ మహిమార్ణవమ్ము తుది నిక్కముగా నెరుగంగ లేక నీ 
ప్రేమకు వచ్చు దాసులకు క్రించుదనంబున నెగ్గు చేసితిన్‌ 
నా మరపున్‌ సహింపు మట నారకు డైన మనంబులో భవ 
న్నామము చింత సేసిన ననంత సుఖస్థితి నొందకుండునే?” 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 287 


అని వేడి పాదములు విడువకుండెను. నారాయణుడు బహుప్రకారముల బోధించి, 
అంబరీషునికడకు బోయి యతనిని సంతుష్టుని జేయు మని చెప్పెను. 


అంతట దుర్వాసుడు అంబరీషుని జేరి పాదములు పట్టుకొనెను. రాజు చరణ 
స్పర్శ్భమునకు జంకుచు హరి చక్రమును స్తుతించెను. | 


“ఏ నమస్మరింతు నింద్ర శాత్రవ ధూమ 
కేతువునకు ధర్మ సేతువునకు 

విమల రూపమునకు విశ్వదీపమునకు 
చక్రమునకు గుప్త శక్రమునకు! 

విహిత ధర్మమందు విహరింతు నేనియు 
ఇష్టమైన ద్రవ్య మిత్తునేని 

ధరణి సురుడు మాకు దైవతం బగునేని 
విఫప్రనకు శుభంబు వెలయు గాక! 
అఖిల గుణాశ్రయు డగు హరి 
సుఖియై నా కొలువువలన జోొక్కెడినేనిన్‌ 
నిఖిలాత్మమయుం డగుటను 

సుఖ, మందుం గాక భూమిసురు డివ్వేళన్‌!” 


ఇట్లు స్తుతింపగా చక్రము శాంతించి వెడలిపోయెను. 
దుర్వాసుడు రాజును కొనియాడుచు... 


“ఒక మా టెవ్వని పేరు కర్ణములలో నొయ్యారమై సోకినన్‌ 
సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్‌ సంభ్రాంతితో, నట్టి స 
త్సుకరున్‌ మంగళతీర్థపాదు హరివిష్ణున్‌ దేవదేవేశునిన్‌ 
అకలంక స్థితి గొల్చు భక్తులకు లే దడ్డంబు రాజాగ్రణీ!” 
యని పలికెను. 
రాజు మునిని పూజించి భోజనము పెట్టించెను. దుర్వాసుడు సంతృప్తుడై 
'బ్రహ్మలోకమునకు జనెను.. 


kkk 


288 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


“న ప్రాభూత్‌ యత్ర నిర్ముకో బ్రహ్మదణ్లో దురత్యయఃొ అప్రతిహతమైన బ్రాహ్మణ 
శాపము వర్తింపని అంబరీష మహారాజు చరిత్రను శుకుడు వర్ణించినాడు. 


హరిధ్యాన పరాయణుడు, వ్రతసేవానిరతుడు నగు రాజుకు నారాయణుడు 
చక్రము ననుగ్రహించెను. అదియే అతనిని సర్వదా కాపాడుచుండెను. 


అంబరీషుడు ద్వాదశి గడియలు గడవకముందే పారణ చేయవలసి యున్నది. 
కాలము గడచినచో వ్రతనిష్టా వ్యతిక్రమ మగుట నిశ్చయము. దుర్వాస మహర్షి 
ఆహ్వానము లేకుండ వచ్చిన అభ్యాగతుడు. పిలుపు లేక వచ్చినను “అభ్యాగతః 
స్వయం విష్ణుకి అనెడి భావనతో అంబరీషుడు సగౌరవముగా అప్పుడాహ్వానించినాడు. 
ఆహూతుడు సమయమునకు భోజనమునకు రావలెను. అట్లు రానిచో ఎందరో 
అతనికొర కెదురు చూచుచుండవలెను. వారందరును ఉపవాసము చేసినవారు. 
దుర్వాసునంతటి మవార్షి కొంత ఆలస్యము చేసినప్పటి కిని ఎల్లరును 
ప్రతీక్షించుచుండవలసినదే. కాని ద్వాదశి గడియలు దాటుచున్నవే. అప్పుడు 
అంబరీషుడేమి చేయవలెను? విద్యావినయ సంపన్నుడగుటచే నతడు ధర్మనిర్ణయము 
చేయజాలినవా డయ్యును ధర్మవేత్తలగు పెద్దలను సంశయము తీర్చవేడెను. వారును 
ధర్మనిర్దాయకు లగుటచే స్వగతము నుద్దాటింపక వేదవిహిత మగు విధానమునే 
యుపదేశించిరి. “అపో శ్నాతి, తన్నేవాశితం, నైవాశితమ్‌” అని (శ్రుతివాక్యము. 
బ్రాహ్మణులు (శ్రుతి ననుసరించిరి. 


“అంభసా కేవలే నాథ, కరిష్యే వ్రతపారణమ్‌ 
ఆహు రృక్షణం విప్రా నశికా నశితం చ యత్‌.” 


అను మనో నిశ్చయముతో రాజు సలిలము పుచ్చుకొనెను. దానివలన ధర్మహాని 
కాని, వ్రతహాని కాని కలుగలేదు. 


స్నానము చేసి దుర్వాసుడు ధ్యానినిష్టుడై యుండుటచే కాలహరణమయినది. 
ఆ విషయమాయన గమనించినట్లు తోచదు. తుదకు అంబరీషుని కడకు వచ్చి, 
దివ్యదృష్టితో పారణ సంగతి గ్రహించినాడు. బుషులలో చాలమందికి ముక్కుమీద 
కోపము. దుర్వాసుడు మహాకోపధారి. తోడనే మండిపడి, జట పెరిగి కృత్యను 
నిర్మించి అంబరీషుని మీదికి పంపెను. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 289 


కృత్య అభిచారిక శక్తి అగ్నిలో పుట్టినది. భీకర రూపముతో కృత్య రాజుమీదికి - 
బోవనుండగా చక్రము వచ్చి దానిని దహించి బుషి వెంట బడెను. కోపోద్రిక్తుడైనవానికి 
వివేకము తరుగును. తొలుత కృత్యను ప్రయోగించుటే దోషము. చక్రము వెంట 
బడినపుడు నమస్కారము చేసిన నెట్లుండెడిదో, తోచక బుషి భయవిహ్వలుడై 
పరుగెత్తెను. ప్రథమతః బ్రహ్మలోకమునకు బరుగెత్తెను. విష్ణునాభీకమలము నుండి 
జన్మించిన బ్రహ్మ విష్ణుచక్ర నివారణము తన కసాధ్యమనెను. అనంతరము బుషి 
సులభసాధ్యుడగు మహేశ్వరుని కడకు బోయి వేడెను. విష్ణువునకు అత్యంతాప్తుడగు 
మహేశ్వరుడు శక్తిసంపన్నుడయ్యు విష్ణువు సన్నిధికే పొమ్మని యుపదేశించెను. చివరకు 
దుర్వాసుడు నారాయణుని పాదములపై బడెను. శ్రీమన్నారాయణుడు 
సర్వశక్తిసంపన్నుడయినను భక్తజనులకు న్యూనత దా నిచ్చువాడు కాడు. కావున 
దుర్వాసునితో- 

“సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం హ్యహమ్‌ 

మ దన్యం తే న జానన్తి నా హం తేభ్యో మనా గపి, 

అతో హ్యాత్మాభిచార స్తే యతస్తం యాతు వై భవాన్‌ 

సాధుషు ప్రహితం తేజః ప్రహర్తుః కురుతే ౭. శివమ్‌” 


అని చెప్పి, అంబరీషునికడకే పొమ్మనెను. 


ఎంత శక్తిమంతుడయినను నిజశక్తిని నిష్మారణముగా ప్రదర్శింపరాదు. 
అందునను అనపరాధులు, సాధువులు నగువారల విషయమున నేమాత్రము 
చూపరాదు. మీదుమిక్కిలి అపకారమునకు దొరకొనరాదు. అట్లు ఆలోచితముగనో 
అనాలోచితముగనో చేసిన దుష్కార్యము ఎదురు తిరిగి వచ్చి బాధించును. 


అంబరీషుడు మహాభాగవతుడగుటచే తన కపకారము తలపెట్టినవానికి 
మనసులోనైనను ప్రత్యపకారము తల పెట్టలేదు. సమస్తము భగవదధీనము చేయుటచే 
స్వయంకర్త్శృత్వము మాని చక్రమునే వేడినాడు. అహంకార మనుచితము, సాధువృత్తి 
సముచితము. 


kkk 


290 ఆం(ధ మహాభాగవతోవన్యాసనములు 


డా 
బస్తోపాఖ్యానము 


అరణ్యములో మేక తిరుగుచు, కర్మవశమున నూతిలోనికి జారిన యాడు 
మేకను జూచి కామించి, తన కొమ్ములతో నూతి యొడ్డున కూలద్రోసెను. ఆడుమేక 
యీవలకు వచ్చి మగమేకను భర్తగా కోరెను. అజము సరే యని దానితో క్రీడించుచు, 
తన్ను కామించిన యాడుమేకల నన్నిటిని స్వీకరించి మత్తిల్లి వర్తించుచుండెను. నూతిలో 
నుండి వెడలదీసిన మేకను నిర్లక్ష్యము చేయగా, అది విచారించి, యుపాలంభనముచేసి 
విడిచి పోవుచుండ, మగమేక దాని వెంటబడి లోపరచుకొన జాలకుండెను. మేక 
యజమానుడు దాని కంగహాని కల్పించెను. అది క్రిందబడి విలపించి వేడుకొనగా 
బ్రాహ్మణుడు యోగవిదుడగుటచే లోపము తీర్చెను, అంతట ఛాగము మరల ఛాగితో 
క్రీడించుచు, ఎంతకాలమునకు విషయ సుఖమునుండి విరమింపలేదు. 

న 

- ఈ యుపాఖ్యానమును యయాతి తన భార్య యగు దేవయానికి జెప్పినాడు. 

ఏ స్థితిలో చెప్పినాడు? 

“స్రైశోపహ్నవ మాత్మనః బుధ్వా-” 
పశువువలె నయితినని యయాతి విచారించి, నవ్వుకొన్నాడు. 


“భుక్త భోగా మజాం హాస్యన్‌ 
అజవ ద్యృత్తి మాత్మనః 
విడంబయన్‌ ప్రియా మాహ 
నిర్వేదయితు మాత్మవాన్‌” 


నిర్వేదము కలిగిన పిమ్మటనే వివేకోదయ మగును. ఎంతకాలము కాంతాభోగ 
మనుభవించుచున్నను తనివి తీరదు. శరీరము జర్జరితమై మృత్యువు నావ్వానించుచున్నను 
విరతి తోపదు. కాని యే క్షణముననో భగవ దనుగ్రహముచేత మనస్సులోని 
యావరణము భగ్నమగును. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 201 


ఇందు అజా శబ్దము మేకను బోధించును. మేకకు కామమెక్కువ యని 
ప్రతీతి. యయాతియు అజవృత్తి నవలంబించి, హసించినాడు. ఇచ్చట అజా శబ్దము 
'అవిద్యాపరము. ' 


దేవయానియు బహుకాలము భోగము లనుభవించియుండుటచే ఉపాఖ్యాన 
వ్యాజమును గ్రహించి భోగవిరత యయ్యెను. బోధ చేసిన యయాతి విరక్తు డయ్యెనని 
వేరుగా చెప్పనక్కరలేదు. 


వ్య య వక 


అre) 
కుచేలోపాఖ్యానము 


శ్రీకృష్ణుని సఖుడైన కుచేలుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుడు, శాంతుడు, 
మానధనుడు, విజితేంద్రియుడు, బ్రహ్మవేత్త. బహు సంతాన ముండుటచే దారిద్యబాధ 
ననుభవించుచు, అన్యులను నీచముగా యాచింపక, తనంతన లభించిన కాసును 
బంగారు నాణెముగా తలపోయుచు, సంతృప్తి చెందుచు, నెట్లో యతడు భార్యను, 
బిడ్డలను పోషించుచుండెను. 


ఆతని భార్య అభిజాత్యము కల పతివ్రతాతిలకము. ఒకనాడు బిడ్డ లాకటిచే 
మలమల మాడుచు, అన్నము పెట్టుమని ఆకులు, గిన్నెలు జేత్ర బట్టుకొని వచ్చి 
చుట్టును జేరగా నామె మిక్కిలి దుఃఖించి, భర్త కడకు బోయి “పేదరికము నివారించు 
నుపాయ మూహింపకున్నావు- 

బాల్యసఖు డైన య ప్పద్మపత్రనేత్రు 

గాన నేగి దారిద్రాంధకారమగ్ను 

లైన మము నుద్ధరింపుము, హరి కృపా క 

టాక్షి రవిదీప్తి పడసి మహాత్మ, నీవు... 

వరదుడు, సాధు భక్తజనవత్సలు, డార్తశరణ్యు, డిందిరా 

వరుడు, దయాపయోధి, భగవంతుడు, కృష్ణుడు, తా కుశస్థలీ 


292 ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


పురమున యాదవ ప్రకరముల్‌ భజియింపగ నున్నవాడు, నీ 
వరిగిన నిన్ను జూచి విభు డప్పుడ యిచ్చు ననూన సంపదల్‌. 
కలలోనం దను ము న్నెరుంగని మహా కష్టాత్ముదైనట్టి దు 
రృలు డాపత్సమయంబునన్‌ నిజపదాబ్దాతంబు లుల్లంబులో 
దలపన్‌ తోడన మెచ్చి యార్తిహరుడై తన్నెన నిచ్చున్‌, సుని 
శ్చల భక్తిన్‌ భజియించువారి కిడడే సంపద్విశేషోన్నతుల్‌?” 


అని బోధించెను. కుచేలుడు సంతోషించి కృష్ణుని జూడబోవుట యిహపర సాధకమని 
తలచి, భార్యతో “నీవ చెప్పినట్లు చక్రపాణిని జూడబోయినపుడు రిక్తహస్తములతో 
జనక, కానుక గొనిపోవలెను గదా? ఏమున్నది?” అనెను. ఆమెన కొన్ని యటుకులు 
భర్త యుత్తరీయము కొంగున గట్టగా, నతడు గోవింద దర్శనోత్సహియై బయలుదేరెను. 
త్రోవలో నతనికి జంకు కలిగినది. 


ద్వారకా నగరములోని కెట్లు పోవుదును? అంతఃపురములోనికి బోవునెడల 
ద్వారపాలకు లడ్డగింతురు. వారి కేమి బహుమాన మీయగలను? ఎక్కడి విప్రడవు? 
ఇందులకేలవచ్చితివి? అన్న, నేమి చేయుదును? కృష్ణుడు నన్నుపేక్షింపడు. అతని 
చిత్తము, నా యదృష్టము” విత్మర్మించుచు బ్రాహ్మణుడు నగరములోను, క్రమముగా 
నగరిలోను ప్రవేశించును. వివిధ హర్యములను జూచుచు, తుదకొక మందిరమున 
స్త్రీలు చామరములు వీచుచుండగా భార్యతోకూడ కృష్ణుడు హంసతూలికాతల్పముపై 
గానబడెను. 


ఇందీవరశ్యాము వందిత సుత్రాము 
కరుణాలవాలు భాసురకపోలు 
హర్యక్ష నిభమధ్యు నఖిలలోకారాధ్యు 
ఘన చక్రహస్తు జగత్రశస్తు 
కౌస్తుభాలంకారు కామితమందారు 
సురుచిర లావణ్యు సురశరణ్యు 
ఖగకులాధిపయాను కౌశేయపరిధాను 
పన్నగశయను నబ్బాతనయను 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 293 


మకరకుండల సద్ఫూష మంజుభాషు 

నిరుపమాకారు, దుగ్గసాగర విహారు 

భూరిగుణసాంద్రు, యదుకులాంభోది చంద్రు 

విష్ణు రోచిష్టు జిష్ణు సహిష్ణు కృష్ణు 

కని దాయం జనునంత కృష్ణుడు దలత్కంజాక్షు డప్పేద వి 
ప్రని నశ్రాంత దరిద్రపీడితు, గృశీభూతాంగు, జీర్దాంబరున్‌ 
ఘనతృష్టాతురచిత్తు హాస్యనిలయున్‌ ఖండోత్తరీయున్‌ కుచే 
లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై డిగెన్‌ తల్పమున్‌. 


దిగి, యెదురు పోయి, బహువిధముల నాదరించి స్వాగతము పలికెను. 
రుక్మిణి చామరము వేసెను. శుద్ధాంత (స్త్రీలు ఆశ్చర్యము చెందిరి. 


కృష్ణుడు కుచేలుని చేయిపట్టుకుని, చిన్ననాడు గురుకులములోని సంగతులు 
కొన్ని జ్ఞప్తి చేసి “నీవు ఉత్తమవంశసంజాతను పెండ్లి యాడినా వనుకొందును. నీ 
మనస్సు ఐహిక విషయములందు లగ్నము కానట్టుతోచుచున్నది” అనెను. అనంతరము 
లోక సంగ్రహమును గూర్చియు, గురు మహిమను గురించియు సంభాషించి “ఒకనాడు 
గురుపత్నీ నియోగమున ఇంధనార్థ మడవికి జని జడివానలో తడిసి, రే యెల్ల నచట 
గడపినాము. ప్రాతఃకాలమున మన గురువు సాందీపని వెదకి వెదకి మనను కనుగొని, 
యూరడించి నిజమందిరమునకు గొనిపోయిన సంగతి జ్ఞప్తియున్నదా?” యని కొంత 
ప్రసంగించి, “నీవు వచ్చునపుడు నా కేమియుపాయనము తెచ్చితివి? 

దళ మైన పుష్ప మైనను 

ఫల మైనను సలిల మైన బాయని భక్తిం 

గొలిచిన జను లర్చించిన 

నెలమిన్‌ రుచిరాన్నముగనె యేను భుజింతున్‌.” 


అనునప్పటి కుచేలుడు మోమోటమిచే అటుకు లీయనేరక తలవంచుకొని మిన్నకుండెను. 
కృష్ణభగవానుడు బ్రాహ్మణుని స్థితిగతులు దివ్యచిత్తమున గ్రహించి ముడివిప్పి, 


294-' ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


అటుకులు గుప్పెడు తీసికొని తిని, మరియొక గుప్పెడు తీసికొన బోవగా రుక్మిణి 
భర్తచేయి పట్టుకొని వారించెను. కుచేలు డారాత్రి గోవిందుని మందిరమున వివిధ 
రుచ్య పదార్ధములు భుజించి, మృదుశయ్యాతలమున నిద్రించి, అరుజోదయమున 
లేచి కాల్యవిధులు నిర్విర్తింప, కృష్ణుడతనిని కొంత దవ్వు పంపెను. త్రోవలో విప్రడిట్లు 
తలపోసెను. “పురుషోత్తముని దర్శించితిని. నా జన్మము ధన్యమయినది! సోదరునివలె 
నన్ను కృష్ణుడు బహువిధముల నాదరించినాడు. 


శ్రీనిధి యిట్లు నన్ను బచరించి ఘనంబున, విత్త మేమియు 
న్నీని తెరంగు గానబడె నెన్న దరిద్రుడు సంపదంధుడై 
కానక తన్ను జేర డని కాక, (శ్రితార్తిహరుండు సత్భపాం 
బోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నొనరింప కుండునే?” 


ఇట్లు తలపోయుచు నిజపురము జేరి, మహాసౌధమును గాంచి ఎవరిదో 
యనుకొనుచుండగా దివ్య వనితలవంటి తెరవలు గీతనృత్త వాద్యములతో నతనిని 
అంతిపురిలోనికి గొనిపోయిరి. దివ్యాంగనవలె నానందముతో కలకలలాడుచున్న 
నిజ భార్యను గాంచి యతడు సంతసించి, హరిలబ్ధ వైభవము లనుభవించుచు 
మనోవికారములేక హరిధ్యాన పరాయణుడై యుండెను. 


జీవేశ్వరులేకముగా నున్నను వారిని గూర్చి శ్రుతి యిట్లు.చెప్పుచున్నది: 

ద్వా సుపర్ణ సయుజా సఖాయా 

సమానం వృక్షం పరిషస్వజాతే! 

తయో రన్యః పిప్పలం స్వా ద్వత్తి, 

అనశ్న న్నన్యో అభిచాకశీతి. 

కుచేలుడు జీవుడు, కృష్ణుడు ఈశ్వరుడు. జీవేశ్వరులకు తత్త్వతః భేదము 
లేదు. అయినను సంసారిత్వమువలన బ్రహ్మమునకే జీవత్వవ్యవ దేశము 
సంభవించుచున్నది. పార్థివ శరీరమున బ్రవేశించిన పిదప జీవుడు కించిజ్ఞుడనినయు, 
ఐశ్వర్యహీనుడ ననియును భావించును. సంసారి యగుటచే బుద్ధి తాద్యాము నొంది, 
స్వస్వరూపమును మరచి అనైశ్వర్యమునే పొందును. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 295 


కుచేల జన్మమునకు పూర్వము జీవుడు లౌకికైశ్వర్య మదమత్తుడై ఐహిక 
భోగముల ననుభవించుచు నారాయణ పరాయణత్వమును విసర్జించెను. 
దుష్మర్మాచరణమునకు ప్రతిఫలము వివిధ బాధారూపమున నుండును. కుచేలుడు 
జన్మతః దరిద్రుడు. కుచేల మనగా జీర్ణవస్త్ర్రము. ఇక్కడ వస్త్రము లౌకిక భోగములకు 
సంకేతము. కుచేలమయినపుడు దారి(ద్యచిహ్నమే. 


“ద్రరిదాయ కుటుంబితా”. ధనహీనులకు సంతానము మెండు. కుచేలునకు 
మొత్తము ఇరువది యేడుగురు బిడ్డలు కలిగినట్లు ఒకచోట గానవచ్చుచున్నది. 
సర్వవిధముల సమర్థత యున్నను, బహుసంతానము వలన బాధలు తప్పవు. అందులో 
తాను భరింపలేని బిడ్డలను గనుట దరిద్రునకు తగనిపని. బిడ్డలకు గుడ్డలు తగినవి 
ఈజాలకపోవుట యటుండ, కడుపునిండ అన్నమైనను పెట్టజాలడు. కావుననే కుచేలుని 
సంతానము ఆకలి చిచ్చుచే మాడుచు పట్టెడోగిరము పెట్టుమని యడుగుట 
సంభవించెను. ఆ వ్యధ భరింపలేక యొకనాడు అతని భార్య దారిద్ర్య నివారణమున 
కుపాయ మూహింపవలసినదని కోరినది. అంతవరకు నతనికి ఈ విషయము 
తోచనే లేదు. 


అందులో ఆభిజాత్యము! తనయంత లభ్యమయినదే పుచ్చుకొను గాని అతడు 
యాచన చేయడు. ఎట్లో కుటుంబ పోషణము చేయుచుండెను. అట్టివాడు ఏదో 
మందముగా నుండును. నిగ్రహము లేక బహుసంతానము కన్నను, అతని కొక 
గొప్ప సుగుణ మున్నది. అది నిరంతర హరిధ్యాన పరాయణత్వము. 

ఆప్రోపదేశము లేకుండ ఉత్తమ కార్యాచరణ ప్రారంభము కానేరదు. అతని 
భార్య యొకనాడిట్లు చెప్పినది: 

“నను, బ్రహ్మన్‌, భగవత సఖా సాక్షాత్‌ శ్రియః పతేః 

బ్రహ్మణ్య శ్చ శరణ్య శ్చ భగవాన్‌ సాత్వతాం పతి$ి 
ఇందలి శబ్దములు సార్థకములు. ఇదియే ఉపదేశమయ్యెను. దుష్కర్మ వేష 


ముండుటచేతనే అప్పటికిని పెద్దమ్మవారు ఏవో సంశయములు కలిగించినది. గోవింద 
దర్శనోత్సాహిత్వము రక్షించినది. 


296 . ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


లీలామానుష విగ్రహుడైన కృష్ణభగవానుని ప్రవర్తనము, సంభాషణము 
సంస్తవనీయములు. తాను భగవదవతారుడైనను లోక సంగ్రహార్థము శ్రీకృష్ణుడు 
అతిథినెట్లు సత్మరింపవలెనో, బాల్యసఖునెట్లు సంభావింపవలెనో లోకమున 
కొజ్జబంతివలె నిరూఢము చేసినాడు. కుచేలుడు అంతిపురము లోనికి బోయి, 
మరునాడుదయము కృష్ణునివద్ద సెలవు తీసికొని పోవువరకును వర్ణితమైన ఘట్టము 
మధురాతి మధురము! 


మథురానాథుడగు మాధవుడే అట్టి చర్య చేయగలడు. అట్టి వాక్కులు 
పలుకగలడు! 


పరమేశ్వరానుగ్రహమువలన కుచేలుని దౌర్భాగ్యము తొలగిపోయినది. క్షణ 

లేశములో ఆతని పురములో నమస్త నంవదలు సమకూడి అతనికై 

యెదురుచూచుచున్నవి. అయినను త్రోవలో నున్న కుచేలున కా విషయము తెలియదు. 

శ్రీనిధి తన్ను సర్వవస్తు పరిపూర్ణుని చేయలేదనియు, అట్లు చేయకుండుటకు కారణము 

' సంపదంధుడు భగవానుని విస్మరించుననియు తలలపోయుట ఆతని యదృష్టమునకు 
సూచనయే. 


ఆప్తోపదేశమువలన వివేకోదయ మయినది. పరమేశ్వరానుగ్రహము వలన 
నిజస్థితి- అనగా ఐశ్వర్యము లభ్యమయినది. అప్పుడు భగవానుని యెడ భావము 
దృఢతమ మగును. ఇంటికి జని కుచేలుడు సంపద లనుభవించుచున్నను మనస్సు 
భగవానునియందే లగ్నము చేసి యుండెను. 


భూభారము హెచ్చి, వసుంధర గోరూపధారిణియై బ్రవ్మాదులను తరచుగా 
ప్రార్థించినట్లు పురాణముల వలన తెలియుచున్నది. భూభారమనగా జనబాహుళ్యము. 
ప్రాచీనకాలమునుండియు భరతవర్షమునకే కాక ప్రపంచమునకే యికృట్టు 
తెచ్చుచున్నది. ప్రజ సంతాన నిరోధకము చేసినగాని ప్రపంచము బాగుపడదు; 
లోకమునకు కుచేలత్వము తొలగదు. 


గ 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 297 


Ie) 
పింగళోపాఖ్యానము 


విదేహ నగరములో పింగళ యను స్వైరిణి కలదు. అనుదిన మామెకడకు 
విటులు వచ్చి తగు ధనమిచ్చి, సంతోషముతో వెడలిపోవుచుందురు. ఇట్లు కొంతకాలము 
గడచెను. ఆమె ఒకరాత్రి వాకిలిగుమ్మముకడ సరసులకొరకు వేచియుండెను. చాలతడవు 
ప్రతీక్షించినను ఎవ్వరును రాలేదు. కొంతసేపటికి సుందరుడొకడు కానవచ్చెను; 
కాని యతడును పింగళ యింటిలోనికి బోవలేదు. ఆమె లోనికి బోవుచు వీధిగుమ్మము 
కడకు వచ్చుచు నెన్నోసారులు తిరిగి శ్రమబడెను. ఇంతలో నర్ధరాత్రమయ్యెను. ఆమె 
యా సంగతి గ్రహించి, రిచ్చపా టొంది విరక్తచిత్తముతో లోనికి బోయి పండుకొనెను. 
ఒక్క క్షణములో నామె మనసు నుండి యావ తొలగెను; జ్ఞానోదయముకూడ 
నయ్యెను. 


అప్పుడామె- 
“ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్‌” 


అనెను. ధనము వెచ్చించి తన యౌవనము హరించిపోవు నాయకులయెడ 
హేయభావము, తన్ను విడువని మనోనాయకుడగు అచ్యుతుని యెడ భక్తియు, 
నామెలో నంకురించెను. తోడనే యామె సుఖముగా నిద్రపోయెను. (సుఖం సుస్వాప 
పింగలా.) 


ఈ యుపాఖ్యానమును అవధూత యదుసంవాదములోనిది. అవధూత 
కేవలము దత్తాత్రేయుడే యని కొందరన్నారు. ఆయన సంభాషణలో తనకు పలువురు 
గురువులున్నారనియు, అందు పింగళయు కలదనియు పలికెను. మహానుభావుడగు 
దత్తాత్రేయుడు సామాన్యనను గురుభావముతో దలచుట మిగుల నాశ్చర్యజనకము. 
కాని- 

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని 

శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః” 


298 ఆంధ్ర మవోభాగవతోవన్వానములు 


అనునట్లు భేదబుద్ధితో నుండక, బాలా దపి సుభాషిత మ్మను విధమున మంచిని. 
(గహించుచుందురు. 


ధనలోలుపయు, విటలోలుపయు నగు స్వ్వైరిణికి క్షణలేశములో నిట్టి 
విరక్తియు, భక్తియు కలుగుటకు కారణము పరమేశ్వరానుగ్రహమే. కావున ప్రతి 
జీవియు ఆశను విసర్జింపవలెను. అదియే సకల దుఃఖములకును, మూలము. 
కాంతా కనకముల మీది యాశ విడువనివారలకు హృదయోన్మీలన మెట్లగును. 
ఆశను ఖడించునది నైరాశ్యమే. 

“నిర్వేద ఆశపాశానాం పురుషస్య యథా హ్యసి 

న హ్యంగా, జాత నిర్వేదో, దేహబంధం జిహాసతి.” 

ఈ యుపాఖ్యానము సంస్కృత భాగవత గృహీతము. ఆంధ్ర భాగవతమున 
ఏకాదశ స్మంధములో పింగళ సూచన మాత్రము కలదు. 


న్యం 


(2.౨ 
మార్శండేయోపాఖ్యానము 


బ్రహ్మచర్య వ్రతము నవలంబించి మృకండు మహాబుష్కి నారాయణ 
ధ్యానపరాయణుడై తపస్సు చేయుచుండగా నతనికి హరిహరులు ప్రత్యక్షమై వరము 
. కోరుమనరి. గుణగణాఢ్యుడయిన కుమారు ననుగ్రహింపుడని యతడు వేడగా, వారు 
మంచిదని, కోరిన వరమొసగి యంతర్జాన మొందిరి. పిమ్మట బుషికి మార్మండేయుడను 
కుమారుడు కలిగి, నియమ నిష్టాగరిష్టుడయి యుండెను. మృత్యువు వచ్చి తనను 
పాశబద్దుని జేయగా మార్కండేయుడు మృత్యువును ధిక్కరించి పదివేల సంవత్సరములు 
తపస్సు చేసెను. అందుల కింద్రుడు భయపడి, మార్మండేయుని తపోభంగము చేయుటకై 
దేవాంగనల నంపెను. వారు బహువిధ ప్రలోభములు చూపినను జటావల్మలధారియై, 
అగ్నిహోత్రునివలె నున్న ముని చలింపలేదు. దేవాంగనలు వెడలిపోయిరి. 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 200 


అతని తపస్సునకు మెచ్చి హరి ప్రత్యక్షము కాగా, మార్కండేయుడు “దేవా, 
సి దివ్యనామ స్మరణంబునం జేసి యీ శరీరంబుతోడనే యనేక యుగంబులు నేను 
బ్రదుకునట్లుగా జేయవే” యని వేడుకొనగా శ్రీహరి యటులే యనుగ్రహించిన, తన 
మాయా స్వరూపమును వివరింపుమని ప్రార్థించిన బుషికి ఆ విషయము తెలిపి 
యంతర్భానమయ్యెను. 


అనంతరము మార్మండేయుడు శివపూజచేయుచు, హరి స్మరణము మరచెను. 
వేభంములు బవుకాలము వర్షింవగా ధరాతలము జలమయము, 
అంధకారబంధురము నయ్యెను. జలమధ్యమున వటపత్రము పై పద్మరాగ ప్రభలతో 
వెలుగుచున్న పాదములుకల బాలుని గాంచి మార్మండేయుడు నమస్కరించి, యతని 
జరరాంతమున సంచారము చేసి చేసి, బాలుని చరణ సంస్మరణమువలన వెలువడి, 
యతనిని కౌగిలింపబోయెను. బాలుడంతర్జానము నొందెను. ముని యథాప్రకారముగా 
నిజాశ్రయము చేరి తపస్సుచేయజొచ్చెను. శాంకరీసమేతుడై శివుడు ధరణిమీదికి 
దిగెను. అన్యమేమియును గానక యేకాగ్రచిత్తుడై యున్న ముని హృదయమున 
శివుడు నిజయోగ మాయాప్రభావముచే టబ్రవేశించి, స్వస్వరూపమును జూపెను. 
మార్మండేయుడు పరమేశ్వరుని బహు ప్రకారముల స్తుతించెను. నీవు పరమశైవుడవని 
మహాదేవుడనుగ్రహించెను. మార్మండేయుడు “దేవా! భవత్సందర్శనమున విష్ణుమాయా 
ప్రభావ మెరుగనయ్యెను. నాకు నారాయణచరణ ధ్యానము, మృత్యుంజయము 
కలుగునట్లు అనుగ్రహింపవలె” నని ప్రార్థించెను. “నీకు జరా, రోగ, వికృతులు లేక 
కల్పకోటి పర్యంత మాయువు, పురుషోత్తముని యనుగ్రహము కలుగు” నని 
మహేశ్వరుడంతర్థానమొందెను. 

Kkk 

“ప్రాకృతిక నైమిత్తక ప్రళభయములలో నెవ్వరు నుండుటకు వీలులేదుకదా? 
అట్టియెడ మార్మండేయుడు సప్తకల్పముల నెట్లు చూడగలిగెను?” అని శౌనకుడు 
సూతు నడిగెను. అతడిట్లు చెప్పెను: 


“మాయ అనాది సమస్త బీజ సమాహార రూపమే మాయ. అన్ని కల్పములును 


300 ఆంధ్ర మవోభాగవతోపన్యానములు 


మాయలో వాసనా రూపమున నుండును. “అఘటన ఘటనా పటీయసీ మాయా, 
అని ప్రసిద్ధమే కదా? కావున మార్మండేయుడు మాయా ప్రదర్శనమునే చూచి భ్రాంతి 
నొందినాడని గ్రహింపవలను.” 


మార్కండేయుడు చిరంజీవులలోనివాడు. చిరంజీవి యన్నంత మాత్రమున 
ప్రళభయకాలమునగూడ నుండువాడని తలపరాదు. ప్రక్రయమున సమస్తములయింపక 
తప్పదు. ఈ యర్థమును బోధించుటకై యీ యుపాఖ్యానము ప్రవృత్తమయినది. 


భాగవతమున మార్మండేయుడు మృత్యువును ధిక్కరించెనని కానవచ్చుచున్నది. 
పురాణాంతరములో నతడు మృత్యుంజయుని శరణు జొచ్చెననియు, మహేశ్వరుడు 
మృత్యువును వారించి, భక్తుని రక్షించి పదునారేండ్లు వయస్సు మాత్రముండునట్లును, 
చిరంజీవి యగునట్లును అనుగ్రహించెననియు తెలియవచ్చుచున్నది. 


మార్మండేయుడు శివపూజ చేయుచు, హరి స్మరణము విడిచెను. తత్త్వతః 
విచారించినచో శివ కేశవులకు భేదము లేదు. శివ సాక్షాత్మారము వలన విష్ణుమాయా 
(ప్రభావము గ్రహించి, మార్కండేయుడు మరల నారాయణ చరణధ్యానము కలుగునట్లు 
వేడినాడు. దీనివలన హరిహరాద్వైతము సూచితమగుచున్నది. 


న 


6€ఎఎల 
ఉపసంహారము 


శ్రీమద్భాగవతము విష్ణు భాగవతమనియు, విష్ణు భక్తిచే మోక్షము 
కలుగుననియు కొందరనుచున్నారు. విష్ణు శబ్దము సర్వవ్యాపియగు శుద్ధ బ్రహ్మ 
చైతన్యమునే సూచించుననియు, శుద్ధమైన అద్వైత తత్త్వమునే శ్రీమద్భాగవతము 
బోధించుచున్నదనియు మరికొందరనుచున్నారు. 
జన్మా ద్యస్య యతో న్వయా దితరత శ్చార్ధే ష్వభిజ్ఞ స్స్వరాట్‌ 
_ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యన్తి య త్ఫూరయః 
తేజో వారి మృదాం యధా వినిమయో యత్ర త్రిసర్లో మృసా 


ఉపాఖ్యానములు -అంతరార్థములు 301 


ధామ్నా స్వేన సడా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. 

ఈ శ్లోకము ప్రక్షిప్తము కాదని యంగీకరించిన పక్షమున శ్రీమద్భాగవత 
కారుడగు కృష్ణదైపాయన వ్యాసుడు పీఠికలోని యీ శ్లోకమున బ్రహ్మ తటస్థ 
.లక్షణమును కంఠోక్తిగా సూచించినాడు. కావ్య ప్రారంభములో “మనా క్కావ్యార్థ 
సూచనమ్‌” అన్నట్లే, ఉత్తమ గ్రంథోపక్రమములో తాత్పర్య బీజముండును. 


బ్రహ్మసూత్రములను బాదరాయణుడు కాక కృష్ణదై ప్వైపాయనుడే నంతరించెనని 
యంగీకరించుచో “జన్మా దస్య యతకి అను బ్రహ్మసూత్రములో తటస్థ లక్షణమును 
చెప్పినట్లు స్పష్టమగుచున్నది. భాగవతాంతర్గత దశమ స్మంధమున 87వ అధ్యాయమున 
శ్రుతిగీతోపాఖ్యానమును శుద్దాద్వైత తత్త్వ ప్రతిపాదనమునకు తార్మాణముగా 
గ్రహింపవచ్చును. 
"పురాణము సముచ్చయము. “వేదార్థ ముపబ్బంహయేత్‌” అని ఆర్యోక్తి. 
వేదాశయము “ఏకం సత్‌ విప్రా బహుధా వదన్తి.” బ్రహ్మ మద్వితీయ మయినను 
“సో కామయ త బహుస్యాం ప్రజాయే యేతి” అనుటవలన నామరూపాత్మకమైన 
సృష్టి వ్యాప్తమయినది. పురాణ సముచ్చయము వేదార్థ విజృంభణము చేయునన్నచో 
భాగవత పురాణము కూడ చతుర్వింశత్యవతారములను, వివిధేతిహాసములను, 
ఉపాఖ్యానములను వర్ణించినను, నిత్య శుద్ధ బద్ధముక్తస్వభావమైన అద్వితీయాఖండ 
బ్రహ్మతత్త్వమునే నిరూపించినదని గ్రహింపదగును. | 


తత్సద్రహ్మార్చణమస్తు 


@ 


Bs 
ta 








ఆంధ్ర 
మహాభాగవతోపన్యాసములు 


వాసుదేవ తత్త్వము - అవతారములు - 
భాగవత వైష్ణవము 


శిరోమణి 
శ్రీ వేడాల తిరువేంగళాచార్యులు 








వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము | 305 


యోగిసంఘమునకు నుత్తమ వ్రతములు, 
వాసుదేవ నామవర్ణనములు 


వాసుదేవుడు పరమార్ధమగు తత్త్వము, ఆ భగవానుని దివ్యములగు గుణ 
గణములను వ్యక్తపరుచు దివ్య చరిత్రము శ్రీమహాభాగవతము. పరమపురుషుని 
గుణగణానుసంధానము సకల శుభముల నొనగూర్చునుగదా! ఆ కారణముననే 
తెనుగువారిమీద మిక్కిలి కృపతో పరమ భాగవతోత్తముడగు శ్రీబమ్మెర పోతనామాత్యుడు 
ఆభాగవతమును తెనుగున రచించి తెనుగు లోకమునకంతకును భుక్తిముక్తులను 
సమకూర్శెను. ఆ మహానుభావుని వదనారవిందమునుండి వెల్వడిన కవిత మరందధార. 
దాని బిందువులు పద్దెములు. అవి మధుర భక్తిని, మధుర రసభుక్తిని మధుర 
రసభుక్తిని కల్గించుట తెనుగు లోకమున కంతకును అనుభవ పునరుక్తమే. భక్తిరస 
ప్రవాహ మామహనీయుని కవితాధారగా, '్రవన్తిగా బ్రవహించినది. అందవగాహన 
మొనరించువారికి సంసార మలపంకము నుండి ముక్తి కల్లుటయు మొదటినుండి 
యున్నదే. అసలీ మహాభాగవతమునకు లోక ప్రచారమును సమకూర్చిన మొదటి 
యధికారి శ్రీపరీక్షిత్తు, విష్ణురాతుడు ఈ ముక్తిభాగ్యము ననుభవించెనుకదా! ఈ 
తీరు గొప్పదనము గల యీగ్రంథమును మహానుభావుడగు మన పోతన్నగారు 
తెనుగొనరించుట మన తెనుగు లందరి యదృష్టమును బంగారుపూవుల బూచి 
ఫలించుటయే. తెనుగునాట నన్ని గ్రంథములకన్న నీపోతన్నగారి వదనారవింద 
మరందధారకే ప్రచార మధికము. దీనివలన నాప్యాయన మొందని యూరు 
తెనుగునాట నుండదనుట యతిశయోక్తి కాదు. అక్షరాస్యుడైన యేతెనుగువాడును 
ఈమరందధారలోని బిందువు నొకదానినైన స్వీకరించి అనుభవింపకుండ నుండడు. 
నా చిన్ననాటి పెద్దలందరును తెల్లవారుజాములవుడు మన మహనీయుని 
భాగవతములోని- 


“నీ పాదకమల సేవయు 
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితా 


306 ఆం(ధ్ర మహోభాగవతోవన్యానములు 


న్తాపార భూతదయయును 
తాపసమందార నాకు దయసేయగదే” 


అను పద్యమును, గజేన్హమోక్షము, రుక్మిణీ కళ్యాణములతోబాటు తమ పిల్లలకు 
జెప్పుచుండువారు. తాము నిత్యము ననుసంధించుచుండువారు. 

“విద్యావతాం భాగవతే పరీక్షా” యన్నట్లుగా ననేకములగు వ్యాస పరాశర 
ఘట్టములతో నిండియున్న యీమహాగ్రంథమును భేదించుట కెంతటి పాండిత్యము 
సహజముగా నుండవలెనో విద్వాంసులు మాత్రమే గుర్తింపగల్గుదురు. సహజ 
పాండిత్యముతో దండిగా నుండిన మన యీపోతన్నగారే యీ(గ్రంథమును గూర్చి- 


“భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు శూలికైనం దమ్మిచూలికైన 
(1-17) 


అని యన్నారు. 


నిజమునకు బై యర్దతను దలంచికొని గర్వించెనేని అతడీనాటివణకు నింతటి 
లోకపూజ్యపదము నొందగలడా? విను డా మహానుభావుడే యీతీరు సందర్భమున 
నెట్లు ప్రహ్లాదుని ద్వారమున దెల్పెనో? 


“అమలజ్ఞానత, దానధర్మరతి, సత్యక్షాంతి నిర్మత్సర 

త్వముల౯, యజ్ఞ తపో 9_నసూయల గడు౯ దర్పించు ధాత్రీసురో 
త్రముకంటె౯ శ్వపచుండు ముఖ్యుండు, మనోం_ర్థప్రాణవాక్కర్మముల్‌ 
సమతన్‌ నిన్ను నయించెనేని నిజవంశ శ్రీకరుండౌ దుదిన్‌.” (7-851) 


అసలు ఈ భాగవతపు సాంప్రదాయమే అట్లు నడచుచున్నది. పరమ 
దుర్భేద్యమైన రహస్యామ్నాయమగు నీ మహాగ్రంథము భాగవతమును ప్రథమోప 
దేశకుడగు శ్రీ శుకమహార్షియగు నారద, వ్యాసాది విబుధ సంప్రదాయమువలన 
- విన్నంత, కన్నంత, దెలియవచ్చినంతయేకదా పరమ భాగవతా గ్రగణ్యుడగు పరీక్షిత్తునకు 
దేటపరచినాడు! ఇంకను కొంత వెనుకకు పరిశీలించినచో వ్యాసుడు, నారదుడునుగూడ 
నిట్టివారే యని తెలియవచ్చును. ఈమహాభాగవతము నెరిగినవారు “తమవరకే అది” 


వాసుదేవ తత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము 307 


అని యూరకొనకుండ సర్వార్థ సాధకమును, సకల దురన్త దుస్తర దుఃఖ 
నిస్తారకమునునగు నీ గోవింద కథాసుధారసమును పరులకు- సంసార దుః 
_ఖాంబుధిమగ్నులకు వినయ నమభావముతో దమంత దామే కోరి (1౭f:2-260) 
తేటపరచుట అత్యవశ్యకర్తవ్య మను విధి ఇందువలన బోధితమగుచున్నది. లేనిచో 
సకల నిరపేక్షులగు సంకర్షణ, సనత్ముమార, నారద, బృహస్పతి, పరాశర, వ్యాస, 
శుకాదులు ఈమహావిషయమును లోకములోనివారి కేల యుపదేశింప తమంత 
వత్తురు? అధవా- సనందనాది విష్ణురాతునివరకున్న ఉపదేశ్యులు కూడా 
నుపాయాన్తరముల బ్రవర్తింపక “ఇదియే కావలెను” అను నాసతో ఏలబ్రవర్తించిరి? 
ఈభాగవతము నుపదేశింపగల యుపదేశకుల యాగమనమునే విష్ణురాతాదు లేల 
యాశించిరి? వినుడు సమాధానమును: 


సీ “శ్రీమంతమై మునిశ్రేష్టకృృతంబైన భాగవతంబు సద్భక్తితోడ 
వినంగోరువారల విమలచిత్తంబులం జెచ్చెణి నీవుండుచిక్కుంగాక 
ఇతర శాస్త్రంబుల నీశుండు చిక్కునే? మంచివారలకు నిర్మత్సరులకుం 
గపటనిర్ముక్తులైకాంక్ష సేయక యిందుందగిలియుండుట మహాతత్త వబుద్ధి. 


పరంగ నాధ్యాత్మికాది తాపత్రయంబు 
నడంచి వరమార్థభూత మై యఖిల సుఖద 
మై సమస్తంబు గాకయు నయ్యునుండు 
వస్తు వెణుగంగందగు భాగవతమునందు.” (1-34) 
అంతేకాక 
“వరగోవింద కథా సుధారస మహావర్నోరుధారాపరం 
పరలంగాక బుధేన్రచంద్ర! యితరోపాయాను రక్తిం బ్రవి 
స్తర దుర్దాన్త దురంత దుస్సహ జనుస్సంభావితానేకదు 
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలంబాజునే.” 
కనుకనే 


“నలిన నయన భక్తి నావచేగాక సంసార జలధిదాటి చనగరాదు 
వేయునేల మాకు విష్ణుప్రభావంబు, దెలుపవయ్య సూతధీసమేత?” 


308 ' ఆం(ధ మవోభాగవతోవన్వానములు . 


అని శౌనకాదులు సూతు నడుగుటయు, సూతుడు- 


' “వేదకల్పవృక్షవిగళితమయి శు8కముఖసుధాద్రవమున మొనసియున్న 
భాగవత పురాణఫలరసాస్వాదన పదవి గనుడు రసికభావవిదులు” 


అని సమాధానించుటయు సంభవించినది. 


“నిగమవిభజన విద్యోల్లాసు”డగు శ్రీవేదవ్యాస విబుధునివలన దానీ మహా 
భాగవతమును విన్నంతయు “బ్రహ్మతత్సరుడై యుత్తమ శ్లోక లీలోత్సవమున 
నాకృష్టచిత్తుడై పఠించిన” తాను కన్నంతయు రాజు “హరిభక్తుడగుటం జేసి యెటిగింతు” 
నన్నాడు. ఆ సంప్రదాయము నుండి తొలగకుండగానే మన భాగవతరత్నము శ్రీ 
పోతన్నగారు కూడా “విబుధవరులవలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత 
తేటపబతు” నన్నారు. దేనిన? శ్రీ వాసుదేవనామ వర్ణనాత్మకముగా వెలసిన యీ 
మహా(గంథమును- శ్రీ భాగవతమును. 


అయితే శ్రీ శుకయోగివద్ద కృష్ణద్వైపాయనుడు విబుధుడు. (ప్రకృతములో 
మన పోతన్నగారికడ నెవరో విచారింపవలసి యున్నది. మన వెనుకటి పరిశోధకులు, 
పురాణం హయగ్రీవ శాస్తులుగారు, తం. తేవప్పెరుమాళ్ళయ్యగారు, నాగపూడి 
కుప్పుసామయ్య B.A. గారు వీరలు శ్రీధరస్వామియే మన పోతన్నగారికడ విబుధులని 
తెల్పుచున్నారు. శ్రీధరులు శ్రీభాగవతమునకు “భావదీపిక” యను వ్యాఖ్యను వ్రాసిరి. 
ఇంతేకాక ఈ శ్రీభాగవతమునకు ఇంచుమించుగా మూల మనదగిన 
విష్ణుపురాణమునకుగూడ వ్యాఖ్య రచించియుండిరి. వారు “అద్వైతులు” అని పెద్దలు- 
ఇందాకటివారు అనెదరు. కాని శ్రీశంకరభగవత్సాదులు- అద్వైతముతో వీరు 
భేదింతురు. అద్వైతులని పిలువబడు చాలమంది శంకర భగవత్సాదులతో భేదింతురు. 
విజ్ఞాన భిక్షువు, మధుసూదన సరస్వతి, అద్వైతానంద తీర్థులు మొదలగువారిట్టివారే. 
మన యీ శ్రీధరస్వాములు శ్రీభాగవతములోని యీ క్రింది శ్లోకము నిట్లు 
వ్యాఖ్యానించిరి. 


తచ్చృద్దధానాఃమునయో జ్ఞాన వైరాగ్యయుక్త యా 
పశ్యన్యాత్మనిచాత్మానం భక్యా(శ్రుత గృహీతయా. (1-2-18) 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 309 


శ్రీధర వ్యాఖ్య: 
తచ్చతత్త్వం సపరికరయా భక్షెవప్రాప్యత ఇత్యాహ 
“తదితి” తదిత్యవ్యయం, జ్ఞాన వైరాగ్యయుక్త యేత్యత్రజ్ఞానంపరోక్షం 
తచ్చతత్త్వమాత్మనిక్షేత్రజ్టేపశ్యన్తీ, కింతత్‌? ఆత్మానం = 
పరమాత్మనం, (శ్రుతేన-వేదాన్లాది శ్రవణేన, 
గృహీతయా = ప్రాప్తయేతి భక్తేర్ణార్యముక్తం. 
దీనిని మన పోతన్నగారిట్లు తేటపరచిరి. 


“వేదాన్త శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞానవైరాగ్యంబుల తోడం గూడిన భక్తిచేతం 
దత్పరులైన పెద్దలు క్షేతజ్ఞండైన యాత్మయందుం బరమాత్మం బొడగందురు. 
(1-56) 


ఈ క్షేత్రజ్ఞుడగు జీవాత్మునందు పరమాత్ముని బొడగనుట ద్వైతుల పద్ధతియేనా? 
విచక్షుణులు విచారింపగలరు. 


సరి! అది యట్లుంచుడు. ప్రకృతములో మన పోతనామాత్యులనుసరించిన 
విబుధులు శ్రీధరస్వాములనుటలో మనవెనుకటివారు వకకంఠులుగా నుండుట పై 
యుదాహరణముల వలన సోపపత్తిక మగుచున్నది. ఇట్లు ఈమహాభాగవతమున 
జాలచోట్ల, చాలచోట్లేమి? అంతటను గూడ ప్రశంసిపబడినవి. శ్రీవాసుదేవుని 
దివ్యగుణ చరిత్రనామాదులు. అవి శ్రీధరస్వాముల వ్యాఖ్యానుసారముగా (బ్రశంస 
నొనర్చుటలో మన పోతన్నగారొక సాంప్రదాయిక మగు ఫక్కికను నిలువబెట్టరనుట 
సువ్యక్తమగును. కాగా ఎవరి నామభాషణములు యోగివరులకు బ్రహ్మహప్రాప్తిని 
గోరి యోగము నభ్యసింపగోరు వారికి ఉత్తమ వ్రతముతో అట్టి శ్రీవాసుదేవుని 
తత్త్వమేదియో విచారించి తెలిసికొందము. 


భీష్మస్తుతిలో విషయత్రయము: 
ఈవాసుదేవతత్త్వము, అవతారములు, భాగవత వైష్ణవము అను మూడు 
.విషయములును “భాగవతము” అను పేరునందే యివి వ్యక్తములగుచున్నవి. ఏమనగా 


310 ఆం([ధ మహాభాగవతోవన్యానములు 


భగవంతునకు సంబంధించినదియు భాగవతమే. అప్పుడు వాసుదేవతత్త్వము 
అర్థమగును. భగవంతునిదైన యవతారమును భాగవతమే. దానినిగురించి 
చెప్పునదియు భాగవతమే. 


భాగవతులు శ్రీవైష్ణవులు, భగవంతుని భక్తులు. వారిని గూర్చి తెల్పునదియు 
భాగవతమే. 


ఇట్లు భాగవతమను పేరే వాసుదేవతత్త్వమును, అవతారములను, భాగవత 
శ్రీవైష్టవమును తెల్పును. 


షి 

అదియునుగాక భాగవతపు టుపక్రమములో మొదటి స్కంధములో భీష్ముడు 
శ్రీకృష్ణుని స్తుతించు ఘట్టమున నీమూడు విషయములును వ్యక్తములగును. 
గమనింపుడు: 

“త్రిజగన్నోహన నీలకాన్తి తను వుద్దీపింప బ్రాభాత నీ 

రజబంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల నీలాలక 

వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబైవిజృంభింప మా 

విజయుం జేరెడు వన్నెంలాడు మది నావేశించు నెల్లప్పు౯.” 

(1-2-17) 

మొదటి పదములోనే “సర్వత్ర వసతిదీవ్యతి” యీ వసుదేవు పదమున నర్భ 
మతి రుచిరదీప్తముగా నున్నది. త్రిజగత్తులకును, సమస్త లోకములను వాసుదేవుని 
తను నీలకాన్తి ఉద్దీపించుచున్నదట. “మా విజయుంజేరెడు వన్నెలాడు” అనుటలో 
విజయ సఖుడైన వసుదేవుని సుతుడు వాసుదేవుడు వ్యక్తమగును. 


ఈవిజయుని జేరుటలోనే భాగవత వైష్ణవ స్వరూపము వ్యక్తపరుపబడినది. 


వాసుదేవుని ప్రాచీన చరిత్రము 


నీ మహానుభావు డెట బ్రశంసింపబడినాడో ఈ మహానుభావుడెంతటి 
అనాదినిధనుడో ఈతని చరిత్రమును మనము విచారింపవలసి యున్నది. 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 311 


ప్రకృతి కాలమున బాశ్చాత్యుల పద్ధతి ప్రకారముగా శాసనాద్యాధారముల 
నిర్జీతమగుట అత్యవసరము. శంఖమున బోసినగాని తీర్థముకాదు కదా! ఆ పద్ధతిలో 
బెస్‌ గనర శాసనము మన కన్నింటికన్న ముందుగా నుపయోగించుచున్నది. అచట 
రాజపుటానాలోని “ఘౌసుండి” యను చోట నొక గొప్ప హాలునకు చుట్టునున్న 
యొక గోడ శిథిలమైన స్థితిలో నగుపడును. ఆ గోడ మీద శ్రీ వాసుదేవుని యొక్కయు, 
బలదేవుని యొక్కయు పూజాస్థానమునకు చుట్టును కట్టబడిన దీ గోడయని ప్రాసి 
తెల్పబడియున్నది. ఆ శాసనాక్షరముల జూచినచో నది, చిట్టచివరకు B.C. రెండవ 
శతాబ్దమున కీవల దెంత మాత్రముకాదని తేలును. 


మరియు నీ మధ్య క్రొత్తగా కనుగొనబడిన బెస్‌నగర్‌ శాసనము నందు 
“హెలియెడోరా (Heli0dంra) అను నొక యవనుల రాయబారి” ఒక స్తంభమును 
తాను వాసుదేవుని గౌరవించుటకై స్థాపించితిననియు దాని చివర గరుడుని బొమ్మకూడ 
నేర్చరుపడినదనియు నా గరుడధ్వజమును దేవదేవుడైన శ్రీ వాసుదేవుని పూజించుటకు 
లేదా గౌరవించుటకు గాను దా నేర్పరచితిననియు, దాను భాగవతుడ ననియు” 
తెల్పుకొనెను. ఇతడు “దియా” అనునతని కుమారుడు. తూర్పు మాల్వాదేశము 
నాకాలమం దేలుచున్న భాగభద్రుని కొడుకు అంతిల తిలకునివద్దనుండి యవనుల 
గ్రీకుల రాయబారిగా వచ్చెను. తక్షశిల యితని స్వస్థలము. తనను తన నోటితో 
“భాగవతుడినని తెల్పుకొనును. ఈ “యన్తిలతిలకి అను పేరు బాక్షోగ్రీకు (బాక్టియన్సు 
గ్రీకులు) నాణెములమీద ముద్రింపబడియున్న “అన్తి లిడాస్‌” అనుదానితో చాలవరకు 
సరిపోవుచున్నది. ఈపేరులోని యక్షరములబట్టియు నిది క్రీస్తుకు పూర్వము రెండవ 
శతాబ్దముకన్న బూర్వపుదనియే స్పష్టపడుచున్నది. ఇందువలన నాకాలమున 
వాసుదేవుడు అత్యధికముగా దేవదేవుడుగా బూజింపబడుచుండె ననియు, తమ 
మతము భాగవత మతమనియు, వాసుదేవ మతానుయాయులు భాగవతులనియు, 
ఈభాగవతమతమును గ్రీకులుగూడ స్వీకరించి గౌరవించి ఆమతానుష్థానముల 
నొనరించిరనియు స్పష్టమే యగుచున్నది కదా! ఈమతము-వాసుదేవుని దేవదేవునిగా 
బూజించునట్టి యీభాగవతమతము ఇండియాయొక్క వాయవ్య భాగమున =గుజరాత్‌ 
మొదలయిన ప్రాంతములందు బాగా వ్యాపించినది. దానివ్యాప్తి విశషమువలన 


312 ॥ ఆం(ధ మవోభాగవతోపన్యానములు 


నానాటి గ్రీకులు మొదలగు విదేశీయులుకూడ ఈమతమును స్వీకరించి తమను 
“భాగవతులు” అని చెప్పుకొనుట మిక్కిలి గౌరవముగా సంతోషముతో నొప్పుకొనిరి. 


ఇంకను నానాఘాటునందలి యొక పెద్ద గుహలోని ౧వ నంబరు 
శాసనములో “సంకర్షణ వాసుదేవులు” అను ద్వంద్వసమాసములో నీ రెండు పేరులు 
కలిసి కనుబడుచున్నవి. అచట ఇతర దేవతల పేర్లుకూడ ఆ ప్రస్తావనలో నున్నవి. 
ఒక యుత్సవ ప్రారంభమును నిరూపించుచున్న యీశాసనము అక్షరములుకూడ 
క్రీస్తుకు పూర్వము మొదటి శతాబ్దమునకు సంబంధించినది గన్పడుచున్నవి. 


ఇంకొక విషయముగూడ ఈసందర్భములో ముఖ్యముగా బ్రశంసింపక 
తప్పదు. B.C. నాల్గవ శతాబ్దములో నానారకములైన మతములు, మూఢ 
విశ్వాసములు, పూజలు నున్నట్లుగా “నిద్దేశ” మను బౌద్ధగ్రంథము తెల్పుచున్నది. 
ఇది' వ్యాఖ్యాన[గ్రంథమే యైనను పాలిభాషలోని బౌద్ధమత (గంథములలో 
ప్రధానముగానే యెన్నబడుచున్నది. అందిట్లున్నది: “ఆజీవకుల దేవతానుయాయులు 
ఆజీవకులయు నిషున్త దేవతానుయాయులు నిషున్త జటిల దేవతానుయాయులు 
జటిలులు పరిబ్బా(ప్రా)జక దేవతానుయాయులు. పరిబ్బా(వ్రాజకులు, అవరుద్ధక 
దేవతానుయాయులు, అవరుద్ధకులు. అట్లే ఏనుగ, గుజ్జము, కాకి, కుక్క వాసుదేవ, 
బలదేవ, పున్న(పూర్ణ), భద్ధ(ద్ర), మానిభద్ద(ద్ర్ర, అగ్ని నాగ, సుపన్న(ర్ల), యక్ష 
అసుర, గన్దబ్బ(ర్వ)మహారాజు, చళ్దా, సూర్య, ఇన్టియ, (బ్రహ్మ, దేవ, దిశలుగా 
పేర్కొనబడుచుండిరి. (ఈ విషయమును ధర్మానన్ద కౌశాంబి తెల్పెనని శ్రీరామకృష్ణ 
గోపాల భాండార్మర్‌గారు వ్రాసిరి). 


బౌద్దులు నాస్తికులు కనుక, వాసుదేవ, బలదేవ పూజకులకు కుక్క నక్కను 
పూజించువారిలోను వాసుదేవ, బలదేవులను కుక్క ఏనుగ, గుజ్జిము, కాకి మొదలగు 
వానితోను గలిపినా, మనము వాస్తవముగా బరిశీలించుచో నీ వాసుదేవుడు, అతని 
పూజ, అతని మతము ఇదియంతయు ఈభరతభూమిలో గొప్పభాగమున నెక్కువగా 
వ్యాపించెననియు, వీనిగొప్పదనము అవ్యాహతమును, అపరిహరణీయమును, 
అనిరాకరణీయమును అని తెలియును. ఎట్లనగా- బెల్వాల్మరు తెల్పినట్లుగా బౌద్ధమత 


వాసుదేవ తత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము ' 313 


(గ్రంథములేని అష్టాధ్యాయిని రచించి B.C. ఏడవ శతాబ్దమునకు బూర్వమునందే 

యున్న పాణిని మహర్షి తన వ్యాకరణ నూత్రములలో “వాసుదేవార్డు 
నాభ్యాంవుజ్‌(4-3-98) అని సూత్రించినాడు. అట వాసుదేవుని భజించువాడు 
వాసుదేవకుడనంబడునని దాని యర్థము. ఈసూత్రముగ కొకటిరెండు సూత్రములకు 
వెనుక “భక్తిఖ అని సూత్రించినాడు. కాగాపై జెప్పిన యర్థమే (వాసుదేవః భక్తిరస్య 
వాసుదేవకః) ఏర్పడక తప్పదు. ఇంకను గొంత పూర్వము “బుష్యంధక వృష్టి కురుభ్యశ్చ” 
అను సూత్రముతో నీవాసుదేవుడు వృష్టి వంశములోనివాడని తెల్పినాడు. వృష్టీనాం 
వాసుదేవోస్మి అని గీత తెల్పును కదా! ఇట “వాసుదేవ”.శబ్ద్బ మేల ముందువాడబడిన 
దను ప్రశ్నకు పతంజలి మహర్షి ఆసూత్రభాష్యములో “నైషా క్షత్రియాఖ్యా సంజ్ఞైషా 
తత్ర భగవతి” అనెను. ఇందువలన వసుదేవగోత్రజుడైన క్షత్రియునిగా తెల్పునది 
మాత్రమే యిట వాసుదేవ శబ్దమును ప్రయోగింపబడలేదనియు, తత్ర- ఆవసుదేవ 
గోత్రజుడైన క్షత్రియుడు భగవానుడేనని తెల్పుట కిట భగవానుని నామము “వాసుదేవ” 
యని యుపయోగింపబడెననియు వ్రాసెను. (ఇందువలన “ఏషా”, “తత్ర” అను 
పదములను జాగ్రత్తగా పరిశీలించినచో మేము తెల్పిన యభిప్రాయమే కన్పట్టును.) 
మరియు బుప్యన్థక వృష్టి కురుభ్యశ్చ (4-1-118) అను సూత్రభాష్యములో “వృష్ణోల_ 
వకాశః - వాసుదేవః బాలదేవళి” అని యుదాహరించుట వలన వృష్టివంశజుడై 
బలదేవుని నిత్య సహవాసియగు, శ్రీవసుదేవుని కుమారుడైన క్షత్రియుడే వాసుదేవుడని 
తేలుటయేకాక ప్రకృత సూత్రములో (4-3-98) భాష్యము “తత్ర” యను పదమువలన 
నిట నావాసుదేవుని క్షత్రియుడుగా తెల్పుట తలంపుగాదు. భగవానుడుగా అనగా 
పరమాత్మ యగు పర వాసుదేవునిగా దెల్పుటకై యిట సూత్రములో మొదట 
“వాసుదేవ” పద ముపయోగింపబడెనని స్పష్టమొనర్చెను. ఈ పతంజలి మహర్షి 
భాష్యమును, పాణిని మహర్షి సూత్రమును జక్కగా గ్రహించు వారికి B.C. ఏడవ 
శతాబ్దమునకు బూర్వమే ఈ మహానుభావుడు వాసుదేవుడొక దేవదేవుడుగా, 
మతసిద్దాంతమునకు (ప్రధాన లక్షణముగా, పరమపూజితుడుగా నుండెననియు, 
నాతడే భగవంతుడను పేర బరగుననియు, నతనియర్చనమే భాగవతతంత్రమను 
సేరున బరగు పాంచ రాత్రాగమమనియు, నాతని గూర్చిన మతమే భాగవత 


314 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


" మతమనియు, నాతని భక్తులే భాగవత శబ్దమునకు ముఖ్యార్థమనియు స్పష్టసిద్ధాంతమని 
తేలును. ఇక “శివభాగవతా”ది శబ్దములు వ్యతిరేక ముఖమున శివాదులు 
గౌణార్థములనియు, వారి భక్తులును అట్లే గౌణులనియు తెల్పుచు పై ముఖ్యార్థమును 
వ్యతిరేకముఖమున దృఢపరచుచున్నవి. 


నిజమున కిది యంతయు కేవల మనావశ్యకము. అసలు 
శ్రీమహాభారతమునందే శాన్తిపర్వములో నారాయణీయమున నీ వాసు దేవునిగూర్చి 
కావలసినంత ప్రసంగమున్నది. ఎవరి మతమునందైనను ఆ మహాభారతము B.C. 
12వ శతాబ్దమున కీవలిది కాదుకదా? కనుక నట మన గ్రంథములనుండియే యీ 
విషయము దృఢముగా షుమారు మూడువేల సంవత్సరములకు బూర్వమునుండి 
సుప్రసిద్ధముగా నున్నదని తేలుచుండగా నీ పాశ్చాత్యుల అరగొర మాటలతో, 
అసందర్భపు, ప్రమాణములతో మనము నిరూపింపవలసిన పనిలేదు. 


ఇంకొక విషయముగూడ మన మిట బ్రస్తావించుకొనక తప్పదు. ఈవాసుదేవుని 
ప్రసంగము ఈ మహా(గంథములో పాంచ రాత్రాగమమునకు సంబంధించియే 
కూర్చబడినది. పాంచరాత్రాగమములోని పరవాసుదేవుడు, వాసుదేవ, సంకర్షణ, 
ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహములు ఇవియన్నియు నిందు ఆ యాగమోక్తమగు నర్వా 
విధానముతో సంబంధింపజేసి ఆ పాంచరాత్రాగమపు బేరు బేర్కొని ఇవి యన్నియు 
నిట సృష్టి ప్రక్రియా నిరూపణమున బ్రసంగించడినవి. ఇందువలన వాసుదేవునకును 
పాంచరాత్రాగమ మునకును ఘనిష్టమగు సంబంధము కన్పడుచున్నది. వాసుదేవుని 
ప్రధానముగా నేర్పరుచుకొనయే యీ పాంచరాత్రాగమము బయలుదేరినది. 
భగవద్గీతలోగూడ “వాసుదేవ స్సర్వమితి సమహాత్మా సుదుర్లభఃి “వృష్టీనాం 
వాసుదేవోస్మి” యనుటయే కాక మరొకచోటగూడ “వాసుదేవ” శబ్దము వాడబడినది. 
ఇందువలన గీతాశాస్త్రము పాంచరాత్రాగమము నాధారముగా గొనియే అది యేమి? 
అనగా పాంచరాత్ర తంత్రమే గీతగా బోధింపబడినదని స్పష్టము. పాంచరాత్రా 
గమమున బోధింపబడు సాంఖ్యము, జ్ఞానయోగము, భక్తియోగము, భక్తెక 
ప్రాధాన్యము, కడమవానివలన భగవంతుని ప్రాప్తి కలుగదనుట యివి యన్నియు 


వాసుదేవ తత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము 315 


బాంచరాత్రాగమ సిద్ధాంతములే. మరియు గీతలో కర్మయోగ సహితమగు 
విజ్ఞానమునకే- అనగా జ్ఞానగర్భితమగు కర్మయోగమునకే ప్రాధాన్యమీయబడినది. 
“తయోస్తు కర్మసన్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే” అని. పాంచరాత్రాగమము 
.భాగవతమునుగూడ వాసుదేవారాధనాత్మకమైన కర్మమునకే వాసుదేవతత్త్వ 
విజ్ఞానసహితమై యున్నదానికే నవవిధ లక్షణములుగల భక్తియే పరమ సులభమును, 
భగవత్రాపకమును నగు నుపాయముగా బ్రహ్మదేవుడు నారదునితో ద్వితీయ 
స్మంధమున దెల్పియున్నాడు. ఇందువలన గీతయు భాగవతమును పాంచరాత్రగమైక 
మూలములే యనుట స్పష్టము. 


ఇంకొకటి గీతయొక్క ఆచార్య సాంప్రదాయమును వినుడు: 


“ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం 
వివస్వాన్మనవే, ప్రాహమను రిక్ష్వాకవే 9_బ్రవీత్‌ 
సకాలెనేహమహతా యోగోనష్టః పరంతప” 


అని. విష్ణువు వివస్వంతునకు, అతడు వైవస్వత మనువుకు, అతడు ఇక్ష్వాకునకు 
దెల్పినట్లున్నది గీతలో. బుగ్వేదము దశమమండలములో “అప్టాపుత్రాస అది తేరాస” 
యను బుక్కులో అదితియొక్క మొదటి కొడుకు విష్ణుడు, చివరి కొడుకు వివస్వంతుడు. 
పెద్దవాడు చిన్నవానికి తత్వోపదేశ మొనర్చుట యుక్తమేకదా! వివస్వంతునివలన 
నుపదేశ మొందనమనువు ఈ పాంచరాత్రాగమమునుండియే మనుస్మృతిలోని 
ధర్మములను దెల్పినటుల “అస్మాత్రవక్షతే ధర్మా౯ మను స్వాయంభువ స్వయం” 
అను శ్లోకము తెల్పును. మనువువలన నిక్ష్వాకు ఉపదేశ మొందెననుట 
కుదాహరణముగా శ్రీ రామాయణము బాలకాండలో నలువదియవ సర్గములో 
“వాసుదేవ” శబ్దమే కాక ఉత్తరకాండములో స్పష్టముగానే పాంచారాత్రాగమము, 
వాసుదేవ పరమాత్మైక సంబద్ధమగునది ప్రశంసింపబడియున్నది. ఏ చారిత్రకుల 
పక్షముననైనను రామాయణము భారతమున కన్న చాల ప్రాచీనమే కదా! అచటనే 
కల “వాసుదేవ” శబ్దము, పాంచ రాత్రాగమము. ఇవి వాసుదేవుని దేవదేవునిగాను, 
అనాదికాల, ప్రసిద్ధునిగాను అతని మతము, అతని పూజావిధానముగూడా 


316 . ఆం(ధ మహాభాగవతోపన్యానములు 


అనాదికాలము నుండియు (్రవర్తించుచు సకల ప్రామాణికులైన ఆస్తికుల 
కత్యాదరణీయములుగా నున్నవనియు బ్రకటించుచున్నవి. 


మనము ఇంతదూరమువరకును విచారించిన శాసనాదికమంతయు 
శ్రీవాసుదేవుని యొక్క బాహ్య స్వరూపావధులు మాత్రమేకాని నిరవధికుడు, నిరవధిక 
మహిమోజ్ఞ్వలుడు నగు నామహానుభావుని యన్త స్వరూపముకాదు. ఇకను ఆ వాసుదేవ 
పరమాత్మయొక్క అన్తస్తత్వ పరిచయమునకై బ్రాకులాడుదము. అది తెలిసినగదా, 
అది పరిచితమైనగదా, దానిని భజించినగదా మన జన్మ సార్థకమగును. పరమాత్మ 
ప్రాప్తి కల్గును. 
శ్రీ వాసుదేవ తత్త్వము 
శ్రీ వాసుదేవుని స్వరూప తత్త్వము ఈ వ్యాస ప్రారంభము నందలి 
శ్లోకమువలననే యెరుగవచ్చును. “వసతి, దీవ్యతి” యని యొక వ్యుత్పత్తి “వాసయతి, 
దీవ్యతి” యని మరొక వ్యుత్పత్తి ఈ “వాసుదేవ” పదమునకు ఈ రెండు 
వ్యుత్పత్తులమూలముగా వాసుదేవపదము బోధించునర్థమే ఆ శ్లోకములో దెలుప 
బడినది. “సర్వత్రా సౌవసతి”, “సమస్తంచవసత్యత్ర” అని యీ రెండు వ్యుత్చత్తులకును 
క్రమముగా సంస్కృతములో నర్థము తెలుపబడినది. అంతటను నుండువాడు, 
అంతయు నితనియం దాధారపడియుం డును అని వాని యర్థము. ఈయర్ధము 
లింతకు “వాసు” అన్నంతవరకే. మిగిలిన “దేవ” పదము “వెలుగొందువాడు” అను 
నర్ధముతో బాటు ననేకార్థములు సమర్పించును. దివు ధాతువునకు- క్రీడ, విజిగీష, 
వ్యవహారము, దృతి, స్తుతి, మోదము, మదము, స్వప్నము, కాన్తి, గతియు నర్థములు. 
కనుక నంతటను నిండియుండి ఇన్న వనులను జేయుచుండుననియు, 
చతుర్వ్యూహములు, (వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను నాల్లు 
వ్యూహములును) ఇచట స్పష్టముగా నిరూపింపబడినవి. అందులో ముఖ్యముగా 
స్వీకరింపబడిన వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమే యిట ప్రధానముగా నవలంబింప 
దగు మంత్రమనియు దాని యర్థము ననుసంధించుచు నిరంతరము ప్రీతిపూర్వకముగా 
ధ్యానించుటవలననే వాసుదేవ ప్రాప్తి రూపమైన పరమ పురుషార్థము లభించుననియు 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 317 


దెల్పబడినది. మోక్షమునకన్న కూడ నత్యధికమైనది శ్రీవాసుదేవుని దివ్యమంగళ 
విగ్రహ సేవనమని పరమైకాన్తులగు భాగవతులు మోక్షమునుగూడ అభిలషింపక 
శ్రీపరవాసుదేవుని దివ్య మంగళ విగ్రహమును, ఆమహానుభావుని దివ్యచరిత్రమును 
కీర్తించుచుందురనియు (3-879), మరికొందరు భాగవతోత్తములు వాసుదేవుని 
దివ్యావతారములను యోగ మహిమతో (బ్రత్యక్ష మొనరించుకొని యనుభవించు ఆ 
మహనీయుని పలుకులు స్తుతించుచు ఆ దేవు మంగళ విగ్రహ దర్శనానుభవము 
నందలి ప్రీతిచే మోక్షమునుగూడ నభిలషింపక యుందురనియు (3-880) 
మోక్షమునకన్న గూడ నిర్హేతుకమైన భగవత్సేవయే గరిష్టమనియు నిట (3-878) 
జెప్పబడినది. 


ఇక నీ వాసుదేవ తత్త్వమును భాగవతములో మన పోతనామాత్యులెట్లు 
నిరూపించిరో కనుగొందము. 


జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అను నారు 
గుణములతో నిండియున్న దీపరవాసుదేవ తత్త్వము. ఆ భగవానుడు ఈ జగమును 
సృష్టించుటకును, పాలించుటకును, ప్రళయ మొందించుటకును గర్త ఆ మహానుభావున 
కీ కృత్యముల నొనర్ప సంకల్పము కల్గినపుడు నాల్గు రకములుగా దాను తన 
సంకల్పముతోనే యగును. ఈ రూపములను వ్యూహము లందురు. 


ఈ వ్యూహములు పుట్టునవి కావు. ఆయా కార్యములకై నాయా వాటిని 
పరవాసుదేవుడు అధిష్టించునపు డాయా వ్యూహ నామముల నొందును, (దీనిని 
ముందు వివరింతుము. ) అవతారములకును వ్యూహములకును గల తేడా యిదియే. 
స్వేచ్చాకృతమగు పరమాత్ముని జన్మము నవతార మందురు. “అజాయమానో బహుధా 
విజాయతే” అను (శ్రుతి. ఆ మహానుభావునకు, మనకు- జీవులకువలె స్వీయ పుణ్య 
పాపాత్మకమైన కర్మవశమున జన్మము లేదు. ఇక నేమి “సంభవామ్యాత్మమాయయా” 
అన్నట్లుగా సర్వేశ్వరేశ్వరుడగు నీ పరవాసుదేవుడు తన సంకల్పమువలననే మత్స్య, 
కుర్మాది రూపముల జన్మించుట అవతారమందురు. అట్లుగాక ఆయా కార్యములకై 
ఆయా వాటి నధిష్టించుట వలన నేర్చడునది వ్యూహము. 


318 ' .... ఆంధ్ర మవోభాగవతోవన్యానములు 


ఇట్లు నిత్యోదితుడగ పరవాసుదేవుడు నాల్లు వ్యూహములుగా నగును. 
వాసుదేవ, సంకర్షణ, ప్రద్నుమ్ను, అనిరుద్ధ వ్యూహములని వానిపేరు. అందు 
మొదటిదగు వాసుదేవ వ్యూహమును శాన్లోదిత మందురు. రెండవది సంకర్షణ 
వ్యూహము, మూడవది (ప్రద్యుమ్న వ్యూహము, నాల్గవది అనిరుద్ధ వ్యూహము. 
క్రమముగా వివరింతుము. 


౧ వాసుదేవ వ్యూహము=శానోదితు డగు వాసుదేవుడు నిత్యోదితుడగు 
పరవాసుదేవుడు. మహత్తత్త్వమును అధిష్టించినపుడు = పనిలో నుపయోగించుటకై 
ప్రేరేపించినపుడు ఈ వ్యూహనామమున బిలువబడును. ఈయది కడమ వ్యూహముల 
కన్నింటికిని మొదటిది. ఈ స్వరూపము మరకతగిరివలె శ్యామలపై యుండును. 
క్షీరసాగర మీ వ్యూహమునకు నివాన స్థానము. పరవాసుదేవుడువలె నీ 
వ్యూహముగూడ షాడ్గుణ్యముతో పరిపూర్ణముగానే యుండును. ఈ వ్యూహము 
ఆధ్యాత్మికాది భౌతికాది దైవికములందు వేటువేటుగా గ్రహింపబడును. ఇది ఆధ్యాత్మిక 
రూపమున చిత్తమందురు. అది భౌతిక రూపమున మహత్తు ఆధిదైవిక రూపమున 
వాసుదేవుడుగా నుపాసింపనగును. ఈ వ్యూహమున కధిష్టాత క్షేత్రజ్ఞుడు. (దీని 
యర్థము -జీవుల కర్మల పరిపాక దశ వలన నీ మహాత్ముడు సృష్టింపవలెనని తలంపుకల్లి 
మహత్తత్త్వమును ప్రేరేచునని. ) ఇది సత్త్వగుణ ప్రధానముగా నుండును. ఏవిధమైన 
దోషములును లేక నిత్యమై యుండును. శాంతముగా ఊర్మిషట్క రహితముగా- 
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యర్యములను అరిషడ్వర్లము లేకుండ నుండునని 
భక్తులు దీనిని సేవించుచుందురు. 


౨ సంకర్షణ వ్యూహము = ఇది వెనుకటి వాసుదేవ వ్యూహము నుండి 
యేర్చడినది. రెండవది, ఈతనియందు వెనుక జెప్పిన ఆరు గుణములలో విజ్ఞానము, 
శక్తి యను రెండు గుణములు ప్రధానముగా నుండును. తెల్లగా అమృతపు నురువు 
వంటి దేహమును, నల్లని వస్త్రమును కలిగి హలమును ధరించి యుండును. ఈ 
గురుతులనుండియే బలరాముడు సంకర్షణుడుగా గుర్తింపబడినాడు. జీవుల నందరను 
సంకర్షించుట వలన నీ వ్యూహము సంకర్షణ మనబడగా కంసుని భయమున 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 319 


జెదరిపోయిన యాదవవుల నందర నొకచోటికి సంకర్షించుటవలన బలరాముడు 
సంకర్షణుడనబడెను. సకల జీవులకును ఇత డధిష్టాత. ఈతని యధిష్టానము 
అహంకారము. రు[ద్రుడీవ్యూహమున కధిష్టాత. ఈతడు భూతేగన్దియ మానసమయుడు. 
కర్త్శృత్వము, కారణత్వము, కార్యత్వము, శాన్తత్వము, ఘోరత్వము, మూఢత్వము 
మొదలగు లక్షణములితనికి గలవు. నివాస మీతనికి పాతాలము. అచ్చట ముప్పదివేల 
యామడల వెడల్పున దోకను జుట్టజుట్టుకొని మహోగ్రమగు శరీరముతో అనన్తుడను 
సర్పాకారముతో విలసిల్లెడు నాదిశేషుడితడు. ఈతని వేయిపడగలందును ఆవగింజవలె 
ఈ ధరామండలముండును. ఈ మహనీయున కీ లోకములను సంహరింపదలంపు 
గల్లినపుడు అదివరలో మహాశాస్తుడుగా నున్నను ఇతడపుడు మహా ఘోరమగు 
క్రోధముతో ఏకాదశ రుద్రులను- మహారౌద్రము కలవారిని, మూడు కనులవారిని, 
త్రిశూలముల జేతపట్టినవారిని సృజించును. ఆ పాతాళమందలి నాగేన్లులు ఈ 
మహనీయుని నిరంతరము మొక్కి సేవించుచుందురు. అచటి నాగకన్యకలు అగరు, 
చందన, కుంకుమపంకముల ననులేపన మీతని కొనర్చుచుందురు. అప్పుడీతని దర్శన, 
స్పర్శనాదుల మూలమున మదనావేశము విజృంభింపగా చిరునగవుల వెదజల్లుచు 
నభిలాషతో సవ్రీడముగా నీతని జూచుచుందురు. అనన్తగుణు డగు నీ యనన్తుడు 
అప్పుడు క్రోధము నుపసంహరించి శాన్తుడై లోకముల క్షేమమును గోరుచుండును. 
సురనరగరుడోరగాదులు తన్నొనరించు స్తుతులవలన సంతోషాతిశయము గల్లి మ్రాగన్న 
వెట్టుచు గూర్మును. నారదుడు, తుంబురాదులతో గూడి బ్రహ్మదేవుని నభయం దీతని 
గొనియాడుచుండును. ఈ వ్యూహము నుండి మూడవదగు- 


౩ [పద్నుమ్య వ్యూహము ఏర్పడును. ఈతనికి వెనుకటి యాజు గుణములలో 
బలము, ఐశ్వర్యమును ప్రధానములు. తాపింఛము (చీకటిచెట్టు పువ్వు వంటి 
శరీర చాయ. కనుకనే అట్టి శ్యామలవర్ణ సుందరుడగు శ్రీకృష్ణ కుమారుడు ప్రద్యుమ్నుడు 
ఈ వ్యూహమని గుర్తింపబడినది. ఈతని యధిష్టానము బుద్ది, సకల (ప్రాణి 
హృదయములందును ఈతడుండును. దీనికి అధిష్టాత (బ్రహ్మదేవుడు. ఈ మూడవ 
వ్యూహము నుండి నాల్గవదైన- 


320 ' ఆం(ధ మహాభాగవతోవన్యానములు . 


౪ అనిరుద వ్యూహము ఏర్పడినది. ఈతనియందు వెనుకటి గుణములలోని 
వీర్య, తేజస్సులు అధికముగా ప్రధానములు. ఈతడు శరత్మాలమునందు వికసించిన 
నల్లకలువపూవు వంటి చాయతో నుండును. ఇట నధిష్టాత చంద్రుడు. హృషీకము 
(వస్తువును గోచరించు నన్తరిన్చియము) మనసు ఇతని యధిష్టానము. కనుకనే 
ఇతడు హృషీకేశుడు. ఇతడు పరవాసుదేవుడే కనుక నితనివలెనే అతనిని గూడ 
హృషీకేశు డందురు. (“ఏవముక్తోహృషి కేశో గుడా కేశేన” అని భగవద్గీత.) 

ఇట్లు నాల్గు వ్యూహములుగా నున్నదియు నా మహానుభావుడైన భగవానుడు 
పరవాసుదేవుదే. అతడు పరవాసుదేవ తత్త్వమునన స్వయముగా సూక్ష్మమనబడును. 
ఈ వాసుదేవాదులు నల్గురు వ్యూహములు. మత్స్య, కూర్మాది అవతారము 
విభవములు. ఈ విభవమును- రామకృష్ణాద్యవతారమును భక్తి శ్రద్ధలతో నర్చించి 
క్రమాభివృద్ధితో వ్యూహముల నొందును. వానిని గూడ భక్తి ధ్యానార్చనాది విధానమున 
సేవించి సూక్ష్మము నొందునని పాంచరాత్రాగమ ప్రక్రియ. ఈ యాగమోక్తమగు 
విధానముననే ఈ మహానుభావు నర్చింపవలెనని “చతుర పాంచరాత్రోక్తహరి 
సమారాధన క్రియలను” అను మాటతో బోతనామాత్యులు తెల్పిరి. 


అవతారములు 


అసలు ఈ వాసుదేవుని యవతారములను మన మేల ప్రస్తావించుకొనవలెనో 
తెలిసికొందము. పోతనామాత్యులే ఆ విషయము నిట్లు తెల్పుచున్నారు. 


“ఆత్మరూపకుడగు హరికథామృతమును 

కర్ణపుటంబుల గాంక్షదీర, 

(గోలుచుండెడు ధన్యులు కుటిల బహుళ 

విషయ మలినీ కృతాంగముల్‌ 

వేగ విడచి, | 

విష్ణుదేవుని చరణారవిందయుగము 

కడకు జనుదురుసిద్ధంబు గౌరవేన్ల” (2-36) 
మరియు 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 321 


పరికింప మత్స్వరూప స్వభావములను, మహిమావతార కర్మములు దెలియ 
దత్త్వ విజ్ఞానంబు దలకొని మత్రసాదమున గల్లెడి... (2-253) 


శ్రీ శుకయోగీనన్లుని నోటినుండి భగవానుని యవతార కథలను విందము: 
అసలు అవతారము లన నేమియో యొకసారి విచారించి తెలసికొందుము. జ్ఞానేచ్చా 
క్రియా శక్తులెట పరాకాష్ట నొందునో అది యవతారమందురు. “అవతార” పదవు 
నర్భమును వ్యతృత్తినిబట్టి విచారించుచో పైనుండి క్రిందికి దిగుట యని. కాగా- 
పరమపద నివాసుడగు పరమాత్మ, వాసుదేవుడు, అటనుండి- నిత్య విభూతినుండి 
లీలావిభూతి- ఈ లోకములోనికి దిగినపడు అవతార మని పర్యవసానము. అట్లేల 
యా మహానుభావుడు దిగివలసివచ్చెనో? అనగా నిత్యానంద మయము, సర్వోన్నతము, 
దుఃఖలేశముకూడ లేనిది అయినది నిత్యవిభూతి. శుద్ధసత్వ్వమయము. అటమిశ్రసత్త్వమే 
లేదు. ఇక రజస్తమస్సుల యునికినిగూర్చి ప్రశ్నయేది? అట్టి దివ్యమగు నిత్యవిభూతి 
నుండి ఈయ లీలా విభూతికి- వెనుకటి విభూతికి అన్ని విధములను ప్రతికోటిగా 
అనగా విరుద్ధముగా సతత దుఃఖమయము సర్వాధయము. సుఖాభాసము తప్ప 
సుఖలేశము కూడ లేనిది. రజస్తమస్సులతో మిశ్రితమగు సత్త్వమటనట నుండునదియు, 
నధికముగా రజస్తమస్సులతోనే నిండియున్నదియునగు నీ లీలా విభూతిలోని కేల 
వాసుదేవుడు దిగవలసివచ్చెను? చక్కగా కాళ్ళు కడుగుకొని చంద్రకాన్త మణిమయమమైన 
కుట్టిమమున నుండువాడు బురద వూబిలోనికి దిగునా? అని యాశంక కలుగును. 


దానికి పాండవుల తల్లి, వాసుదేవుని మేనత్త కుంతీదేవి యిట్లని 
సమాధానమిచ్చినది. 


జలరాశి నడుమ దిరిగెడు కలము క్రియ౯ భూరిభారకర్శితయగు నీ 
యిల గావ నజుడు గోరిన గలిగితివని కొందరండ్రు గణనాతీతా 


ఎవడైన నొక బాలు డా వూబిలో పడి లేవలేక, బైటికి రాలేక కొట్టుకొనునపుడు 
కరుణాళు డయ్యెనేని చం[ద్రకాన్తమణికుట్టిమమునందున్నను వెంటనే యూబిలోని 
కురికి బాలుని రక్షించియే తీరును. ఆసమాన్యముగా కృపాళుడగువాడే 
యిట్లొనర్చుచుండ పరమ కృపాళుడగు పరమేశ్వరుడు వాసుదేవు డూరకొనునా? 


322 | ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


ఒకని విషయములోనే యట్లుండగా ఈ యనేక కోట్లమంది విషయములో నిక 
జెప్పనక్కరలేదు కదా! అయితే భగవాను డవతారమెత్తి భూభారము నుడిపెననిన. 
నేమి? చాల మందిని చంపుటయో, చంపించుటయో యింతయేకదా! అంతమాత్రమున 
రక్షించుట యెట్లగును? అట్లే యగుచో దానవ, రాక్షసాసురులొనర్చినదియు రక్షణమే 
వారును లోక రక్షకులనియే పేర్వడయరేమి? అని తోచవచ్చును. ఇందుకే పోతన్నగారు- 


“అంగవ్రాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ ్రేజికి 


అన్నారు. దుష్టాంగముల వంటి వారైన ఆసుర రాక్షస దానవాదులను సంహరించినచో 
మిగిలిన దేవతా, మహర్షి సాధపురుషులకు, వారివారి క్రియలు- భగవదర్చన, 
జప, తపో, ధ్యాన, సమాధ్యాదులు నిర్విఘ్నముగా నెరవేరగలవు. భగవానుని 
తత్త్వజ్ఞానము అందరియెడను వ్యాపింపగలదు. అవతారకథలు విస్తరించి 
కీర్తింపబడగలవు. 


అలసులు మందబుద్ధియుతులల్పతరాయువు లుగ్రరోగ సం 

కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియు జేయంజాల రీ 

కలియుగమందు మానవుల..... (1-42) 
అన్నట్లుగా 


ఇట్లున్న మనము తరింపవలెనన్నచో, దానికై, శ్రవణ, వందనార్చన, పాదసేవన, 
కీర్తన సఖ్య ధ్యాన స్మరణాత్మ, నివేదనముల నొనర్పవలెనన్నచో నా మహనీయుడు, 
కృపాకూపారుడు పరమపదాధి నాయకుడు శ్రీ వాసుదేవు డీలోకమునకు దిగిరాక 
తప్పునా? మన కనుల కగుపడదగు దివ్యమంగళ సుందర విగ్రహముల ధరింపక 
తప్పునా? మన మనో మోహనకరములగు దివ్య అద్భుత, మంగళకర లీలల నాచరింపక 
తప్పునా? అటుల రాలేదా? ధరింపలేదా? ఆచరింపలేదా? అట్లే వచ్చినాడు. 
 అవతారముల ధరించినాడు. దివ్యసుందరలీలల బ్రదర్శనము నాచరించినాడు. 
మనలనందరను సమకాలికులను ప్రత్యక్షముగాను, భిన్నకాలికులను శాబ్దికముగాను 
గోచరించి తరింపజేసినాడు, చేయుచున్నాడు, చేయనున్నాడు. కనుక నా యవతార 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 323 


కథా కథన మత్యంతావశ్యకమనుటలో సంశయము లేదుకదా? 


ఇక ఇపు డామహానుభావుని యవతారములను చెప్పుకొందము. 
అవతారములు సామాన్యముగా రెండు రకములుగా భాగవతమున గన్చడుచున్నవి. 
అంశావతారములని, కలావతారములని, మరికొందరు (వల్లభ, చైతన్యాదులు) 
పూర్ణావతారములని యొక విభాగమును గల్పింతురు. మత్స్యకూర్మాద్యదవతారములు 
అంశావతారములనియు, బుషభ, పరశురామాద్యవతారములు కలావతారము 
లనియు పెద్దలు తెల్పుదురు. “అంశావతారా అన్యేతు కృష్ణస్తు భగవా౯ స్వయం,” 
అనుటనుబట్టి సర్వశక్తులను బ్రకటించిన యీ కృష్ణావతారము పూర్ణావతారమే. 
ఇందువలన “పుండరీకాక్షుండగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు 
సేయం దన మేని కేశద్వయంబు చాలునని యాత్మప్రభావంబు తెలుపుకొరకు 
నిజకళాంశ సంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణంబులని 
నిర్దేశించుకొణకు సితాసిత లేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నలరి 
యవతరించెను.” (2-176) అని భాగవతములో పోతనామాత్యుని నుడువు 
లగుపడుటవలన శ్రీకృష్ణావతారము అంశావతార మను కొనగూడదని స్పష్టము. 

ఈ యవతారములు దశావతారములనియు, ఏకవింశత్యవతారములనియు, 
మన్వంతరావతారము లనియు, భాగవతమున గీర్తింపబడినవి. 

ఈ యవతారముల ప్రసంగమును బ్రహ్మదేవుడు నారదునితో జేయు నాటికే 
వరాహాద్యవతారములు కొన్ని గడచినవి. ఇక మన్వన్త రావతారములు అంగీకరించినవి 
కొన్నియు, మరికొన్ని యంగీకరింపగలవియుగా ఉన్నవి. ఆసమయమున ధన్వన్తరి, 
పరశురామాద్యవతారములు నడచుచున్నవి. రాబోవు కాలమున శ్రీరామా 
ద్యవతారములు నడువ నున్నవి. 


మన్వన్తరావతారములు: 

౧ మొదటి మనువు స్వాయంభువ మనువు. అతడు శతరూప యను పతితో 
జిరకాలము రాజ్యమేలెను. అతనికి ఆకూతియు, దేవహూతియు నిరువురు కూతులు. 
అతడు ఆకూతిని రుచికిని, దేహూతిని కర్టమునకు నిచ్చి పెండ్లి చేసెను. కొంతకాలమున 
కాలమనువు విరక్తికలిగి తపస్సానర్చి భగవాను డగు శ్రీ వాసుదేవుని మన్రోపనిష 
దధణంబుల స్తుతించుచుండగా- 


324 ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


రక్కసులు దినంగంగడంగిన వెక్కసముగ యజ్ఞనామ విష్ణుండు 
వారింజక్కడిచెం జక్రధారల. 
(8-12) 
ఈ యజ్ఞుడెవరో యెరుగుదురా? ఆకూతికి రుచివలన జనించిన మహానుభావుడే. 
ఇది మొదటి మన్వన్తరమునందలి శ్రీహరియొక్క అంశమున గల్గిన యజ్ఞావతారము. 
ఈతడే ఇంద్రుడుగాగూడ నుండి తన కొడుకులతో గూడి స్వర్గమేలెను. ఈనాడు 
వేరుగా నింద్రుడు లేడు. 


౨ ఇక రెండవ యవతారము-కర్ణమునివలన దేవహూతి (మొదటి మనువు 
కూతురు) యందు కపిలుడను పేర నవతరించి తల్లి దేవహూతికి సాంఖ్యము, 
భక్తియోగము మొదలగునవి యుపదేశించెను. ఆసురి యను బ్రాహ్మణునకు తత్త్వగ్రామ 
వినిర్ణయంబుగల సాంఖ్యం బుపన్యసించె. (ఈమహానుభావు నుపదేశమునందే వ్యూహ 
చతుష్టయ ప్రకారము పాంచరాత్రాగమ ప్రశంస, తదుక్త విధానమున నర్చన 
మొనర్పవలయుననుటయు దెల్పబడినది.) ఈ రెండును మొదటి మనువునాటి 
యవతారములు. 


౩ ఇక రెండవ మనువు స్వారోచిషుడు. ఈతని తండ్రి సప్పార్చి. అతని 
పాలనకాలమున “వేదశిరుండను విప్రని దయితకు = “తుషితికు పుత్రుండై తోయజాక్షుం 


డవతరించెను. కౌమారక బ్రహ్మచారి యగుచు నతండు సలిపె వ్రతము.” 
(8-14) 
౪ మూడవ మనువు ఉత్తముడు. ఇతడు స్వాయంభువ మనువునకు పౌత్రుడు. 
ఇతని కాలమున ధర్మునకు సూన్ఫతయను భార్యయందు సత్య సేనుడను బేరున 
వాసుదేవు డవతరించెను. దుష్ట స్వభావులైన దనుజ యక్షపతులను జయించి సత్యజిత్తను 
అప్పటి యింద్రునకు సహాయమొనర్చను. 


౫ నాల్లవ మనువు, ఉత్తముని భ్రాత తామసుడు. ఇతని కాలముననే పైని 
వర్ణించిన “హరి” యను ఆదిమూలావతారము నడచినది. 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము ఇ 325 


౬ అయిదవ మనువు, ఆతామసుని తమ్ముడు రైవతుడు. అతని కాలమున 
“శుభ్రు”డను వాని భార్య “వికుంఠ” కడుపున వైకుంఠుడను పేరున నవతరించెను. 
' వైకుంఠ మను లోకమును నిర్మించెను. అది సకల లోకములకును సేవనీయముగా 
నొనర్చెను. శ్రీ రమాదేవి యా లోకమునం దెదురుకోల్చి శ్రీ వాసుదేవుని గౌరవించినది. 
ఇది కళావతారము. 


౭ ఆరవ మనువు, చాక్షుషుడు. ఆ కాలమున “వైరాజు” నకు “సంభూతి” 
యందు “అజితుడు” అను పేరుతో అవతరించెను. అతడే కూర్మరూపముతో జలధిలో 
మందరము మునిగిపోకుండ ధరించి అమృతమును మధింప సాహ్యమొనర్చిను. 
అమృతము దేవతలకు లభించిన దా మహనీయుని మూలముననే. ఇది 
అంశావతారము. 


౮_ఏడవది యగు వైవస్వత మన్వన్తరము ప్రకృతము: నడచుచున్న ఈ వైవస్వత 
మనువును, శ్రాద్ధదేవు డనియు నందురు. ఈ కాలమున కశ్యపున కదితి గర్భమున 
వామనుడన నవతరించి, బలిని యాచించి మూడడుగుల మేర పుచ్చుకొని 
విరాడ్రూపమున డ్రివిక్రముడై భూమ్యాకాశముల రెండు పాదముల నాక్రమించెను. 
మూడవ పాదము బలి శిరస్సున నిడి యతనని సుతలమున కడగద్రొక్కెను. ఈ 
యవతారము బుగ్వేదమున నొకటి రెండు పర్యాయముల ప్రశంసింపబడినది. 





“'యస్వ్యోరుషుత్రిషు విక్రమణేషు అధిక్షియన్తి భువనాని విశ్వా” అను బుక్కు 
“సమస్త భువనములును శ్రీ మహావిష్ణువుయొక్క మూడు అడుగులందును 
అడగియున్నవి” అను నర్ధముతో నీ త్రివిక్రమావతారమును బ్రశంసించినది. 

“ఇదం విష్ణు ర్విచక్రమే క్రేధానిదధేపదం” అని యజుర్వేదము. “విష్ణువు 
మూడు రకములుగా తన యడుగు నుంచెను” అని తెల్పును. ఇంతవర కీయవతారములు 
కడచినవి. 


౯ ఇక రాబోవు మన్వన్తరములందలి యవతారముల కీర్తింతము: 


326 ' ఆం(ధ మహాభాగవతోవన్యానములు 


సూర్యసావర్ణి యనువాడు ఎనిమిదవ .మనువుగా నగుటకై యిపుడు 
తపస్ఫొనర్చు చున్నాడు. అతడు సూర్యునకు ఛాయయం దుదయించెను. ఆ కాలమున 
“వేదగుహి” కి “సరస్వతి” యను పత్నియందు “సార్వభౌముడ”ను పేరుతో 
నవతరించును వాసుదేవుడు. వామనావతార కాలమున బలిచక్రవర్తివద్దనుండి 
తీసుకొన్న దేవేంద్ర పదవిని తిరిగి యతనికిచ్చి అతనిని దేవేంద్రునిగా బ్రతిస్టించును. 


౧౦ తొమ్మిదవ మనువు వరుణుని. కొడుకు దక్షసావర్ణి కాలమున 
“ఆయుష్మాన్తునకు “అంబుధారి యను పత్నియందు బుషభుడను భగవత్మళావతార 
మేర్చడును. 


౧౦ పదవ మనువు ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి. అతని కాలమున 
విశ్వసృజు నింట విశూచికి విష్వక్సేనుడుగా నవతరించును. శంభుడను నింద్రునితో 
జెలిమిసేసి జగమును కాపాడును. ఇది అంశావతారము. 


౧౨ పదునొకండవ మనువు ధర్మసావర్ణి. అపుడు సూర్యాకునకు “ధర్మసేతు” 
వను పేరుతో భగవాను డవతరించి జగములను దయతో రక్షించును. 


౧౩ ప్రండైండవ మనువు భద్రసావర్ణి. ఆ కాలమున సత్యాతపసుడను నతనికి 
సూన్ఫత యను భార్య యందు “స్వధాముడు” అను పేరున లోకరక్షైై వాసుదేవుడవతరిం 
చును. 


౧౪ పదమూడవ మనువు దేవసావర్ణి. ఈతని సమయమున దేవహోత్రి 
భార్య బృహతికి భగవానుడు “యోగవిభుడు” అను పేరున నుదయించును. ఇంద్రుని 
సుఖపెట్టును. 

౧౫ పదునాల్లవ మనువు ఇంద్రసావర్షి. ఈతని మన్వన్తరము నందు 
సత్రాయణునకు వితాన యను భార్యయందు వాసుదేవుడు “బృహద్భానుడు” అను 
పేరున నవతరించును. యజ్ఞాది రూపమైన కర్మకాండమును విస్తరింపజేయును, 
ఇట్లీ పదునాలుగు మన్వనర్తము లందలి భగవదవతారములను ప్రశంసించితిమికదా! 
ఇక కడమ అవతారములను కీర్తింతము. 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 327 


నిజమున కీ యవతారములకన్నింటిని గూడ మొదటి యవతారము పురుష 
సూక్తమున బ్రతిపాదింపబడినట్లు వేయి తలలతో నుండి ప్రకృతిని ప్రవర్తింప 
జేయునట్టి- 


౧ ఆదిపూరుష రూపము- విరాడ్రూప మన్నమాట. ఇది యన్ని 
యవతారములకును మూలమైనది. దీనియంశాశముతో దేవతలు, తిర్యక్కులు, నరులు 
మొదలగువా రందరు సృజింపబడుచుందురు. ఆ మహానుభావుడే మొదట 
కౌమారసర్గమునందుండి బ్రాహ్మణుడై దుశ్చరమగు నఖండిత బ్రహ్మచర్యము 
మాచరించెను. 


౨ తరువాత వరహావతారమును తెలిసికొందము. మొదటిదగు విరాడ్రూపము 
కాలమున హిరణ్యగర్భు నుండి యేర్చడిన సనకసనందనాదులు శపింపగా శ్రీహరి 
ద్వారపాలకులు జయవిజయులు కశ్యపుని భార్య దితి కడుపున హిరణ్యాక్ష 
హిరణ్యకశిపులుగా బుట్టిరి. వారిలో హిరణ్యాక్షుడు రసాతలమునకు భూమిని 
చాపచుట్టగా జట్టికొని పోవుచుండగా వరాహ రూపమున వాసుదేవుడు వానిని 
సంహరించి భూమిని రసాతలము నుండి యుద్ధరించెను. ఈ విషయము “ఉద్దృతాసి 
వరాహేణ కృష్ణేన శతబాహునా” అని యజుర్వేదము తెల్పును. ఈ యవతారమునందే 
భూమి దేవి శ్రీ యజ్ఞవరాహుతోడి సమావేశమువలన నరకాసురుని కనెనని 
చెప్పబడినది. 


౩ పుత్రార్ధియై తప మొనరించు నత్రితో “నేను నీకు దత్తుడను” అని పల్ముటవలన 
“దత్తాత్రేయూడని పేరు కల్గిన యవతారము ఏర్పడినది. హైహయ వంశ్యులైన 
కార్తవీర్యార్డునాదులు ఆ మహానుభావునివలన నష్ట విబూతి సంపాదక మగు యోగము 
బడసిరి. ఈ మహనీయుడే అలర్భుడు, ప్రహ్లాదుడు మొదలగువారికి ఆత్మ విద్యను 
బోధించెను. 


౪ బ్రహ్మదేవుడు కల్పాదికాలమున సృష్టిజేయు తలంపుతో తపమొనర్చుచు 
“సన” యనెను. అది కారణముగా నల్వు రవతరించిరి. వారే “సనక”, సనందన, 
సనత్కుమార, సనత్సుజాతులు”. వీరు బ్రహ్మకు మానస పుత్రులు. శ్రీహరి కళలతో 


328 | ఆం(ధ్ర మహోభాగవతోవన్యానములు 


దనరి యుందురు! వారి సంప్రదాయము నుండియే విష్ణుతత్త్వజ్ఞానము ఈ లోకమున 
బ్రవర్తించినది. వారు నల్వురుగా గన్పడినను నొక్కరుగానే గణింపబడుదురు. 


౫ ధర్మునకు దక్షుని కుమార్తెయెన మూర్తివ యందు నర నారాయణుల 
లవతరించిరి. వారు బదరికావనమున దపమొనరించుకొనుచుండగా నింద్రుడు 
తపసు చెజిచుటకై అప్పరసల బంపెను. వా రీవనమునకు వచ్చి ఆటపాటల 
విహరించచు తపసు జెజుప బ్రయత్నించిరి. వారిని శపింప సామర్థ్యమున్నను అది 
తపోబాధకము కనుక దానిని వీడి నారాయణుడు తన తొడ జీరి దానినుండి యొక్క 
చక్కని చుక్కను నిర్మించెను. ఊరువుల నుండి పుట్టెను గనుక నూర్వశి యనబడిన 
యామె చక్కదనమున కోడి సిగ్గుపడి యింద్రు డంపిన వనితలు తొలగిపోయిరి. 
ఇట్లు వీ రిరువురును కామక్రోధములను జయించిరి. 


౬ ఉత్తానపాదు డను మహారాజునకు సుమతి గర్భమున ద్రువుడన 
నవతరించెను. సవతి తల్లి సురుచి యాడిన మాటలవలన వగగుంది గొప్ప 
తపస్సొనరించి, సశరీరముగా నూర్ధ్వలోకముల కేగి మింట ధ్రువపదమున నిలచెను. 
పైనున్న భృగు ప్రభృతులు, క్రిందనున్న సప్రబుషులును తనను స్తుతించుచుండ నా 
మహాత్ము డిప్పటికిని నక్షత్ర రూపమున గన్పడుచునే యున్నాడు. 


౭ వేనుడు, బ్రాహ్మణుల మాటల ధిక్కరించి వారి యాగ్రహమున జనిపోయెను. 
అపు డరాజకమువలన లోకము పడు బాధల తొలగించుటకై వేనుని బాహువును 
మహర్షులు మధింపగా నారాయణాంశమున “వృధు చక్రవర్తి యవతరించెను. 
తనవలెనే లక్ష్మి యంశమున బుట్టిన యామెను బెండ్లి యాడెను. గోరూపథారిణియెన 
భూదేవి నుండి లోకములోని యందరికిని గావలసినవానిని పిదుకుకొనున ట్లొనర్చాను. 
సనత్ముమారు నుండి యధ్యాత్మతత్త్వము నుపదేశమొంది ప్రజలలో ప్రబోధమొనరించి 
పరమపదమున కేగెను. 


౮ ఎనిమిదవది బుషభావతారము. ఇది వెనుక మన్వన్తరములలో తొమ్మిదవ 
మనువునాటి యవతారము కాదు. అట అంబుధార, ఆయుష్మన్తులు తల్లిదండ్రులు. 
అతడు వేరు. అది తొమ్మిదవ మన్వన్తరమున రానున్నది. ఇది ఆగ్నీధ్రుని కుమారుడు 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 329 


నాభికీ మేరుదేవి యందు హరి వృషభావతారము. ఇత * డురుక్రము డని ప్రసిద్ధి 
పడసినాడు. ఇతడు జడ స్వభావమైన యోగముతో జరించెను. ప్రశాన్లాన్లః కరణుడై, 
పరిముక్తసంగుడై యత డుండగా, అదియే పరమహంసల కభిగమ్యమగు పద మదేనని 
పరమర్చులు తెల్పిరి. ఈ మహానుభావుని జడయోగము. అవధూత ప్రవృత్తిలోని 
యన్తూర్థము నెజుగక ఆర్హతులు, జైనులు విపరీతముగా గ్రహించి అవైదికమై శిష్టులకు 
పరిగ్రహింపరానిదగు మార్గము నవలంబించిరి. 


౯ తొమ్మిదవ యవతారము హయగ్రీవావతారము. (బ్రహ్మదేవుడు యజ్ఞ 
మొనరించునపుడు సకల వేదమయుడును, సకలాన్త రాత్మయునగు యజ్ఞపురుషుడు 
శ్రీ వాసుదేవుడు సువర్ణచ్చాయతో “హయగ్రీవుడు”గా నవతరించెను. ఈ మహనీయుని 
నాసికా వివరములనుండియే వేదములన్నియు నేర్పడినవి. 


౧౧ మత్స్యావతారము పదవది. శ్రాద్ధదేవుడను మారు పేరుగల వైవస్వత 
మనువునకు యుగాన్త సమయమున జిన్న చేపగా మొదట నగుపడి కొద్దికాలములోనే 
'సముద్రమునతప్ప మరొకయెడ నుండుట కవకాశము లేనంత గొప్ప మత్స్యముగా 
బెరిగెను. ప్రకయరాత్రమున నిదురించు (బ్రహ్మ ముఖమునుండి బయల్పడిన 
వేదములను సోమకు దను రాక్షసుడపహరింపగా వానిని సంహరించెను. ఆ వేదములను 
జిక్కువడకుండ బ్రహ్మదేవునకు దెచ్చియిచ్చెను. అంతేకాక మనువు మొదలగువారున్న 
నావను “ప్రళయ పయోధిజలము”న మునుగకుండ అనిమిషుడై రక్షించెను. 


౧౧ పదునొకండవది నరసింహావతారము. 
౧౨ పం[డ్రెండవదగు హంసావతారమున శ్రీవాసుదేవుడు తన తత్త్వమును 
దన యారాధనమును సరిగా బోధించి తన భక్తుల చరిత్రమును భక్తిమార్గపు 


ప్రాశస్త్యమును దెల్బు శ్రీ భాగవత మహాపురాణమును దేవర్షి నారదున కుపదేశించెను. 
ఆత్మతత్త్వ ప్రదీపకమైన యా భాగవతమునే ఆతడు నిరన్తరము నాస్వాదించుచు- 





* ఈ యవతారము “ఉర్ముకమస్య సహి బంధురిత్థా” యని బుగ్వేదము ప్రశసించిన దనెదరు. “శంనో 
విష్ణు రురుక్రమః” అని యజుర్వేదము కూడ శాంతిమంత్రములో ప్రశంసించినది. 


330. ఆం(ధ మవాభాగవతోవన్యానములు 


౧౩ పదమూడవదగు తన యవతారమున- అనగా నారదావతారమున 
దేవర్షియె కర్మనిర్మోచకమైన వైష్ణవ తన్రమును నారద పాంచరాత్ర మనుపేర తెల్పెను. 
భగవదుపదిష్ట మగు భాగవత పురాణమును వ్యాసున కుపదేశించెను. అదియే శ్రీ 
శుకులద్వారా పరీక్షిత్తున కుపదేశింపబడి సూత శౌనకాది సంప్రశ్నోత్తరములుగా 
నైమిశారణ్యమున (బ్రవచింపబడి యీనా డిట్లు మన పోతరాజుగారి ద్వారా 
మననందరను తరింపజేయుచున్నది. 


౧౪ పదునాల్గవదగు ధన్వన్తరి యవతారమున దన పేరు తలంచినంత 
మాత్రముననే రోగముల నన్నింటిని నివారించుచు నాయుర్వేదమున జనుల కారోగ్య 
సౌఖ్యమును గల్లించెను. 


౧౫ పదునైదవదగు పరశురామావతారము భృగువంశములో జమదగ్ని 
భార్యయైన రేణుక యందు అవతరించెను. హైహయ వంశ్యులైన కార్తవీర్యార్డునాది 
రాజులు ప్రజలకు కంటకులుగా నుండగా వారినందరను సంహరించెను. ఆ వరుసనే 
లోకకంటకులను దునుమాడ సంకల్పించుకొని రాజు లందరను ముయ్యేడుమారులు 
వెదకి వెదకి చంపెను. బ్రాహ్మణులు తనను యాచింపగా నీ భూమండలమంతయు 
వారికి దాన మొసగెను. ముందు మన్వన్తరమున- ఎనిమిదవ మనువు సూర్యసావర్ణి 
మనువు కాలమున సప్రర్షిపదము నలంకరింపగలడు. 


౧౬ పదునారవది శ్రీరామావతారము. 


౧౭ పదునేడవది బలరామావతారము. వసుదేవుని భార్యలలో మొదట దేవకి 
కడుపునబడి భగవదాజ్ఞవలన యోగమాయచే నా గర్భము సంకర్షింపబడి రోహిణి 
యను వసుదేవుని భార్యయం దుంచబడియెను. ఆమెయందు జనించిన యీ 
కుమారకుడు బలవిభవంబున బలుండనియు, శరీర ధావల్య సౌందర్యంబుల 
రాముండనియు, గర్భ సంకర్షణంబున నుదయించుటంజేసి సంకర్షణుం డనియు 
బిలువంబడు. ఈతడు సుధాఫేన ధవళమగు రూపమును, నీలాంబరమును, 
హలమును ధరించుటంజేసియు జీవ సంకర్షణమువంటి సకల యాదవ సంకర్షణ 
మొనరించుటవలనను రెండవదగు సంకర్షణ వ్యూహముగా గుర్తింపబడును. 


వాసుదేవ తత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము 331 


౧౮ పదునెనిమిదవది శ్రీకృష్ణావతారము. 


౧౯ పంతొమ్మిదవది వ్యాసావతారము. (ప్రతి యుగమునందును అల్ప 
హృదయులు, అల్పతరాయువులునైన మనుజులు వేదములను సరిగా (గహింపజాలరని 
సత్యవతియందు శ్రీమన్నారాయణు సంశమున నీ యవతారము కల్గినది. అష్టాదశ 
మహాపురాణములు, అష్టాదశోపపురాణములు, మన ప్రకృతపు శ్రీ మహాభాగవతము, 
మహాభారతము, హరివంశము, (బ్రహ్మ సూత్రములు ఇవి యన్నియు నిర్మించెను. 
“వ్యాసోచ్చిష్టమిదం జగత్‌” అనియు “వ్యాసో నారాయణో హరిః” అనియు నేర్పడిన 
యాభాణకములు ఈ మహానుభావుని గొప్పదనమును స్పష్టపరచును. 


౨౦ ఇరువదవ యవతారము బుద్దావతారము. పరమ లుబ్బులై, 
అన్భతపరాయణులై, మ్లేచ్భాచారములతో పాషండ మతాభిమానముకల్లి లోకాపకార 
మొనరించు దైత్యులను మోసపుచ్చి సంహరించుటకై అజినుని సుతుడైన బుద్దుని 
యవతారమును ధరించెను. వాసుదేవుడు. ఆ దైత్యుల యాచార వ్యవహారములను 
జెడగొట్టెడు ఉపదేశముల నొనరించెను. వారిని మాయించెను. 


౨౧ ఇక నిరువదియొకటవది కల్మ్య్యవతారము. పరమాత్మ యగు వాసుదేవుని 
స్మరింపక వేదవిహితములగు యజ్ఞ యాగాదుల యనుష్టానము మాని సత్యము" 
నాదరింపక పాషండులై యున్న బ్రాహ్మణులును, అంతటి దుష్టులైన శూద్రరాజులును 
విజృంభించి లోకమున కపకార మొనర్చుచుండగా వాసుదేవుడు విష్ణుయశునకు 
కల్మిరూపమున నవతరించి అశ్వారూఢుడై, ఖద్గధారియై వారి నందరను సంహరించి 
అధర్మమును అడంచును. ధర్మమును నిలువబెట్టును. . 


ఇవి భగవానుడైన వాసుదేవుని యేకవింశత్యవతారములు. ఇట్లనేకములగు 
నవతారములు మనము వర్ణింపనలవికానన్ని యింకను ఉన్నవి. వీనిని సాక్షాత్తు 
పరమపదనాథుడైన ఆ వాసుదేవుడే తానే లెక్కపెట్టజాలనని ముచుకుందునితో 
“భూరజంబులనైన భూనాథ! యెన్నంగ జనుగాని నా గుణజన్మ కర్మ నామంబులెలను 
నెన్నంగ నెవ్వరు జాల రది యేల నాకును నలవికాదు” అనెను. అస లీ విషయము 
బుగ్వేదములోనే విష్ణుసూక్తములో నిట్లు తెల్పబడినది. “విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం 


332 ఆం(ధ మహోభాగవతోవన్యానములు 


యః పార్థివాని విమమే రజాంసి” అని తెల్పబడినది. భాగవతములోగూడ ఇట్లనబడినది: 


“విష్ణోర్ను వీర్య గణనాం కతమో9 రతీయః పారివాన్వపి కవిరిమమేరజాంసి”. 
భాగవత వైష్ణవము 


వాస్తవముగా నాలోచించుచో శ్రీ భాగవత శ్రీ వైష్టవమును, భగవద్రామానుజ 
శ్రీ వైస్సవమును భిన్నములుగా నుండజాలవు. ఉండుట కవకాశము లేదు. ఏమనగా 
రెండును గూడ నొక పాంచరాత్రాగమమాధారముగానే యేర్చడినవి. శ్రీ భాగవత 
మట్టిదని ఇదివరలోనే గ్రంథమునుండి నిరూపించియుంటిని. భగవ ద్రామానుజుల 
పంచరాత్రాధి కరణపు భాష్యమువలన గూడ వారిమతము తదాగమైక మూలమని 
స్పష్టము. 

శ్రీ శుకయోగీ(న్లులు పరీక్షిన్మహరాజుతో- 

ఆ హరినామ సంస్మరణ మొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ 
నృపా(2-8) అని యుపదేశించిరి. 

“గోవిందనామ కీర్తనం గావించి భయంబుదక్కి ఖట్వాంగ ధరిత్రీ విభుండు 
చూరగొనియెను గైవల్యము తొల్లి రెండు గడియల లోన౯”(2-11) అని యుదాహ 
రణము తెల్పిరి. అంతిమకాలమున భగవానుని స్మరణ మెంతటి నద్యోముక్తిదమై 
ప్రాధాన్యము వహించుచున్నదో ఆ విషయము నజామిలోపాఖ్యానములో (6 స్కం.) 
యమ విష్ణుదూతల సంవాదముతో సంపూర్తిగా విస్తరించి ప్రదర్శించిరి. ఇందువలన 
వెనుక జెప్పినట్లుగా భగవన్నామ సంకీర్తనము అంతిమ కాలమున దాని యావశ్య 
కతయుగూడ బోద్ధ్యవుల మనసునకు జాల చక్కగా పట్టును. శ్రీహరినామసంకీర్తనము 
అత్యంత మావశ్యక మను శ్రీవైష్ణవ విశేష లక్షణమట ప్రదర్శితము. దాని కంగములుగా 
అహింసా స్వధర్మానుష్టానాదికమంతయు నుండవచ్చును. ఒకవేళ లేకున్నను శ్రీవాసుదేవ 
సంకీర్తన మొక ముహూర్తకాలము ప్రాణభీతితో నొనర్చినను అది యమదూతలనుండి 
సద్యోముక్తిని కల్గించితీరునని ధృవపరుపబడినది. ఈ ఆ తరువాత మన గత జీవితము 
విషయములో నిర్వేదము కల్గును. తదనంతరము తత్త్వవిజ్ఞానము కల్లును. శ్రీ 
వాసుదేవునందు వెంటనే భక్తి జనించును. అతడు దాని ననుష్టించి పరమపదమునకు 


వాసుదేవ తత్త్వము -అవతారములు-భాగవత వైష్ణవము 333 


బోయి క్రమ ముక్తి భాగ్యము నందగల్లును. ఈ యర్థ మీ యజామిళ చరిత్రమునందు 
సువ్యక్తమగును. అతడు మరణకాలమున దన బిడ్డమీది (ప్రేమతో తన బిడ్డనే “నారాయణ 
నారాయణ” యని పిలచెను. అది భగవానుడగు విష్ణుని నామమేకదా! కనుక వెంటనే 
విష్ణుదూతలరుగుదెంచి యమదూతల బారద్రోలి నద్యోముక్తి నతనికి గల్లించిరి. ఆ 
తరువాత నతనికి తన గత చరిత్రమునుగూర్చి చాల నిర్వేదము కల్గినది. వైరాగ్య 


మేర్చడినది. “వెష్ణవజ్ఞానదీపం బాత్మస్నేహంబున దోచినది.” 
(6-150) 


హరి భక్తులతో మాటలు ధర నెన్నడుం జెడని పుణ్యధనములమూటల్‌ 
వరముక్తికాంతతేటలు నరిషడ్వర్గములు చొరని యరుదగు కోటల్‌” 
(6-152) 


అనుచు నా బ్రాహ్మణుడు తత్త్వవేత్తయెనాడు. భక్తియోగము నాగశ్రయించినాడు. 
ఏమయినాడు? “సువర్షమయమైన విమానం బెక్కి సకల నిఖిలానంద భోగభాగ్యానుభ 
వాకుంఠితంబైన వైకుంఠ నగరంబునకు శ్రీమన్నారాయణ పాదారవింద సేవాచరణ 
పరిణామస్థితికిం జని” నాడు. (6-15 4)“ఇట్లు విష్లావిత సర్వధర్ముండైన దాసీపతి 
గర్డిత కర్మంబుల చేత బతితుండును, హత వ్రతుండునునై నరకంబునం గూలు 
చుండి భగవన్నామ (గ్రహణంబున సద్యోముక్తుండయ్యె.” కావునా 


(6-154) 
కర్మంబులెల్లం బాయను 
మర్మము దలపంగలేదు మధురిపుపేరే 
పేర్మిని నొడువుటకంటెను.” (6-155) 


ఇందులో గల సారమేమో గమనించండి. 


“వుత్రోపచారితమైన విష్ణునామ మవసానకాలమ్మునను భజించి 
శార్జినిలయంబు జేరె నజామిళుండు.” (6-157) 
ఇక “నిట్లు సద్భక్తి కల్గిన నేమీ చెప్ప.” (6-157) 


334 


ఆం(ధ మవోభాగవతోవన్యానములు 


“కోరిన వారికి నెల్లను 
చేరువ గైవల్య పదవి శ్రీవరుని మదిం 
గోరని వారల కెల్లను 


'దూరము మోక్షాప్తి యెన్ని త్రోవలనైన౯ (6-158) 


కాగా భగవన్నామమును గీర్తించిన సద్యోముక్తి కల్లునని యజామిళ చరిత్రము 


తెల్పినది. అంతేకాదు. అవసానకాలమున నా శ్రీహరి స్మరణ మెంత యావశ్యకమో 
కూడా వ్యక్తపరచినది. ఈ నామస్మరణమున నతడు ధర్మాత్ముడై పరమాత్మయందు 
శాన్తినొందుట గమనించినచో- 


అపిచేత్సదురాచారః భజతేమామనన్యభాక్‌ 
సాధురేవ నమన్తవ్యః సమగ్వ్యవసితోహిసః 
క్షప్రంభపతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి, 
కౌన్తేయ ప్రతిజానీహినమే భక్తః ప్రణశ్యతి” 


అను గీతావచనము అక్షరాల యథార్థమని మనకు బుజువగునుగదా! . 


ఇట ధర్మాత్మత యన నేమి? పరమాత్మ యగు వాసుదేవుని యందు భక్తియే. 


“వాసుదేవునియందు బ్రయోగింపబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబుల 
బుట్టించు...” “అపవర్గపర్యస్తంబైన యా పరమధర్మంబునకు మాధవుండు 
సంతోషించుటయే సిద్ధి.” . 


మాధవుడు సంతోషించునదేది? వినుడు ప్రహ్లాద సూక్తిని- 


“చాలదు భూదేవత్వము 

చాలదు దేవత్వ మధిక శాన్తత్వమును౯ 

చాలదు హరి మెప్పింప వి 

శాలోద్యములార! భక్తి చాలిన భంగినన్‌” (7-244) 


ఇట్లు వాసుదేవ ప్రీతికరమైన ధర్మము శ్రీహరి భక్తియే యని తేలినది. కనుక శ్రీ 
వాసుదేవునియందలి భక్తియే భాగవత వైష్ణవుల ప్రధాన విశేషలక్షణము. ఆ 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 335 


భక్తినిట్లానర్చవలెనని పరమభాగవతులలో మొట్టమొదట గీర్తింపబడు ప్రహ్లాదుడు 
తెలుపుచున్నాడు: 


తనుహృద్భాషల, సఖ్యమున్‌, శ్రవణమున్‌, దాసత్వమున్‌, వందనా 
రృనముల్‌, సేవయు, నాత్మలో నెజుకయున్‌, సంకీర్తనల్‌, చింతనం. 
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్‌ హరిన్‌ నమ్మి స 
జ్ఞనుడై యుండుట భద్రమంచు దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా. 
(7-167) 
ఈ భక్తిమార్గమునే అన్వయ పద్ధతిలో నిట్లు దెల్పినారు: 


“కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ 
సురరక్షకుని జూచు చూడ్ములుచూడ్ములు శేషశాయికి మొక్కు శిరము శిరము 
విష్ణునాకర్ణించు వీనులువీనులు, మధువైరి దవిలిన మనముమనము 
భగవన్తు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి 
దేవదేవుని జింతించు దినము దినము, చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు 
కుంభినీధవు జెప్పెడి గురుడుగురుడు, తండ్రి! హరి జేరుమనియెడు తండ్రి తండ్రి 
(7-169) 
వ్యతిరేక క్రమమున- 
కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనకుంభిత చర్మభప్రిగాక 
వైకుంఠు బొగడని వక్రంబు వక్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక 
హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మితదర్విగాక 
కమలేశు జూడని కన్నులు కన్నులే తనుకుద్య జాలరంధ్రములుగాక 
చక్రి చిన్తలేని జన్మంబు జన్మమే తరల సలిలబుద్భుదంబుగాక 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. 
(7-170) 


శ్రీ రుక్మిణీమాతయు నీ విషయమునే స్వవిషయమున వాచ్యముగాను, 
అస్మదాదుల విషయమున వ్యంగ్యముగాను సాక్షాత్సరోక్షముల నన్వయించునట్లుగా 


336 . ఆంధ్ర మహాభాగవతోవన్యానములు 


తెల్చెనుగదా! (10-1076-1713.) *దృప్త ప్రసన్న యగు శ్రీ రుక్మిణీమాతయేకాక 
ఆరప్రసన్నులగు గోపికామతల్లులుకూడ నెట్లనిరో గమనించండి: 








నీ పాదకమలంబు నెమ్మిడగ్గణగాని తరలిపోవంగ పాదములురావు, 

నీ కరాబ్దంబులు నెతీనంటి తివగాని తక్కినపనికి హస్తములుసొరవు, 

నా వాగమృతధారనిండ గ్రోలగగాని చెవు లన్య భాషలు సేరివినవు, 

నీ సుందరాకృతి నియతిజూడగగానిచూడ వన్యంబుల జూడ్మికనులు, 

నిన్నెకాని పలుకనేరవు మా జిహ్వ లొల్లననుచు బలుకనోడ వీవు 

మా మనంబులెల్ల మజపి దొంగిలితివ ఏమి సేయువారమింక గృష్ట 
(10-998) 


ఈ తీరున సకలేన్చియములును సర్వేశ్వరుడును సర్వపితామహాదులకునుగూడ 
అవిభావ్యుడగు శ్రీవాసుదేవ పరమాత్మయందే తమ తమ కృత్యము లన్నియు 
సమర్పింపక తప్పనట్టి స్థితియే భాగవత వైష్ణవములోని ప్రధానమగు నన్తరార్థము. 
మన మనసులో నీ రకముగా నిరన్తర మగు ధ్యాన ముండుట అత్యవసరము. 

ఏ నీ గుణములు కర్ణేగ్టియంబులు సోక దేహతాపంబులు దీజిపోవు 

నే నీ శుభాకార మీక్షింప గన్నుల కఖిలార్థలాభంబు కలుగుచుండు 

నే నీ చరణసేవ లే ప్రొద్దుజేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు 

నే నీలసన్నామ మే ప్రొద్దు భక్తితో దడవిన బంధసంతతులువాయు 

నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ యాననాన లేదు 

కరుణ జూడుము కంసారి ఖలవిదారి, శ్రీయుతాకార! మానినీ చిత్తచోర! 

(10-పూ. 1701) 


అట్టి యార్తియు నిరన్తర ధ్యానమును రెండును భాగవతవైష్టవులగు గోపికలు 
శ్రీ రుక్మిణీమాత మొదలుగవారి యందున్నది కనుక వారందరును తరించి మా 


* అని యిట్లు భగవంతుండైన హరి తన్ను బాయక సేవించుటం బ్రియురాలను పట్టపుదేవి ననియెడి 
రుక్మిణి దర్బంపు నేర్పున హరియించి (10-ఉ.236). ఇందువలన శ్రీ రుక్మిణీమాత దృష్త ప్రసన్న 
యని తేలికనదా! 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 337 


లక్షణములే తరుణోపాయములని మనకు వ్యక్తపరచియున్నారు. 


అందు ప్రహ్లాదుని “పాపసంచయములు పాయు నిన్న ముక్తబంధుడవై 
నన్ను డగ్గజిదవు” అని శ్రీన్ససింహమూర్తి కటాక్షించెను. 


ఇకను లోకమాతను శ్రీరుక్కిణీదేవిని “సురుచిరలీలన్‌ దెచ్చెద బాలన్‌” అని 
పలికి తెచ్చి కళ్యాణ మొనర్చుకొని చెపేట్టెనుకదా! ఇక భక్తభాగవత శిరోమణులగు 
గోపికల విషయంలో-- 


కరుణాలోకములం బటాంచల కరాకర్షంబులన్‌ మేఖలా 

కర బాహుస్తనమర్శనంబుల నఖాంకవ్యాప్పులన్‌ నర్మవా 

కృరిరంభంబుల మంజులాధర సుధాపానంబులన్‌ గాన్తలన్‌ 

గరంగించెన్‌ రతికేళిం గృష్టుండు కృపన్‌ గందర్పుం బాలార్చుచున్‌. 
(10-పూ. 1001) 


అని పోతనామాత్యులు వారి కృతార్థతను స్పష్టపరిచిరికదా. 


ఈ యందరి కృతార్థలకును స్వామిని గూర్చిన నిరన్తరానుధ్యానము పరమమైన 
ఆర్తితోడ గూడినది. తొలగిపోయిన, లేక స్వామి కనుపడకపోయిన నేమౌదుమో 
యనునంతటి వియోగ భీరుత్వము ఏర్పడవలయును. అదియేకదా పరమభక్తి 
యందురు. “పునర్విశ్లేష భీరుత్వం పరమాభక్తిరిష్యతి” అనికదా పెద్దల ప్రమాణోక్తి. 


అయితే అజామిళుడొకటి రెండు పర్యాయములు అబుద్ధిపూర్వకముగానే 
స్మరించినను అతనికే రక్షణ దొరకినదికదా! గజేన్లుని విషయమట్లు కాలేదేమి? 
అతడెంతో కాలము బుద్ధిపూర్వకముగానే తలంచినను, నుతించినను- 


ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై 
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం 
బెవ్వం డనాదిమధ్యలయుం డెవ్వండు సర్వము తానయైన వాం 
దెవ్వండు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్‌. 
(8-73) 


338 | ఆం(ధ మవోభాగవతోవన్వానములు 


అని చాలమారులు శరణు జొచ్చినను పరబ్రహ్మ లక్షణములలో జగజ్జన్మస్థితి లయ 
కారణత్వములతో గీర్తించినను వాసుదేవుడు ప్రత్యక్షము కాలేదేమి? రాలేదేమి? 
కాపాడలేదేమి? 


వినుడు. గజేన్హునకు చాలకాలమువరకును స్థిరనిశ్చయములేదు. 
చూడండి: 


కలడందురు దీనులయెడ, కలడందురు పరమయోగి గణములపాలన్‌ 

కలడందు రన్నిదిశలను, కలడు కలండనెడువాడు కలడోలేడో! (8-86) 
ఇంకను స్పష్టముగా- 

వినుదంట! జీవులమాటలు 

సనుదంట! చనరానిచోట్ల శరణార్థుల కో 

యనుదంట! పిలచిన, సర్వము 

గనుదంట! సందేహమయ్యె గరుణా వారీ! (8-91) 


వీని యన్నింటివలనను సందేహమే గజేన్లుని తలంపులో నున్న దనుట 
తెలియవచ్చునుకదా! అతనికి చాలకాలమువరకును స్థిర నిశ్చయముతో అకించన 
శరణాగతి కుదురలేదు. 


లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్‌ 

ఠావుల్‌ దప్పెను, మూర్భవచ్చె, దనువున్‌ డస్సెన్‌, శ్రమంబయ్యెడిన్‌, 

నీవే తప్ప నితః పరంబెణుంగ, మన్నింపందగున్‌ దీనునిన్‌, 

రావే యీశ్వర! కానవేవరద! సంరక్షింపు భద్రాత్మకా! (8-90) 


అని యకించన శరణాగతినాటికి అతనికి సంశయము వీడలేదు. తర్వాతనే కదా 
“సందేహమయ్యె” అన్నది. కనుకనే “సంశయము” తొలగువరకును అతనికి రక్షణ 
దొరకలేదు. శ్రీవాసుదేవుడు “సంశయాత్మా వినశ్యతి” యని నిస్సంశయముగానే 
గానమొనర్చెగదా! భగవద్విరోధులైన హిరణ్యకశిపు ప్రముఖులుకూడ నిశ్చయాత్మక 
బుద్ధితోనే వాసుదేవునితో విరోధించిరి. అజామిళు డబుద్ధిపూర్వకమైనను సంశయముతో 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 339 


బిడ్డను బిలువలేదు. నిశ్చయముగానే పిలచెను. అందుననే అతనికి వెంటనే ముక్తి 
దొరకెను. యమదూతల నుండి సద్యో రక్షణము లభించినది. ఇక ప్రహ్లోదునకు 
గజేన్రునివలె అస్థిరబుద్ధిగాని, సంశయముగాని లేదు. స్థిరనిశ్చయమే. అతని మాట 


యిదిా 


కల డంభోధి, కలండు గాలి, గల డాకాశంబునం, గుంభినిన్‌ 
గల! డగ్నిన్‌, దిశలం, బగళ్ల, నిశలన్‌, ఖద్యోతచం ద్రాత్మలన్‌, 
గల డోంకారమునం, ద్రిమూర్తుల, ద్రిలింగ వ్యక్తులందంతటన్‌ 
గల డీశుండు, కలండు, తండ్రి! వెదకంగా నేల యీయాయెడన్‌. 


ఇందుగల డందులేడని, సందేహమువలదు చక్రి సర్వోపగతుం. 
డెందుందు వెదకిచూచిన, నందందే కలడు దానవాగ్రణి! వింటే. 
(7-274, 275) 


గజేన్తుడు “కలడో? లేడో? సందేహమయ్యెన్‌” అని సంశయపడుచుండగా 
నీ మహానుభావుడు=ప్రహాదుడు, “కలడు, కలడు, కలండు, వెదుకనక్కజలేదు. చక్రి 
సర్వోపగతుడు సందేహము వలదు” అని రాయి గుద్ది వాసుదేవుని అస్తిత్వ నిశ్చయమును 
ప్రకటించినాడు. కనుక గజేన్లునకు సంశయబుద్ధినిబట్టి వెంటనే రక్షణ లభించలేదు. 
భాగవత శ్రీవెష్టవులందరు నీ విషయమును ముఖ్యముగా గమనింపవలెను. భగవానుని 
విషయములో రక్షణ విషయములో సంశయ మెంతమాత్రము పనికిరాదు. మహా 
విశ్వాస పూర్వకముగా వాసుదేవుని భజించితీరవలెను. అవిశ్వాస మేమాత్రము కూడా 
పనికిరాదు. “అనన్య సాధ్యే స్వాభీష్టే మహా విశ్వాసపూర్వకం... వరణాగతికి” అని 
సూక్తి. మహా విశ్వాసముతో భజించుటయే ప్రపత్తి. ఇది భాగవత శ్రీవైష్టవమున 
నత్యంత (ప్రధానతమమని యిప్పటికి స్పష్టపడినదికదా! విరోధముననైనను 
విశ్వాసమున్నచో నతనికి రక్షణ ముండును. “అసన్నేవస భవతి అసద్ర హ్మేతి వేదచేత్‌” 
అని శ్రుతినిబట్టి అతడు అసత్సురుషుడు. కనుకనే వేమనకు ఈశ్వరాస్తిత్వమున 
దలంపేలేదు. అతడు నాస్తిక్యముతోనే నాశనమైనాడు. ఇకను హిరణ్యకశిపుడు 
మొదలగువారు విరోధులైనను ఈశ్వరుని యస్తిత్వమున దృఢ నిశ్చయము కలవారే 


340 ఆం(ధ. మహాభాగవతోవన్యానములు 


కనుక సత్చురుషులే. “అస్తి బ్రహ్మేతిచేద్వేదసన్రమేనం తతోవిదుః” అని (శ్రుతి 
ప్రమాణించును గదా! బ్రహ్మయున్నదని తెలసినంతనే సత్పురుషుడగు నన్నపుడు ఆ 
బ్రహ్మ యంగమర్శనమున నెంతటి సత్పురుషత్వము సంభవింపనగునో యోజింపుడు. 


కనుకనే “అతడు రణమున నేడు నాయంగమర్భ నమున నిర్మల దేహుడై నవ్యమహిమ 
నపగ తాఖిల కల్మషుడై తనర్చి పుణ్యలోకంబులకు నేగు పుణ్యచరిత!” (7-879) 
అని నృసింహరూపుడైన వాసుదేవుడు సెలవిచ్చినాడు. ఇపుడు శ్రీవైష్ణవునకు బ్రధాన 
లక్షణము భగవానుడగు వాసుదేవుని యస్తిత్వ నిశ్చయము, రక్షించు నను విశ్వాసమును 
కూడనని తెలియవలెను. “రక్షిష్యతీతి విశ్వాసః” అని కదా శరణాగతిలోని ప్రకారము 
ఇట్లు వాసుదేవునందు మహా విశ్వాసముతో నుండుటయే భగవద్రామానుజ మునుల 
సిద్ధాన్తములోగూడ శ్రీవైష్ణవుల లక్షణము. 


అయితే ప్రహ్లాదుని విషయమున నొక శంక కల్గుచున్నది. అతనికి విశ్వాసమున్న 
దంటిరి కదా! అతడు చిరకాలము స్మరించినను రక్షణము, ముక్తి దొరకలేదేమి? 


పరమాత్మయే ఈ యాశంకను దీర్చినాడు. 

“సకలభూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరునాత్మ 

నిల్చి, కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు మీశ్వరార్చ 

ణముగ, భోగముల నశించు బుణ్యంబు వ్రతముల 

పాపసంచయములు పాయు నిన్ను. (7-372) 

ప్రారబ్ధకర్మము ప్రహ్లాదునకు మిగిలియున్నది. అందువలన నతనికి వెంటనే భగవత్రాప్తి 
కలుగలేదు. అతడనుభవింపవలసిన (ప్రారబ్ధకర్మ తీరుటకే తండ్రి బాధల 
పెట్టినంతకాలము అతడనుభవించుచుండగా స్వామి యూరకున్నాడు. అతని కీకర్మ 
తీరగనే భగవత్రాప్పి కల్గునని తెల్పినారు. 


కనుక గజేన్హునకు నిశ్చయబుద్ధి కుదరునంతవరకును పరమేశ్వరుడైన 
వాసుదేవుడు అతనినే రక్షింపక ఊరకున్నాడు. అతనికి నిశ్చయబుద్ధి యేర్పడినతోడనే 
ఆ పరమాత్మ విష్ణుదేవుడు ఆపన్న ప్రసన్నుడు తానెంత దూరముననున్నను, ఎట్టి 
రాగూడని తీరులోనున్నను, వినరాని వరుసలోనున్నను(చూ. “అలవైకుంఠపురంబులో”) 


వాసుదేవ తత్త్వము-అవతారములు-భాగవత వైష్ణవము 341 


విన్నాడు. పరువెత్తుకొనివచ్చినాడు, కాపాడినాడు. ఈ విశిష్ట విషయమును మన 
పోతన్న గారెంత చక్కగా వ్యక్తపరచిరో గమనింపుడు. 


అదివరకు “సందేహమయ్యెన్‌” అనుచున్న గజేన్దుడు- 


“ఓ కమలాక్ష! యో వరద! యో ప్రతిపక్ష విపక్షదూర! కు 
య్యో! కవియోగివన్స్వ! సుగుణోత్తమ! యో శరణాగతామరా 
నోకహ! యో మునీశ్వరమనోహర! యో విమలప్రభావ! రా 
వే! కరుణింపవే! తలంపవే! శరణార్థిని నన్ను గావవే! 
(8-92) 
“అరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుగాచుగాక” 

(8-93) 
యని కమలాక్షునందు శ్రీ వాసుదేవ పరమాత్మయందు దృఢనిశ్చయమును గుదుర్చుకొని 
.శరణాధి౯యై ఆతని యీశ్వరత్వమును, సర్వసామర్థ్వమును, అరక్షిత రక్షకత్వమును, 
ఆపన్న ప్రసన్నత్వమును శ్‌ నిస్సందేహముగా భావించెనో లేదో; ఆ వెంటనే భగవానుడు 
= ఈ పేరు లా దశలో చాలవు. ఇక నేమి? ఆపన్న ప్రసన్నుడే- 


“సిరికిం జెప్పడు, శంఖచక్రయుగముం జేదోయి సంధింపడు, ఏ 
పరివారంబును జీరడు, అభ్రగపతిం బన్నింపడు, ఆకర్షికాం 
తరధమ్మిల్లము జక్కనొత్తడు(ఇది యంతయు సరే) వివాదప్రోత్ధిత శ్రీకుచో 
పరిచేలాంచలమైన వీడడు(ఏల?) గజప్రాణావనోత్సాహియె. 

(8-96) 


అంతేనా? 





* మూలమునం దా క్రమము లేకున్నను బోతన్నగారు తన తెనుంగు సేతలో మొదల నంతయు 
గజేన్టుని సంశయమును, జిట్టచివర కతనికి నిశ్చయబుద్ధియు నా వెంటనే పరమేశ్వరుని రక్షణమును, 
పద్యముల క్రమమును తీర్చిదిద్దినాడు. ఇట్టి విశేషముల నింకను పలుచోట్ల మన మహాకవి 
కూర్చియున్నాడు. గమనింపవలెను. 


342 ఆం(ధ మహాభాగవతోవపన్యానములు 


ఆకాశమున దాను వేంచేయునపుడు ఇగన్లాది దేవతలు నమస్మరించినను 
వానిని గైకొనలేదు. అసలు వారిని కడకంటనైన జూడలేదు. మకరిని ద్రుంచి కరిని 
గాపాడునంతవరకును ఆ మహనీయున కారాటము పోలేదు. ఆపదలోనుండి 
శరణాగతుడైన గజేన్హునికన్న గూడ రక్షకుడగు నీ మహనీయునకు- వాసుదేవునకు 
దాసుడు. శరణార్థి రక్షింపబడువరకును మనసు కుదుటబడదు. ఆ తండ్రికి ఈ 
బిడ్డలందుండు వాత్సల్యమట్టిది. ఈ విశిష్ట స్వభావమును “తేషాం నిత్యాఖియుక్తానాం 
యోగక్షేమం వహామ్యహం” అన్న శ్రీసూక్తితోగూడ శ్రీ వాసుదేవునందు నిత్యమును 
మహావిశ్వాసముతో ననుసంధించుకొనుట భాగవతులైన శ్రీవైష్టవులకు అత్యన్త విశిష్టమైన 
స్వరూపము. పరమాత్మయు సర్వరక్షకుడును ప్రసన్న పారిజాతమును సర్వేశ్వరుడును 
నైన శ్రీ వాసుదేవునందే మహా విశ్వాసముతో నిత్యము శరణాగతులగుట ప్రపత్తి 
నొనరించుట విశిష్టమగు భాగవత శ్రీవైష్టవమని ముఖ్య తాత్పర్యము. 


ఆం(ధ సారస్వత పరిషత్తు 
ఆంధ్ర మహాభారతోపన్యాసములు 
తెలుగు వాగ్గేయకారులు - అన్నమయ్య విలక్షణ వ్యక్తిత్వం 
తెనుగు సాహితి 


స్త్రీల రామాయణపు పాటలు 


పరిణతవాణి- 1, 2, 8, 4 సంపుటాలు 
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న బర 
_ ఇరివెంటి వ్యాసాలు... 
శాలివాహన గాథా సప్తశతీసారము 
. రాయప్రోలు రచనలు - తత్వవివేచన 
. తెలుగులో సాహిత్యోద్ధారకులు 
. మల్లికా గుచ్చము 


అలన రాలా ROE 


సుమతి, వేమన, కృష్ణశతకాలు .. 
ఆంధ్ర సారస్వత పరిషత్తు వజ్రోత్సవ సంచిక 
. తెలంగాణాలో జాతీయోద్యమాలు' 
. సంస్కృత పాఠవల్లరి 
. నా సాహిత్యోపన్యాసములు. . 
. గౌతమబుద్ధడు-జవహర్తాల్‌ నెహ్రు. 
. కర్నల్‌ కాలిన్‌ మెకంజీ....:.... 
. మనదేశం - తెలుగుసీమ: 
. మననదులు - కృష్ణాగోదావరులు 
. మధురభక్తి - ముగ్గభక్తి 
. ప్రాచీన కవిత 


. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్వర్గోత్సవ సంచిక 
. దశరూపక సారం 

. భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం 

. నా రేడియో ప్రసంగాలు 


. శివరాత్రి మహాత్మ్యము 
. తెలుగు రచన 





అద్వాన్సుతోపాటు ప్రతులకు వ్రాయండి: 
“ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, హైదరాబాదు-500 001. ఫోన్‌: 24753724